భార్యను నిర్బంధించిన భర్త | Wife, husband detained | Sakshi
Sakshi News home page

భార్యను నిర్బంధించిన భర్త

Jul 24 2014 3:49 AM | Updated on Sep 2 2017 10:45 AM

భార్యను నిర్బంధించిన భర్త

భార్యను నిర్బంధించిన భర్త

రెండో పెళ్లి కోసం ఓ వ్యక్తి తన భార్యను ఇంట్లో నిర్బంధించి వేధింపులకు గురిచేసిన ఘటన బుధవారం గంగవరం మండలం ఉయ్యాలమిట్టలో చోటు చేసుకుంది.

  •     రెండో పెళ్లికి పథకం
  •      పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
  • పలమనేరు: రెండో పెళ్లి కోసం ఓ వ్యక్తి తన భార్యను ఇంట్లో నిర్బంధించి వేధింపులకు గురిచేసిన ఘటన బుధవారం గంగవరం మండలం ఉయ్యాలమిట్టలో చోటు చేసుకుంది. తప్పిం చుకున్న బాధితురాలు గంగవరం పోలీసులను ఆశ్రయిం చింది.

    బాధితురాలి కథనం మేరకు.. గంగవరం కస్తూర్బా పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసే కల్పనతో పుంగనూరులోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసే శివశంకర్ నాయుడుకు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. కల్పనను అత్తింటి వారు కొద్ది రోజులు ఆప్యా యంగా చూసుకున్నాడు. ఆపై రెండో పెళ్లికి శివశంకర్ నాయుడు అత్తమామలు నాగరాజునాయుడు, వసంతమ్మ, మేనమామ గోపాల్‌నాయుడు పథకం పన్నారు. అప్పటి నుంచి వీరి వేధింపులు ఎక్కువయ్యాయి. బాధితురాలు కొన్నాళ్లుగా పుట్టింట్లోనే ఉంటోంది. శివశంకర్ నాయుడు వారం రోజుల క్రితం భార్య వద్దకు వచ్చారు.

    ఇకపై ఎటువంటి గొడవలూ లేకుండా చూసుకుంటానని అత్తమామలకు నచ్చజెప్పి భార్యను ఇంటికి తీసుకెళ్లారు. రెండ్రోజుల క్రితం బాధితురాలిని చితకబాది ఇంట్లో నిర్బంధించారు. బుధవారం ఉదయం స్థానికుల సాయంతో తప్పించుకున్న బాధితురాలు గంగవరం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తన భర్త, ఆయన కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని వేడుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement