second marrige
-
మనోజ్ మెహందీ ఫోటోలు షేర్ చేసిన మంచు లక్ష్మీ!
మంచు వారింట పెళ్లి సందడి మొదలైంది. గత కొంతకాలంగా మంచు మనోజ్ పెళ్లిపై వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. భూమా మౌనిక రెడ్డిని మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. రేపు(మార్చి3)న వీరు పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నట్లు సమాచారం. మంచు లక్ష్మీ ప్రసన్న ఇంట్లోనే మనోజ్-మౌనికల వివాహం జరగనుందట. ఇప్పటికే మెహందీ కార్యక్రమాలు ఘనంగా జరగ్గా నేడు సంగీత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. మెహందీకి సంబంధించిన ఫోటోలను మంచు లక్ష్మీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో మనోజ్ రెండోపెళ్లి వార్తలపై క్లారిటీ వచ్చినట్లయ్యింది. మహా మంత్ర పూజతో మనోజ్ పెళ్లి వేడుకలను ప్రారంభించిన మంచు లక్ష్మీ.. మనోజ్ పెళ్లి బాధ్యతను తనపై వేసుకొని దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతుంది. కేవలం ఇరు కుటుంబసభ్యులు, అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో మనోజ్ వివాహం జరగనుందని తెలుస్తుంది. -
భార్యను చెల్లి అని పిలవమన్నాడు.. ఆ తర్వాత..
హిమాయత్‌నగర్: తన భార్యను పెళ్లి చేసుకున్నదే కాకుండా ఆమెను చెల్లి అని పిలవాలంటూ ఆర్తీ రెండో భర్త నాగరాజు.. నాగులసాయిని బెదిరించాడు. ఈ నెల 7న నారాయణగూడ మెట్రో రైల్వే స్టేషన్ వద్ద నాగులసాయిని అడ్డగించిన నాగరాజు తన భార్య ఆర్తీతో మాట్లాడినా, ఫోన్ చేసినా ఊరుకునేది లేదని హెచ్చరించాడు. ఇకపై ఆమె నీకు చెల్లెలి వరుస అవుతుంది కాబట్టి చెల్లి అని పిలవాలని చెప్పాడు. ఈ కారణంతోనే తాను అతడిపై దాడి చేశానంటూ నిందితుడు నారాయణగూడ పోలీసుల విచారణలో వెల్లడించాడు. మంగళవారం నిందితుడు నాగుల సాయిని రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై ఇన్స్పెక్టర్ రాపోలు శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్‌పేట గోల్నాకకు చెందిన రావుల సాయి అలియాస్ నాగులసాయి వృతి రీత్యా బ్యాండ్ వాయిస్తుంటాడు. బ్యాండ్ పని లేనప్పుడు చిత్తు కాగితాలు ఏరుకుని జీవనం సాగించేవాడు. ఇతని స్నేహితుడి ద్వారా చిక్కడపల్లికి చెందిన ఆర్తీ పరిచయమైంది. దీంతో 2014లో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు, వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. నిత్యం ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండటంతో వారు కొద్దిరోజుల వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆర్తీ అన్న జితేంద్రపై నాగుల సాయి దాడి చేసి ఏడాది పాటు జైలులో ఉన్నాడు. ఆ తర్వాత కోర్టు ధిక్కారం కేసులో మరో ఏడాది జైలుకు వెళ్లాడు. ఈ క్రమంలో జితేంద్ర భార్య ఆర్తీకి నాగరాజును పరిచయం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వారికి కుమారుడు విష్ణు జన్మించాడు. మంటల్లో గాయపడిన విష్ణు దాడి మరుసటి రోజు చనిపోయాడు. గర్భంలో ఉన్న శిశువు మృతి.. అందర్నీ ఒకేసారి చంపాలనే ఉద్దేశంతో కుమారుడితో సహా ఇద్దరూ ఒకేచోట ఉన్నప్పుడు పెట్రోల్ పోశాడు. ఈ దాడిలో పది నెలల విష్ణు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మూడు రోజుల క్రితం నాగరాజు సైతం చనిపోగా.. సోమవారం రాత్రి ఆర్తి గర్భంలో ఐదు నెలల శిశువు మృతి చెందింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని గాంధీ వైద్యులు వెల్లడించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
రెండో పెళ్లి గురించి తొలిసారి స్పందించిన నటుడు పృథ్వీరాజ్
నటుడు బబ్లూ పృథ్వీరాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మొదట చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆయన విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కొంతకాలంగా సినిమాలకు దూరమైన పృథ్వీరాజ్ ప్రస్తుతం సీరియల్స్‌లో నటిస్తున్నాడు. కొద్దిరోజులుగా పృథ్వీ మలేషియాకు చెందిన 23 ఏళ్ల అమ్మాయిని రెండవ వివాహం చేసుకున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ స్పందించాడు. ''నాకు ఇప్పుడు 56 సంవత్సరాలు. ఆ అమ్మాయికి 24ఏళ్లు. ఇంకా తను మలేషియాకు చెందిన అమ్మాయి కాదు, తెలుగుమ్మాయే. శీతల్ నాతో పెళ్లికి సిద్ధంగా ఉంది. నిజానికి మొదట నేను పెళ్లికి ఒప్పుకోలేదు. ఆలోచించుకోమని చాలా సమయం ఇచ్చాను. కానీ ఆమె నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఆమె ఫ్యామిలీ కూడా దీనికి ఒప్పుకున్నారు. ఇంకా మాకు పెళ్లి కాలేదు, కానీ రిలేషన్షిప్లో ఉన్నాం. అయినా ప్రేమకు వయసుతో ఏం సంబంధం?ఎవరు, ఏ వయసులో ప్రేమలో పడతారో ఎవ్వరూ చెప్పలేరు’’ అంటూ పృథ్వీ చెప్పుకొచ్చారు. కాగా పృధ్వీరాజ్‌కు 1994లో బీనా అనే మహిళతో పెళ్లి కాగా, కొంతకాలం క్రితమే విడాకులు తీసుకున్నారు. -
వివాహ రిసెప్షన్లో రచ్చ...విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి
అనంతపురం క్రైం: ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి రెండో వివాహ రిసెప్షన్ రచ్చకు దారి తీసింది. విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్నాడని మొదటి భార్య రిసెప్షన్‌ను అడ్డుకుంది. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి దిశ పోలీసుస్టేషన్‌కు పంపారు. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల మేరకు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన దూదేకుల నాగరాజుకు అదే జిల్లా కోవెలకుంట్లకు చెందిన మహబూబ్ బీతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల పాప ఉంది. మనస్పర్థలు రావడంతో ఈ దంపతులు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉంటే, ఇటీవల నాగరాజు మరో యువతిని వివాహం చేసుకున్నట్లు మహబూబ్ బీకి తెలిసింది. రామ్‌నగర్‌లో సోమవారం నిర్వహించిన వివాహ రిసెప్షన్‌ను అడ్డుకునేందుకు యత్నించింది. నాగరాజు కుటుంబీకులు ఫిర్యాదు చేయడంతో నాల్గవ పట్టణ సీఐ కత్తి శ్రీనివాసులు బృందం అక్కడికి చేరుకుని మహబూబ్ బీకి నచ్చజెప్పారు. దిశ పోలీసుస్టేషన్‌కు వెళ్లమని సూచించారు. దిశ పీఎస్‌లో బాధితురాలికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. విడాకుల అంశం కోర్టులో ఉండడంతో తామేం చేయలేమని, కోర్టులోనే తేల్చుకోవాలని సూచించారు. కాగా, మహబూబ్బీకి గతంలోనే తాను తలాఖ్ ఇచ్చేసినట్లు నాగరాజు చెప్పడం గమనార్హం. (చదవండి: ముక్కలు చేసి... మూటకట్టి!) -
'నీ భర్త ఇక్కడ రెండో పెళ్లి చేసుకుంటున్నాడు'
సాక్షి, ఆళ్లగడ్డ: '' ప్రేమించానన్నాడు. నువ్వే సర్వస్వమన్నాడు. కాదంటే.. చచ్చిపోతానన్నాడు. నిన్ను, నీ వాళ్లను పువ్వుల్లో పెట్టి సాక్కుంటానని నమ్మబలికాడు. ఇలా ఏడాది పాటు ఆమె చుట్టూ తిరిగాడు. ఇక ఆమె కాదనలేకపోయింది. కుటుంబ సభ్యులను ఒప్పించి అతన్ని మనువాడింది. కానీ ఐదేళ్ల తర్వాత అతని నిజ స్వరూపం బయటపడింది.'' ఇప్పుడు ఆమె న్యాయం కోసం వేడుకుంటోంది. ఇందుకు సంబంధించిన వివరాలు... ఆళ్లగడ్డ మండలం చిన్న కందుకూరు గ్రామానికి చెందిన ఓబులేసు జియో ఫైబర్ కంపెనీలో ఉద్యోగం చేసేందుకు మహారాష్ట్రలోని నాందేడ్‌కు వెళ్లాడు. అక్కడ ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉండేవాడు. ఈ క్రమంలో భర్త చనిపోయి ఇద్దరు కుమారులతో కలిసి పుట్టింటిలో ఉంటున్న ఇంటి యజమాని కుమార్తె విజయ సునీల్ అగర్వాల్‌పై కన్నేశాడు. ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. కాస్త చనువు ఏర్పడ్డాక ప్రేమిస్తున్నానని చెప్పాడు. అసలే భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమె.. అతన్ని మందలించింది. అయినా వినకుండా వెంటపడ్డాడు. ఆమెతో పాటు పిల్లలను, తల్లిదండ్రులను బాగా చూసుకుంటానని నమ్మబలికాడు. నీవు లేకుంటే చచ్చిపోతానని బెదిరించాడు. ఇరుగూ పొరుగు వారితోనూ మాట్లాడి.. ఎలాగైనా పెళ్లికి ఒప్పించాలని వేడుకున్నాడు. అతని మాటలు నమ్మిన వారందరూ ఆమె తల్లిదండ్రులను ఒప్పించి ఐదేళ్ల క్రితం పెళ్లి చేశారు. అక్కడే ఉంటూ బుద్ధిగా కాపురం చేసేవాడు. వారి కాపురానికి గుర్తుగా నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కాగా.. ఓబులేసు నాలుగు నెలల క్రితం సొంతూరికి వెళ్లొస్తానని చెప్పి వచ్చాడు. కొన్ని రోజుల పాటు భార్యతో ఫోనులో బాగానే మాట్లాడాడు. త్వరలోనే తిరిగొస్తానని నమ్మించాడు. రానురాను ఫోనులో మాట్లాడాలంటే విసుక్కోవడం, ఎంతకూ ఫోను ఎత్తకపోవడం వంటివి చేసేవాడు. పని ఒత్తిడి వల్ల ఇలా ప్రవర్తిస్తున్నాడని ఆమె అనుకుంది. కానీ రెండు వారాల క్రితం ఓబులేసు మిత్రుడొకరు ఫోను చేసి ‘నీ భర్త ఇక్కడ రెండో పెళ్లి చేసుకుంటున్నాడ’ని చెప్పడంతో ఉలిక్కిపడింది. గత నెల 28న అతను గ్రామంలోనే మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఇది తెలిసిన విజయ భర్తకు ఫోన్ చేయగా.. తనకు ఇష్టం లేక పోయినా బలవంతంగా పెళ్లి చేశా రని చెప్పాడు. దీంతో ఆమె కుమారుడితో కలిసి ఆళ్లగడ్డకు చేరుకుంది. నాలుగు రోజులుగా అతనితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా కుటుంబ సభ్యులు కుదరనివ్వలేదు. చివరకు గ్రామంలోకి సైతం రానివ్వడం లేదు. ఆళ్లగడ్డలోనే ఉండాలని, అక్కడికే వచ్చి మాట్లాడతామని చెబుతున్నారే తప్ప ఎవరూ రావడంలేదు. దీంతో బాధితురాలు విషయాన్ని మీడియాకు తెలిపింది. తనకు ఇక్కడ ఎవరూ తెలియదని, తెలుగు కూడా రాదని, ప్రజా, మహిళా సంఘా లు సహకరించి న్యాయం చేయాలని వేడుకుంటోంది. చదవండి: నల్లపురెడ్డిపల్లెలో కాల్పుల కలకలం -
