
‘దిల్’ రాజు
కొంత కాలంగా నిర్మాత ‘దిల్’ రాజు రెండో వివాహం చేసుకోబోతున్నారనే వార్త ప్రచారంలో ఉంది. తాజాగా జీవితంలో కొత్త ప్రయాణాన్ని (పెళ్లిని ఉద్దేశించి) ప్రారంభిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు ‘దిల్’ రాజు. ఈ ప్రెస్ నోట్‌లో ఈ విధంగా పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం ప్రపంచమంతా కష్టకాలంలో ఉంది. వృత్తిపరంగా అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యక్తిగతంగానూ కొంతకాలంగా సరిగ్గా సాగడంలేదు.
కానీ త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరింపబడతాయి, అందరం బావుంటాం అనే ఆశతో ఉన్నాను. ఈ నమ్మకంతోనే నా జీవితంలో మరో ప్రయాణాన్ని తిరిగి ప్రారంభిస్తున్నాను’’. ఆదివారం నిజామాబాద్‌లోని ‘దిల్’ రాజు ఫార్మ్ హౌస్‌లో రాత్రి 11.30 గంటలకు అతి కొద్దిమంది సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక జరిగింది. ‘దిల్’ రాజు వివాహం చేసుకున్నది వాళ్ల బంధువుల అమ్మాయినే అని, సినిమా నేపథ్యం లేని కుటుంబం అని తెలిసింది. 2017లో ‘దిల్’ రాజు భార్య అనిత హార్ట్ ఎటాక్‌తో మరణించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment