![Singer Sunitha Responds Her Second Marriage, Says Yes - Sakshi](/styles/webp/s3/article_images/2020/12/7/singer.gif.webp?itok=uRoxctgR)
తన రెండో పెళ్లిపై వస్తున్న వార్తలపై గాయని సునీత స్పందించారు. త్వరలో రామ్ అనే వ్యక్తితో ఏడడుగులు వేసి తన జీవితాన్ని పంచుకోబోతన్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు. త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెడుతున్ననట్లు తెలిపారు. ఇప్పటి వరకు అండగా నిలిచిన పిల్లలకు, తల్లిదండ్రులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో రామ్‌తో నిరాడంబరంగా జరిగిన నిశ్చితార్థపు ఫోటోలను ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. చదవండి: సింగర్ సునీత ఎంగేజ్‌మెంట్..
‘అందరి తల్లిలాగే నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని, ఉన్నతంగా స్థిరపడేలా చూసేందుకు కలలు కంటున్నాను. అలాగే నా పిల్లలు కూడా నేను జీవితంలో స్ధిరపడాలని కోరుకున్నారు. అలాంటి అద్భుతమైన పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నందుకు అదృష్టవంతురాలిగా భావిస్తున్నాను. చివరికి ఆ క్షణం వచ్చింది. నా జీవితంలోకి మంచి స్నేహితుడిగా వచ్చిన రామ్ భాగస్వామిగా మారనున్నాడు. మేము ఇద్దరం త్వరంలో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నాము. నా జీవిత విషయాలను రహస్యంగా ఉంచుతున్నానని అర్థం చేసుకున్న నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు. ఎప్పటిలాగే నన్ను ఆదరించి, మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నా’.. అంటూ ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment