Singer Sunitha Engagement: Sunitha Gets Engaged With Business Man Ram Verapaneni, in Telugu - Sakshi
Sakshi News home page

గాయని సునీత ఎంగేజ్‌మెంట్‌..

Published Mon, Dec 7 2020 12:06 PM | Last Updated on Tue, Dec 8 2020 4:46 AM

Singer Sunitha Ready For Second Marriage, Engaged - Sakshi

ప్రముఖ గాయని‌ సునీత‌ వివాహంపై వస్తున్న రూమర్లకు చెక్‌ పడింది. గత కొన్ని రోజులుగా ఆమె రెండో పెళ్లిపై వదంతులు వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు డిజిట‌ల్ రంగంలో కీల‌క పాత్ర పోషిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త రామ్‌ వీరపనేనితో సోమవారం ఉదయం సునీత నిశ్చితార్థం జరిగింది. అతికొద్ది మంది సమక్షంలో ఇంట్లోనే సింపుల్‌గా నిశ్చితార్థ కార్యక్రమాన్ని నిర్వహించారు. 19 ఏళ్ల వయసులోనే సునీతకు పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టాక.. భర్త తీరుతో విసిగిపోయి విడాకులు తీసుకున్న సునీత పిల్లల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు. అయితే సునీత పెళ్లి చేసుకునే రామ్‌కి కూడా ఇది రెండో వివాహమే. చదవండి: రెండో పెళ్లిపై స్పందించిన సునీత 

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాగా సునీత ఎంగేజ్‌మెంట్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అప్పట్లో రెండో పెళ్లి చేసుకునే ఉద్ధేశ్యం లేదని చెప్పిన ఆమె అనూహ్యంగా ఇలా ఎంగేజ్‌మెంట్‌ చేసుకోవడంతో అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. అయితే ఈ విషయంపై ఆమె తరపు నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఇక గాయనిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు సునీత. పాటల తోటలో పాతికేళ్లుగా అలుపెరగని గాన కోయిల ఆమె.  సునీత పాటకు పరవశించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. టాలీవుడ్‌లో ఏ సింగర్‌కి లేని ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఆమెకు ఉంది. అయితే వ్యక్తిగత జీవితంలో మాత్రం సునీత ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement