ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ముధోల్ మండలంలో దారుణం జరిగింది. కన్న తండ్రే కూతురు పాలిట కాలయముడయ్యాడు. మళ్లీ ఆడపిల్ల పుట్టిందని కసాయి తండ్రి 9 నెలల పాపను కడతేర్చాడు. ముధోల్ మండలం వడ్తాల గ్రామానికి చెందిన లక్ష్మణ్‌కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య ముత్తుకు ఐదుగురు ఆడపిల్లలు. దీంతో సంవత్సరం క్రితం భైంసా పట్ణణానికి చెందిన లక్ష్మిని రెండో వివాహం చేసుకున్నాడు.
ఆమెకు మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టింది. రెండో కాన్పులో కూడా మళ్లీ ఆడపిల్లే పుట్టడంతో తరుచూ వీరిద్దరీ మధ్య గొడవలు జరుగుతున్నాయి. కొన్నిరోజుల నుంచి కూతుర్ని అమ్మకానికి పెడదామని భార్యతో ఘర్షణకు దిగుతూ ఉండేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి లక్ష్మి ఇంటికి వచ్చేసరికి చిన్నారి అపస్మారక స్థితిలో ఉంది. తల్లి చిన్నారిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. తన కూతురిని లక్ష్మణ్ చంపేసి ఉంటాడని లక్ష్మి అనుమానిస్తోంది. పాప మరణించినప్పటి నుంచి లక్ష్మణ్ పరారీలో ఉండడంతో దీనికి మరింత బలంగా చేకూరింది. దీనిపై పాప తల్లి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. లక్ష్మణ్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కన్న కూతురిని కడతేర్చిన కసాయి తండ్రి
Published Fri, Oct 16 2015 8:22 AM | Last Updated on Mon, Jul 29 2019 5:43 PM
Advertisement
Advertisement