second wedding
-
54 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న మాజీ మంత్రి
భువనేశ్వర్: అధికార పార్టీ బీజూ జనతాదల్ కొరాపుట్ జిల్లా పరిశీలకుడు, మాజీమంత్రి కెప్టెన్ దివ్యశంకర్ మిశ్రా(54) రెండో వివాహం చేసుకున్నారు. పూరీ సమీపంలోని ఓ రిసార్టులో ఆదివారం ఈ వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పరిమిత బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. పాస్‌లు ఉన్న వారిని మాత్రమే ప్రవేశానికి అనుమతించారు. కాగా దివశంకర్‌తోపాటు అతను వివాహం చేసుకున్న ప్రియాంక అగస్తీకి కూడా ఇది రెండో పెళ్లి. వీరిద్దరూ ఇంతకముందు తమ గత వైవాహిక జీవితాలలో విడాకులు తీసుకున్నారు. గతంలో జయపట్నకు చెందిన మహిళతో వివాహం చేసుకున్న ఆయన.. వివిధ కారణాలతో ఆమెకు విడాకులు ఇచ్చారు. వీరి దాంపత్యంలో జన్మించిన కుమారుడు దుబాయ్‌లో చదువుతున్నట్లు సమాచారం. టాటాలో సీనియర్ ఇంజినీర్.. దివ్యశంకర మిశ్రాను వివాహం చేసుకున్న ప్రియాంక అగసీకలహండి జిల్లాలోని గోలముండా మండలం డెకోటా గ్రామానికి చెందిన భవానీ అగస్తీ కుమార్తె. సోషల్ మీడియా ప్రొఫైల్ ప్రకారం టాటా పవర్లో సీనియర్ లీడ్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. ప్రియాంకకు కూడా ఇది రెండో వివాహం కాగా, గతంలో మానస్ పండా అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని, విడాకులు తీసుకున్నారు. సంచలనాలకు మారు పేరైన దివ్యశంకర్.. ఈ వివాహంతో మరోసారి వార్తల్లో నిలిచారు. దివ్యశంకర్ ప్రస్తుతం కలహండి జిల్లా జునాఘడ్ విధానసభ స్థానం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. తొలుత నవీన్ క్యాబినెట్లో హోంశాఖ సహాయ మంత్రిగా ఉండేవారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉపాధ్యాయురాలు మమతా మెహర్ హత్య కేసులో దివ్యశంకర్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో క్యాబినెట్ విస్తరణలో మంత్రి పదవిని నిలబెట్టుకోలేక పోయారు. అయితే ఇటీవల బీజేడీ అధిష్టానం ఆయనకు కొరాపుట్ జిల్లా బాధ్యతలు అప్పగించింది. -
బిడ్డ పుట్టిన తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగి నట్టేట ముంచాడు
అనంతపురం క్రైం: మొదటి భార్య నుంచి విడిపోయానంటూ నమ్మించి తనను రెండో పెళ్లి చేసుకుని బిడ్డ పుట్టిన తర్వాత నట్టేట ముంచిన సాఫ్ట్వేర్ ఉద్యోగి నుంచి న్యాయం చేయాలంటూ ఓ మహిళ వేడుకుంది. బాధితురాలు తెలిపిన మేరకు... అనంతపురం నగరంలోని ఐదో రోడ్డుకు చెందిన సాదిక్ వలి మహల్దార్... హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి వివాహమై, పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ విషయాన్ని దాచిపెట్టి మొదటి భార్యతో విడాకులు తీసుకున్నానని, రెండో వివాహం కోసం ఎదురు చూస్తున్నట్లు ఓ మ్యాట్రీమోని వెబ్సైట్లో 2018 అక్టోబర్‌లో నమోదు చేసుకున్నాడు. దీనిని గమనించిన కుటుంబసభ్యులు సూచన మేరకు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన తబ్సూమ్ అదే ఏడాది నవంబర్ 23న హైదరాబాద్‌లో రెండో వివాహం చేసుకున్నారు. కొన్ని నెలల పాటు వీరి కాపురం సజావుగా సాగింది. తర్వాత సాదిక్ అనంతపురానికి మకాం మార్చి హైదరాబాద్‌లో ఉన్న తబ్సూమ్ వద్దకు 15 రోజులకో సారి వెళ్లేవాడు. ఈ క్రమంలోనే కరోనా లాక్డౌన్ పడడంతో ఐదు నెలల పాటు హైదరాబాద్ వైపు కన్నెత్తి చూడలేదు. చదవండి: (SPSR Nellore District: నీరు చెట్టు.. కనిపిస్తే ఒట్టు) అప్పటికే గర్భం దాల్చిన తబ్సూమ్.. హైదరాబాద్‌లోనే ఉంటూ 2020లో మగబిడ్డకు జన్మనిచ్చారు. అంతకు ముందే తాను వ్యాపారం చేసేందుకు రూ.20 లక్షలు కావాలని తబ్సూమ్ను సాదిక్ వలి డిమాండ్ చేశాడు. కోవిడ్ సమయంలో వ్యాపారం మొదలు పెడితే నష్టపోవాల్సి వస్తుందని, ఒకవేళ వ్యాపారమంటూ చేయదలిస్తే హైదరాబాద్‌లోనే చేద్దామంటూ భర్తకు ఆమె సూచించారు. ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం లేదని, 2021 మే నుంచి తబ్సూమ్ను పూర్తిగా దూరం చేశాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరిలో తబ్సూమ్కు సాదిక్ వలి మొదటి భార్య భాను ఫోన్‌చేసి తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, తాము కలిసే ఉంటున్నామని తెలిపింది. తనకు తెలియకుండా రెండో పెళ్లి ఎలా చేసుకున్నారంటూ నిలదీసింది. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన ఆమె అదే నెల 22వ తేదీ అనంతపురానికి వచ్చి సాదిక్ కుటుంబసభ్యులను నిలదీశారు. అనంతరం దిశ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దిశ పోలీసుల సూచన మేరకు సనత్‌నగర్ పోలీసులకు మరో ఫిర్యాదు అందజేయడంతో విచారణ అనంతరం సాదిక్ వలిపై 420, 498ఏ, 3, 4 డీపీఏ సెక్షన్ల కింద సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తన రెండేళ్ల బాబు పెద్దయ్యాక నాన్న ఎవరని అడిగితే తానేమి సమాధానమివ్వాలో అర్థం కావడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. తనలా మరో అమ్మాయి మోసపోకుండా సాదిక్‌ను కఠినంగా శిక్షించాలని వేడుకున్నారు. చదవండి: (లైంగిక దాడికి యత్నించిన యువకునికి 3 ఏళ్ల జైలు) -
ఘనంగా సింగర్ సునీత ప్రీవెడ్డింగ్ పార్టీ ఫొటోలు
-
సునీత ప్రీ వెడ్డింగ్.. హాజరైన రేణు దేశాయ్
సాక్షి, హైదరాబాద్: ఇటీవల సింగర్ సునీత కు వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అంతేగాక జనవరిలో రామ్‌ను వివాహం చేసుకుంటున్నట్లు సునీత వెల్లడించారు. ఈ నేపథ్యంలో పెళ్లి సమయం దగ్గరపడుతుండటంతో వీరిద్దరూ ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాన్ని ఆదివారం జరుపుకున్నారు. గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్లో ఆదివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో టాలీవుడ్ నటీనటులతో పాటు టాప్ సింగర్స్ హజరయ్యారు. (చదవండి: అతికొద్ది మంది సమక్షంలో సునీత పెళ్లి) కేవలం కొద్దిమంది సమక్షంలో జరిగిన ఈ ప్రీ వెడ్డింగ్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్, యాంకర్ సుమ కనకాలలు సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే సునీత-రామ్‌ల ప్రీ వెడ్డింగ్‌కు హీరో నితిన్ హోస్ట్‌గా వ్వవహరించి.. కార్యక్రమానికి సంబంధించి అన్ని పనులను దగ్గరుండి చూసుకున్నాడట. మరో విషయం ఏంటంటే సునీతకు కాబోయే భర్త రామ్‌కు నితిన్ కూడా అత్యంత సన్నిహితుడు కావడంలో దగ్గరుండి ఈ వేడుకను జరిపించినట్లు సమాచారం. View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates) -
సన్నిహితుల సమక్షంలో పెళ్లి: సునీత
తన మధురమైన గాత్రంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న గాయని సునీత త్వరలో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. సింగిల్ పేరెంట్‌గా పిల్లల బాధ్యతలు చూసుకుంటున్న ఆమె త్వరలో వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. ఈ క్రమంలో మ్యాంగో మీడియా గ్రూప్ హెడ్ రామ్ వీరపనేనినితో సోమవారం నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పటికే పెళ్ళికి సంబంధించి ఇరు కుటుంబ సభ్యులు మాట్లాడుకొని ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇక జనవరిలో తమ పెళ్లి జరగనున్నట్లు ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ సునీత వెల్లడించారు. ఈ వేడుక కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య నిరాడంబరంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా సునీత, రామ్ ఇద్దరికి ఇదీ రెండో వివాహమన్న విషయం తెలిసిందే. చదవండి: గాయని సునీత ఎంగేజ్మెంట్.. కాగా గత కొంత కాలంగా సునీతరెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం కొనసాగింది. ఈ నేపథ్యంలో వివాహబంధంలోకి అడుగుపెడుతున్నట్టు సోమవారం సునీత స్వయంగా ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖులు, అభిమానులు సునీతకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా సునీతకు 19 ఏళ్ల వయస్సులోనే వివాహం జరిగింది. చిన్నవయసులోనే ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత భర్తతో మనస్పర్థాలు తల్తెడంతో ఆయనతో సునీత విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి కుటుంబ బాధ్యతలను తనే చూసుకుంటూ పిల్లలతో కలిసి ఒంటరిగా జీవిస్తున్నారు. చదవండి: రెండో పెళ్లిపై స్పందించిన సునీత -
