fabrication
-
భారత్‌లో అపార వ్యాపారావకాశాలు: కెనాన్ ఇండియా ప్రెసిడెంట్
భారత్‌లో చిప్ ఫ్యాబ్రికేషన్కి సంబంధించి గణనీయంగా వ్యాపార అవకాశాలు ఉన్నట్లు జపాన్‌కి చెందిన ఇమేజింగ్ ఉత్పత్తుల దిగ్గజం కెనాన్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో తొషియాకి నొమురా తెలిపారు. తమ సెమీకండక్టర్ లిథోగ్రఫీ మెషిన్లను సరఫరా చేసేందుకు, దేశీయంగా సెమీకండక్టర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్న కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు వివరించారు.చిప్‌ల ఉత్పత్తికి పలు చిప్ తయారీ సంస్థలకు ఇప్పుడు భారత్ కొత్త గమ్యస్థానంగా మారుతోందని పేర్కొన్నారు. మరోవైపు 2024లో తమ వృద్ధి దాదాపు రెండంకెల స్థాయిలో ఉండగలదని, ఏటా ఇదే తీరును కొనసాగించగలమని ఆశిస్తున్నట్లు నొమురా వివరించారు.ప్రధాన వ్యాపారమైన ఇమేజింగ్, ప్రింటింగ్, సరై్వలెన్స్ ఉత్పత్తులతో పాటు కెనాన్ ఇండియా సంస్థ ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేలతో పాటు డయాగ్నోస్టిక్ మెడికల్ ఇమేజింగ్ సొల్యూషన్స్‌పై (సీటీ, ఎక్స్-రే, అ్రల్టాసౌండ్ మొదలైనవి) కూడా దృష్టి పెడుతోంది. హెల్త్‌కేర్ విభాగంలో తమ వ్యాపార వృద్ధికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయని నొమురా తెలిపారు. అటు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ విస్తరిస్తున్నామని పేర్కొన్నారు. ఐటీ, బీఎఫ్ఎస్ఐ, ఫార్మా తదితర పరిశ్రమలపైనా దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. -
కూల్ డ్రింక్స్ తెగ తాగేస్తున్నారా? ఈ వీడియో చూడండి!
సమ్మర్ వచ్చేసింది...ఎండలు మండిపోతున్నాయని కూల్ డ్రింక్స్ తెగ తాగేస్తున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. కల్తీ కోకా కోలా డ్రింక్ బాటిల్స్ వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. (ఎనిమిదేళ్లకే పెళ్లి..బడి గుమ్మం తొక్కలేదు : అయితేనేం ఆమె ఒక లెజెండ్!) ఈ వీడియో ప్రకారం కోకా కోలా లేబుల్స్ వేసిన ప్లాస్టిక్ బాటిల్స్‌లో ఒక వ్యక్తి డ్రింక్‌ను నింపుతున్న దృశ్యాలను ఇందులో చూడొచ్చు.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇదేందిరా ఇది.. ఎపుడు చూడలే అంటూ ఒకింత ఆందోళనగా కమెంట్స్ చేస్తున్నారు. (వేసవిలో చల్ల చల్లగా : గోండ్ కటీరా జ్యూస్.. ఒక్కసారి తాగితే..!) ఈ కోకాకోలా ఫ్యాక్టరీలో తయారైనా ఒకటే, బాత్ రూంలో తయారైనా ఒకటి పెద్దగా తేడా ఏముంది అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. మరికొంతమంది దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కోకాకోలాను ట్యాగ్‌ను గమనార్హం. అయితే ఈ వీడియో ఎక్కడిది? ఏ ప్రదేశానికి చెందినది అనే వివరాలు అందుబాటులో లేవు. మరి ఈ వీడియోపై కోకా కోలా కంపెనీ ఎలా స్పందిస్తుందో చూడాలి. (లగ్జరీ బంగ్లాను విక్రయించిన ఇషా అంబానీ? ఎవరు కొన్నారు? ) A forward doing the rounds. Things get ...... With @CocaCola pic.twitter.com/vAhxcDhb1F — R. Balakrishnan (@BalakrishnanR) March 29, 2024 -
ఏడాదిలోగా తొలి సెమీకాన్ ప్లాంటు
