రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ఇంజనీరింగ్ విద్యార్థిని ఉషారాణి ఆత్మహత్య కేసును సీఐడీ విచారణకు డీజీపీ సాంబశివరావు శనివారం ఆదేశించారు. కర్నూలు జిల్లా పాణ్యం ఆర్జీఎం కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న ఉషారాణి కీచక అధ్యాపకుడి వేధింపుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్టు చెబుతున్నారు