దిల్ వాకిట్లో తేజస్విని
ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు (వెంకట రమణారెడ్డి) వివాహం హైదరాబాద్‌కు చెందిన తేజస్విని (వైఘా రెడ్డి)తో ఆదివారం రాత్రి జరిగింది. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని నర్సింగ్‌పల్లిలోగల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిరాడంబరంగా జరిగిన ఈ వివాహ వేడుకలో కేవలం ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఆదివారం రాత్రి 7.23 గంటలకు పెళ్లి జరిగింది. నూతన దంపతులిద్దరూ సోమవారం ఆలయంలో సత్యనారాయణ వ్రతం చేశారు. కాగా ‘దిల్’ రాజు భార్య అనిత 2017లో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. తన కుమార్తె హన్షితా రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు ఆరు నెలల క్రితమే ‘దిల్’రాజుకు తేజస్వినితో వివాహ ముహూర్తాన్ని నిశ్చయించినట్లు సమాచారం. ‘‘జీవితంలో ఈ కొత్త ప్రారంభం అద్భుతంగా కొనసాగాలని కోరుకుంటున్నాను నాన్నా. మీ ఇద్దరూ ప్రేమతో, సంతోషంగా ఉండాలి’’ అని ‘దిల్’ రాజు కుమార్తె హన్షితా రెడ్డి సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. అన్నట్లు ‘దిల్’ రాజు నిర్మించిన సూపర్ హిట్ చిత్రాల్లో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఒకటి. ఇప్పుడు పెళ్లి జరిగిన సందర్భంగా ఆయన జీవితానికి ఈ టైటిల్ ని ఆపాదించి ‘దిల్ వాకిట్లో తేజస్విని’ అనొచ్చు. -
కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నా
కొంత కాలంగా నిర్మాత ‘దిల్’ రాజు రెండో వివాహం చేసుకోబోతున్నారనే వార్త ప్రచారంలో ఉంది. తాజాగా జీవితంలో కొత్త ప్రయాణాన్ని (పెళ్లిని ఉద్దేశించి) ప్రారంభిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు ‘దిల్’ రాజు. ఈ ప్రెస్ నోట్లో ఈ విధంగా పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం ప్రపంచమంతా కష్టకాలంలో ఉంది. వృత్తిపరంగా అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యక్తిగతంగానూ కొంతకాలంగా సరిగ్గా సాగడంలేదు. కానీ త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరింపబడతాయి, అందరం బావుంటాం అనే ఆశతో ఉన్నాను. ఈ నమ్మకంతోనే నా జీవితంలో మరో ప్రయాణాన్ని తిరిగి ప్రారంభిస్తున్నాను’’. ఆదివారం నిజామాబాద్‌లోని ‘దిల్’ రాజు ఫార్మ్ హౌస్‌లో రాత్రి 11.30 గంటలకు అతి కొద్దిమంది సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక జరిగింది. ‘దిల్’ రాజు వివాహం చేసుకున్నది వాళ్ల బంధువుల అమ్మాయినే అని, సినిమా నేపథ్యం లేని కుటుంబం అని తెలిసింది. 2017లో ‘దిల్’ రాజు భార్య అనిత హార్ట్ ఎటాక్‌తో మరణించిన సంగతి తెలిసిందే. -
దీప్తిశ్రీ మృతదేహం లభ్యం
కాకినాడ క్రైం: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సవతి తల్లి చేతిలో హత్యకు గురైన చిన్నారి దీప్తిశ్రీ ఐసాని (7) మృత దేహాన్ని పోలీసులు సోమవారం పంట కాలువ నుంచి వెలికి తీశారు. ఇంద్రపాలెం పంట కాలువ, ఉప్పుటేరు కలిసే చోట గుర్రపుడెక్కలో మృతదేహాన్ని కనుగొని ప్రత్యేక నావలో ఓ మూటలో గట్టుపైకి తెచ్చారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, డీఎస్పీ కె. కుమార్ మృత దేహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ అస్మి మాట్లాడుతూ సవతి తల్లి శాంతికుమారియే చిన్నారిని కిడ్నాప్ చేసి ఇంటిలో హత్య చేసి షేర్ ఆటోలో తీసుకొచ్చి ఇంద్రపాలెం ఉప్పుటేరులో కలిసే పంటకాలువలో పడేసిందని తెలిపారు. సోమవారం ఉదయం నుంచి ఇంద్రపాలెం వంతెన సమీపంలో పోలీసులు, ధర్మాడి సత్యం బృందం ప్రత్యేక గాలింపు చేయడంతో మృతదేహాన్ని కనుగొన్నట్లు ఎస్పీ తెలిపారు. కూతురిపై ప్రేమతో తనకు పుట్టిన బిడ్డను భర్త నిర్లక్ష్యం చేస్తాడన్న అనుమానంతో శాంతికుమారి ఈ ఘాతుకానికి పాల్పడిందని ఎస్పీ వివరించారు. ఇందులో శాంతికుమారి మినహా మరొకరి ప్రమేయం లేదని తెలిపారు. మృతదేహాన్ని కాకినాడ జీజీహెచ్‌కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. -
ఇలా చేసిన అత్తను చూశారా?