న్యూఢిల్లీ: దేశీయంగా ఎల్రక్టానిక్ చిప్ తయారీ తొలి ప్లాంటు ఏడాదిలోగా ఏర్పాటయ్యే వీలున్నట్లు కేంద్ర టెలికం, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దేశంలో వేఫర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంటుసహా.. సెమీకండక్టర్ తయారీ ఎకోసిస్టమ్(వ్యవస్థ)ను నెలకొల్పే బాటలో తొలిగా ప్రభుత్వం 10 బిలియన్ డాలర్ల ప్రోత్సాహకాలకు తెరతీసినట్లు తెలియజేశారు. అన్ని రకాల హైటెక్ ఎల్రక్టానిక్ ప్రొడక్టులలో వినియోగించే ఫిజికల్ చిప్స్ తయారీకి వేఫర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్లను తొలి దశ బ్లాకులుగా వ్యవహరిస్తారు. అంతర్జాతీయంగా నాయకత్వ స్థాయిలో ఎదిగేందుకు కొన్ని ప్రత్యేక విభాగాలపై దృష్టి పెట్టినట్లు అశ్వినీ వెల్లడించారు. ప్రధానంగా సెమీకండక్టర్లకు టెలికం, ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ) అతిపెద్ద విభాగాలుగా ఆవిర్భవించినట్లు వివరించారు. వెరసి ఈ విభాగాలలో వినియోగించే చిప్స్ అభివృద్ధి, తయారీలపై దృష్టి పెట్టడం ద్వారా టెలికం, ఈవీలకు గ్లోబల్ లీడర్లుగా ఎదిగే వీలున్నట్లు తెలియజేశారు. ఈ రెండు విభాగాలపై ప్రత్యేక దృష్టితో పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. రానున్న కొన్ని నెలల్లో చెప్పుకోదగ్గ విజయాలను అందుకోనున్నట్లు అంచనా వేశారు. వేఫర్ ఫ్యాబ్రికేషన్, డిజైన్, తయారీ ద్వారా పూర్తి వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. దేశీయంగా చిప్ తయారీ యూఎస్ దిగ్గజం మైక్రాన్ పెట్టుబడుల విజయంతో ప్రపంచమంతటా దేశీ సామర్థ్యాలపై విశ్వాసం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. మైక్రాన్ గత నెలలో గుజరాత్‌లోని సణంద్‌లో సెమీకండక్టర్ అసెంబ్లీ ప్లాంటు నిర్మాణాన్ని ప్రారంభించింది. ఈ ప్లాంటుతోపాటు టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు జూన్‌లో మొత్తం 2.75 బిలియన్ డాలర్ల(రూ. 22,540 కోట్లు) పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించింది. వీటిలో మైక్రాన్ 82.5 కోట్లు ఇన్వెస్ట్ చేయనుండగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిగిలిన పెట్టుబడులను సమకూర్చనున్నాయి. -
కొద్ది వారాల్లో తొలి సెమికండక్టర్ ఫ్యాబ్
న్యూఢిల్లీ: దేశీయంగా తొలి సెమీకండక్టర్ ఫ్యాబ్‌ను వచ్చే కొద్ది వారాల్లోనే ప్రకటించనున్నట్లు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రభుత్వ అనుకూల విధానాల తోడ్పాటుతో చిప్ పరిశ్రమ వచ్చే 3–4 ఏళ్లలో గణనీయంగా వృద్ధి చెందగలదని సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పదేళ్ల క్రితం ప్రతి 100 ఫోన్లలో 99 శాతం మొబైల్స్‌ను దిగుమతి చేసుకోగా .. నేడు భారత్‌లో వినియోగిస్తున్న 99 శాతం మొబైల్ ఫోన్లు దేశీయంగానే తయారవుతున్నాయని మంత్రి చెప్పారు. మొబైల్ ఫోన్ల తయారీ లో భారత్ రెండో స్థానంలోనూ, ఎగుమతుల్లో మూడో స్థానంలోనూ ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది మొబైల్ ఫోన్ల ఎగుమతులు 9.5–10 బిలియన్ డాలర్ల స్థాయికి చేరగలవని వైష్ణవ్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే సెమీకండక్టర్ల పరిశ్రమకు అనువైన పరిస్థితులను కల్పించడంపై ప్రభుత్వం దృష్టి పెడుతోందని ఆయన పేర్కొన్నారు. -
100 బిలియన్ డాలర్ల సంస్థగా వేదాంత
న్యూఢిల్లీ: వ్యాపార దిగ్గజం వేదాంత లిమిటెడ్ వచ్చే ఎనిమిదేళ్లలో 100 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8 లక్షల కోట్లు) కంపెనీగా ఎదగాలని నిర్దేశించుకుంది. ప్రస్తుతం ఇది 18 బిలియన్ డాలర్ల (రూ. 1.3 లక్షల కోట్లు) సంస్థగా ఉంది. వృద్ధి ప్రణాళికలను దూకుడుగా అమలు చేయడంపైనా, వివిధ వ్యాపార విభాగాల్లో సామర్థ్యాలను పెంచుకోవడంపైనా మరింతగా దృష్టి పెట్టనున్నట్లు బుధవారం వేదాంత వార్షిక సర్వసభ్య సమావేశంలో సంస్థ చైర్మన్ అనిల్ అగర్వాల్ వెల్లడించారు. సెమీకండక్టర్లు, డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ విభాగాల్లోకి వ్యూహాత్మకంగా ప్రవేశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ‘అంతర్జాతీయంగా సెమీకండక్టర్ల కొరత నెలకొంది. భారత్ 100 శాతం దిగుమతులపైనే ఆధారపడాల్సి ఉంటున్నందున ఇది సమస్యగా మారింది. దేశీయంగా సెమీకండక్టర్ల వినియోగం 2026 నాటికి 80 బిలియన్ డాలర్లకు, ఆ తర్వాత 2030 నాటికి 110 బిలియన్ డాలర్లకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి‘ అని అగర్వాల్ వివరించారు. దేశీయంగా సమగ్ర సెమీకండక్టర్ తయారీ ప్లాంటు ఏర్పాటు చేసేందుకు వేదాంత ఇప్పటికే దిగ్గజ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌తో చేతులు కలిపింది. దేశ వృద్ధిలో సహజ వనరుల కీలక పాత్ర.. భారతదేశ ఆర్థిక వృద్ధిలో సహజ వనరుల రంగం కీలక పాత్ర పోషిస్తోందని అనిల్ అగర్వాల్ అన్నారు. ఒక చిన్న విధానపరమైన మార్పు ఈ రంగం ‘నిజమైన సామర్థ్యాన్ని వెలికితీస్తుంది‘ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘భారత్ స్వావలంబన దిశలో వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో దేశ వృద్ధి, ఉపాధి కల్పనలో సహజ వనరుల రంగం కీలక పాత్ర పోషిస్తోంది. చిన్న విధాన సంస్కరణలు కూడా సహజ వనరుల విభాగ నిజమైన సామర్థ్యాన్ని వెలికితీస్తాయి’’ అని చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ► మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల మధ్య ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా చైనాను మాత్రమే కాకుండా భారత్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ► ‘చైనాతోపాటు మరొక దేశం వ్యూహాన్ని’ అవలంబిస్తున్న అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ‘భారత్ ఖచ్చితంగా ఒక ఆకర్షణీయమైన ప్రదేశంగా కనబడుతుంది. తమ పెట్టుబడులకు కేవలం చైనానే కాకుండా, ప్రత్యామ్నాయంగా మిగిలిన దేశాలవైపూ చూడటం ఈ వ్యూహం ప్రధాన ఉద్దేశం. ► మహమ్మారి కోవిడ్–19, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. అయితే ఈ సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ చాలా దేశాల కంటే మెరుగ్గా పనిచేస్తోంది. ► భారత్ దాదాపు ఏడు శాతం వృద్ధి రేటుతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉంది. అమెరికా, బ్రిటన్లు దాదాపు రెండంకెల స్థాయిల్లో ద్రవ్యోల్బణం సవాలును ఎదుర్కొంటుండగా, ఆయా దేశాలతో పోల్చితే భారత్‌లో ఒక మోస్తరు ద్రవ్యోల్బణమే కొనసాగుతోంది. -
చిప్ తయారీ ఇక ‘లోకల్’
న్యూఢిల్లీ: దేశంలో సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ తయారీ ప్లాంట్ల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ విభాగంలో అంతర్జాతీయంగా దిగ్గజ సంస్థలను భారత్‌కు రప్పించడంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ప్రయత్నాలు మొదలుపెట్టింది. తైవాన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, వీఐఏ టెక్నాలజీస్, యునైటెడ్ మైక్రో ఎలక్ట్రానిక్ కార్పొరేషన్, ఇంటెల్, మైక్రాన్ టెక్నాలజీ, ఎన్ఎక్స్పీ సెమీకండక్టర్స్, టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, ఫుజి