రెండో పెళ్లి చేసుకున్నాడని ఆరోపణ
ఇరగవరం/తణుకు :రెండో వివాహం చేసుకోవడమే కాకుండా భార్యను వేధిస్తున్నాడనే అభియోగంపై ఇరగవరం మండలం యర్రాయిచెరువు గ్రామానికి చెందిన ఎస్సై జక్కంశెట్టి భానుప్రసాద్, మరో ఏడుగురిపై ఇరగవరం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తూర్పుగోదావరి సఖినేటిపల్లి ఎస్సైగా పనిచేస్తూ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న జక్కంశెట్టి భానుప్రసాద్ నరసాపురం మండలం పితాని మెరక గ్రామానికి చెం దిన గుబ్బల దుర్గాభవాని అలియాస్ జ్యోతిని 2013లో ద్వారకాతిరుమలలో వివాహం చేసుకున్నారు.
కట్నకానుకల రూపంలో సుమారు రూ.30 లక్షల విలువ చేసే ఆస్తి, నగదు ఇచ్చారు. పెళ్లయిన నాటినుంచి భార్యను చిత్రహింసలకు గురిచేస్తూ విడాకులు ఇవ్వాలని భానుప్రసాద్ బలవంతం చేసేవాడని, పెద్దల సమక్షంలో రాజీ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో భానుప్రసాద్ భార్య దుర్గాభవానిని వదిలి వెళ్లిపోయాడన్నారు. దీంతో ఆమె అత్తారింటి ముందు మూడు రోజులపాటు దీక్ష చేసింది. భానుప్రసాద్‌లో మార్పు రాకపోవడంతో పోలీసు ఉన్నతాధికారులకు, మానవహ క్కుల సం ఘానికి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారించిన పోలీసు ఉన్నతాధికారులు ఎస్సై భానుప్రసాద్‌ను సస్పెండ్ చేశారు.
ఇదిలావుండగా దుర్గాభవానిని వివాహం చేసుకోకముందే కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలం మల్లపరాజుగూడేనికి చెందిన సరోజ అనే మహిళను రిజిస్టర్ వివాహం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. తణుకులో విద్యాభ్యాసం చేసిన భానుప్రసాద్ 2005లో ఎస్సై ఉద్యోగం పొందారు. నూజివీడు, ముదినేపల్లి, సఖినేటిపల్లి, రంపచోడవరం స్టేషన్లలో విధులు నిర్వహించారు. దుర్గాభవాని ఫిర్యాదు మేరకు అతడిపై హత్యాయత్నం, వరకట్న వేధింపులు, మోసం అభియోగాలపై 498(ఏ), 352, 307, 417, 420 తదితర సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. అతని తల్లిదండ్రులు జక్కంశెట్టి లక్ష్మణరావు, జక్కంశెట్టి నాగమణి, సోదరులు దుర్గాప్రసాద్, రామకృష్ణ, సోదరి రాధాకుమారి, కుడుపూడి వెంకటేశ్వరరావు, స్నేహితుడు సుం కవల్లి సతీష్‌పై కేసు నమోదు చేశారు.
ఎస్సైపై కేసు నమోదు
Published Tue, Mar 17 2015 2:40 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM
Advertisement