ప్రియుడితో ఏకాంతంగా ఉన్న కూతురిని..
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో దారుణ పరువు హత్య చోటుచేసుకుంది. ప్రియుడితో ఏకాంతంగా ఉన్న కూతురిని చూసి తట్టుకోలేని ఓ తండ్రి ఆ జంటను కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన సాంబాల్ సమీపంలోని గిన్నార్ ప్రాంతంలో చోటుచేసుకుంది. స్థానికంగా నివసించే అచ్చన్ ఖురేషి మధ్య రాత్రి తన 16 ఏళ్ల కూతురు ఇంట్లో లేకపోవడాన్ని గుర్తించాడు.
ఎక్కడికి వెళ్లిందో అని వెతుకుతుండగా ఇంటి పక్కన ప్రియుడు సల్మాన్(18) తో ఏకాంతంగా గడపటాన్ని చూసిన అచ్చన్ ఆవేశంతో కూతురిని గొంతు నులిమి చంపగా, ప్రియుడిని కత్తితో పొడిచి చంపాడు. అచ్చన్ అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.