fake
-
‘కమాండ్’ తప్పిందా?
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ)కు ఇటీవల కాలంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు సమీక్షా సమావేశాలకు హాజరవుతున్నారు. ఇంతటి కీలకమైన ఐసీసీసీలోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి..టాస్‌్కఫోర్స్ పోలీసునంటూ తిరగడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశం అయింది. ఐసీసీసీలోకి ఎవరు వెళ్లాలన్నా చెకింగ్ పాయింట్లో అన్ని వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. గుర్తింపు కార్డు కూడా చూపించాలి. ఎవరిని కలవాలో చెప్పాలి. నకిలీ టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ ఐసీసీసీలోకి మూడుసార్లు వెళ్లి రావడం పట్ల పోలీసులు ఆరా తీస్తున్నారు. లోపలికి ఎలా వచ్చాడు ఎవరిని కలిశాడు, ఏం చెప్పి వచ్చాడు అన్నదానిపై ఉన్నతాధికారులు, నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. కూకట్‌పల్లికి చెందిన జ్ఞాన సాయి ప్రసాద్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను ఎదురుగా ఉన్న నిలోఫర్ కేఫ్‌లో కలుసుకున్న నకిలీ టాస్‌్కఫోర్స్ కానిస్టేబుల్..తన పేరు హరిజన గోవర్ధన్‌గా పరిచయం చేసుకొని హోటల్ బిజినెస్‌లో లాభాలు వస్తాయంటూ రూ.2.82 లక్షలు వసూలు చేశాడు. మూడు విడతలుగా ఇదే హోటల్లో బాధితుడు చెల్లించడం జరిగింది. ఈ మూడుసార్లు నిందితుడు హరిజన గోవర్దన్ ఐసీసీసీ నుంచి బయటికి వచ్చి బాధితుడిని నమ్మించాడు. బాధితుడు కూడా నేరుగా కమాండ్ కంట్రోల్‌సెంటర్ నుంచి సదరు వ్యక్తి వస్తుండటంతో అందులో పని చేస్తున్న వ్యక్తిగానే భావించాడు. ఇక్కడే బాధితుడు దెబ్బతిన్నాడు. అడిగినంత డబ్బు చెల్లించుకొని తీరా మోసపోయిన తర్వాత బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐసీసీసీలో సీసీ ఫుటేజీలు పరిశీలించగా నిందితుడు మూడుసార్లు రావడం పోలీసులు గుర్తించారు. ఇంతటి కీలకమైన కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి అది కూడా సీఎం రోజూ హాజరవుతున్న ప్రాంతంలోకి నకిలీ పోలీసు వెళ్ళడం దిగ్భ్రాంతికి గురి చేస్తున్నది ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికకారులు లోతుగా విచారిస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. బాధితుడి నుంచి మరింత సమాచారం రాబడుతున్నారు. గతంలో నిందితుడు ఇలాంటి మోసాలకు పాల్పడి ఉంటాడా..అనే కోణంలో కూడా పాత నేరస్తుల కదలికలపై దృష్టి పెట్టారు. మొన్నటికి మొన్న సచివాలయంలో నకిలీ అధికారులు సంచలనం సృష్టించగా తాజాగా సీఎం సమీక్షలకు వస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ ఘటన పోలీసులకు సవాల్‌గా మారింది. -
AP: పోలీసు ఉద్యోగ పరీక్షలో దొడ్డిదారి యత్నం!
కర్నూలు: ఎలాగైన పోలీసు ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో కొంతకాలంగా సాధన చేసిన ఓ అభ్యర్థి ఛాతీ, ఎత్తు కొలతల్లో ఫెయిల్ కావడంతో దొడ్డిదారిలో యత్నించి అడ్డంగా దొరికిపోయాడు. అధికారులను మోసగించే క్రమంలో అక్కడ సాంకేతికత ద్వారా గుర్తించి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని 4వ పట్టణ పోలీసు స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు చేసి కటకటాల్లోకి పంపారు. పోలీసు నియామక ప్రక్రియలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్‌లో డిసెంబరు 30 నుంచి దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం కోసిగి మండలం దొడ్డి బెళగల్ గ్రామానికి చెందిన పి.నరసింహుడు కుమారుడు పబిత తిరుమల బయోమెట్రిక్‌కు హాజరయ్యాడు. అయితే, అతను ఎత్తు, ఛాతి కొలతల్లో ఫెయిల్ కావడంతో వె నక్కి పంపారు. అయితే క్వాలిఫై అయినట్లుగా హాల్ టికెట్‌ను కలర్ జిరాక్స్ తీసుకొని.. క్వాలిఫై అయినట్లు టిక్ మార్క్ వేసుకొని 1600 మీటర్ల పరుగులో పాల్గొనేందుకు వరుస క్రమంలో నిలబడి మోసగించేందుకు ప్రయత్నించగా...స్టాటింగ్ పాయింట్ బందోబస్తు డ్యూటీలో రిజర్వు ఇన్స్పెక్టర్ నాగభూషణం గుర్తించి అభ్యర్థి మోసాన్ని వెలుగులోకి తెచ్చారు. పాడ్ క్యారియర్ లేకుండా 1600 మీటర్ల పాయింట్ వద్ద ఆర్ఎప్ఐడీ రిజిస్ట్రేషన్ కంప్యూటర్ ఆపరేటర్ జయరాం దగ్గరకు వెళ్లి పరిశీలించగా...సిస్టమ్‌లో అభ్యర్ధి పేరు చూపడం లేదని, హాల్ టికెట్లో మాత్రం క్వాలిఫై అయినట్లుగా నకిలీ తయారు చేసి టిక్ మార్క్ వేసుకున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయాన్ని ఎస్పీ బింధుమాదవ్ దృష్టికి తీసుకెళ్లగా.. 4వ పట్టణ పోలీసులకు అప్పగించాలని ఆదేశించారు. ఈ మేరకు అభ్యర్థి పబిత తిరుమలపై చీటింగ్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్ఐ గోపీనాథ్ తెలిపారు.కాగా 11 రోజు మంగళవారం పోలీసు కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలకు మొత్తం 600 మందిని ఆహ్వానించగా... 412 మంది వచ్చారు. వీరిలో ప్రధాన పరీక్షకు మంగళవారం 267 మంది ఎంపికయ్యారు. -
నకిలీ సర్టిఫికెట్ల పై విజిలెన్స్ దృష్టి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో నకిలీ సదరం సర్టిఫికెట్ల కుంభకోణంపై అధికారులు మళ్లీ దృష్టి సారించారు. పింఛన్లు, పన్ను మినహాయింపులు, ఇతర సౌకర్యాలు పొందేందుకు కొందరు అనర్హులు అక్రమంగా వైకల్య సర్టిఫికెట్లు పొందినట్లు ‘సాక్షి’2022 జనవరిలోనే బయటపెట్టింది. నాడు అధికారులు కొద్దిరోజులు హడావిడి చేసి.. ఆ తర్వాత మిన్నకుండిపోయారు. ఏసీబీ విచారణ జరిపినా దోషులను తేల్చలేకపోయింది. తాజాగా విజిలెన్స్ విభాగం నాటి ఏసీబీ నివేదిక దుమ్ము దులిపింది. లోతుగా దర్యాప్తు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నకిలీ సదరం సర్టిఫికెట్ల దందాను నాడు సాక్షి బయటపెట్టింది. ఒక్క ఇల్లందకుంట మండలంలోనే 1,086 వైకల్య పింఛన్లలో అనేకం అనుమానాస్పదంగా ఉన్నాయన్న విషయా న్ని వెలుగులోకి తెచి్చంది. దీనిపై ఆ సమయంలో డీఆర్డీఏ, కరీంనగర్ సివిల్ ఆసుపత్రి వర్గాలు పరస్పరం నిందించుకుని ఇద్దరు తాత్కాలిక ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించి చేతులు దులుపుకున్నారు. ఈ అంశంపై నిర్వహించిన ఏసీబీ విచా రణ కూడా డీఆర్డీఏ, సివిల్ ఆసుపత్రి కనుసన్నల్లోనే జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు లో ఇంతవరకూ దోషులను తేల్చకపోవటం ఆ ఆరోపణలకు బలాన్నిచి్చంది. తాజాగా ఈ కుంభకోణంపై దృష్టిపెట్టిన విజిలెన్స్ అధికారులు.. విష యాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి దృష్టికి తీసుకెళ్లారు. ఆవిడ ఆదేశాలతో రంగంలోకి దిగి.. అనుమానాస్పద సర్టిఫికెట్లు అన్నీ 2011 నుంచి 2021 మధ్య జారీ చేసినట్లు తేల్చారు. ఆ సర్టిఫికెట్లు జారీ చేసిన వైద్యులను ప్రశ్నించినా పెద్దగా సమాచారం రాబట్టలేకపోయారు. ఈ కుంభకోణంపై ఏసీబీ డీజీ శ్రీనివాస్‌రెడ్డి స్వయంగా దృష్టిపెట్టి దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. ఇది పైకి కనిపిస్తున్నంత చిన్న కుంభకోణం కాదని అధికారులు అంటున్నారు. ఈ సర్టిఫికెట్లను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ ఉద్యోగాలు, పన్ను రాయితీలు, పింఛన్లు, ఇంజినీరింగ్, మెడికల్ సీట్లు పొందుతున్న విషయాన్ని విజిలెన్స్ గుర్తించింది. ఈ కుంభకోణంలో నిందితులను ఎవరినీ ఉపేక్షించేది లేదని ఓ ఉన్నతాధికారి సాక్షికి తెలిపారు. భారీ నష్టమే..నెలకు రూ.3000 పింఛనే కదా.. వాటివల్ల ఏం నష్టం అని ఈ కుంభకోణం గురించి చాలామంది అనుకుంటున్నారు. కానీ, ఇది చాలా లోతైన కుంభకోణం. ఉదాహరణకు ఇల్లందకుంట మండలంలో 1,086 వైకల్య ఆసరా పింఛన్లు ఉన్నాయి. వీరందరికీ నెలకు రూ.3000 చొప్పున పింఛన్ చెల్లిస్తే.. దాదాపు రూ. 32 లక్షల పైనే అవుతుంది. ఏడాదికి దాదాపు రూ.4 కోట్లు అవుతుంది. అలాగే బస్ పాసులు, బ్యాంకు రుణాలు, లైసెన్సులు, రిజర్వేషన్లు, ఐటీ పన్ను మినహాయింపు.. ఇలా నెలనెలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లకు కోట్లలో చిల్లు పడుతోంది. చాలామంది వ్యాపా రులు దివ్యాంగులమని సర్టిఫికెట్లు తీసుకుని ఏటా రూ.75 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు ఆదాయ పు పన్ను మినహాయింపు పొందుతున్నారు. ప్రభు త్వ ఉద్యోగులు బదిలీలు, పదోన్నతుల్లో వీటిని అడ్డం పెట్టుకుని కోరుకున్న చోట పోస్టింగులు పొందుతున్నారు. దీంతో ఎంతలేదన్నా.. ఒక్క నకిలీ సర్టిఫికెట్తో నెలనెలా సుమారు రూ.20 వేల వరకు లబ్ధి పొందవచ్చని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఇప్పుడున్న నకిలీ సదరం సర్టిఫికెట్లలోనూ అధికభాగం చెవిటి సమస్య ఉన్నవారే కావడం గమనార్హం. ఇతర వైకల్యాలైతే ఆ సమస్య ఉన్నట్లు బయటకు నటించాల్సి ఉంటుంది. చెవుడు సమస్య అయితే.. పెద్దగా నటించాల్సిన అవసరం ఉండదు. అందుకే చాలామంది వాటినే తీసుకొన్నారు. -
అస్కీ మాజీ డైరెక్టర్ భాగ్యలక్ష్మి అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో: నకిలీ ఇన్వాయిస్లతో కుట్ర పూరితంగా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాకు (అస్కీ) చెందిన రూ.88.91 లక్షలు స్వాహా చేసిన కేసులో నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) శుక్రవారం మాజీ డైరెక్టర్ డాక్టర్ భాగ్యలక్ష్మిని అరెస్టు చేసింది. ఈ గోల్‌మాల్‌లో ఆమె పీఏగా పని చేసిన ఎం.రవికుమార్ పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించామని డీసీపీ ఎన్.శ్వేత పేర్కొన్నారు. అస్కీ ఆధీనంలో సెంటర్ ఫర్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, సెంటర్ ఫర్ అడ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ పేర్లతో కేంద్రాలు పని చేస్తున్నాయి. అస్కీలో ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన భాగ్యలక్ష్మి ఎక్స్‌టెన్షన్‌పై వీటికి డైరెక్టర్‌గా పని చేశారు. 2021–24 మధ్య ఈమె హయాంలో అనేక శిక్షణ కార్యక్రమాలు, ప్రాజెక్టులు జరిగాయి. ఆయా సందర్భాల్లో అవసరాన్ని బట్టి పలు ఏజెన్సీలు, కన్సల్టెంట్లతో పాటు పలువురు విక్రేతలు సేవల్ని వినియోగించుకున్నారు. ఆయా ఏజెన్సీలు, విక్రేతలు ఇచి్చన ఇన్వాయిస్ల ఆధారంగా అస్కీ నిధుల నుంచి చెల్లింపులు చేశారు. ఈ విక్రేతలు, కన్సల్టెంట్స్ జాబితాలో హర్యానాలోని గుర్గావ్కు చెందిన షేక్ అభిషేక్ ఇమ్లాక్, నగరానికి చెందిన బల్లపు శృతి, నలమస రజని, మాదాపూర్‌కు చెందిన ఎం.బుర్రయ్య, పాండురంగనగర్‌కు చెందిన ధనలక్ష్మి ఉన్నారు. వీరు ఇచ్చిన ఇన్వాయిస్ల ఆధారంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ భాగ్యలక్ష్మి 2021 మార్చి నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు రూ.88.91 లక్షల చెల్లింపులు చేశారు. తన పీఏ రవికుమార్ సాయంతో ఆ నగదును వారి నుంచి తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ చెల్లింపులతో పాటు ఇతర కార్యకలాపాల నేపథ్యంలో భాగ్యలక్ష్మిని ఈ ఏడాది ఆగస్టు 16న అస్కీ విధుల నుంచి తొలగించింది. శుక్రవారం ఆమెను అరెస్టు చేసిన సీసీఎస్ జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించింది. -
'అలాంటివి ఇక వద్దు'.. వారికి పుష్ప టీమ్ స్ట్రాంగ్ వార్నింగ్!
సోషల్ మీడియాలో వైరలవుతోన్న పుష్ప చిత్రంలోని ఫేక్ డైలాగ్స్‌పై చిత్రబృందం స్పందించింది. నెట్టింట వైరలవుతోన్న ఫేక్ డైలాగ్స్ సృష్టించేవారికి పుష్ప టీమ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అలాంటి పైరసీ వీడియోలు, సంబంధిత లింక్స్ కనిపిస్తే తమకు తెలియజేయాలని సూచించింది. ఈ మేరకు మెయిల్‌తో పాటు ఫోన్ నంబర్‌ను ట్విటర్ ద్వారా షేర్ చేసింది. ఇలాంటి వాటిని వ్యాప్తి చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ హెచ్చరించింది.మైత్రి మూవీ మేకర్స్ తన ట్విట్లో ప్రస్తావిస్తూ..' ఊహాజనితమైన, సొంత క్రియేటీవిటితో పుట్టించిన కొన్ని డైలాగులు పుష్ప-2 చిత్రంలోనివి అంటూ కొంత మంది కావాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కొంత మంది కావాలనే సినిమాపై నెగటివ్ ప్రచారం కోసం ఇలాంటివి పోస్ట్ చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఇలాంటి పోస్టులు పోస్ట్ చెయ్యటం మానుకోండి. లేకపోతే అలాంటి వారిపై చట్ట పరమైన యాక్షన్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం.' అని పోస్ట్ చేశారు. దీంతో ఎవరైనా సరే ఫేక్ డైలాగ్స్, వీడియోస్ పోస్ట్ చేసి చిక్కుల్లో పడొద్దు. అలాంటి పైరసీ వీడియోలు కానీ, లింక్స్ కనిపిస్తే వెంటనే వివరాలు పంపితే దాన్ని అడ్డుకుంటామని పేర్కొంది. ఊహాజనితమైన, సొంత క్రియేటీవిటితో పుట్టించిన కొన్ని డైలాగులు పుష్ప-2 చిత్రంలోనివి అంటూ కొంత మంది కావాలని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు. వాంటెడ్ గా కొంత మంది సినిమాపై నెగటివ్ ప్రచారం కోసం కావాలని ఇలాంటివి పోస్ట్ చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఇలాంటి పోస్టులు పోస్ట్ చెయ్యటం…— Mythri Movie Makers (@MythriOfficial) December 6, 2024 Any unauthorized videos or spoilers of the movie #Pushpa2 can be reported immediately to the Anti Piracy Control Room @AntipiracySWe will bring them down immediately.claims@antipiracysolutions.orgWhatsapp: 8978650014— Mythri Movie Makers (@MythriOfficial) December 6, 2024 -
మీషోపై పడ్డ సైబర్ నేరగాళ్లు: ఎన్ని కోట్లు దోచేశారంటే..
సైబర్ నేరగాళ్లు ప్రజలను మాత్రమే మోసం చేశారని గతంలో చాలా కథనాల్లో తెలుసుకున్నాం. ఇప్పుడు ఏకంగా మీషో కంపెనీని మోసం చేసి ఏకంగా రూ. 5.5 కోట్లు నష్టాన్ని కలిగించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.సైబర్ నేరగాళ్లు మీషో ఈ-కామర్స్ కంపెనీలో ఫేక్ సెల్లర్‌గా నటిస్తూ.. అదే ప్లాట్ఫామ్లో నకిలీ ఖాతాల ద్వారా ఆర్డర్లు చేసేవారు. ఆర్డర్ డెలివరీ చేసుకున్న తరువాత వాటి స్థానంలో విరిగిపోయిన లేదా పాడైపోయిన పాత వస్తువులను పెట్టి మళ్ళీ రిటర్న్ చేసేవారు. దీనిని నిజమని నమ్మించడానికి వీడియోలు కూడా క్రియేట్ చేసేవారు. ఆ తరువాత డబ్బు వెనక్కి తీసుకునేవారు.మోసగాళ్ళు ఈ సంవత్సరం జనవరి నుంచి జూలై మధ్య ఇదే వరుసలో మోసాలు చేస్తూ.. మీషో నుంచి రూ. 5.5 కోట్లు వసూలు చేశారు. డబ్బు జమచేసుకోవడానికి వీరు వివిధ బ్యాంక్ అకౌంట్స్ ఉపయోగించారు. ఈ మోసాన్ని కంపెనీ గుర్తించిన తరువాత సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.మీషో కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసిన తరువాత.. పోలీసులు రంగంలోకి దిగారు. చివరకు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారు కూడా నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో పాల్గొన్న ఇతర నిందితులను పట్టుకోవడానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. -
డీప్ ఫేక్.. అంతా ఫేక్
మీరు చెప్పనిది చెప్పినట్టుగా.. అనని మాటలు అన్నట్టుగా.. చెయ్యని పనులు చేసినట్టుగా.. ఒక్క మాటలో చెప్పాలంటే మిమ్మల్ని మీరు నమ్మలేనంతగా మాయ చేసి ఏమార్చే డీప్ ఫేక్ కాలం నడుస్తోంది. ఈ టెక్నాలజీని గతంలో సెలబ్రిటీలు, రాజకీయ నాయకులను బద్నాం చేసేందుకే అధికంగా వినియోగించగా.. ఇప్పుడది సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి కూడా వెళ్లింది. మీరు మీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ‘ఎక్స్’ వంటి సోషల్ మీడియా అకౌంట్లలో పంచుకునే ఒకే ఒక్క హై రిజల్యూషన్ ఫొటో ఉంటే చాలు.. సైబర్ నేరగాళ్లు మీకు సంబంధించి ఏ డీప్ ఫేక్నైనా సృష్టించగలరని పేర్కొంటున్నారు. - సాక్షి, హైదరాబాద్డీప్ ఫేక్‌లో ఏమేం చేయవచ్చు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ వాడి డీప్ ఫేక్ వీడియోలు, ఆడియోలు, ఫొటోలు సృష్టించవచ్చు. సాంకేతికంగా చెప్పాలంటే డీప్ ఫేక్‌లో ఫేస్ స్వాపింగ్, వాయిస్ క్లోనింగ్, లిప్ సింక్రనైజింగ్, ఎమోషనల్ మ్యానుపులేషన్, ఆడియో డీప్ ఫేక్ వంటివి చేయవచ్చు. ఒరిజినల్ వాయిస్లోంచి మనకు కావాల్సిన పదాలను ఎంపిక చేసుకుని వాటి నుంచి ఫేక్ కంటెంట్‌ను స్పీచ్ సింథసిస్ చేసే వీలు కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. అమాయకులను మోసగించేందుకు సైబర్ నేరగాళ్లు ఈ డీప్ ఫేక్ను అస్త్రంగా మార్చుకుంటున్నారు. సోషల్మీడియాలోఅతి వద్దు ఫేస్బుక్, ‘ఎక్స్’, ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలపై కొందరు అవసరానికి మించి వ్యక్తిగత, ఫొటోలు, వీడియోలను పంచుకుంటారు. ఇలా చేస్తే సైబర్ నేరగాళ్లకు అవకాశం ఇచ్చినట్టేనని నిపుణులు చెబుతున్నారు. ఇలా మనం పెట్టే ఫొటోలు, వీడియోలను వాడుకుని డీప్ ఫేక్ చేసేందుకు అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా యాప్‌లు వాడే విష యంలో ప్రైవసీ సెట్టింగ్స్‌ను మరవొద్దని సూచిస్తున్నారు. మనం పెట్టే ఫొటోలు, వీడియోలు మన కాంటాక్ట్ లిస్ట్లోనివారే చూసేలా సెట్టింగ్స్ అప్డేట్ చేసుకోవడం మంచిదని చెబుతున్నారు.డీప్ ఫేక్నుఎలా గుర్తించవచ్చు? » డీప్ ఫేక్ వీడియోను గుర్తించేందుకుఅందులోని వ్యక్తుల ముఖ కవళికలను నిశితంగా పరిశీలించాలి. అసహజంగా కళ్లు ఆర్పుతున్నట్టుగా ఉన్నా, సహజపరిస్థితులకు భిన్నంగా ముఖంపై వచ్చే లైటింగ్‌లో తేడాలు ఉన్నాఅది డీప్ ఫేక్ అని గుర్తించాలి. »శరీర కదలికల్లో అకస్మాత్తుగాతేడాలు ఉన్నా అనుమానించాలి.»ఆడియోలో పెదాల కదలికలు సరిగానే అనిపిస్తున్నా..కొన్ని పదాలు వెనుక,ముందు అవుతుండడం గమనించవచ్చు. »డీప్ ఫేక్ ఆడియోల్లో నిశితంగా గమనిస్తే.. వాయిస్ మాడ్యులేషన్లో తేడాలను, ఆడియో క్వాలిటీలో తేడాలనుగుర్తించవచ్చు. » డీప్ ఫేక్ ఇమేజ్‌లలో చివరలు బ్లర్అయినట్టుగా ఉంటాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో తేడాలు, వెలుతురులో తేడాలు ఉంటాయి. -
HYD: బయట టీ తాగే వారు జాగ్రత్త.. నకిలీ టీ పౌడర్ ముఠా అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: రోజులో ఒక్కసారైనా టీ తాగినిదే ఏం పని తోచదు చాలా మందికి. ఇంట్లోనే కాదు బయటకు వెళ్లినా సమాయనుసారం టీ చుక్కా నోట్లో పడాల్సిందే. కానీ షాపుల్లో, టీ కొట్టుల్లో ఎక్కువగా లూస్ టీపోడినే వాడుతుంటారు. ఇకపై బయట టీ తాగే సమయంలో చాయ్ లవర్లు కాస్తా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో నకిలీ టీ పొడి తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. నగరంలో టీ దుకాణాలకు తక్కువ ధరకు కల్తీ టీ పొడి సరఫరా చేస్తున్న ముఠాను ఆటకట్టించారు మధ్యమండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు. సనత్‌నగర్‌లోని ఓ కంపెనీపై దాడి చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. టన్నుల కొద్దీ నకిలీ టీపొడి స్వాధీనం చేసుకున్నారు.నాసిరకమైన టీ పొడిలో కొబ్బరి చిప్ప పొడి, రసాయనాలు, రంగులు, చాక్లెట్ ఫ్లేవర్ మిల్క్ పౌడర్ కలిపి కస్తే టీ పొడి తయారు చేస్తున్న ముఠాకు మధ్య మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. ముగ్గురు నిందితులను పట్టుకుని వారి నుంచి 300 పేజీల కల్తీ టీ పొడి, 200 కేజీల కొబ్బరి చిప్పల పొడి స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వైవీఎస్ సుదీంద్ర తెలిపారు. ఫతేనగర్‌కు చెందిన జగన్నాథ్ కోణార్క్ టీ పౌడర్ సేల్స్ ఆండ్ సప్లయర్స్ పేరుతో వ్యాపారం చేస్తున్నారు.తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కల్తీ టీ పొడి తయారీకి సిద్ధమ య్యాడు. మార్కెట్ నుంచి కేజీ రూ. 80 ఖరీదు చేసే టీ పొడి, రయనాలు, రంగులు, ఫ్లేవర్స్‌తో పాటు కొబ్బరి చిప్పల పొడి కొనేవాడు. దీన్ని తన దుకాణానికి తీసుకువెళ్లి తన వద్ద పని చేసే ప్రతాప్, పరాదాలకు ఇచ్చే వాడు. వీళ్లు వాటన్నింటినీ కలిపి కల్తీ టీ పొడి తయారు చేసి ప్యాక్ చేసే వారు. ఈ పొడిని కేజ్ రూ.250కి అమ్మే జగన్నాథ్ లాభాలు ఆర్థిస్తున్నాడు.ఈ టీ పొడిని ప్రతినిదులు ఎక్కువగా చిన్న చిన్న దుకాణదారులతో పాటు రోడ్డు వచ్చిన టీ బుధవారం స్టాల్స్ కు అమ్మేవాడు. వీరి వ్యవహారంపై సమాచారం అందుకున్న కార్యాలయ మధ్య మండల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎన్ రామకృష్ణ నేతృత్వంలో ఎస్సై డి.శ్రీకాంత్ గౌడ్ వలపన్ని ముగ్గురినీ పట్టుకున్నారు. నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న సరుకును సనత్‌నగర్ పోలీ సులకు అప్పగించారు. జగన్నాథ్‌పై ఇప్పటికే మోమిన్‌పేట్, సనత్ నగర్ ఠాణాల్లో మూడు అదే తరహా కేసులు ఉన్నాయని అయిన ప్పటికీ అతడు తన వంతా కొనసాగుస్తున్నాడని టీసీపీ తెలిపారు. కల్తీ పొడితో చేసిన టీ పొడి తాగడం వల్ల కేన్సర్, కామెర్లు సహా అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. -
ఛత్తీస్‌గఢ్‌లో ఉత్తుత్తి ‘ఎస్బీఐ’ శాఖ
జంజ్‌గిర్–చంపా(ఛత్తీస్‌గఢ్): ఆన్లైన్ మోసాల బారినపడిన బాధితులు మొట్టమొదట న్యాయం కోసం వెళ్లేది బ్యాంక్ బ్రాంచ్ వద్దకే. అలాంటి బ్యాంక్ కార్యాలయం నకిలీ అని తేలితే?. ఛత్తీస్‌గఢ్‌లో ఇలాంటి మోసం ఒకటి తాజాగా వెలుగుచూసింది. ఈ ఉదంతంలో పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) పేరిట కొందరు మోసగాళ్లు నకిలీ ఎస్బీఐ బ్రాంచ్‌ను తెరచి జనం నుంచి డబ్బులు ‘ఫిక్స్డ్’ డిపాజిట్లు తీసుకోవడం మొదలెట్టారు. శక్తి జిల్లా అదనపు ఎస్పీ రామాపటేల్ తెలిపిన వివరాల ప్రకారం.. శక్తి జిల్లాలోని మల్ఖారౌదా పోలీస్‌స్టేషన్‌పరిధిలోని ఛంపోరా గ్రామంలో సెప్టెంబర్ 18వ తేదీన కొత్తగా నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ తెరుచుకుంది. అక్కడి దుకాణసముదాయంలో ఒక షాప్‌ను అద్దెకు తీసుకుని కంప్యూటర్లు, ఇతర బ్యాంకింగ్ సామగ్రితో ఎస్బీఐ శాఖను కొందరు మొదలుపెట్టారు. అయితే ఈ బ్రాంచ్‌పై అనుమానం వచ్చిన ఒక వ్యక్తి పోలీసులు, బ్యాంక్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదుచేశారు. దీంతో హుతాశులైన పోలీసులు, కొర్బా పట్టణంలోని ఎస్బీఐ రీజనల్ ఆఫీస్ బృందంతో కలిసి ఈ నకిలీ బ్రాంచ్‌కు హుటాహుటిన వచ్చారు. అప్పుడు ఆ నకిలీ బ్రాంచ్‌లో ఐదుగురు పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే అక్కడి ఉద్యోగులకు తాము నకిలీ బ్రాంచ్‌లో పనిచేస్తున్నామన్న విషయం కూడా తెలీదని వార్తలొచ్చాయి. బ్యాంక్ మేనేజర్‌గా చెప్పుకునే ఒక వ్యక్తి వీరిని ఇంటర్వ్యూ చేసి నియమించుకున్నాడని సమాచారం. దీంతో ముగ్గురిని అరెస్ట్ చేసి పోలీసులు ప్రశ్నించడం మొదలెట్టారు. బ్రాంచ్‌లోని కంప్యూటర్లు, ఇతర మెటీరియల్‌ను స్వా«దీనం చేసుకున్నారు. అయితే ఈ నకిలీ బ్రాంచ్ వల్ల ఎవరైనా మోసపోయారా? ఎంత మంది డిపాజిట్లు చేశారు? ఇతర తరహా లావాదేవీలు జరిగాయా? అనే వివరాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. -
ఐఫోన్ 13 రూ.11కే..?
