చంద్రబాబు వల్లే రాష్ట్రం దివాలా: మంత్రి రాజా | Daissetty Raja comment on Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు వల్లే రాష్ట్రం దివాలా: మంత్రి రాజా

Published Sat, Aug 19 2023 6:12 AM | Last Updated on Sat, Aug 19 2023 8:16 AM

Daissetty Raja comment on Chandrababu - Sakshi

తుని రూరల్‌: చంద్రబాబు హయాంలో అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని దివాలా తీయించారని రోడ్లు భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. కాకినాడ జిల్లా తుని మండలం గెడ్లబీడు వద్ద శుక్రవారం జరిగిన జేసీఎస్‌ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి రాజా మాట్లాడు­తూ ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని చంద్రబాబు, యనమల రామకృష్ణుడు చేస్తున్న తప్పుడు ప్రచారంపై ధ్వజమెత్తారు. తనపై యనమల రామకృష్ణుడు తప్పుడు ప్రచారం చేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటనందూరు మండలంలో తాను 150 ఎకరాలు కొనుగోలు చేసినట్లు నిరూపిస్తే ఆ భూమిని ఆయనకే రాసిచ్చేస్తానని సవాల్‌ విసిరారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement