
తన మధురమైన గాత్రంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న గాయని సునీత త్వరలో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. సింగిల్ పేరెంట్‌గా పిల్లల బాధ్యతలు చూసుకుంటున్న ఆమె త్వరలో వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. ఈ క్రమంలో మ్యాంగో మీడియా గ్రూప్ హెడ్ రామ్ వీరపనేనినితో సోమవారం నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పటికే పెళ్ళికి సంబంధించి ఇరు కుటుంబ సభ్యులు మాట్లాడుకొని ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇక జనవరిలో తమ పెళ్లి జరగనున్నట్లు ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ సునీత వెల్లడించారు. ఈ వేడుక కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య నిరాడంబరంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా సునీత, రామ్ ఇద్దరికి ఇదీ రెండో వివాహమన్న విషయం తెలిసిందే. చదవండి: గాయని సునీత ఎంగేజ్‌మెంట్..
కాగా గత కొంత కాలంగా సునీతరెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం కొనసాగింది. ఈ నేపథ్యంలో వివాహబంధంలోకి అడుగుపెడుతున్నట్టు సోమవారం సునీత స్వయంగా ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖులు, అభిమానులు సునీతకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా సునీతకు 19 ఏళ్ల వయస్సులోనే వివాహం జరిగింది. చిన్నవయసులోనే ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత భర్తతో మనస్పర్థాలు తల్తెడంతో ఆయనతో సునీత విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి కుటుంబ బాధ్యతలను తనే చూసుకుంటూ పిల్లలతో కలిసి ఒంటరిగా జీవిస్తున్నారు. చదవండి: రెండో పెళ్లిపై స్పందించిన సునీత
Comments
Please login to add a commentAdd a comment