తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సినీ ప్రముఖులు నేడు సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు ఇప్పటికే ప్రకటించారు. సుమారు 36 మంది సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. నేడు ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్‌లోని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమావేశం కానున్నారు.
నిర్మాతల నుంచి ఎవరు వెళ్తున్నారంటే.. దిల్ రాజు, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, ఏషియన్ సునీల్ నారంగ్, నిర్మాత సుప్రియ యార్లగడ్డ, నిర్మాత చినబాబు, నిర్మాత నాగవంశీ, పుష్ప నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి శంకర్, పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్,శ్యాంప్రసాద్‌రెడ్డి, సుధాకర్ రెడ్డి, స్రవంతి రవి కిషోర్ , కె ఎల్ నారాయణ, యూవీ క్రియేషన్స్ వంశీ, భోగవల్లి ప్రసాద్ తదితరులు
తెలుగు హీరోలనుంచి వెంకటేష్,నాగార్జున, నితిన్, కిరణ్ అబ్బవరం, వరుణ్ తేజ్, శివ బాలాజీ, హాజరు కానున్నారు.
దర్శకుల సంఘం నుంచి అధ్యక్షుడు వీర శంకర్, రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను, డైరెక్టర్ సాయి రాజేష్, విశ్వంభర డైరెక్టర్ వశిష్ట ,కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్ , అనిల్ రావిపూడి, బాబీ, వంశీ పైడిపల్లి, ప్రశాంత్ వర్మ సీఎంతో భేటీ కానున్నారు.
తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచి ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ , సెక్రటరీ దామోదర్ ప్రసాద్ వెళ్తుండగా మా అసోసియేషన్‌తో పాటు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్ నుంచి పలువురు ప్రతినిధులు హాజరు కానున్నారు
చర్చకు వచ్చే అంశాలు
సినిమా పరిశ్రమ సమస్యలపై చర్చ
తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధితోపాటు పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులు
నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డుల పరిశీలన
చిన్న, మధ్య స్థాయి సినిమాలకు థియేటర్స్ కేటాయింపు
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేసే సినిమాలకు ప్రోత్సాహకాలు
ఇటీవల సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటనపై చర్చ
టికెట్ ధరల పెంపు, పెంపుబెనిఫిట్ షోల అంశాల గురించి చర్చ
Comments
Please login to add a commentAdd a comment