attempted murder case
-
అంగళ్లు కేసు క్లోజ్!
బి.కొత్తకోట: రాజు తలచుకుంటే జరగనిది ఏముంది? మరి కేసే రాజుదైతే లెక్కేముంది? అధికారం చంద్రబాబుదైతే కేసు మూసివేతకు అడ్డు ఏముంది? అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ముదివేడు పోలీస్‌స్టేషన్‌లో 2023 అగస్టులో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు సహా 20 మంది టీడీపీ నేతలపై నమోదైన కేసును నీరుగార్చి అధికారికంగా మూసివేసేందుకు రంగం సిద్ధమైంది. కుట్ర, హత్యాయత్నం లాంటి తీవ్రమైన సెక్షన్లు నమోదైన ఈ కేసులో దర్యాప్తును ముందుకు తీసుకెళ్లకపోగా అసలు ఫిర్యాదే తప్పు అని ఖాకీలు తాజాగా తేల్చేశారు.దీనిపై పైస్థాయి నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిళ్లతో మదనపల్లె డీఎస్పీ జారీ చేసిన నోటీసును రూరల్ సీఐ ఆదివారం ఫిర్యాదుదారుడికి అందజేశారు. ప్రాజెక్టుల సందర్శన పేరుతో నాడు అంగళ్లుకు వచ్చిన చంద్రబాబు పోలీసులను తీవ్రంగా తూలనాడటంతోపాటు రైతులపై సైతం దాడులకు టీడీపీ శ్రేణులను పురిగొల్పారు. దీనిపై ఫిర్యాదుదారుడు సమరి్పంచిన ఆధారాలను కనీసం పట్టించుకోని పోలీసు అధికారులు తాజాగా ఏకంగా కేసే లేకుండా మూసివేసేందుకు సిద్ధమయ్యారు. ఆ రోజు జరిగింది ఇదీ.. ముదివేడు సమీపంలో రూ.750 కోట్లతో నిరి్మస్తున్న రిజర్వాయర్‌పై చంద్రబాబు ఎన్జీటీలో కేసు వేయించి టీడీపీ నేతల ద్వారా అడ్డుకోవడంతో పనులు ఆగిపోయాయి. దీనిపై మార్కెట్ కమిటీ చైర్మన్ డీఆర్.ఉమాపతి, రైతులు, వైఎస్సార్సీపీకి చెందిన కొందరు నాడు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపి చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే చంద్రబాబు అంగళ్లు కూడలి వద్ద వారిని వేలెత్తి చూపిస్తూ ఉసిగొల్పడంతో టీడీపీ మూకలు విరుచుకుపడ్డాయి. రాళ్లు, ఇటుకలు, కట్టెలు, చెప్పులు, రాడ్లతో మూకుమ్మడిగా దాడి చేయడంతో వైఎస్సార్సీపీకి చెందిన వసంతరెడ్డి, అర్జున్‌రెడ్డి, విలేకరి శ్రీనివాసులు, మహే‹Ù, ముదివేడు పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ కేశవ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఉమాపతి ఆడియో, వీడియో సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేయడంతో ఆగస్టు 8న చంద్రబాబు సహా 20 మంది టీడీపీ నేతలు, ఇతరులపై 120బి, 147, 148, 153, 307, 115, 109, 323, 324, 506, రెడ్‌విత్ 149 ఐపీసీ సెక్షన్లు కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఆర్సీఎస్ నోటీసుచంద్రబాబు సీఎం కావడంతో ఆయనపై నమోదైన కేసును నీరుగార్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా చంద్రబాబుపై నమోదైన క్రైమ్ నంబర్ 79/2023 తప్పుడు కేసుగా తేల్చేసి ఫిర్యాదుదారుడిని ఆదివారం పోలీస్‌స్టేషన్‌కు రప్పించి రెఫర్డ్ కేసు సమన్స్ (ఆర్సీఎస్) అందచేశారు. పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే నోటీసు అందుకున్న వారం రోజుల్లో సంబంధిత కోర్టును ఆశ్రయించవచ్చని అందులో ఉంది. అయితే నోటీసును డీఎస్పీ గత నెల 25న జారీ చేస్తే ఫిర్యాదుదారుడికి ఆదివారం అందచేయడం గమనార్హం. గడువు ముగిశాక నోటీసు అందించడం ద్వారా కోర్టును ఆశ్రయించే అవకాశం లేకుండా చేయాలని కుట్రపూరితంగా వ్యహరించినట్లు స్పష్టమవుతోంది. అయితే ఫిర్యాదుదారుడు ఉమాపతి తాను నోటీసు అందుకున్న తేదీని ప్రస్తావిస్తూ కాగితాలపై సంతకం చేయడంతో పోలీసుల పాచిక పారలేదు.బలవంతంగా నాతో సంతకంముదివేడులో ఉన్న నన్ను ఆరుగురు పోలీసులు ఓ నిందితుడి మాదిరిగా మదనపల్లె రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టారని, నోటీసు తీసుకుని సంతకం చేయాలని నన్ను బలవంతం చేశారు. కేసు రాజీకి ఒప్పుకోనని చెప్పినా పట్టుపట్టి సంతకం పెట్టించుకున్నారు. రైతులకు ద్రోహం చేయడం వల్లే ఆ రోజు చంద్రబాబును ప్రశి్నంచేందుకు అంగళ్లు వచ్చాం. రైతులమైన మాపై టీడీపీ శ్రేణులు రాళ్లు, రాడ్లతో దాడులు చేశాయి. పోలీసుల ఒత్తిళ్లకు తలొగ్గేది లేదు. ఈ కేసులో రాజీ పడేది లేదు. కచ్చితంగా కోర్టును అశ్రయిస్తా. – డీఆర్.ఉమాపతి, అంగళ్లు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ -
వైఎస్సార్సీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడిపై టీడీపీ నేతల హత్యాయత్నం
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడసెంట్రల్): వైఎస్సార్సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పల్లపోతు మురళీకృష్ణ అలియాస్ కొండపల్లి బుజ్జిపై సోమవారం విజయవాడలో టీడీపీ నేతలు హత్యాయత్నం చేశారు. ఇటీవలి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావుకు మద్దతుగా పనిచేశాడనే అక్కసుతో ఆయనపై హత్యాయత్నం చేశారు. విజయవాడ నగరం నడిబొడ్డున నార్త్‌జోన్ ఏసీపీ కార్యాలయానికి సమీపంలోనే ఈ దారుణానికి ఒడిగట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా హత్యాయత్నం చేసిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫార్మా డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేస్తున్న మురళీకృష్ణ అలియాస్ బుజ్జి అయోధ్యనగర్ లోటస్ ల్యాండ్ సెక్టార్–1లో నివసిస్తున్నారు. రోజూలానే సోమవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో బ్యాడ్మింటన్ ఆడుకుని ఇంటికి వస్తుండగా సెక్టార్–2 ఆకాష్ అపార్ట్మెంట్స్ వద్దకు వచ్చేసరికి నలుగురు వ్యక్తులు రెండు బైకులపై వచ్చి ఆయన్ని అడ్డగించి ఒక్కసారిగా దాడిచేశారు. మోహంమీద, శరీరంపైన పిడుగుద్దులతో విరుచుకుపడ్డారు. పక్కనున్న రాయితో కొట్టి హత్యచేసేందుకు ప్రయత్నించారు.