ఐఫోన్ 13 కేవలం రూ.11కే లభ్యమవుతోందని ఫ్లిప్‌కార్ట్‌లో వెలిసిన ప్రకటనపై కస్టమర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ఆర్డర్ పెట్టినా స్టాక్ అయిపోయిందని పాప్అప్ మెసేజ్ రావడంతో సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివిధ మాధ్యమాల్లో వినియోగదారులు పెడుతున్న పోస్టులుకాస్తా వైరల్‌గా మారుతున్నాయి.ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో సెప్టెంబర్ 22న రాత్రి 11 గంటలకు కేవలం రూ.11కే ఐఫోన్ 13 బుక్ చేసుకోవచ్చనేలా బ్యానర్లు వెలిశాయి. దాంతో వినియోగదారులు సరిగ్గా రాత్రి 11 గంటలకు ఆర్డర్ పెట్టేందుకు ప్రయత్నించారు. కానీ ఆ సమయంలో స్టాక్ అయిపోయిందని పాప్అప్ మెసేజ్ రావడం గమనించారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా అదే తంతు కొనసాగడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. దాంతో వివిధ సామాజిక మాధ్యమాల్లో విభిన్నరీతిలో స్పందించారు.Flipkart Deserves Belt Treatment From GovtThey Put a Banner of iPhone 13 at Just ₹11Product Went Out of Stock But Helps Them in Free Marketing On Social Media, WhatsAppIn Other Countries, They’ll Pay Penalty For Such Malpractices On The Name of Sale & Discount— Ravisutanjani (@Ravisutanjani) September 22, 2024 ‘ఫ్టిప్‌కార్ట్ వినియోగదారులను తప్పదోవ పట్టించేలా ప్రకటనలు విడుదల చేస్తుంది. వాట్సప్, సోషల్ మీడియాలో ఉచిత పబ్లిసిటీ కోసం దిగుజారుతుంది. ఇతరదేశాల్లో ఇలా చీప్ ట్రిక్స్ అమలు చేస్తే పరిస్థితులు భిన్నంగా ఉంటాయి’ అని ఒకరు స్పందించారు. ‘ఈ ఆఫర్ నిజంగా నిరాశపరిచింది. నిత్యం తప్పుడు ప్రకటనలు వస్తూన్నాయి. సంస్థ దీనిపై తగిన విధంగా స్పందించాలి. తప్పుదోవ పట్టించే ప్రచారాలకు ఫ్లిప్‌కార్ట్ బాధ్యత వహించాలి’ అని ఇంకొక యూజర్ తెలిపారు. ‘వాహ్ తర్వాత ఏమిటి? మ్యాక్‌బుక్ ప్రో రూ.11?’ అని మరో యూజర్ స్పందించారు. ఏదేమైనా, తప్పు ఎవరు చేసినా దానికి ఫ్లిప్‌కార్ట్ బాధ్యత వహించి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.ఇదీ చదవండి: ఏఐకు కొత్త అర్థం చెప్పిన ప్రధానిఇటీవల ఐఫోన్ 16 సిరీస్ అమ్మకాలు ప్రారంభించిన యాపిల్ దానికంటే ముందు మోడళ్ల రేట్లను తగ్గిస్తుందనే వార్తలు వస్తున్నాయి. దాంతో ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో ఇలాంటి ప్రకటనలు చూసి చాలా మంది వినియోగదారులు తక్కువ ధరకే ఇస్తున్నారని భ్రమపడే అవకాశం ఉంటుంది. ఏదైనా ఆఫర్ ప్రకటించినపుడు విభిన్న ప్లాట్ఫామ్ల్లో ఆ మోడల్ ధరను పోల్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నమ్మశక్యంగా లేని ఆఫర్‌గా అనిపిస్తే ఆ ప్రకటన ఇస్తున్న కంపెనీ కాల్ సెంటర్‌కు ఫోన్‌చేసి వివరాలు ధ్రువీకరించుకోవాలని సూచిస్తున్నారు. కంపెనీలు కూడా కస్టమర్లను తప్పుదోవ పట్టించే ప్రకటనలు నిలిపేయాలని చెబుతున్నారు. -
నకిలీ ‘సీఐఏ’ ఏజెంట్ ఎన్ఆర్ఐపై బిగుస్తున్న ఉచ్చు : నవ్వుతూనే ముంచేశాడు!
భారతీయ వ్యాపారవేత్త గౌరవ్ శ్రీవాస్తవ మోసం, మనీ లాండరింగ్ ఆరోపణల వ్యవహారం మరింత ముదురు తోంది. అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) రంగంలోకి దిగింది. అమెరికా పౌరుడిగా చెప్పుకుంటూ, సీఐఏ ఏజెంట్ అని నమ్మించి వివిధ దేశాలకు చెందిన రాజకీయ, వ్యాపార నాయకులను మోసగించడం, తీవ్రమైన తప్పిదాలకు పాల్పడటం ఆరోపణల కేసులో ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ చేసింది.నకిలీ సీఐఏ ఏజెంట్‌గా శ్రీవాస్తవ ఏకంగా ప్రెసిడెంట్ జో బిడెన్‌ను కలిశారని, డెమోక్రటిక్ పార్టీకి 10 లక్షల డాలర్ల పైగా విరాళం ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తడం అక్కడ రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. 'నకిలీ సీఐఏ ఏజెంట్' స్కామ్‌లో శ్రీవాస్తవ, అనేక సంవత్సరాలుగా మోసపూరిత కార్యకలాపాలతో అమెరికా జాతీయ భద్రతకు భంగం కలిగించాడనే ఆరోపణలను ఎఫ్‌బీఐ విచారిస్తోంది.ఘోరమైన అబద్ధాలతో వాషింగ్టన్ రాజకీయ ప్రముఖులు, పలువురు సెలబ్రిటీను బురిడీ కొట్టించాడు. వ్యాపార వేత్తలను నమ్మించి, తనఫౌండేషన్కు భారీనిధులను దక్కించుకున్నాడు. అయితే ఇండియాలోని లక్నోకు చెందిన శ్రీవాస్తవ కాలేజీ డ్రాపౌట్ అని కూడా వాల్ స్ట్రీట్ జర్నల్ తాజాగా రిపోర్ట్ చేసింది.శ్రీవాస్తవ మోసపూరిత కార్యకలాపాలు అంతర్జాతీయ లావాదేవీలకు కూడా విస్తరించాయని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. సూడాన్, లిబియాతో సహా ఆఫ్రికాలోని నాయకులను తప్పుదారి పట్టించాడు . అమెరికా ప్రభుత్వ మద్దతు పొందేందుకు తప్పుడు వాగ్దానాలు చేశాడు. వాషింగ్టన్లో, అతను తన చర్యలను చట్టబద్ధం చేయడానికి ఉన్నత అధికారులతో సంబంధాలను మెయింటైన్ చేశాడు. మిస్టర్ జీగా పాపులర్ అయిన శ్రీవాస్తవ బాధితుల్లో నాటో మాజీ కమాండర్ జనరల్ వెస్లీ క్లార్క్ వంటి ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. ఇంకా అట్లాంటిక్ కౌన్సిల్ థింక్ ట్యాంక్, అనేక డెమొక్రాటిక్ నిధుల సేకరణ కమిటీలు, అనేకమంది సెనేటర్లు , కాంగ్రెస్ సభ్యులతో సహా అనేక ఉన్నత స్థాయి వ్యక్తులను మోసగించాడు. నేటర్ మార్క్ వార్నర్, ప్రతినిధి పాట్రిక్ ర్యాన్, జెనీవాకు చెందిన వస్తువుల వ్యాపారి, ఇంకా అనేక మంది ఆఫ్రికన్ నాయకులు ఇండోనేషియా అధ్యక్షుడు కూడా శ్రీవాస్తవ మోసానికి గురి కావడం గమనార్హం. అంతేకాదు తనపై కథనాలను రాసిన మీడియాను కూడా పరువు నష్టం దావాతో బెదరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాలు మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో కొందరు ఆయనకు దూరం కాగా, మరికొందరు సంబంధాలను తెంచుకున్నారు.మరోవైపు శ్రీవాస్తవ, అతని భార్య షరోన్‌పై కాలిఫోర్నియాలో రెండు వేర్వేరు మోసం కేసులు నమోదైనాయి. అలాగే లీజు గడువు ముగిసిన తర్వాత 12 మిలియన్ల డార్లు శాంటా మోనికా ఇంటిని ఖాళీ చేయడం లేదని, అద్ద కూడా చెల్లించలేదని ఆరోపిస్తూ ఇంటి యజమాని స్టీఫెన్ మెక్‌ఫెర్సన్, శ్రీవాస్తవపై దావా వేశారు. శ్రీవాస్తవ,అతని భార్య షారోన్ ఆధ్వర్యంలో ‘ది గౌరవ్ & షారన్ శ్రీవాస్తవ ఫ్యామిలీ ఫౌండేషన్’ను కూడా ఉంది. ఆహారం , ఇంధన భద్రత వంటి ప్రపంచ సమస్యలపై ఇది దృష్టి సారిస్తుంది. అయితే తాజా అరోపణల నేపథ్యంలో ఈ ఫౌండేషన్ చట్టబద్ధతపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. కాగా శ్రీవాస్తవ మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్న వ్యాపారి నీల్స్ ట్రూస్ట్కు అనుమానం రావడంతో ఈ భారీ స్కాం బట్టబయలైంది. అయితే ఇవన్నీ కట్టుకథలని శ్రీవాస్తవ న్యాయవాది కొట్టి పారేశారు. కాలిఫోర్నియాలో వ్యాజ్యాలతో సహా కొన్ని ఖచ్చితమైన ఆధారాలున్నప్పటికీ, శ్రీవాస్తవ అతని న్యాయవాదులు అన్ని ఆరోపణలను ఖండిస్తూనే ఉన్నారు. -
వెల్లుల్లిని కొంటున్నారా.. ఇది తెలిస్తే
ఘాటైన వాసన దాని సహజ లక్షణం. అందుకే దాన్ని చూడగానే చాలామంది ముక్కు చిట్లాస్తారు. కానీ అదిలేని వంటిల్లు సాధారణంగా ఉండదు. ఎందుకంటే ఆ ఘాటే నోరూరించే రుచికి కారణం. ఆ ఘాటే ఆరోగ్యానికి అద్భుతమైన ఔషదం. అందుకే పప్పు నుంచి చికెన్ దాకా ఏది వండాలన్నా వెల్లుల్ని ఉండాల్సిందే. అలాంటి దివ్య ఔషదాలున్న వెల్లుల్ని ధరలు విపరీతంగా ఉన్నాయి. ఆ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు కొందరు కాసుల కక్కుర్తికోసం అడ్డదార్లు తొక్కుతున్నారు.మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో సిమెంట్‌తో తయారు చేసిన నకిలీ వెల్లుల్లి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది.ఆ వీడియోలో వెల్లుల్ని పొట్టు ఒలిచిన తర్వాత రాయిలా గట్టిగా ఉండడం మనకు కనిపిస్తుంది. ఆ దృశ్యాలు ఇప్పుడు వినియోగదారుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.దేశవ్యాప్తంగా వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో కొన్ని కూరగాయల మార్కెట్లలో నకిలీ వెల్లుల్లిని విక్రయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో తాజా వెలుగులోకి వచ్చిన కొనుగోలు దారులలో భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న వెల్లుల్ని స్వచ్ఛతపై అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు.देशभर में लहसुन के दाम फिलहाल आसमान छू रहे हैं। इस बीच एक हैरान करने वाला मामला सामने आया है, जहां महाराष्ट्र के अकोला में कुछ फेरीवाले नागरिकों को सीमेंट से बना नकली लहसुन बेचकर धोखा दे रहे हैं। #Garlic #Maharashtra #Akola इनपुट्स: धनंजय साबले pic.twitter.com/Q4v1hZBhR9— सत्य सनातन भारत (Modi ka parivar)🚩🙏🕉️🙏🕉 (@NirdoshSha33274) August 18, 2024 -
పూజా ఖేద్కర్ వివాదం.. కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ వైకల్య ధ్రువీకరణ పత్రాల వివాదం నేపథ్యంలో సివిల్ సర్వెంట్ల నియామకం, శిక్షణ, నిర్వహణ సంబంధిత కార్యకలాపాలు నిర్వహించే కేంద్ర విభాగానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ)విభాగం అప్రమత్తమైంది. ఆరుగురు సివిల్ సర్వెంట్ల వైకల్య ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వారిలో ఐదుగురు ఐఏఎస్, ఒకరు ఐఆర్ఎస్ అధికారి ఉన్నట్లు సమాచారం.లగ్జరీ సౌకర్యాల కోసం అతిగా ప్రవర్తించి మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ పలు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. ఉద్యోగం కోసం ఓబీసీ సర్టిఫికెట్తో పాటు కంటి, మానసిక సంబంధిత సమస్యలపై తప్పుడు పత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటిని నిర్ధారించేందుకు నిర్వహించే వైద్య పరీక్షలకు ఖేద్కర్ ఆరుసార్లు గైర్హాజరవ్వడం వంటి వరుస వివాదాలు ఆమె ఐఏఎస్ అభ్యర్థితత్వం రద్దుకు దారి తీసింది. ట్రైనీ ఐఎస్ఎస్ అధికారిణి చేసిన తప్పుల్ని గుర్తించిన యూపీఎస్సీ ఆమె ఎంపికను రద్దు చేసింది. భవిష్యత్తులో సివిల్స్ పరీక్షల్లో పాల్గొనకుండా ఆమెపై జీవితకాల నిషేధం విధించింది.తదుపరి చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆమెపై ఢిల్లీ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే తన అరెస్ట్ తప్పదేమోనన్న అనుమానంతో ఖేద్కర్ ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు ముందస్తు బెయిల్‌ను నిరాకరించింది. ఈ వరుస పరిణామాలతో ఖేద్కర్ విదేశాలకు పారిపోయినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.Puja Khedkar case: Following the row over #IAS probationer #PujaKhedkar, the Department of Personnel and Training (#DoPT) will now scrtutinise the disability certificates of six other civil servants.https://t.co/F4bXZs7rL9— Business Today (@business_today) August 2, 2024 -
పూజా ఖేద్కర్‌కు UPSC షాక్.. అభ్యర్థిత్వం రద్దు
వివాదాస్పద ట్రెయినీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌కు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) షాకిచ్చింది. నకిలీ దృవీకరణ పత్రాలు సమర్పించారని తేలడంతో యూపీఎస్సీ ఆమె ఐఏఎస్ సెలక్షన్‌ను క్యాన్సిల్ చేస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆమెపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడంతో పాటు భవిష్యత్‌లో యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో పాల్గొనకుండా డీబార్ చేసింది. UPSC has, initiated a series of actions against her, including Criminal Prosecution by filing an FIR with the Police Authorities and has issued a Show Cause Notice (SCN) for cancellation of her candidature of the Civil Services Examination-2022/ debarment from future… pic.twitter.com/ho417v93Ek— ANI (@ANI) July 19, 2024శుక్రవారం (జులై 19) యూపీఎస్సీ కమిషన్ పూజా ఖేద్కర్ వివాదంపై అధికారికంగా స్పందించింది. యూపీఎస్సీ నిర్వహించిన విచారణలో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2022 లో ఉత్తీర్ణత సాధించేందుకు పూజా మనోరమ దిలీప్ ఖేద్కర్ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారు.సివిల్ సర్వీస్ ఎగ్జామ్ గట్టెక్కేందుకు తన పేరుతో పాటు తల్లిదండ్రులు, ఫొటోలు,సంతకాలు, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, ఇంటి అడ్రస్‌తో పాటు ఇతర వివరాలన్నీ తప్పుడు ధృవీకరణ పత్రాలను అందించినట్లు తమ విచారణలో తేలిందని యూపీఎస్సీ అధికారికంగా ప్రకటిస్తూ మీడియోకు ఓ నోట్‌ను విడుదల చేసింది.ఆ నోట్లో మోసపూరిత కార్యకాలాపాలకు పాల్పడినందుకు పూజా ఖేద్కర్‌పై అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ షోకాజు నోటీసులు ఇచ్చినట్లు తెలిపింది. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2022 నిబంధనల ప్రకారం.. భవిష్యత్‌లో యూపీఎస్సీ పరీక్షలు రాయకుండా, అభ్యర్ధిత్వాన్ని ప్రకటించకుండా డీబార్ చేసినట్లు పేర్కొంది. పరీక్షల్లో మోసపూరితంగా వ్యవహరించడంతో పూజా ఖేద్కర్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్లో పోలీసులు ఆమెపై క్రిమినల్ కేసులు పెట్టినట్లు యూపీఎస్సీ వెల్లడించింది. -
పచ్చి అబద్ధాలతో విద్యుత్ శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు
-
నకిలీ ఇన్వాయిస్ల కట్టడికి బయోమెట్రిక్ అథెంటికేషన్
నకిలీ ఇన్వాయిసింగ్ కేసులను అరికట్టడానికి దేశవ్యాప్తంగా బయోమెట్రిక్ అథెంటికేషన్ విధానాన్ని అమలు చేయనున్నట్లు 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మోసపూరిత ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ లను ఎదుర్కోవడానికి ఆధార్ ఆథెంటికేషన్ దోహదపడుతుందని ఆర్థిక మంత్రి తెలిపారు.మోదీ ప్రభుత్వం 3.0 ఏర్పడిన తర్వాత జరిగిన తొలి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఇదే కావడం గమనార్హం. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.ఆలిండియా ప్రాతిపదికన బయోమెట్రిక్ ఆధారిత ఆధార్ అథెంటికేషన్ వ్యవస్థను దశలవారీగా అమలు చేస్తామని, ఇది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మోసాలను అరికట్టడంలో సహాయపడటంతో పాటు, జీఎస్టీలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను బలోపేతం చేస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. -
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
చైనాకు శత్రువులు ఎక్కడో లేరు. ఆ దేశ యువత రూపంలో ఆ భూభాగంలోనే ఉన్నారు. ఇంతకీ ఏం చేస్తున్నారని అంత మాట అన్నారంటారా?.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వేదికగా తమ దేశం పరువును ఎప్పటికప్పుడు తీసిపారేస్తున్నారు మరి.యుంటాయ్ జలపాతం.. చైనాలోనే అతిపెద్ద జలపాతంగా ఓ రికార్డు ఉంది. దీనిని ఆసియాలోనే అతిపెద్ద వాటర్‌ఫాల్‌గా చైనా ప్రమోట్ చేసుకుంటోంది కూడా. హెనాన్ ప్రావిన్స్‌లో యుంటాయ్ పర్వతాల నడుమ పచ్చని శ్రేణుల్లో సుమారు 314 మీటర్ల(1,030 ఫీట్ల) ఎత్తు నుంచి నీటి ధార కిందకు పడే దృశ్యాలు.. చూపరులను ఎంతో ఆకట్టుకుంటుంది. లక్షల మంది సందర్శకులతో పర్యాటకంగానూ ఈ జలపాతం విశేషంగా నిలుస్తుంటుంది కూడా. అలాంటి జలపాతం విషయంలో షాకింగ్ విషయం వెలుగు చూసిందిప్పుడు. అంత ఎత్తు నుంచి పైపులతో నీటిని కిందకు గుమ్మరిస్తుందనే నిజం బయటపడింది. కొందరు యువకులు.. యుంటాయ్ పర్వత్వాల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లారు. అక్కడ వాళ్లు ఆ పైపుల్ని గమనించి వీడియో తీయడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఇంకేం.. చైనా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో ఈ వీడియో విపరీతంగా చక్కర్లు కొట్టింది. దీంతో యుంటాయ్ జియో పార్క్ నిర్వాహకులు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.Chinese officials have been forced to apologise, after a hiker's video revealed that China's highest waterfall may be supplied by a water pipe.The video, on Douyin app, showed the flow of water from the Yuntai Mountain Waterfall coming from a pipe built into the rock face.🧵1 pic.twitter.com/O8DodMnn1L— BFM News (@NewsBFM) June 7, 2024వర్షాధార జలపాతం అయిన యుంటాయ్కి వేసవి కాలంలో వచ్చిన పర్యాటకుల్ని నిరాశకు గురి చేయడం ఇష్టం లేకనే అక్కడి నిర్వాహకులు ఈ పని చేస్తున్నారంట. అయితే అప్పటికే సోషల్ మీడియా ద్వారా ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసిపోయింది.గతంలో కరోనా టైంలో వైరస్ కట్టడి పేరిట అక్కడి ప్రభుత్వం సాగించిన దమనకాండ గుర్తుండే ఉంటుంది. ఆ టైంలోనూ సోషల్ మీడియా ద్వారా అక్కడి సంగతులు బయటి ప్రపంచానికి తెలిశాయి. అలాగే.. గ్జియాపు కౌంటీ గ్రామం విషయంలోనూ చైనా సృష్టించిన ఫేక్ ప్రపంచం ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసింది. -
TGSRTC ఫేక్ ప్రచారంపై సజ్జనార్ క్లారిటీ
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ పేరును టీజీఎస్సార్టీసీగా మార్చేసింది ప్రభుత్వం. అధికారికంగా బుధవారమే దీనిపై ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడినట్లు సాక్షి సహా పలు మీడియా చానెల్స్ సైతం కథనాలిచ్చాయి. అయితే TGSRTCపై సోషల్ మీడియాలో జరుగుతున్న ఓ ప్రచారాన్ని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఖండించారు. TGSRTC కొత్త లోగో ఇదే నంటూ ఇంటర్నెట్లో ఒకటి వైరల్ అవుతోంది. అయితే ఆ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని సజ్జనార్ స్పష్టత ఇచ్చారు. ‘‘అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదు. టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో ప్రచారంచేస్తోన్న లోగో ఫేక్. .. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. కొత్త లోగోను సంస్థ రూపొందిస్తోంది. కొత్త లోగోను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఇంకా ఫైనల్ చేయలేదు అని సజ్జనార్ ఎక్స్ ద్వారా తెలియజేశారు. #TGSRTC కొత్త లోగో విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదు. టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో ప్రచారంచేస్తోన్న లోగో ఫేక్. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. కొత్త లోగోను సంస్థ… pic.twitter.com/n2L0rezuoo— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) May 23, 2024 అత్యుత్సాహంతో కొన్ని వెబ్సైట్లు అలా లోగోను డిజైన్ చేసి కథనాలిచ్చాయి. దీంతో అదే నిజమైన లోగో అంటూ వైరల్ అయ్యింది. టీజీఎస్సార్టీసీ తాజా ప్రకనటతో కొత్త లొగోను త్వరలోనే అధికారికంగా ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. -
అమెరికా వీసా కోసం ‘దొంగ’ నాటకం, అడ్డంగా బుక్కైన నలుగురు భారతీయులు
అమెరికా వీసా కోసం వింత నాటకంతోఅడ్డంగా బుక్కయ్యారు. నిందితుల్లో నలుగురు భారతీయులతో సహా ఆరుగురు ఉన్నారు. ఇమ్మిగ్రేషన్ వీసాలు పొందేందుకు ఆయుధాలతో దోపిడీల్లో బాధితులుగా కుట్ర పన్నారు. తద్వారా బాధితులు యునైటెడ్ స్టేట్స్కు ఇమ్మిగ్రేషన్ వీసాలు పొందవచ్చని ప్లాన్ వేశారు. చివరికి ఏమైందంటే..కెంటకీలోని ఎలిజబెత్‌టౌన్‌కు చెందిన భిఖాభాయ్ పటేల్, జాక్స్న్కు చెందిన నీలేష్ పటేల్, టెన్నెస్సీ, రవినాబెన్ పటేల్, రేసిన్, విస్కాన్సిన్,ఫ్లోరిడాలోని జాక్సన్విల్లేకు చెందిన రజనీ కుమార్ పటేల్, అమెరికా వీసాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు దశలవారీగా జరిగిన దోపిడీలలో బాధితులుగా నటించారు. తద్వారా మానసిక లేదా శారీరక వేధింపులకు గురైన కొన్ని నేరాల బాధితుల కోసం ఉద్దేశించిన వీసాలు పొందవచ్చని భావించారు. కానీ పోలీసులకు చిక్కారు. చికాగో సెంట్రల్ కోర్టులో ఆరోపణలు నమోదైనాయి. కోర్టు ప్రకటన ప్రకారం, నిందితులు, కొందరు దోపిడీకి గురైన వారి సర్టిఫికేట్ల ఆధారంగా అమెరికా పౌరసత్వం, వీసా సేవలకు నకిలీ U-వీసా దరఖాస్తులను కూడా సమర్పించారు. వీసా దరఖాస్తులో తప్పుడు ప్రకటనలు చేశారని రవీనాబెన్ పటేల్‌పై వేర్వేరుగా ఆరోపణలు వచ్చాయి. ఈ స్కాంలో నలుగురు వ్యక్తులు నయీంకు వేల డాలర్లు చెల్లించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు ఈ నకిలీ దోపిడీ సమయంలో కొందరు వ్యక్తులు ఆయుధాలతో బాధితుల వద్దకు వెళ్లి దోచుకున్నారని కూడా నివేదిక పేర్కొంది. మోసానికి కుట్ర పన్నారనే ఆరోపణలపై నిందితుడికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, వీసా దరఖాస్తులో తప్పుడు ప్రకటనలు చేసిన ఆరోపణలపై 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే నిబంధన ఉందని ఒక ప్రకటన తెలిపింది. -
మంత్రి బొత్సపై చంద్రబాబు కొత్త కుట్ర
విశాఖ సిటీ: టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ఓటమి ఖాయమని తేలిపోవడంతో పోలింగ్‌కు ముందు రోజు చంద్రబాబు కొత్త కుట్రకు తెరతీశారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నట్లు నకిలీ లేఖ సృష్టించారు. బొత్స లెటర్ హెడ్‌పైనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాస్తున్నట్లుగా లేఖను తయారు చేశారు. దాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ అధికార పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు.వైఎస్సార్సీపీ నేతల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే కుట్రకు తెరలేపారు. ఈ కుతంత్రంపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓటమి భయంతో చంద్రబాబు ఇంతటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటువంటి నీచ రాజకీయాలు చంద్రబాబుకు అలవాటే అని మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్‌కు ఫిర్యాదు చేశారు. నకిలీ లేఖను సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులను వెంటనే అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.రోజుకో కుట్ర..ఓటమి ముంగిట నిలిచిన చంద్రబాబు రోజుకో కుట్రతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం చేసిన ప్రతి సంస్కరణ, నిర్ణయంలో లేని వివాదాలు సృష్టిస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు. భూ యజమానులకు మేలు చేసే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించాలని చూశారు. అయినా ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో ఇప్పుడు మంత్రి బొత్స సత్యనారాయణను టార్గెట్ చేశారు. ఆయన వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నట్లు నకిలీ లేఖను సృష్టించారు. -
వైఎస్ విజయమ్మ పేరుతో టీడీపీ తప్పుడు లేఖ
విశాఖపట్నం: ఎన్నికల్లో ఓడిపోతున్నామనే నిస్పృహతో టీడీపీ నీచపు పనులకు పాల్పడుతోందని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మండిపడ్డారు. వైఎస్ విజయమ్మ రాసినట్టుగా టీడీపీ ఒక లేఖను సృష్టించి.. దాన్ని అడ్డుపెట్టుకుని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసి బురదజల్లుతోందని తెలిపారు.ఆ లేఖలో ఉపయోగించిన భాషను చూస్తే అది ఫేక్ అన్న సంగతి అందరికీ అర్థం అవుతోందని తెలిపారు. ఓడిపోతున్నామనే ఉక్రోషంతో టీడీపీ ఇలాంటి తప్పుడు పనులు చేస్తోందని విమర్శించారు. టీడీపీ ఫేక్ ప్రచారాలను ప్రజలు తిప్పికొడుతున్నారని తెలిపారు. విజయమ్మ పేరిట లేఖను సృష్టించి సర్క్యులేట్ చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరతామని ఆయన తెలిపారు. -
బెంగళూరులో నయా స్కాం.. ఫేక్ స్క్రాచ్ కార్డ్‌తో రూ.18 లక్షలు దోపిడీ
డిజిటలైజేషన్ అనేక మార్పులు తీసుకొచ్చింది. మనిషి జీవితాన్ని సులభతరం చేసింది. కానీ దానికి పెరుగుతున్న ఆదరణతో పాటు, నేరాలు, మోసాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. సామాన్యులను దోపిడీ చేసేందుకు స్కామర్లు కొత్త ట్రిక్స్‌ను ఉపయోగిస్తున్నారు.బెంగళూరులో కొత్త స్కామ్ బయటపడింది. డెక్కన్ హెరాల్డ్ కథనం ప్రకారం.. అన్నపూర్ణేశ్వరి నగర్‌కు చెందిన 45 ఏళ్ల మహిళ ఈ మోసానికి గురై రూ. 18 లక్షలు పోగొట్టుకుంది. ఈ స్కామ్‌లో మోసగాళ్లు ప్రసిద్ధ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల పేరుతో స్క్రాచ్ కార్డ్‌లను పంపుతారు. ఈ మహిళకు కూడా ఈ-కామర్స్ వెబ్సైట్ మీషో నుంచి పంపుతున్నట్లుగా స్క్రాచ్ కార్డ్ పంపారు.ఆమె కార్డును స్క్రాచ్ చేయగా, ఆమె 15.51 లక్షల రూపాయలను గెలుచుకున్నట్లు వచ్చింది. ఆమె బహుమతిని క్లెయిమ్ చేయడానికి అందించిన నంబర్‌ను వెంటనే సంప్రదించింది. అవతలి వైపు వ్యక్తి స్క్రాచ్ కార్డ్ ఫోటోలు, గుర్తింపు రుజువును కోరారు. వారు చెప్పినట్లే ఆమె వివరాలను అందించింది. ఆ తర్వాత కర్ణాటకలో లాటరీ టిక్కెట్ల అక్రమం కారణంగా 30 శాతం పన్నులు ముందుగా చెల్లించాలని కేటుగాళ్లు ఆమెను నమ్మించారు. దీంతో బాధితురాలు ఫిబ్రవరి, మే మధ్య అనేకసార్లు మొత్తం రూ. 18 లక్షలు ఆర్టీజీఎస్ ద్వారా బదిలీ చేసింది. అయితే ఆ తర్వాత ఆమెకు తదుపరి సమాచారం అందకపోవడంతో, తాను మోసపోయానని గ్రహించి, పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టం, ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
చంద్రబాబు కోసం ఇంతలా దిగజారాలా పీవీ రమేష్..?
సాక్షి, కృష్ణా: చంద్రబాబు కోసం ఇంతలా దిగజారాలా అంటూ రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్‌పై మాజీ మంత్రి పేర్నినాని ధ్వజమెత్తారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి పచ్చ మీడియా సరిపోవన్నట్లు మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా చంద్రబాబు జత కట్టుకుంటున్నారని మంపడిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విపరీతమైన విషం చిమ్మి కుట్రతో అధికారంలోకి రావాలని చంద్రబాబు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడని నిప్పులు చెరిగారు.మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల తన పొలం మ్యుటేషన్ జరగట్లేదని చేసిన ట్వీట్‌ను ప్రస్తావించారు. పెద్ద పెద్ద చదువులు చదువున్న మీరు ఇంత అసహ్యంగా, దిగజారి మీరు ప్రవర్తించాలా? అని ప్రశ్నించారు. పీవీ రమేష్‌ది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం విన్నకోట గ్రామమమని తెలిపారు. ఈ గ్రామంలో తన తండ్రి పేరుపై ఉన్న పొలం తన పేరుపైకి మార్చడం లేదంటూ అన్యాయంగా, కిరాతకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రమేష్ తండ్రి సుబ్బారావు మాస్టారుతో పాటు అదే గ్రామంలో ఉన్న ఇతర ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కుటుంబాలు, స్థానికులు మొత్తం కలిసి 25 ఎకరాల భూమిని కొని చెరువును తవ్వారని చెప్పారు.25 మంది కలిసి 70 ఎకరాలు కొని దానిలో ఒక చెరువు తవ్వి లీజుకు ఇస్తూ వస్తున్నారన్నారు పేర్ని నాని. ఏడాది క్రితం రమేష్ తండ్రి సుబ్బారావు మరణించారని, ఆయన మరణించిన తర్వాత రమేష్ మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేశారని, అప్పటి నుంచీ విచారణలు జరుగుతున్నాయని చెప్పారు. గాలంకి నాగేంద్ర అనే వ్యక్తి కూడా ఈ చెరువులో భాగస్వామి. ఆయనకు, రమేష్‌కు కోర్టులో కేసులు నడుస్తున్నాయని తెలిపారు.వివాదాల వల్లే..ఆ చెరువులో వీళ్లకి సంబంధించిన పొలం ఎంతో కొంత ఉంది.దీనికోసమే జనవరి నెలలో జాయింట్ కలెక్టర్, ఆర్డీవోలు అక్కడ విచారణ నిర్వహించారు. ఆ విచారణకు అందరు రైతుల్ని ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకుని రమ్మని చెప్పారు. అయితే పీవీ రమేష్ మాత్రం తన గుమస్తాకు ఫోటోస్టాట్ కాపీలిచ్చి పంపారట. ఫోటోస్టాట్ కాదు..ఒరిజినల్స్ పంపండి అని చెప్పారు. ఆయన రాడు..సరే గుమస్తాను పంపినా ఒరిజినల్స్ కావాలి కదా?క్కడ ఉన్న వివాదాన్ని తీర్చడం కోసమే మూడు నెలలుగా ఆ చెరువును అధికారులు ఎండబెడుతున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత సరిహద్దులు ఫిక్స్ చేసి ఎవరి భూమి వారికి ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.ఇంత కథ నడుస్తుంటే ఇంత విషం చిమ్మడం ధర్మమా పీవీ రమేష్?మీ వివాదానికి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధం ఏమిటి?అక్కడున్న రైతులందరికీ, మీకు తగాదా ఉండటం ఏంటి? అక్కడున్న ల్యాండ్ కన్నా మీరు అదనంగా లీజు పొందుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.ఎవరి పొలం ఎక్కడో కూడా తెలియని పరిస్థితి. చెరువు పూర్తిగా ఎండిపోయిన తర్వాత కదా కొలతలు వేసి ఎవరి హద్దు ఏంటో చెప్పేది?.ఎటువంటి వివాదం లేకపోతే, అది వ్యవసాయ భూమి అయి హద్దులు క్లియర్‌గా ఉంటే..ప్రభుత్వాన్ని విమర్శించినా ఒక అర్ధం ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు మీ పొలానికి సంబంధం ఏంటి?చంద్రబాబు పంచన చేరి ఐఏఎస్ చదువుకుని పచ్చిగా రాజకీయాల కోసం దిగజారడం అవసరమా? చంద్రబాబు కోసం మీరు ఏ డాన్స్ కట్టమంటే ఆ డాన్స్ కడుతున్నారు. ఏ ట్వీట్ చేయమంటే ఆ ట్వీట్ చేస్తున్నారు. చంద్రబాబుకు అధికారం సంపాదించడం కోసం మీరు ఇలా తప్పుడు ప్రకటనలు చేసి జగన్‌గారి ప్రభుత్వంపై విషం చిమ్మడం దుర్మార్గమైన చర్య. మీరు విన్నకోట గ్రామం రండి.. అక్కడేం జరుగుతుందో చూడండి.మీ కోసమే.. ఆ వివాదం తేల్చడం కోసమే మూడు నెలలుగా వీఆర్వోలను కాపలా పెట్టి మరీ చెరువును కాళీ చేయిస్తున్నారు.పోలింగ్ అయిన తర్వాత వచ్చి సర్వే చేస్తామని రైతులకు, మీ గుమస్తాకి కూడా సమాచారం అందించారు. ఆ చెరువు మధ్యలోనే ఆవుల దొడ్డి కింద ఓ 3.5 ఎకరాల వివాదాస్పద భూమి కూడా ఉంది. మీతో ఉన్న ఆ 25 మంది రైతులు కూడా ఆ ఆవుల దొడ్డి భూమి మాదంటే మాది అని క్లెయిమ్ చేస్తున్నారు.ఇలాంటి చరిత్ర కలిగిన భూమిని మీ నాన్నగారు మీకు అప్పజెప్పారు.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల నాకు మ్యుటేషన్ అవ్వడం లేదని ఇంతగా దిగజారడం అవసరమా? ’ అని మండిపడ్డారు పేర్ని నాని. -
ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేష్.. టీడీపీ ఫేక్ ప్రచారంపై సీఐడీ విచారణ
సాక్షి, విజయవాడ: టీడీపీ ఫేక్ ప్రచారంపై సీఐడీ విచారణ చేపట్టింది. చంద్రబాబు ఏ1గా, లోకేష్ ఏ2గా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై ఐవీఆర్ఎస్ కాల్స్‌తో టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. టీడీపీ అసత్య ప్రచారంపై వైఎస్సార్సీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది.ఈసీ ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీ.. విచారణ చేపట్టింది. చంద్రబాబు, లోకేష్‌తో పాటు 10 మందిపై కేసు నమోదు చేసింది. ఐవీఆర్ఎస్ కాల్స్ చేసిన ఏజెన్సీలపైనా కేసు నమోదైంది.కాగా, ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ తప్పుడు సమాచారంతో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారం మీద ఎన్నికల సంఘం (ఈసీ) కొరడా ఝళిపించింది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఏప్రిల్ 29న ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన ఈసీ టీడీపీ దుష్ప్రచారంపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని, అలా తీసుకున్న చర్యలపై తక్షణం నివేదిక ఇవ్వాలని మంగళగిరి సీఐడీ (సైబర్ సెల్) అడిషనల్ డీజీకి అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎంఎన్ హరీంధర ప్రసాద్ ఆదేశించారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారంతో దురుద్దేశపూర్వకంగా లాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై ఐవీఆర్ఎస్ కాల్స్‌తో పాటు సామాజిక మాధ్యమాల్లో టీడీపీ ప్రచారం చేస్తోందంటూ వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. ఇందుకు తగిన ఆధారాలనూ సమర్పించింది.వివిధ ప్రాంతాల నుంచి వేర్వేరు నెంబర్ల ఐవీఆర్ కాల్స్ వస్తున్నాయని.. వాటిని లిఫ్ట్ చేయగానే.. ‘వైఎస్ జగన్ అధికారంలోకొస్తే మీ భూములు మీ పేరు మీద ఉండవు, జగన్ కాజేస్తాడు, ఒరిజినల్స్ ఆయన దగ్గర ఉంచుకుంటాడు, మీకు జిరాక్స్ కాపీలు వస్తాయి, కాబట్టి జగన్‌కు ఓటు వేయకుండా తెలుగుదేశంకు ఓటు వేయండి’.. అంటూ రికార్డ్ మెసేజ్‌లు వస్తున్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.వీటికి సంబంధించిన వాయిస్ రికార్డులను వైఎస్సార్సీపీ ఈసీకి ఆధారాలుగా సమర్పించింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల సంఘం ఆమోదంలేకుండా ఎలాంటి ప్రచారం చేయడానికి వీల్లేదని.. కానీ ఎటువంటి అనుమతుల్లేకుండా వివిధ చోట్ల నుంచి కాల్స్‌చేస్తూ ఇలా ప్రచారం చేయడం ఉల్లంఘన కిందకే వస్తుందని.. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీచేసింది.ఎన్నికల సమరంలో అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు ఉండేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంటుందని, ఈ విధంగా చట్టాలపై తప్పుడు సమాచారంతో దుష్ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలను రేకెత్తిస్తున్న టీడీపీపై తక్షణం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ తన ఫిర్యాదులో కోరింది -
ఫేక్ ఉబర్ డ్రైవర్ల హల్ చల్..
అమెరికాలో అత్యంత రద్దీగా ఉండే అట్లాంటా ఎయిర్పోర్ట్ దగ్గర ఉబర్, లిఫ్ట్ వంటి రైడ్ షేర్ల పేరుతో ఫేక్ రైడ్ డ్రైవర్లు హల్చల్ చేస్తున్నారు. వీరు ప్రయాణికులను మోసగిస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రైడ్‌షేర్ డ్రైవర్ల ముసుగులో ప్రయాణికులను మోసగిస్తున్న ఫేక్ రైడ్ డ్రైవర్లను స్థానిక వార్తా సంస్థ 11అలైవ్ గుర్తించింది. ఈ మోసగాళ్లు తక్కువ రేట్లను రైడ్లను అందిస్తారు. వివిధ చెల్లింపు పద్ధతులను అంగీకరిస్తారు. అయితే వారికి డబ్బు కంటే కూడా మానవ అక్రమ రవాణా వంటి వేరే అక్రమ ఉద్దేశాలు ఉండవచ్చు. ఈ వ్యవహారంపై అట్లాంటా పోలీస్ డిపార్ట్మెంట్ రహస్య ఆపరేషన్ చేపట్టింది. ప్రయాణికులను మోసగిస్తున్న పలువురు ఫేక్ డ్రైవర్లను అరెస్టు చేసింది. అయినప్పటికీ వీరి ఆగడాలు తగ్గడం లేదు. తొందరలో ఉండే ప్రయాణికులే లక్ష్యంగా వీళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. అధికారిక యాప్‌ల ద్వారా తమ రైడ్‌షేర్ ఏర్పాట్లను నిర్ధారించుకోవాలని, నిర్దేశించిన ప్రాంతాల్లో మాత్రమే డ్రైవర్లను కలవాలని అధికారులు ప్రయాణికులకు సూచిస్తున్నారు. దీంతోపాటు పికప్ చేసుకునేందుకు వచ్చిన వ్యక్తి పేరు తెలుసుకుని నిర్ధారించుకోవాలని సలహా ఇస్తున్నారు. -
కూల్ డ్రింక్స్ తెగ తాగేస్తున్నారా? ఈ వీడియో చూడండి!
సమ్మర్ వచ్చేసింది...ఎండలు మండిపోతున్నాయని కూల్ డ్రింక్స్ తెగ తాగేస్తున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. కల్తీ కోకా కోలా డ్రింక్ బాటిల్స్ వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. (ఎనిమిదేళ్లకే పెళ్లి..బడి గుమ్మం తొక్కలేదు : అయితేనేం ఆమె ఒక లెజెండ్!) ఈ వీడియో ప్రకారం కోకా కోలా లేబుల్స్ వేసిన ప్లాస్టిక్ బాటిల్స్‌లో ఒక వ్యక్తి డ్రింక్‌ను నింపుతున్న దృశ్యాలను ఇందులో చూడొచ్చు.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇదేందిరా ఇది.. ఎపుడు చూడలే అంటూ ఒకింత ఆందోళనగా కమెంట్స్ చేస్తున్నారు. (వేసవిలో చల్ల చల్లగా : గోండ్ కటీరా జ్యూస్.. ఒక్కసారి తాగితే..!) ఈ కోకాకోలా ఫ్యాక్టరీలో తయారైనా ఒకటే, బాత్ రూంలో తయారైనా ఒకటి పెద్దగా తేడా ఏముంది అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. మరికొంతమంది దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కోకాకోలాను ట్యాగ్‌ను గమనార్హం. అయితే ఈ వీడియో ఎక్కడిది? ఏ ప్రదేశానికి చెందినది అనే వివరాలు అందుబాటులో లేవు. మరి ఈ వీడియోపై కోకా కోలా కంపెనీ ఎలా స్పందిస్తుందో చూడాలి. (లగ్జరీ బంగ్లాను విక్రయించిన ఇషా అంబానీ? ఎవరు కొన్నారు? ) A forward doing the rounds. Things get ...... With @CocaCola pic.twitter.com/vAhxcDhb1F — R. Balakrishnan (@BalakrishnanR) March 29, 2024 -
నకిలీ మందుల ముఠా గుట్టు రట్టు!
దేశరాజధాని ఢిల్లీలో నకిలీ మందులను తయారు చేస్తున్న అంతర్జాతీయ ముఠా వ్యవహారం వెలుగు చూసింది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసులో ప్రముఖ క్యాన్సర్ ఆసుపత్రికి చెందిన ఇద్దరు ఉద్యోగులతో సహా ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు రూ.1.96 లక్షల విలువైన క్యాన్సర్‌కు సంబంధించిన నకిలీ ఇంజెక్షన్లను విక్రయించారు. చైనా, అమెరికా తదితర దేశాలకు కూడా వీరు క్యాన్సర్ నకిలీ మందులను పంపారు. నిందితుల వద్ద నుంచి రూ.4 కోట్ల విలువైన రూ.89 లక్షల నగదు, రూ.18 వేల డాలర్లు, ఏడు అంతర్జాతీయ, రెండు భారతీయ బ్రాండ్లకు చెందిన క్యాన్సర్ నకిలీ మందులను క్రైమ్ బ్రాంచ్ స్వాధీనం చేసుకుంది. స్పెషల్ సీపీ క్రైమ్ బ్రాంచ్ షాలినీ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం మూడు నెలల విచారణ అనంతరం పోలీసుల దర్యాప్తు బృందం ఈ ముఠాను పట్టుకోగలిగింది. ఈ కేసులో దర్యాప్తు కోసం పోలీసుల బృందం ఢిల్లీ ఎన్సీఆర్లో ఏకకాలంలో ఎనిమిది చోట్ల దాడులు చేసింది. విఫిల్ జైన్ నకిలీ మందుల రాకెట్‌కు సూత్రధారిగా వ్యవహరించాడని పోలీసులు తెలిపారు. ఇతనికి చెందిన ఇళ్ల నుంచి మూడు క్యాప్ సీలింగ్ మిషన్లు, ఒక హీట్ గన్ మెషీన్ మొదలైనవాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని క్యాన్సర్ ఆస్పత్రికి చెందిన ఉద్యోగులు కోమల్ తివారీ, అభినయ్ కోహ్లీలను కూడా ఈ కేసులో అరెస్టు చేశారు. -
ఫేక్ ఐడీలతో టీడీపీ పోస్టింగ్‌లు
సాక్షి ప్రతినిధి, కడప/సాక్షి, హైదరాబాద్: తెర వెనుక టీడీపీ కుట్రలు బహిర్గతమయ్యాయి! కుట్రపూరితంగా పోస్టింగ్‌లు చేస్తూ బురద చల్లేందుకు ఎల్లో గ్యాంగ్ చేసిన యత్నాలు వెలుగులోకి వచ్చాయి. వైఎస్సార్ జిల్లా పులివెందుల నివాసి వర్రా రాఘవరెడ్డి దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. జనవరి 26వతేదీ నుంచి తన పేరుతో కొందరు ఫేక్ ఐడీ సృష్టించి పోస్టులు పెడుతున్నట్లు గుర్తించిన ఆయన 28న పులివెందుల ఎస్ఐ అరుణ్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఏపీ పీసీపీ చీఫ్ షర్మిలను అసభ్యంగా దూషిస్తూ ఫేక్ ఐడీ ద్వారా పోస్టులు చేస్తున్నారని, ఫేక్ ఐడీని ట్రేస్ చేయాలని రాఘవరెడ్డి కోరారు. ఇదే విషయంపై జనవరి 31న వైఎస్సార్ జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌కు కూడా ఫిర్యాదు చేశారు. కాగా మాజీ మంత్రి వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత తమను చంపేందుకు కుట్ర చేస్తున్నారని, ఏపీ పీసీసీ అధ్యక్షురాలిని దూషిస్తున్నారని వర్రా రాఘవరెడ్డి పేరుతో ఉన్న ఫేక్ ఐడీ వివరాలను హైదరాబాద్ పోలీసులకు అందచేశారు. తన పేరుతో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి తప్పుడు పోస్టులు ఫేస్బుక్లో పోస్టు చేయడం వెనుక ఐ– టీడీపీ శ్రేణులున్నాయని వర్రా రాఘవరెడ్డి ‘సాక్షి’ ప్రతినిధితో పేర్కొన్నారు. ఇలాంటి పోస్టులను ముందే పసిగట్టిన తాను ఇప్పటికే ఏపీ పోలీసులను విచారించాలని కోరినట్లు తెలిపారు. బెదిరింపులు పెరిగాయి: సునీత మాజీ మంత్రి వైఎస్ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత తనకు ప్రాణహాని ఉందంటూ శుక్రవారం హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘ఇద్దరినీ చంపేస్తాం..’ అనే అర్థం వచ్చేలా గుర్తు తెలియని వ్యక్తులు ఫేస్బుక్ ద్వారా పోస్టులు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల ఈ తరహా బెదిరింపులు ఎక్కువయ్యాయని, పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ శిల్పవల్లి దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
దిల్ రాజు అంటే బ్రాండ్ ఎవ్వరినీ వదలను
-
29,273 బోగస్ కంపెనీలు.. రూ. 44,015 కోట్లు కొట్టేసేందుకు పన్నాగం!
నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) క్లెయిమ్‌లకు పాల్పడిన వేలాది బోగస్ కంపెనీలను జీఎస్టీ అధికారులు గుర్తించారు. 2023 డిసెంబర్ వరకు ఎనిమిది నెలల్లో రూ. 44,015 కోట్ల క్లెయిమ్‌లకు పాల్పడిన 29,273 బోగస్ సంస్థలను జీఎస్టీ అధికారులు గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ప్రభుత్వానికి 4,646 కోట్లు ఆదా అయినట్లు పేర్కొంది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో దాదాపు రూ.12,036 కోట్ల ఐటీసీ ఎగవేతలకు పాల్పడిన 4,153 బోగస్ సంస్థలను గుర్తించగా వీటిలో 2,358 బోగస్ సంస్థలను కేంద్ర జీఎస్టీ అధికారులు గుర్తించారు. 926 బోగస్ కంపెనీల గుర్తింపుతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా రాజస్థాన్ (507), ఢిల్లీ (483), హర్యానా (424) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. డిసెంబరు త్రైమాసికంలో బోగస్ కంపెనీలను గుర్తించడం ద్వారా రూ. 1,317 కోట్లు దుర్వినియోగం కాకుండా అడ్డుకోగలిగారు. ఈ కేసుల్లో 41 మందిని అరెస్టు చేయగా, వీరిలో 31 మందిని సెంట్రల్ జీఎస్టీ అధికారులు అరెస్టు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘2023 మే నెల మధ్యలో నకిలీ రిజిస్ట్రేషన్లపై స్పెషల్ డ్రైవ్ ప్రారంభించినప్పటి నుంచి రూ. 44,015 కోట్ల అనుమానిత ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ITC) ఎగవేతకు పాల్పడిన మొత్తం 29,273 బోగస్ సంస్థలను గుర్తించాం. దీని వల్ల రూ. 4,646 కోట్లు ఆదా అయ్యాయి. ఇప్పటి వరకు 121 మందిని అరెస్టు చేశాం’ అని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. -
55.5 లక్షల ఫేక్ మొబైల్ కనెక్షన్లు.. ప్రభుత్వం ఏం చేసింది?
దేశవ్యాప్తంగా 55.5 లక్షల ఫేక్ మొబైల్ కనెక్షన్లను కేంద్ర ప్రభుత్వం గుర్తించి తొలగించింది. టెక్నాలజీ వినియోగం పెరుగుతున్నకొద్దీ దాని దుర్వినియోగం, సైబర్ మోసాలు సైతం అదే స్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి. దీన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పడు చర్యలు తీసుకుంటోంది. టెలికాం వినియోగదారుల భద్రతకు సంబంధించి తీసుకున్న చర్యలను కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంటుకు తెలియజేసింది. నకిలీ, ఫోర్జరీ ధ్రువపత్రాలతో పొందిన మోసపూరిత మొబైల్ కనెక్షన్లను గుర్తించి తొలగించడానికి ప్రత్యేక వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు పేర్కొంది. రాజ్యసభ సభ్యుడు సుశీల్ కుమార్ మోదీ అడిగిన ప్రశ్నకు కేంద్ర టెలికాం, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిస్తూ వినియోగదారులు తమ పేరుతో జారీ అయిన అన్ని మొబైల్ కనెక్షన్లను సరిచూసుకుని మోసపూరితమైన, అవసరం లేని కనెక్షన్లను నివేదించడానికి అనుమతించే సంచార్ సాథీ పోర్టల్‌ను రూపొందించినట్లు వివరించారు. మొబైల్ కనెక్షన్లను విక్రయించేందుకు ఇప్పటికే ఉన్న కేవైసీ మార్గదర్శకాలను మరింత బలోపేతం చేస్తూ టెలికాం కంపెనీలకు సూచనలిచ్చినట్లు చెప్పారు. 55.5 లక్షల మొబైల్ కనెక్షన్ల తొలగింపు అంతేకాకుండా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సాయంతో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి నవంబర్ మధ్య కాలంలో ఎస్సెమ్మెస్ ఆధారిత సైబర్ మోసాలను 36 శాతం కట్టడి చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ప్రభుత్వ తీసుకున్న చర్యల ఫలితంగా సుమారు 4 లక్షల మంది పౌరులు సైబర్ నేరగాళ్ల బారినపడి మోసపోకుండా రూ. 1,000 కోట్లకు పైగా రక్షణ కల్పించినట్లు పేర్కొన్నారు. ఇక నకిలీ గుర్తింపు పత్రాలతో పొందిన అలాగే 55.5 లక్షల మొబైల్ కనెక్షన్లు తొలగించినట్లు వివరించారు. వీటిలో బ్యాంక్‌లు, పేమెంట్ వాలెట్లకు లింక్ అయిన మొబైల్ కనెక్షన్లు 9.8 లక్షలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే వినియోగదారులు నివేదించిన 13.4 లక్షల అనుమానిత మొబైల్ కనెక్షన్లు రీ వెరిఫికేషన్‌లో విఫలమవడంతో డిస్కనెక్ట్ చేసినట్లు చెప్పింది. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు నివేదించిన ప్రకారం సైబర్ క్రైమ్, ఆర్థిక మోసాలకు పాల్పడినందుకు మొత్తం 2.8 లక్షల మొబైల్ కనెక్షన్లు తొలగించడంతోపాటు 1.3 లక్షల మొబైల్ ఫోన్లను బ్లాక్ చేసినట్లు కేంద్ర అశ్వని వైష్ణవ్ పేర్కొన్నారు. -
నకిలీ సీఎంఓ అధికారి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి (సీఎంఓ) అని ప్రచారం చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను ఎల్బీనగర్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలికి చెందిన ప్రవీణ్ సాయి బీటెక్ పూర్తయ్యాక హైదరాబాద్‌కు వచ్చి, వనస్థలిపురంలో ఉంటున్నాడు. స్థానికంగా ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంటెక్‌లో చేరాడు. విలాసవంతమైన జీవనానికి అలవాటు పడిన ప్రవీణ్ సాయి అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఏడాది కాలంగా సీఎంఓ అధికారిగా ప్రచారం చేసుకుంటూ అమాయకులను మోసం చేయడం ప్రారంభించాడు. మంత్రులు, ఎమ్మెల్యేలతో సత్సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేసుకొని, డబుల్ బెడ్రూం ఇళ్లు, స్థలాలు ఇప్పిస్తానని అమాయకులను మోసం చేసేవాడు. మంత్రులు, ఎమ్మెల్యేల నకిలీ లెటర్ హెడ్లతో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులు, యువత నుంచి పెద్దఎత్తున డబ్బు వసూలు చేశా డు. నకిలీ ఎన్ఓసీలు, ల్యాండ్ డాక్యుమెంట్లు సృష్టించి స్థలాలు విక్రయించేవాడు. బేగంపేటలో పలువురు బాధితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తానని రూ.లక్షల్లో వసూలు చేశాడు. ఈ కేసులో ప్రవీణ్ సాయి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉండటంతో గతంలో∙ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. రూ.30 కోట్ల భూ సెటిల్మెంట్లో.. అబ్దుల్లాపూర్‌మెట్‌లో రూ.30 కోట్లు విలువ చేసే భూమి సెటిల్మెంట్ చేయిస్తానని చెప్పి, బాధితుడితో రూ.12 కోట్లకు ఒప్పందం చేసుకున్నాడు. అడ్వాన్స్‌గా రూ.8 లక్షలు తీసుకొని, బాధితుడిని ఆ ల్యాండ్‌లో నిలబెట్టి ఫొటోలుతీసి బోర్డు కూడా పాతాడు. కొద్దిరోజుల తర్వాత ఆ ప్రాంతానికి వెళ్లిన బాధితుడు ఆ స్థలంలో బోర్డు లేకపోవడంతో అనుమానం కలిగింది. వెంటనే ప్రవీణ్ సాయికి ఫోన్ చేయగా పొంతనలేని సమాధానం చెప్పడంతో మోసపోయానని గ్రహించి అబ్దుల్లాపూర్‌మెట్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం నిందితుడు అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం రాగా.. వెంటనే అరెస్టు చేశారు. -
‘ఈనాడు’ అవాస్తవ ఆరోపణలు
సాక్షి, అమరావతి: ఏజెన్సీలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గర్భిణుల వసతి గృహాల నిర్వహణపై గురువారం ఈనాడు పత్రికలో ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవమని వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. వసతి గృహాలకు గర్భిణులు ప్రసవ సమయానికి 7 రోజుల ముందు చేరుకుంటారని.. వారికి రోజుకు రూ.300 ఖర్చుతో ఉచిత ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపింది. సాలూరు పరిసర ప్రాంతాల్లోని గర్భిణుల కోసం సాలూరులో వసతి గృహం ఏర్పాటు చేశారని, ఇందులో సేవలందించేందుకు ఏఎన్ఎంలను నియమించారని పేర్కొంది. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో గుమ్మ లక్ష్మీపురంలోనూ ఓ వసతి గృహం ఉందన్నారు. ఈ రెండింటి నిర్వహణ కోసం 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,50,500 నిధులు అందించామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ.3,75,000 అందించామని తెలిపింది. రాష్ట్రంలో గర్భిణుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో జనని శిశు సురక్షా కార్యక్రమం కింద గర్భిణులకు ఉచిత వైద్య సేవలు, మందులు, వైద్య పరీక్షలు, రక్త మార్పిడి, ఆహారం, రిఫరల్, రవాణా ఖర్చుల నిమిత్తం అన్ని ప్రభుత్వ వైద్యశాలలకు రూ.29.09 కోట్లు విడుదల చేశామని తెలిపింది. దీంతోపాటు గర్భిణులకు 108 అంబులెన్స్‌లు, వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల ద్వారా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొంది. -
నిత్యానంద కైలాసతో ఒప్పందాలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
బ్యూనస్ ఎయిర్: నిత్యానంద ప్రకటించుకున్న 'యునైటెట్ స్టేట్స్ ఆఫ్ కైలాస' ప్రత్యేక దేశంతో ఒప్పందం చేసుకున్నందుకు పరాగ్వే దేశ అధికారి తన పదవిని కోల్పోయాడు. దక్షిణ అమెరికన్ ఐస్‌ల్యాండ్‌గా పేర్కొని నిత్యానంద కైలాస దేశం నుంచి కొంత మంది అధికారులు తనను మోసం చేసినట్లు ఆ పరాగ్వే అధికారి చెప్పారు. ఆర్నాల్డ్ చమోర్రో వ్యవసాయ మంత్రిత్వ శాఖలో ప్రధాన అధికారిగా పనిచేస్తున్నారు. దక్షిణ అమెరికన్ ఐస్‌ల్యాండ్‌గా పేర్కొని నిత్యానంద కైలాస దేశం నుంచి కొంత మంది అధికారులు తన వద్దకు వచ్చారు. కైలాసతో దౌత్య సంబంధాలు, పరస్పర సహకారానికి సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేయించుకున్నారు. అంతేకాకుండా కైలాసకు ఐక్యారాజ్య సమితి గుర్తింపు తెప్పించడానికి సంబంధించిన పత్రాలపై కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. పరాగ్వే వ్యవసాయ మంత్రి కార్లోస్ గిమెనేజ్ను కూడా కలిశారు. నిత్యానంద దేశంతో ఒప్పందం వ్వవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పరాగ్వేలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌లో వివిధ కేసుల్లో నిందితునిగా ఉన్న నిత్యానందతో ఒప్పందం చేసుకోవడాన్ని ప్రజలు ప్రశ్నించారు. ఇక చేసేదేమి లేక ఒప్పందాలపై సంతకాలు చేసిన వ్యవసాయ శాఖ అధికారి రాజీనామా చేశారు. ఇదీ చదవండి: యూపీ అబ్బాయి.. డచ్ అమ్మాయి.. ఖండాంతరాలు దాటిన ప్రేమ -
రైళ్లలో నకిలీ టీసీలు
చీరాల: రైళ్లలో దోపిడీ దొంగలే కాదు.. టీసీల పేరుతో కొత్త రకం దోపిడీలకు పాల్పడుతున్నారు. టికెట్ లేని ప్రయాణికులు, రిజర్వేషన్ స్లీపర్, ఏసీ బోగీల్లో అనుమతి లేకుండా ఎక్కిన వారే వీరి టార్గెట్. మెడలో ఒక నకిలీ రైల్వే ఐడీ కార్డు, నకిలీ రశీదు బుక్‌తో చూడడానికి నిజమైన టికెట్ కలెక్టర్లా మాట్లాడుతూ టికెట్ తీసుకోని ప్రయాణికులకు జరిమానాలు విధిస్తూ కొత్త రకం దోపిడీకి పాల్పడుతున్నారు. వీరందరూ విజయవాడ నుంచి నెల్లూరు వరకు రైళ్లలో సంచరిస్తూ ముందస్తుగా అనుకున్న రైళ్లలోనే వెళుతుంటారు. ఎవరికీ అనుమానం రాకుండా ప్రవర్తిస్తూ జరిమానాలు విధిస్తూ అడ్డంగా దోచుకుంటున్నారు. అతడే కీలకం బాపట్ల జిల్లా భట్టిప్రోలుకు చెందిన ఉప్పు సాయి ప్రసాద్ తెనాలిలో ఉంటున్నాడు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్మరానికి చెందిన జి.గణేష్, వరంగల్ జిల్లా నెక్కొండ మండలం గొడ్లకొండ గ్రామానికి చెందిన బొంతా కళ్యాణ్, మహబూబాబాద్ జిల్లా నెల్లికోడూరు మండలం పెద్దతండాకు చెందిన బి.ప్రవీణ్ వద్ద లక్ష రూపాయలు తీసుకుని నకిలీ పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వడమే కాకుండా వారిని తనతో ఉంచుకుని విజయవాడ– నెల్లూరు మధ్య రైళ్లలో టీసీలుగా అవతారమెత్తించాడు. రోజూ అతడే డ్యూటీలు వేయించి ఏ రైలు ఎక్కాలో చెప్పేవాడు. రైళ్లలో టికెట్ లేనివారిని గుర్తించి వారి నుంచి జరిమానాలు వసూలు చేయించేవాడు. జరిమానాల సొమ్మును భారీగా తీసుకునేవాడని తెలిసింది. ముందుగా అనుకున్న రైళ్లలోనే టీసీలుగా వెళ్లి టికెట్ తీసుకోని ప్రయాణికుల వద్ద నుంచి జరిమానాలు వసూలు చేస్తున్నారు. విజయవాడ నుంచి నెల్లూరు రైల్వేస్టేషన్ల మధ్య అనుకున్న రైల్వేస్టేషన్లలో దిగి మరో రైలు ఎక్కుతూ జరిమానాలు విధిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో చీరాలకు వచ్చిన వారు చీరాల రైల్వేస్టేషన్లో అసలు టీసీకి దొరికిపోయారు. టీసీలా వ్యవహరిస్తున్న వారిపై అనుమానం రావడంతో ముగ్గురిని జీఆర్పీ పోలీసులకు అప్పగించారు. దీంతో జీఆర్పీ పోలీసులు విచారించగా సాయి ప్రసాద్ బాగోతం బయటపడింది. సాయి ప్రసాద్ వలే విజయవాడలో ఇదే తరహాలో మరో వ్యక్తి దందా సాగిస్తున్నట్లు బాధితులు తెలిపారు. ఈ విషయమై జీఆర్పీ ఎస్ఐ కొండయ్యను ‘సాక్షి’ వివరణ కోరగా పట్టుబడిన ముగ్గురు మైనర్లు కావడంతో వారికి 41 నోటీసులిచ్చినట్టు తెలిపారు. వ్యవహారంపై విచారణ జరుగుతోందని, దర్యాప్తు పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. -
ఇంటర్నెట్ ను ముంచెత్తుతున్న డీప్ ఫేక్ లు
-
ఫేస్బుక్ యాడ్స్‌లో ఫేక్ లోన్‌యాప్స్ నమ్మి మోసపోవద్దని
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ మోసాలకు తెరతీసేందుకు సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుకుతున్నారు. తాజాగా ఫేక్ లోన్ యాప్‌లను ఫేస్బుక్లో యాడ్స్ రూపంలో పంపుతున్నట్లు సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫేస్బుక్లో వచ్చే ఆన్లైన్ లోన్‌యాప్‌లలో నిమిషాల్లోనే మీ బ్యాంకు ఖాతాల్లో రుణం మొత్తం జమ చేస్తామంటూ నమ్మబలుకుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఫేస్బుక్ వినియోగదారులను టార్గెట్ చేస్తూ ఈ తరహా ప్రకటనలు ఇస్తున్నట్లు తెలిపారు. తీసుకున్న రుణానికి వడ్డీ కూడా అతి స్వల్పం అని ఊదరగొడుతున్నారన్నారు. ఇలా వారి వలకు చిక్కే అమాయకుల నుంచి ప్రాథమిక వివరాల కోసం అంటూ ఆధార్‌కార్డు, పాన్‌కార్డుల వివరాలు సేకరిస్తున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్బీఐ నిబంధనల మేరకు పనిచేసే సంస్థల నుంచే ఆన్లైన్ రుణాలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. -
ఎన్ఐఏ పేరిట ఐఎస్ దుష్ప్రచారం
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే, లవ్జిహాదీలకు ప్రేరేపించే, సోషల్ మీడియాలో ముస్లింలు పెట్టే అభ్యంతరకరమైన మెసేజ్‌లపై సమాచారం ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) పేరిట ఓ తప్పుడు సమాచారం సర్క్యులేట్ అవుతున్నట్టు ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు. దేశ వ్యతిరేక భావజాలం ఉన్న ముస్లింల సమాచారం ఇవ్వాలంటూ ఫేక్ ఫోన్ నంబర్లతో ఎన్ఐఏ పేరిట ప్రచారం చేస్తున్నట్టు ఎన్ఐఏ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఓ వర్గాన్ని ఎన్ఐఏ టార్గెట్‌గా చేసుకున్నట్టు కొన్ని తప్పుడు సందేశాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారం అవుతున్నాయని వెల్లడించింది. నకిలీ ఫోన్ నంబర్లను జత చేసిన ఈ సందేశాలతో ఎన్ఐఏకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఎన్ఐఏ అధికారులు దీనిపై ఆరా తీయగా..ఈ తరహా సందేశాలతో ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్) మోసపూరితంగా భారతీయ యువకులను లక్ష్యంగా చేసుకుంటున్నట్టు తేలిందని పేర్కొన్నారు. ఇలాంటి నకిలీ, తప్పుడు సందేశాలను నమ్మవద్దని, ప్రచారం చేయవద్దని లేదా ఫార్వర్డ్ చేయవద్దని ప్రజలను ఎన్ఐఏ అధికారులు కోరారు. -
గుండెపోటు నాటకంతో 20 రెస్టారెంట్లకు టోకరా: చివరికి ఏమైందంటే...?
రెస్టారెంట్ బిల్లు ఎగ్గొట్టేందుకు గుండె పోటు డ్రామాలు ఆడడం అలవాటుగా మార్చుకున్నాడో ప్రబుద్ధుడు. ఇలా ఒకటీ, రెండూ కాదు ఏకంగా 20 రెస్టారెంట్లలో ఇదే తంతు కొనసాగించాడు. కానీ మోసం ఎల్లకాలం సాగదు కదా. ఎట్టకేలకు పోలీసులు చిక్కాడు. ప్రస్తుతం ఈ ఉదంతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. స్పెయిన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. డైలీ లౌడ్ ప్రకారం ఖరీదైన రెస్టారెంట్‌కు వెళ్లడం, కడుపునిండా లాగించేయడం ఆనక మూర్ఛపోయినట్టు నటించి, గుండె నొప్పి అంటూ నైలపై దొర్లి దొర్లి హడావిడి చేయడం ఇదీ ఇతగాడి తంతు. స్పెయిన్‌లోని బ్లాంకా ప్రాంతంలోని స్థానిక రెస్టారెంట్లలో ఫ్యాన్సీ డిన్నర్ తింటాడు. సరిగ్గా బిల్లు కట్టే సమయానికి గుండెపోటు అంటూ భయంకరమైన డ్రామాకు తెర తీస్తాడు. ఇతగాడి నాటకాన్ని పసిగట్టిన సిబ్బంది అప్రమత్తమై, ఈ కేటుగాడి ఫోటోను ఆ ప్రాంతంలోని అన్ని రెస్టారెంట్లకు పంపించి వారిని కూడా అలర్ట్ చేశారు. (టీవీ మహిళా జర్నలిస్టు హత్యకేసు: ఆ దుర్మార్గులదే ఈ పని!) దీన్ని గమనించని మనోడు ఒక లగ్జరీ రెస్టారెంట్లో యథావిధిగా సుష్టిగా భోంచేశాడు. ముందుగానే అక్కడి సిబ్బంది బిల్లు ఇచ్చారు. దీంతో సుమారు రూ. 3,081 బిల్లు చెక్కు ఇచ్చి వెళ్లి పోదామని చూశాడు. పాత బిల్లు సంగతి ఏంటని నిలదీశారు. అయితే హోటల్ గదికి వెళ్లి డబ్బులు తెస్తానని చెప్పాడు. సిబ్బంది అతన్ని వదిలి పెట్టలేదు. నాటకం మొదలు పెట్టాడు. గుండెనొప్పి వస్తోంది ఆంబులెన్స్‌ని పిలవాలంటూ హంగామా చేశాడు. కానీ వాళ్లు ఆంబులెన్స్‌కు బదులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతగాడి మోసానికి చెక్ పడింది. అతని ఫోటోను అన్ని రెస్టారెంట్లకు పంపి, అరెస్ట్ చేయించామని స్థానిక రెస్టారెంట్ మేనేజర్ మీడియాకు తెలిపారు. గత ఏడాది నవంబరు 22 నుంచి ఈ వ్యక్తి ఈ నగరంలోనే ఉంటున్నాడట. (భీకర పోరు: సాహో ఇండియన్ సూపర్ విమెన్, వైరల్ వీడియో) -
సమాజ్ వాదీ నేత ఆజాం ఖాన్‌కు ఏడేళ్ల జైలు శిక్ష
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజాం ఖాన్, ఆయన భార్య తజీన్ ఫాతిమా, కుమారుడు అబ్దుల్లా ఆజాంలకు యూపీలోని రాంపూర్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్షను విధించింది. 2019 నాటి నకిలీ జనన ధృవీకరణ పత్రాల కేసులో ఈ ముగ్గుర్ని దోషులుగా నిర్ధారించింది. ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు న్యాయమూర్తి షోబిత్ బన్సల్ ముగ్గురు దోషులకు గరిష్టంగా ఏడేళ్ల జైలు విధిస్తూ శిక్షను ఖరారు చేశారు. నకిలీ ధ్రువపత్రాలపై బిజెపి ఎమ్మెల్యే ఆకాష్ సక్సేనా రాంపూర్‌లోని గంజ్ పోలీస్ స్టేషన్లో జనవరి 3, 2019న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎఫ్ఐఆర్ నమోదైంది. వారి కుమారుడు అబ్దుల్లా ఆజాంకు రెండు నకిలీ పుట్టిన తేదీ సర్టిఫికేట్లు పొందేందుకు ఆజాం ఖాన్, ఆయన భార్య తజీన్ ఫాతిమా సహాయం చేశారని సక్సేనా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక సర్టిఫికెట్ లక్నో నుంచి కాగా మరొకటి రాంపూర్ నుంచి పొందినట్లు ఫిర్యాదులో స్పష్టం చేశారు. "కోర్టు తీర్పు తర్వాత, ముగ్గురిని జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు నుండే దోషులను జైలుకు తరలించారు" అని ప్రాసిక్యూషన్ తరపున వాదిస్తున్న మాజీ జిల్లా ప్రభుత్వ న్యాయవాది అరుణ్ ప్రకాష్ సక్సేనా అన్నారు. ఛార్టిషీటు ప్రకారం అబ్దుల్లా ఆజాం జనవరి 1,1993న జన్మించినట్లు రాంపూర్ మున్సిపాలిటీ నుంచి ఒక ధ్రువపత్రాన్ని పొందగా.. మరొకటి సెప్టెంబర్ 30, 1990న జన్మించినట్లు లక్నో నుంచి పొందారు. నాలుగేళ్లపాటు విచారణ తర్వాత న్యాయస్థానం ఈ మేరకు శిక్షను ఖరారు చేసింది. ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా 16 మంది హైకోర్టు జడ్జిల బదిలీ -
రాజకీయంగా వాడుకోవాలని చూస్తే సహించం
ఒంగోలు సబర్బన్ : ప్రకాశం జిల్లా ఒంగోలులో సంచలనం సృష్టించిన నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపుల కుంభకోణం కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ మలికాగర్గ్ చెప్పారు. ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆమె మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడారు. నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపుల కుంభకోణం కేసును ఎవరైనా రాజకీయంగా వాడుకోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కేసులో ఏ పార్టీ వాళ్లు ఉన్నా వదిలిపెట్టేది లేదన్నారు. 20 రోజుల క్రితం వేరే కేసులో ఒంగోలు తాలూకా పోలీసులు తనిఖీ చేస్తుంటే అక్కడ నకిలీ స్టాంపులు, డాక్యుమెంట్లు బయటపడ్డాయని, అప్పటి నుంచి వేగంగా కేసు దర్యాప్తు జరుగుతోందన్నారు. ఈ కేసు దర్యాప్తును వేగంగా చేపట్టాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయంగా తనతో చెప్పారని తెలిపారు. తనతో పాటు కలెక్టర్ ఏఎస్ దినే‹Ùకుమార్‌తో కూడా ఈ కేసు విషయంపై బాలినేని స్పష్టంగా మాట్లాడినట్టు చెప్పారు. ఈ కేసులో ఏ పార్టీ వారున్నా, చివరకు తన అనుచరులున్నా సరే ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు తలొగ్గవద్దని కూడా బాలినేని స్పష్టం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కొన్ని పార్టీలు రాజకీయ ప్రాబల్యం కోసం అనవసర ఆరోపణలు చేస్తున్నాయని, వెంటనే మానుకోవాలని సూచించారు. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలున్నా పోలీస్ అధికారులకు తెచ్చివ్వాలని సూచించారు. అంతే కానీ రాజకీయ స్వార్థం కోసం పోలీస్ దర్యాప్తును పక్కదారి పట్టిస్తే మాత్రం సహించేది లేదని ఎస్పీ హెచ్చరించారు. ‘కేసులో వేలకొలది డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నాం. వాటిలో 130 డాక్యుమెంట్లను నిశితంగా పరిశీలిస్తున్నాం. వాటిలో నకిలీవి ఎన్ని, అసలు డాక్యుమెంట్లు ఎన్ని ఉన్నాయో అటు రెవెన్యూ, ఇటు రిజి్రస్టేషన్ల శాఖల సమన్వయంతో దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్ట్ చేశాం, మరో 12 మందిని అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇంకా ఎవరెవరి పాత్ర ఇందులో ఉందో కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నాం’ అని అన్నారు. తొలుత దర్శి డీఎస్పీతో సిట్ ఏర్పాటు చేశామని, కేసు తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఒంగోలు ఏఎస్పీ కే.నాగేశ్వరరావుకు కేసును అప్పగిస్తూ అప్‌గ్రేడ్ చేసినట్టు తెలిపారు. -
నకిలీ న్యాయవాది విజయగాథ.. 26 కేసులు గెలిచి..
వ్యక్తి సామర్ధ్యం అనేది అతని విద్య, లేదా నైపుణ్యాల ద్వారా వెలుగులోకి వస్తుంది. అలాగే మనిషి ఎంత విద్యావంతుడైతే అతను తన వృత్తిలో అంత మెరుగ్గా ఉంటాడని అంటుంటారు. అయితే ఇటువంటి బలమైన నమ్మకాలను సైతం వమ్ము చేస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. వృత్తిపరమైన విజయంతో అందరినీ ఆశ్చర్యపరిచిన నకిలీ న్యాయవాది ఉదంతం ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ కథ కెన్యాకు చెందిన ఒక వ్యక్తిది. అతను ఒక ఉన్నత న్యాయవాద సంస్థలో లాయర్‌గా తన పేరు నమోదు చేసుకోవడమే కాకుండా తన క్లయింట్ల తరపున వాదించి 26 కేసులలో విజయం సాధించాడు. ఈ నకిలీ లాయర్ పేరు బ్రియాన్ మ్వెండా న్జాగి. అతను నిజమైన న్యాయవాది కాదని న్యాయమూర్తులు కూడా గుర్తించలేకపోవడం విశేషం. లా కోర్సు చేయకుండానే బ్రియాన్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. కెన్యా లా సొసైటీ అతనిని అనుమానించిన నేపధ్యంలో అతని మోసపూరిత చర్యలు వెలుగు చూశాయి. బ్రియాన్ అనే నిజమైన న్యాయవాది తాను ప్రాక్టీస్ చేయకపోయినా తన ఖాతా యాక్టివ్‌గా ఉండటాన్ని చూసి, అతను కెన్యా లా సొసైటీకి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుదారు అటార్నీ జనరల్ కార్యాలయంలో పని చేస్తున్నాడు. అందుకే అతనికి ప్రాక్టీస్ సర్టిఫికెట్ అవసరం లేకపోవడంతో అతను తన ఖాతాను ఎప్పుడూ ఉపయోగించలేదు. అయితే ఒకరోజు అతను తన ఖాతా లాగిన్ చేసినప్పుడు, అతనికి అనుమానం వచ్చింది. దీంతో అతను లా సొసైటీకి ఫిర్యాదు చేశాడు. దీంతో అతని పేరు మీద మరొకరు లాయర్‌గా వ్యవహరిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ నేపధ్యంలో నకిలీ న్యాయవాదిని అరెస్ట్ చేశారు. అయితే సోషల్ మీడియాలో అతని వృత్తి నైపుణ్యాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. ఇది కూడా చదవండి: హఠాత్తుగా నాగుపాము తిరగబడితే... -
దిగ్విజయ్ సింగ్ రాజీనామా.. క్లారిటి
భోపాల్: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రాజీనామా లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. నకిలీ లేఖ అని పేర్కొంటూ పోలీసుకు ఫిర్యాదు చేసింది. మధ్యప్రదేశ్‌లో ఎన్నికలకు అభ్యర్థుల లిస్టు ప్రకటించిన వెంటనే దుష్ప్రచారం చేయడానికి ప్రతిపక్షాలు ఈ ఘటనకు పాల్పడ్డాయని కాంగ్రెస్ ఆరోపించింది. 'అబద్ధాలు అడటంలో బీజేపీకి మంచి పట్టుంది. 1971లో ఎలాంటి ఆశ లేకుండా కేవలం పార్టీ సిద్ధాంతాల కోసం కాంగ్రెస్ సభ్యత్వాన్ని తీసుకున్నాను. చివరి శ్వాస వరకు కాంగ్రెస్‌లోనే ఉంటాను. రాజీనామాకు సంబంధించి నకిలీ లేఖపై పోలీసులకు ఫిర్యాదు చేశాను' అని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న 230 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ 144 మంది అభ్యర్థుల లిస్టును ప్రకటించింది. ఇందులో దిగ్విజయ్ సింగ్ కుమారుడితో సహా సిట్టింగ్ ఎమ్మెల్యే జైవర్ధన్ సింగి పేర్లు కూడా ఉన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన రాజీనామా లేఖలో తన అనుచరులకు సీట్లు దక్కనందుకు దిగ్విజయ్ విచారం వ్యక్తం చేస్తూ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసినట్లు దుండగులు పేర్కొన్నారు. భారమైన హృదయంతో పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకోవడానికి నిర్ణయించుకున్నట్లు లేఖలో ఉంది. కాంగ్రెస్ తన మొదటి లిస్టులో పార్టీ చీఫ్ కమల్‌నాథ్‌తో పాటు 69 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చింది. ఇదీ చదవండి: ప్రశ్నలడిగేందుకు లంచం తీసుకున్నారు -
‘నకిలీ విత్తు’ చిత్తు!
ఇతని పేరు బుద్ధా సన్యాసిరావు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం. ఈయన 5 ఎకరాల్లో సొంత విత్తనంతో సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. మొలక శాతం ఎంతుందో తెలుసుకునేందుకు ఆర్బీకే ద్వారా కోరుకొండ ల్యాబ్‌కు శాంపిల్ పంపి ఉచితంగా పరీక్ష చేయించారు. మొలక శాతం చాలా తక్కువగా ఉందని గుర్తించడంతో వాటిని పక్కన పెట్టి, డెల్టా సీడ్స్ కంపెనీ నుంచి బీపీటీ 5204 విత్తనాన్ని కొని మరోసారి పరీక్షించుకుంటే మొలక శాతం బాగా వచ్చింది. అదే విత్తనాలు నారుమడి పోసుకొని సాగు చేశాడు. నిజంగా మొలక శాతం లేని సొంత విత్తనంతో సాగు చేసి ఉంటే ఎకరాకు విత్తనానికి రూ.1,000, నారుమడి, దమ్ముకు రూ.500, బాటలు తీసి ఎరువులు, పురుగు మందులకు మరో రూ.200 చొప్పున 5 ఎకరాలకు రూ.8,500కు పైగా నష్టం వచ్చేది. పంటపై పెరిగే పురుగులు, చీడపీడల నియంత్రణకు ఎకరాకు రూ.600 నుంచి రూ.800 వరకు అదనపు పెట్టుబడి పెట్టాల్సి వచ్చేది. మొక్కలు ఎదగడానికి పట్టే 25 రోజుల విలువైన కాలమే కాకుండా, ఎకరాకు 4–6 బస్తాల దిగుబడి కోల్పోవాల్సి వచ్చేది. ‘ఆ విత్తనం ఉపయోగించకపోవడం వల్ల పెట్టుబడి కోల్పోకుండా జాగ్రత్త పడడమే కాదు.. మొలక శాతం ఎక్కువగా ఉన్న బీపీటీ 5204 రకం విత్తనంతో సాగు వల్ల ఆశించిన దిగుబడులను సాధించగలిగాను. కొత్తగా ఏర్పాటు చేసిన అగ్రిల్యాబ్ వల్ల నా పంట కాపాడుకోగలిగాను’ అని ఈ రైతు ఆనందంగా చెబుతున్నాడు. పంపాన వరప్రసాదరావు, తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ ఇంటిగ్రేటెడ్ అగ్రిల్యాబ్ నుంచి సాక్షి ప్రతినిధి : తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కొరుకొండ గ్రామం. ప్రసిద్ధి చెందిన లక్ష్మీనరసింహస్వామి వారు కొలువైన ఈ గ్రామంలో ఓ వైపు పంట పొలాలు.. మరో వైపు ఆయిల్ పామ్, మామిడి, జీడిమామిడి తోటలు. గ్రామంలో కొత్తగా నిరి్మంచిన సచివాలయం, ఆర్బీకే కేంద్రాలున్నాయి. గ్రామం మధ్య కాపవరం రోడ్డులో ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో అత్యంత అధునాతనంగా నిరి్మంచిన భవనం ఉంది. అదే వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్. ఈ ల్యాబ్‌కు అనుబంధంగా పసు వ్యాధి నిర్ధారణ ల్యాబ్ కూడా ఉంది. ల్యాబ్ పరిధిలో 16,691 హెక్టార్ల విస్తీర్ణం ఉండగా, 14,162 మంది రైతులున్నారు. వీరిలో 70 శాతం మంది కౌలుదారులే. ల్యాబ్‌లో అడుగు పెట్టగానే ఎటు చూసినా అత్యాధునిక పరికరాలే. విత్తన, ఎరువుల శాంపిల్స్‌ను పరీక్షించే సీడ్ బ్లోవర్, మైక్రోస్కోప్, ప్యూరిటీ బోర్డు, డిస్టిలేషన్ యూనిట్, బోర్నర్, గోనెట్ డివైడర్, సీడ్ జెర్మినేటర్, హాట్ ఎయిర్ ఓవెన్, మప్లే పర్నేస్, హాట్ప్లేట్, సెక్షన్ పంప్, డేస్కికేటర్ ఇలా ఒకటి కాదు.. రెండు కాదు పదుల సంఖ్యలో పరికరాలు ఉన్నాయి. రైతులు తెచ్చిన శాంపిల్స్ పరీక్షించడంలో ల్యాబ్ ఇన్చార్జి, వ్యవసాయాధికారి దేవరపల్లి రామతులసితో పాటు ల్యాబ్ సిబ్బంది తలమునకలైఉన్నారు. అదే సమయంలో శాంపిల్స్ పట్టుకొని కొంతమంది, ఇచ్చిన శాంపిల్స్ ఫలితాల కోసం మరికొంత మంది రైతులు ల్యాబ్‌కు రావడం మొదలైంది. ల్యాబ్ ఏమిటో? ఎవరి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిందో మీకు తెలుసా? అని ఆరా తీయగా, అక్కడకు వచ్చిన రైతులే కాదు.. గ్రామంలోని పలువురు రైతులు కూడా ల్యాబ్ ఏర్పాటుతో మాకు ఎంతో మేలు జరుగుతోందని ఆనందంగా చెప్పారు. ‘గతంలో ఏదైనా పరీక్షించుకోవాలంటే పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వెళ్లాల్సి వచ్చేది. అంత దూరం వెళ్లేందుకు ఆరి్థక భారం కావడంతో డీలర్లు ఇచ్చిన విత్తనాలను కనీసం పరీక్ష కూడా చేయించుకోకుండానే విత్తుకునే వాళ్లం. మొలక వస్తే అదృష్టం.. లేకుంటే మా దురదృష్టం.. అన్నట్టుగా ఉండేది మా పరిస్థితి. ఇప్పుడు మా నియోజకవర్గంలోనే ఈ ల్యాబ్ రావడంతో విత్తనాలు, ఎరువులు తనిఖీ చేయించుకోగలుగుతున్నాం’ అని తెలిపారు. విత్తనం మంచిదైతే.. పంట బాగుంటుంది. పంట బాగుంటే దిగుబడిపై దిగులుండదు. ఆశించిన దిగుబడులు సాధించాలంటే మేలి రకం విత్తనం కావాలి. అన్నదాతలు నకిలీ విత్తనాలతో మోసపోకుండా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన వైఎస్సార్ అగ్రి ల్యాబ్స్ అద్భుత పనితీరుతో రైతులకు భరోసా కల్పిస్తున్నాయి. ఏటా రూ.వేల కోట్ల పెట్టుబడి మట్టిపాలు కాకుండా ముందుగానే పరీక్షించి హెచ్చరిస్తున్నాయి. పైసా ఖర్చు లేకుండా ఇన్‌పుట్స్‌ను ముందుగానే పరీక్షించుకోవడం ద్వారా నాసిరకం, నకిలీల బారిన పడకుండా ధైర్యంగా సాగు చేసుకోగలుగుతున్నారు. సొంతంగా తయారు చేసుకున్నవైనా, మార్కెట్లో కొనుగోలు చేసినవైనా నేరుగా ల్యాబ్‌కు వెళ్లి విత్తన నాణ్యతను ఉచితంగా పరీక్షించుకుని, ఫలితాల ఆధారంగా ధైర్యంగా సాగు చేసుకోగలుగు తున్నామని పలువురు రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది రైతులు నష్టపోకుండా అగ్రి ల్యాబ్‌లు అండగా నిలుస్తున్నాయి. గతంలో నకిలీలదే రాజ్యం రాష్ట్రంలో ఏటా వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు కోసం 1.25 లక్షల లాట్స్ విత్తనాలు, 2.80 లక్షల బ్యాచ్‌ల పురుగు మందులు, 20 వేల బ్యాచ్‌ల ఎరువులు మార్కెట్‌కు వస్తుంటాయి. గతంలో వీటి నాణ్యతను పరీక్షించేందుకు రాష్ట్ర స్థాయిలో 11 ల్యాబరేటరీలు మాత్రమే అందుబాటులో ఉండేవి. పెస్టిసైడ్స్ కోసం 5, ఎరువులు, విత్తన పరీక్షల కోసం 3 చొప్పున ఉండేవి. మార్కెట్లోకి వచ్చే ఎరువుల్లో 30 శాతం, విత్తనాల్లో 3–4 శాతం, పురుగు మందుల్లో ఒక శాతానికి మించి శాంపిళ్లను పరీక్షించే సామర్ధ్యం వీటికి ఉండేదికాదు. దీంతో మార్కెట్లో నకిలీలు రాజ్యమేలేవి. ఏటా వీటి బారిన పడి రైతన్నలు ఆర్థికంగా వేల కోట్ల రూపాయల పెట్టుబడి నష్టపోయేవారు. నాణ్యమైన సాగు ఉత్పాదకాలను అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలో మరెక్కడా లేని విధంగా నియోజకవర్గ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయడంతో రైతుల్లో నమ్మకం, భరోసా కలిగింది. దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా ఏపీ ఇప్పటిదాకా తమిళనాడులో అత్యధికంగా 33 అగ్రీ ల్యాబ్స్ ఉండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి ఫలితంగా నియోజకవర్గ స్థాయిలో ల్యాబ్స్ ఏర్పాటుతో ఏపీని దేశంలో నంబర్ వన్ స్థానంలో నిలిపారు. ఒక్కొక్కటి రూ.6.25 కోట్లతో జిల్లా స్థాయిలో 10 ల్యాబ్స్, ఒక్కొక్కటి రూ.82 లక్షల నుంచి 90 లక్షల అంచనాతో నియోజకవర్గ స్థాయిలో 147 ల్యాబ్స్, రూ.75 లక్షలతో నాలుగు (విశాఖ, తిరుపతి, అమరావతి, తాడేపల్లిగూడెం) రీజనల్ కోడింగ్ సెంటర్స్, రూ.8.50 కోట్ల అంచనా వ్యయంతో గుంటూరులో డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీతో రాష్ట్ర స్థాయి ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. కాగా 2021 జూలై 8న రైతు దినోత్సవం రోజున 70 కేంద్రాలు, ఆ తర్వాత మరో 5 కేంద్రాలను ప్రారంభించగా, ఈ ఏడాది జూలై 8న మరో 52 ల్యాబ్‌ల సేవలు అందుబాటులోకి వచ్చాయి. మరో 20 ల్యాబ్స్ నిర్మాణ దశలో ఉన్నాయి. వీటికి అనుబంధంగా 154 ఇంటిగ్రేటెడ్ వెటర్నరీ, 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్‌ను ఏర్పాటు చేశారు. పరీక్షలన్నీ ఉచితమే ల్యాబ్‌లలో విత్తన మొలక శాతం పరీక్ష నివేదికను వారం రోజుల్లోపు ఇస్తున్నారు. పురుగు మందులు, ఎరువుల నాణ్యత నిర్థారణ రిపోర్టును 2–3 రోజుల్లోనే అందజేస్తున్నారు. రైతులు కాకుండా వ్యాపారులు, డీలర్లు, తయారీదారులు, ఇతరులు నాణ్యత ప్రమాణాల పరీక్ష నివేదిక కోసం ఎరువుల రకాన్ని బట్టి రూ.వెయ్యి నుంచి రూ.3 వేల వరకు, పురుగు మందులకు సంబంధించి రూ.3,500, విత్తనాల నివేదిక కోసం రూ.200 చొప్పున చెల్లించాలి. అదే రైతులకైతే పూర్తిగా ఉచితం. ప్రభుత్వమే ఈ వ్యయాన్ని భరించి రైతన్నకు తోడుగా నిలుస్తోంది. ఏటా 50 వేల శాంపిళ్ల చొప్పున ఇప్పటి వరకు 1,03,215 శాంపిళ్లను పరీక్షించారు. వీటిలో 11 వేల శాంపిళ్లు ఆర్బీకేల ద్వారా రైతులు పంపినవే. వీటిలో 1,884 నమూనాలు నాణ్యత లేనివిగా గుర్తించి వాటి తయారీ, అమ్మకం దారులపై చట్టపరంగా చర్యలకు ఆదేశించారు. అత్యాధునిక పరికరాలు నమూనాల పరీక్ష కోసం ప్రత్యేకంగా ఆటోమేటెడ్ క్వాలిటీ కంట్రోల్ యాప్ (ఇన్సైట్) అభివృద్ధి చేశారు. ఫలితాలను ట్యాంపర్ చేసేందుకు వీల్లేని రీతిలో ప్రతి లేబరేటరీలో ఆటోమేషన్ ఏర్పాటు చేశారు. టెస్టింగ్ చేసిన ప్రతి ఒక్కటి రికార్డు కావడంతో పాటు ఫలితాలు ఆటోమేటిక్‌గా సిస్టమ్‌లో నమోదవుతున్నాయి. ల్యాబ్‌లో ఏబ్యాచ్ శాంపిల్‌ను ఏ సమయంలో పరీక్షించారో ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా నమోదు అవుతోంది. షాపులో బ్యాచ్ నంబర్ చెక్ చేస్తే చాలు.. నాణ్యత సరి్టఫికెట్ ఉందో లేదో తెలిసిపోతుంది. ఇచ్చిన శాంపిల్స్‌కు టెస్టింగ్ జరిగిందో లేదో కూడా ట్రాక్ చేసుకోవచ్చు. జిల్లా ల్యాబ్‌లో గ్రో అవుట్ టెస్టింగ్ ఫెసిలిటీ కల్పించారు. ఇక్కడ మొక్కల జనటిక్ ఫ్యూరిటీ టెస్టింగ్ చేస్తున్నారు. రైతులు తెచ్చే నమూనాలకు ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదు. ప్రతి ల్యాబ్ లో ఒక అఫీషియల్ అనలిస్టు, ఇద్దరు జూనియర్ అనలిస్టులను ఏర్పాటు చేశారు. వీరికి అత్యాధునిక శిక్షణ ఇచ్చారు. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్‌ను సమీప ఆర్బీకేలతో అనుసంధానించారు. ఇన్పుట్స్ పరీక్షించుకునేలా రైతులను ప్రోత్సహించేలా ఆర్బీకేల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రీ ల్యాబ్‌ల ద్వారా ఏటా 50 వేలకు పైగా ఇప్పటి వరకు 1,03,215 విత్తన శాంపిళ్లను పరీక్షించారు. వీటిలో 11 వేల శాంపిళ్లు ఆర్బీకేల ద్వారా రైతులు పంపినవే. ఇందులో 1,884 నమూనాలు నాణ్యత లేనివిగా గుర్తించి వాటి తయారీ, అమ్మకందారులపై చట్టపరంగా చర్యలకు ఆదేశించారు. తద్వారా ఆయా రైతులు నష్టపోకుండా ముందస్తుగానే అడ్డుకున్నారు. రైతులకు సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు నష్టాలపాలవ్వకుండా చూశారు. అత్యుత్తమ ల్యాబ్‌గా కోరుకొండ నియోజకవర్గ స్థాయి ల్యాబ్‌లలో కోరుకొండ ల్యాబ్ నంబర్ వన్‌గా నిలిచింది. ల్యాబ్‌ల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ర్యాంకింగ్ ఇస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయాధికారి ఎస్.మాధవరావు కృషి ఫలితంగా ఆర్బీకేల ద్వారా రైతులకు అవగాహన కల్పించడంతో కోరుకొండ ల్యాబ్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ ల్యాబ్‌లో ఇప్పటి వరకు 1038 శాంపిల్స్ పరీక్షించారు. వీటిలో యాక్ట్ శాంపిల్స్‌లో 74 విత్తన, 26 ఎరువు శాంపిల్స్, ఆర్బీకే శాంపిల్స్‌లో 16 విత్తన, 35 ఎరువులు, రైతు శాంపిల్స్‌లో 716 విత్తన, 75 ఎరువులు, ట్రేడ్ శాంపిల్స్‌లో 66 విత్తన, 25 ఎరువు శాంపిల్స్ పరీక్షించారు. రైతు శాంపిల్స్‌లో 21 నమూనాలు నాణ్యతలేనివని గుర్తించారు. తద్వారా ఆయా రైతులు నష్టపోకుండా కాపాడగలిగారు. ల్యాబ్‌లలో పరీక్షలు ఇలా జిల్లా ల్యాబ్స్‌లో బీటీ, హెచ్‌టీ పత్తి జన్యు పరీక్షలు, తేమ, మొలక శాతం, విత్తన శక్తి బాహ్య స్వచ్ఛత తదితర అధునాతన విత్తన పరీక్షలతో పాటు ఎరువుల్లో నత్రజని, భాస్వరం, పొటాష్, సూక్ష్మ పోషకాలైన జింక్, ఇనుము, బోరాన్, కాల్షియం, మేగ్నీషియం వంటి పోషకాల నాణ్యత పరీక్షలు, పురుగు మందుల్లో క్రియాశీల పదార్థాలను పరీక్షిస్తున్నారు. నియోజకవర్గ స్థాయి ల్యాబ్స్‌లో విత్తనాల్లో మొలక శాతం, బాహ్య స్వచ్ఛత, ఎరువుల్లో నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి పోషకాల నాణ్యతను పరీక్షిస్తున్నారు. పురుగుల మందుల నమూనాలను జిల్లా ల్యాబ్స్‌కు పంపిస్తున్నారు. 4 కేటగిరిల్లో శాంపిల్స్ పరీక్ష.. యాక్ట్ శాంపిల్స్ : ఇవి ప్రతి మండల వ్యవసాయాధికారి మండలంలోని డీలర్ల దగ్గర, వారికి సందేహాస్పదంగా అనిపించిన శాంపిల్స్‌ను తీసి పంపిస్తారు. వీటిని ఆర్సీసీ కోడింగ్ వ్యవస్థ ద్వారా వివిధ ల్యాబ్స్లకు పంపి పరీక్షిస్తారు. ఆర్బీకే శాంపిల్స్ : ఆర్బీకే ద్వారా సరఫరా చేసే ఎరువులు, విత్తన శాంపిల్స్ ఫార్మర్ శాంపిల్స్ : రైతులు సొంతంగా, నేరుగా తెచ్చుకునే శాంపిల్స్ డీలర్ శాంపిల్స్: డీలర్లు నేరుగా పంపే శాంపిల్స్ డీలర్లలో భయం నేను 10 ఎకరాల్లో ఇటీవల కొత్తగా వచ్చిన వరి వంగడం ఎంటీయూ 1318 సాగు చేయాలనుకున్నా. కొత్త రకం కదా.. మొలక శాతం ఏలా ఉంటుందోననే ఆందోళనతో కోరుకొండ ల్యాబ్‌కు తీసుకొచ్చి పరీక్ష చేయించాను. మంచి ఫలితం వచ్చింది. నేను నారుమడి పోసి సాగు చేస్తున్నా. ఇప్పుడు ఈ ల్యాబ్‌ల వల్ల గతంలో మాదిరిగా డీలర్లు ఏది పడితే వాటిని మాకు అంటగట్టే ప్రయత్నం చేయడం లేదు. ల్యాబ్‌ల ఏర్పాటుతో ఇన్పుట్స్ క్వాలిటీపై రైతుల్లో మంచి అవగాహన వచ్చింది. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. – చిల్పారాశెట్టి అప్పలరాజు, శ్రీరంగపట్నం, కోరుకొండ మండలం, తూర్పుగోదావరి నాణ్యత ప్రమాణాలపై దృష్టి జిల్లా, నియోజకవర్గ స్థాయి ల్యాబ్ సేవలు దాదాపు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. వీటిలో అత్యాధునిక ఎక్యూప్మెంట్స్ అందుబాటులోకి తీసుకొచ్చాం. ల్యాబ్‌లలో నాణ్యతా ప్రమాణాలను మరింత మెరుగు పర్చేందుకు నాలుగు జోన్లుగా విభజించాం. విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, తిరుపతి, పల్నాడు జిల్లా వ్యవసాయాధికారులను ఈ జోన్లకు కస్టోడియన్ అధికారులుగా నియమించాం. వీరి సేవలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. – చేవూరు హరికిరణ్, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ -
తుస్సుమన్న ఎల్లో బ్యాచ్ ప్లాన్.. వీళ్లు ఐటీ ఉద్యోగులా..!
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్‌కు ఐటీ ఉద్యోగులు నిరసనలు తెలుపుతున్నారంటూ రోజూ ఏదో ఒక చోట కొందరు రోడ్ల మీదకు వస్తున్నారు. అయితే, ఈ ఎల్లో బ్యాచ్ ఫేక్ ఐటీ ఉద్యోగులని ఇప్పటికే రుజువైనా.. మళ్లీ మళ్లీ రోడ్ల మీదకు వచ్చి హడావుడి చేస్తున్నారు. తాజాగా, కొందరు చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా రోడ్ల మీదకు వచ్చి తాము ఐటీ ఉద్యోగులమని కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ, వీరి ప్లాన్ బెడిసికొట్టింది. దీంతో, ఫేక్ ఐటీ బ్యాచ్ ప్లాన్ ఫేయిల్ అయ్యింది. కాగా, టీడీపీ కన్నుసన్నల్లో ఐటీ ఉద్యోగుల నిరసన కొనసాగుతున్నట్టు బట్టబయలైంది. చంద్రబాబుకు మద్దతు అంటూ ఐటీ ఉద్యోగుల పేరుతో కొందరు నిరసనలు తెలుపుతున్నారు. అయితే, ఐటీ ఉద్యోగుల ప్లకార్డులపై ‘ఐటీడీపీ’ సింబల్ కనిపించింది. కాగా, నిరసనలకు మూడు రోజుల ముందే ఐటీడీపీ వింగ్ కార్యకర్తలను సమన్వయం చేసింది. టీడీపీ నేతలను సమన్వయ పరిచే బాధ్యతలను ఐటీడీపీకి అప్పగించింది. నిరసలు ఎలా చేయాలో ప్లాన్ చేసింది. ఐటీ ఉద్యోగుల ముసుగులో టీడీపీ సానుభూతిపరులతో ఎల్లో బ్యాచ్ నిరసనలకు ప్లాన్ చేసింది. ఇలా బాబుకు ఐటీ ఉద్యోగుల మద్దతు అంటూ ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. తాజాగా వీరి బాగోతం బట్టబయలైంది. ఇది కూడా చదవండి: టీడీపీ, జనసేన పొత్తు అట్టర్ ఫ్లాప్ -
టీడీపీ శవ రాజకీయం.. ఎల్లో మీడియా కొత్త కలరింగ్!
శ్రీకాళహస్తి/పెద్దపంజాణి/గుడుపల్లె/తాడేపల్లిగూడెం రూరల్: అనారోగ్యం బారిన పడి మృతి చెందిన వ్యక్తుల శవాలనూ టీడీపీ నేతలు వదలడం లేదు. నిత్యం అనారోగ్య కారణాలతో రాష్ట్రంలో మరణాలు సంభవిస్తూ ఉంటాయి. రెండు రోజులుగా అలాంటి మరణాలను చంద్రబాబు అరెస్ట్‌ను తట్టుకోలేక వ్యక్తులు ప్రాణాలు విడుస్తున్నట్టుగా టీడీపీ నేతలతోపాటు ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. తద్వారా చంద్రబాబు అరెస్ట్‌పై సానుభూతి సంపాదించేందుకు టీడీపీ నేతలు తెగతాపత్రయ పడుతున్నారు. అయితే, వాస్తవాలు తెలిసిన ఆయా ప్రాంతాల వారు టీడీపీ ప్రచార యావను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. పలుచోట్ల నమోదైన మరణాలు టీడీపీ ఖాతాలోకి చేరిపోయాయి. వాటిలో కొన్ని ఇలా.. గుండెపోటుతో మరణించాడంటూ.. తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం తంగేళ్లపాలెం దళితవాడకు చెందిన వెంకట రమణయ్య(45) ఈ నెల 9న మధ్యాహ్నం రుయాలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అయితే చంద్రబాబు అరెస్ట్ వార్త విని గుండెపోటుతో మరణించాడంటూ తెలుగుదేశం నాయకులు, పచ్చమీడియా శవ రాజకీయం మొదలుపెట్టాయి. నిజానికి వెంకట రమణయ్యకు బీపీ, షుగర్ వంటి ఆనారోగ్య సమస్యలున్నాయి. 9న ఉదయాన్నే ఆయన పొలానికి వెళ్లి కళ్లు తిరిగి పడిపోవడంతో స్థానికంగా ఉన్న ఓప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతను బీపీ మాత్రలు సక్రమంగా వేసుకోకపోవంతో బీపీ ఎక్కువై మెదడులో నరాలు దెబ్బతినడంతో కోమాలోకి వెళ్లాడని వైద్యులు తెలిపారు. దీంతో అక్కడినుంచి తిరుపతిలోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతిచెందాడు. దీనిని చంద్రబాబు అరెస్ట్ వార్త విని గుండెపోటుతో మరణించాడంటూ ఎల్లో మీడియాలో ప్రచారం చేయడమేంటని బంధువులు, తంగేళ్లపాలెం గ్రామస్తులు ప్రశ్నించారు. మరో ఘటనలోనూ.. చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలం కొడతనపల్లెకు చెందిన వెంకటేష్‌కు ఈ నెల 9న ఉదయం గుండెపోటు రావడంతో కుప్పంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆరోగ్యం కుదుటపడటంతో ఇంటికి తీసుకొచ్చారు. మరుసటిరోజు ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో గుండెనొప్పి ఎక్కువ కావడంతో ఇంట్లోనే మృతి చెందాడు. ఈ విషయం తెలిసి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు ఎమ్మెల్సీ భరత్‌కు సమాచారం అందించారు. వెంటనే దహన సంస్కారాల కోసం రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని మృతుని కుటుంబ సభ్యులకు అందించారు. ఆ తరువాత టీడీపీ నాయకులు అక్కడికి వెళ్లి చంద్రబాబును అరెస్ట్ చేíయడాన్ని టీవీలో చూసి గుండెపోటుతో మరణించాడంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. కత్తార్లపల్లిలోనూ ఇదే తీరు చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం కత్తార్లపల్లికి చెందిన శంకరప్ప(50) ఆదివారం సాయంత్రం బంధువుల ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై ఇంటికొచ్చాడు. అరుగుపై విశ్రాంతి తీసుకుంటుండగా.. ఉండగా ఉన్నట్టుండి కుప్పకూలాడు. వెంటనే అతన్ని పుంగనూరు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు గుర్తించారు. దీనిపై స్థానిక టీడీపీ నాయకులు శంకరప్ప టీడీపీ కార్యకర్త అని, చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు పంపడంతోనే గుండెపోటుతో మృతిచెందాడని ప్రచారం చేశారు. దీనిని గమనించిన గ్రామస్తులు ఇదేం శవరాజకీయాలు నాయనా అంటూ నోరెళ్లబెట్టారు. 20 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తినీ.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లికి చెందిన చిరు వ్యాపారి తాడేపల్లి శేఖర్(40) అనే వికలాంగుడు 20 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రెండు, మూడు రోజులకు ఒకసారి తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి వెళ్తూ చికిత్స తీసుకుంటున్నాడు. ఆదివారం అర్ధరాత్రి గుండెల్లో మంటగా ఉండటంతో ఆర్ఎంపీ వైద్యుడితో ఇంజెక్షన్ చేయించారు. మెరుగైన వైద్యం కోసం సోమవారం తెల్లవారుజామున అంబులెన్స్‌లో తణుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో శేఖర్ మృతి చెందాడు. కానీ.. ఇతడి మరణాన్ని చంద్రబాబు జైలుకు వెళ్లడాన్ని తట్టుకోలేక మృతి చెందాడంటూ ఎల్లో మీడియా ప్రచారం చేసింది. ఇది కూడా చదవండి: చంద్రబాబుకు జైలు భోజనమే పెట్టాలి -
పక్కా కుట్రతోనే స్కిల్ దోపిడీ
సాక్షి, అమరావతి : ‘చంద్రబాబు పక్కా కుట్రతోనే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) ప్రాజెక్ట్ ముసుగులో ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. 2014–15లో ముఖ్యమంత్రిగా తన పదవిని దుర్వినియోగం చేస్తూ, కుట్ర పూరితంగా షెల్ కంపెనీలు సృష్టించి ఫేక్ ఇన్వాయిస్లు సమర్పించి రూ.371 కోట్లను అక్రమంగా తరలించారు. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరిట రూ.3,300 కోట్ల ప్రాజెక్టును కేవలం కాగితాలపై సృష్టించడం.. ప్రాజెక్టు చేపట్టకుండానే నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లు విడుదల చేయడం.. షెల్ కంపెనీల ద్వారా తరలించడం.. ఇలా అంతా చంద్రబాబు కనుసన్నల్లోనే సాగింది. ప్రజాధనం కొల్లగొట్టాలనే పక్కా పన్నాగంతో ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ సృష్టికర్త.. ఆ కుంభకోణంతో అక్రమంగా నిధులు పొందిన లబ్ధిదారూ రెండూ చంద్రబాబే’ అని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం స్పష్టం చేసింది. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం కేసులో అరెస్ట్ చేసిన చంద్రబాబును ఆదివారం ఉదయం విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఈ సందర్భంగా 29 పేజీల రిమాండ్ రిపోర్ట్‌ను సీఐడీ న్యాయస్థానంలో సమర్పించింది. అవినీతి కుంభకోణాన్ని పూర్తిగా వెలికి తీసి, దోషులను శిక్షించేందుకు సమగ్ర దర్యాప్తు సాఫీగా సాగాలంటే చంద్రబాబుకు జ్యుడిషియల్ రిమాండ్ విధించాలని కోరింది. ‘గత టీడీపీ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడుతోపాటు ఇతర నిందితులు 38 మంది సహకారంతో చంద్రబాబు ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. షెల్ కంపెనీల ద్వారా నిధులు అక్రమంగా తరలించడంలో చంద్రబాబు తనయుడు నారా లోకేశ్, ఆయన సన్నిహితుడు కిలారు రాజేష్ కీలక పాత్ర పోషించారు’ అని వెల్లడించింది. రిమాండ్ రిపోర్ట్‌లో ఇంకా ఏం చెప్పిందంటే.. దోచేందుకే ప్రాజెక్ట్.. యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ పేరిట ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకే ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్‌ను చంద్రబాబు రూపొందించారు. టీడీపీ నేత ఇల్లెందుల రమేశ్ ద్వారా డిజైన్‌టెక్, ఎస్‌ఐఎస్‌డబ్ల్యూ సంస్థలు ఆయన్ను సంప్రదించాయి. దాంతో రాష్ట్ర కేబినెట్ ఆమోదం లేకుండానే ఏపీఎస్ఎస్డీసీని ఏర్పాటు చేశారు. సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ ఇండియా హెడ్‌గా ఉన్న సుమన్‌బోస్, డిజైన్ టెక్ ఎంపీ వికాస్ వినాయక్ కన్వేల్కర్ ఈ కుట్రలో భాగస్వాములయ్యారు. ఏపీఎస్ఎస్డీసీ, సీమెన్స్–డిజైన్‌టెక్ కంపెనీలు త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. అనంతరం ఏపీఎస్‌ఎస్‌డీకి డైరెక్టర్‌గా తన సన్నిహిడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.లక్ష్మీ నారాయణ, ఎండీ–సీఈవోగా గంటా సుబ్బారావును నియమించారు. ఏపీఎస్ఎస్డీసీని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఎంటర్ ప్రైజస్, ఇన్నోవేషన్ విభాగాన్ని ఏర్పాటు చేసి అప్పటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు బాధ్యతలు అప్పగించారు. ఎలాంటి సర్వే లేకుండానే కేవలం డిజైన్‌టెక్ కంపెనీ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఆధారంగా ఆ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరుతో డిజైన్‌టెక్ భాగస్వామిగా ప్రాజెక్ట్‌ను ఖరారు చేశారు. రూ.3,300 కోట్లతో ప్రాజెక్ట్‌ను ఆమోదించి.. అందులో సీమెన్స్–డిజైన్‌టెక్ కంపెనీలు 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు సమకూరుస్తాయని ఒప్పందంలో పేర్కొన్నారు. నిధులు ఇచ్చేయండని చంద్రబాబు ఆదేశం ఒప్పందంలో చెబుతున్నట్లుగా సీమెన్స్ కంపెనీ తన వాటా 90 శాతంలో ఒక్కరూపాయి కూడా ఇవ్వకుండానే ఏపీఎస్ఎస్డీసీ వాటా 10 శాతం కింద జీఎస్టీ కలిపి డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు చెల్లించేశారు. అందుకు అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్, ప్రత్యేక కార్యదర్శి సునీత నోట్ ఫైళ్లపై లిఖితపూర్వకంగా అభ్యంతరం వ్యక్తం చేసినా ఆయన పట్టించుకోలేదు. చంద్రబాబు ఆదేశాలతోనే సీమెన్స్ కంపెనీకి రూ.371 కోట్లు విడుదల చేస్తున్నట్టు ఆర్థిక శాఖ అధికారులు ఆ నోట్‌ఫైళ్లలో స్పష్టం చేస్తూ ఆ నిధులు విడుదల చేశారు. లోకేశ్‌దీ కీలక పాత్ర షెల్ కంపెనీల ద్వారా నిధులు ముంబయి నుంచి హైదరాబాద్‌కు.. అక్కడి నుంచి చంద్రబాబు నివాసానికి చేర్చడంలో ఆయన తనయుడు నారా లోకేశ్ కీలక పాత్ర పోషించారు. లోకేశ్ తన సన్నిహితుడు కిలారు రాజేశ్ ద్వారా ఆ నిధుల తరలింపు ప్రక్రియను పర్యవేక్షించారు. ఫైళ్లు మాయంటీడీపీ హయాంలోనే 2018లో కేంద్ర జీఎస్టీ అధికారులు ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణాన్ని గుర్తించారు. పుణెలోని పలు షెల్ కంపెనీల్లో సోదాలు చేసి భారీగా నకిలీ ఇన్వాయిస్లను జప్తు చేశారు. వాటిలో ఏపీఎస్ఎస్డీసీకి సరఫరా చేసిన నకిలీ ఇన్వాయిస్లను గుర్తించడంతో ఏపీ ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. అయితే దీనిపై విచారణ చేయకుండా ఏసీబీని చంద్రబాబు అడ్డుకున్నారు. ఆ వెంటనే ఏపీఎస్ఎస్డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫైళ్లను మాయం చేశారు. నిధులు కొల్లగొట్టేందుకుగ్రీన్ చానల్ ఆ ప్రాజెక్ట్ నిధులను షెల్ కంపెనీల ద్వారా కొల్లగొట్టేందుకు చంద్రబాబు ప్రత్యేకంగా గ్రీన్ చానల్‌ను ఏర్పాటు చేసుకున్నారు. విద్యా శాఖతో నిమిత్తం లేకుండా ఏపీఎస్ఎస్డీసీ నుంచి నేరుగా ఎంటర్‌ప్రైజస్– ఇన్నోవేషన్ డిపార్ట్మెంట్ అక్కడ నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫైళ్లు పంపాలని ఆదేశించారు. ఆ మేరకు డిజైన్ టెక్ కంపెనీకి విడుదల చేసిన రూ.371 కోట్లలో రూ.279 కోట్లను యోగేశ్ గుప్తా మన దేశంతోపాటు సింగపూర్, దుబాయ్‌లలోని షెల్ కంపెనీలకు తరలించారు. అనంతరం షెల్ కంపెనీల కమీషన్లు మినహాయించుకుని హవాలా మార్గంలో, బ్యాంకు నుంచి డ్రా చేసి మొత్తం రూ.241 కోట్లను షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసానికి ముంబయిలో అందించారు. ఆ నగదును మనోజ్ పార్థసాని చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు హైదరాబాద్‌లో ముట్టజెప్పారు. ఆయన ఆ రూ.241 కోట్లు చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. కస్టడీలో విచారించాల్సినఅవసరం ఉంది ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం మాస్టర్ మైండ్ చంద్రబాబుకు అత్యున్నత స్థాయిలో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికే సిట్ విచారణ కోసం నోటీసులు జారీ చేసిన యోగేశ్ గుప్తా, మనోజ్ పార్థసాని విదేశాలకు పరారయ్యారు. మిగిలిన సాక్షులను కూడా చంద్రబాబు బెదిరించి దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆయన్ను అరెస్టు చేశాం. ఆయన బయట ఉంటే కేసు దర్యాప్తు పక్కదారి పట్టే అవకాశాలున్నాయి. అందువల్ల ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఈ కేసును సమగ్రంగా విచారించేందుకు చంద్రబాబును కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉంది. -
బాబు ఫిర్యాదే ఓ బోగస్
సాక్షి, న్యూఢిల్లీ: దొంగ ఓట్ల నమోదులో ప్రపంచ ఛాంపియన్ అయిన చంద్రబాబు బోగస్ ఫిర్యాదులు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. దొంగే.. దొంగా..దొంగా అనడానికి సరైన అర్థం చంద్రబాబు అని తెలిపారు. ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి తిరిగి అదే ఎన్టీఆర్‌కు పూలమాల వేయగలగడం చంద్రబాబుకే సాధ్యమన్నారు. ఎన్టీఆర్‌ను బతికున్న రోజుల్లో బాగా చూసుకున్న వారిని వదిలేసి.. ఆయన్ని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఈరోజు ఎన్టీఆర్ పేరుతో రూపొందించిన రూ.100 నాణెం ఆవిష్కరణ సభలో పాల్గొనడం చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. విజయసాయిరెడ్డి సోమవారం సాయంత్రం వైఎస్సార్సీపీ ఎంపీలతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ బృందంతో భేటీ అయ్యారు. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో దొంగ ఓట్లు ఎలా నమోదయ్యాయో ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పారదర్శకంగా ఓటరు జాబితా రూపొందించడంపై చర్చించారు. దొంగ ఓట్ల నమోదుపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. 2015 నుంచి టీడీపీ దొంగ ఓటర్ల వివరాలిచ్చాం చంద్రబాబు హయాంలో జరిగిన దొంగ ఓటర్ల మాల్‌ప్రాక్టీస్‌పై ఎన్నికల సంఘం అధికారులతో సుదీర్ఘంగా చర్చించాం. అధికారులు సానుకూలంగా స్పందించారు. బాబు హయాంలో మా పార్టీ ఓట్ల గల్లంతు, టీడీపీ వ్యక్తుల దొంగ ఓట్లపై అన్ని ఆధారాలతో ఎన్నికల సంఘానికి వివరించాం. ఉదాహరణకు లక్ష్మి అనే మహిళ పేరును రకరకాల స్పెల్లింగ్‌లతో, వయస్సులు, ఇంటిపేర్లు, భర్త పేర్లు, డోర్ నెంబర్ సబ్‌డివిజన్ చేసి .. ఇలా రకరకాల మార్పులతో అనేక ఓట్లుగా చంద్రబాబు ఎలా చేర్పించారో ఆధారాలతో అందించాం. ఎన్నికల కమిషన్ ఉన్నతాశయాలను దుర్వినియోగం చేస్తూ రోడ్లపై అనాథల్లా తిరిగే వారిని, స్థిరనివాసం లేని సంచారులను సైతం ఏదో ఒక డోర్ నెంబర్ మీద ఓటర్లుగా చేర్చి పెట్టుకున్నాడు చంద్రబాబు. 2015 నుంచి 2017 వరకు అన్ని వివరాలు ఇచ్చాం. 2019 ఎన్నికలకు ముందు 3.98కోట్ల మంది ఓటర్లు ఉంటే.. ఈ రోజుకు 3.97 కోట్ల ఓటర్లు ఉన్నారు. తేడా లక్ష మాత్రమే. సగటున ప్రతి వెయ్యి మందికి ఓటర్ల వివరాల్ని చూశాం. రాష్ట్రంలో 63 నియోజకవర్గాల్లో 20 చోట్ల 15,800 దొంగ ఓట్లు నమోదైనట్లు తేలింది. 40 నియోజకవర్గాల్లో 5,800 నుంచి 6,000 వరకు దొంగ ఓట్లు తేలాయి. ఇవన్నీ ఏయే జిల్లాల్లో ఏ ఏ నియోజకవర్గాల్లో ఉన్నాయో టేబుల్ రూపంలో అందించాం. ఓటర్ల జాబితాలో వైఎస్సార్సీపీ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. చంద్రబాబు ఆనాడు ఏ విధంగానైతే రాజకీయంగా ఓటర్ల జాబితాలను తారుమారు చేశాడో.. ఆ విధానాల్ని మా పార్టీ అమలు చేయలేదు. చంద్రబాబు ఓటర్ల జాబితాలపై ఎందుకు వణుకుతున్నాడో కూడా ఎన్నికల సంఘానికి వివరించాం. 2019 ఎన్నికలకు ముందు చేర్చిన దొంగ ఓటర్లే ఈనాటి దాకా జాబితాలో ఉన్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో జాబితాలపై రీసర్వే చేస్తూ.. ఆధార్‌తో ఓటర్ ఐడీని లింక్ చేస్తే ఆయన దొంగ ఓట్లన్నీ బయటకొస్తాయి. ఇదే జరిగితే మరోసారి ఆయన ఓటమి ఖాయం. ఆ ఫ్రస్ట్రేషన్‌తోనే వైఎస్సార్సీపీపై ఎన్నికల సంఘానికి తప్పుడు ఫిర్యాదు ఇచ్చారు. నాడు సేవా మిత్ర.. నేడు మై టీడీపీ యాప్‌తో గతంలో సేవామిత్ర యాప్ ద్వారా ఇతర పార్టీల సానుభూతిపరులెవరో తెలుసుకొని, వైఎస్సార్సీపీ ఓటర్లను జాబితాల్లో నుంచి తొలగించారు. ఈ విషయం తెలుసుకుని మేం ఆనాడు పోరాటం చేశాం. ఇప్పుడు అదే బాటలో ‘మై టీడీపీ’ యాప్ అంటూ ఓటర్ల నుంచి ఎలాంటి సమాచారాన్ని సేకరిస్తున్నారో, దానిని చంద్రబాబు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాం. అశోక్ డాకవరం అనే వ్యక్తి టీడీపీ తరఫున ఓటర్ల సమాచారాన్ని సేకరించడం, దాంతో ఓటర్‌కు తెలియకుండానే ఓటు తొలగింపు, కొత్త ఓటర్లను చేర్చుకొనే దరఖాస్తుల్ని ఎలా మేనేజ్ చేస్తున్నాడో ఆధారాలతో సహా వివరించాం. ఓటరు సర్వేలో అభ్యంతరకరమైన ప్రశ్నలతో చంద్రబాబు మెథడాలజీని అశోక్ అమలు చేస్తున్నారు. ఓటర్ పొలిటికల్ ప్రిపేర్డ్నెస్, పార్టీ ఛాయిస్‌తో ఏం సంబం«దం ఉందని అశోక్ అడుగుతున్నారు? అతని అవసరమేంటి? ఓటరు కులం ఏమిటో కూడా అడుగుతున్నారు. దీన్నిబట్టి చంద్రబాబులో కుల ఉన్మాదం ఎంతగా పెరిగిందో అర్థమవుతుంది. సభ్య సమాజంలో ఏ వ్యక్తి, ఏ నాయకుడైనా ఓటరును కులం అడగగలరా? ఇవి చాలా నేరపూరితమైన విషయాలుగా వైఎస్సార్సీపీ భావిస్తోంది. ఇదే విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాం. పారదర్శక ఓటర్ల జాబితా వైఎస్సార్సీపీ సిద్ధాంతం బోగస్ ఓట్లను ఏరివేయాలని, పూర్తి పారదర్శకంగా ఓటర్ల జాబితాతో ఎన్నికలు జరగాలనేది వైఎస్సార్సీపీ సిద్ధాంతం. ఇదే విషయాన్ని ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వారి ముందు ప్రధానంగా రెండు డిమాండ్లు ఉంచాం. ఓటరు ఐడీతో ఆధార్ కార్డు లింకు చేయాలని కోరాం. దీనిద్వారా చంద్రబాబు దొంగ ఓట్లు చేర్పించే దురాలోచనకు బ్రేకులు పడతాయి. అదేవిధంగా ఆధార్ లింకుతో బయోమెట్రిక్ సదుపాయం ఉంటుంది. ఒక వ్యక్తికి ఒకే ఓటు (వన్సిటిజన్.. వన్ ఓట్) అనే వైఎస్సార్సీపీ సిద్ధాంతం నెరవేరుతుంది. చంద్రబాబు ఈరోజు వైఎస్సార్సీపీ దొంగ ఓట్లు చేరుస్తోందంటూ దొంగే.. దొంగా, దొంగా.. అన్నట్లు రంకెలేస్తున్నారు. వాస్తవానికి ఆయన ఓటర్ల జాబితా మాల్‌ప్రాక్టీస్‌పై మేము వైఎస్సార్సీపీ తరఫున 2018లోనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. 2014 నుంచి నేటి వరకు ఓటర్ల జాబితాలపై ప్రత్యేక విచారణ చేయాలని కోతున్నాం. దొంగ ఓట్లు చేర్చడం, నిజమైన ఓటర్ల వివరాల గల్లంతుకు ఎవరు పాల్పడ్డారనే వాస్తవాన్ని నిగ్గు తేల్చాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశాం. -
సర్వేలపై ఎల్లో మీడియా సొంత కథనాలు
సాక్షి, అమరావతి: ఏ జాతీయ సంస్థ సర్వే వచ్చినా అది ఫేక్, పెయిడ్ అంటూ ఎల్లో మీడియా సొంత కథనాలు వండి వారుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ఆయన శనివారం గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఇండియా టుడే ఇంగ్లిష్ న్యూస్ చానల్... సీ ఓటర్‌తో కలిసి చేసిన సర్వే మాత్రమే అసలు సిసలు అంటూ ఎల్లో మీడియా ఊదరగొడుతోందన్నారు. పచ్చ పార్టీ గెలుస్తుందని చెబితే ఒరిజినల్, లేకపోతే ఆ సర్వే ఫేకా అని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో గ్యారెంటీగా గెలుస్తామనే ధీమా టీడీపీలో ఏ ఒక్కరికీ లేదన్నారు. రాజకీయాల్లో విజేతలు, హుందాగా ఉండే వారి మాటలకే సమాజంలో గౌరవం ఉంటుందని తెలిపారు. పరాజితులు, ఒకప్పటి రౌడీషీటర్లు, చిల్లర నేరగాళ్లు హెచ్చరికలు జారీ చేస్తే వీధి కుక్కలు కూడా భయపడవని చెప్పారు. నలుగురి దృష్టిని ఆకర్షించే ఘటన ఎక్కడ జరిగినా దాన్ని చంద్రబాబు తనకు ఆపాదించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు రావడానికి కూడా తానే స్ఫూర్తి అని అన్నా అంటారన్నారు. ‘‘నా హయాంలోనే ఎర్రచందనం స్మగ్లింగ్ కొత్త పుంతలు తొక్కింది.. ఎందరో పుష్పరాజ్‌లను నేను తయారు చేశా.. పుష్ప పార్ట్ 2 కూడా వస్తోంది తమ్ముళ్లూ’’ అని బాబు అంటారేమో అని ఎద్దేవా చేశారు. పల్నాడు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు తాము సమీక్ష నిర్వహిస్తే ‘ఈనాడు’లో తప్పుడు కథనాలు రాశారని మండిపడ్డారు. జర్నలిజం విలువలను పూర్తిగా వదిలేసిన ఈనాడు అభూత కల్పనలు రాస్తూ నానాటికీ దిగజారుతోందన్నారు. కాగా ఇంటర్నేషనల్ కాంపిటెన్స్ ఫర్ ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రకటించిన జైవిక్ ఇండియా అవార్డుకు ఎంపికైన గనిమిశెట్టి పద్మజకు విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపారు. మన రాష్ట్రానికి మూడు అవార్డులు దక్కడం ప్రశంసనీయమన్నారు. -
అదంతా ఉత్తదే! ఎలాన్ మస్క్‌పై షాకింగ్ రిపోర్ట్
ఎక్స్ (ట్విటర్) అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk)పై షాకింగ్ రిపోర్ట్ ఒకటి వెలువడింది. చిత్రమైన ఆలోచనలు, నిర్ణయాలు, విచిత్ర వ్యాఖ్యానాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే మస్క్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఇదంతా ఉత్తదే అని ఓ రిపోర్ట్ పేర్కొంటోంది. ఎక్స్ (ట్విటర్)లో ఎలాన్ మస్క్‌కు ఏకంగా 153.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఇందులో చాలా వరకు అకౌంట్లు ఫేక్ అని, కొన్ని యాక్టివ్ లో లేవని, మరికొన్ని కొత్త అకౌంట్స్ అని థర్డ్ పార్టీ రీసెర్చర్ ‘ట్రావిస్ బ్రౌన్’ సేకరించిన డేటా ఆధారంగా ‘మ్యాషబుల్’ (Mashable) అనే టెక్ వెబ్సైట్ నివేదించింది. మస్క్‌కి ఉన్న 153.9 మిలియన్ల మంది ఫాలోవర్లలో దాదాపు 42 శాతం అంటే 65.3 మిలియన్లకు పైగా ఖాతాలకు కనీసం ఒక్క ఫాలోవర్ కూడా లేరని ఈ నివేదిక పేర్కొంది. మస్క్‌ను అనుసరిస్తున్న ఒక్కో ఖాతాలకు సగటున ఉన్న ఫాలోవర్లు కేవలం 187 మంది. మస్క్ ఫాలోవర్లలో 0.3 శాతం అంటే 4,53,000 మంది మాత్రమే ఎక్స్ ప్రీమియం (ట్విటర్ బ్లూ) సబ్స్క్రైబర్లు. మస్క్ ఫాలోవర్లలో 62.5 మిలియన్ల మంది ఎప్పుడూ అసలు ఒక్క ట్వీట్ కూడా చేయలేదని రిపోర్ట్ వెల్లడించింది. -
బుద్ధి తక్కువై లోకేష్ పాదయాత్రకెళ్లా!
Viral Video: పాదయాత్ర చేస్తే ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావాలి. ప్రజల కష్టాలు దగ్గరగా వెళ్లి చూడాలి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర అలా చేసి ప్రజల కష్టాలు చూశారు కాబట్టే.. ఆశీర్వదించి ఘన విజయం కట్టబెట్టారు ఏపీ ప్రజలు. పులిని చూసి నక్కవాత పెట్టుకోవాలనుకుంటే ఏం జరుగుతుంది?.. అసలు తెలుగు దేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు చేస్తోంది ఏం యాత్ర?.. ఆ అనుమానాల్ని నివృత్తి చేసే వీడియో మరొకటి సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా యువగళం పాదయాత్రలో ఓ దివ్యాంగుడిని పరామర్శించిన(యాక్టింగ్లేండి) పరామర్శించాడు నారా లోకేష్. బ్యాక్‌గ్రౌండ్‌లో టీడీపీ సాంగ్ మారుమోగుతుంటే.. ఆ పెద్దాయనతో చిరునవ్వుతో రోడ్డు మీద ఓ ఫొటో కూడా దిగాడు. కానీ, ఈలోపు పక్క నుంచి ఓ పచ్చ నేత ఐదొందల నోటును ఆ దివ్యాంగుడి చేతిలో పెట్టాడు. దాన్ని ఆయన తీసుకున్నాడు. కట్ చేస్తే.. తన మానాన తాను చర్చికి వెళ్తుంటే.. నారా లోకేష్ యువ గళం పాదయాత్ర ఉందని చెబుతూ విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు తీసుకెళ్లాడని, 2వేల రూపాయలు ఇస్తామని చెప్పి.. కేవలం 500లే ఇచ్చారని, వికలాంగుడినైన తనని కూడా మోసం చేశారని, పాదయాత్రకెళ్లి బుద్ధి తక్కువ పని చేశానని చెంపలేసుకున్నాడు పాపం ఆ పెద్దాయన. -
ఢిల్లీ టూ రాంకోఠి!
హైదరాబాద్: సుజుకీ కంపెనీకి చెందిన టూవీలర్, ఫోర్ వీలర్ల నకిలీ స్పేర్ పార్ట్స్ అమ్మకాలు చేస్తున్న రాంకోఠిలోని ‘బాలజీ ఆటో పార్ట్స్’ షాపుపై సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపుదాడి చేశారు. సుజుకీ కంపెనీకి చెందిన హోలోగ్రామ్ డూప్లికేట్ది తయారు చేసి ఇదే నిజమైన కంపెనీదంటూ నమ్మిస్తూ వాహనదారులను కొంతకాలంగా మోసం చేస్తున్న విషయాన్ని గుర్తించారు. దీంతో పాటు సుజుకి కంపెనీకి చెందిన క్యూఆర్ కోడ్లను సైతం క్రియేట్ చేసి ఈ నకిలీ దందాకు పాల్పడుతున్నట్లు స్పష్టత వచ్చింది. దీంతో ‘బాలాజీ ఆటో పార్ట్స్’ షోరూంలో భారీ ఎత్తున ఫేక్ స్పేర్ పార్ట్స్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు సీజ్ చేసి నారాయణగూడ పోలీసులకు అప్పగించారు. టాస్క్‌ఫోర్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నారాయణగూడ పోలీసులు యజమాని మహేందర్కుమార్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీ నుంచి దిగుమతి.. రాంకోఠి కేంద్రంగా కొంతకాలంగా ద్విచక్ర, కారు, ఆటోలకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ నకిలీ దందా నడుస్తుంది. ఈవిషయంపై సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారం అందుకుని శనివారం రాత్రి ‘బాలాజీ ఆటో పార్ట్స్’ షోరూంపై రైడ్ చేశారు. షోరూంకు చెందిన మహేందర్ కుమార్ గత కొంతకాలంగా న్యూఢిల్లీ నుంచి నకిలీ స్పేర్ పార్ట్స్‌ను ఇక్కడకు తీసుకొస్తున్నాడు. హోలోగ్రామ్‌ను కూడా ఇదే షోరూంలో నకిలీది తయారు చేసి ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన ఆ పరికరాలపై వేస్తున్నారు. దీంతో పాటు క్యూఆర్ కోడ్ సైతం పరికరాల కవర్లపై ఉండటంతో ఎవరికీ ఇది ఫేక్ అని అనుమానం లేదు. న్యూఢిల్లీలో సుమారు రూ.500కు కొనుగోలు చేసిన పార్ట్స్‌ను ఇక్కడ రూ.1000కి అమ్ముతున్నారు. ఇలా కొంతకాలంగా చేస్తున్న నకిలీ స్పేర్‌పార్ట్స్ వ్యవహారంపై సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ సాయికిరణ్ రైడ్ చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దాదాపు రూ.10 లక్షల నకిలీ పార్ట్స్ సీజ్ రైడ్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు 14 సిలిండర్ పిస్టాన్ కిట్స్, 26 ఎయిర్ ఫిల్టర్లు, 6 అబ్సోర్బేర్ అస్సీ రేర్ షాక్, 45 షూసెట్బ్రేక్లు, 45 ప్లేట్ క్లచ్‌లు, 8 సీడీఐ యూనిట్లు, 5 హబ్ రేర్ వీల్స్, 5 ఎయిర్ ఫిల్టర్ బాక్సులు, 5 డిస్క్ క్లచ్ ప్రెజర్లు, 5 హబ్క్లచ్ స్టిక్కర్స్, 75 వారిటర్ బాడీలు, ఒక డెల్ ల్యాప్‌టాప్, ఒక ప్రింటర్, సుజుకీ క్యూ ఆర్‌కోడ్ స్టిక్కర్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి ధర దాదాపు రూ.10 లక్షలు ఉండొచ్చని పోలీసులు పేర్కొన్నారు. -
నకిలీ టీచర్లకు ప్రమోషన్లు.. దర్జాగా విద్యార్థులకు పాఠాలు.. 14 ఏళ్ల ముసుగు తొలగిందిలా!
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ పోలీసులు ఇద్దరు నకిలీ టీచర్లను అరెస్టు చేశారు. వీరు నకిలీ డాక్యుమెంట్ల సహాయంతో 14 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. ఈ టీచర్లిద్దరూ కాన్పూర్‌లోని దేహాత్ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. ఇంతేకాదు వీరిద్దరికీ ప్రభుత్వం ప్రమోషన్లు కల్పించి, హెడ్మాస్టర్లను చేసింది. ఈ విషయం వెల్లడికావడంతో అటు విద్యావిభాగంతో పాటు ఇటు సామాన్యులలోనూ కలకలం చెలరేగింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం 2009లో నకిలీ విద్యార్హతల ధృవపత్రాలతో అనిల్ కుమార్, బ్రజేంద్ర కుమార్‌లు టీచర్ ఉద్యోగాలు సంపాదించారు. దేహాత్ పరిధిలోని ఝీంఝక్లో ఉంటున్న అనిల్ ములాయి ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్. అలాగే బ్రజేంద్ర కుమార్ షాహ్పూర్ మోహ్రా ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్గా ఉన్నారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి.. బర్రా పోలీస్ ఇన్స్పెక్టర్ నూర్య బలిపాండే మీడియాతో మాట్లాడుతూ బర్రాకు చెందిన సందీప్ రాథౌడ్ ఏడాది క్రితం అంటే 2022లో గ్వాలియర్‌లో ఉంటున్న అతని బంధువు రాజీవ్ తనను మోసగించాడంటూ ఫిర్యాదు చేశాడన్నారు. రాజీవ్‌తో పాటు అతని తల్లి, సోదరి కలసి తనకు టీచర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ. 34 లక్షలు తీసుకున్నారనని సందీప్ తన ఫిర్యాదులో ఆరోపించాడు. ఈ పనిలో కాన్పూర్‌కు చెందిన రామ్‌శరణ్, అతని దగ్గర పనిచేసే ధర్మేంద్రల హస్తం కూడా ఉన్నదని పేర్కొన్నాడు. వీరంతా తాను టీచర్ అయ్యేందుకు కావలసిన నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని తెలిపాడు. అయితే ఇలా దొంగ సర్టిఫికెట్లతో టీచర్ ఉద్యోగం చేసేందుకు సందీప్ నిరాకరించాడు. ఫలితంగా తన డబ్బు కూడా తిరిగి రాలేదని సందీప్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసుల దర్యాప్తులో మరిన్ని కొత్త విషయాలు వెలుగు చూశాయి. రాజీవ్ నకిలీ ధృవపత్రాలతో ఇద్దరికి టీచర్ ఉద్యోగాలు ఇప్పించినట్లు పోలీసులు గుర్తించారు. వారు అనిల్ కుమార్, బ్రజేంద్రలుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ గత 14 ఏళ్లుగా కాన్పూర్‌లోని దెహాత్ పాఠశాలలో టీచర్లుగా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. పోలీసులు వీరికి సంబంధించిన రికార్డులు చెక్ చేయగా, వీరి దగ్గరున్నవి దొంగ సర్టిఫికెట్లని గుర్తించారు. దీంతో వీరిద్దరినీ అరెస్టు చేశారు. ఈ విషయమై ఏడీసీపీ అశోక్ కుమార్ సింగ్ మాట్లాడుతూ పోలీసులు ఇద్దరు యువకులను అరెస్టు చేశారని, వారు నకిలీ పత్రాలతో ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు పొందారని గుర్తించామని తెలిపారు. అయితే వీరికి ఉద్యోగాలు ఇప్పించిన రాజీవ్ సింగ్ హైకోర్టు నుంచి అరెస్టు వారెంట్‌పై స్టే తెచ్చుకున్నాడన్నారు. ఈ ఉదంతంతో ప్రమేయం ఉన్న రామ్ కశ్యప్‌ను కొద్ది రోజుల క్రితమే అరెస్టు చేసి, జైలుకు తరలించామన్నారు. ఇది కూడా చదవండి: ‘హార్మోనియం’ను నెహ్రూ, ఠాగూర్ ఎందుకు వ్యతిరేకించారు? రేడియోలో 3 దశాబ్దాల నిషేధం వెనుక.. -
చంద్రబాబు వల్లే రాష్ట్రం దివాలా: మంత్రి రాజా
తుని రూరల్: చంద్రబాబు హయాంలో అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని దివాలా తీయించారని రోడ్లు భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. కాకినాడ జిల్లా తుని మండలం గెడ్లబీడు వద్ద శుక్రవారం జరిగిన జేసీఎస్ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రాజా మాట్లాడుతూ ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని చంద్రబాబు, యనమల రామకృష్ణుడు చేస్తున్న తప్పుడు ప్రచారంపై ధ్వజమెత్తారు. తనపై యనమల రామకృష్ణుడు తప్పుడు ప్రచారం చేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటనందూరు మండలంలో తాను 150 ఎకరాలు కొనుగోలు చేసినట్లు నిరూపిస్తే ఆ భూమిని ఆయనకే రాసిచ్చేస్తానని సవాల్ విసిరారు. -
భక్తులకు కర్రలు కాకుండా.. తుపాకులివ్వాలా!.. తప్పుడు ప్రచారంపై చర్యలు తప్పవు!
"టీటీడీపై హద్దు పద్దు లేని దుష్ప్రచారం".."ఎవరైతే దుష్ప్రచారంలో భాగంగా సోషల్ మీడియాలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వీడియోలను కట్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారో వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధం అవుతున్న టీటీడీ సైబర్ సెక్యూరిటీ విభాగం." సాక్షి, తిరుమల: తిరుమలకు నడిచి వెళ్లే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని భక్తులకు చేతికర్ర ఇవ్వాలని టీటీడీ తీసుకున్న నిర్ణయంపై సామాజిక మాధ్యమాల్లో చాలామంది వెకిలిగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. దుడ్డుకర్ర భక్తుల ప్రాణాలు కాపాడుతుందా అని హేళన చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నవారికి ఏమాత్రం బాధ్యత లేదనిపిస్తుంది. లేదా ప్రభుత్వం మీద ఉద్దేశపూర్వకంగానే ఇలా మాట్లాడుతున్నారని అనిపిస్తుంది. అంతా అడవి మార్గమే.. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లాలంటే.. మొత్తం అటవి మార్గమే. అది అలిపిరి మెట్ల మార్గమైనా, శ్రీవారిమెట్టు మార్గమైనా తొలిమొట్టు మొదలు చివరి సోపానం దాకా అడవే. అందులోనూ రిజర్వు ఫారెస్టు. అందుకే శేషాచల అడవుల్లో వన్యప్రాణులు ఎక్కువగానే వుంటాయి. కరోనా లాక్ డౌన్ వల్ల నెలల తరబడి చడీచప్పుడు లేకపోవడంతో అడవి జంతువులు.. మెట్లమార్గంలోనూ, ఘాట్ రోడ్లలోనూ స్వేచ్ఛగా తిరుగాడటం మొదలుపెట్టాయి. అందుకే కరోనా తరువాత.. చిరుతలు, ఏనుగులు, ఎలుగుబంట్ల సంచారంపై తరచూ వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భక్తులపై అడవి జంతువుల దాడులు పెరిగాయి. భక్తుల రక్షణ కోసం టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటున్నా అప్పుడప్పుడు అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు సమస్య మరింత తీవ్రమైంది. అద్భుతమైన ఏర్పాటు.. నడక దారి భక్తుల రక్షణ కోసం, సౌకర్యం కోసం.. వందల కోట్లు ఖర్చుచేసి నడక దారులను అద్భుతంగా నిర్మించారు. నడవడానికి సౌకర్యవంతంగా మెట్లు, వాతావరణ ఇబ్బందులను తట్టుకునేలా పైకప్పు నిర్మించారు. రాత్రిపూట కూడా నడవడానికి ఇబ్బందిలేకుండా కాంతివంతమైన విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. అలాగే.. చిరుతల జాడ కనిపించినపుడు వాటిని బంధించి దూరంగా విడిచిపెడుతున్నారు. దేశంలోని ఏ దేవాలయమూ కల్పించని ఏర్పాట్లను టీటీడీ చేస్తున్నది. ఇన్ని చేస్తున్నా ఏదో ఒక కారణంతో టీటీడీని విమర్శిస్తున్న వారు ఉన్నారు. తిరుమలకు సంబంధించిన ప్రతీ అంశాన్ని సున్నితంగా మార్చేయడం, సంచలనం చేయడమే ఇందుకు కారణం. అది వేరే అంశం. చేతికర్రతో ఎంతో ధైర్యం.. ఇక ప్రస్తుత విషయానికొస్తే.. భక్తల రక్షణ కోసం చేతికి కర్రలు ఇవ్వాలని నిర్ణయించడం తప్పవుతుందా..! భక్తులకు కర్రలు కాకుండా తుపాకులివ్వాలా..! అయినా కర్రని తేలిగ్గా తీసేయాల్సిన పనిలేదు. గ్రామాల్లో ఒంటరిగా పొలానికెళ్లే రైతు చేతిలో కర్ర ఉంటుంది. ఆ సమయానికి ఆ చేతికర్రే రైతుకు తోడు, రక్షణ. అటవీ ప్రాంతాల్లో సంచరించే గిరివాసులకు కర్రే బలమైన ఆయుధం. ఏనుగును మావటి నియంత్రించేది కర్రతోనే. మనిషి చేతిలో కర్రను చూస్తే ఏ జంతువైనా భయపడుతుంది. తిరుమల నడక దారిలో చిరుతలతో పాటు ఎలుగుబంట్ల బెడదా కూడా ఉంది. అలాంటప్పుడు భక్తుల చేతిలోని కర్ర కచ్చితంగా రక్షణగా నిలుస్తుంది. వందలాది భక్తుల చేతుల్లో కర్రలుంటే చిరుతైనా తోకముడుస్తుంది. ఉత్తి చేత్తో నడవడం కంటే.. చేతిలో కర్ర ఉండటం ఎన్నో రెట్లు ధైర్యాన్నిస్తుంది. చేతికర్ర ఊతంతో మెట్లు ఎక్కడమూ సులభమవుతుంది. భక్తులపై కూడా రాజకీయాలు.. ఇలాంటివేవీ పట్టించుకోకుండా, భక్తుల ప్రాణాలు సంకటంలో ఉన్న వేళలోనూ రాజకీయాల కోసం అవహేళన చేయడం, అసంబద్ధ విమర్శలు చేయడం సమర్ధనీయం కాదు. అయినా చేతికి కర్రలు ఇవ్వడంతోనే సరిపెట్టుకోలేదు. భక్తులను గుంపులుగా పంపడం, ప్రతీ పది మీటర్లకు ఇక సెక్యూరిటీ గార్డు ఏర్పాటు, అటవీ ప్రాంతం వైపు అధిక కాంతినిచ్చే విద్యుత్ దీపాలు, శబ్ధం చేస్తూ అడవి జంతువులను దూరంగా తరమటం, అడవి దారిలో చిన్నారుల నడక సమయంలో మార్పులు ఇలాంటి చర్యలూ టీటీడీ చేపట్టింది. భక్తుల రక్షణ కోసం ఏం చేయాలో అన్నీ టీటీడీ చేస్తున్నది. దీన్ని అభినందించాల్సింపోయి ఎగతాళి చేయడం సరికాదు. ఇది కూడా చదవంవడి: తిరుమల: బోనులో చిక్కిన మరో చిరుత.. -
ప్రియుని కోసం పాకిస్తాన్ వచ్చిన బ్రిటన్ మహిళ.. పోలీసులకు చుక్కలు!
ఇటీవలి కాలంలో భారత్-పాకిస్తాన్ మధ్య పలువురు యువతీయువకుల ప్రేమ కథలు వినిపిస్తున్నాయి. మొదట సీమా హైదర్, ఇప్పుడు అంజూ.. వీరిద్దరూ ప్రేమ పేరుతో ‘సరిహద్దులు’ దాటేశారు. ఈ తరహా కథలు ఈమధ్య కాలంలో సోషల్‌మీడియాలో లెక్కకుమించి కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి కథలన్నీ నిజం కాదనే వాదన కూడా వినిపిస్తోంది. తాజాగా పాక్ పోలీసులు ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాకు చెందిన ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో ఫేక్ పోస్ట్ పెట్టాడనే ఆరోపణలతో అతనిపై కేసు నమోదు చేశారు. ఆ పోస్టులో ఒక మహిళ తన ప్రేమికునితో పాటు ఉండేందుకు విదేశాల నుంచి ఇక్కడకు వచ్చిందని పేర్కొన్నాడు. అయితే అతని కథనంలో నిజం లేదని పోలీసులు తేల్చారు. సీరియస్‌గా మారిన సిల్లీ పోస్ట్! పాక్ న్యూస్ వెబ్సైట్ ‘ఆజ్ ఇంగ్లీష్’లోని ఒక కథనం ప్రకారం ముహమ్మద్ గులాబ్ ఒక సోషల్ మీడియా పోస్టులో ఇలా అనే ఒక బ్రిటీష్ మహిళ తన ప్రియునితో పాటు ఉండేందుకు సలార్జై వచ్చిందని పేర్కొన్నాడు. కేవలం వినోదం కోసం అతను షేర్ చేసిన ఈ పోస్టు సీరియస్‌గా మారిపోయింది. ఈ పోస్టును చూసిన పోలీసులు వెంటనే అప్రమత్తమై, ఆ వ్యక్తి ఆ పోస్టులో పేర్కొన్న చిరునామాకు తరలివెళ్లి చూడగా, అక్కడ ఎవరూ లేకపోవడాన్ని గమనించి ఆశ్చర్యపోయారు. కేసు నమోదు.. అరెస్టు! అనంతరం పోలీసులు ఈ ఫేక్ పోస్టు క్రియేట్ చేసిన ముహమ్మద్ గులాబ్‌పై కేసు నమోదు చేయడంతో పాటు అతనిని అరెస్టు చేశారు. అయితే స్థానికులు ముహమ్మద్ అరెస్టును వ్యతిరేకించారు. సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు సాధారణమేనని వారు వాదిస్తున్నారు. కాగా కొద్ది రోజుల క్రితం పాకిస్తానీ మహిళ సీమా హైదర్ తన భారతీయ ప్రేమికుని కోసం నేపాల్ మార్గం గుండా అక్రమంగా భారత్‌లోనికి ప్రవేశించింది. ప్రస్తుతం పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. ఇదేవిధంగా భారత్‌కు చెందిన అంజూ తన ఫేస్బుక్ ప్రెండ్ నసరుల్లాను కలుసుకునేందుకు పాక్ వెళ్లింది. ఇది కూడా సంచలనంగా మారింది. ఇది కూడా చదవండి: రోడ్డుపై అర్థనగ్నంగా యువతి నృత్యం.. ఒళ్లు మండిన యువకుడు చేసిన పని ఇదే.. -
పాతబస్తీలో నకిలీ నోటు కలకలం!
చంచల్‌గూడ: దేశంలో రూ.1000, రూ.500 నోట్లు రద్దు అనంతరం కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఆర్బీఐ కొత్త రూ. 2 వేలు, రూ. 500, రూ. 200 నోట్లను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. కాగా గత గురువారం పాతబస్తీలోని మాదన్నపేట కూరగాయల మార్కెట్లో నకిలీ రూ. 200 నోటు దర్శనమిచ్చింది. మార్కెట్లో ఓ వ్యాపారి వద్ద గుర్తు తెలియని వ్యక్తి ఆకు కూరలు కొనుగోలు చేసి రూ. 200 నోటు ఇచ్చి మిగతా డబ్బులు తీసుకుని జారుకున్నాడు. సదరు వ్యాపారి ఆ రూ.200 నోటును వ్యాపారం చెల్లింపుల్లో భాగంగా మరో వ్యాపారికి ఇవ్వగా నకిలీదిగా గుర్తు పట్టాడు. నోటు సైజ్ తక్కువ, పేపర్ మందం ఎక్కువగా ఉంది. కలర్లో వ్యత్యాసం ఉండటంతో పాటు నోటుపై వాటర్ మార్క్ గాంధీ బొమ్మ కూడా లేకపోవడంతో అది ఫేక్ నోటుగా నిర్ధారించుకున్నాడు. దీంతో అసలైన నోటు అని భావించిన వ్యాపారి తాను మోసపోయినట్లు గుర్తు పట్టారు. వారం క్రితం రూ. 500 నోటు ఇక్కడే ఈ ఘటనకు వారం రోజుల ముందు కూడా ఇలాగే మరో గుర్తు తెలియని వ్యక్తి రూ. 500 నకిలీ నోటు మార్చేందుకు యయత్నంచగా పసిగట్టిన వ్యాపారి సదరు వ్యక్తితో గొడవపడినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ రెండు ఘటనలను పరిశీలిస్తే నగరంలో నకిలీ రూ. 500, 200 నోట్లు చెలామణిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. పోలీసు, ఎన్ఐఏ, బ్యాంక్ అధికారులు మార్కెట్లో నకిలీ నోట్ల గుర్తింపుపై ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తే వ్యాపారులు మోసపోకుండా ఉంటారు. మార్కెట్లో పోలీసు స్టేషన్‌కు చెందిన సీసీ కెమెరాలు ఉన్నాయి. వాటిలోని ఫుటేజీలను మాదన్నపేట పోలీసులు పరిశీలిస్తే నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టయ్యేందుకు అవకాశం లేకపోలేదు. అయితే మాదన్నపేట పోలీసులు ఈ కేసును సుమోటోగా తీసుకుంటారా లేక, బాధితులు ఫిర్యాదు ఇస్తేనే రంగంలోకి దిగుతారా అనేది వేచి చూడాలి. -
విద్యుత్ షాక్ నుంచి అమ్మాయిని కాపాడిన ఆర్టిఫిషియల్ గోళ్లు
సాధారణంగా విద్యుత్ షాక్ తగిలినవారు తీవ్రంగా గాయాలపాలు కావడమో లేదా మృతి చెందడమో జరుగుతుండటాన్ని మనం చూసేవుంటాం. అయితే ఇటీవల ఒక కాలేజీ యువతికి విద్యుత్ షాక్ తగిలి 4 అడుగుల దూరం ఎగిరిపడంది. అయితే ఇంత జరిగినా ఆమెకు చిన్నపాటి గాయం కూడా కాకపోవడం విశేషం. ఈ విచిత్ర ఉదంతం ఇంగ్లండ్‌లో చోటుచేసుకుంది. తనకు ఎదురైన అనుభవం గురించి బాధితురాలు మాట్లాడుతూ తాను నకిలీ గోళ్లు పెట్టుకున్నకారణంగా విద్యుత్ షాక్ నుంచి బయటపడ్డానని తెలిపింది. 21 ఏళ్ల నికోల్ ఫోర్‌మ్యాన్ అనే యువతి ఇంటిలోని బాయిలర్ సరిచేసేందుకు ప్రయత్నిస్తుండగా కరెంట్ షాక్‌కు గురయ్యింది. బాయిలర్‌ను బంద్ చేయకుండానే నీటిని వేడి చేసి, స్నానం చేసేందుకు ఆ నీటిలో కాలు మోపింది. వెంటనే ఆమె షాక్‌నకు గురయ్యింది. ఎడిన్బర్గ్ క్వీన్ మార్గరిట్ యూనివర్శిటీలో చదువుకుంటున్న ఆ యువతి..‘షాక్ తగిలిన వెంటనే నాలుగు అడుగుల దూరం ఎగిరిపడ్డాను. తరువాత స్పృహ కోల్పోయానని’ తెలిపింది. ఇంటిలోని వారు ఆమెను గమనించి వెంటనే బాధితురాలని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెను పరీక్షించి, ఆమె పెట్టుకున్న నకిలీ గోళ్ల కారణంగానే ఎంతో ప్రమాదకరమైన విద్యుత్ షాక్ నుంచి బయటపడిందని తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడిన నికోల్..‘మా అమ్మ నా ఆర్టిఫిషిల్ గోళ్లను చూసి నన్ను తెగ మందలించేది. అయితే ఇప్పుడు ఆ గోళ్లే తనను కాపాడాయని తెలుసుకుని సంతోషపడుతోందని’ తెలిపింది. ఇది కూడా చదవండి: భూమిపై ఎలియన్స్?.. ప్రకంపనలు పుట్టిస్తున్న నిఘా విభాగం మాజీ అధికారి వాదన! -
Hyderabad: రూ.10 లక్షల మోసం.. ఉప్పల్‌లో నకిలీ జడ్జి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్‌లో నకిలీ జడ్జిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. జడ్జి అవతారమెత్తి వివాదాస్పద భూములను పరిష్కరిస్తానని నమ్మబలుకుతూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు సభ్యుల ముఠాను మల్కాజిగిర ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఉప్పల్ పీఎస్‌లో మల్కాజిగిరి డీసీపీ ధరావత్ జానకి వెల్లడించారు. కరీంనగర్ జిల్లా వేములవాడకు చెందిన నామాల నరేందర్ డిగ్రీ చదవి ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చి రామంతాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. జల్సాలకు అలవాటు పడి, సులభంగా డబ్బులు సంపాదించాలనే అత్యాశతో గతంలో దొంగతనాలు, బైక్ చోరీలు చేస్తూ జైలుకు వెళ్లి వచ్చాడు. అతనిపై పోలీసులు పీడీ చట్టం కూడా ఉపయోగించారు. తరువాత హైకోర్టులో వివాదాస్పద భూముల కేసులు త్వరగా పరిష్కరిస్తామనిఫేస్బుక్లో ఓ పేజ్ రూపొందించాడు. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన గార్లపాటి సోమిరెడ్డి అనే వ్యక్తి దగ్గర పదిలక్షల రూపాయలు తీసుకొని మోసం చేశాడు. కేసు పరిష్కారం కాకపోవడంతో బాధితుడు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన రాచకొండ ఎస్ఓటీ పోలీసులు.. నకిలీ జడ్జి నామాలా నరేందర్‌తోపాటు అతని వెంట గన్‌మెన్‌గా తిరుగుతూ నిందితుడికి సహకరిస్తున్న చిక్కం మధుసూదన రెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఇద్దరిని రిమాండ్‌కు తరలించినట్లు మల్కాజిగిరి డీసీపీ ధరావత్ జానకి తెలిపారు. నిందితుల వద్ద అనుమతి లేని ఓ పిస్టల్ , అయిదు రౌండ్ల బుల్లెట్లు, ఒక కారు, ఫేక్ జడ్జి ఐడి కార్డు , రూ. 7500 నగదు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. -
Pulasa Fish: పేరు పులస.. అమ్మేది విలస
ఆత్రేయపురం: పులస సీజన్ వచ్చేసింది. నకిలీ పులసలు కూడా మార్కెట్లోకి వచ్చాయి. అంటే విలస అన్నమాట. చూసేందుకు పులస, విలస ఒకే రకంగా ఉంటాయి. రుచిలో భారీ తేడా ఉంటుంది. అంతేకాదు. ధరలో కూడా తేడా ఉంటుంది. పులస కేజీ చేప రూ.5 వేల నుంచి రూ.10 వేల వర ధర పలుకుతూండగా నకిలీ పులసను కూడా అదే ధరకు విక్రయిస్తూ పలువురు మోసం చేస్తున్నారు. జూలై, ఆగస్టు నెలల్లో గోదావరికి భారీగా వరద వస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఉపనదులు తోడుగా గోదావరి పోటెత్తుతుంది. నది ఉధృతంగా ప్రవహించి తిరిగి నీటిమట్టం తగ్గుతున్న సమయంలో సముద్రం నుంచి విలసలు గోదావరి నీటిలోకి ఎదురీదుతూ వస్తాయి. ఆ విధంగా కేంద్ర పాలిత ప్రాంతం యానాం సమీపాన సముద్రం నుంచి గోదావరిలోకి ఎదురు ప్రయాణం ప్రారంభించిన విలసలు సుమారు 40 కిలోమీటర్ల మేర గోదావరిలో ఎదురీత పూర్తయ్యే సరికి పులసలుగా రూపాంతరం చెందుతాయని మత్స్యకారులు అంటారు. ఆ పులసలు కొత్తపేట నియోజకవర్గంలో కొత్తపేట, ఆత్రేయపురం, రావులపాలెం, ఆలమూరు మండల గ్రామాలైన ఆత్రేయపురం, బొబ్బర్లంక, పేరవరం, రాజవరం, మెర్లపాలెం, చొప్పెల్ల, రావులపాలెం తదితర ప్రాంతాల్లో పులస దొరుకుతుంది. కానీ విలస చేప మాత్రం సముద్రంలోనే దొరుకుతుంది. దీని ధర కేవలం రూ.200 నుంచి రూ.500 లోపే ఉంటుంది. ఒడిశా, ముంబై, విశాఖ తదితర సముద్ర తీర ప్రాంతాల్లో వీటిని పట్టి ఐస్ బాక్సుల్లో నిల్వ చేసి గోదావరి ప్రాంతాలకు ఈ సీజన్లో తరలించి పులస పేరుతో 10 రెట్లు ఎక్కువ ధరకు విక్రయించి మత్స్య ప్రియులను మోసం చేస్తున్నారు. పుస్తెలు అమ్మి అయినా ఏడాదికి ఒక్కసారి పులస కూర తినాలనే నానుడి ఉన్న కోనసీమ వాసులు ఎంత ధరయినా వెనకాడకుండా పులసలు కొని తృప్తిగా ఆరగిస్తున్నారు. అయితే ఈ పులసలు గోదావరిలో ఎర్ర నీరు ఉన్నంత వరకూ మాత్రమే దొరికే అవకాశం ఉండటంతో నకిలీ పులసలను తెచ్చి కొందరు వ్యాపారం చేస్తున్నారు. కొత్తగా పులస చేపల కొనుగోలుకు వస్తున్న వారు విలస బారిన పడి మోసపోతున్నారు. ఇంతకీ పులసకు, విలసకు తేడా గమనిస్తే.. పులస చేప నిగనిగలాడుతూ ఉంటుంది. ఎటువంటి రంగూ లేకుండా పూర్తి తెలుపు రంగులో ఉంటుంది. చల్లదనం అసలే ఉండదు. చేప మొత్తం జిగురుగా అంటే పట్టుకుంటే జారిపోయేలా ఉంటుంది. కేవలం గోదావరి బ్యారేజీల వద్ద లేదా పరీవాహక ప్రాంతంలో మాత్రమే పులస చిక్కుతుంది. విలసగా ఉన్న చేప సముద్రం నుంచి 40 లేదా 50 కిలోమీటర్లు గోదావరికి ఎదురీదుతూ వచ్చి పులసగా మార్పు చెందుతుంది. వీటిని వండిన తరువాత వారం రోజులైనా కూర రుచిగానే ఉంటుంది. విలస (నకిలీ పులస) చేపకు నిగారింపు ఉండదు. ఎరుపు, పసుపు రంగుల్లో ఉంటుంది. చల్లగా ఉంటుంది. ఎందుకంటే ఐస్ బాక్స్‌ల్లో నిల్వ చేస్తారు. చేప పట్టుకుంటే పెద్ద జిగురుగా ఉండదు. ఎక్కడబడితే అక్కడ వీటిని విక్రయిస్తూ ఉంటారు. కేవలం సముద్రంలో మాత్రమే ఇవి దొరుకుతాయి. అక్కడ నుంచి ఐస్ బాక్సుల్లో నిల్వచేసి పులసలు అమ్మే ప్రాంతానికి తరలించి పులస ధరకే వీటిని విక్రయిస్తుంటారు. వీటిని వండిన మరుసటి రోజుకే కూర రుచి తగ్గుతుంది. చేప ప్రియులను మోసం చేస్తున్నారు సముద్రంలో పుట్టిన విలసను గోదావరి జిల్లాలకు తీసుకువచ్చి పులస పేరుతో మత్స్య ప్రియులను మోసం చేస్తున్నారు. పులస కేవలం సముద్రంలోనే పుడుతుంది. అది 20 నుంచి 40 కిలోమీటర్ల మేర గోదావరిలో ఎదురీదిన తరువాత పులసగా మారుతుంది. ఐస్ బాక్సుల్లో విలసను తెచ్చి మత్స్యప్రియులను మోసం చేస్తున్నారు. దాని వల్ల మాలాంటి జాలర్లు నష్టపోతున్నాం. – లంకె వెంకటకృష్ణ, మత్స్యకారుడు, ఆత్రేయపురం -
సినిమా రేంజ్లో.. దంపతుల పక్కా స్కెచ్.. టమాటా లారీ హైజాక్..
బెంగళూరు: ధరలు పెరిగిపోయిన దగ్గర నుంచి టమాటాను దోపిడీ చేసిన ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. పంటపై ఉండగానే రాత్రికి రాత్రే.. పొలంలోనే టమాటాలను మాయం చేసిన సందర్భాలు కూడా ఎదురయ్యాయి. తాజాగా బెంగళూరులో సినిమాని సీన్‌ని తలపించే ఘటన వెలుగులోకి వచ్చింది. తమిళనాడుకు చెందిన దంపతులు పక్కా స్కెచ్‌తో యాక్సిడెంట్ కట్టుకథ అల్లి.. రైతు దగ్గర నుంచి రూ. 2.5 లక్షల విలువ చేసే 2.5 టన్నుల టమాటా లారీని హైజాక్ చేశారు. చిత్రదుర్గ జిల్లాలోని ఉరయూరుకు చెందిన వ్యక్తి మల్లేష్. టమాటా లారీ లోడ్‌ను జులై 8న కొలార్‌కు తీసుకువెళ్తున్నాడు. లారీ బెంగళూరుకు రాగానే ఓ దంపతులు లారీని అడ్డగించారు. లారీ తమ కారుకు తాకిందని కట్టుకథ సృష్టించి డబ్బులు డిమాండ్ చేశారు. మల్లేష్ అందుకు నిరాకరించాడు. దీంతో లారీ నుంచి మల్లేష్‌ను బయటుకు లాగి లారీతో హుడాయించారు. చేసేదేమీ లేక మల్లేష్ స్థానిక పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. లారీ వెళ్లిన మార్గాన్ని ట్రాక్ చేసి నిందితులను పట్టుకున్నారు. నిందితులను వెల్లూరుకు చెందిన దంపతులు భాస్కర్(28), సింధుజా(26)గా గుర్తించి అరెస్టు చేశారు. వీరు ఓ దారిదోపిడీ దొంగల ముఠాలో సభ్యులుగా కూడా ఉన్నట్లు గుర్తించారు. ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన బస్సు.. క్షణాల్లోనే.. -
వయస్సు 28.. కేసులు 34.. నకిలీ ఏసీబీ అధికారి అరెస్ట్
శంషాబాద్: డిగ్రీ పూర్తి చేసిన ఓ యువకుడు విలాసవంతమైన జీవితం కోసం నేరాల బాట పట్టాడు.. చైన్‌స్నాచింగ్‌లతో మొదలు పెట్టి ప్రభుత్వాధికారులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతూ మోస్ట్ వాంటెడ్ నేరగాడిగా మరాడు.. కేవలం 28 ఏళ్ల వయస్సులోనే అతడిపై 34 కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఓ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు నకిలీ ఏసీబీ అధికారి అవతారంలో తిరుగుతున్న అతడిని అరెస్ట్ చేశారు. గురువారం శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి వివరాలు వెల్లడించారు... అనంతపురం జిల్లా, కోటలపల్లి గ్రామానికి చెందిన నూతేటి జయకృష్ణ(28) 2016లో బీకాం పూర్తి చేశాడు. అనంతరం ఓ టెక్స్టైల్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఎస్సై పరీక్షలకు సిద్ధమవుతున్న అతను అనంతపురం పట్టణంలో రెండు చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడి పోలీసులకు చిక్కాడు. ఆయా కేసుల్లో జైలుకు వెళ్లిన అతడికి అక్కడ అనిల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అనిల్ ద్వారా బెంగళూరులోని శ్రీనాథ్‌రెడ్డి పరిచయమయ్యాడు. ‘గ్యాంగ్’ స్ఫూర్తిగా తీసుకుని .. తమిళ హీరో సూర్య నటించిన గ్యాంగ్ సినిమాను చూసిన వీరు దానిని స్ఫూర్తిగా తీసుకుని ప్రభుత్వాధికారులను మోసం చేయాలని నిర్ణయించుకున్నారు. ఓ పక్క చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతూనే మరోవైపు నకిలీ ఏసీబీ ప్రభుత్వాధికారులను బెదిరించి వసూళ్లు చేయడం మొదలుపెట్టారు. 2019లో నకిలీ ఏసీబీగా అవతారమెత్తిన జయకృష్ణ, ఒంగోలు, నెల్లూరు, ఏలూరు, అనంతపురం విశాఖపట్నం, విజయనగరం, తదితర ప్రాంతాల్లోని మున్సిపల్, రెవెన్యూ, రవాణా తదితర రంగాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్లు చేసి మీపై ఆరోపణలున్నాయి సెటిల్ చేసుకోవాలంటూ వసూళ్లకు పాల్పడ్డాడు. గత మార్చి, జూన్, జులైలో సిద్దిపేటలో ఇద్దరు ఉద్యోగులు, సైబరాబాద్ పరిధిలో ఒకరికి ఇదే తరహాలో ఫోన్లు చేసి వసూళ్లకు పాల్పడ్డాడు. వీరిపై పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 18 కేసులు నమోదయ్యాయి. బస్సుల్లో తిరుగుతూనే.. గుగూల్ ద్వారా ప్రభుత్వ అధికారుల ఫోన్ నంబర్లు సేకరించడంతో పాటు విద్యార్థులు, సీనియర్ సిటిజన్ల ఆధార్ కార్డుల ద్వారా సుమారు 200 నకిలీ సిమ్‌కార్డులు తీసుకుని వాడినట్లు గుర్తించారు. ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ చేసుకున్న అనంతరం వారు పథకం ప్రకారం ఉదయం ఆర్టీసీ బస్సు ఎక్కేవారు. రాత్రి వరకు బస్సులో ప్రయాణం చేస్తూనే అధికారులకు ఫోన్ చేసి బెదిరించేవారు. పని పూర్తి కాగానే సిమ్‌ను అక్కడే పారేసేవారు. గత రెండేళ్లలో మొత్తం 9 బ్యాంకు ఖాతాల్లో రూ. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా రూ.1.2 కోట్లు వేయించుకున్నట్లు గుర్తించారు. డబ్బులు వచ్చిన వెంటనే గోవా తదితర ప్రాంతాలకు వెళ్లి జల్సాలు చేయడం జయకృష్ణకు అలవాటు. వరస నేరాలతో అప్రమత్తమైన శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు నకిలీ సిమ్‌కార్డుల ఆధారంగా బెంగళూరులో జయకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ.85 వేల నగదు, ఖాతాల్లో ఉన్న రూ.2.24లక్షలు, 8 ఫోన్లు, 5 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారులు ఎవరూ కూడా నేరుగా అధికారులకు ఫోన్లు చేయరని ప్రభుత్వాధికారులు దీనిని గుర్తించాలని డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. విద్యార్థులు కూడా గుర్తుతెలియని వ్యక్తులకు ఆధార్ కార్డులు, గుర్తింపు కార్డులు ఇవ్వకూడదని సూచించారు. కేసును చేధించిన శంషాబాద్ ఎస్ఓటీ, శంషాబాద్ పోలీసులకు డీసీపీ అభినందించారు. -
దేవుడితోనే ఆటలాడబోయి...చివరకు...
-
నయా సైబర్ క్రైం.. డీప్ ఫేక్!
సోషల్ మీడియాలో ఫొటోలు, ఆడియో, వీడియోలు విరివిగా పోస్ట్ చేస్తుంటారా.. అయితే జరభద్రం.. సైబర్ నేరాల్లో కొత్తగా పుట్టుకొచ్చిన డీప్ ఫేక్ గురించి మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.. వీడియోలో మీ ముఖమే కనిపిస్తూ ఉంటుంది... కానీ అది మీరు కాదు. ఆడియోలో మీ మాటలే వినిపిస్తూ ఉంటాయి... కానీ మాట్లాడేదీ మీరు కాదు. మీరు చేయని అభ్యంతరకరమైన పనులు కూడా మీరే చేసినట్లు మారుస్తారు.. ఎలాగంటే.. మీ వాయిస్, వీడియో, ఫొటోలను వినియోగించి అశ్లీల వీడియోలతో సింథసిస్ చేసి మీరే వీడియో కాల్ చేసినట్లు సృష్టిస్తారు. లేదంటే కిడ్నాప్ అయ్యాననో, అత్యవసరమనో మీ ఫేక్ వీడియోలు సృష్టించి వాటిలో చెప్పిస్తారు. ఆ వీడియోలను కుటుంబీకులకు చూపించి అందినకాడికి దండుకుంటారు. ఈ నేరాలు ఘోరాలు చేసేందుకు అవసరమైన ఫోన్ నంబర్లు, వివరాలన్నీ తెలుసుకునేందుకు నేరగాళ్లు పెద్ద కష్టపడక్కర లేదు.. కేవలం మన సోషల్ మీడియా ఖాతాల నుంచే సంగ్రహిస్తున్నారు.. సాక్షి, హైదరాబాద్: ఆడియో–వీడియో సింథసిస్ ప్రక్రియ ద్వారా జరుగుతున్న సరికొత్త సైబర్ నేరమే డీప్ ఫేక్. ఈ నయా తరహా సైబర్ నేరాలు పాల్పడేందుకు నేరగాళ్ళకు అవసరమైన డేటా డార్క్ వెబ్‌తో పాటు సోషల్ మీడియాలో తేలిగ్గా లభిస్తోంది. సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫొటోలు, ఆడియో, వీడియోలను సంగ్రహిస్తున్న ఈ–కేటుగాళ్ళు వాటిని సేకరిస్తున్నారు. డార్క్ వెబ్ సహా ఇంటర్నెట్ నుంచి ఖరీదు చేసిన టూల్స్ వినియోగించి సింథసిస్ ప్రక్రియ చేయడుతున్నారు. ఇది కేవలం నేరగాళ్ళు మాత్రమే కాదు... సాంకేతికతపై పట్టున్న వాళ్లు కూడా చేస్తున్న వ్యవహారం కావడం ఆందోళన కలిగించే అంశం. ఈ నయా సైబర్ క్రైం డీప్ ఫేక్‌తో బాధితులు ఆర్థికంగా నష్టపోవడమే కాదు... కొన్ని సందర్భాల్లో పరిస్థితి ఆత్మహత్యలు చేసుకునే వరకు వెళుతోంది. యువతీ యువకులతో పాటు మధ్య వయస్సుల్లో జరుగుతున్న ‘కారణం తెలియని’ సూసైడ్స్‌కి ఈ సింథసిస్ ప్రక్రియ కూడా ఓ కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బ్లాంక్ వీడియో కాల్స్‌తో... సెక్సార్షన్ నుంచి ఎక్సార్షన్ వరకు వినియోగం... ఇటీవల కాలంలో అనేకమందికి వర్చువల్ నంబర్ల నుంచి బ్లాంక్ వీడియో కాల్స్ వస్తున్నాయి. వీటిని స్పందించి ఫోన్ ఎత్తితే.. అవతలి వారు కనిపించరు, మాట్లాడరు. ఎవరు కాల్ చేశారో తెలుసుకోవడానికి కొద్దిసేపు ఫోన్లో ప్రశ్నిస్తుంటాం. ఆ సమయంలో సైబర్ నేరగాళ్ళు రిసీవర్ వీడియో రికార్డు చేస్తారు. దీన్ని అశ్లీల వీడియోలతో సింథసిస్ చేసి వాళ్ళే ఆ వీడియోలో ఉన్నట్లు రూపొందిస్తారు. ఈ వీడియోను చూపించి బాధితుడిని భయపెట్టి వీలున్నంత దండుకుంటారు. ప్రధానంగా యువకులు, మధ్య వయసు్కలే ఈ నేరంలో టార్గెట్‌గా మారుతున్నారు. నేరగాళ్ళే కాదు అవసరార్థులూ వాడేస్తున్నారు.. ఈ సింథసిస్ ప్రక్రియను సైబర్ నేరగాళ్ళతో పాటు మరికొందరూ వాడేస్తున్నారు. ఆన్లైన్ ఇంటర్వ్యూలకు హాజరయ్యే యువత కూడా సింథసిస్ టెక్నిక్ వాడి అడ్డదారిలో గట్టెక్కుతోంది. బ్యాంకులు, ఇతర సంస్థలకు వీడియో అథెంటికేషన్ చేయాల్సిన వచ్చినప్పుడూ ఈ ప్రక్రియ వాడుతున్నారు. ఈ కారణంగానే ఇటీవల కార్పొరేట్ సంస్థలు ఆన్లైన్ ఇంటర్వ్యూలను రికార్డు చేస్తూ, అభ్యర్థిని హెచ్ఆర్కు పిలిచి పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇక బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్ని మోసం చేయడానికి వీడియో సింథసిస్ వినియోగిస్తున్నట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు. భర్త గొంతును రికార్డు చేసి.. వేధిస్తున్నట్టు మార్చి... మనస్పర్ధల నేపథ్యంలో తన భర్తపై ఫిర్యాదు చేయాలని భావించిన ఓ భార్య వాయిస్ సింథసిస్ టెక్నిక్ వాడారు. తన భర్త గొంతును రికార్డు చేసి తనను దూషిస్తున్నట్లు, వేధిస్తున్నట్లు మార్చేశారు. ఆ రికార్డునే ఆధారంగా చూపించి భర్తపై ఆరోపణలు చేశారు. అయ్యో తాను అసలు అట్లా మాట్లాడలేదంటూ భర్త గోడువెళ్లబోసుకోవడంతో కౌన్సెలింగ్ చేసిన పెద్దల విచారణలో అసలు విషయం బయటపడింది. ఆ వీడియోలు చూడగానేతొందరపడొద్దు.. ఈ సింథసిస్ ప్రక్రియను ఫోరెన్సిక్ ల్యాబ్‌ల్లోనూ పూర్తి స్థాయిలో నిర్థారించడం సాధ్యం కావట్లేదు. కొన్ని అభ్యంతరకర అంశాలకు సంబంధించి తమ వారికి సంబంధించిన వీడియోలు, ఆడియోలను చూసిన కుటుంబీకులు తొందర పడకూడదు. అవి ఆడియో–వీడియో సింథసిస్ ప్రక్రియ ద్వారా తయారయ్యాయేమోనని అనుమానించాలి. బెనిఫిట్ ఆఫ్ డౌట్‌ను వర్తింపజేయాలి. బాధితులుగా మారిన వారికి దన్నుగా ఉంటే ఒంటరితనం, కుంగిపోవడం జరగక ఆత్మహత్యలు వంటి వాటికి ఆస్కారం ఉండదు. – పెండ్యాల కృష్ణశాస్త్రి, సైబర్ నిపుణుడు -
ఆ వెబ్ సిరీస్ చూసి.. ₹2000 దొంగనోట్లు ముద్రించి..
‘ఫర్జీ’ వెబ్ సిరీస్ చూసి ₹2000 దొంగనోట్లను ముద్రించిన ఇద్దరు కేటుగాళ్లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 40 ఏళ్ల వయసు పైబడిన నిందితులు తాజిమ్, ఇర్షాద్‌లు ఈ దొంగనోట్లను చలామణీ చేస్తుండగా పోలీసులకు చిక్కారు. ఆ సమయంలో నిందితులిద్దరూ ₹2000 దొంగనోట్లను దాచివుంచి, వాటిని తక్కువ మొత్తానికి మారుస్తున్నారు. పోలీసులు నిందితుల వద్ద నుంచి రూ. 5 లక్షల, 50వేలను స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ నకిలీ 2000 నోట్లు. నిందితులను విచారించి.. ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన స్పెషల్సెల్కు కొన్ని ప్రాంతాల్లో నకిలీ నోట్లు సర్క్యులేట్ అవుతున్నాయనే సమాచారం అందింది. ఈ మేరకు తనిఖీలు చేపట్టిన పోలీసులు అలీపూర్ ప్రాంతంలో తాజిమ్ను అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి పోలీసులు రెండున్నర లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అతనిని విచారించిన అనంతరం కైరాన్‌లో ఇర్షాద్‌ను అరెస్టు చేసి,అతని ఇంటిలో నుంచి రూ. 3 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులు విచారణలో పలు విషయాలు తెలిపారు. ఫర్జీ వెబ్‌సిరీస్ చూసి తాము తమ దుకాణంలోనే దొంగనోట్లను ముద్రించామని, తరువాత వాటిని చెలామణి చేయడం ప్రారంభించామన్నారు. వెబ్సైట్లను సెర్చ్ చేసి.. నకిలీ నోట్లు ముద్రించేందుకు పలు వెబ్సైట్లను సెర్చ్ చేశామని తెలిపారు. తరువాత నోట్లు ముద్రించేందుకు భారీగా పేపర్ కొనుగోలు చేయడంతోపాటు ప్రింటర్ కూడా తీసుకువచ్చామన్నారు. కాగా నిందితులు ఈ నకిలీ నోట్లను ఢిల్లీ-ఎన్సీఆర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లలో చలామణీ చేశారు.అయితే వీరు ఎంత మొత్తంలో దొంగనోట్లు ముద్రించారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘వందే భారత్’ ఢీకొని యువకుడు మృతి.. ఎక్కడంటే.. -
కస్టమ్స్ ఆఫీసర్లమని చెప్పి 4 లక్షలు దోపిడీ
న్యూఢిల్లీ: సౌదీ అరేబియా నుండి భారత్ వచ్చిన 53 ఏళ్ల మహమ్మద్ సులేమాన్ ను కస్టమ్స్ ఆఫీసర్లమని చెప్పి ఇద్దరు ఆగంతకులు అతను కష్టపడి సంపాదించిన సొమ్ము మొత్తాన్ని దోచుకుని నడిరోడ్డుపై వదిలేశారు. దిక్కుతోచని స్థితిలో సులేమాన్ ఢిల్లీ పోలీసులను ఆశ్రయించాడు. ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్ ప్రకారం.. రాజస్థాన్‌లోని అజ్మీర్ కు చెందిన మొహమ్మద్ సులేమాన్ సౌదీ అరేబియాలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ సంపాదించుకునే సామాన్యుడు. చాలాకాలం తర్వాత భారత్ వచ్చిన సులేమాన్ కు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అడుగు పెడుతూనే ఇద్దరు వ్యక్తులు బురిడీ కొట్టించారు. తమను తాము కస్టమ్స్ అధికారులుగా పరిచయం చేసుకున్న ఆ ఇద్దరూ అక్కడి నుండి అతడిని నేరుగా పార్కింగ్ ఏరియాకు తీసుకువెళ్లారు. ఈ క్రమంలోనే సులేమాన్ నుండి పాస్ పోర్టు సహా అన్ని వస్తువులను లాక్కున్నారు దుండగులు. అక్కడి నుండి కారులో మహిపాల్ పూర్ వైపుగా తీసుకెళ్లి మార్గమధ్యలో ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఆపి.. ఈ ఫోన్ ఎక్కడిది? ఈ కరెన్సీ నీకెలా వచ్చిందని ప్రశ్నించి సులేమాన్ ఫోన్ తోపాటు అతని వద్దనున్న 19000 సౌదీ రియాద్లు(4.15 లక్షలు), రూ.2000 నగదును దోచుకున్నారు. నిలువుదోపిడీ పూర్తయిన తర్వాత దుండగులు సులేమాన్ ను కార్లో తీసుకెళ్లి జనసంచారం లేనిచోట దింపేసి ఉన్నతాధికారులతో తిరిగి వస్తామని చెప్పి వెళ్లిపోయారు. అప్పటికి గాని జరిగిందేంటో అర్ధం కాని సులేమాన్ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఇది కూడా చదవండి: దేశంలో ఏం జరుగుతోందో తెలియాలంటే మణిపూర్ వెళ్లి చూడండి.. -
అందం కోసం కొత్త దంతాలు.. ‘షార్క్’లా మారిన యువకుడు!
ప్రపంచంలో చాలామంది అందం కోసం విపరీతంగా తాపత్రయపడుతుంటారు. ఇందుకోసం ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటుంటారు. కొందరు తమ దంతాలు సరిగా లేవంటూ, వాటికి హంగులు సమకూరుస్తారు. ఇటువంటి సందర్బాల్లో చికిత్స చేయించుకున్న కొందరి ముఖాలు భయంకరంగా మారిపోవడాన్ని మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. ఇటువంటి మరో తాజా ఉదంతం ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇటీవలే డెంటల్ ట్రీట్మెంట్ తీసుకున్న ఒక యువకునికి ఎదురైన చేదు అనుభవం గురించి ఆయన స్వయంగా సోషల్ మీడియాలో వివరించాడు. జాక్ జేమ్స్ కెమెరాలో అందంగా కనిపించాలనే ఉద్దేశంతో నకిలీ దంతాలు పెట్టించుకోవాలనుకున్నాడు. ఇందుకోసం బ్రిటన్ నుంచి టర్కీకి వెళ్లాడు. £3,000( సుమారు రూ. 3 లక్షలు) వెచ్చించి నకిలీ దంతాలు పెట్టించుకున్నాడు. మొదట్లో ఈ దంతాలు అతని ముఖానికి ఎంతో అందాన్నిచ్చాయి. అయితే కొద్ది రోజుల తరువాత అతని దంతాల నుంచి రక్తం కారసాగింది. అలాగే నోటు నుంచి దుర్వాసన కూడా వెలువడసాగింది. దీంతో జాక్ జేమ్స్.. మాంచెస్టర్‌లోని ఒక డెంటిస్ట్‌ను సంప్రదించాడు. ఆ దంతవైద్యుడు పలుపరీక్షలు చేసిన అనంతరం అతని దంతాలు పూర్తిగా పాడయిపోయాయని చెప్పాడు. ఇన్ఫెక్షన్ సోకిందని తెలిపాడు. ఆ దంతాలను తిరిగి సరిగా చేసేందుకు £20,000(సుమారు రూ. 20 లక్షలు) ఖర్చవుతాయని తెలిపాడు. ఇంగ్లండ్‌లో ఈ చికిత్సకు ఇంత భారీగా ఖర్చవుతుందని తెలుసుకున్న అతను తిరిగి గతంలో తనకు చికిత్స చేసిన టర్కీలోని డెంటిస్ట్ దగ్గరకు వెళ్లాడు. ఆ డెంటిస్ట్ అతనితో దంత చికిత్సలో తప్పేమీ జరగలేదని, అయితే తిరిగి దంతాలను సరి చేసుకోవాలంటే, మరోమారు చికిత్స చేయించుకోవాలని, ఇందుకు మరింత ఖర్చవుతుందని తెలిపాడు. మరో మార్గంలేక జాక్ అందుకు అంగీకరించాడు. నకిలీ దంతాలను తొలగించుకుని ఇన్ఫెక్షన్ దూరమయ్యేందుకు చికిత్స తీసుకున్నాడు. తరువాత కొత్తగా టెంపరరీ దంతాలను పెట్టించుకున్నాడు. అయితే అతను ఈ టెంపరరీ దంతాలను శుభ్రం చేసుకుంటున్నప్పుడు, అసలు దంతాలు షార్క్ దంతాలుగా మారిపోవడాన్ని గమనించాడు. అన్ని దంతాల మధ్య గ్యాప్ ఉండటాన్ని గుర్తించాడు. జాక్ తన దంతాలు చూసుకున్నప్పుడల్లా ఏదో హర్రర్ ఫిల్మ్‌లోని క్యారెక్టర్లా ఉన్నానని భావిస్తాడట. దీంతో అతనికి ఈ షార్క్ దంతాలను కూడా తొలగించుకోవాలని అనిపిస్తుందట. ఇందుకోసం మరో వైద్యుడిని సంప్రదించాలని అనుకుంటున్నానని జాక్ తెలిపాడు. ఇది కూడా చదవండి: తొలి హార్ట్ట్రాన్స్ ప్లాంట్‌కు 56 ఏళ్లు.. ఆ రోజు జరిగిందిదే! -
వాళ్ళ లక్ష్యం చాట్ GPT యూజర్స్ భయపెడుతున్న కొత్త మాల్ వేర్స్.!
-
గొంతును ఏమార్చారు, ఒరిజినల్‌గా నమ్మించారు
బ్రిటన్ రాజ కుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీ అతని భార్య మేఘన్ మార్కెల్లు ప్రముఖ పాడ్‌కాస్ట్ సంస్థ స్పాటిఫై నుంచి వైదొలగిన విషయం విదితమే. అయితే, ఆ తదనంతరం వారు ప్రారంభించిన ‘ఆర్కిటైప్స్’ పాడ్‌కాస్ట్ కోసం మేఘన్ చేసినట్టు చెబుతున్న ఇంటర్వ్యూలు ఆమె చేసినవి కాదని ఒక రిపోర్టులో వెల్లడయ్యింది. షోలోని కొన్ని ఇంటర్వ్యూలను డచెస్ సిబ్బంది చేశారని పాడ్న్యూస్ తెలిపింది. ప్రశ్నలు అడుగుతున్న ఆమె వాయిస్ ఆడియోను ఇంటర్య్యూ మధ్యలో క్లిప్ చేశారని ఆరోపించారు. కాగా స్పాటిఫై, ఆర్కివెల్ పరస్పరం విడిపోవడానికి అంగీకరించాక వారు కలిసి చేసిన సిరీస్ గురించి గర్వపడుతున్నామని ఆ సంస్థలు సంయుక్త ప్రకటన చేసిన కొద్దిసేపటికే మేఘన్‌పై ఆరోపణలతో కూడిన ఈ వార్త వెలువడింది. హ్యారీ, మేఘన్ ప్రారంభించిన ఆర్కివెల్ మీడియా సంస్థ 2020లో $20 మిలియన్ల డీల్‌కు సంబంధించిన పూర్తి చెల్లింపును అందుకునేందుకు తగినంత కంటెంట్‌ను ఉత్పత్తి చేయలేదని గతంలో ఆరోపణలు వచ్చాయి. అయితే మేఘన్ మరొక ప్లాట్‌ఫారమ్‌లో ‘ఆర్కిటైప్స్’ ప్రేక్షకుల కోసం మరింత కంటెంట్‌ను అందిస్తున్నారని ఆర్కివెల్ ప్రొడక్షన్స్ ప్రతినిధి వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు తెలిపారు. ఈ విషయంలో స్పోర్ట్స్ రైటర్, పాడ్‌కాస్టర్ బిల్ సిమన్స్ ఈ జంటపై విరుచుకుపడ్డాడు. తాను ఒకసారి హ్యారీని పాడ్‌కాస్ట్ విషయమై కలిశానని తెలిపాడు. ఈ పాడ్‌కాస్ట్ ఆడియోలో డచెస్ ఆఫ్ సస్సెక్స్ నుండి వచ్చిన వ్యాఖ్యల మధ్య యారో వివరణలు, వ్యాఖ్యలు జతచేశారు. అవి అల్లినవి, డైలీ మెయిల్ నవంబర్‌లో నివేదించినవని తేలింది. రాజ దంపతులు రెండు సంవత్సరాల క్రితం స్పాటిఫైతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తరువాత బయటకు వచ్చేశారు. అప్పటికి కేవలం 12 ఎపిసోడ్లు మాత్రమే రూపొందాయి. జమీలా జమీల్, సెరెనా విలియమ్స్, ప్యారిస్ హిల్టన్, మిండీ కాలింగ్‌తో సహా పలువురు అతిథులతో సంభాషణలతో పాటు నిర్దిష్ట అంశాల గురించి మాట్లాడే నిపుణులు, విద్యావేత్తలు, రచయితల క్లిప్‌లు ఉన్నాయి. నిపుణుల ఆడియో క్లిప్‌లు మేఘన్ ఆడియో మధ్య జత చేసి ఉన్నాయి. దీంతో ఆమె స్వయంగా కొందరితోనైనా మాట్లాడారా? లేదా అందరితో మాట్లాడారా అనేది స్పష్టంగా వెల్లడికాలేదు. ఇది కూడా చదవండి: లాలాజలంతో ఇక ప్రెగ్నెన్సీ టెస్ట్ -
ఏది నిజం?: అసలే డ్రామోజీ.. చేతిలో ‘ఛీ’నాడు
సాక్షి, అమరావతి: సూర్యుడిపై ఉమ్మేస్తే తన ముఖంపైనే పడుతుందన్న ఇంగితాన్ని కూడా ‘ఛీనాడు’ పట్టించుకోవడం మానేసింది! ఆ ముఖం తడుస్తున్నా సరే.. తుడుచుకునేందుకు కూడా అది సిద్ధపడటం లేదు!! నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు.. నా ఇచ్ఛయేగాక నాకేటి వెరపు అన్నట్లుగా వలువలు వదిలేసి కోలాటమాడుతోంది! డ్రామోజీ సమర్పిస్తున్న దగుల్బాజీ కథనాల్లో తాజాగా రాష్ట్ర ఆరోగ్య రంగం కూడా చేరింది!! వైద్య ఆరోగ్యశాఖలో దాదాపు 49,000 పోస్టులను భర్తీ చేయకుండా ఖాళీగా వదిలేసిందంటే ప్రజారోగ్యంపై చంద్రబాబు సర్కారు ఎంత బరి తెగించి వ్యవహరించిందో ఈనాడుకు కనపడలేదా? ఆరోగ్యశ్రీని నీరుగార్చి దాదాపు రూ.700 కోట్ల మేర బకాయిలు పెట్టిన చంద్రబాబు నిర్వాకాలపై రామోజీ కలం కదలలేదు ఎందుకు? ఒకే ఏడాది ఐదు కొత్త మెడికల్ కాలేజీలు.. మూడేళ్లలో మొత్తం 17 వైద్య కళాశాలలు ఆవిష్కృతమవుతుండటం.. వైద్య ఆరోగ్యశాఖలో 49,000 పోస్టుల భర్తీ.. రూ.17,000 కోట్ల వ్యయంతో ఆరోగ్య రంగానికి జవసత్వాలు కల్పిస్తున్న పరిస్థితి ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో సైతం గతంలో ఎప్పుడూ లేదు. రాష్ట్రంలో 95 శాతం కుటుంబాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి భరోసా ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వమూ ఆంధ్రప్రదేశ్ మినహా మరొకటి లేదు! కోవిడ్ మహమ్మారినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి ఉచితంగా లక్షల మందికి చికిత్స అందించి ప్రాణాలు కాపాడిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. తాజాగా ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా పల్లె ముంగిటకే డాక్టర్లను పంపుతున్న రాష్ట్రం కూడా మనదే. ఉన్నఫళంగా రాత్రికి రాత్రే రావటానికి మెడికల్ కాలేజీలేమీ రోడ్డు పక్కన కిళ్లీ షాపులు కాదు! ఓ కొత్త వైద్య కళాశాల ఏర్పాటు కావాలంటే కచ్చితంగా కొన్ని నిబంధనలు అనుసరించాలి. కనీసం 330 పడకల సదుపాయంతో ఆసుపత్రులు రెండేళ్ల పాటు సేవలందించాలి. పక్క రాష్ట్రానికి కొత్త మెడికల్ కాలేజీలు వచ్చాయంటూ రామోజీ గుండెలు బాదుకుంటున్నారు. మరి అక్కడ పదేళ్లుగా ఒకే ప్రభుత్వం అధికారంలో ఉందన్న విషయం గుర్తులేదా? అది కూడా అక్కడి ప్రభుత్వం మొదటి ఐదేళ్లు ఎంతో కృషి చేయడంతో రెండో విడతలో ఇప్పుడు 17 కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. మన రాష్ట్రంలో ఆరోగ్య రంగం నిస్తేజంగా మారటానికి గత సర్కారు నిర్వాకాలే కారణమన్న సంగతి తెలిసీ రామోజీ బురద చల్లే యత్నం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ఒకేసారి వేల సంఖ్యలో పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వాస్పత్రుల్లో నాడు–నేడు ద్వారా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు. మూడేళ్లలో 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వీటిలో ఐదు కొత్త మెడికల్ కాలేజీల్లో ఈ ఏడాదే ప్రవేశాలు కల్పించనున్నారు. ఇవన్నీ సహించలేక ఈనాడు అయోమయం కథనాలను తన పాఠకులకు వడ్డించింది! తెలంగాణలో ఎలా అంటే? తెలంగాణ ప్రభుత్వం 2014–19 మధ్య నాలుగు కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడంతోపాటు భవిష్యత్తులో మరిన్ని కళాశాలల ఏర్పాటుకు వీలుగా 25 సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రులను జిల్లా ఆస్పత్రులుగా అప్‌గ్రేడ్ చేస్తూ పడకల సంఖ్యను పెంచింది. 2018లోగా ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేసింది. అప్పట్లో తీసుకున్న చర్యలు 17 కొత్త వైద్య కళాశాలలకు అనుమతులు వచ్చేందుకు దోహదపడ్డాయి. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న నారా చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను నిర్వీర్యం చేయడంతోపాటు కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు దిశగా కనీసం ప్రయత్నించలేదు. కనీసం తెలంగాణను చూసైనా ఆస్పత్రుల్లో పడకలు పెంచిన పాపాన పోలేదు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగి కూడా రాష్ట్ర ప్రయోజనాలను నీరుగార్చారు. నాడు బీజేపీకే చెందిన కామినేని శ్రీనివాసరావు రాష్ట్ర వైద్య శాఖ మంత్రిగా ఉన్నారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ వైద్య రంగాన్ని పట్టించుకోకుండా ప్రైవేట్ వైద్య కళాశాలలను ప్రోత్సహిస్తూ వైద్య విద్యను వ్యాపారంగా మార్చేశారు. సమర్థతతో సాధించిన సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామని 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ఆ మేరకు మాట నెరవేరుస్తూ 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. జాతీయ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తొలుత ఐదు జిల్లా ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేయడం ద్వారా రాజమహేంద్రవరం, ఏలూరు, విజయనగరం, నంద్యాల, మచిలీపట్నం వైద్య కళాశాలలకు అనుమతులను రాబట్టారు. దీంతో ఈ ఏడాది 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి వస్తున్నాయి. వచ్చే ఏడాది పాడేరు, పులివెందుల, ఆదోనిలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు వీలుగా అక్కడి ఆస్పత్రుల్లో పడకలు పెంచేలా ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో 2024–25లో మరో మూడు కొత్త వైద్య కళాశాలలు, ఆ తర్వాత ఏడాది మిగిలిన 9 వైద్య కళాశాలలను అందుబాటులోకి తెచ్చేలా సన్నద్ధమయ్యారు. తద్వారా మూడేళ్లలో 17 కొత్త మెడికల్ కాలేజీలు మన రాష్ట్రంలోనూ ఏర్పాటు కానున్నాయి. వైద్య రంగం అభివృద్ధికి సాక్ష్యాలివిగో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేయడం ద్వారా ప్రజారోగ్యానికి సీఎం జగన్ రక్షణగా నిలిచారు. గత నాలుగేళ్లలో ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా పథకాల కోసం ప్రభుత్వం రూ.8,302.47 కోట్లు వెచ్చించింది. ఆరోగ్యశ్రీ ద్వారా 36,19,741 మంది, ఆసరా ద్వారా 16,20,584 మంది లబ్ధి పొందారు. రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలని్నంటినీ పథకం పరిధిలోకి తేవడంతో 1.4 కోట్లకు పైగా కుటుంబాలకు ఆరోగ్యశ్రీ వర్తిస్తోంది. 2014–19 మధ్య ఆరోగ్యశ్రీలో కేవలం 1,059 ప్రొసీజర్లు మాత్రమే అందుబాటులో ఉండగా ఇప్పుడు ఏకంగా 3,255కి పెరిగాయి. ఆరోగ్య ఆసరా ద్వారా శస్త్ర చికిత్స అనంతరం రోగి కోలుకునే సమయంలో గరిష్టంగా రూ.ఐదు వేల వరకు ప్రభుత్వం సాయం అందిస్తోంది. ►సీఎం జగన్ అధికారంలోకి రాగానే మండలానికి ఒకటి చొప్పున 104, 108 వాహనాలను సమకూర్చారు. 768 అంబులెన్స్‌లతో 2020లో సేవలను విస్తరించారు. తాజాగా మరో 146 అంబులెన్స్‌లను కొనుగోలు చేశారు. ప్రస్తుతం రోజుకు సగటున 3,300 మంది అంబులెన్స్ సేవలను వినియోగించుకుంటున్నారు. 104 ఎంఎంయూలను తొలుత మండలానికి ఒకటి చొప్పున 676 వాహనాలను సమకూర్చారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలులోకి రావడంతో 104 ఎంఎంయూలు మరో 256 వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. ►గతేడాది ఏప్రిల్ నుంచి 500 కొత్త వాహనాలతో ‘డాక్టర్ వైఎస్సార్ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్’ సేవలను విస్తరించారు. రోజుకు సగటున 631 మంది బాలింతలను క్షేమంగా ఇళ్లకు చేరుస్తున్నారు. ►గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ లక్ష్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ వి«ధానాన్ని ప్రవేశపెట్టారు. పీహెచ్సీ వైద్యులు నెలకు రెండుసార్లు 104 మొబైల్ మెడికల్ యూనిట్(ఎంఎంయూ)తో పాటు గ్రామాలను సందర్శించి అక్కడే వైద్య సేవలు అందిస్తున్నారు. పీజీ సీట్లు పెరిగాయ్.. కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతులు సాధించడంతోపాటు ప్రస్తుతం ఉన్న 11 వైద్య కళాశాలల్లో పీజీ సీట్లు పెరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లను సమకూర్చేందుకు ఖాళీల భర్తీతో పాటు కొత్తగా పోస్టులను సృష్టించి నియామకాలు చేపట్టింది. ఇతర మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తున్నారు. దీంతో 2019 వరకూ 937 మాత్రమే పీజీ సీట్లు ఉండగా గత నాలుగేళ్లలో ఏకంగా 768 సీట్లను రాబట్టగలిగారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ సీట్లు 1705కి పెరిగాయి. పీజీ సీట్లను మరింత పెంచడం ద్వారా రాష్ట్రంలో స్పెషలిస్ట్ వైద్యులను అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ముందుకు వెళుతోంది. వైద్యరంగంలో ఆదర్శంగా ఏపీ చంద్రబాబు అసమర్థతతో వైద్య రంగంలో రాష్ట్రం వెనుకబాటుకు గురైంది. ఆయన అధికారంలో ఉండగా ఆరోగ్య రంగాన్ని నీరుగార్చారు. ప్రజారోగ్యం పట్ల చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న చర్యలతో వైద్య రంగంలో ఏపీ రోల్ మోడల్‌గా ఆవిష్కృతం అవుతోంది. తెలంగాణలో తొమ్మిదేళ్లలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏర్పాటయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం తొలి ఐదేళ్లలో కనీసం ఒక్కటంటే ఒక్క వైద్య కళాశాల తీసుకురాలేకపోయిన విషయాన్ని ఈనాడు ఎందుకు విస్మరించింది? ఏపీలో ఒకేసారి 5 కొత్త మెడికల్ కాలేజీలు ఈ ఏడాదే అందుబాటులోకి వస్తున్నాయి. మిగిలినవి రెండేళ్లలో ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండకుండా సీఎం జగన్ చర్యలు చేపట్టారు. ఇప్పుడు విమర్శలు చేస్తున్న రామోజీరావుకు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వైద్య రంగానికి ఏం చేశారో రాసే ధైర్యముందా? – విడదల రజని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చదవండి: Fact Check: అర్హులకు పరిహారం జమచేస్తే నిందలా?.. ‘ఈనాడు’ వంకర రాతలు -
ఆ రాతల్లో అంతా రోతే.. ఇదేంటి రామోజీ!
సాక్షి, అమరావతి: పిడుగులు పడనీ, పెనుగాలులు రానీ, వానలతో చెట్లు కూలనీ, వరదలతో ట్రాన్స్ఫార్మర్లు కుప్పకూలనీ.. అగ్ని ప్రమాదాలు సంభవించనీ.. విద్యుత్ సరఫరా మాత్రం ఆగడానికి వీల్లేదు.. వైర్లు తెగి, స్తంభాలు కూలినా కరెంటును ఆపడం కుదరదు. ప్రాణాలుపోతే మాకేంటి.. ఎవరేమైపోతే మాకేంటి.. అన్నట్లుగా ఉంది ఈనాడు రామోజీరావు తీరు. అందుకేనేమో వాతావరణంలో అకస్మాత్తుగా వస్తున్న మార్పులతో అక్కడక్కడా కొద్దిసేపు విద్యుత్ సరఫరా నిలిపితే రాష్ట్రమంతటా విద్యుత్ కోతలు విధిస్తున్నారంటూ అడ్డగోలు రాతలు రాస్తోంది. ఆ క్రమంలోనే విద్యుత్ ‘కోతలు బాబోయ్’ అంటూ సోమవారం ‘ఈనాడు’ ప్రచురించిన కథనంలో ఎలాంటి వాస్తవం లేదని గుంటూరు టౌన్–2, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సీహెచ్ రమేష్ స్పష్టంచేశారు. బలమైన ఈదురుగాలులవల్లే.. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో శనివారం, ఆదివారం వాతావరణంలో జరిగిన మార్పులు దృష్ట్యా ఉరుములు మెరుపులతో కూడిన బలమైన ఈదురు గాలులు వచ్చాయి. దీంతో అక్కడక్కడ తీగలు తెగి, విద్యుత్ స్తంభాలు విరిగాయి. ఈ నేపథ్యంలో.. పడిపోయిన వాటిని యథాస్థితికి తీసుకొచ్చి, లోడ్‌ను సరిచేయడానికి విద్యుత్ సరఫరాను కొంతసేపు నిలపాల్సి వచ్చింది. విద్యుత్ పునరుద్ధరించి వినియోగదారులకు అందించే క్రమంలోనే ఇలా జరిగింది. అంతేగానీ ఎటువంటి అధికారిక కోతలు విధించటంలేదని ఏఈ వెల్లడించారు. చదవండి: బాధితులకు అండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ -
నిలువునా ముంచిన ముఠా టార్గెట్ ఇక్కడ యువతే..!
-
2014 నాటి మేనిఫెస్టో కరకట్ట కింద దాచేసిన బాబు
-
పచ్చ విషం గక్కడమే పనిగా పెట్టుకున్నరామోజీరావు
-
అనుమతి లేకుండా సచిన్ ఫోటో వాడుకుంటున్న డిగ్రీ కంపెనీ
-
కాటేసిన కల్తీసారా.. 12 మంది మృతి.. పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
రాష్ట్రంలో మళ్లీ కల్తీ సారా పేదలను కాటేసింది. మరక్కానం సమీపంలోని జాలర్ల గ్రామంలో విక్రయిస్తున్న కాల్తీసార తాగి ఐదుగురు జాలర్లు విగత జీవులయ్యారు. 17 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సీఎం ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తలా రూ. పది లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషి యా ప్రకటించారు. ఇక చెంగల్పట్టు జిల్లాలో మరో నలుగురు రోజువారీ కూలీలు కల్తీ మద్యం తాగి మరణించారు. సాక్షి, చైన్నె: పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రాష్ట్రంలో కల్తీసారా విక్రయాలు మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో విల్లుపురం జిల్లా పరిధిలోని సముద్ర తీర గ్రామాలలో సారా విక్రయాలు పెద్దఎత్తున సాగుతున్నట్లు గత కొంత కాలంగా ఆరోపణలు వినిపిస్తూ వచ్చాయి. తాజాగా కొందరు పోలీసుల నిర్లక్ష్యానికి కల్తీ సారా తాగి ఐదుగురు జాలర్లు మరణించారు. వివరాలు.. విల్లుపురం జిల్లా మరక్కానం పరిధిలోని ఎక్కియార్ కుప్పం సముద్ర తీరంలోని అంబా మేడు పరిసరాల్లో పుదుచ్చేరి నుంచి సారా తీసుకొచ్చి మరీ విక్రయిస్తున్నారు. అదే ప్రాంతంలోకి మారియమ్మన్ ఆలయం వీధికి చెందిన అమరన్(25) ఈ దందా నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ పరిస్థితులలో శనివారం రాత్రి ఇతడు అమ్మిన సారాను పదుల సంఖ్యలో జాలర్లు తాగారు. రాత్రి సమయంలో ఎక్కియార్‌కుప్పం గ్రామానికి చెందిన శంకర్(55), ధరణి వేల్(50), సురేష్(60), ఇంద్రన్(61)తో పాటు ఆరుగురు పూటుగా కల్తీ సారా తాగి ఇళ్లకు చేరుకున్నారు. కాసేపటికి కడుపు నొప్పి, వంతులతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో వీరిని అర్థరాత్రి వేళ పుదుచ్చేరి జిప్మర్కు తరలించారు. వీరంతా కల్తీ సారా సేవించినట్లు వైద్యపరీక్షల్లో తేలింది. అదే సమయంలో చికిత్స పొందుతూ శంకర్, సురేష్, ధరణి వేల్ మరణించారు. ఆందోళనతో ఉద్రిక్తత.. కల్తీ సారా తాగి ముగ్గురు మరణించారనే సమాచారంతో విల్లుపురం జిల్లా యంత్రాంగం కదిలింది. అంబా మేడు పరిఽధిలో సారా పూటుగా తాగి అపస్మారక స్థితిలో పడివున్న వారిని గుర్తించి చికిత్స నిమిత్తం మరాక్కానం, ముండియంబాక్కం ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ పళణి, ఎస్పీ శ్రీనాథ్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. కల్తీ సారా విక్రయదారులను అరెస్టు చేయాలని కోరుతూ ఆదివారం ఉదయం జాలర్ల గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. సారా విక్రయదారుడు అమరన్‌ను అరెస్టు చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇవ్వడంతో జాలర్లు ఆందోళన విరమించారు. అదే సమయంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన మరో ఇద్దరు మధ్యాహ్నం మరణించడంతో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఇక చికిత్స పొందుతున్న బాధితుల్లో ఇద్దరి పరిస్థితి ఆందోళనకకరంగా ఉందని వైద్యులు ప్రకటించారు. అధికారులపై వేటు మళ్లీ సారా సంస్కృతి తెర మీదకు రావడం, నలుగురు మరణించడంతో ప్రభుత్లంపై ప్రతి పక్షాలు దుమ్మెత్తి పోసే పనిలో పడ్డాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామితో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రభుత్వతీరును దుయ్యబట్టారు. రాష్ట్రంలో యథేచ్ఛగా గంజాయి వంటి మత్తు పదార్థాలు లభ్యమవుతూ వచ్చాయని, ఇప్పుడు సారా సంస్కృతి కూడా మళ్లీ తెర మీదకు వచ్చి నలుగురు బలికావడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఈ ఘటనను సీఎం స్టాలిన్ తీవ్రంగా పరిగణించారు. డీజీపీ శైలేంద్రబాబుతో ఈ విషయంపై చర్చించారు. డీజీపీ ఆదేశాలతో మరక్కానం ఇన్స్పెక్టర్ అరుల్ వడివళగన్, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ దీపన్, ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ మరియా సోఫి మంజుల, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ శివగురునాథన్‌ను సస్పెండ్ చేశారు. ఈ ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలకు సీఎం స్టాలిన్ తన సానుభూతి తెలియజేశారు. అలాగే తలా రూ. 10 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. సారా రక్కసి నలుగురిని బలి కొనడంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. సారా తయారీ కేంద్రాలపై దృష్టి సారించారు. -
శిలాఫలకాలకే పరిమితమైన చంద్రబాబు పాలన
-
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు ఫేక్..! ఆప్ నేతకు క్షమాపణలు చెప్పిన ఈడీ..
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో పొరపాటుగా పేరు చేర్చినందుకు ఆప్ నేత సంజయ్ సింగ్‌కు క్షమాపణలు చెప్పింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. టైపోగ్రాఫికల్/క్లరికల్ తప్పిదం వల్ల రాహుల్ సింగ్ పేరుకు బదులు సంజయ్ సింగ్ అని అచ్చయ్యిందని తెలిపింది. ఈ మేరకు ఆయనకు అధికారిక లేఖ పంపింది. లిక్కర్ స్కాం కేసు ఛార్జ్‌షీట్‌లో ఆప్ నేత సంజయ్ సింగ్ పేరును కూడా ఈడీ చేర్చింది. అసలు ఏ సంబంధం లేని తన పేరును ఛార్జిషీట్లో చేర్చడంపై సంజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రతిష్ఠ దెబ్బతీశారని ఈడీకి లీగల్ నోటీసులు పంపారు. దీంతో తప్పు తమవైపు నుంచే జరిగిందని ఈడీ అంగీకరించింది. సంజయ్ సింగ్‌కు క్షమాపణలు చెప్పింది. అనంతరం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. చరిత్రలో తొలిసారి ఈడీ క్షమాపణలు కోరతూ తనకు లేఖ రాసిందని సంజయ్ సింగ్ ట్వీట్ చేశారు. ED के झूठ का पर्दाफ़ाश करेंगे। अग्रिम कार्यवाही के लिये भारत सरकार के वित्त सचिव को मेरा पत्र। pic.twitter.com/84f9NLk9Id — Sanjay Singh AAP (@SanjayAzadSln) May 3, 2023 ఢిల్లీ లిక్కర్ స్కాం ఫేక్ కేసు: కేజ్రీవాల్.. ఈ విషయంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఏ సంబంధం లేని సంజయ్ సింగ్‌ను కూడా ఢిల్లీ లిక్కర్ స్కాంలోకి లాగాలని ఈడీ చూసిందని , కానీ లీగల్ నోటీసులు పంపడంతో క్షమాపణలు చెప్పిందని పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు ఫేక్ అని తెలిపేందుకు ఇదే పెద్ద నిదర్శనమన్నారు. నిజాయితీ గల తమ పార్టీని, నాయకుల ప్రతిష్టను మసకబార్చాలనే దురుద్దేశంతోనే ప్రధాని మోదీ ఈడీతో ఈ పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీకి ఆదరణ పెరగడం చూసి ఓర్వలేకపోతున్నారని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. क्या किसी का नाम चार्जशीट में गलती से भी डाला जाता है? इस से साफ़ है कि पूरा केस फ़र्ज़ी है। केवल गंदी राजनीति के तहत देश की सबसे ईमानदार पार्टी को बदनाम करने और सबसे तेज़ी से बढ़ने वाली पार्टी को रोकने के लिए प्रधान मंत्री जी ऐसा कर रहे हैं। उन्हें ये शोभा नहीं देता। https://t.co/xu5kywg5Fz — Arvind Kejriwal (@ArvindKejriwal) May 3, 2023 కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ ఇప్పటికే అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన రిమాండ్‌లోనే ఉన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా తెలంగాణ ఎమ్మెల్సీ కవితతో పాటు మరికొందరు ప్రముఖులను సీబీఐ ఈ కేసులో విచారించిన విషయం తెలిసిందే. చదవండి: శరద్ పవార్ రాజీనామా చేశారంటే.. దేశ రాజకీయాల్లో ఏదో జరగబోతోంది..! -
సర్వే నివేదిక పుస్తకాన్ని ఆవిష్కరించిన కొమ్మినేని శ్రీనివాసరావు
-
హలో.. పార్శిల్ ముట్టిందా? కాదు.. బ్యాంకు ఖాతా ఖాళీ అయింది
కాజీపేట: నిత్యం ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటాం. వాటికి సంబంధించిన సమాచార అన్వేషణ కోసం ఇంటర్నెట్పై ఎక్కువగా ఆధారపడుతున్నాం. ఇంటర్నెట్లోని వివిధ వెబ్సైట్ట్లను పరిశీలించే వారి సంఖ్య పెరుగుతోంది. మనిషి అవసరాన్ని గుర్తించిన కేటుగాళ్లు తమ సంపాదనకు మలుచుకుంటున్నారు. ఫలితంగా సొ మ్ము పరుల పాలవుతోంది. సేవా లోపాల పరిష్కారానికి వివిధ సంస్థల ఫోన్ నంబర్లు ఇంటర్నెట్లో బోగస్‌వి పెడుతున్నారు. వాటికి పలువురు వినియోగదారులు ఫోన్‌చేసి మోసగాళ్ల ఉచ్చులో పడి బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును పోగొట్టుకుంటున్నారు. కొరియర్ నంబర్ కోసం వెతికితే... కాజీపేటకు చెందిన అబ్దుల్ ఖాదర్ హైదరాబాద్‌లో ఉండే తన స్నేహితుడికి ఇటీవల ఓ పార్సిల్‌ను కొరియర్ చేశాడు. వారం గడుస్తున్నా కొరియర్ రాకపోయేసరికి ఇంటర్నెట్లో సంబంధిత సంస్థ కస్టమర్ కేర్ నంబర్ కోసం వెతికి దానికి ఫోన్ చేశాడు. ఆ నంబర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తర్వాత కొద్దిసేపటికి కొరియర్ సంస్థ నుంచి అంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి పరిచయం చేసుకున్నాడు. మీ పార్సిల్ బ్రాంచి కార్యాలయంలో ఆగిందని, ప్రాసెస్ చేయడానికి రూ.2 ఫోన్ ద్వారా చెల్లించాలని కోరారు. మీకు రాము అనే కొరియర్ బాయ్ తీసుకొస్తాడని చెప్పి ఓ నంబర్ ఇచ్చాడు. ఆ నంబర్‌కు రూ.2 చెల్లిస్తే ఈ నెల 26 వరకు పార్సిల్ చేరుస్తామంటూ ఓ లింక్ పంపించాడు. నిజమే అని నమ్మిన అబ్దుల్ ఖాదర్ ఆ లింక్‌ను క్లిక్‌చేసి డబ్బు చెల్లించాడు. రెండు రోజులు దాటుతున్నా కొరియర్ సర్వీస్ అడ్రస్ లేకపోవడంతో పాటు సెల్‌ఫోన్‌కు వచ్చిన ఎస్ఎంఎస్లు చూసి అవాక్కయ్యాడు. తొమ్మిది విడుతలుగా రూ.1.36 లక్షలు ఆయన బ్యాంక్ ఖాతా నుంచి డ్రా అయ్యాయి. వెంటనే ఖాతాను బ్లాక్ చేయించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇలాంటి ఆన్లైన్ కేసులు ఒక కాజీపేట పీఎస్‌లోనే పాతికకు పైగా నమోదయ్యాయి. ఇంటర్నెట్లోని వివిధ వెబ్సైట్లలో పలువురు మోసగాళ్లు ..వివిధ కంపెనీల, బ్యాంకుల కస్టమర్ కేర్ నంబర్ అని చెప్పి తమ సొంత ఫోన్ నంబర్లను ఉంచుతున్నారు. వెబ్సైట్లలో వెతికి ఈ నంబర్లను ఉంచుతున్నారు. వెబ్సైట్లలో వెతికి ఈ నంబర్లకు ఫోన్ చేసి మోసపోకూడదు. ఆ సంస్థకు చెందిన అధీకృత వెబ్సైట్ నుంచి మాత్రమే తీసుకోవాలి. ప్రైవేట్ వెబ్సైట్లలో వివరాలు నమోదు చేయకూడదు. అవి మోసగాళ్లకు సులువుగా వెళ్తాయి. సంబంధిత కంపెనీ వెబ్సైట్లోకి వెళ్లడం ఉత్తమం.