కూల్‌ డ్రింక్స్‌ తెగ తాగేస్తున్నారా? ఈ వీడియో చూడండి! | Adulterated Coca-Cola Bottles Doing Rounds On Social Media | Sakshi
Sakshi News home page

కూల్‌ డ్రింక్స్‌ తెగ తాగేస్తున్నారా? ఈ వీడియో చూడండి!

Published Fri, Mar 29 2024 5:34 PM | Last Updated on Fri, Mar 29 2024 6:16 PM

adulterated coca cola bottles doing rounds on social media - Sakshi

సమ్మర్‌ వచ్చేసింది...ఎండలు మండిపోతున్నాయని కూల్‌ డ్రింక్స్‌ తెగ తాగేస్తున్నారా? అయితే మీకో షాకింగ్‌ న్యూస్‌. కల్తీ కోకా కోలా డ్రింక్‌ బాటిల్స్‌ వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. (ఎనిమిదేళ్లకే పెళ్లి..బడి గుమ్మం తొక్కలేదు : అయితేనేం ఆమె ఒక లెజెండ్‌!)

ఈ వీడియో ప్రకారం కోకా కోలా లేబుల్స్‌ వేసిన ప్లాస్టిక్‌ బాటిల్స్‌లో ఒక వ్యక్తి డ్రింక్‌ను నింపుతున్న దృశ్యాలను ఇందులో చూడొచ్చు.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇదేందిరా ఇది.. ఎపుడు చూడలే అంటూ  ఒకింత ఆందోళనగా కమెంట్స్‌ చేస్తున్నారు. (వేసవిలో చల్ల చల్లగా : గోండ్‌ కటీరా జ్యూస్‌.. ఒక్కసారి తాగితే..!)

ఈ కోకాకోలా ఫ్యాక్టరీలో తయారైనా ఒకటే, బాత్‌ రూంలో తయారైనా ఒకటి పెద్దగా తేడా ఏముంది అంటూ  మరికొందరు వ్యాఖ్యానించారు. మరికొంతమంది దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కోకాకోలాను ట్యాగ్‌ను గమనార్హం.  అయితే ఈ వీడియో ఎక్కడిది? ఏ ప్రదేశానికి చెందినది అనే వివరాలు అందుబాటులో లేవు.  మరి ఈ వీడియోపై కోకా  కోలా కంపెనీ ఎలా స్పందిస్తుందో చూడాలి. (లగ్జరీ బంగ్లాను విక్రయించిన ఇషా అంబానీ? ఎవరు కొన్నారు? )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement