DGP Sambasiva Rao
-
27న రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
సాక్షి, అమరావతి: రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ ఈ నెల 27న అమరావతి సచివాలయం, ఆచార్య నాగార్జున వర్సిటీ వద్ద జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్ రాష్ట్రపతి పర్యటనపై బుధవారం డీజీపీ సాంబశివరావుతో సహా ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లను సక్రమంగా చేయాలని సంబంధిత శాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు. 27న కోవింద్ విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి హెలికాఫ్టర్‌లో నాగార్జున వర్సిటీకి చేరుకుని అక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. -
డీజీపీ నియామకం రాష్ట్రం పరిధిలోకి..
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా డీజీపీ నియామకాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టేలా పోలీస్ చట్టాన్ని సవరించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం త్వరలో ఆర్డినెన్స్ కూడా తీసుకురావాలని తీర్మానించింది. రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సీకి పంపిన డీజీపీ ప్యానల్ ప్రతిపాదనలు నిబంధన లకు విరుద్ధంగా ఉన్నాయంటూ కేంద్ర హోంశాఖ మూడు పర్యాయాలు తిప్పి పంపిన నేపథ్యంలో ఏకంగా పోలీస్ చట్టాన్నే సవరించాలని మంత్రివర్గం నిర్ణయించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీస్ యాక్ట్ 9 ఆఫ్ 2014ను సవరిస్తూ ఆర్డినెన్స్ తెచ్చి, తరువాత అసెంబ్లీలో చర్చించి పూర్తిస్థాయి సవరణకు ఆమోదం పొందాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ ఆర్డినెన్సుతో డీజీపీ నియామకాన్ని ఇకపై రాష్ట్ర ప్రభుత్వమే చేసేందుకు అవకాశం లభిస్తుంది. ఆలిండియా సర్వీసెస్(ఏఐఎస్) యాక్ట్ 1953కి లోబడి డీజీపీ పదవీకాలం కూడా నిర్ణయించే అధికారం ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్రానికి ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో శనివారం రాత్రి వరకు జరిగిన మంత్రివర్గ సమావేశం వివరాలను మంత్రి నారాయణతో కలిసి సమాచార శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. మంత్రివర్గం నిర్ణయాలివీ... - ఈ ఏడాది డిసెంబర్ 27న నాగార్జున యూనివర్సిటీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా రాష్ట్ర ఫైబర్ గ్రిడ్ ప్రారంభోత్సవం. - పోలవరం ప్రాజెక్టు పనుల కోసం నిర్మాణ సంస్థకు ప్రభుత్వం ఇచ్చిన మొబిలైజేషన్ అడ్వాన్స్ మొత్తాన్ని స్వాధీనపరుచుకోవడాని కి(రికవరీ) మరో ఏడాది గడువు. 2018 సెప్టెంబర్‌కి నిర్మాణ సంస్థ మొబిలైజేషన్ అడ్వాన్స్ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. - ‘చంద్రన్న పెళ్లికానుక’పథకాన్ని ఫిబ్రవరిలో ప్రారంభిస్తారు. బీసీలకు రూ.30 వేలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.50 వేలు పెళ్లికానుక ఇవ్వనున్నారు. - ప్రతిపాదిత ట్రాన్స్‌జెండర్ పాలసీపై మంత్రిమండలి చర్చించింది. ఇది అమల్లోకి వస్తే 26 వేల మంది హిజ్రాలకు మేలు జరుగుతుంది. 18 ఏళ్లు పైబడిన హిజ్రాలకు నెలకు రూ.1500 పెన్షన్ అందిస్తారు. వీరికి రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, స్కాలర్షిప్లు మంజూరు చేస్తారు. - రాష్ట్రంలో కొత్తగా 9 అర్బన్ మండలాల ఏర్పాటు. విశాఖ అర్బన్ 2, 3, 4, విజయవాడ అర్బన్ 2, 3, 4, గుంటూరు, నెల్లూరు, కర్నూలులో ఒక్కొక్కటి చొప్పున అర్బన్ మండలాలు ఏర్పాటు కానున్నాయి. - కృష్ణా జిల్లా గన్నవరంలో నూతనంగా అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కమ్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు. ఈ కోర్టుకు అవసరమైన 27 పోస్టుల మంజూరుకు మంత్రిమండలి ఆమోదం. - పప్పుధాన్యాల కొనుగోళ్లకు ముగ్గురు మంత్రులతో కమిటీ. -
పోలీస్ బాస్ బరస్ట్
‘మీ దర్యాప్తులో తేలిన అంశాలు పత్రికలకు లీకవుతున్నాయా లేక.. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా మీరు దర్యాప్తు చేస్తున్నారా?!.. ఎందుకిలా జరుగుతోంది.. మీ తీరుతో పోలీసు వ్యవస్థ పరువు తీస్తున్నారు’.. బాస్ నోటి నుంచి దూసుకొచ్చిన ఈ మాటల తూటాలు నగర పోలీసు అధికారులను సూటిగా తాకాయి.. గంజాయి నిర్మూలన ప్రధానాంశంగా నిర్వహించిన ఐదు జిల్లాల ఉన్నతాధికారుల సమీక్షలో.. ఇటీవల విశాఖలో నమోదైన పలు సంచలనాత్మక కేసులు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.. హత్య కేసుల్లో డీఎస్పీ రవిబాబు అరెస్టు.. బంగారం రికవరీకి రాజస్థాన్ వెళ్లిన పోలీసు అధికారులపై అక్కడి ఏసీబీ పంజా.. గంజాయి అక్రమ రవాణాలో ఎక్సైజ్ పోలీసుల పాత్ర బహిర్గతం.. తదితర ఘటనలు ప్రస్తావనకు వచ్చినప్పుడు పోలీస్ బాస్ ఒక్కసారి బరస్ట్ అయ్యారని సమాచారం..‘మీరేం చేస్తున్నారో.. ఇక్కడేం జరుగుతోందో.. ప్రతిదీ నాకు తెలుసు’.. అని క్లాస్ పీకారు.. ప్రశాంతతకు విశాఖ మారుపేరు.. అటువంటి నగరంలో క్రైమ్ రేటు పెరుగుతోంది.. పరిస్థితి అదుపు తప్పుతోంది.. పరువు పోతోంది.. ఈ పరిస్థితిలో మార్పు రావాలని డీజీపీ గట్టిగా హెచ్చరించారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: హత్య కేసుల్లో ఓ డీఎస్పీ జైలుకెళ్లడంతో రాష్ట్రవ్యాప్తంగా విశాఖ పోలీసుల పరువు గంగలో కలిసింది. ఓ సీఐ, ఇద్దరు ఎస్సైలు ఎక్కడో రాజస్థాన్ రాష్ట్రంలో లంచం కేసులో అక్కడి ఏసీబీకి చిక్కడంతో జాతీయస్థాయిలోనూ మచ్చ వచ్చింది. ఇక గంజాయి స్మగ్లింగ్ కేసులో ఇద్దరు ఎక్సైజ్ అధికారులు అడ్డంగా బుక్కయ్యారు. ఇవన్నీ తాజాగా జరిగిన ఘటనలే. పోలీసులను సవా ల్ చేస్తున్నవే.. సరిగ్గా ఇదే సమయంలో రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్(డీజీపీ) సాంబశివరావు నగర పర్యటనకు రావడంతో పోలీసు అధికారులు హడలెత్తిపోయారు. పోలీస్ బాస్ ఏమంటారో... ఎవరికి చీవాట్లు పడతాయోనని ఆందోళన చెందారు. సరిగ్గా అధికారులు భయపడినట్లే జరిగింది. డీజీపీ సాంబశివరావు పోలీసుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. గంజాయి నిర్మూలన ప్రధానాంశంగా గురువారం విశాఖ నగరంలో డీజీపీ సాంబశివరావు శ్రీకాకుళం, విజ యనగరం. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల ఎస్పీలతో పాటు రాజమండ్రి అర్బన్, విశాఖ పోలీస్ కమిషనరేట్ అధికారులు, ఎక్సైజ్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కమిషనరేట్ పరిధిలోని డీసీపీలు, ఏసీపీలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. గంజాయి నిర్మూలనకు ప్రత్యేక కార్యచరణ రూపొందించడమే సమావేశం అజెండా అయినప్పటికీ విశాఖ పోలీసుల పనితీరుపై డీజీపీ సమీక్ష చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. నాకంతా తెలుసు నగరంలో గంజాయి సరఫరా, వినియోగంపై ప్రస్తావనకు వచ్చిన సందర్భంలో టాస్క్‌ఫోర్స్‌కు చెందిన ఓ అధికారి సమాధానమివ్వబోగా డీజీపీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ‘టాస్క్‌ఫోర్స్‌లో ఏం జరుగుతోంది.. శాఖాపరమైన ఫిర్యాదులు లెక్కలేనన్ని వస్తున్నాయి.. మీరేం చేస్తున్నారో అంతా నాకు తెలుసు’.. అని గట్టిగా క్లాస్ పీకినట్టు చెబుతున్నారు. ఇదే సందర్భంలో డీఎస్పీ రవి బాబు కేసు దర్యాప్తు విషయం ప్రస్తావనకు వచ్చిందని అంటున్నారు. ‘హత్య కేసుల్లో డీఎస్పీ ఉన్నా గానీ నిష్ఫక్షపాతంగా కేసు కట్టా రన్న పేరు తెచ్చుకున్నారు.. అక్కడ వరకు ఓకే కానీ.. ఆ కేసు దర్యాప్తు విషయాలు ముందుగానే పత్రికలకు ఎలా లీకయ్యాయని’ ప్రశ్నిం చినట్టు తెలిసింది. ‘మీరు దర్యాప్తు చేసిన విషయాలు ముందుగానే పూసగుచ్చినట్టు పత్రిక ల వారికి చెప్పారా.. లేదంటే పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా మీరు విచారణ చేపట్టారా’.. అని సంబంధిత విచారణ అధికారులను నేరుగా ప్రశ్నించినట్టు తెలిసింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా విశాఖ నగరంలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరుగుతోంది.. అంతకు ముందు విశాఖ అంటే ప్రశాంత నగరమనే వాళ్లు.. కానీ ఈ మధ్యనే పరిస్థితి అదుపు తప్పింది.. శాంతిభద్రతల విషయంలో వెంటనే మార్పు రావాలి.. అని కమిషనరేట్ అధికారులను డీజీపీ గట్టిగా హెచ్చరించినట్లు సమాచారం. సెక్యూరిటీ లేకుండా ఆ అర్ధగంట డీజీపీ ఎక్కడకు వెళ్లారు? సమావేశం నుంచి డీజీపీ ఓ అర్ధగంట సేపు ఎటువంటి గన్‌మెన్ సెక్యూరిటీ లేకుండా ఒంటరిగానే ప్రైవేటు కారులో వెళ్లడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మధ్యాహ్నం 3.15 గంటలకు ఎస్పీలు, కమిషనర్లు, ఎక్సైజ్ అధికారులతో మొదలైన సమావేశం రెండు గంటలకు పైగా ఏకబిగిన సాగింది. అనంతరం డీజీపీ సమావేశం నుంచి బయటకు వచ్చి ఒక్కరే ఓ ప్రైవేటు కారులో బయటకు వెళ్లారు. సరిగ్గా ప్రెస్‌మీట్‌కు ముందు 6 గంటలకు తిరిగి చేరుకున్నారు. ఆయన పర్యటన పూర్తిగా వ్యక్తిగతమే అయినప్పటికీ గన్‌మెన్ లేకుండా ఒంటరిగా ఆ అర్ధగంట ఎక్కడకు వెళ్లారోనని పోలీసు అధికారవర్గాల్లోనూ చర్చకు తెరలేపింది. కాగా, నగరంలోని సంపత్ వినాయగర్ స్వామి ఆలయానికి వెళ్లి వచ్చారని, దేవాలయానికి వెళ్లేటప్పుడు సెక్యూరిటీ ఎందుకని ప్రైవేటు వాహనంలో వెళ్లారని ఓ పోలీసు అధికారి గురువారం రాత్రి సాక్షికి చెప్పుకొచ్చారు. -
ఎస్ఐపై తక్షణం చర్యలు తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్/విజయవాడ సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై పోలీసు దౌరన్యాన్ని తమ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. రాజాపై దాడి చేసిన ఎస్ఐపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన తూర్పు గోదావరి ఎస్పీ విశాల్ గున్నిని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎస్పీతో పాటు డీజీపీ సాంబశివరావుతో ఫోన్లో మాట్లాడారు. రాజాపై జరిగిన దాడి వ్యవహారం తన దృష్టికి వచ్చిందని ఈ ఘటనపై నిష్పాక్షికంగా విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని ఎస్పీ తనకు చెప్పారని విజయసాయిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డీజీపీ దృష్టికి తాను ఈ విషయం తీసుకెళ్లినపుడు, ఎస్ఐపై తక్షణం చర్యలు తీసుకుం టానని తనకు హామీ ఇచ్చారని విజయసాయిరెడ్డి వివరించారు. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలి జక్కంపూడి రాజాపై దాడి చేసిన రామచంద్రపురం ఎస్ఐ నాగరాజును క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలోని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయంలో సోమవారం పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సామినేని ఉదయభాను, అధికారప్రతిని«ధులు వెలంపల్లి శ్రీనివాస్, టీజేఆర్ సుధాకర్ తదితరులు విలేకరులతో మాట్లాడారు. -
సాంబశివరావు పదవీకాలం పొడిగింపు?
సర్వీసు రెండేళ్లు పొడిగించేలా కేంద్రాన్ని కోరనున్న రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ డీజీపీగా నండూరి సాంబశివరావును రెండేళ్లపాటు కొనసాగించేందుకు చంద్రబాబు సర్కారు కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్లో ఆయన పదవీకాలం ముగియనుంది. అయితే మరో రెండేళ్లు ఆయన్ను డీజీపీగా కొనసాగించేలా సర్వీసును పొడిగించేలా కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. జూలై మొదటివారంలో కేంద్రానికి పంపించే సీనియర్ ఐపీఎస్‌ల ప్యానల్లో 1984 బ్యాచ్‌కు చెందిన సాంబశివరావు, 1985 బ్యాచ్‌కు చెందిన మాలకొండయ్య, 1986 బ్యాచ్‌కు చెందిన కౌముది ముగ్గురి పేర్లు ఉంటాయని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్న మాలకొండయ్యకు డీజీపీ పోస్టు ఇవ్వడానికి చంద్రబాబు సుముఖంగా లేరని చెబుతున్నారు. ఏపీ కేడర్‌కు చెందిన కౌముది ప్రస్తుతం ఎన్ఐఏలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. ఆయనను ఏపీకి తీసుకొచ్చి డీజీపీ పోస్టు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదని సమాచారం. ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్‌ను డీజీపీ చేయాలని ప్రభుత్వంలోని పలువురు కీలకనేతలు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిసింది. -
ఐలవరం టూ జమ్మూకశ్మీర్
కిడ్నాపర్ నాగేశ్వరరావును అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లా భట్టిప్రోలు ఐలవరం గ్రామానికి చెందిన లిఖితను కిడ్నాప్ చేసిన ఆటోడ్రైవర్ నాగేశ్వరరావు జమ్మూకశ్మీర్‌లో పేర్లు మార్చుకుని మకాం ఉండగా అరెస్టు చేసినట్లు ఏపీ డీజీపీ సాంబశివరావు తెలిపారు. గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం విలేకరు లకు ఆయన వివరాలు వెల్లడించారు. నిం దితుడిపై కిడ్నాప్ కేసు నమోదు చేశామన్నా రు. కిడ్నాప్ తర్వాత 25వ తేదీ వరకూ వారి వివరాలు ట్రాక్ చేయగలిగామన్నారు. గతం లో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేసి 2011లో తొలగింపునకు గురయ్యాక ఐలవ రంలో ఆటో నడుపుకొంటున్నాడన్నారు. పిల్లలను లోబర్చుకొనే యత్నం... నాగేశ్వరరావు ప్రవర్తనకు విసిగిన భార్య అతని నుంచి దూరంగా ఉంటోందని డీజీపీ తెలిపారు. ఐలవరంలో ఓ టీచర్ సహా పలువురు మహిళలతో అతనికి వివాహేతర సంబంధాలున్నాయన్నారు. ఆటోలో స్కూల్ కు తీసుకెళ్లే పిల్లలను కూడా లోబర్చుకో వడానికి యత్నించేవాడన్నారు. లిఖితకు ఏడాది నుంచి మాయమాటలు చెప్పి దగ్గర య్యాడని వివరించారు. టీచర్‌కు ఫోన్‌తో ఆచూకీ లభ్యం.. ఏప్రిల్ 21న లిఖితను కిడ్నాప్ చేసి ఐలవరం నుంచి ఒంగోలు, అక్కడి నుంచి హైదరాబా ద్ మీదుగా ఢిల్లీ, కశ్మీర్‌లోని సాంబాకు తీసు కెళ్లినట్లు తెలిపారు. బీఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా నాగేశ్వరరావు పనిచేయడంతో అక్కడ పరిచ యాలున్నాయని, అతని పేరును తేజగా, లిఖిత పేరును గీతగా మార్చి సెంట్రింగ్, కెమికల్ ఫ్యాక్టరీ, ఆయిల్ కంపెనీల్లో పనిచే స్తూ లిఖితపై పలుమార్లు లైంగికదాడి చేసి నట్లు చెప్పారు. ఐలవరంలోని టీచర్‌కు నాగేశ్వరరావు ఫోన్ చేసి అకౌంట్లో డబ్బులు వేయాలని కోరడంతో ఆచూకీ లభ్యమైందని వివరించారు. -
రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి
ఏలూరు అర్బన్: జిల్లాలో రోడ్డు ప్రమాదాలపై రాష్ట్ర డీజీపీ ఎన్.సాంబశివరావు ఏలూరు రేంజ్ డీఐజీ పీవీఎస్ రామకృష్ణ, జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్‌తో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో అధికారులు జిల్లాలో ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. డివి జన్ల వారీగా ఇప్పటివరకూ ఎన్ని ప్రమాదాలు జరిగాయి, ఎందరు మరణించారు అనే వివరాలు సేకరించారు. రహదారి ప్రమాదాల నివారణలో భాగంగా ప్రభుత్వం జిల్లాలో ఇప్పటివరకూ ఉన్న పెట్రోలింగ్ వాహనాలకు తోడు మరో 13 వాహనాలను సమకూర్చిందని వాటిని ఎవరు మోనిటర్ చేస్తున్నారని, వాహనాలు వచ్చిన తర్వాత ప్రమాదాలను ఎంత మేరకు తగ్గించారని అడిగి తెలుసుకున్నారు. ఆయా వివరాలను డీఐజీ, ఎస్పీ గణాంకాలతో వివరించారు. -
రోడ్డు భద్రత యాప్‌లో ప్రమాద దృశ్యాలు
– అప్లోడ్ చేయాలని పోలీస్ అధికారులకు డీజీపీ ఆదేశం కర్నూలు: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కడ జరిగినా ఆ దృశ్యాలను ఫొటోలు తీసి.. రోడ్డు భద్రత యాప్‌లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని పోలీసు అధికారులను డీజీపీ సాంబశివరావు ఆదేశించారు. బుధవారం ఉదయం విజయవాడ నుంచి అన్ని జిల్లాల పోలీసు అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా నుంచి రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు, ఎస్పీ ఆకె రవికృష్ణ, అడిషనల్ ఎస్పీ షేక్షావలీ హాజరయ్యారు. ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ..వాహనాలను రాంగ్ రూట్లో నడపడం, మద్యం తాగి డ్రైవింగ్ చేయడం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయన్నారు. జిల్లాల వారీగా రోడ్డు ప్రమాదాల సమచారాన్ని అడిగి తెలుసుకున్నారు. జాతీయ రహదారుల్లోని హాస్పిటల్స్ ఫోన్ నంబర్లు పోలీసు సిబ్బంది కలిగి ఉండాలన్నారు. కొత్తగా ఎంపికైన ఎస్ఐలు శిక్షణకు వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని చెక్‌పోస్టుల సమాచారం అందజేయాలన్నారు. డీఎస్పీ రమణమూర్తి, ఏఓ అబ్దుల్ సలాం, సీఐలు మహేశ్వరరెడ్డి, శ్రీనివాసులు, డేగల ప్రభాకర్, సుబ్రమణ్యం, ఆదిలక్ష్మీ, రామాంజనేయులు (కమ్యూనికేషన్), ఆర్ఐలు రంగముని, జార్జ్, రామకృష్ణ, ఈ.కాప్స్ ఇంచార్జి రాఘవరెడ్డి, డీఐజీ సీసీ నారాయణ, డీసీఆర్బీ ఎస్ఐ పులిశేఖర్, ఈ.కాప్స్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఐపీఎస్ అధికారుల బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. విజయవాడ జాయింట్ పోలీస్ కమిషనర్ పి.హరికుమార్‌ను ఏసీబీ అదనపు డైరెక్టర్ (డీఐజీ)గా నియమించింది. వెయిటింగ్లో ఉన్న వినీత్ బ్రిజ్‌లాల్‌ను గ్రేహౌండ్స్ డీఐజీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లాం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా రిటైర్డ్ ఎస్పీ కె.మాధవరావును స్టేట్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఓఎస్డీగా నియమిస్తూ రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి అనూరాధ ఉత్తర్వులు జారీ చేశారు. డీజీపీ నండూరి సాంబశివరావు అభ్యర్థన మేరకు రిటైర్డ్ ఎస్పీ మాధవరావుకు ఓఎస్డీగా పోస్టింగ్ ఇచ్చినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నెలకు రూ.50 వేల వేతనంతో ఏడాదిపాటు ఆయన ఓఎస్డీగా కొనసాగనున్నారు. -
బాధితులను పరామర్శించిన డీజీపీ
-
డీజీపీపై చర్యలు తీసుకోండి
⇒ గన్నవరం న్యాయస్థానంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రైవేటు కేసు ⇒ మరో ఐదుగురు పోలీసు అధికారులపైనా ఫిర్యాదు ⇒ మహిళా సదస్సులో పాల్గొనకుండా అడ్డుకున్నారు, బెదిరించారు ⇒ మహిళగా, ఎమ్మెల్యేగా నా హక్కులకు భంగం కలిగించారు గన్నవరం (విజయవాడ): విజయవాడలో నిర్వహించిన జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో పాల్గొనకుండా తనను అక్రమంగా నిర్బంధించి బలవంతంగా హైదరాబాద్‌కు తరలించిన ఉదంతంలో డీజీపీ సాంబశివ రావుతో పాటు మరో ఐదుగురు పోలీసు అధికారులపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రైవేటు కేసు దాఖలు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే రోజా మంగళవారం కృష్ణా జిల్లా గన్నవరం జూనియర్ అదనపు సివిల్ జడ్జి కోర్టుకు స్వయంగా వచ్చి కేసు వేశారు. ఈ నెల 11న తనను గన్నవరం విమానాశ్ర యంలో బెదిరించి సదస్సుకు హాజరు కాకుం డా అడ్డుకోవడం ద్వారా ఓ మహిళగా, ఎమ్మెల్యేగా తన హక్కులకు భంగం కలిగించారని పిటిషన్లో రోజా పేర్కొన్నారు. అందుకు బాధ్యులైన డీజీపీ, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్, ఎయిర్‌పోర్టు ఏసీపీ రాజీవ్ కుమార్, నార్త్ జోన్ ఏసీపీ శ్రావణి, సీఐలు సహేరాబేగం, గౌస్ బేగ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుధాకర్ రెడ్డి, వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి, న్యాయవాదులు సునీత, రాజశేఖర్, సాయిరాం, గుంటూరు జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ పోలూరి వెంకటరెడ్డి, వైఎస్సార్ సీపీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దుట్టా రామచంద్రరావు, కృష్ణా జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ తాతినేని పద్మావతితో కలిసి ఎమ్మెల్యే రోజా మంగళవారం ఉదయం 10.30కి గన్నవరం కోర్టుకు వచ్చారు. మహిళా ఎమ్మెల్యే హక్కులకు భంగం.. కోర్టు కాల్వర్క్ అనంతరం న్యాయమూర్తి డి.షర్మిలకు సీఆర్పీసీ సెక్షన్ 190, 200 కింద ప్రైవేటు కేసు నమోదు నిమిత్తం రోజా తన ఫిర్యాదు పత్రాలను దాఖలు చేశారు. ఆమె తరఫున సీనియర్ న్యాయవాది సుధాకర్‌రెడ్డి కోర్టులో వాదనలను వినిపించారు. జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుకు ఎమ్మెల్యే రోజాను ఆహ్వానించిన తర్వాత పాల్గొన కుండా అడ్డుకోవడం ద్వారా ఆమె హక్కులకు భంగం కలిగించే విధంగా పోలీసులు అవ మానించారని న్యాయవాది సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే రోజా హక్కులకు భంగం కలిగించిన పోలీసు అధికారులపై సెక్షన్ 341, 342, 365, 367 ఐపీసీ, 120 (బి) ఐపీసీ కింద కేసు దాఖలు చేయాలని కోరారు. వాదనల అనంతరం తదుపరి విచారణను న్యాయమూర్తి డి.షర్మిల మార్చి 3వ తేదీకి వాయిదా వేశారు. రాష్ట్రంలోని మహిళలకు రక్షణ కల్పించడంలో పోలీస్ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తంచేశారు. -
నన్ను.. చంపేస్తారేమో
మీడియా ఎదుట విలపించిన రోజా ⇒ నన్ను చంపేస్తే నా పిల్లలకు దిక్కెవరు? ⇒ సదస్సుకు ఆహ్వానించి పోలీసులతో నిర్బంధిస్తారా? ⇒ స్పీకర్ కోడలి ఆర్తనాదాలు ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తే తప్పా? ⇒ మహిళల హక్కుల్ని స్పీకరే హరిస్తే ఎవరికి చెప్పాలి ⇒ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడితే అవకాశమిస్తామని డీజీపీ అనడం దారుణం సాక్షి, అమరావతి: ‘‘తెలుగుదేశం ప్రభుత్వం నుంచి నాకు ప్రాణహాని ఉంది. నన్ను చంపేయరని గ్యారంటీ లేదు.’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆందోళన వ్యక్తం చేశారు. తనను జాతీయ మహిళా పార్లమెంటుకు ఆహ్వానించి ఉద్దేశ్యపూర్వకంగానే అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో పోలీసులు కారులో ఎక్కించుకుని సదస్సుకు హాజరు కాకుండా అరెస్టు చేయడం చూస్తే మహిళలకు ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి రక్షణ ఉందో అర్ధం చేసుకోవచ్చని అన్నారు. తనను అరెస్టుచేసి సదస్సుకు రాకుండా అడ్డుకున్న ఘటనపై శనివారం లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాకు వివరించారు. (చదవండి : ఎమ్మెల్యే రోజా నిర్బంధం ) మహిళా పార్లమెంటు జరుగుతున్న రోజున తనను ఆ సదస్సుకు రానివ్వకుండా అడ్డుకోవడం అత్యంత దురదృష్టకరమైన రోజని రోజా అన్నారు. రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేకుండా పోతే ఇక సామాన్య మహిళలకు ఎలాంటి రక్షణ ఉంటుందని సూటిగా ప్రశ్నించారు. ‘‘నేనేమైనా ఉగ్రవాదినా? నా వద్ద బాంబులున్నాయా? కత్తులున్నాయా? ఏమీ లేకుండానే ఆహ్వానం పంపించి ఎందుకు అరెస్టు చేశారు? నేనంటే చంద్రబాబుకు, స్పీకర్‌కు ఎందుకంత భయం’’ అని రోజా ప్రశ్నించారు. ప్రజల మాన ప్రాణాలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు ముఖ్యమంత్రికి తొత్తులుగా మారి తన అరెస్టు విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించారని ఆరోపించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే.. విజయవాడలో సదస్సు పెట్టి.. ‘‘నేరాలు తీవ్రంగా పెరుగుతున్న విజయవాడలో మహిళా సదస్సు పెట్టారు. అక్కడికి నేను వెళితే ఉగ్రవాదిలాగా నిర్బంధించారు. ఇది ప్రజల డబ్బుతో నిర్వహిస్తున్న సదస్సు. ప్రజాప్రతినిధిగా పాల్గొనే హక్కు నాకు ఉంది. అయినా అడ్డుకున్నారంటే ఈ ప్రభుత్వ దుర్మార్గం ఎలా ఉందో చెప్పుకోవచ్చు. ఎందుకయ్యా చంద్రబాబు, స్పీకర్‌గారు నేనంటే అంత భయం? ప్రతిపక్షం అనేది ఎప్పుడూ ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తిచూపుతూనే ఉంటుంది. దీనికి భయపడి మహిళలను అడ్డుకుంటారా? అసెంబ్లీలో మహిళా సమస్యలపై మాట్లాడితే అడ్డుకున్నారు. కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌లో మహిళలను వ్యభిచార కూపంలో దించుతుంటే అసెంబ్లీలో గళమెత్తినందుకు నన్ను నిబంధనలకు విరుద్ధంగా ఏడాదిపాటు సస్పెం డ్ చేశారు, ఇప్పుడు జరుగుతున్న మహిళా సదస్సులో నేను పాల్గొంటే ఎక్కడ మహిళా సమస్యలపై మాట్లాడతానోనని భయపడి అడ్డుకున్నారు. రాష్ట్రంలో జరిగే ప్రతి అత్యాచారం, దాడుల వెనక ఎవరో ఒకరు తెలుగుదేశం నేత ఉన్నారు. ఇంట్లో కోడలు ఆర్తనాదాలు గుర్తుకు రాలేదా? మహిళా సాధికారత అంటూ పార్లమెంటు నిర్వహిస్తున్న స్పీకర్...