నా కుమారులు నన్ను మళ్లీ పెళ్లి చేసుకోమంటున్నారు: నటి
మన వ్యవస్థలో విడాకులు తీసుకున్న మగవారు వెంటనే మరో వివాహం చేసుకుంటారు. సమాజం కూడా ఒంటరి మగవారి పట్ల సానుభూతి చూపుతుంది. అదే ఆడవారి విషయానికి వస్తే.. సమాజంతో పాటు కుటుంబ సభ్యుల ఆలోచన ధోరణి కూడా ఇందుకు భిన్నంగా ఉంటుంది. భర్త చనిపోయిన తర్వాతనో లేక విడాకులు తీసుకున్న మహిళ.. మరో సారి పెళ్లి చేసుకోవడాన్ని పెద్ద నేరంగా పరిగణిస్తారు చాలా మంది. ఇక వారికి ఎదిగిన పిల్లలు ఉంటే.. బిడ్డలకు పెళ్లి చేయాల్సింది పోయి ఈమె వివాహాం చేసుకోవడం ఏంటి అంటూ అడ్డదిడ్డంగా మాట్లాడతారు. చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి విషయాల్లో కుటుంబ సభ్యులు ఆడవారికి అండగా నిలుస్తారు. ఈ కోవకు చెందిన కుటుంబమే టీవీ నటి ఊర్వశి ధోలాకియాకు దొరికింది. అందుకే భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న ఆమెను రెండో వివాహం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారట. అది కూడా ఆమె కుమారులు. ఈ విషయాలను ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు ఊర్వశి. ఇక ఇంటర్వ్యూలో భాగంగా ఊర్వశి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘‘బాల నటిగా ఇండస్ట్రీలో ప్రవేశించాను. 16వ ఏట ప్రేమలో పడ్డాను. 17వ ఏట నాకు కవలలు జన్మించారు. సాగర్, క్షితిజ్. ఆ తర్వాత భర్తతో విడిపోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి నేను ఒంటరిగానే ఉన్నాను. సింగిల్ పేరెంట్‌గానే నా బిడ్డలను పెంచి పెద్ద చేశాను. వారికి మంచి చదువు, కెరీర్ అందించాలని రాత్రింబవళ్లు పని చేశాను. రోజులు ఎలా గడుస్తున్నాయో కూడా తెలియనంత బిజీగా గడిపాను. చూస్తుండగానే నా కొడుకులిద్దరు పెద్దవారయ్యారు. వారి కాళ్ల మీద వారు నిలబడగలిగారు. ఇందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను’’ అంటూ చెప్పుకొచ్చారు ఊర్వశి నన్ను మరో పెళ్లి చేసుకోమని కోరుతున్నారు.. ‘‘ఇప్పుడు కుటుంబ సభ్యులు, నా కొడుకులిద్దరు నేను జీవితంలో సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నారు. మరో పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు. నా బిడ్డలు ఓ అడుగు ముందుకు వేసి ‘‘అమ్మ నీకు నచ్చిన వ్యక్తిని వివాహం అయినా చేసుకో.. లేదంటే డేటింగ్ చేయ్’’ అని అడుగుతుంటారు. వారి మాటలను నేను పెద్దగా పట్టించుకోను. నవ్వేసి ఊరుకుంటాను’’ అని చెప్పుకొచ్చారు. అలాంటి వ్యక్తి దొరికితే ఆలోచిస్తాను.. ‘‘నా భర్తతో విడిపోయిన తర్వాత నాకు మరో సారి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన రాలేదు. దీని గురించి ఆలోచించే టైమ్ కూడా దొరకలేదు. ఇక మరో విషయం ఏంటంటే నేను చాలా స్వతంత్ర భావాలు కల మహిళను. నా జీవితాన్ని నాకు నచ్చినట్లు జీవిస్తాను. ఎవరి కోసం నన్ను నేను మార్చుకోను. వీటన్నింటిని అర్థం చేసుకునే వ్యక్తి తారసపడితే అప్పుడు ఆలోచిస్తాను. కానీ ఇప్పుడు నా దగ్గర అందుకు టైం కూడా లేదు’’ అన్నారు. బలవంతంగా మనల్ని మనం మార్చుకోవడం సరికాదు.. ‘‘ఇక లవ్‌లో కానీ పెళ్లి బంధంలో కానీ మనం సౌకర్యవంతంగా ఉంటూనే అవతలి వ్యక్తిని ఇష్టపడాలి, ప్రేమించాలి. మన స్పేస్ మనం తీసుకున్నట్లే.. ఎదుటి వ్యక్తికి కూడా పర్సనల్ స్పేస్ ఇవ్వాలి. అంతేతప్ప మనల్ని ప్రేమిస్తున్నారు కదా అని.. వారి కోసం బలవంతంగా మనల్ని మనం మార్చుకుంటే.. ఆ బంధం ఎంతో కాలం నిలవదు. ఎవరికైనా నేను ఇచ్చే సలహా ఇదే. మన కంఫర్ట్‌ని వదులుకుని మరీ ఎదుటి వారి కోసం మారాల్సిన అవసరం లేదు. అలా చేస్తే ఆ బంధం ఎక్కువ కాలం నిలవదు’’ అంటూ చెప్పుకొచ్చారు ఊర్వశి. కసౌటి జిందగీ కే మొదటి ఎడిషన్‌లో కొమోలికా పాత్రతో ఊర్వశి ధోలకియా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆమె దేఖ్ భాయ్ దేఖ్, శక్తిమాన్, కబీ సౌతాన్ కబీ సాహెలి, తుమ్ బిన్ జావున్ కహాన్, కహిన్ టు హోగా, బేట్టాబ్ దిల్ కీ తమన్నా హై, చంద్రకాంత - ఏక్ మాయావి ప్రేమ్ గాథా వంటి టీవీ షోలలో నటించారు. బిగ్ బాస్ సీజన్ 6 విజేతగా నిలిచారు ఊర్వశి. చదవండి: కలికాలం: భర్తకు విడాకులు.. మామతో వివాహం రెండోపెళ్లి నాకు ఓకే : నాగబాబు.. పోస్ట్ వైరల్ -
రెండో పెళ్లిపై స్పందించిన సునీత
తన రెండో పెళ్లిపై వస్తున్న వార్తలపై గాయని సునీత స్పందించారు. త్వరలో రామ్ అనే వ్యక్తితో ఏడడుగులు వేసి తన జీవితాన్ని పంచుకోబోతన్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు. త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెడుతున్ననట్లు తెలిపారు. ఇప్పటి వరకు అండగా నిలిచిన పిల్లలకు, తల్లిదండ్రులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో రామ్‌తో నిరాడంబరంగా జరిగిన నిశ్చితార్థపు ఫోటోలను ఫేస్బుక్లో షేర్ చేశారు. చదవండి: సింగర్ సునీత ఎంగేజ్మెంట్.. ‘అందరి తల్లిలాగే నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని, ఉన్నతంగా స్థిరపడేలా చూసేందుకు కలలు కంటున్నాను. అలాగే నా పిల్లలు కూడా నేను జీవితంలో స్ధిరపడాలని కోరుకున్నారు. అలాంటి అద్భుతమైన పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నందుకు అదృష్టవంతురాలిగా భావిస్తున్నాను. చివరికి ఆ క్షణం వచ్చింది. నా జీవితంలోకి మంచి స్నేహితుడిగా వచ్చిన రామ్ భాగస్వామిగా మారనున్నాడు. మేము ఇద్దరం త్వరంలో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నాము. నా జీవిత విషయాలను రహస్యంగా ఉంచుతున్నానని అర్థం చేసుకున్న నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు. ఎప్పటిలాగే నన్ను ఆదరించి, మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నా’.. అంటూ ముగించారు. -
గాయని సునీత ఎంగేజ్మెంట్..
ప్రముఖ గాయని సునీత వివాహంపై వస్తున్న రూమర్లకు చెక్ పడింది. గత కొన్ని రోజులుగా ఆమె రెండో పెళ్లిపై వదంతులు వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలకు ఫుల్స్టాప్ పెడుతూ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు డిజిటల్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో సోమవారం ఉదయం సునీత నిశ్చితార్థం జరిగింది. అతికొద్ది మంది సమక్షంలో ఇంట్లోనే సింపుల్‌గా నిశ్చితార్థ కార్యక్రమాన్ని నిర్వహించారు. 19 ఏళ్ల వయసులోనే సునీతకు పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టాక.. భర్త తీరుతో విసిగిపోయి విడాకులు తీసుకున్న సునీత పిల్లల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు. అయితే సునీత పెళ్లి చేసుకునే రామ్‌కి కూడా ఇది రెండో వివాహమే. చదవండి: రెండో పెళ్లిపై స్పందించిన సునీత ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి కాగా సునీత ఎంగేజ్మెంట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అప్పట్లో రెండో పెళ్లి చేసుకునే ఉద్ధేశ్యం లేదని చెప్పిన ఆమె అనూహ్యంగా ఇలా ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. అయితే ఈ విషయంపై ఆమె తరపు నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఇక గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు సునీత. పాటల తోటలో పాతికేళ్లుగా అలుపెరగని గాన కోయిల ఆమె. సునీత పాటకు పరవశించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. టాలీవుడ్లో ఏ సింగర్‌కి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమెకు ఉంది. అయితే వ్యక్తిగత జీవితంలో మాత్రం సునీత ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. -
కన్న కూతురిని కడతేర్చిన కసాయి తండ్రి
-
కన్న కూతురిని కడతేర్చిన తండ్రి
-
కన్న కూతురిని కడతేర్చిన కసాయి తండ్రి
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ముధోల్ మండలంలో దారుణం జరిగింది. కన్న తండ్రే కూతురు పాలిట కాలయముడయ్యాడు. మళ్లీ ఆడపిల్ల పుట్టిందని కసాయి తండ్రి 9 నెలల పాపను కడతేర్చాడు. ముధోల్ మండలం వడ్తాల గ్రామానికి చెందిన లక్ష్మణ్‌కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య ముత్తుకు ఐదుగురు ఆడపిల్లలు. దీంతో సంవత్సరం క్రితం భైంసా పట్ణణానికి చెందిన లక్ష్మిని రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టింది. రెండో కాన్పులో కూడా మళ్లీ ఆడపిల్లే పుట్టడంతో తరుచూ వీరిద్దరీ మధ్య గొడవలు జరుగుతున్నాయి. కొన్నిరోజుల నుంచి కూతుర్ని అమ్మకానికి పెడదామని భార్యతో ఘర్షణకు దిగుతూ ఉండేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి లక్ష్మి ఇంటికి వచ్చేసరికి చిన్నారి అపస్మారక స్థితిలో ఉంది. తల్లి చిన్నారిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. తన కూతురిని లక్ష్మణ్ చంపేసి ఉంటాడని లక్ష్మి అనుమానిస్తోంది. పాప మరణించినప్పటి నుంచి లక్ష్మణ్ పరారీలో ఉండడంతో దీనికి మరింత బలంగా చేకూరింది. దీనిపై పాప తల్లి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. లక్ష్మణ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.