
( ఫైల్ ఫోటో )
సాక్షి, విజయవాడ: సీపీఐ రామకృష్ణ, చంద్రబాబు, పవన్‌పై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు తొత్తులా సీపీఐ రామకృష్ణ వ్యవహరిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. జనసేన సిద్ధాంతం లేని పార్టీ అని ఎద్దేవా చేశారు. అలాగే, బాలకృష్ణ, పవన్ నోరు అదుపులో పెట్టకుని మాట్లాడాలని హెచ్చరించారు.
కాగా, ఎమ్మెల్యే మల్లాది విష్ణు గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి చేసిన చంద్రబాబును సీపీఐ సమర్థిస్తోంది. చంద్రబాబుకు తొత్తులా రామకృష్ణ వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు చేసిన స్కాంలు పవన్‌కు కనబడట్లేదా?. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో పేదరికం 12 నుంచి 6 శాతానికి తగ్గింది. బాలకృష్ణ, పవన్ కల్యాణ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. జనసేన సిద్ధాంతం లేని పార్టీ అని తీవ్ర విమర్శలు చేశారు.
మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌కు అత్యుత్సహం ఎక్కువైంది. దత్త తండ్రి అరెస్ట్‌ను పవన్ జీర్ణించుకోలేకపోతున్నాడు. అవినీతి చేసిన వ్యక్తిని సపోర్టు చేయడం సిగ్గుచేటు. చంద్రబాబు చేసిన అవినీతిలో పవన్, బాలకృష్ణకు కూడా వాటా ఉందా?. చంద్రబాబు ఒక ఆర్థిక నేరస్థుడు. పవన్‌కు భయం పట్టుకుంది. అందుకే ఈరోజు జైలుకి వెళ్లాడు. పవన్ బీజేపీతో వివాహం.. టీడీపీతో కాపురం చేస్తున్నాడు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: మాకొద్దు ‘బాబు’ వర్రీ.. మాకెందుకు ఈ కొరివి!
Comments
Please login to add a commentAdd a comment