తన సొంత కోడలిని వేధింపులకు గురిచేయడం ఏ తరహా మహిళా సాధికారతో చెప్పాలి. స్పీకర్ తన కోడలిపై వ్యవహరించిన తీరుపై ఆమె చేసిన ఆర్తనాదాల వీడియోను ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తే తప్పా? ఇంట్లో ఆర్తనాదాలు, అమరావతిలో నీతులు మాట్లాడతావా?. రెండు రోజుల క్రితమే కారు షెడ్లో ఉండాలి, మహిళలు ఇంట్లో ఉండాలని స్పీకర్ మాట్లాడిన తీరు మహిళా లోకాన్ని బాధించింది. మహిళా పార్లమెంటులో ఒక్క మహిళ బాధనైనా విన్నారా? మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించారా? భజన చేయించు కోవడానికా మీరు పిలిచింది...ఒక వనజాక్షినో, రిషితేశ్వరి తల్లినో, జానీమూన్నో పిలిచి మాట్లాడించి ఉంటే బాగుండేది. నన్ను చంపేస్తే నా పిల్లలకు దిక్కెవరు? మహిళా పార్లమెంటు నిర్వహించే నైతిక హక్కు చంద్రబాబుకు, స్పీకర్‌కు లేనే లేదు. అసెంబ్లీలో మాట్లాడితే రూల్సుకు విరుద్ధంగా సస్పెండ్ చేసే వీళ్లు రేపు అమరావతిలో జరిగే అసెంబ్లీలో ఏం చేస్తారోనని భయంగా ఉంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు రక్షణ లేదు. నన్ను పోలీసులు కారులో ఎక్కించి నా సెల్‌ఫోన్ తీసుకున్నారు. నా గన్‌మెన్‌ను దించేశారు...ఇక నన్ను చంపెయ్యరని గ్యారంటీ ఏముంది? నేనే చనిపోతే నా పిల్లలకు దిక్కెవరు? విజయవాడలో నిర్వహిస్తున్న జాతీయ మహిళా పార్లమెంటు తెలుగుదేశం మహానాడులా ఉందిగానీ, మహిళా సదస్సులా లేదు. కనీసం ఆ పోస్టర్లలో ఒక్క మహిళ ఫొటో అయినా ఉందా? సీఎం చంద్రబాబు, స్పీకర్, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఫొటోలున్నాయి...ఇదేనా మీ మహిళా సాధికారత? గిరిజన ఎమ్మెల్యేలన్న గౌరవం కూడా లేదు విదేశాల నుంచి వచ్చేవారికి ఫ్లైట్లు బుక్ చేశారు. పెద్ద పెద్ద హోటళ్లలో రూములు ఇచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళలను, స్కూలు విద్యార్థినులను సంతల్లో పశువుల్లాగా ప్రొక్లైనర్లలో ఎక్కించుకుని వెళతారా? ఇదేనా మహిళా పార్లమెంటు? (విద్యార్థినులను పొక్లైనర్లలో తీసుకెళుతున్న దృశ్యాలను మీడియాకు చూపించారు.) ఇవన్నీ చూస్తుంటే ఒక్క శాతం కూడా మహిళా సాధికారత సాధించలేరు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితను పిలిచారు. చంద్రబాబు కోడలు, లోకేష్ భార్య అయిన నారా బ్రాహ్మణిని పిలిచారు. వెంకయ్యనాయుడు కూతురు దీపా వెంకట్‌ను, కోడెల శివప్రసాదరావు కూతురు విజయలక్ష్మిని పిలిచి మాట్లాడించారు. మీకు భజన చేయించుకోవడానికా వీళ్లందరినీ పిలిచింది? మీకు నిజాయితీ ఉంటే బృందాకారత్నో, సామాజిక ఉద్యమకారిణి మేథాపాట్కర్నో పిలిచి మాట్లాడించి ఉండాల్సింది. ఆ ధైర్యం మీకు లేదు. ( చదవండి : నిస్సిగ్గుగా అరాచకం ) వెంకయ్య కూతురు, నారాబ్రహ్మణి తదితరులను ఏ హోదాతో పిలిచారు? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను ఎందుకు పిలవలేదు? నాకు మణికొండ, నగరి రెండు చిరునామాలకు రెండు ఇన్విటేషన్లు పంపించారు. ఒకవేళ సదస్సుకు రాకపోయి ఉంటే మహిళల సమస్యలపై చిత్తశుద్ధిలేదని బురద జల్లుతారు. వస్తే ఇలా అడ్డుకున్నారు. నాపై అంటే గౌరవం లేదు, కనీసం మా పార్టీలో నలుగురు గిరిజన ఎమ్మెల్యేలు ఉన్నారు. వారికి కనీసం ఫోన్ చేసైనా మహిళా పార్లమెంటుకు రమ్మని పిలిచారా? ఇదేనా మీ మహిళా సాధికారత? బాబు రెండున్నరేళ్ల పాలనలో మహిళలపై జరిగిన అన్యాయాలు, అక్రమాలపై రాయాలంటే పెద్ద గ్రంథమే రాయాల్సి వస్తుంది. త్వరలో వీరికి ప్రజలే బుద్ధి చెబుతారు. డ్వాక్రా రుణ మాఫీ అన్నారు కానీ మాఫీ చెయ్యకుండా మహిళా సంఘాలను నిర్వీర్యం చేశారు, బాబొస్తే జాబొస్తుందని చెప్పి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చదివిన అమ్మాయిలకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈరోజు నాకు అన్యాయం జరిగింది..రేపు మీ చెల్లికో, తల్లికో జరుగుతుంది...అందుకే అందరం కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నించి, ప్రభుత్వం మెడలు వంచి, మహిళల హక్కులను కాపాడాల్సిన అవసరం ఉంది. కన్నీటి పర్యంతమైన రోజా మహిళా పార్లమెంటుకు వెళుతున్న తనను నిర్బంధించిన నేపథ్యంలో ఆర్కే రోజా ఆద్యంతం కన్నీటి పర్యంతమయ్యారు. మీడియా సమావేశంలో ఉద్విగ్నంగా మాట్లాడుతూనే బోరున విలపించారు. ఒక మహిళ పట్ల పోలీసులు వ్యవహరించే తీరు ఇదా? వాళ్లు ఏం చేస్తారో తెలియదు, సెల్‌ఫోన్ లేదు, గన్‌మెన్‌ను దించేశారు. ఈ పరిస్థితుల్లో పోలీసుల మధ్య వెళ్లడం ఎలా ఉంటుందో ఊహించారా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ప్రభుత్వంలో తనకు అస్సలు రక్షణ లేదని, తనకు ఏమైనా జరిగితే తన పిల్లల పరిస్థితి ఏమిటని? గద్గద స్వరంతో ప్రశ్నించారు. ఈ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మహిళలపై జరిగిన అన్నిరకాల దాడులకు సంబంధించిన వివరాలను మీడియా ప్రతినిధులకు రోజా అందజేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ అణగదొక్కాలని చూడలేదు.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిజంగా మగాడే...ఆ విషయం గట్టిగా చెప్పగలను. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ప్రతిపక్ష పార్టీలో ఉన్నాను. పలు సమస్యలపై గళమెత్తాను. కానీ నన్ను ఏనాడూ వైఎస్ అణగదొక్కాలని చూడలేదు, ఒక మహిళా నాయకురాలిగా మాత్రమే చూశారు. అదే ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాచేత పదేళ్లపాటు పార్టీలో గాడిద చాకిరి చేయించుకుని, నేను ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేస్తే ఒక్క పైసా ఇవ్వకుండా రెడ్డి కులస్తురాలినని ఓడించిన నీచ సంస్కృతి. నేను ఐదునెలల గర్భిణిగా ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున బొబ్బిలి ఉప ఎన్నికలో పాల్గొన్నాను...కానీ ఆ కృతజ్ఞత కూడా బాబుకు లేదు. ఇలాంటి సెంటిమెంట్లన్నీ చంద్రబాబుకు ఉండవు. బాబుకు అనుకూలంగా తీర్పులు వస్తే కోర్టులు గొప్పవి. మాకు అనుకూలంగా వస్తే మాత్రం లెక్క చేయరు. అచ్చెన్నాయుడు, బుచ్చయ్యచౌదరి, బోండా ఉమా కంటే నేనేమైనా ఎక్కువ మాట్లాడానా...నా లాంటి మహిళా శాసనసభ్యురాలికే అసెంబ్లీలో ఈ విధమైన పరిస్థితి ఉంటే సాధారణ మహిళలకు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం ఉంటుందా? -
నిస్సిగ్గుగా అరాచకం
ఎమ్మెల్యే రోజాపై సర్కారు నిరంకుశం.. మహిళా పార్లమెంట్‌కు రాకుండా అడ్డగింత ⇒ రెండు ఆహ్వానాలు.. నాలుగు అవమానాలు... ⇒ దలైలామా వస్తున్నారని... ప్రత్యేకంగా తీసుకెళ్తామని.. ⇒ గన్నవరం విమానాశ్రయంలో హైడ్రామా ⇒ బలవంతంగా పోలీసు వాహనంలో తరలింపు ⇒ విజయవాడ అంటూ గుంటూరువైపు పయనం ⇒ పేరేచర్ల వద్ద వాహనం దూకి సాయం కోసం రోజా అర్థింపు ⇒ జనాన్ని బెదిరించి తిరిగి వాహనంలో కుక్కిన ఖాకీలు ⇒ కిందపడిపోయిన ఎమ్మెల్యేను వాహనం వరకు ఈడ్చివేత ⇒ ఆమె రోజా కాదు నక్సలైట్ అంటూ అబద్ధాలు.. ⇒ హైదరాబాద్ నివాసం వద్ద రోజాను వదలివెళ్లిన పోలీసులు దారుణం.. దుర్మార్గం..అమానవీయం.. అత్యంత హేయం..మధ్యయుగాలనాడు కూడా ఇలాంటి నిర్బంధం కనీవిని ఎరగం...జనం చూస్తారన్న భయం లేదు... ఛీత్కరిస్తారన్న వెరపు లేదు..మహిళా పార్లమెంటు సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఓ మహిళా ఎమ్మెల్యే పట్ల దుర్మార్గంగా వ్యవహరించారు..తాలిబాన్ పాలనే మెరుగన్నట్లు ప్రభుత్వం, పోలీసులు...అరాచకం సృష్టించారు.మహిళా సాధికారత పేరుతో కోట్లు వెచ్చించి నిర్వహిస్తున్న సదస్సు సాక్షిగా..అందులో పాల్గొనేందుకు వచ్చిన మహిళా ఎమ్మెల్యే పట్ల ప్రభుత్వం అత్యంత అమానుషంగా వ్యవహరించింది. మహిళా సమస్యలపై మాట్లాడే గొంతును కర్కశంగా నులిమే ప్రయత్నం చేసింది.మహిళా పార్లమెంటుకు ఎమ్మెల్యే రోజాను ఆహ్వానించిన ప్రభుత్వం.. విమానాశ్రయంలోనే పోలీసులను మోహరించి, అడ్డగించింది.కారణం చెప్పకుండా.. నిర్బంధించి.. వ్యక్తిగత సిబ్బందిని దూరం చేసి.. వాహనాలు మార్చుతూ, జిల్లాలు తిప్పుతూ.. బెదిరిస్తూ.. హైదరాబాద్‌కు తరలించడం చూసి రాష్ట్రమంతా నివ్వెరపోయింది..మహిళల పట్ల తాము ఎంత కర్కశంగా వ్యవహరించగలమో మహిళా ఎమ్మెల్యే రోజా విషయంలో వ్యవహరించిన తీరుతో బాబు సర్కారు మరోమారు రుజువు చేసుకుంది.. సాక్షి నెట్వర్క్ : మహిళా పార్లమెంటు సదస్సుకు ఆహ్వానంతో వెళుతున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కె రోజాను శనివారం గన్నవరం విమానాశ్రయంలో పోలీసులు అడ్డగించారు. ఆ తర్వాత అత్యంత దుర్మార్గంగా, బలవంతంగా హైదరాబాద్ తరలించారు. రెండు ఇన్విటేషన్లు పంపిన ప్రభుత్వం విమానాశ్రయంలో రోజాను అదుపులోకి తీసుకుని హైడ్రామా నడిపించింది. దలైలామా వస్తున్నారని కాసేపు.. ప్రత్యేక వాహనంలో తరలిస్తున్నామని కాసేపు... నిరీక్షించేలా చేసి కనీసం ఎక్కడికి తీసుకుపోతున్నారో కూడా చెప్పకుండా వెనుకమార్గం గుండా పోలీసు వాహనంలో తరలించారు. విజయవాడలో మీకు కేటాయించిన వసతికి తీసుకెళ్తున్నామని చెబుతూ గుంటూరు జిల్లా మీదుగా ఆమెను హైదరాబాద్ తరలించారు. (చదవండి : నన్ను.. చంపేస్తారేమో ) తనను నిర్బంధించి తరలిస్తున్న సంగతిని సామాజిక మాధ్యమాల ద్వారా తెలియ జేసేందుకు యత్నించిన రోజా ఫోన్‌ను పోలీసులు లాగేసుకుని దురుసుగా ప్రవర్తించారు. ప్రభుత్వ నిరంకుశ పోకడలను నిరసిస్తూ వాహనం నుంచి దిగేందుకు యత్నించిన ఆమెను వాహనంలోకి ఈడ్చేశారు. తోపులాటలో ఆమె వాహనం నుంచి కిందపడిపోయినా.. గాయాలవుతున్నా కర్కశ ఖాకీలు లెక్కచేయలేదు. దురుసుగా వాహనంలోకి నెట్టేశారు. ఆమె ఏ నేరం చేశారని ప్రశ్నించిన స్థానికులనూ బెదిరించారు. అసలు ఆమె రోజా కాదు నక్సలైట్ అని అబద్దపు వ్యాఖ్యలూ చేశారు. దారులు మారుస్తూ.. ముందుకుసాగారు. పోలీసు వాహనాన్ని అడ్డుకుని తమ నాయకురాలిని కాపాడుకునేందుకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ శ్రేణులను, అభిమా నులను చెదరగొడుతూ రోజాను హైదరాబాద్‌లోని ఆమె నివాసం వద్ద విడిచిపెట్టారు. సామాజిక మాధ్యమంలో రోజా చేసిన వ్యాఖ్యల వల్లే ఆమెను జాతీయ మహిళా పార్లమెంటుకు హాజరు కాకుండా అడ్డుకుని వెనక్కు పంపేశామని డీజీపీ సాంబశివ రావు పేర్కొనడం చూసి జనం నివ్వెరపోతున్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలకు రోజాను నిర్బంధించిన తీరు అద్దం పడుతోందని విశ్లేషకులంటున్నారు. వినాశకాలే విపరీత బుద్ధిః అని వ్యాఖ్యానిస్తున్నారు.. శనివారం రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన రోజా నిర్బంధం, తరలింపు వ్యవహారం ఎలా సాగిందంటే... విమానాశ్రయంలోనే నిర్బంధం.. విజయవాడలో నిర్వహిస్తున్న జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో రెండోరోజు చర్చా గోష్టిలో పాల్గొనాలని స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు కొన్నిరోజుల క్రితం నగరి ఎమ్మెల్యే రోజాకు ఆహ్వానపత్రం పంపారు. దీంతో ఆమె హైదరాబాద్ నుంచి శనివారం ఉదయం 8గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు.కానీ రోజాను అడ్డుకునేందుకు ప్రభుత్వం విమానాశ్రయంలోనే హైడ్రామాకు తెరతీసింది. కొత్త టెర్మినల్ భవనం నుంచి బయటకు వస్తున్న రోజాను ఏసీపీ రాజీవ్‌కుమార్ నేతృత్వంలో పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీ వెళ్లేందుకు బౌద్ధుల ఆధ్యాత్మికగురువు దలైలామా వస్తున్నందున అరగంట పాటు లాంజ్‌రూమ్‌లో విశ్రాంతి తీసుకోవాల్సిందిగా ఆమెను కోరారు. పోలీసుల విజ్ఞప్తి మేరకు రోజా లాంజ్‌రూమ్ వద్దకు వెళ్లారు. కానీ ఆమెను దాదాపు గంటకుపైగా బయటకు రానీయకుండా పోలీసులు అక్కడే నిర్భదించారు. రోజా కోసం వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కైలే జ్ఞానమణి పంపించిన కారును పోలీసులు అనుమతించలేదు. అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనంలో విజయవాడలో బస ఏర్పాటు చేసిన హోటల్‌కు పంపిస్తామని రోజాకు చెప్పారు. అందుకు ఆమె నిరాకరించినప్పటికీ మహిళా సీఐతో పాటు పలువురు సిబ్బంది ఆమెను పోలీసు వాహనం లోకి ఎక్కించి పాత టెర్మినల్ వైపు తీసుకువెళ్లారు. ఆమెతోపాటు వాహనం ఎక్కిన పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్‌యాదవ్, వ్యక్తిగత సిబ్బందిని పాత టెర్మినల్ గేటు వద్ద దించి వేశారు. ఒక్క రోజాను మాత్రమే వాహనంలో విజయవాడ వైపుగా తీసుకువెళ్లారు. మీడియా కంట పడకుండా టెర్మినల్ ముందువైపు కాకుండా వెనుక నుండి తరలించారు. విమానాశ్రయంలో ఉన్న వైఎస్సార్సీపీ నేతలెవరూ తమ వాహనాన్ని అనుస రించకుండా పోలీసులు పథకం ప్రకారం వ్యవహరించారు. వైఎస్సార్సీపీ నేతల సెల్ ఫోన్లను, కారు తాళాలను లాక్కున్నారు. అంతా గోప్యమే... విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా పోలీసులు హైడ్రామా కొనసాగించారు. రోజాను ప్రభుత్వం విజయవాడలో ఏర్పాటు చేసిన బసకు తీసుకువెళ్తామని చెప్పిన పోలీసులు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. వాహనాన్ని విజయవాడ మీదుగా గుంటూరు వైపు తీసుకువెళ్లారు. తనను ఎక్కడికి తీసుకువెళ్తున్నారని ఆమె ప్రశ్నించినప్పటికీ బదులివ్వలేదు. వాహనాన్ని జాతీయరహదారి మీదున్న బైపాస్ రోడ్డులోకి మళ్లించారు. అంకిరెడ్డిపాలెం, నల్లపాడు మీదుగా పేరేచర్ల జంక్షన్ మీదుగా హైదరాబాద్ వైపు సాగారు.. కిందపడ్డా కనికరించని పోలీసులు.. వెళ్తున్న మార్గాన్ని బట్టి తనను హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు రోజా గుర్తించారు. దాంతో గుంటూరు జిల్లా పేరేచర్లలో స్పీడ్ బ్రేకర్ వద్ద వేగం తగ్గగానే వాహనం దిగేందుకు ప్రయత్నించారు. తనను పోలీసులు కిడ్నాప్ చేసి తీసుకెళుతున్నారని పెద్దగా కేకలు వేశారు. దాంతో స్థానికులు ఉలిక్కిపడి భారీగా అక్కడకు చేరుకున్నారు. స్థానికులు తిరగబడకముందే జారుకోవాలని పోలీసులు రోజా పట్ల అమానుషంగా వ్యవహరించారు. మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఆమెను బలవంతంగా రోడ్డుపై ఈడ్చుకుంటూ లాక్కెళ్లి వాహనంలో పడేశారు. తనను వదిలిపెట్టాలని రోజా కన్నీటి పర్యంతమైనప్పటికీ పోలీసులు కనికరించలేదు. వాహనం వద్దకు రాబోతున్న స్థానికులను పోలీసులు లాఠీలు ఝళిపిస్తూ చెదరగొట్టి భయానక వాతావరణం సృష్టించారు. రోజా కాదు నక్సలైట్ అంటూ వ్యాఖ్యలు.. రోజాను బలవంతంగా ఎందుకు తరలిస్తున్నారని ప్రశ్నించిన స్థానిక మహిళలపై పోలీసులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్కడ గుమికూడిన స్థానిక మహిళలతో ‘ఆమె రోజా కాదు.. నక్సలైటు’ అంటూ పోలీసులు వ్యాఖ్యానించడంతో కలకలం చెలరేగింది. అసలు అక్కడ ఏం జరుగుతోందో కొంతసేపు అర్థం కాని స్థితి ఏర్పడింది. కళ్లెదురుగా రోజా కనిపిస్తున్నా ఆమె నక్సలైట్ అని పోలీసులు చెప్పడం స్థానికులను విభ్రాంతికి గురిచేసింది. రోజాపై ప్రభుత్వం ఏస్థాయిలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందో దీనిని బట్టి అర్థమవుతోందని పలువురు చర్చించుకోవడం కనిపించింది. ఎక్కువ సేపు ఉంటే స్థానికుల నుంచి ప్రతిఘటన తప్పదని భావించిన పోలీసులు వాహనాన్ని మేడికొండూరు మీదుగా సత్తెనపల్లి వైపు మళ్లించారు. దారులు మళ్లిస్తూ: రోజాను పిడుగురాళ్ల పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్నారనే సమాచారంతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. రోజాను తీసుకెళుతున్న పోలీసు వాహనాల కాన్వాయ్ మధ్యాహ్నం 12.50గంటలకు పిడుగురాళ్లకు చేరుకుంది. కానీ అక్కడ వైఎస్సార్ సీపీ నేతలు ఉండటంతో పోలీసులు వాహనాన్ని అపకుండా వేగంగా దాచేపల్లి వైపు మళ్లించారు. ఏం జరుగుతుందో వైఎస్సార్ సీపీ నేతలు తెలుసుకునే లోపే పోలీసు వాహనాలు పిడుగురాళ్ల దాటాయి. సత్తెనపల్లి డీఎస్పీ మధుసూదనరావు ఆధ్వర్యాన పోలీసులు రోజాను పిడుగురాళ్ల మీదుగా దాచేపల్లి వైపు తీసుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నేతలు కాసు మహేష్‌రెడ్డి, జంగా కృష్ణమూర్తిలతోపాటు దాదాపు 300 మంది కార్యకర్తలు దాచేపల్లిలో రోడ్డుపై బైఠాయించారు. రోజాను విడిచిపెట్టాలని రాస్తారోకోకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు శాంతినగరం వద్ద తమ వాహనాలను కొంత సేపు నిలిపివేశారు. వాహనాలను వెనక్కు తిప్పి తుమ్మల చెరువు వద్దకు చేరుకున్నారు. అనంతరం మళ్లీ వాహనాలను వెనక్కు తిప్పి దాచేపల్లి వైపు వెళ్లారు. దీంతో రోజాను హైదరాబాద్ తరలిస్తున్నారని వైఎస్సార్ సీపీ నేతలు గుర్తించారు. కాసు మహేష్‌రెడ్డి, జంగా కృష్ణమూర్తి, ఇతర నేతలు, కార్యకర్తలు దాచేపల్లి పోలీసుస్టేషన్ వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకోకు దిగారు. ఆందోళన ఉధృతిని గుర్తించిన పోలీసులు భారీగా మోహరించారు. నాయకులు, కార్యకర్తలను బలవంతంగా పోలీసు స్టేషన్‌కు తరలించారు. తద్వారా రోజాను తరలిస్తున్న పోలీసు వాహనాలను ఎవ్వరూ అడ్డగించకుండా కట్టడి చేశారు. ఆ తరువాత పది నిముషాలకు రోజాను తీసుకువెళ్తున్న పోలీసు వాహనాలు దాచేపల్లి మీదుగా హైదరాబాద్ వైపు దూసుకువెళ్లాయి. పొందుగల వద్ద ఉన్న అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు దాటించే వరకు గురజాల, సత్తెనపల్లి డీఎస్పీలు, సీఐలు ఆ వాహనాల వెన్నంటే ఉన్నారు. రోజాను బలవంతంగా తరలిస్తున్న దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై పోలీసులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. కాగా, ఎయిర్‌పోర్టులో నిర్బంధించి.. వ్యక్తిగత సిబ్బంది లేకుండా.. ఎటువైపు తీసుకుపోతున్నారో కూడా చెప్పకుండా తరలిస్తున్నా ఎమ్మెల్యే రోజా ధైర్యాన్ని కోల్పోలేదు. ఆ సమయంలో ఆమె పోలీస్ వాహనంలో నుంచే మాట్లాడుతూ తన మొబైల్ ఫోన్ ద్వారా సెల్ఫీ వీడియోలు తీసి మీడియాకు పంపించారు. సామాజిక మాధ్యమంలో వ్యాఖ్యలు నేరమా! వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్.కె.రోజాను విమానాశ్రయంలోనే నిర్బంధించి వెనక్కి పంపేయడానికి రాష్ట్ర డీజీపీ ఎన్.సాంబశివరావు చెబుతున్న కారణాలు సరైనవిగా అనిపించడం లేదని విశ్లేషకులంటున్నారు. రోజా సామాజిక మాధ్యమంలో జాతీయ మహిళా పార్లమెంటు నిర్వాహకులు స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావుపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని, అందు వల్లనే ఆమెను సదస్సుకు వెళ్లకుండా అరెస్టు చేయాల్సి వచ్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలతో డీజీపీ చెప్పారు. వాస్తవానికి రోజా ఫేస్బుక్లో చేసిన వ్యాఖ్యలు చూస్తే అవేమీ అభ్యంతరకరమైనవి కానే కావని విశ్లేషకులంటున్నారు. కోడెల శివప్రసాదరావు కోడలు తనకు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడిన ఉదంతం విడియో కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఆ వీడియోను ఆమె తన ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తూ ఈ కింది వ్యాఖ్యలు చేశారు. ‘చిత్తశుద్ధి లేని శివపూజలేల....’ ‘‘ఇంట్లో కోడలిని వేధించే వాళ్లు... రోడ్డెక్కినా మహిళ ఆర్తనాదాన్ని వినని వాళ్లు... అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ లేనంత నిరంకుశంగా మహిళా ఎమ్మెల్యేను ఏడాది పాటు సస్పెండ్ చేసినోళ్లు... బండి షెడ్లో ఉండాలి. ఆడది ఇంట్లో ఉండాలి అనే పనికిమాలిన సిద్ధాంతాలను మాట్లాడే వాళ్లూ...వీళ్లా మహిళా పార్లమెంటును నిర్వహించేది... వీళ్లా మహిళా సాధికారత కోసం మాట్లాడేది.. ఎంత మాట. ఎంత మాట...’’ ఈ వ్యాఖ్యల్లో సాటి మహిళ ఆవేదనకు స్పందించి చేసిన మాదిరిగా ఉన్నాయి తప్పితే ఎక్కడా అభ్యంతరకరంగా లేవని విశ్లేషకులంటున్నారు. పైగా కొద్ది రోజులుగా పలు రాజకీయ పక్షాలు కూడా మహిళా పార్లమెంటు నిర్వహణ తీరుపై తప్పు పడుతూ విమర్శలు చేస్తున్నాయి. అవన్నీ తప్పు కానపుడు డీజీపీకి రోజా సోషల్ మీడియా చేసిన వ్యాఖ్యలు తప్పుగా అనిపించడం చూస్తే మనం ప్రజా స్వామ్యంలో ఉన్నామా! లేక నియంతల యుగంలో ఉన్నామా? అన్న అనుమానాలు కలుగక మానవు. -
ఆహ్వానించి నిర్బంధిస్తారా?
నిప్పులు చెరిగిన వైఎస్సార్సీపీ నేతలు రోజాను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలి డీజీపీకి వినతిపత్రం సాక్షి, అమరావతి: జాతీయ మహిళా పార్లమెంట్‌కు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఆహ్వానించి, నిర్బంధించి అవమానిస్తారా? అని ఆ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో రోజాను పోలీసులు నిర్బంధించడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ నాయకులు శనివారం విజయవాడలో బందరు రోడ్డు నుంచి డీజీపీ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, గౌరు చరిత, మాజీ ఎమ్మెల్యేలు జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరుదు కల్యాణి తదితరులు డీజీపీ నండూరి సాంబశివరరావును కలిసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అనంతరం డీజీపీ కార్యాలయం వద్ద రోడ్డుపై కొద్దిసేపు ఆందోళనకు దిగారు. కాగా సోషల్ మీడియాలో రోజా చేసిన వ్యాఖ్యల దృష్ట్యా ఆమెను ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నామని డీజీపీ సాంబశివరావు చెప్పారు. మహిళా పార్లమెంట్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయబోనని రోజా హామీ ఇస్తే.. సదస్సుకు అనుమతించే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. డీజీపీ వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా సీపీఎం నేత మధు,సీపీఐ నేతలు నారాయణ, రామకృష్ణ, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. -
కీచకపర్వానికి ‘పచ్చ’ నేత అండ
-
కీచకపర్వానికి ‘పచ్చ’ నేత అండ
పొలంలో పనిచేస్తున్న వివాహితపై కిరాతకం నోటిలో టవల్కుక్కి దారుణానికి పాల్పడిన ముగ్గురు మొబైల్‌తో ఫొటోలు తీసి బెదిరించి మరో రెండుసార్లు... ఆలస్యంగా వెలుగుచూసిన దారుణం సాక్షి, అమరావతి: కూటికోసం కూలికెళ్లిన ఓ అభాగ్యురాలిని నోట్లో టవల్ కుక్కి ముగ్గురు యువకులు అతి కిరాతకంగా అత్యాచారం చేశారు. న్యాయం చేయాల్సిన పోలీసులు అధికార పార్టీ నేత ఆదేశాలకే విలువ ఇచ్చి నిందితులకు అండగా నిలిచారు. ప్రాణ భయంతో బాధితురాలు భర్తతో కలిసి ఊరు విడిచి పారిపోయి హైదరాబాద్‌లో తలదా చుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ దారుణం కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.రాష్ట్ర ప్రభుత్వం జాతీయ మహిళా పార్లమెంట్‌ను ప్రారంభించిన రోజునే న్యాయం కోసం బాధితురాలు, ఆమె భర్త డీజీపీ కార్యాలయం వద్ద రోజంతా పడిగాపులు పడటంతో జరిగిన దారుణం వెలుగుచూసింది. దోషులకు టీడీపీ నేత అండ ఉండటంతో ధైర్యాన్ని కూడగట్టుకుని న్యాయం కోసం పోలీస్ డీజీపీని ఆశ్రయించారు. ఆయన ఆదేశించినా న్యాయం జరక్కపోవడంతో మరోమారు పోలీస్ బాస్‌ను కలిసేందుకు ఆ దంపతులు శుక్రవారం విజయవాడకు వచ్చారు. సోమవారం రావాలంటూ క్యాంపు కార్యాలయం వద్ద గార్డులు చెప్పడంతో వారు రోడ్డుపక్కన రోజంతా పడిగాపులు పడ్డారు. వారిని కదలించిన మీడియా వద్ద విలపిస్తూ జరిగిన అన్యా యాన్ని ఏకరువు పెట్టారు. బాధితురాలి కథనం మేరకు వివరాలు... బెదిరించి అత్యాచారం చేశారు.. కర్నూలు మండలం ఆర్.కొంతలపాడు గ్రామంలో గత ఏడాది డిసెంబర్ 13న పొలంలో పనిచేస్తున్న వివాహితను నోట్లో తువ్వాలు కుక్కి ఎత్తుకపోయిన ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. అదే గ్రామానికి చెందిన కె.శ్రీను, కె.కృష్ణ, గొల్ల శివ అత్యాచారం చేసి నగ్నంగా సెల్ఫోన్లో వీడియో, ఫొటోలు కూడా తీశారు. చంపుతామని బెదిరించారు. కొద్ది రోజుల తరువాత ఆ ఫొటోలు చూపించి మళ్లీ రెండు పర్యాయాలు అత్యాచారం చేశారు. ప్రాణభయంతోనే.. బాధితురాలి భర్త తన భార్య నీరసంగా ఉండడంతో గత ఏడాది డిసెంబర్ 14న వైద్యం చేయించినట్టు బాధితురాలి భర్త తెలిపాడు. భయపడిన ఆమె అప్పుడు విషయం చెప్పలేదనీ, మరో రెండు పర్యాయాలు కూడా బెదిరించి అత్యాచారం జరగడంతో నిందితులను అడ్డగించి ఫొటోలు తీసిన సెల్ మెమెరీ కార్డును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న విజయవాడ వచ్చి డీజీపీ సాంబశివరావుకు ఫిర్యాదు చేస్తే ఆయన ఆదేశాలతో కర్నూలు సీఐ మహేశ్వరరెడ్డిని ఈ నెల 2న కలిసి ఫిర్యాదు చేశామన్నాడు. తొలుత సానుకూలంగా స్పందించిన సీఐ అటు తరువాత టీడీపీ నేత ఒత్తిడితో మారిపోయారన్నారు. టీడీపీ నాయకుడు విష్ణువర్థన్‌రెడ్డి అత్యాచారానికి పాల్పడిన దోషులను కాపాడుతున్నాడని చెప్పాడు. కేసు నమోదు చేశాం: ఎస్పీ సాక్షి ప్రతినిధి, కర్నూలు : తనపై అత్యాచారం జరిగిందంటూ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై వారం రోజుల క్రితమే కేసు నమోదు చేసినట్టు కర్నూలు ఎస్పీ ఆకే హరికృష్ణ వివరణ ఇచ్చారు. ఈ కేసు దర్యాప్తులో ఉందని చెప్పారు. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేయాలని కర్నూలు పోలీసులను ఆదేశించినట్టు ఆయన తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, దోషులను పోలీసులు కాపాడుతున్నారనే ఆరోపణల్లో నిజం లేదని ఎస్పీ చెప్పారు. -
ఈ ప్రభుత్వంలో మహిళకు ఇదేనా న్యాయం?
టీడీపీ ఎంపీ శివప్రసాద్ కుమార్తె డాక్టర్ మాధవీలత సూటి ప్రశ్న సాక్షి ప్రతినిధి, తిరుపతి : ‘ఒక దళిత మహిళను ఇంత ఘోరంగా అవమానిస్తారా... నేనొక డాక్టర్ని. పైగా అధికార పార్టీ ఎంపీ కూతుర్ని.. నాలుగు గంటలుగా రోడ్డు మీద కూర్చొని జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటూ ఏడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.. ఈ ప్రభుత్వంలో ఉన్నం దుకు ఇదా మాకు జరిగే న్యాయం?’ అంటూ చిత్తూరు ఎంపీ కుమార్తె డాక్టర్ మాధవీలత భోరున విలపించారు. ‘తిరుపతిలో మహిళా ఎస్పీ ఉండి కూడా న్యాయం జరగలేదు. కనీ సం వచ్చి పలకరించనూ లేదు. నన్ను తోసేసి, నా డ్రైవర్ని కొట్టిన వ్యక్తి పోలీస్‌స్టేషన్ వద్ద ఉంటే నేనే అక్కడికెళ్లి సారీ చెప్పించుకోవాలంట. ఇదేమైనా న్యాయంగా ఉందా?’ అంటూ మీడియా ముందు ఆవేదన వెళ్లగక్కారు. నాకు న్యాయం జరిగే వరకూ రోడ్డు మీద నుంచి కదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో రెండు గంటల పాటు తీవ్రస్థాయిలో హైడ్రామా నెలకొంది. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. డాక్టర్ మాధవీలతకు మద్దతుగా కొందరు డాక్టర్లు, యువకులు రోడ్డుపై బైఠాయించారు. తిరుపతి నగరంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన టీడీపీ వర్గాల్లో కలకలం రేపింది. డాక్టర్ మాధవీలత, పోలీసుల కథనం మేరకు.. శుక్రవారం మధ్యాహ్నం డాక్టర్ మాధవీలత కల్యాణ్ జ్యూయలరీ రోడ్డు లోంచి కారులో వెళ్తున్నారు. రోడ్డు మధ్యలో డోర్లు తెరిచి నిలబెట్టిన కారును పక్కకు తీయాల్సిందిగా మాధవీలత డ్రైవర్ ఆంజనేయులు హారన్ కొట్టారు. పక్కనే ఉన్న ఇంట్లోంచి బయటకు వచ్చిన నరేంద్ర అనే వ్యక్తి హారన్ కొడితే నరుకుతానన్నట్లు సైగ చేశాడు. మాధవీలత డ్రైవర్ ఆంజనేయులు కారు దిగి ఆయనతో వాగ్వాదానికి దిగాడు. వీరు వాదులాడుకుంటుండగానే పక్కనే ఉన్న నరేంద్ర డ్రైవర్ దీపు.. ఆంజనేయులుపై దాడి చేశాడు. కారులోంచి గమనించిన డాక్టర్ మాధవీలత వెంటనే కిందకు దిగి ఇదేమిటని వారిని నిలదీసింది. నరేంద్ర, మాధవీలతల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. తనకు న్యాయం చేయాలని డాక్టర్ మాధవీలత అక్కడే రోడ్డుపై బైఠాయించింది. ‘ఆయన మా డ్రైవర్ని దారుణంగా కొట్టడమే కాకుండా కులం పేరుతో ధూషించాడు. మహిళనని చూడకుండా నాపై దౌర్జన్యం చేస్తూ రోడ్డు మీద తోసేసి వెళ్లాడు. మధ్యాహ్నం నుంచి ఇక్కడే కూర్చుని న్యాయం కోసం పోరాటం చేస్తుంటే పట్టించుకున్న వారే లేరు. మహిళలకు రక్షణ ఇదేనా?’ అని కన్నీటి పర్యంతమయ్యారు. నరేంద్ర అరెస్ట్: విషయం తెలియగానే డీఎస్పీ మురళీకృష్ణ ఘటన స్థలికి పోలీసులను పంపారు. నరేంద్రను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. 3 గంటల తర్వాత చంద్రగిరి పోలీసులు వాహనంలో వెళ్తున్న ఆయన్ను అదుపులోకి తీసుకుని తిరుపతి తూర్పు పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. అతన్ని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. పోలీసులు కొమ్ముకాస్తున్నారు... నరేంద్రను అదుపులోకి తీసుకున్నామంటోన్న పోలీసులు అతన్ని సంఘటనా స్థలికి ఎందుకు తీసుకు రావడం లేదని డాక్టర్ మాధవీలత ప్రశ్నించారు. ఘటన జరిగిన తర్వాత తాను వెంటనే డీఐజీ ప్రభాకర్‌రావుకు ఫోన్ చేసి వివరించానని చెప్పారు. ‘రోడ్డు మీద నుంచి లేచి నేనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలంట.. వెళ్లే ప్రసక్తే లేద’ని ఆమె స్పష్టం చేశారు. అడకత్తెరలో పోలీసులు ‘ఇటు వైపు ఎంపీ శివప్రసాద్.. అటు వైపు మంత్రి బొజ్జల.. ఇద్దరూ ఫోన్లలో వాయించేస్తున్నారు. ఏం చేయాలో తెలియడం లేద’ని ఓ పోలీసు అధికారి నిస్సహాయత వ్యక్తం చేశారు. గొడవ పడ్డ నరేంద్ర.. శ్రీకాళహస్తికి చెందిన మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి దగ్గరి బంధువని సమాచారం. ఎక్సైజ్ శాఖలో పనిచేసే పోలీస్ ఉన్నతా«ధికారికి స్వయాన సోదరుడు. మంత్రి నుంచి ఫోన్లు మోగడంతో రంగంలోకి దిగిన డీజీపీ సాంబశివరావు తిరుపతి పోలీసులను అప్రమత్తం చేసినట్లు తెలిసింది. మరో పక్క ఎంపీ శివప్రసాద్ నుంచి కూడా ఒత్తిడి పెరిగింది. ఎమ్మెల్యే చెవిరెడ్డి పరామర్శ రోడ్డు మీద కూర్చొని నిరసన తెల్పుతున్న మాధవీలతను సాయంత్రం ఆరు గంటలకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఓదార్చారు. అక్కడే ఉన్న స్పెషల్ బ్రాంచి డీఎస్పీ, పోలీసులతో మాట్లాడారు. విద్యావంతురాలైన ఓ మహిళ న్యాయం కోసం రోడ్డుమీద కన్నీళ్లు పెట్టుకోవడం శ్రేయస్కరం కాదని పోలీసులను హెచ్చరించారు. నరేంద్రను అరెస్టు చేశామని, సుమోటోగా అతనిపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పడంతో మాధవీలత నిరసన విరమించి ఇంటికెళ్లారు. -
ఉద్యమాన్ని మొగ్గలోనే తుంచేయండి
ఉద్యమం ప్రజల్లోకి చొచ్చుకుపోయే వీలుంది ప్రతిపక్షాలపై ఎదురుదాడి తీవ్రం చేయండి ప్రజల దృష్టిని మరల్చండి పార్టీ సమన్వయ కమిటీ భేటీలో చంద్రబాబు హోదా ఉద్యమంపై కఠినంగా వ్యవహరించాలని డీజీపీకి ఆదేశాలు సాక్షి, అమరావతి: ‘తమిళులంతా ఐక్యంగా పోరాడి జల్లికట్టుపై ఆర్డినెన్స్ సాధించుకున్న నేపథ్యంలో మన రాష్ట్రంలోనూ ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేసే అవకాశం ఉంది. ఇందుకు తెలుగుదేశం పార్టీ పరంగా ఘాటుగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ హోదా ఉద్యమంపై ధీటుగా దాడి చేయండి. మన వాణిని సమర్థంగా వినిపించిండి. ఉద్యమం తీవ్రమైతే మనం చేసేది, చేయగలిగేది కూడా ఏమీ ఉండదు. అందుకే ఈ దశలోనే మన సత్తా చూపాలి. ఉద్యమాన్ని మొగ్గలోనే తుంచేయాలి’ అని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు ఆదేశించారు. ఆయన బుధవారం ఉదయం విజయవాడలోని తన అధికారిక నివాసంలో జరిగిన తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ నేతల భేటీలో పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, పలువురు రాష్ట్ర మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విలేకరుల సమావేశం ప్రత్యక్ష ప్రసారం జరిగింది. ఆ తరువాత చంద్రబాబునాయుడు అదే అంశంపై ప్రధానంగా చర్చ జరిపారనేది సమాచారం. ప్రత్యేక హోదా అంశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టుదలతో ఉన్నట్లు స్పష్టమవుతోందని, ప్రజల్లోకి ఉద్యమం ఇంకా చొచ్చుకునిపోయే పరిస్థితులకు అవకాశాలు ఇవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఆయా ప్రాంతాల్లోని స్థానిక నాయకత్వాలపై ఉందని స్పష్టం చేశారు. ప్రజల్లో ప్రత్యేక హోదా డిమాండ్ ప్రబలితే ఆపడం ఎవరి తరమూ కాదని, ఆ దృష్ట్యానే ముందే పార్టీ నేతలు ఐక్యంగా ప్రతిపక్ష పార్టీలపై ఎదురుదాడికి సిద్ధం కావాలని చెప్పారు. ముందుగా జిల్లాల్లో తగవులు మాని పార్టీ పరంగా చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలని సూచించారు. ఇక తాను పార్టీ వ్యవహారాలపైనా ఎక్కువ దృష్టి పెడతానని, ఎక్కడా తేడాలు వచ్చినా క్షమించేది లేదని హెచ్చరించారు. సమావేశం తరువాత డీజీపీకి పిలుపు ఆ తర్వాత కేబినెట్ సమావేశం జరుగుతున్న సమయంలో డీజీపీ సాంబశివరావును ముఖ్యమంత్రి పిలిపించారు. గురువారం విశాఖలో జరగనున్న కొవ్వొత్తుల ర్యాలీతో సహా అన్ని కార్యక్రమాల విషయంలోనూ గట్టిగా వ్యవహరించాలని ఆదేశించారు. ‘భాగస్వామ్య సదస్సుకు 42 దేశాల నుంచి ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు వస్తున్నారు. ఒక్క చిన్న సంఘటన జరిగినా పరువంతా పోతోంది. మొత్తం డైవర్ట్ అవుతుంది. మొత్తం అలర్ట్ చేయండి’ అని సూచించారని సమాచారం. సీఎంతో సూచనల తరువాతే డీజీపీ అన్ని జిల్లాల పోలీసు అధికారులకు ఆందోళనకారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించినట్లు తెలిసింది. -
'అలాంటివి చేస్తే అనుమతించం'
-
యువతపై ఉక్కుపాదమా?
♦ హోదా ఉద్యమకారులపై సర్కారు నిర్బంధం ♦ శాంతియుత ప్రదర్శనలపైనా ఆంక్షలు ► ఉద్యమాన్ని నీరుగార్చడమే లక్ష్యం ► హోదా పోరాటానికి అనుమతి లేదు: డీజీపీ ► విశాఖ దారుల్లో చెక్‌పోస్టులు, బీచ్‌లో సీసీ కెమెరాలు, ► అయినా వెనుకంజ వేసేది లేదంటున్న యువత ► ఇది ఆఖరిపోరాటం అంటూ కదులుతున్న యువతీ యువకులు సాక్షి ప్రత్యేక ప్రతినిధి, సాక్షి, అమరావతి, విశాఖపట్నం: సాగరతీరాన ఉత్తుంగ తరంగా లను ఆంక్షలతో ఎవరైనా ఆపగలరా?... జల్లికట్టు పోరాట స్ఫూర్తితో ప్రత్యేకహోదాను సాధించుకోవడం కోసం ఉరకలెత్తుతున్న యువతను అనుమతుల పేరుతో ఆపాలను కోవడం సరిగ్గా అలాంటిదే. గణతంత్ర దినో త్సవాన విశాఖ తీరంలోనూ, రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలోనూ జరిగే కార్య క్రమాలలో పాల్గొనాలని, హోదా పట్ల తమ ఆకాంక్షను కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు గుర్తిం చేలా చేయాలని యువత సర్వసన్నద్ధమవు తు న్న నేపథ్యంలో వారిని ఎలాగైనాసరే అడ్డుకుని ఉద్యమాన్ని నీరుగార్చడానికి సర్కారు ప్రయత్నాలు ప్రారంభించింది. హోదా కోసం జరిగే ర్యాలీలకు అనుమతి లేదని, తరలి వచ్చేవారిని అడ్డుకుంటామని డీజీపీ నండూరి సాంబశివరావు మంగళవారం మీడియా సమావేశంలో హెచ్చరించారు. విశాఖలో ప్రదర్శనలకు, ర్యాలీలకు ఎలాంటి అనుమతీ లేదని ఆయన స్పష్టం చేశారు. విశాఖతో పాటు విజయవాడ, తిరుపతి కార్యక్రమాల కూ అనుమతి లేదని డీజీపీ ప్రకటించారు. అనుమతుల్లేని ర్యాలీలు, ప్రదర్శనలలో పా ల్గొంటే చట్టపరమైన చర్యలు తీసుకుం టామ ని, కేసులు పెడతామని విశాఖ కలెక్టర్, పోలీ సు కమిషనర్ హెచ్చరించారు. అన వసరంగా భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని విద్యార్థుల కు హితవు పలికారు. అవసరమైతే హౌస్ అరెస్టులు చేస్తామని, విశాఖ బీచ్‌లో సీసీ కెమెరాలు పెట్టామని వారు పేర్కొన్నారు. అయితే ఎంతటి నిర్బంధం ఎదురైనా వెను కంజ వేసే ప్రసక్తిలేదని, ప్రత్యేక హోదా ఉద్య మాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ముందుకే తీసుకు పోతామని యువత స్పష్టం చేస్తోంది. హోదా కోసం జరిగే అన్ని కార్యక్రమాలకు సంఘీభా వం ప్రకటించాలని, హోదా ఆకాంక్షను వెల్లడి స్తూ 26న కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొనాల ని ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునివ్వడం యువతలో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. హోదాపై ఇంత నిర్బంధమా..? ఐదున్నర కోట్ల మంది ప్రజల ఏకైక ఆకాంక్ష ప్రత్యేక హోదాపై ఈ స్థాయిలో నిర్బంధం ప్రయోగించడం చూసి రాష్ట్రప్రజలు విస్తుపో తున్నారు. రాష్ట్రప్రభుత్వం తరఫున డీజీపీ ఇలా ప్రకటించారంటే అది ముఖ్యమంత్రి మాటగానే భావించాల్సి ఉంటుందని చర్చించుకుంటున్నారు. ప్రజల ఆకాంక్ష కోసం తాను ముందుండి కేంద్రంపై పోరాడాల్సిన ముఖ్యమంత్రి ఇలా ఉద్యమాన్ని నిర్బంధం ప్రయోగించి నీరుగార్చేందుకు ప్రయత్నిస్తుం డడం విచారకరమని వ్యాఖ్యానిస్తున్నారు. తెలుగుప్రజల ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన తెలుగుదేశం పార్టీ.. తెలుగుప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా మారిన ప్రత్యేకహోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టడమేమిటని ప్రశ్నిస్తున్నారు. అనుమతిలేని నిరసనలు, ర్యాలీలలో పాల్గొనే వారిని అరెస్టు చేస్తామని, జైళ్లలో నిర్బంధిస్తా మని పోలీసులు అంటున్నారు. డీజీపీ వ్యాఖ్య లతో రాష్ట్రంలోని 13 జిల్లాల పోలీసు అధికా రులు అప్రమత్తమయ్యారు. జిల్లా కేంద్రాలలో వైఎస్సార్సీపీ జరపతలపెట్టిన కొవ్వొత్తుల ర్యాలీలను భగ్నం చేయడానికి వ్యూహాలు రచించడం ప్రారంభించినట్లు పోలీసు వర్గాల లో వినిపిస్తోంది. ముఖ్యనేతల గృహనిర్బంధా లతో ఉద్యమాన్ని నీరుగార్చాలని పోలీసు అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిం చడంపైనా ఆంక్షలు విధిస్తుండడం చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. మరో వైపు జిల్లాల్లో ప్రత్యేక హోదా ఉద్యమం విషయంలో చురుకుగా వ్యవహరిస్తున్న యువతీయువకుల సమాచారంపై కూడా పోలీసులు ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్లు వినిపిస్తోంది. ఏది ఏమైనా ముందుకే.. రాష్ట్రానికి అపర సంజీవని అయిన ప్రత్యేక హోదాను ఇప్పుడు కాకుంటే మరెప్పటికీ సాధించుకో లేమన్న అభిప్రాయం యువతలో గట్టిగా నెలకొంది. రెండున్నరేళ్లుగా ఎదురు చూసిన యువత ఇటు ఉద్యోగాలు లేక, అటు పరిశ్రమలు రాక తీవ్ర నిరాశలో కూరుకుపో యింది. దీనికి ప్రత్యేక హోదా ఒక్కటే పరిష్కారం అన్న అభిప్రాయానికి వచ్చారు. పొరుగున ఉన్న తమిళనాడులో సాంప్రదాయ క్రీడ జల్లికట్టు కోసం రాష్ట్రమంతా ఒక్కతాటి పైకి రాగలిగినప్పుడు ఐదున్నరకోట్ల మంది ప్రజల జీవన్మరణ సమస్యగా ఉన్న ప్రత్యేక హోదాను పోరాడి సాధించుకోలేమా అని ప్రశ్నతో యువత రగిలిపోతోంది. అందుకే ఎంతటి నిర్బంధం ఎదురైనా వెనుకంజ వేసేది లేదని యువతీయువకులు స్పష్టం చేస్తున్నారు. ప్రత్యేకహోదా కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని చెబుతున్నారు. గణతంత్ర దినోత్సవం రోజున జిల్లాకేం ద్రాలకు చేరుకునేందుకు అన్ని జిల్లాల్లోనూ యువతీయువకులు సన్నద్ధమౌతున్నారు. అవసరమైన సన్నాహాలు చేసుకుంటున్నారు. పార్టీల కతీతంగా జరుగుతున్న ఈ పోరాటం లో అందరూ ఒక్కతాటిపై నిలవాలని, హోదా సాధించేవరకు పట్టుదలగా పోరాడాలని సామాజిక మాధ్యమాలలో ఒకరికొకరు సందే శాలు పంపించుకుంటున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ప్రత్యేకహోదాకు సంబంధించిన పోస్టులు, చర్చలే ఉంటున్నాయి. వ్యక్తిగత ప్రొఫైల్స్‌కు సంబంధించిన డిస్ప్లే పిక్చర్లన్నీ ప్రత్యేక హోదా డిమాండ్‌తో కూడిన పిక్‌లుగా మారిపోయాయి. ర్యాలీలను అనుమతించం..: డీజీపీ ‘‘ప్రత్యేక హోదా కోసం ఈ నెల 26న విశాఖ బీచ్ కార్యక్రమాన్ని ఎట్టిపరిస్థితుల్లోను అనుమ తించం. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’’అని డీజీపీ నండూరి సాంబశివరరావు ప్రకటించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో మంగళ వారం ఆయన మీడియా సమావేశం నిర్వహిం చారు. జల్లికట్టును ఆదర్శంగా తీసుకుని ప్రత్యేక హోదా కోసం విశాఖ బీచ్‌లో యువత నిరసన తెలపాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వస్తున్న మెస్సేజ్‌లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియలేదన్నారు. ఎవరు నాయకత్వం వహిస్తున్నారో తెలియని ఇటువంటి కార్యక్రమాలతో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతుందని చెప్పారు. పెద్ద కార్యక్రమాలు చేపట్టినప్పుడు నిర్వాహకులు ఎవరన్నది చూసి అనుమతి ఇస్తామని చెప్పారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా చేపట్టే కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున వీఐపీలు పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి నిరసనలు, ఆందోళనలు వంటి సోషల్ మీడియా పిలుపులకు, ట్వీట్లకు స్పందించి యువత పాల్గొనవద్దని కోరారు. విశాఖ బీచ్‌లోనే కాదు సోషల్ మీడియాలో పిలుపునిచ్చినట్టు విజయ వాడ, తిరుపతిలో ర్యాలీలకు అనుమతిలేదని, నిరసనలు జరుగుతాయనుకున్న ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులోకి తెస్తామని, కాదని వస్తే అడ్డుకుంటామని డీజీపీ చెప్పారు. 26న కార్యక్రమాలకు అనుమతి లేదు: విశాఖ కలెక్టర్, కమిషనర్ విశాఖ ఆర్కే బీచ్‌లో ఈ నెల 26న యువత తలపెట్టిన మౌన ప్రదర్శన. నిరసన కార్యక్రమాలకు అనుమతులు ఇచ్చే ప్రసక్తే లేదని విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, నగర పోలీస్ కమిషనర్ యోగానంద్‌లు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మి యువత ఈ ప్రదర్శనల్లో పాల్గొని తమ భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని హితవుపలికారు. ప్రత్యేక హోదా ఉద్యమ నేపథ్యంలో అప్రమత్త మైన జిల్లా యంత్రాంగం మంగళవారం సమీక్షించింది. అనంతరం కలెక్టరేట్ మీటింగ్ హాలులో కలెక్టర్, సీపీలు మీడియాతో మాట్లాడారు. ’జనవరి 26న రిపబ్లిక్ డే.. 27, 28 తేదీల్లో విశాఖలో భాగస్వామ్య సదస్సు నేపథ్యంలో ప్రదర్శనలు..ర్యాలీలు చేయడం తగదని కలెక్టర్, సీపీలు పేర్కొన్నారు. ఎలాంటి అనుమతుల్లేని ర్యాలీలు, ప్రదర్శనల్లో పాల్గొంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.. కేసులు నమోదు చేస్తాం.. అనవసరంగా భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని సీపీ హెచ్చరించారు ర్యాలీ చేయడానికి సిద్ధమైతే హౌస్ అరెస్ట్‌లు సైతం చేసేందుకు వెనుకాడమని హెచ్చరించారు. ఇందుకోసం ఆర్కేబీచ్లో ప్రత్యేకంగా సీసీ కెమెరాలు, పోలీస్ చెక్‌పోస్టులు, పికెటింగ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. -
నిరసన కార్యక్రమాలకు పోలీసుల అనుమతి లేదు
-
'సోషల్ మీడియా ఆధారంగా చేసే కార్యక్రమాలను అనుమతించం'
సోషల్ మీడియా ఆధారంగా చేపట్టే కార్యక్రమాలను తాము అనుమతించేది లేదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు. పెద్ద కార్యక్రమాలు జరిగేటప్పుడు వాటి నిర్వాహకులు ఎవరన్న విషయం ముఖ్యమని.. కానీ సోషల్ మీడియా ఆధారంగా జరిగే కార్యక్రమాలకు ఓనర్ షిప్ ఉండదని ఆయన చెప్పారు. విశాఖలో ఈనెల 26వ తేదీన తలపెట్టిన దీక్షకు అనుమతి కావాలని ఎవరూ తమను కోరలేదన్నారు. తమకు శాంతిభద్రతలే ముఖ్యమని.. పోలీసు ఆంక్షలకు అంతా సహకరించాలని చెప్పారు. ఏక్షణంలోనైనా హౌస్ అరెస్టు శాంతిభద్రతలకు భంగం కలిగించే ఆందోళన దేన్నీ తాము అంగీకరించబోమని డీజీపీ సాంబశివరావు తెలిపారు. ముద్రగడ పద్మనాభం సహా ఎవరైనా అనుమతి తీసుకోవాల్సిందేనని ఆయన అన్నారు. కాపు సత్యాగ్రహ దీక్ష నేపథ్యంలో తాము ఏక్షణమైనా ముద్రగడను హౌస్ అరెస్టు చేసే అవకాశం ఉందని చెప్పారు. కాగా, కాపు రిజర్వేషన్ల కోసం కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం బుధవారం నుంచి సత్యాగ్రహ యాత్ర తలపెట్టారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుంచి అంతర్వేది వరకు ఈ యాత్ర సాగనుంది. ఆయనకు సంఘీభావం తెలిపేందుకు కాపునేతలు భారీగా చేరుకుంటున్నారు. ముద్రగడ నివాసం వద్ద పెద్దసంఖ్యలో పోలీసులను మోహరించారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించి, మీడియాపై కూడా ఆంక్షలు పెట్టారు. -
కోడి పందేల నిర్వాహకులపై 1,347 కేసులు
మీడియా సమావేశంలో డీజీపీ సాంబశివరావు వెల్లడి సాక్షి, అమరావతి: సంక్రాంతి సందర్భంగా కోడిపందేలు నిర్వహించిన వారిపై రాష్ట్రవ్యాప్తంగా 1,347 కేసులు నమోదు చేసినట్టు డీజీపీ నండూరి సాంబశివరావు చెప్పారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లాలో 337, తూర్పుగోదావరి జిల్లాలో 136, కృష్ణా జిల్లాలో 471, విజయవాడ సిటీలో 91, గుంటూరు అర్బన్‌లో 3, గుంటూరు రూరల్‌లో 309 కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. రివాల్వర్‌తో గాలిలోకి కాల్పులు జరిపిన గుడివాడ టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త రావి వెంకటేశ్వరరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. విజయవాడలో దుండగులు ధ్వంసం చేసిన వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని అదే స్థానంలో పెట్టిస్తామన్నారు. విగ్రహాన్ని ధ్వంసంచేసిన వారిని సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, దీనిపై ఇప్పటికే ఒక అంచనాకు వచ్చామని డీజీపీ చెప్పారు. కైకలూరు మండలం ఆటపాక, కలిదిండి మండలం తాళ్లాయి పాలెంలో కొందరు ఫ్లెక్సీలు చించి వివాదం సృష్టించే ప్రయత్నాలు చేశారని డీజీపీ అన్నారు. పథకం ప్రకారం కొన్ని అసాంఘిక శక్తులు కులాలు, పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు నాయకుల విగ్రహాలు, సినిమా హీరోల ఫ్లెక్సీలు ధ్వంసం చేస్తున్నట్టు గుర్తించామని డీజీపీ చెప్పారు. -
హద్దు మీరొద్దు..: డీజీపీ
సినీ అభిమానులకు హెచ్చరిక... టెలీకాన్ఫరెన్సులో ఎస్పీలకు ఆదేశాలు సాక్షి, అమరావతి : తమ హీరోలపై ఉన్న అభిమానాన్ని చాటుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదని, హద్దులు మీరి శాంతి భద్రతల సమస్యకు కారణమైతే ఉపేక్షించేది లేదని సినీ అభిమానులను డీజీపీ ఎన్.సాంబశివరావు హెచ్చరించారు. సంక్రాంతికి ఇద్దరు అగ్రహీరోల సినిమాలు విడుదల అవుతున్న తరుణంలో పోలీస్ ఉన్నతాధికారులతో శనివారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల ఎస్పీలతోను టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. చిరంజీవి సినిమా ‘ఖైదీ నంబర్ 150’, బాలకృష్ణ నటించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాల విడుదల సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, రెండు సినిమాలు విడుదలవుతోన్న థియేటర్ల వద్ద పోలీస్ బందోబస్తు నిర్వహించాలని ఎస్పీలను ఆదేశించారు. -
అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం
-
అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం
- 18వ తేదీ వరకు ఆస్తుల ప్రదర్శన - నేడు ప్రకటన వెలువరిస్తామన్న డీజీపీ సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి సంబంధించిన వేలం వివరాలను ఆదివారం పత్రికల ద్వారా ప్రకటన వెలువరించను న్నట్టు ఏపీ డీజీపీ సాంబశివరావు తెలిపారు. శనివారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. మొత్తం రూ.280 కోట్ల విలువ గల ఆస్తులను ప్రస్తుతం వేలం వేస్తున్నట్టు చెప్పారు. సీల్డు కవరులో వచ్చిన అన్ని టెండర్లను ఈ నెల 26న హైకోర్టుకు పంపుతామని, 27న టెండర్లను తెరుస్తామని వివరించారు. ఆసక్తి కలిగిన వారు ఒక్కొక్క విభాగానికి ప్రభుత్వం నిర్ణయించిన ధరలో ఒక మొత్తాన్ని బిడ్ అమౌంట్‌గా చెల్లించి ఎలాంటి భయాందోళనలు లేకుండా వేలంలో పాల్గొనవచ్చని సూచించారు. వేలంలో పాల్గొన దలచిన వారికి ఈ నెల 18వ తేదీ వరకు సీఐడీ అధికారులు ఆస్తులు చూపిస్తారని డీజీపీ తెలిపారు. గతంలో నిర్వహించిన వేలంద్వారా రూ.17 కోట్లు వచ్చినట్టు తెలిపారు. అగ్రిగోల్డ్ సంస్థ పేరిట బంగారం, వెండి, వాహనాలు, భవనాల వంటి చరాస్తులతోపాటు రాష్ట్రంలో 17 వేల ఎకరాల భూమి, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాల్లో మరో 3,200 ఎకరాల స్థిరాస్తులు ఉన్నాయని చెప్పారు. -
పోలీసుల తల్లిదండ్రులకు వైద్య సేవలు
సాక్షి, అమరావతి: పోలీసులపై ఆధారపడిన వారి తల్లిదండ్రులకు ఆరోగ్య భద్రత పథకంలో వైద్య సేవలు విస్తరించేలా రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్ అనురాధ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిర్దేశించిన నెట్వర్క్ ఆసుపత్రులు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పోలీస్ కుటుంబాలకు వైద్య సేవల కోసం నిమ్స్ తరహా ప్యాకేజీలను అందిస్తున్నారు. అత్యవసర వైద్య సేవలు చేయించుకున్న వారు మెడికల్ బిల్లులు సమర్పిస్తే రీయింబర్స్మెంట్ ఇస్తున్నారు. డీజీపీ నండూరి సాంబశివరావు ప్రతిపాదనలతో ఇకపై ఆరోగ్య భద్రత స్కీమ్‌లో పోలీసుల తల్లిదండ్రులకు వైద్య సేవలు అందించేలా నిర్ణయం తీసుకున్నట్టు అనురాధ ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ప్రజలకు నా క్షమాపణలు: డీజీపీ
గుంటూరు: బ్యాంకు క్యూలైన్లలో నగదు కోసం ఉన్న సామాన్యులపై పోలీసుల దాడులను ఖండిస్తున్నామని ఏపీ డీజీపీ సాంబశివరావు అన్నారు. గుంటూరు మోడల్ పోలీస్ స్టేషన్లో గురువారం ఆకస్మిక తనిఖీలు చేసిన ఆయన పలు ఏటీఎంలు, బ్యాంకుల వద్ద క్యూలైన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అనంతపురం ఘటనపై పోలీసు శాఖ తరపున ప్రజలకు క్షమాపణ చెబుతున్నానన్నారు. -
ఉషారాణి ఆత్మహత్య కేసు: సీఐడీ విచారణ
కడప : రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ఇంజనీరింగ్ విద్యార్థిని ఉషారాణి ఆత్మహత్య కేసులో సీబీసీఐడీ విచారణ ప్రారంభించింది. తొలుత వైఎస్సార్‌జిల్లా బద్వేల్ పోలీసు స్టేషన్లో విచారణ చేపట్టిన అధికారులు ఆమె స్వగ్రామం పుట్టాయపల్లి వెళ్లి కుటుంబీకుల నుంచి వివరాలు సేకరించారు. ఉషారాణి తండ్రి జయరామిరెడ్డిని కూడా విచారించి ఆయన తెలిపిన విషయాలను నమోదు చేసుకున్నారు. సీఐడీ సీఐ నాగభూషణం, సిబ్బంది విచారణ జరిపారు. కాగా కర్నూలు జిల్లా పాణ్యం ఆర్జీఎం కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న ఉషారాణి కీచక అధ్యాపకుడి వేధింపుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్టు చెబుతున్నారు. ఘటనను తీవ్రంగా ఖండిస్తున్న రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, విద్యార్థినుల తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఘటనపై మెరుగైన విచారణ కోసం డీజీపీ సాంబశివరావు ఈ నిర్ణయం తీసుకున్నారు. -
ఉషారాణి ఆత్మహత్య కేసు సీఐడీకి
-
ఉషారాణి ఆత్మహత్య కేసు సీఐడీకి
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ఇంజనీరింగ్ విద్యార్థిని ఉషారాణి ఆత్మహత్య కేసును సీఐడీ విచారణకు డీజీపీ సాంబశివరావు శనివారం ఆదేశించారు. కర్నూలు జిల్లా పాణ్యం ఆర్జీఎం కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న ఉషారాణి కీచక అధ్యాపకుడి వేధింపుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్టు చెబుతున్నారు. ఘటనను తీవ్రంగా ఖండిస్తున్న రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, విద్యార్థినుల తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఘటనపై మెరుగైన విచారణ కోసం డీజీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఘటన స్థలాన్ని డీజీపీ పరిశీలించారు. -
ముద్రగడ పాదయాత్రకు అనుమతి లేదు
స్పష్టం చేసిన డీజీపీ సాంబశివరావు సాక్షి, అమరావతి: ముద్రగడ పద్మనాభం పాదయాత్రలో అసాంఘిక శక్తులు చొరబడి హింస సృష్టిస్తాయనే సమాచారం ఉన్నందునే అనుమతి ఇవ్వలేదని డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు. తూర్పుగోదావరిలో అరుునా కడపలో అరుునా ఇలాంటి యాత్రలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లాతోపాటు అన్ని జిల్లాల్లోనూ సెక్షన్ 30 అమల్లో ఉందని, అనుమతి లేకుండా ఎలాంటి పాదయాత్రలు, ఆందోళనలు చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముద్రగడ పద్మనాభం తన యాత్రకు ఇంతవరకూ అనుమతి కోరలేదని, ఒకవేళ కోరితే హింస జరగదని.. ఏం జరిగినా తానే బాధ్యత తీసుకుంటానని, ప్రభుత్వ ఆస్తులకు నష్టం జరిగితే చెల్లిస్తానని హామీ పత్రం రాసిస్తే సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి దాన్ని పరిశీలిస్తామన్నారు. -
ఉనికిని కాపాడుకునేందుకే దళం పోస్టర్లు
గుంటూరులో విలేకరుల సమావేశంలో డీజీపీ సాంబశివరావు సాక్షి, గుంటూరు: గాలికొండ ఏరియా కమిటీ వాల్‌పోస్టర్లు అంటించి హడావుడిచేయడం వారి వ్యూహంలో భాగమని డీజీపీ సాంబశివరావు చెప్పారు. గుంటూరు నగరంలోని పాతగుంటూరు, నగరంపాలెంలో నిర్మిస్తున్న నూతన మోడల్ పోలీసు స్టేషన్లను మంగళవారం ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ మావోరుుస్టులు వారి క్యాడర్లో మనో ధైర్యం నింపేందుకు, ఉనికిని చాటిచెప్పుకునేందుకు ఈ చర్యలకు దిగుతున్నారని చెప్పారు. పోలీసు శాఖ ఆప్రాంతంపై పూర్తి పట్టు సాధించిందని, ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో గాయపడ్డ వారితోపాటు, మరికొందరు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సామాన్య ప్రజల శాంతికి భంగం కలుగకూడదనే తాము కూంబింగ్ చేయడం లేదని, మళ్లీ అవసరమైతే ఆప్రాంతంలోకి ప్రవేశిస్తామని చెప్పారు. పోలీసు శాఖలో 14వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, నిదానంగా వాటిని భర్తీ చేస్తామన్నారు. అర్బన్ జిల్లాను నిర్లక్ష్యం చేసే సమస్య లేదని, తుళ్లూరులోసైతం ఐపీఎస్ అధికారిని నియమించామని చెప్పారు. పాతపద్ధతుల్లో కాకుండా పోలీసులు ప్రజలతో మమేకమై స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మంచిగా మాట్లాడి వారి సమస్యలను తీర్చేందుకు ప్రయత్నించాలన్నారు. -
నన్ను ఎన్కౌంటర్ చేస్తానని బెదిరించారు
డీజీపీకి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు లేఖ సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం దానవారుుపేటలో ఈ నెల 3న తనను తుని రూరల్ సీఐ అడ్డగించి ఎన్కౌంటర్ చేస్తానని బెదిరించారని డీజీపీ నండూరి సాంబశివరావుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డీజీపీకి మధు సోమవారం లేఖ రాశారు. దివీస్ వ్యతిరేక పోరాట కమిటీని కలిసేందుకు వెళ్లిన తనపై తుని రూరల్ సీఐ చెన్నకేశవరావుతోపాటు పలువురు పోలీసులు దాడి చేసి దారుణంగా కొట్టారని మధు పేర్కొన్నారు. -
చంద్రబాబు నివాసానికి భద్రత పెంపు
ఉండవల్లిలోని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసానికి పోలీసులు భద్రతను పెంచారు. అదనంగా మరో 25 మంది సాయుధ సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌తో కలిసి ఏపీ డీజీపీ సాంబశివరావు ఆదివారం భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఏపీ డీజీపీ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులపై బురద జల్లడం మావోయిస్టులకు అలవాటైందని వ్యాఖ్యానించారు. మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ(ఆర్కే) విషయంలో అది మరోసారి రుజువైందని చెప్పారు. గాయపడిన మావోయిస్టులు లొంగిపోతే పూర్తిస్థాయిలో చికిత్స అందిస్తామని పేర్కొన్నారు. ఏవోబీలో వారం కిందటే కూంబింగ్‌ను ఆపేశామని డీజీపీ సాంబశివరావు తెలిపారు. -
గాజర్ల రవి తప్పించుకున్నాడా?
12 మంది మహిళా మావోయిస్టులు మృతి మల్కన్‌గిరి నుంచి సాక్షి ప్రత్యేక బృందం: ఎన్ కౌంటర్లో గాజర్ల రవి అలియాస్ ఉదయ్ మృతి చెందాడా? లేక తప్పించుకున్నాడా? అన్న అంశంపై స్పష్టత కొరవడింది. ఇటు పోలీసులు కానీ, అటు మావోయిస్టుల వైపు నుంచి కానీ దీనిపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మంగళవారం విలేకరులతో మాట్లాడిన మల్కన్‌గిరి, విశాఖపట్నం ఎస్పీలు కూడా దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. సోమవారం ఉదయం రవి మరణించాడనే ప్రచారం సాగింది. దీంతో మల్కన్ గిరి జిల్లాలో కలకలం రేగింది. అయితే కాల్పుల నుంచి ఆయన తప్పించుకున్నారని, సురక్షితంగా ఉన్నారని కూడా ప్రచారం జరుగుతోంది. మరో 4 మృతదేహాలు లభ్యం ఎన్కౌంటర్లో మరణించినవారి సంఖ్య 28కి చేరింది. సంఘటన ప్రాంతంలో గాలిస్తున్న కూంబింగ్ దళాలకు మంగళవారం ఉదయం మరో నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. వీటిలో ఒక మహిళా మావోయిస్టు మృతదేహం కూడా ఉంది. దీంతో ఎన్కౌంటర్లో మృతి చెందిన మహిళల సంఖ్య 12కు చేరింది. మావోయిస్టు నేత మురళి మృతదేహాన్ని అతని కుమారుడికి అప్పగించారు. ఇంకా 14 మృతదేహాలు గుర్తించాల్సి ఉంది. వీటిలో ఎక్కువ మృతదేహాలు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన మావోయిస్టులవిగా పోలీసులు చెబుతున్నారు. కూంబింగ్ ఇంకా కొనసాగుతోందని, ఎన్కౌంటర్ జరిగినప్పుడు తీవ్రంగా గాయపడిన మావోయిస్టులు అడవిలో ప్రాణాలు వదిలే అవకాశం ఉండటంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని అంటున్నారు. మరో ఎన్కౌంటర్! ఎన్ కౌంటర్ జరిగిన అడవుల్లో ఏపీ డీజీపీ సాంబశివరావు మంగళవారం ఏరియల్ సర్వే చేశారు. మంగళవారం లభించిన నాలుగు మృతదేహాల విషయంలో డీజీపీ కథనం మరోలా ఉంది. సోమవారం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో మావోలు మంగళవారం కూడా కాల్పులు జరిపారని, పోలీసులు అప్రమత్తమై ఎదుర్కోవడంతో మరో నలుగురు మావోలు మృతి చెందారని చెప్పారు. ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన గ్రేహౌండ్స్ సీనియర్ కమాండో మహ్మద్ అబు బాకర్ కుటుంబానికి ప్రభుత్వం రూ.40 లక్షల ప్రత్యేక పరిహారాన్ని (స్పెషల్ ఎక్స్‌గ్రేషియా) అందజేసింది. గుర్తించిన మృతుల వివరాలు.. 1. బాకూరు వెంకటరమణ అలియాస్ గణేష్ అలియాస్ ప్రసాద్ (ఎస్జేసీఎం, ఈస్ట్ విశాఖ, బాకూరు విలేజ్, విశాఖ జిల్లా) 2. శ్యామల కిష్టయ్య అలియాస్ దయ, (ఎస్జేసీఎం, కోరాపుట్ /శ్రీకాకుళం డివిజన్ సెక్రటరీ) 3. ఐనాపర్తి దాసు అలియాస్ మధు (డీజీఎం, టెక్‌టీం, వెస్ట్ గోదావరి) 4. గెమ్మెలి కేశవరావు అలియాస్ బిస్రు (డీసీఎస్, ఫస్ట్ సీఆర్టీ, తాడపాలెం, విశాఖ జిల్లా) 5. లత అలియాస్ పద్మ, (డీసీఎం, వైఫ్ ఆఫ్ మహేందర్, ఎస్‌జెడ్‌సీఎం, హైదరాబాద్) 6. రాజేష్ అలియాస్ సీమల్ (డీసీఎం, ఫస్ట్ సీఆర్సీ, సీజీ) 7. బొట్టు తుంగనాలు అలియాస్ మమత (డీజీఎం, వైఫ్ ఆఫ్ సురేష్, ఎస్‌జెడ్‌సీఎం ఆఫ్ శ్రీకాకుళం జిల్లా) 8. ఎమలపల్లి సింహాచలం అలియాస్ మురళి, అలియాస్ హరి (డీసీఎం, విజయనగరం) 9. స్వరూప అలియాస్ రిక్కి, (డీసీఎం, ఎక్స్ ఆర్టీసీ కండక్టర్, తూర్పు గోదావరి జిల్లా) 10. శ్వేత, ఏసీఎం, పెదబయలు ఏరియా 11. బుద్రి, ఏసీఎం, ఆర్కే సెక్యూరిటీ గార్డ్ 12. మున్నా, ఆర్కే కుమారుడు, 13. రైనో, డీసీఎం 14. కిల్లో సీత, సప్లై టీం మెంబర్, చింతపల్లి డివిజన్, విశాఖపట్నం జిల్లా -
ఎరుపెక్కిన ఏఓబీ
ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ - మృతుల్లో కీలకనేతలు గాజర్ల రవి, వెంకటరమణ, శ్యామల కిష్టయ్య, ప్రమీల, చలపతి, అరుణ - 11 మంది మహిళా మావోయిస్టులు కూడా.. - తప్పించుకున్న అగ్రనేత ఆర్కే.. తనయుడు మృతి - పలువురు మావోయిస్టులకు గాయాలు - కాల్పుల్లో మరణించిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ - మావోయిస్టుల మృతదేహాలు మల్కన్‌గిరికి తరలింపు - గాయపడిన కానిస్టేబుళ్లు విశాఖకు తరలింపు - ఘటనా స్థలంలో భారీగా ఆయుధాల స్వాధీనం సోమవారం.. కాసేపట్లో తెల్లవారుతుంది అనగా ఏఓబీ తుపాకుల మోతతో దద్దరిల్లింది. రక్తం ఏరులై పారింది. మావోయిస్టులను చుట్టుముట్టిన గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ బలగాలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. మావోయిస్టులను పెద్ద సంఖ్యలో మట్టుబెట్టాయి. విశాఖ జిల్లాకు సుమారు 9 కి.మీల దూరంలోని ఒడిశా సరిహద్దులో జరిగిన ఈ భారీ ఎన్కౌంటర్లో 24 మంది మావోయిస్టులు మరణించారు. వీరిలో 11 మంది మహిళలు ఉన్నారని సమాచారం. ఏఒబీ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక బృందం తెల్లవారుఝాము.. కాసేపట్లో తెలవారుతుందనగా ఆంధ్ర - ఒడిశా బోర్డర్ (ఏఓబీ) తుపాకుల మోతతో దద్దరిల్లింది. రక్తం ఏరులై పారింది. మావోయిస్టులను చుట్టుముట్టిన గ్రేహౌండ్స్ దళాలు, స్పెషల్‌పార్టీ బలగాలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. మావోయిస్టులను పెద్ద సంఖ్యలో మట్టుబెట్టాయి. దేశచరిత్రలోనే మునుపెన్నడూ ఎరగని స్థాయిలో ఎదురుదెబ్బ తిన్నారు. విశాఖ జిల్లాకు సుమారు 9 కి.మీల దూరంలోని ఒడిశా సరిహద్దు ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ భారీ ఎన్కౌంటర్లో మొత్తం 24 మంది మావోయిస్టులు మరణించారు. వారిలో 11 మంది మహిళలు కూడా ఉన్నారని సమాచారం. మావోయిస్టులు ఇంత భారీ సంఖ్యలో మరణించడం ఇదే ప్రథమం. మహిళా మావోయిస్టులు కూడా ఇంతమంది ఒక ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోవడం కూడా ఇదే మొదటిదని అంటున్నారు. ఓ గ్రేహౌండ్స్ కమెండో మృతి చెందగా మరో కమెండో ఇంకా పలువురు మావోయిస్టులు గాయపడ్డారు. మరణించినవారిలో మావోయిస్టు కీలక నేత గాజర్ల రవి అలియాస్ గణేష్ కూడా ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే రవి మరణాన్ని పోలీసులు ధృవీకరించలేదు. మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు రామకృష్ణ అలియాస్ ఆర్కే ఈ ఎన్కౌంటర్ నుంచి తృటిలో తప్పించుకోగా ఆర్కే కుమారుడు పృథ్వీ అలియాస్ మున్నా మరణించారని సమాచారం. మరోవైపు తప్పించుకున్న మావోయిస్టు నేతల కోసం గ్రేహౌండ్స్ దళాలు ఏఓబీ ప్రాంతంలో కూం బింగ్‌ను మరింత ముమ్మ రం చేశాయి. భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టులు ప్రతీకార దాడులకు దిగే అవకాశముందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, బీహార్ రాష్ట్రాలనుఅప్రమత్తం చేశాయి. దాంతో ఈ ఆరు రాష్ట్రాలలో వీఐపీల భద్రతను కట్టుదిట్టం చేశారు. పక్కా సమాచారంతోనే.. మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారంతోనే గత కొద్ది రోజుల నుంచి గ్రేహౌండ్స్ దళాలు ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చేపట్టాయి. డిసెంబర్ 3 నుంచి పీఎల్జీఏ వారోత్సవాలు నిర్వహించడంలో భాగంగా ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా జంత్రి పోలీస్‌స్టేషన్ పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు.. అందులో మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణతోపాటు పలువురు కీలక నేతలు పాల్గొం టున్నట్టు అందిన సమాచారం మేరకు వందల సంఖ్యలో కూంబింగ్ దళాలు అటువైపు కదిలాయి. కడుములగుమ్మ సమితి పరిధిలోని రామ్‌గడ్-పనసపుట్ మధ్య ఉన్న మావోయిస్టు శిబిరాలను ఆదివారం రాత్రే చుట్టుముట్టాయి. ముందుజాగ్రత్తగా ఈ ప్రాంతానికి 9 కిలోమీటర్లు దూరంలో దళాలు తమ వాహనాలను వదిలి సెల్ ఫోన్లు సైతం కట్టేసి కాలినడకన అక్కడికి చేరుకున్నాయి. రూడకోట ప్రాంతంలోని పోలీస్ ఔట్ పోస్ట్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున 4-5 గంటల మధ్య పోలీసు బలగాల రాకను పసిగట్టిన మావోయిస్టులు వారిపై కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన గ్రేహౌండ్స్ దళాలు ఎదురుకాల్పులకు దిగాయి. భీకరంగా జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో 23 మంది మావోయిస్టులు హతం కాగా, కడప 11వ బెటాలియన్‌కు చెందిన సీనియర్ కమెండో అబుబాకర్(27)తో పాటు విశాఖ జిల్లాకు చెందిన మరో కమెండో దొంతల సతీష్‌కు బుల్లెట్ గాయాలు తగిలాయి. వీరిని హెలికాప్టర్లో హుటాహుటిన విశాఖ సెవెన్ హిల్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అబుబాకర్ మృతి చెందగా, మృత దేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. ఎన్కౌంటర్ విషయం తెలియగానే విశాఖ జిల్లా ఎస్పీ రాహల్దేవ్ శర్మ హెలికాప్టర్లో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ నుంచి మావోయిస్టుల మృతదేహాలను ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా కేంద్రానికి తరలించారు. అక్కడి ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. మావోయిస్టుల మృతదేహాలను 72 గంటలపాటు తాము భద్రపరుస్తామని, ఆ లోగా కుటుంబసభ్యులు వస్తే అప్పగిస్తామని లేదంటే ఖననం చేస్తామని విశాఖ, మల్కన్‌గిరి ఎస్పీలు తెలిపారు. రెండోసారి ఎదురుకాల్పులు.. మహిళా మావోయిస్టు మృతి ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో సోమవారం ఉదయం 9-10 మధ్యలో మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో మరో మహిళా మావోయిస్టు మృతి చెందారు. తెల్లవారుఝామున జరిగిన ఎన్కౌంటర్ అనంతరం కొంతమంది మావోయిస్టులు తప్పించుకున్నట్టు గ్రే హౌండ్స్ బలగాలు గుర్తించాయి. సంఘటనా స్థలంలో 40 కిట్లుండగా, తొలుత ఎన్ కౌంటర్ ప్రాంతంలో 20 మంది మృతదేహాలనే గుర్తించారు. గాలింపు జరపగా బలిమెల రిజర్వాయర్ ప్రాంతంలో మరో ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు కనిపించాయి. దీంతో మిగిలిన వారు నదిదాటి పరారై ఉంటారని భావించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈనేపథ్యంలో నది ఆవల కొంతమంది మావోయిస్టులు ఉదయం 9 దాటిన తర్వాత కాల్పులు ప్రారంభించగా పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందినట్టు ఎస్పీ నిర్ధారించారు. అస్తమించిన రవి సామ్రాజ్యం మావోయిస్టు నాయకుడు గాజర్ల రవి అలియాస్ గణేష్ మల్కన్‌గిరి, కోరాపుట్, విశాఖ ఏరియా కార్యదర్శిగా ఉన్నారు. రవి మృతితో ఏవోబీలో మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బ తగిలినట్లేనని భావిస్తున్నారు. చంద్రబాబుపై అలిపిరిలో 2003లో జరిగిన దాడిలో రవి పాల్గొన్నారు. పోలీసు వాహనాల పేల్చివేత, చిత్రకొండ జలాశయంలో 36 మంది ఆంధ్ర గ్రేహౌండ్స్ జవాన్ల హత్య, ఐఏఎస్ అధికారి వినీల్ కృష్ణ కిడ్నాప్, బీఎస్ఎఫ్ క్యాంప్‌లపై దాడులు, ఇన్ఫార్మర్ల నెపంతో గిరిజనుల హత్య తదితర ఘటనల్లో రవి ప్రధాన నిందితుడు. గంపకొండ వద్ద పోలీస్ వాహనం మందుపాతరతో పేల్చి 16 మంది పోలీసుల మృతికి కారకుడయ్యాడు. భారీగా ఆయుధాలు లభ్యం ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో మూడు ఏకే 47లు, 4 ఎస్ఎల్ఆర్లు, రెండు ఇన్సెన్స్ , ఏడు 303, నాలుగు సింగిల్ బ్యారెల్ గన్స్, మూడు పిస్టళ్లు, ఒక గ్రేనైడ్, 40 కిట్ బ్యాగ్‌లు, 2.16 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటన ప్రదేశంలో మరిన్ని ఆధారాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి సమీపంలోనే మావోయిస్టుల డెన్ ఉన్నట్టు అనుమానిస్తున్నారు. అందరూ తెలుగు వారే.. ఈ ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టులంతా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినవారేనని అంటున్నారు. గాజర్ల రవి స్వస్థలం వరంగల్ జిల్లా వెలిసాల గ్రామం. వెంకట రమణ స్వస్థలం విశాఖజిల్లా హుకుంపేట మండలం బాపూరు గ్రామం. అలిపిరి దాడిలో రవితో పాటు వెంకట రమణ కూడా పాల్గొన్నట్లు సమాచారం. చలపతి స్వస్థలం చిత్తూరు జిల్లా మత్యం పైపల్లె గ్రామం. చలపతి భార్య అరుణది విశాఖ జిల్లా పెందుర్తి ప్రాంతం. అరుణ కుటుంబ స్వస్థలం విజయవాడ సమీపంలోని మహంతిపురం. దయన్న స్వస్థలం నల్గొండ జిల్లా. శ్రీకాకుళం జిల్లా బాతుపురానికి చెందిన చెల్లూరి నారాయణరావు అలియాస్ సూరన్న, అతని భార్య మందస మండలం నల్లబొడ్లూరు గ్రామానికి చెందిన బొడ్డు కుందనాలు అలియాస్ సునీత, బాతుపురం గ్రామానికి చెందిన కోటేశ్వరరావు (మెట్టూరి జోగారావు అలియాస్ కోటేశ్వరరావు) ఈ ఎన్కౌంటర్లో మృతి చెం దారు. గాజర్ల రవిపై రూ.25లక్షల రివార్డు ఉండగా, వెంకటరమణపై రూ.20 లక్షలు రివార్డు ఉంది. మిగిలిన వారిపై కూడా రూ.15 లక్షల నుంచి రూ.20లక్షల వరకు రివార్డు ఉందని చెబుతున్నారు. డీసీఎంలపై రూ.4 లక్షలు చొప్పున, ఏసీఎంలపై రూ. లక్ష చొప్పున రివార్డులు ఉన్నాయి. తప్పించుకున్న ఆర్కే.. తనయుడు హతం.. ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడైన అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) తప్పించుకున్నారు. ఆర్కే పలుమార్లు ఇలా తృటిలో తప్పించుకున్న సంగతి తెల్సిందే. ఇటీవలే మావో ఉద్యమంలో చేరిన ఆర్కే తనయుడు పృథ్వీ అలియాస్ మున్నా మృతి చెందినట్టుగా భావిస్తున్నారు. మృతుల్లో 11మంది మహిళా మావోయిస్టు నేతలు ఉన్నారు. చనిపోయిన వారిలో మావోయిస్టు కీలక నేతలైన గాజర్ల రవి అలియాస్ గణేష్, డాకూరి వెంకట రమణ అలియాస్ ఉదయ్, శ్యామల కిష్టయ్య అలియాస్ దయన్న, ప్రమీలా (ఉదయ్ భార్య), చలపతి, అరుణ(చలపతి భార్య), రాజన్న, బెంగాల్ సుధీర్, అశోక్, కిరణ్‌లు కూడా ఉన్నట్టు సమాచారం. కాగా, ఎన్కౌంటర్లో మృతిచెందిన 24 మందిలో ఇప్పటికి 11 మందిని మాత్రమే గుర్తించగలిగారు. మిగిలిన 13 మందిని గుర్తించేందుకు అన్ని పోలీస్స్టేషన్లకు మృతుల ఫొటోలు పంపారు. కానిస్టేబుల్ కుటుంబాలకు డీజీపీ పరామర్శ విశాఖ నగరానికి వచ్చిన డీజీపీ సాంబశివరావు తొలుత ఎస్పీ క్యాంపు కార్యాలయంలో పోలీసు అధికారులతో సమావేశమై ఎన్‌కౌంటర్‌పై పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. అనంతరం నేరుగా సెవెన్ హిల్స్‌కు వెళ్లి గాయపడిన శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన కానిస్టేబుల్ సతీష్‌ను పరామర్శించారు. కేజీహెచ్‌కు వెళ్లి అబుబారక్ మృతదేహాన్ని పరిశీలించారు. అక్కడ నుంచి నేరుగా గాజువాక బీసీ రోడ్లో అతని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను డీజీపీ ఓదార్చారు. చనిపోయిన అబుబారక్ కుటుంబానికి స్పెషల్ ఎక్స్‌గ్రేషియా రూ.40లక్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. కూంబింగ్ కొనసాగుతూనే ఉంది: డీజీపీ ఏఒబీలో ఎన్కౌంటర్ నేపథ్యంలో విశాఖ చేరుకున్న ఏపీ డీజీపీ సాంబశివరావు తాజా పరిస్థితిని అక్కడినుంచే సమీక్షిస్తున్నారు. ఆయన ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడుతూ ‘సంఘటనా స్థలంలో ఇంకా ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. కాల్పులను విరమించి లొంగి పోవాల్సిందిగా ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా మావోయిస్టులు పట్టించుకోవడం లేదు. కాల్పులు కొనసాగిస్తూనే ఉన్నారు’ అని చెప్పారు. ఎదురుకాల్పులు, గాలింపు చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఎదురు కాల్పుల్లో ఇరువురు మావోయిస్టులతో సహా పలువురు కానిస్టేబుల్స్‌కు కూడా గాయాలైనట్టు తెలిపారు. ఇప్పటి వరకు 24మంది మావోయిస్టులు, గ్రేహౌండ్స్ కమాండో ఒకరు మృతి చెందినట్టు డీజీపీ నిర్ధారించారు. ప్రతీకారం తీర్చుకుంటాం మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ సాక్షి, హైదరాబాద్: ఏవోబీలో మావోయిస్టుల మృతి ఘటనకు ప్రతీకారం తీర్చుకుంటామని మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ హెచ్చరించారు. ఏపీ-ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపి.. మావోయిస్టులను హతమార్చారని ఆయన సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మావోయిస్టుల మృతి, పోలీసు కాల్పుల ఘటనపై తక్షణమే హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
'ట్రాఫిక్ ఆంక్షలను సడలిస్తున్నాం'
విజయవాడ: పున్నమి ఘాట్‌లో ఏర్పాట్లను డీజీపీ సాంబశివరావు ఆదివారం పరిశీలించారు. ట్రాఫిక్ ఆంక్షలను పరిస్థితులను బట్టి సడలిస్తున్నామని చెప్పారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఐడీ కార్డులు కలిగిన మీడియాను, వెహికల్స్‌ను అనుమతించాలని డీజీపీ పేర్కొన్నారు. అధికారులు పుష్కర ఘాట్ వద్దకు తమ వాహనాల్లో బంధువులను అధిక సంఖ్యలో తీసుకురాకుండా పోలీసులకు సహకరించాలని డీజీపీ సూచించారు.