
సాక్షి, అమరావతి: రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ ఈ నెల 27న అమరావతి సచివాలయం, ఆచార్య నాగార్జున వర్సిటీ వద్ద జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్ రాష్ట్రపతి పర్యటనపై బుధవారం డీజీపీ సాంబశివరావుతో సహా ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లను సక్రమంగా చేయాలని సంబంధిత శాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు. 27న కోవింద్ విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి హెలికాఫ్టర్‌లో నాగార్జున వర్సిటీకి చేరుకుని అక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.