ఎలక్ట్రిక్ కంపెనీ, ప్యానాసోనిక్, ఇన్ఫీనియాన్ టెక్నాలజీస్ ఏజీ, ఎస్టీ మైక్రో ఎలక్ట్రానిక్స్, ఎస్కే మైనిక్స్, శామ్సంగ్ కంపెనీలతో ఒక జాబితాను రూపొందించింది. అంతర్జాతీయ కంపెనీలతోపాటు, దేశీయ కంపెనీల జాయింట్ వెంచర్ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణలకు ఇప్పటికే ఎలక్ట్రానిక్స్ శాఖా ఆహ్వానం పలికింది. ప్రాథమిక స్థాయి ప్రాజెక్టు నివేదికను సమర్పించేందుకు ఈ నెల 31వతేదీ వరకు గడువు ఇచ్చింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద అంతర్జాతీయంగా పేరొందిన కంపెనీలను రాబట్టే చర్యలను మొదలు పెట్టింది. 400 డాలర్లకు పైగా (రూ.30వేలు) ఖరీదైన ల్యాప్‌టాప్‌లను తయారు చేసే, 200 డాలర్లకు పైగా ఖరీదైన ట్యాబ్లెట్లను (రూ.15వేలు) తయారు చేసే సంస్థలకు, సర్వర్లు, పర్సనల్ కంప్యూటర్ల తయారీ సంస్థలకు పీఎల్ఐ పథకం కింద విక్రయాలపై 2–4 శాతం వరకు ప్రోత్సాహకంగా ఇచ్చే ప్రణాళికలతో ఎలక్ట్రానిక్స్ శాఖా ఉంది. మూడు దశల్లో.. తైవాన్‌కు చెందిన క్వాంటా కంప్యూటర్ ఇన్కార్పొరేటెడ్, ఫాక్స్‌కాన్, ఏసర్, ఆసుస్, ఇన్వెంటెక్ కార్పొరేషన్.. అమెరికాకు చెందిన డెల్, యాపిల్, సిస్కో సిస్టమ్స్, ఫ్లెక్స్, భారత్‌కు చెందిన కోకోనిక్స్, హెచ్‌ఎల్‌బీఎస్ టెక్నాలజీస్లను ఆకర్షించే ప్రణాళికలతో కేంద్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖా ఉంది. పీఎల్ఐ పథకం కింద రూ.7,350 కోట్ల ప్రోత్సాహకాలను ఇవ్వనుంది. ఫ్యాబ్రికేషన్ ప్లాంట్లను రాబట్టడంలో మూడు దశలను అనుసరించనుంది. మొదట ఇంటెగ్రేటెడ్ డిజైన్ తయారీదారులు, ఫౌండ్రీలు లేదా భారత కంపెనీల భాగస్వామ్యంతో ఫ్యాబ్రికేషన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయదలిచిన సంస్థలను తీసుకురావాలన్న ప్రణాళికతో ఉంది. లేదా ఇప్పటికే ఉన్న ప్లాంట్ విస్తరణ ప్రతిపాదలను అయినా అనుమతించనుంది. ప్రతీ నెలా 30,000 వేఫర్ స్టార్స్ సామర్థ్యంతో (300ఎంఎం వేఫర్ సైజ్) కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సయిడ్ సెమీకండక్టర్ టెక్నాలజీతో చిప్‌లను తయారు చేయాల్సి ఉంటుంది. ఇక రెండో దశలో 200 ఎంఎం వేఫర్సైజ్తో కూడిన చిప్‌లను అత్యాధునిక టెక్నాలజీల సాయంతో తయారు చేసే సంస్థలకు ఆహ్వానం పలకనుంది. మూడో దశలో భారత సంస్థల భాగస్వామ్యంతో సెంమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్లను ఏర్పాటు చేసే సంస్థలను తీసుకురానుంది. ఎటువంటి మద్దతుకైనా సిద్ధమే.. తమ నుంచి ఏ తరహా ఆర్థిక మద్దతు కావాలో చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సంస్థలను కోరింది. ఈక్విటీ రూపంలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ డేలా వయబులిటీ గ్యాప్ ఫండ్, దీర్ఘకాల వడ్డీ లేని రుణాలు, పన్ను ప్రయోజనాలు, మౌలిక సదుపాయాలు.. ఏ విధమైన మద్దతు కావాలో చెప్పాలని కోరింది. ఆసక్తి కలిగిన కంపెనీలు తమ పెట్టుబడుల ప్రతిపాదనలను, టెక్నాలజీల వినయోగం వివరాలను సమర్పించాలంటూ కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖా ఇప్పటికే స్పష్టం చేసింది. కంపెనీల నుంచి వచ్చే ప్రతిపాదనల ఆధారంగా దేశంలో ఫ్యాబ్రికేషన్ సెమీ కండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ఆకర్షణీయమైన పథకాన్ని రూపొందించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
ఆర్టీఐ పత్రాలను ఫోర్జరీ చేశాడు!
న్యూఢిల్లీ: ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని సేకరించినట్లు చెప్తూ.. ఆయుష్ మంత్రిత్వశాఖ ముస్లింలకు ఉద్యోగాలను ఇవ్వలేదని చెప్పిన జర్నలిస్టును పోలీసులు అరెస్టు చేశారు. తాను ఆ విషయాన్ని ఆర్టీఐ నుంచి మాత్రమే తీసుకున్నట్లు శర్మ వివరించారు. గత ఏడాది మార్చినెలలో16 నుంచి 31 తేదిల మధ్య సమయంలో మిల్లీ గెజిట్ లో ఈ విషయాన్ని ప్రచురించారు. ఈ విషయంపై శర్మను విచారించిన కోట్లా ముబారక్పూర్ పోలీసుల దేశాన్ని, ఢిల్లీని వదలి వెళ్లకూడదనే కండీషన్ తో శర్మను విడిచిపెట్టారు. పోలీసులు మిల్లీ గెజిట్ మ్యాగజైన్ ఎడిటర్ డా.జర్ఫారుల్ ఇస్లాం ఖాన్ ను ఈ కేసులో సాక్షిగా పేర్కొన్నారు. -
భార్యను నిర్బంధించిన భర్త
రెండో పెళ్లికి పథకం పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు పలమనేరు: రెండో పెళ్లి కోసం ఓ వ్యక్తి తన భార్యను ఇంట్లో నిర్బంధించి వేధింపులకు గురిచేసిన ఘటన బుధవారం గంగవరం మండలం ఉయ్యాలమిట్టలో చోటు చేసుకుంది. తప్పిం చుకున్న బాధితురాలు గంగవరం పోలీసులను ఆశ్రయిం చింది. బాధితురాలి కథనం మేరకు.. గంగవరం కస్తూర్బా పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసే కల్పనతో పుంగనూరులోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసే శివశంకర్ నాయుడుకు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. కల్పనను అత్తింటి వారు కొద్ది రోజులు ఆప్యా యంగా చూసుకున్నాడు. ఆపై రెండో పెళ్లికి శివశంకర్ నాయుడు అత్తమామలు నాగరాజునాయుడు, వసంతమ్మ, మేనమామ గోపాల్‌నాయుడు పథకం పన్నారు. అప్పటి నుంచి వీరి వేధింపులు ఎక్కువయ్యాయి. బాధితురాలు కొన్నాళ్లుగా పుట్టింట్లోనే ఉంటోంది. శివశంకర్ నాయుడు వారం రోజుల క్రితం భార్య వద్దకు వచ్చారు. ఇకపై ఎటువంటి గొడవలూ లేకుండా చూసుకుంటానని అత్తమామలకు నచ్చజెప్పి భార్యను ఇంటికి తీసుకెళ్లారు. రెండ్రోజుల క్రితం బాధితురాలిని చితకబాది ఇంట్లో నిర్బంధించారు. బుధవారం ఉదయం స్థానికుల సాయంతో తప్పించుకున్న బాధితురాలు గంగవరం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తన భర్త, ఆయన కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని వేడుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.