
చంద్రబాబు నివాసానికి భద్రత పెంపు
ఉండవల్లిలోని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసానికి పోలీసులు భద్రతను పెంచారు. అదనంగా మరో 25 మంది సాయుధ సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్తో కలిసి ఏపీ డీజీపీ సాంబశివరావు ఆదివారం భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఏపీ డీజీపీ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులపై బురద జల్లడం మావోయిస్టులకు అలవాటైందని వ్యాఖ్యానించారు.
మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ(ఆర్కే) విషయంలో అది మరోసారి రుజువైందని చెప్పారు. గాయపడిన మావోయిస్టులు లొంగిపోతే పూర్తిస్థాయిలో చికిత్స అందిస్తామని పేర్కొన్నారు. ఏవోబీలో వారం కిందటే కూంబింగ్‌ను ఆపేశామని డీజీపీ సాంబశివరావు తెలిపారు.