తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం దానవారుుపేటలో ఈ నెల 3న తనను తుని రూరల్ సీఐ అడ్డగించి ఎన్‌కౌంటర్ చేస్తానని బెదిరించారని
డీజీపీకి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు లేఖ
సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం దానవారుుపేటలో ఈ నెల 3న తనను తుని రూరల్ సీఐ అడ్డగించి ఎన్‌కౌంటర్ చేస్తానని బెదిరించారని డీజీపీ నండూరి సాంబశివరావుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు డీజీపీకి మధు సోమవారం లేఖ రాశారు. దివీస్ వ్యతిరేక పోరాట కమిటీని కలిసేందుకు వెళ్లిన తనపై తుని రూరల్ సీఐ చెన్నకేశవరావుతోపాటు పలువురు పోలీసులు దాడి చేసి దారుణంగా కొట్టారని మధు పేర్కొన్నారు.