చుట్టుపక్కలవారు కేకలు వేయడంతో అక్కడినుంచి పరారయ్యారు. తీవ్రంగాగాయపడిన బుజ్జిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు.. హత్యాయత్నం చేసింది టీడీపీకి చెందిన కాకొల్లు మహేంద్ర, గొట్టుముక్కల వెంకటేశ్వరరాజు, బెజ్జం జయపాల్, షేక్ గౌస్‌బాషాగా గుర్తించారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. నిందితుల్ని కోర్టులో హాజరుపరిచారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ స్పందించాలి: వెలంపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బుజ్జిని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైఎస్సార్సీపీ నేతలు పోతిన వెంకటమహేష్, తోలేటి శ్రీకాంత్ పరామర్శించారు. అనంతరం వెలంపల్లి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ టీడీపీ సంకెళ్లలోఉందని విమర్శించారు. నార్త్‌జోన్ ఏసీపీ కార్యాలయం సమీపంలోనే దారుణం జరిగిందన్నారు. దాడులను అరికట్టాలని ఇటీవల సీపీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదని చెప్పారు. ఎమ్మెల్యే బొండా ఉమా తన అనుచరులతో దాడులకు పాల్పడుతున్నాడని, సెంట్రల్ నియోజకవర్గంలో 35 మందిపై దాడులు జరిగాయన్నారు. బొండా ఉమా మర్యాదగా ఈ దాడులు ఆపాలని సూచించారు. పోలీసు వ్యవస్థ ఈ దాడులను అరికట్టకపోతే రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడతారని హెచ్చరించారు. ఈ దాడులపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. -
హత్యాయత్నం కేసులో నలుగురి అరెస్ట్
వేంపల్లె: శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి అనుచరుడు వేంపల్లె అజయ్‌కుమార్‌రెడ్డిపై దాడి కేసులో 10 మందిపై హత్యాయత్నం కేసు నమోదైంది. సీఐ చాంద్‌బాషా శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. వేంపల్లె టీడీపీ మండల పరిశీలకుడు అజ్జుగట్టు రఘునాథ్‌రెడ్డి, అజ్జుగట్టు రవితేజారెడ్డిలను అసభ్య పదజాలంతో తిట్టడం, సోషల్ మీడియాలో అవహేళన చేశారనే కోపంతో అజయ్‌కుమార్‌రెడ్డిని చంపాలని నిందితులు ప్రయత్నించినట్టు ఫిర్యాదు అందిందన్నారు. అజయ్‌కుమార్‌రెడ్డి సోదరుడు మౌనీధర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై విచారణ చేపట్టామన్నారు.ఈ కేసులో వైఎస్సార్ జిల్లా పులివెందుల శివారు శిల్పారామం వద్ద గండూరు హిదయతుల్లా, కొండాపురం మండలం డోంకుపల్లి గ్రామానికి చెందిన పందిర్ల శివకుమార్‌రెడ్డి, సింహాద్రిపురం మండలం కోవరంగుట్టపల్లె గ్రామానికి చెందిన మల్లెల మహేశ్వర్, వేముల మండలం నల్లచెరువుపల్లె గ్రామానికి చెందిన రామిరెడ్డి ధరణీశ్వరరెడ్డిని అరెస్ట్ చేశామన్నారు. పులివెందుల రోడ్డులోని స్కూల్ సమీపంలో అజయ్‌కుమార్‌రెడ్డిని హాకీ స్టిక్స్, బండరాళ్లతో కొట్టి గాయపరిచామని నిందితులు చెప్పినట్టు సీఐ తెలిపారు. మిగిలిన వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని సీఐ తెలిపారు. -
రెచ్చిపోతున్న ఇసుక స్మగ్లర్లు
ముస్తాబాద్ (సిరిసిల్ల): ఇసుక స్మగ్లర్ల ఆగడాలు జిల్లాలో పరాకాష్టకు చేరుకున్నాయి. పోలీసులు పట్టుకున్న ఇసుక ట్రాక్టర్‌ను స్టేషన్‌కు తరలించే క్రమంలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై ఇసుక స్మగ్లర్ దాడి చేశాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో ప్రాణపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ఎస్సై శేఖర్‌రెడ్డి కథనం ప్రకారం.. ముస్తాబాద్ మండలం రామలక్ష్మణపల్లె మానేరు వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా అవుతోందన్న సమాచారంతో ఎస్సై ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం రాత్రి తనిఖీలకు వెళ్లారు. రాంరెడ్డిపల్లె, నామాపూర్ గ్రామాల మధ్య ఐదు ట్రాక్టర్లను పట్టుకున్నారు. వాటిని ఠాణాకు తరలిస్తుండగా, గోపాల్పల్లెకు చెందిన భూక్య గురుబాబు తన కారులో నామాపూర్ చేరుకున్నాడు. ‘నా బండినే పట్టుకుంటారా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రాక్టర్‌పై ఉన్న కానిస్టేబుల్ సత్యనారాయణపై దాడికి దిగాడు. దీంతో కానిస్టేబుల్ ఎదురుతిరిగి ట్రాక్టర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లాల్సిందేనని పట్టుబట్టాడు. అక్కడికి చేరుకున్న ఎస్సై ట్రాక్టర్‌ను ఠాణాకు తీసుకెళ్లాలని హెచ్చరించాడు. దీంతో గురుబాబు ట్రాక్టర్‌ను నడిపాడు. ఆ సమయంలో కానిస్టేబుల్ సత్యనారాయణ ట్రాక్టర్ ఇంజిన్‌పై కూర్చోగా, నామాపూర్ శివారులోని మేళ్ల చెరువు వద్దకు చేరుకోగానే గురుబాబు ట్రాక్టర్‌ను వేగంగా నడుపుతూ చెరువులోకి తీసుకెళ్లి.. తాను కిందకి దూకి పారిపోయాడు. ట్రాక్టర్‌పై ఉన్న కానిస్టేబుల్ చెరువులోని బండరాళ్లపై పడిపోగా నడుము భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ట్రాక్టర్ చెరువు నీటిలో మునిగిపోయింది. అటుగా వచ్చిన ఎస్సై వెంటనే కానిస్టేబుల్‌ను 108లో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గురుబాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
అది ప్రాణాలు తీసేంత దాడే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడి ప్రాణాలు తీసేంత తీవ్రమైనదేనని ప్రముఖ న్యూరో సర్జన్ డా. కేవీఆర్ శాస్త్రి అంటున్నారు. అదృష్టవశాత్తు ఎడమ కనుబొమ్మ పై భాగంలో తగలడంతో తీవ్రగాయంతో సరిపోయిందని, అదే ఎడమ కణతపై లేదా తల వెనుక భాగంలో తగిలితే కుడి చేయి చచ్చుబడటం, మాట పడిపోవడంతోపాటు ప్రాణాపాయం సంభవించేందుకు కూడా ఎక్కువగా అవకాశాలున్నాయని ఆయన విస్పష్టంగా పేర్కొన్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ – న్యూరో సైన్సెస్ (నిమ్హాన్స్– బెంగళూరు)లో న్యూరాలజీ విభాగాధిపతిగా చేసిన ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సీఎం జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం తీవ్రతను పలు కోణాల్లో విశ్లేషించారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. పదునైన ఆయుధంతో దాడి సీఎం వైఎస్ జగన్‌పై పదునైన రాయి లేదా ఇతర పదునైన వస్తువుతో బలంగా దాడి చేశారు. ఎడమ కనుబొమ్మ పై భాగంలో బలంగా తగలడంతో చర్మం ఛిద్రమై తీవ్ర గాయమైంది. దాంతోనే కుట్లు వేయాల్సి వచ్చింది. ఆయన కొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. ప్రస్తుతం ఆయన ఒకట్రెండు రోజుల విశ్రాంతి తరువాత రోజువారి పనుల్లో నిమగ్నమైనప్పటికీ, వైద్యులు తరచూ పర్యవేక్షిస్తూ ఉండాలి. కణతపై తగిలి ఉంటే.. ఆ పదునైన రాయి లేదా వస్తువు కాస్త పక్కన ఎడమ కణతపై తగిలి ఉంటే పెనుముప్పు సంభవించేది. ఆ భాగంలో ఎముక సున్నితంగా ఉంటుంది. పదునైన రాయి బలంగా తగిలితే ఆ ఎముక విరిగి లోపలే ఉండిపోయేది. ఆ ఎముక లోపల మెదడు భాగానికి గుచ్చుకుంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లేది. ఇక ఎడమ కణత భాగంలోనే పెద్ద రక్తనాళం ఉంటుంది. ఆ నాళం తెగి భారీగా రక్తస్రావం అయ్యేది. కుడి చేయి చచ్చుబడటం, మాట పడిపోయే ప్రమాదానికి దారి తీసి ఉండేంది. మెదడులోనే రక్తస్రావమైనా, మెదడుకు రక్త సరఫరాకు ఇబ్బంది కలిగి ప్రాణాపాయం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తల వెనుకభాగంలో తగిలితే.. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుడివైపు ఉన్న ప్రజలను చూసి అభివాదం చేస్తూ ఉండటంతో ఎడమ వైపు నుంచి బలమైన రాయి లేదా మరో పదునైన వస్తువుతో దాడి చేశారు. ఆ సమయంలో ఆయన వెనక్కి తిరిగి ఉన్నారు. ఆ వస్తువు తల వెనుక కింద భాగంలో తగిలి ఉంటే మెదడుకు తీవ్ర గాయమయ్యేది. మెదడులో రక్తస్రావం అయి ప్రాణాలకు ముప్పు వాటిల్లేది. అదృష్టవశాత్తూ అది ఎడమ కనుబొమ్మ పై భాగంలో తగలడంతో తీవ్ర గాయంతో సరిపోయింది. అయినప్పటికీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని వైద్యులు కొన్నిరోజులపాటు పర్యవేక్షిస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. న్యూరో సర్జన్ డా. కేవీఆర్ శాస్త్రి దోషుల్ని శిక్షించాలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలనలో అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందడం చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ఇటువంటి పనులు చేస్తున్నాయి. ఆయన్ని హత్యచేయాలనే ప్రణాళిక ప్రకారం దాడిచేశారు. ఇది ప్రతిపక్షాల కుట్రే. దీనివెనుక ఎంతటి పెద్దవారున్నా పూర్తిస్థాయిలో విచారించి దోషులను కఠినంగా శిక్షించాలి. – చిర్ల జగ్గిరెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చంద్రబాబు చెప్పడంతోనే.. జగన్మోహన్రెడ్డిని రాళ్లతో కొట్టమని శనివారం మధ్యాహ్నం తుళ్లూరులో చంద్రబాబు తన ప్రసంగంలో సూచించారు. ఆ వీడియోలు ఉన్నాయి. జగన్‌ను రాళ్లతో కొట్టండి, అతడు దుర్మార్గుడు, దున్నపోతు, సైకో రాళ్లతో దాడి చేయండి అని.. చంద్రబాబు చెబితే ఈ దుర్మార్గులు, పచ్చకుక్కలు, తెలుగుతమ్ముళ్లు, పిచ్చి పరాకాష్టకు చేరిన కులగజ్జి పట్టిన కుక్కలు సీఎం జగన్‌ను చంపడానికి కుట్ర పన్నారు. చంద్రబాబునాయుడు ప్రణాళికతో జగన్మోహన్రెడ్డి మీద గత ఎన్నికల ముందు, ఈ ఎన్నికల ముందు ఈ దారుణం చేయించారు. తక్షణమే ఈ కుట్ర వెనుక ఉన్న వ్యక్తులను పట్టుకోవాలి. – కొడాలి నాని, ఎమ్మెల్యే ఉసిగొల్పుతున్న చంద్రబాబు ఇటీవల ఎన్నికల ప్రచారసభల్లో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి దురాగతాలకు ఉసిగొల్పుతున్నారు. చంద్రబాబు ప్రసంగాల వీడియో క్లిప్‌లు పరిశీలిస్తే వాస్తవం ఇట్టే అర్థమవుతుంది. జగన్‌పై హత్యాయత్నం ప్రతిపక్షాల కుట్రలో భాగమే. జగన్ ఇటువంటి వాటికి భయపడే వ్యక్తి కాదు. చంద్రబాబు ఇలాంటి సిగ్గుమాలిన రాజకీయాలు మానుకోవాలి. – కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే జగన్‌ను చంపాలనే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని హత్యచేయాలనే ప్రయత్నించారు. రాష్ట్ర ప్రజల అదృష్టం బాగుండి ముఖ్యమంత్రికి ఏమీకాలేదు. కుల ఆధిపత్యంతో, అసూయతో ఇలా చేశారు. ఈ కుట్రను ప్రధాని నరేంద్రమోదీ వెలికి తీయించాలి. పొత్తులతోను, డబ్బుతోను అధికారం చేజిక్కించుకోవాలనుకున్న చంద్రబాబు వ్యూహం ఫలించదని తెలియడంతో ఈ కుట్ర చేశారు. – రాచమల్లు శివప్రసాదరెడ్డి, ఎమ్మెల్యే చంద్రబాబు, నాదెండ్ల మనోహర్ కుట్ర ముఖ్యమంత్రిపై హత్యాయత్నం వెనుక చంద్రబాబు, నాదెండ్ల మనోహర్ కుట్ర ఉంది. వారిద్దరి దుర్మార్గపు ఆలోచనతోనే సీఎంపై హత్యాయత్నం జరిగింది. సీఎం జగన్‌పై ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఈ దారుణానికి పాల్పడ్డారు. – సింహాద్రి రమేష్‌బాబు, ఎమ్మెల్యే నైతికంగా దెబ్బతీయాలని.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రజాభిమానం అధికంగా ఉండడం గమనించి, ఆయన్ని నైతికంగా దెబ్బతీయాలనే హత్యాయత్నం చేశారు. వైఎస్సార్సీపీకి గ్రాఫ్ పెరుగుతోందని గ్రహించి ఓర్వలేక ఈ దారుణానికి తెగబడ్డారు. గతంలో విజయవాడలో వంగవీటి మోహన రంగా హత్య వంటివి చూస్తే.. ఎదుటి వ్యక్తులను కుట్రలతో దెబ్బతీయడం టీడీపీకి అలవాటేనని అర్థమవుతోంది. – జక్కంపూడి రాజా, ఎమ్మెల్యే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జనం నీరాజనం పడుతుంటే ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు ఇలాంటి దుర్ఘటలకు పాల్పడడం దారుణం. దాడిచేసిన వారిని గుర్తించి, అందుకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. – శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు ప్రజానాయకుడిపై హత్యాయత్నం ప్రజాస్వామానికి గొడ్డలిపెట్టు. పేదల పెన్నిధి, విద్య, వైద్యం, సంక్షేమం అందిస్తున్న సీఎం వైఎస్ జగన్‌పై హత్యాయత్నం దుర్మార్గం. గాయపడిన జగన్‌కు ప్రథమ చికిత్స చేశా. ఆయనలో ఎలాంటి భయం లేదు. – డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు, వైఎస్సార్సీపీ మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి కఠిన చర్యలు తీసుకోవాలి ముఖ్యమంత్రిపై హత్యాయత్నం హేయం. ఈ సంఘటనపై లోతైన దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. – దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఇంటెలిజెన్స్‌పై చర్యలు తీసుకోవాలి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం చేయడం తప్పు. దీన్లో పోలీస్, ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంది. ఎలక్షన్ కమిషన్ ఇంటెలిజెన్స్ మీద చర్యలు తీసుకోవాలి. – వంగవీటి రాధా, మాజీ ఎమ్మెల్యే -
గన్‌మెన్ కావాలని..
ఉప్పల్: బీజేపీ నేతపై హత్యాయత్నం బూటకమని పోలీసులు తేల్చారు. తనకు రాజకీయ నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో ప్రాణహాని ఉందని పోలీసులను నమ్మించే ప్రయత్నంలో తనపై తానే హత్యాయత్నం చేయించుకున్న రౌడీ షీటర్‌ను అదుపులోకి తీసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గురువారం మల్కాజిగిరి డీసీపీ పద్మజ, ఏసీపీ పురుషోత్తం రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. బోడుప్పల్ ప్రాంతానికి చెందిన యల్లగోని భాస్కర్ గౌడ్, సినీ నిర్మాతగా, రియల్ వ్యాపారిగా పని చేసేవాడు. ఈ నెల 24న అతను తనపై హత్యాయత్నం జరిగిందని రక్త గాయాలతో ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు విచారణలో పలు అసక్తికరమైన అంశాలు గుర్తించారు. సెటిల్మెంట్లు..రియల్ దందాలు భాస్కర్ గౌడ్ పలు సినిమాలకు నిర్మాత వ్యవహరించాడు. బీజేపీ రాష్ట్ర స్వచ్చ్ భారత్ అభియాన్ కనీ్వనర్‌గా, జాతీయ హిందీ సలహాదారు కమిటీ సభ్యుడిగా పని చేస్తున్నాడు. బోడుప్పల్లో ఆఫీసు ఏర్పాటు చేసిన అతను భూ తగాదాలకు సంబంధించిన సెటిల్ మెంట్లు చేస్తుంటాడు. ఈ క్రమంలో అతడిపై ఉప్పల్, నాచారం, కీసర తదితర పోలీస్ స్టేషన్లలో ఏడు కేసులు ఉన్నాయి, మేడిపల్లి పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉంది. పలుకుబడి కోసం పథకం.. ఈ నేపథ్యంలో ప్రజల్లో పలుకుబడి పెంచుకునేందుకు గన్మెన్న్ను నియమించుకోవాలని భావింన భాస్కర్ గౌడ్ తన స్నేహితుడు శివ కిషోర్ గౌడ్‌తో కలిసి పథకం రూపొందించాడు. హత్యాయత్నం జరిగితే కాని గన్మెన్లను ఇవ్వరని తెలియడంతో శివకిషోర్ తన స్నేహితుడు యదగిరితో కలిసి ఈ నెల 22 న నాగోల్‌లోని అమరావతి బార్ వద్ద పథకం రంచారు. యాదగిరి స్నేహితులు కొండా అరుణ్,సృజన్ రెడ్డి, ఆకుల ప్రశాంత్, మిరపకాయల సంతోష్ రెడ్డి, మహేష్ తదితరులు భాస్కర్ గౌడ్‌పై ఫేక్ హత్యాయత్నం చేయాలని నిర్ణయించారు. ఇందుకుగాను ర. 2.5 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్‌గా ర. 50,000 ఇచ్చారు. 24న ఉప్పల్ ఏషియన్ థియేటర్ వైపు నుంచి భాస్కర్ గౌడ్ కారులో డ్రైవర్‌తో కలిసి ఉప్పల్ భగాయత్లోకి రాగానే వనం టీ స్టాల్ వద్ద ఉన్న శివకుమార్ స్నేహితులు డ్రైవర్‌పై, భాస్కర్ గౌడ్‌పై కత్తితో దాడి చేసి పారి పోయారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు హత్యాయత్నం బూటకమని తేల్చారు. పోలీసులను తప్పుదోవ పట్టింనందుకుగాను పలు సెక్షన్లపై కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు. మిరపకాయల సంతోష్ రెడ్డి, మహేష్‌లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి నుండీ హత్యాయత్నానికి ఉపయోగించిన కత్తి, కారు, రెండు ద్విచక్ర వాహనాలు, ఆరు సెల్ఫోన్లు, ర. 2 లక్షల నగదు స్వాదీనం చేసుకున్నారు. సవవేశంలో ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి ,ఎస్ఐ శంకర్, సిబ్బంది పాల్గొన్నారు. -
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్టు
ప్రొద్దుటూరు క్రైం : హత్యాయత్నం కేసులో నిందితులుగా ఉండి 35 రోజుల నుంచి పోలీసులకు ముప్పు తిప్పలు పెడుతూ తప్పించుకొని తిరుగుతున్న భరత్‌కుమార్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డిలను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ప్రొద్దుటూరులోని కొర్రపాడు రోడ్డులో ఉన్న మల్లేలమ్మ గుడి వద్ద అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రెండు బైక్‌లు, ఐదు సెల్ఫోన్లు, సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు అరెస్ట్ వివరాలను మీడియాకు వెల్లడించారు. అక్టోబర్ 28న వైఎస్సార్సీపీ కార్యకర్త బెనర్జీని చంపాలనే ఉద్దేశంతో ఈ దాడి జరిగింది. బెనర్జీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. అలాగే భరత్‌కుమార్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డిలు ప్రొద్దుటూరు టీడీపీ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాల్లో చురుకై న పాత్ర పోషించేవారు. గతంలో టీడీపీకి చెందిన నందం సుబ్బయ్య హత్య కేసులో బెనర్జీ ముద్దాయిగా ఉన్నాడు. అప్పటి నుంచి వీరి మధ్య వ్యక్తిగతంగా, పార్టీ పరంగా విరోధం ఉండేది. తరచూ వాగ్వాదం, తగవులు కొనసాగుతూ వీరి మధ్య ఉన్న మనస్పర్థలు తారాస్థాయికి చేరాయి. ఈ విషయాలన్నీ భరత్‌కుమార్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డిలు ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి చెప్పేవారు. సరైన అవకాశం కోసం వేచి ఉన్న ముగ్గురు బెనర్జీని మట్టు పెట్టేందుకు వ్యూహ రచన చేశారు. అక్టోబర్ 28న వైఎస్సార్సీపీ నాయకులు ప్రొద్దుటూరులో సామాజిక సాధికార యాత్ర పేరుతో ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టారు. ఆ రోజు బెనర్జీ పార్టీ కార్యక్రమంలో బిజీగా ఉంటాడని.. అతన్ని మట్టు పెట్టేందుకు ఇదే సరైన సమయమని వారు పథకం రచించారు. ఈ క్రమంలో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు బైక్‌లో వెళ్తున్న బెనర్జీని భరత్‌కుమార్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డిలు తమ బైక్‌తో ఢీ కొట్టారు. అక్కడ వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా పక్కనే టెంకాయల బండిపై ఉన్న కత్తితో బెనర్జీని నడిరోడ్డులో విచక్షణారహితంగా నరికారు. పోలీసులు రావడంతో సంఘటనా స్థలం నుంచి నిందితులిద్దరూ పారిపోయారు. అప్పటి నుంచి వారు పోలీసులకు దొరక కుండా పరారీలో ఉన్నారు. ఈ క్రమంలో భరత్‌కుమార్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డిలను కొర్రపాడు రోడ్డులోని మల్లేలమ్మ గుడి వద్ద త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రెండు మోటార్ బైక్‌లు, ఐదు సెల్ఫోన్లు, రెండు సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. సహకరించిన వారి పాత్రపై విచారణ హత్యాయత్నం కేసులో పరారీలో ఉన్న నిందితులిద్దరికీ సహకారాలు అందించిన వారిని కూడా విచారణ చేస్తామని డీఎస్పీ తెలిపారు. వారి వద్ద ఉన్న సెల్ఫోన్లు, కొత్త సిమ్ కార్డుల ద్వారా భరత్‌కుమార్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డిలు స్థానికంగా ఏం జరుగుతుందనే సమాచారాన్ని తెలుసుకునేవారు. పరారీలో ఉన్న నిందితులకు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, రాయచోటికి చెందిన సిద్ధారెడ్డితో పాటు ఇంకా కొంత మంది ఆర్థిక సాయంతో వాహనాలను సమకూర్చారన్నారు. వాళ్లు ఉండేందుకు వసతి ఏర్పాట్లు చేసినట్లు తమ విచారణలో వెల్లడైందని డీఎస్పీ తెలిపారు. నేరం చేసిన ముద్దాయిలకు సహకరించడం కూడా నేరం అవుతుందన్నారు, ఈ విషయం తెలిసి కూడా నిందితులకు వీరు సహకారం అందించినట్లు తమ విచారణలో నిర్ధారణ అయిందని చెప్పారు. విచారణ అనంతరం సహకరించిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ చెప్పారు. కాగా ఈ కేసులో టీడీపీ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని నవంబర్ 13న త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కడప సెంట్రల్ జైల్లో ఉన్న ఆయన 21న బెయిల్‌పై విడుదలయ్యారు. నిందితుల కోసం 35 రోజులు శ్రమించిన పోలీసులు బెనర్జీపై హత్యాయత్నం చేసిన కేసులో పరారీలో ఉన్న భరత్‌కుమార్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డిల కోసం పోలీసులు 35 రోజుల పాటు శ్రమించారు. ఏపీతో పాటు తెలంగాణా, కర్నాటక రాష్ట్రాల్లో నిందితులిద్దరూ తలదాచుకుంటూ వచ్చారు. వీళ్లు బస చేసిన ప్రాంతాల్లో కూడా విచారణ చేస్తామని డీఎస్పీ తెలిపారు. ఈ కేసులోని నిందితులను పట్టుకోవడానికి కృషి చేసిన త్రీ టౌన్ సీఐ వెంకటరమణ, ఇతర సీఐలు, ఎస్ఐలు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. రివార్డు కోసం జిల్లా ఎస్పీకి సిఫార్సు చేయనున్నట్లు డీఎస్పీ నాగరాజు తెలిపారు. -
బెయిల్‌పై వచ్చి నలభై ఏళ్లు చిక్కలేదు..!
హైదరాబాద్: ముంబైకి చెందిన సయ్యద్ తాహిర్ (65)..40 ఏళ్ళ క్రితం అక్కడి డోంగ్రీ ప్రాంతంలో ఓ హత్యాయత్నం చేశాడు. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసినా బెయిల్‌పై వచ్చి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. నేరుగా హైదరాబాద్ వచ్చిన అతగాడు టోలిచౌకి ప్రాంతంలో తలదాచుకున్నాడు. అక్కడి న్యాయస్థానం ఇతడిపై స్టాండింగ్ వారెంట్ జారీ చేయడంతో తాహిర్ కోసం గాలించిన మహారాష్ట్ర పోలీసులు ఎట్టకేలకు అతడి ఆచూకీ కనిపెట్టారు. శుక్రవారం సిటీకి వచ్చిన ప్రత్యేక బృందం అతడిని అరెస్టు చేసి తీసుకువెళ్లింది. ఇక్కడి యువతినే వివాహం చేసుకుని, కుమారుడు, కుమార్తెలు కలిగిన తాహిర్‌కు అప్పట్లో తాను ఎవరి చంపడానికి ప్రయత్నించాడో కూడా గుర్తులేకపోవడం గమనార్హం. డోంగ్రీలోని కళ్యాణ్ మాన్షనన్కు చెందిన తాహిర్ వృత్తిరీత్యా డ్రైవర్. 1982లో చిన్న వివాదానికి సంబంధించి తోటి డ్రైవర్‌పై హత్యాయత్నం చేశాడు. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేయడంతో న్యాయస్థానం నుంచి బెయిల్ పొందాడు. తనకు శిక్షపడటం ఖాయమని భావించిన ఇతగాడు పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. నేరుగా హైదరాబాద్ వచ్చి టోలిచౌకి ప్రాంతంలో స్థిరపడ్డాడు. స్థానికంగా గుర్తింపుకార్డులు సంపాదించిన తాహిర్ ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. వీరికి ప్రస్తుతం నలుగురు సంతానం ఉన్నారు. డోంగ్రీలో నమోదైన హత్యాయత్నం కేసు వాయిదాలకు ఇతడు హాజరుకాకపోవడంతో సెషన్స్ కోర్టు తొలుత సమన్లు జారీ చేసింది. ఆపై బెయిలబుల్ తర్వాత నాన్–బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. అయితే పోలీసులు ఎంతగా గాలించినప్పటికీ తాహిర్ ఆచూకీ లభించలేదు. డోంగ్రీలోనే ఉన్న అతడి తల్లిని, ఇతర బంధువులు, స్నేహితులను ఆరా తీసినా ఎలాంటి సమాచారం లభించలేదు. ఇదే విషయాన్ని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం స్టాండింగ్ వారెంట్ జారీ చేసి అతడి కోసం గాలింపు కొనసాగించాలని, దొరికినప్పుడు అరెస్టు చేయాలని ఆదేశించింది. దీంతో ఓ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. తాహిర్ ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించిన ఈ టీమ్ అతడి తల్లి వివరాలు ఆరా తీసింది. ఆమె నాలుగేళ్ల క్రితం చనిపోయిందని, అక్కడి మజ్గావ్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగినట్లు తెలుసుకుంది. అక్కడకు వెళ్లి ఆరా తీసిన పోలీసులు..వాటికి తాహిర్ హాజరయ్యాడని, అప్పట్లో కొందరికి తాను హైదరాబాద్‌లో ఉంటున్నట్లు చెప్పాడని తెలుసుకున్నారు. దీంతో గాలింపు చర్యలు వేగవంతం చేసిన పోలీసులు డోంగ్రీ ప్రాంతంలో ఉన్న వేగులను అప్రమత్తం చేశారు. వారిలో ఒకడు తాహిర్ చిన్ననాటి స్నేహితుడికి దగ్గర కావడం ద్వారా అసలు విషయం చెప్పకుండా అతడి ఫోన్ నెంబర్ సేకరించాడు. దీని ఆధారంగా ఆరా తీసిన అధికారులు తాహిర్ హైదరాబాద్‌లోని టోలిచౌకిలో ఉంటున్నట్లు గుర్తించారు. గత వారం నగరానికి చేరుకున్న ప్రత్యేక బృందం ఈ ప్రాంతంలో గాలించినా అతడి ఆచూకీ లభించలేదు. దీంతో సాంకేతికంగా ముందుకు వెళ్ళిన అధికారులు అతడు లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నట్లు, పశ్చిమ బెంగాల్ వెళ్లి వస్తున్నట్లు గుర్తించారు. సిటీలోనే మకాం వేసిన ప్రత్యేక బృందం శుక్రవారం తాహిర్ ఇంటికి వచ్చినట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కోర్టు వారెంట్ ఆధారంగా అరెస్టు చేసి ముంబై తరలించారు. అక్కడి సెషన్స్ కోర్టు తాహిర్‌కు ఈ నెల 20 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అప్పట్లో తాను ఎవరితో గొడవపడ్డానో ఆ వ్యక్తి పేరు గుర్తులేదని తాహిర్ చెప్పాడు. తనకు నలుగురు సంతానం అని, పెద్ద కుమార్తె దంత వైద్యురాలు కాగా రెండో కుమార్తె ఉపాధ్యాయురాలని విచారణలో చెప్పాడు. చిన్న కుమార్తె బ్యూటీషియన్, కుమారుడు హోం రెన్నోవేషన్ కాంట్రాక్టర్‌గా స్థిరపడినట్లు వివరించాడు. -
దళిత యువతిపై దాడి
జక్రాన్‌పల్లి: ప్రేమ పేరుతో దళిత యువతిని వేధించి, హత్యాయత్నానికి పాల్పడ్డాడో యువకుడు. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. జక్రాన్‌పల్లికి చెందిన దళిత యువతిని అదే గ్రామానికి చెందిన ఓ ముస్లిం యువకుడు కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. శనివారం రాత్రి ఆమెను బలవంతంగా తన బైక్‌పై ఎక్కించుకుని తీసుకువెళ్లాడు. ఈ క్రమంలో యువతి ప్రతిఘటించి బైక్‌పై నుంచి కిందకు దూకింది. దీంతో ఆగ్రహించిన సదరు యువకుడు మద్యం మత్తులో యువతిని కొట్టి రోడ్డు పక్కన పడేశాడు. ఆమెను గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. గ్రామంలో ఆందోళన.. యువతిపై హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రాత్రి దళిత సంఘాల ప్రతినిధులు, బాధిత యువతి కుటుంబ సభ్యులు గ్రామంలో కొవ్వొత్తులతో ర్యాలీ తీశారు. జక్రాన్‌పల్లి అంబేడ్కర్ చౌరస్తాలో ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై తమకు ఇంకా ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నాయకుల హత్యాయత్నం
ద్వారకాతిరుమల: ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలోని గొల్లగూడెంలో ఆదివారం రాత్రి వినాయకచవితి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్న పలువురు వైఎస్సార్సీపీ నేతలపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కర్రలు, ఇతర ఆయుధాలతో దాడిచేసి హత్యాయత్నం చేశారు. ఈ దాడిలో ఐదుగురు వైఎస్సార్సీపీ నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుల కథనం ప్రకారం.. వినాయకచవితి ఉత్సవాల నిర్వహణ కోసం స్థానిక రామాలయం వద్ద వైఎస్సార్సీపీ నేతలు గంటా వెంకటసుబ్రహ్మణ్యం, బొంతు రమేష్, ఈలప్రోలు ధర్మరాజు, కొత్తపల్లి గురువిష్ణు, కొత్తపల్లి హేమంత్ షామియానా పందిరి ఏర్పాటు చేస్తున్నారు. ఆ సమయంలో పాతకక్షల నేపథ్యంలో టీడీపీ గ్రామకమిటీ అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రసాద్, నాయకులు కొమ్మిన సత్యనారాయణ, చిలకా సతీష్, బొంతు వెంకటేశ్వరరావు, కొత్తపల్లి హరికృష్ణ, గంజి సతీష్, గంజి సురేష్, బొంతు మణీంద్రరావు, బొంతు నరసింహరావు, కవి భార్గవ, కొత్తపల్లి దుర్గారావు తదితరులు వారిపై ఒక్కసారాగా దాడిచేశారు. కర్రలు, ఆయుధాలతో తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో ఘంటా వెంకటసుబ్రహ్మణ్యం, బొంతు రమేష్, ఈలప్రోలు ధర్మరాజు తలలకు బలమైన గాయాలై తీవ్ర రక్తస్రావమైంది. కొత్తపల్లి గురువిష్ణుకు చెయ్యి విరగ్గా, కొత్తపల్లి హేమంత్‌కు తీవ్రగాయాలయ్యాయి. గాయపడినవారిని స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారు అక్కడ చికిత్స పొందుతున్నారు. రాజకీయకక్షల నేపథ్యంలో తమను హత్యచేసేందుకు ప్రయత్నించారని బాధితులు పేర్కొన్నారు. ఈ దాడిపై దర్యాప్తు చేస్తున్నట్లు ద్వారకాతిరుమల ఎస్ఐ టి.సుధీర్ తెలిపారు. -
బావా కలవాలని ఉంది.. అని మెసేజ్ పెట్టి
కొమరం భీమ్: తన కూతుర్ని ప్రేమించాడనే కోపంతో ఓ యువకుడిని హతమార్చేందుకు యత్నించాడు ఆ యువతి తండ్రి. ఈ ఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కౌటాల మండలంలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు, బాధితుడి కథనం ప్రకారం.. గుండాయిపేట గ్రామానికి చెందిన ఎల్ములే గణపతి, వనిత దంపతుల చిన్న కుమారుడు ఎల్ములే సాయిరాం కౌటాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. గ్రామంలోని సమీప బంధువు, పదో తరగతి చదువుతున్న నాగపూరి శంకర్ కూతురు, సాయిరాం ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం అమ్మాయి ఇంట్లో తెలిసింది. బావా కలవాలని ఉంది..అని మెసేజ్ పెట్టి సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ‘బావా నిన్ను కలవాలని ఉంది’అని సాయిరాం ఫోన్‌కు యువతి ఫోన్ నుంచి మెసేజ్ వచ్చింది. దీంతో సాయిరాం రాత్రి సమయంలో గ్రామంలోని ఓ షాప్ వద్దకు వచ్చాడు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు వచ్చి మత్తు మందు కర్చిప్‌తో నోటిని ముసివేయడంతో సాయిరాం స్పృహ కోల్పోయాడు. అనంతరం పొలాల్లోకి తీసుకెళ్లి తీ వ్రంగా కొట్టారు. తర్వాత గ్రామ శివారులోని వ్యవ సాయ బావిలో పడేశారు. కాసేపు అక్కడే ఉండి.. చనిపోయాడని భావించి వెళ్లిపోయారు. బావిలో తక్కువ నీరు ఉండడంతో సాయిరాం నీటిలో మునగలేదు. రాత్రి 2 గంటల ప్రాంతంలో యువకుడికి మెలకువ రావడంతో ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులు వెంటనే కౌటాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సాయిరాం తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుండాయిపేట్ గ్రామానికి చెందిన నాగపూరి శంకర్, నాగపూరి పంకజ్, నాగపూరి సందీప్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు కౌటాల ఎస్సై మధుకర్ తెలిపారు. -
కాల్చిన కొడవలితో దాడి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కొడవలితో భార్యపై భర్త హత్యాయత్నం చేసిన ఘ టన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బుధవారం జరిగింది. కాల్చిన కొడవలితో దాడి చేయడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఒగ్గు నిర్మల(35), మల్లేశ్ దంపతుల మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. హమాలీ పనిచేసే మల్లేశ్.. వచ్చిన డబ్బులతో మద్యం తాగి రోజూ భార్యను కొడుతున్నాడు. బుధవారం ఉదయం బయటకు వెళ్లి ఇంటికొచ్చిన మల్లేశ్.. కొడవలిని కాల్చి పెట్టుకున్నాడు. పిల్లలు పాఠశాలకు వెళ్లగా నిర్మల ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇదే అదనుగా భావించిన మల్లేశ్ కాల్చిన కొడవలితో నిర్మల మెడ వెనుక భాగంలో పొడిచాడు. ఆమె కేకలు వేయడంతో ఇరుగుపొరుగు రావడం చూసి మల్లేశ్ పరారయ్యాడు. కుటుంబ సభ్యులు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స చేసి కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. కొడవలిని కాల్చడంతో శరీరం లోపలి భాగాలకు తీవ్ర గాయాలు అయ్యి ఉండొచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. కొడవలిని మెడ నుంచి తొలగించేందుకు ప్ర యత్నం చేస్తున్నారు. పరిస్థితి విషమంగానే ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. మల్లేశ్.. పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. -
కోడి దొంగతనంపై గొడవ..హత్యాయత్నం.. అత్యాచారం కేసులో 10 ఏళ్ల జైలు
అమలాపురం టౌన్: భార్యాభర్తలపై హత్యాయత్నం చేయడమే కాకుండా భార్యపై అత్యాచారం చేసిన నేరం రుజువు కావడంతో పి.గన్నవరం మండలం ఊడిమూడి శివారు చింతావారిపేటకు చెందిన పచ్చిమాల శ్రీనివాసరావుకు రాజమహేంద్రవరంలోని జిల్లా 8వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి పీఆర్ రాజీవ్ పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు చెప్పారు. ముద్దాయికి రూ.5 వేల జరిమానా కూడా విధించారు. అమలాపురం జిల్లా ఎస్పీ కార్యాలయం ఈ కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సంవత్సరం జనవరి నెలలో ఊడిమూడి శివారు చింతావారిపేటలో తమ సొంత ఇంట్లో భార్యాభర్తలు నివసిస్తున్నారు. అదే ఇంట్లో ఓ పోర్షన్లో ఉంటున్న పచ్చిమాల శ్రీనివాసరావు హత్యాయత్నం, అత్యాచారం కేసుల్లో నిందితుడు. కోడి దొంగతనంపై జరిగిన విషయమై ఆరా తీసిన భర్తపై కోపంతో పచ్చిమాల శ్రీనివాసరావు ఈ అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. తొలుత భర్త తలపై సన్నికల్లు పొత్రంతో కొట్టి తీవ్రంగా గాయపరిచి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా భార్యను కూడా తీవ్రంగా కొట్టి గాయపరిచాడు. ఇదే సందర్భంగా ఆమైపె అత్యాచారం కూడా చేశాడన్నది ముద్దాయి శ్రీనివాసరావుపై అభియోగం. అప్పట్లో ఈ కేసులకు సంబంధించి శ్రీనివాసరావుపై పి.గన్నవరం పోలీసు స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. అప్పటి డీఎస్పీ వై.మాధవరెడ్డి సమగ్ర దర్యాప్తు చేసి బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా చార్జి షీటు నమోదు చేశారు. కోర్టులో సోమవారం జరిగిన తుది విచారణలో ముద్దాయి శ్రీనివాసరావుపై మోపిన నేరాలు రుజువు కావడంతో న్యాయమూర్తి రాజీవ్ పై విధంగా తీర్పు చెప్పారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ మారిశెట్టి వెంకటేశ్వరరావు ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించారు. ప్రత్యేక పర్యవేక్షణ వల్ల ఘటన జరిగిన నాలుగు నెలల్లోనే ముద్దాయికి శిక్షలు పడ్డాయని ఎస్పీ సుసరాపు శ్రీధర్ తెలిపారు. -
చెల్లెలు, బావను హత్య చేసేందుకు ప్రయత్నం.. అన్న అరెస్ట్
మదనపల్లె : తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తిపంపకాల్లో చెల్లెలి కుటుంబానికి, తనకు ఉన్న వివాదంలో భాగంగా పథకం ప్రకారం బావను, చెల్లెలును హత్య చేసేందుకు ప్రయత్నించి విఫలమైన బావమరిదిని టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ మురళీకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లె పంచాయతీ పప్పిరెడ్డిగారిపల్లెలో నివాసం ఉంటున్న జంగాల రామకృష్ణ(55) భార్య శివకుమారికి, పుంగనూరు పట్టణం తాటిమాకులపాళ్యంకు చెందిన అన్న బండారుశంకరప్పతో ఆస్తి వివాదం ఉంది. శివకుమారికి తల్లిదండ్రుల నుంచి ఆస్తి పంపకాల్లో భాగంగా విలువైన 15 సెంట్ల స్థలం వాటాగా దక్కింది. ఈ స్థలంలో కొంత విక్రయించగా, మిగిలిన స్థలానికి సంబంధించి అన్నాచెల్లెళ్ల మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఆస్తికి సంబంధించి సరిహద్దుల విషయంలో అన్న శంకరప్పపై చెల్లెలు శివకుమారి.. ఫోర్జరీ సంతకాలతో తన ఆస్తిని ఇతరులకు విక్రయించినట్లుగా పుంగనూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. కేసులో భాగంగా బండారు శంకరప్ప అరెస్ట్ అయ్యాడు. తర్వాత విడుదలయ్యాడు. నమ్మించి.. కొంత కాలం తర్వాత ఎలాగైనా బావ రామకృష్ణ, చెల్లెలు శివకుమారిని అంతం చేసి ఆస్తిని దక్కించుకోవాలని శంకరప్ప పథకం వేశాడు. అందులో భాగంగా చెల్లెలు కుటుంబంతో మంచి మాటలు కలిపి రాకపోకలు సాగించాడు. బుధవారం పథకం ప్రకారం కత్తిని వెంటతీసుకెళ్లి ఇంట్లోనే ఇద్దరినీ హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా పుంగనూరు నుంచి చెల్లెలి ఇంటికి వచ్చాడు. అక్కడ మరికొందరు ఇంట్లో ఉండటంతో పథకం అమలు చేయడం అసాధ్యమని భావించాడు. బావ రామకృష్ణను పుంగనూరుకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్టాండులో వదలాల్సిందిగా కోరాడు. దీంతో రామకృష్ణ తన స్కూటీపై శంకరప్పను వెనుక కూర్చోబెట్టుకుని ఆర్టీసీ బస్టాండు వద్దకు వచ్చాడు. ఇన్‌గేట్ సమీపంలోకి రాగానే కరెంటు పోవడంతో వెంటనే శంకరప్ప తన వెంట తెచ్చుకున్న కత్తితో రామకృష్ణ గొంతుకోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు వెంటనే అప్రమత్తం కావడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. టూటౌన్ పోలీసులకు సమాచారం అందడంతో బాధితుడ్ని జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లి, మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. కేసులో నిందితుడైన శంకరప్ప గురువారం మదనపల్లె పట్టణంలోని ఎస్టేట్ బస్టాప్ వద్ద ఉండగా, టూటౌన్ ఎస్ఐ లోకేష్‌రెడ్డి సిబ్బందితో కలిసి అరెస్ట్ చేశాడు. నిందితుని వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తపుమరకల షర్టు, రూ.150 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్ కోసం కోర్టుకు హాజరుపరిచినట్లు సీఐ మురళీకృష్ణ తెలిపారు. ఆస్తులకు సంబంధించిన విషయాల్లో గొడవలు, హత్యలకు, హత్యాయత్నాలకు పాల్పడినా, శాంతిభద్రతలకు భంగం కలిగించినా వారిపై రౌడీషీట్ ఓపెన్ చేసి పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. బండారు శంకరప్పపై రౌడీషీట్ ఓపెన్ చేస్తున్నట్లు చెప్పారు. -
బాటిళ్లతో యువకుడి గొంతు కోసి పరారైన దుండగులు
సాక్షి, హైదరాబాద్: శేరిలింగంపల్లి లింక్‌రోడ్ వద్ద ఓ యువకునిపై హత్యాయత్నం కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు బాటిళ్లతో ఓ యువకుడి గొంతు కోసి పరారయ్యారు. యువకుడి కేకలు విని స్థానికులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో దుండగులు పరారయ్యారు. తీవ్ర రక్తస్రావం అయిన యువకుడి పరిస్థితి విషమం ఉండటంతో వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న చందానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
సినిమా స్టోరీని తలపించే మోసాలు, ఆఖరికి తల్లిదండ్రులను కూడా
కోల్‌కతా: ఒంటిపై మడత నలగని సూటు, బూటు. ఐఏఎస్ అధికారిగా దర్పం. నీలి బుగ్గకారులో ప్రయాణం. ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో పరిచయాలు. ప్రజా సేవకుడిగా ఫోజులు. మున్సిపల్ కార్పొరేషన్లో కీలక అధికారినంటూ జనాన్ని మభ్యపెట్టడం. ప్రజల్లో ‘గుర్తింపు’కోసం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఓ మోసగాడు సాగించిన లీలలు ఇవీ. సొంత డబ్బులతో ఉత్తుత్తి కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలు నిర్వహించి, చివరికి పోలీసులకు దొరికిపోయాడు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడాడంటూ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. సదరు మాయగాడు ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు. పశ్చిమ బెంగాల్‌లోని సీల్దా ప్రాంతానికి చెందిన దేవాంజన్ దేవ్ వయసు కేవలం 28 సంవత్సరాలు. అయితేనేం మోసాల్లో ఆరితేరిపోయాడు. అతడి తండ్రి మనోరంజన్ దేవ్ బెంగాల్ ఎక్సైజ్ శాఖలో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేసి, పదవీ విరమణ పొందారు. దేవాంజన్ చారుచంద్ర కాలేజీలో జువాలజీ సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. కలకత్తా యూనివర్సిటీలో జెనటిక్స్లో పీజీ చదవడానికి ప్రవేశం పొందాడు. కానీ, చదువు మధ్యలోనే అటకెక్కింది. 2014లో సివిల్ సర్వీసెస్ పరీక్ష రాశాడు. ప్రిలిమినరీ పరీక్షలోనే విజయం సాధించలేకపోయాడు. అయినప్పటికీ పరీక్షల్లో నెగ్గానని తన తల్లిదండ్రులను నమ్మించాడు. ఐఏఎస్ అధికారిగా ట్రైనింగ్ కోసం ముస్సోరి వెళ్తున్నానని చెప్పాడు. కానీ, ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలో చేరాడు. ఆ సమయంలో కొన్ని పాటల ఆల్బమ్‌లు రూపొందించాడు. 2017లో ఇంటికి తిరిగివచ్చాడు. ట్రైనింగ్ పూర్తయ్యిందని చెప్పాడు. రాష్ట్ర సచివాలయంలో తనకు ఉద్యోగం వచ్చిందని బుకాయించాడు. అప్పటి నుంచి మోసాలే వృత్తిగా జీవనం సాగించాడు. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ అధికారినంటూ నకిలీ లెటర్హెడ్లు, గుర్తింపు కార్డులు సృష్టించాడు. కార్పొరేషన్ ఈ–మెయిళ్లను పోలిన ఈ–మెయిళ్లు సైతం రూపొందించుకున్నాడు. పోర్జరీ పత్రాలతో బ్యాంకు ఖాతాలు తెరిచాడు. అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ పేరిట ఓ కంపెనీ స్థాపించాడు. కోల్‌కతాలోని కస్బా ప్రాంతంలో ఆఫీసు ప్రారంభించాడు. తాను పెద్ద అధికారినని, ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ జనానికి చెప్పేవాడు. దీంతో ఇరుగు పొరుగు, బంధుమిత్రులు గొప్పగా చూడసాగారు. దేవాంజన్కు అమితమైన గౌరవం ఇచ్చారు. మోసాన్ని పసిగట్టిన మిమీ చక్రవర్తి 2020లో కరోనా వైరస్ వ్యాప్తిని దేవాంజన్ దేవ్ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. శానిటైజర్లు, మాస్కులు, పీపీఈ కిట్లు, గ్లౌజ్‌లు సేకరించి, ప్రముఖుల చేతుల మీదుగా ప్రజలకు పంపిణీ చేశాడు. ఈ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశాడు. దీంతో అతడికి మరింత ప్రచారం లభించింది. దేవాంజన్ ఇటీవల సొంత డబ్బులతో కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలు నిర్వహించాడు. వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామంటూ ప్రచారం సాగించాడు. ఓ వ్యాక్సినేషన్ కేంద్రానికి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, సినీ నటి మిమీ చక్రవర్తిని ఆహ్వానించాడు. ఆమె నకిలీ టీకా తీసుకొని మోసపోయింది. అనారోగ్యానికి గురైంది కూడా. దాంతో ఆమెకు అనుమానం వచ్చింది. కోల్‌కతా మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసింది. అధికారులు రంగంలోకి దిగారు. దేవాంజన్ గుట్టును రట్టు చేశారు. అతడు నిర్వహించే వ్యాక్సినేషన్ కేంద్రాల్లో అసలైన కరోనా టీకాలకు బదులు అమికాసిన్ అనే యాంటీబయాటిక్ ఇస్తున్నట్లు గుర్తించారు. దాదాపు 2,000 మందికి ఈ ఇంజెక్షన్లు ఇచ్చినట్లు తేల్చారు. పోలీసులు అతడిపై హత్యాయత్నం కేసు పెట్టారు. -
గ్యాంగ్‌వార్.. రౌడీషీటర్‌పై హత్యాయత్నం
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. కాలాపత్తర్ లో పాత కక్షల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. రెండు వర్గాలు కత్తులతో దాడులు చేసుకున్నారు. రౌడీషీటర్ షానుర్పై ప్రత్యర్థి వర్గం మరణాయుధాలతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో షానూర్కు తీవ్రగాయాలు కాగా, ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. షానూర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. వర్గ ఆధిపత్యం, పాత తగాదాలే దాడులకు కారణమని పోలీసులు భాస్తున్నారు ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. షానూర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
పెట్రోలు పోసి..నిప్పంటించబోయి..
గాజువాక: కట్టుకున్న భార్యను, కన్న పిల్లలను కడతేర్చడానికి ప్రయత్నించాడొక శాడిస్టు. అర్ధ రాత్రి వారు నిద్రిస్తున్న సమయంలో పెట్రోలు పోసి హత్య చేయడానికి ప్రయ త్నించిన ఘటన గాజువాకలో కలకలం రేపింది. స్థానిక నేతాజీ కాలనీలో చోటు చేసుకున్న ఈ సంఘటనపై బాధితురాలు, గాజువాక పోలీసు లు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కార్పెంటర్‌గా పని చేస్తు న్న గంగవరం గ్రామ నివాసి కొప్పనాతి దుర్గా రావుతో తుంగ్లాం గ్రామానికి చెందిన చిన్నికి పద్నాలుగేళ్ల కిందట వివాహమైంది. వారికి కుమారుడు నిఖిల్, కుమార్తె లేహ్యా ఉన్నారు. వివాహమైనప్పట్నుంచీ చిన్నిని వేధిస్తున్నాడు. దీంతో ఆమె కొన్నేళ్లుగా భర్తకు దూరంగా ఉంటోంది. నేతాజీ కాలనీలోని తన సోదరి పల్లవి ఇంట్లో తలదాచుకుంటోంది. దుర్గారావు అక్కడి కి కూడా వెళ్లి వేధిస్తుండడంతో పలుమార్లు పోలీసులను ఆశ్రయించింది. వారు స్టేషన్‌కు పిలిపించి సర్దిచెప్పి పంపించేవారు. అయినప్పటికీ అతడిలో మార్పు లేకపోవడంతో వారి మధ్య గొడవలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం కూడా నేతాజీ కాలనీలోని ఆమె నివసిస్తున్న ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. అర్ధరాత్రి సమయంలో ఆ ఇంటి బయట గడియను పెట్టేశాడు. చిన్ని, ఆమె పిల్లలు నిద్రిస్తున్న గదికి నిప్పంటించడం కోసం కిటికీలోంచి పెట్రోలు పోశాడు. తనతో కాపురానికి రాకపోతే నిప్పు పెట్టేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. వారి మధ్య ఘర్షణ కారణంగా చుట్టు పక్కలవారు బయటకు రావడాన్ని గమనించిన దుర్గారావు అక్కడ్నుంచి పరారయ్యాడు. ప్రాణాలతో బయటపడ్డ చిన్ని ఆదివారం తన పిల్లలతో కలిసి గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమకు ప్రాణరక్షణ కల్పించాలని పోలీసులను వేడుకుంది. ఈ ఘటనపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చిన్ని ఇంటి పక్కనే ఉన్న ఓ చర్చిలో డిష్ టీవీ యాంటీనా, వాటర్ పైప్‌లైన్‌ను కూడా దుర్గారావు ధ్వంసం చేసినట్టు స్థానికులు తెలిపారు. కేసును గాజువాక ఎస్ఐ రమేష్ దర్యాప్తు చేస్తున్నారు. -
బాకీ తీర్చమన్నందుకు..
ఒంగోలు: బాకీ తీరుస్తామంటూ ఓ మహిళను మామ, అల్లుడు నమ్మకంగా నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన స్థానిక రామ్‌నగర్ పదో లైనులో రైల్వేట్రాక్ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. షేక్ లక్ష్మిది తాళ్లూరు మండలం కొత్తపాలెం. ఈమె కొన్నాళ్ల క్రితం అదే మండలం మన్నేపల్లికి చెందిన లక్కుల వెంకారెడ్డికి రూ.4 లక్షలు అప్పు ఇచ్చింది. ఏళ్లు గడుస్తున్నా ఆయన బాకీ తీర్చలేదు. అంతేకాకుండా అతడు స్వగ్రామంలో కాకుండా తన మామగారి ఊరైన చినగంజాం మండలం రాజుబంగారుపాలెంలో నివాసం ఉంటున్నాడు. విషయం తెలుసుకున్న లక్ష్మి.. నేరుగా అక్కడకు వెళ్లి తన బాకీ తీర్చాలని వెంకారెడ్డిని కోరింది. అతడి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. కోర్టులో కేసు మంగళవారం విచారణకు వచ్చింది. బాధితురాలు లక్ష్మి కోర్టుకు హాజరైంది. తమతో వస్తే బాకీ డబ్బులు ఇస్తామంటూ వెంకారెడ్డి, అతని మామ మంచాల వెంకటేశ్వరరెడ్డి అలియాస్ బాబుల్‌రెడ్డిలు ఆమెను నమ్మబలికారు. ఇద్దరూ కలిసి రాత్రి 7 గంటల సమయంలో ఆమెను రామ్‌నగర్ పదో లైనులోని రైల్వేట్రాక్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై ఇనుపరాడ్డు, బండరాయితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆమె చున్నీతో మెడకు బిగించారు. చనిపోయిందని భావించి అక్కడి నుంచి పరారయ్యారు. రాత్రి 11 గంటల సమయంలో ఆ దారిన వెళ్తున్న ఓ వ్యక్తికి తీవ్ర గాయాలతో లక్ష్మి కనిపించింది. అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితురాలిని చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు. డబ్బులు ఇస్తామంటూ నమ్మకంగా తీసుకెళ్లి హత్య చేయాలని పథకం పన్నిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
హత్యాయత్నం చేసిన యువతికి ఐదేళ్ల జైలు శిక్ష
బంజారాహిల్స్: తాను ప్రేమిస్తున్న యువకుడిని తమ బంధువుల అమ్మాయే పెళ్లి చేసుకుంటుందన్న అక్కసుతో ఆమెపై హత్యాయత్నం చేసిన యువతికి న్యాయమూర్తి ఐదేళ్ల జైలుశిక్షతోపాటు రూ.2 వేల జరిమానా విధించారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం దీక్షకుంట్ల గ్రామానికి చెందిన పల్లకొండ మమత (27)కు వర్దన్నపేట మండలం ఐలోను గ్రామానికి చెందిన పల్లకొండ దివ్యశ్రీ(23) దగ్గరి బంధువు. 2013 మార్చి 9వ తేదీన దివ్యశ్రీకి వరంగల్ వాసి కుమార్(32)తో నిశ్చితార్ధం జరిగింది. అదే ఏడాది జూన్ 13వ తేదీన వీరి పెళ్లిని నిశ్చయించారు. అయితే మమతకు కుమార్‌తో అప్పటికే ప్రేమ వ్యవహారం నడుస్తోంది. దీంతో కుమార్, దివ్యశ్రీ పెళ్లిని మమత జీర్ణించుకోలేకపోయింది. దీంతో ఆమె దివ్యశ్రీని అడ్డుతొలగించుకోవాలని పథకం వేసింది. కుమార్ ప్రవర్తన మంచిది కాదని.. అతడు మరో అమ్మాయిని ప్రేమించి హైదరాబాద్‌లో పెళ్లి చేసుకుంటున్నాడని దివ్యశ్రీని నమ్మించింది. కావాలంటే చూపిస్తానంటూ ఆమెను 2013 మే 4వ తేదీన శ్రీకృష్ణానగర్‌లో నివసించే తన సోదరి స్వరూప ఇంటికి తీసుకొచ్చింది. కూరగాయలు కోసే కత్తితో విచక్షణారహితంగా పొడిచింది. ‘నేను ప్రేమిస్తున్న కుమార్‌ను పెళ్లి చేసుకుంటావా...? అతడిని నీకు దక్కనివ్వను’ అంటూ 9 చోట్ల గాయపరిచింది. దివ్యశ్రీ తన ఫోన్‌తో కుమార్‌కు, తన తండ్రి సారయ్యకు విషయాన్ని తెలిపింది. దీంతో వారు సమీపంలోనే ఉంటున్న తమ బంధువులను సంఘటనా స్థలానికి పంపించి దివ్యశ్రీని ఆసుపత్రికి తరలించారు. దివ్యను చంపేయటం, కుదరకుంటే అందవికారంగా చేయడం లక్ష్యంగా పెట్టుకున్న మమతపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 307కింద హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు రుజువు కావడంతో మంగళవారం నిందితురాలు మమతకు న్యాయమూర్తి ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.2వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.