ఆడదంటే ఆడదానికి శత్రువు కాదని అత్త గుండెలో కూడా అమ్మ ఉన్నదన్నాడో సినీకవి. చంపాబాయీ అనే మహిళ ఈ మాటలను అక్షరాలా నిజం చేసి చూపించింది. భర్తను కోల్పోయిన తన కోడలికి తానే తల్లిగా మారి రెండోపెళ్లి చేసి మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.ఛత్తీస్‌గఢ్‌లోని హీరాపూర్‌కు చెందిన చంపాబాయీకి చిన్నతనంలోనే పెళ్లైంది. ఓ కొడుకు పుట్టిన కొన్నేళ్ల తర్వాత ఆమె భర్తను కోల్పోయింది. ఇక అప్పటినుంచి కొడుకే లోకంగా బతుకుతూ అతడిని పెంచి పెద్ద చేసింది. ఓ మంచి ముహూర్తం చూసి కొడుకు పెళ్లి జరిపించింది. తన కష్టాలు తీరినట్టేనని, కొడుకు, కోడలు, రాబోయే మనవలతో సంతోషంగా జీవితాన్ని గడపవచ్చని ఆశపడింది. కానీ దురదృష్టం.. ఒక్కగానొక్క కొడుకు రెండేళ్ల క్రితం హఠాన్మరణం చెందడంతో ఆమె ఆశలన్నీ అడియాసలయ్యాయి. అమ్మ మనసు.. అర్థం చేసుకున్న కోడలు ఓ పెళ్లివేడుకలో చోటుచేసుకున్న ప్రమాదంలో చంపాబాయి కొడుకు డోమేంద్ర సాహు తీవ్ర గాయాల పాలయ్యాడు. ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపే అతడు మరణించడంతో తన కోడలి జీవితం ఒక్కసారిగా తలకిందులైనట్లుగా చంపాబాయి భావించింది. జీవితభాగస్వామిని కోల్పోయిన స్త్రీగా సమాజంలో తానెలా బతికిందీ ఒంటరి తల్లిగా కొడుకును పెంచేందుకు పడిన కష్టాలు ఒక్కసారిగా ఆమె కళ్ల ముందు కదలాడాయి. అన్నింటికంటే... చిన్నతనంలోనే భర్తను కోల్పోయిన కోడలు ఙ్ఞానేశ్వరి పరిస్థితి ఏమవుతుందోనన్న వేదనే చంపాబాయి మనసును కలచివేసింది. తాను పడిన కష్టాలు కోడలు పడకకూడదనే ఆమెకు మళ్లీ పెళ్లి చేయాలని నిశ్చయించుకుంది.అయితే హీరాపూర్ ప్రజలకు చంపాబాయి తీసుకున్న నిర్ణయం అంతగా నచ్చలేదు. ‘‘ఇలా చేయడం సంప్రదాయ విరుద్ధం.. అసలు నువ్విలాంటి ఆలోచన చేస్తావని అనుకోనేలేదు..’’ అంటూ ఈటెల్లాంటి మాటలతో ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశారు. అయినప్పటికీ చంపాబాయి ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. కోడలి కోసం వరుడి వేట మొదలుపెట్టింది. తమ గ్రామానికి దగ్గర్లోనే ఉండే కమల్ సాహు అనే డివోర్సీతో కోడలి పెళ్లి ఖాయం చేసింది. అత్తగారు తన కోసం పడుతున్న తపన చూసిన ఙ్ఞానేశ్వరి ఆమె నిర్ణయాన్ని గౌరవించింది. భార్యతో విడిపోయినప్పటికీ.. ఇద్దరు ఆడపిల్లల బాధ్యతను తలకెత్తుకున్న కమల్ వ్యక్తిత్వానికి ముగ్ధురాలై.. అతడిని పెళ్లి చేసుకునేందుకు మనస్ఫూర్తిగా అంగీకారం తెలిపింది. ఈ క్రమంలో ఈనెల 24న కొంతమంది సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా వారి పెళ్లి జరిగింది. కోడలు కాదు.. తను నా కూతురు.. కోడలు ఙ్ఞానేశ్వరికి రెండో పెళ్లి చేయడం గురించి చంపాబాయి మాట్లాడుతూ..‘మా ఇంట్లో అడుగు పెట్టిన నాటినుంచే కోడలిగా కాకుండా తనను కూతురిగా భావించాను. నా ఒక్కగానొక్క కొడుకు భార్య కాబట్టి వారిద్దరికీ నా ప్రేమను సమానంగా పంచాను. కానీ దురదృష్టవశాత్తూ 2017, ఏప్రిల్ 20న డోమేంద్ర మాకు శాశ్వతంగా దూరమయ్యాడు. ఆ బాధను మరచిపోయేందుకు నా కోడలికి ఏ లోటు రాకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నాను. భర్తను కోల్పోయిన స్త్రీగా ఎంత వేదన అనుభవించానో నాకు తెలుసు. ఙ్ఞానేశ్వరి జీవితంలో చోటుచేసుకున్న విషాదాన్ని తీర్చాలంటే పెళ్లి ఒక్కటే మార్గంగా తోచింది. అందుకే ఎవరేమనుకున్నా లెక్కచేయక ఆమెకు మళ్లీ పెళ్లి చేశాను’ అంటూ తల్లి మనసు చాటుకున్నారు. మా వియ్యంకురాలు బంగారం.. ‘మా వియ్యపురాలు ధైర్యం చేశారనే చెప్పాలి. ఆమె నా కూతురిని తన కూతురిలా భావించారు. తనకు రెండోపెళ్లి చేసి కొత్త జీవితాన్నిచ్చారు. వైధవ్యంలో మగ్గిపోకుండా తనను కాపాడారు. అందరూ మా వియ్యపురాలిలా ఆలోచిస్తే ఆడవాళ్ల పరిస్థితి మెరుగవుతుంది. స్త్రీ పునర్వివాహం నేరం కాదనే భావన సమాజంలో నాటుకుపోతుంది. ఇందుకు నా కూతురి పెళ్లి ఆదర్శంగా నిలుస్తుంది’ అంటూ ఙ్ఞానేశ్వరి తల్లి ఆనందభాష్పాలు పెట్టుకున్నారు. అవును... భార్య చనిపోయిన రెండో రోజే వధువు కోసం వెదికే భర్తలున్న ఈ సమాజం భర్త చనిపోయిన తర్వాత స్త్రీ జీవితం అక్కడితోనే ఆగిపోవాలని ఎన్నో ఆంక్షలు విధించింది.దక్షిణాదిన కందుకూరి వీరేశలింగం వంటి సంఘసంస్కర్తలు వీటన్నింటినీ అధిగమించి వితంతు పునర్వివాహాలు జరిపించినప్పటికీ ఉత్తరాది సమాజంలో చంపాబాయి లాంటి వాళ్లు అరుదుగానైనా కన్పిస్తుండటం ఊరట కలిగించే విషయమే కదా! – సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్‌డెస్క్ -
అబద్ధం చెప్పి.. రెండో పెళ్లి చేసుకున్నాడు
నమ్మించి మోసగించి ఓ యువతిని రెండో వివాహం చేసుకున్న ఓ వ్యక్తిని రెయిన్‌బజార్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ రమేశ్, ఎస్సై శ్రీనివాస్ రెడ్డితో కలిసి తెలిపిన వివరాలివీ..మెహిదీపట్నం టౌలిచౌకి ప్రాంతానికి చెందిన మహ్మద్ అహ్మద్ అలీ (35), కమరున్నీసా దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. మహ్మద్ అహ్మద్ అలీ గుడిమల్కాపూర్‌లో తాజ్ బాబా ప్లవర్ మార్ట్ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇతడు కొన్ని నెలల క్రితం యాకుత్‌పురా వహేద్ కాలనీ నివాసి కుత్బుద్దీన్ కుటుంబంతో పరిచయం ఏర్పచుకున్నాడు. కుత్బుద్దీన్ దుబాయ్‌లో ఉంటుండగా... ఆయన భార్య అక్తర్ సుల్తానా ముగ్గురు కూతుళ్లతో కలిసి వహేద్ కాలనీలోని సొంతింట్లో ఉంటోంది. కాగా, అహ్మద్ అలీ.. అక్తర్ సుల్తానా వద్ద వ్యాపారం కోసమంటూ రూ.35 లక్షలు తీసుకున్నాడు. తనకు వివాహం కాలేదని నమ్మించి అక్తర్ సుల్తానా చిన్న కూతురు బీటెక్ చదివిన ఆఫ్సా సలీమా (27)ను ఈనెల 5న వివాహం చేసుకున్నాడు. పెళ్లికి హాజరైన వారి ద్వారా అహ్మద్ అలీకి ఇదివరకే పెళ్లయిన విషయం ఆనోటా ఈనోటా అందరికీ తెలిసింది. దీంతో అక్తర్ సుల్తానా కుటుంబ సభ్యులు అహ్మద్ అలీతో గొడవ పడ్డారు. మోసం చేశాడంటూ వారు గురువారం రెయిన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అహ్మద్ అలీపై ఐపీసీ 420, 406, 506 కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. -
ఎస్సైపై కేసు నమోదు
రెండో పెళ్లి చేసుకున్నాడని ఆరోపణ ఇరగవరం/తణుకు :రెండో వివాహం చేసుకోవడమే కాకుండా భార్యను వేధిస్తున్నాడనే అభియోగంపై ఇరగవరం మండలం యర్రాయిచెరువు గ్రామానికి చెందిన ఎస్సై జక్కంశెట్టి భానుప్రసాద్, మరో ఏడుగురిపై ఇరగవరం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తూర్పుగోదావరి సఖినేటిపల్లి ఎస్సైగా పనిచేస్తూ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న జక్కంశెట్టి భానుప్రసాద్ నరసాపురం మండలం పితాని మెరక గ్రామానికి చెం దిన గుబ్బల దుర్గాభవాని అలియాస్ జ్యోతిని 2013లో ద్వారకాతిరుమలలో వివాహం చేసుకున్నారు. కట్నకానుకల రూపంలో సుమారు రూ.30 లక్షల విలువ చేసే ఆస్తి, నగదు ఇచ్చారు. పెళ్లయిన నాటినుంచి భార్యను చిత్రహింసలకు గురిచేస్తూ విడాకులు ఇవ్వాలని భానుప్రసాద్ బలవంతం చేసేవాడని, పెద్దల సమక్షంలో రాజీ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో భానుప్రసాద్ భార్య దుర్గాభవానిని వదిలి వెళ్లిపోయాడన్నారు. దీంతో ఆమె అత్తారింటి ముందు మూడు రోజులపాటు దీక్ష చేసింది. భానుప్రసాద్‌లో మార్పు రాకపోవడంతో పోలీసు ఉన్నతాధికారులకు, మానవహ క్కుల సం ఘానికి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారించిన పోలీసు ఉన్నతాధికారులు ఎస్సై భానుప్రసాద్‌ను సస్పెండ్ చేశారు. ఇదిలావుండగా దుర్గాభవానిని వివాహం చేసుకోకముందే కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలం మల్లపరాజుగూడేనికి చెందిన సరోజ అనే మహిళను రిజిస్టర్ వివాహం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. తణుకులో విద్యాభ్యాసం చేసిన భానుప్రసాద్ 2005లో ఎస్సై ఉద్యోగం పొందారు. నూజివీడు, ముదినేపల్లి, సఖినేటిపల్లి, రంపచోడవరం స్టేషన్లలో విధులు నిర్వహించారు. దుర్గాభవాని ఫిర్యాదు మేరకు అతడిపై హత్యాయత్నం, వరకట్న వేధింపులు, మోసం అభియోగాలపై 498(ఏ), 352, 307, 417, 420 తదితర సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. అతని తల్లిదండ్రులు జక్కంశెట్టి లక్ష్మణరావు, జక్కంశెట్టి నాగమణి, సోదరులు దుర్గాప్రసాద్, రామకృష్ణ, సోదరి రాధాకుమారి, కుడుపూడి వెంకటేశ్వరరావు, స్నేహితుడు సుం కవల్లి సతీష్‌పై కేసు నమోదు చేశారు. -
భర్తే కాలయముడు
⇒ అసోంలో గాజువాక యువతి హత్య ⇒ ఆర్మీ పోలీసు కస్టడీలో నిందితుడు ⇒ కాపురానికి తీసుకెళ్లిన నెల రోజులకే ఘాతుకం గాజువాక : తాను క్షేమంగా ఉన్నానని రాత్రి తల్లిదండ్రులకు ఫోన్ చేసిన ఆమె తెల్లవారేసరికి శవమైంది. కట్టుకున్న భర్తే కాలయముడు కావడంతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హతాశులయ్యారు. పెద్దల భరోసాతో కాపురానికి వెళ్లిన తమ కుమార్తె విగతజీవిగా మారిందని తెలిసి గుండెలవిసేలా రోదిస్తున్నారు. మృతురాలి సమీప బంధువుల కథనం ప్రకారం... పెదగంట్యాడ మండలం పాలవలస గ్రామానికి చెందిన నీలాపు అప్పలరెడ్డి, అచ్చియ్యమ్మ దంపతులు గాజువాక బీసీ రోడ్‌లోని భానోజీకాలనీకి కొన్నేళ్ల క్రితం వలస వచ్చారు. తమ కుమార్తె పద్మ (23)కు సింహగిరి కాలనీకి చెందిన ఎక్స్ సర్వీస్మన్ దాసరి పైడయ్య కుమారుడు ఆర్మీ ఉద్యోగి అప్పలరెడ్డి (26)తో రెండేళ్ల క్రితం వివాహం జరిపించారు. అసోం క్యాంపులో హవాల్దార్‌గా పనిచేస్తున్న అప్పలరెడ్డి వివాహం అయిన వెంటనే భార్యను తనతో తీసుకువెళ్లిపోయాడు. ప్రసవం కోసం గాజువాక వచ్చిన పద్మ నాలుగు నెలల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. కుమారుడిని చూడటానికి అప్పలరెడ్డి రాకపోవడంతో ఆరా తీసిన పద్మకు భర్త నుంచి సరైన సమాధానం లభించలేదు. దీంతో సింహగిరి కాలనీలో ఉంటున్న అతడి తల్లిదండ్రులతో పద్మ తల్లిదండ్రులు మాట్లాడారు. అక్కడ్నుంచి కూడా సరైన స్పందన లభించకపోవడంతో గత నెలలో గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులతోపాటు ఇరుకుటుంబాల తరఫున పెద్ద మనుషులు కూడా జోక్యం చేసుకొని భార్యాభర్తల మధ్య గత నెల 20న రాజీ కుదిర్చారు. 24న సింహగిరి కాలనీలోని అత్తారింటికి పంపించారు. అదే రోజు బాబుకు బారసాల జరిపిన అప్పలరెడ్డి 27న తన భార్య, కుమారుడితో అసోం వెళ్లాడు. శనివారం రాత్రి పద్మ తల్లిదండ్రులకు ఫోన్ చేసి బాగానే ఉన్నామని చెప్పింది. అంతా బాగుందని సంబరపడిన సమయంలో కుమార్తెను అల్లుడే హత్య చేసినట్టు తెలిసి ఆమె తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. అసోంలో వారి సమీప బంధువులు ఫోన్లో తెలిపారు. నిందితుడిని ఆర్మీ పోలీసులు అరెస్టు చేసినట్టు తెలిసింది. ఆ విషయాన్ని ఇక్కడి బంధువులకు ఆర్మీలోని ఒక ఉన్నతాధికారి ఫోన్లో చెప్పినట్టు చెబుతున్నారు. బైండింగ్ వైరును మెడకు బిగించి హత్య చేసినట్టు అక్కడ పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నట్టు తెలిపారు. అప్పలరెడ్డికి ఇది రెండో వివాహం అప్పలరెడ్డికి పద్మ రెండో భార్య. మొదటి భార్య అతడు వేధింపులు భరించలేక వదిలి వెళ్లిపోయినట్టు మృతురాలి బంధువులు చెబుతున్నారు. అతడు దగ్గర బంధువు కావడంతో పద్మను ఇచ్చి రెండో వివాహం చేశారు. అప్పలరెడ్డి సోదరి వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. అసోంలో కూడా తొలుత చిత్ర హింసలకు గురి చేసేవాడని, అతనొక శాడిస్టు అని పద్మ పలుసార్లు మొరపెట్టుకున్నట్టు చెబుతున్నారు. రాజీ కుదిర్చినప్పటికీ తొలుత కాపురానికి వెళ్లడానికి ఇష్టపడలేదని, పెద్దలు భరోసా ఇవ్వడంతో ఆమె వెళ్లిందని చెబుతున్నారు. ఆమె మృతి వార్తతో ఇక్కడ విషాదం అలుముకుంది. -
భార్యను నిర్బంధించిన భర్త
రెండో పెళ్లికి పథకం పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు పలమనేరు: రెండో పెళ్లి కోసం ఓ వ్యక్తి తన భార్యను ఇంట్లో నిర్బంధించి వేధింపులకు గురిచేసిన ఘటన బుధవారం గంగవరం మండలం ఉయ్యాలమిట్టలో చోటు చేసుకుంది. తప్పిం చుకున్న బాధితురాలు గంగవరం పోలీసులను ఆశ్రయిం చింది. బాధితురాలి కథనం మేరకు.. గంగవరం కస్తూర్బా పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసే కల్పనతో పుంగనూరులోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసే శివశంకర్ నాయుడుకు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. కల్పనను అత్తింటి వారు కొద్ది రోజులు ఆప్యా యంగా చూసుకున్నాడు. ఆపై రెండో పెళ్లికి శివశంకర్ నాయుడు అత్తమామలు నాగరాజునాయుడు, వసంతమ్మ, మేనమామ గోపాల్‌నాయుడు పథకం పన్నారు. అప్పటి నుంచి వీరి వేధింపులు ఎక్కువయ్యాయి. బాధితురాలు కొన్నాళ్లుగా పుట్టింట్లోనే ఉంటోంది. శివశంకర్ నాయుడు వారం రోజుల క్రితం భార్య వద్దకు వచ్చారు. ఇకపై ఎటువంటి గొడవలూ లేకుండా చూసుకుంటానని అత్తమామలకు నచ్చజెప్పి భార్యను ఇంటికి తీసుకెళ్లారు. రెండ్రోజుల క్రితం బాధితురాలిని చితకబాది ఇంట్లో నిర్బంధించారు. బుధవారం ఉదయం స్థానికుల సాయంతో తప్పించుకున్న బాధితురాలు గంగవరం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తన భర్త, ఆయన కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని వేడుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రెండో పెళ్లికి యత్నం
కడప అగ్రిక ల్చర్, న్యూస్‌లైన్: రెండో పెళ్లి చేసుకోవడానికి ఓ వ్యక్తి చేసిన ప్రయత్నం విఫలమైంది. మార్కాపురానికి చెందిన వెంకటశివ కడపకు చెందిన అమ్మాయిని వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. అంతకు ముందే అతనికి విజయలక్ష్మితో వివాహమైంది. ఈ విషయం భార్యకి తెలియకుండా మరో వివాహం చేసుకునేందుకు నిశ్చితార్థానికై కడపకు వచ్చాడు. పసిగట్టిన ఆమె ఎదురు తిరగడంతో నిశ్చితార్థపు తంతు ఆగిపోయింది. చిన్నచౌకు పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన వెంకటశివ, విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన విజయలక్ష్మి హైదరాబాద్‌లో ఒకరు కంపెనీలో, మరొకరు డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. వారిద్దరికి పరిచయాలు ఏర్పడి ప్రేమించుకున్నారు. అయితే పెద్దలు అంగీకరించకపోవడంతో వారిద్దరు కలిసి వివాహం చేసుకున్నారు. అటు తర్వాత శాస్త్రోక్తంగా తిరుపతికి వెళ్లి వివాహం చేసుకున్నారు. హైదరాబాద్‌లో సాఫీగా ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇంతలో వెంకటశివ ‘మా చెల్లెలు నిశ్చితార్థం ఉంది, కడపకు వెళ్లాలి’ అని భార్య విజయలక్ష్మికి చెప్పాడు. దీంతో తాను కూడా వస్తానని మొండికేసింది. చేసేదేమీలేక వెంకటశివ భార్యను వెంట పెట్టుకుని వచ్చాడు. నిశ్చితార్థం తన చెల్లెలుకు జరుగుతుందని మాయ మాటలు చెప్పేందుకు ప్రయత్నించాడు. అయితే నిశ్చితార్థం సందర్భంగా అబ్బాయి వెంకటశివను అక్కడికి పిలవడంతో ఇదేమిటి చెల్లెలు నిశ్చితార్థం అన్నావు.. నీవు నిశ్చితార్థం చేసుకుంటున్నావని విజయలక్ష్మి ఎదురు తిరిగింది. ఈ విషయం రెండో పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి తండ్రితో చెప్పింది. అయితే నీతో వెంకటశివకు వివాహం జరిగినట్లు ఆధారమేమిటని అక్కడ ఉన్న వారందరూ ప్రశ్నించారు. ఇదిగో తాళి అని చూపించింది. ఇది కాదు ఫొటోలు, సంబంధిత పత్రాలు ఏవైనా ఉంటే బాగుంటుందని అన్నారు. విజయలక్ష్మి చేసేదేమీలేక చిన్నచౌకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు రంగప్రవేశం చేసి వెంకటశివను కొత్తగా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తాలూకు మనుషులను పిలిపించి మాట్లాడారు. వెంకటశివ తన భర్త అని ఆధారాలున్నాయని, అవి హైదరాబాద్‌లో ఉన్నాయని విజయలక్ష్మి చెప్పింది. పోలీసులు హైదరాబాద్‌లో మీరు నివాసముంటున్న ఏరియా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఉచిత సలహా ఇచ్చి పంపినట్లు విజయల క్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో నిశ్చితార్థం ఆగిపోయింది.