Father Attempted Murder His Daughter Lover In Adilabad - Sakshi
Sakshi News home page

బావా కలవాలని ఉంది.. అని మెసేజ్‌ పెట్టి

Published Wed, Aug 9 2023 11:55 AM | Last Updated on Wed, Aug 9 2023 12:59 PM

father Attempted murder daughter lover In Adilabad   - Sakshi

కొమరం భీమ్: తన కూతుర్ని ప్రేమించాడనే కోపంతో ఓ యువకుడిని హతమార్చేందుకు యత్నించాడు ఆ యువతి తండ్రి. ఈ ఘటన కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో కౌటాల మండలంలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు, బాధితుడి కథనం ప్రకారం.. గుండాయిపేట గ్రామానికి చెందిన ఎల్ములే గణపతి, వనిత దంపతుల చిన్న కుమారుడు ఎల్ములే సాయిరాం కౌటాల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్నాడు. గ్రామంలోని సమీప బంధువు, పదో తరగతి చదువుతున్న నాగపూరి శంకర్‌ కూతురు, సాయిరాం ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం అమ్మాయి ఇంట్లో తెలిసింది. 

బావా కలవాలని ఉంది..అని మెసేజ్‌ పెట్టి 
సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ‘బావా నిన్ను కలవాలని ఉంది’అని సాయిరాం ఫోన్‌కు యువతి ఫోన్‌ నుంచి మెసేజ్‌ వచ్చింది. దీంతో సాయిరాం రాత్రి సమయంలో గ్రామంలోని ఓ షాప్‌ వద్దకు వచ్చాడు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు వచ్చి మత్తు మందు కర్చిప్‌తో నోటిని ముసివేయడంతో సాయిరాం స్పృహ కోల్పోయాడు. అనంతరం పొలాల్లోకి తీసుకెళ్లి తీ వ్రంగా కొట్టారు. తర్వాత గ్రామ శివారులోని వ్యవ సాయ బావిలో పడేశారు.

కాసేపు అక్కడే ఉండి.. చనిపోయాడని భావించి వెళ్లిపోయారు. బావిలో తక్కువ నీరు ఉండడంతో సాయిరాం నీటిలో మునగలేదు. రాత్రి 2 గంటల ప్రాంతంలో యువకుడికి మెలకువ రావడంతో ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులు వెంటనే కౌటాలలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సాయిరాం తండ్రి  ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుండాయిపేట్‌ గ్రామానికి చెందిన నాగపూరి శంకర్, నాగపూరి పంకజ్, నాగపూరి సందీప్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు కౌటాల ఎస్సై మధుకర్‌ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement