చంద్రబాబు సహా 20 మందిపై కుట్ర, హత్యాయత్నం కేసు
దర్యాప్తు చేయకుండా ఫిర్యాదుదారుడికి ఆర్‌సీఎస్ నోటీసు
గత నెల 25న నోటీసు జారీ చేస్తే తాజాగా అందించి బలవంతంగా సంతకాలు
కోర్టును ఆశ్రయించకుండా పోలీస్ మార్కు ఎత్తుగడ
బి.కొత్తకోట: రాజు తలచుకుంటే జరగనిది ఏముంది? మరి కేసే రాజుదైతే లెక్కేముంది? అధికారం చంద్రబాబుదైతే కేసు మూసివేతకు అడ్డు ఏముంది? అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ముదివేడు పోలీస్‌స్టేషన్‌లో 2023 అగస్టులో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు సహా 20 మంది టీడీపీ నేతలపై నమోదైన కేసును నీరుగార్చి అధికారికంగా మూసివేసేందుకు రంగం సిద్ధమైంది. కుట్ర, హత్యాయత్నం లాంటి తీవ్రమైన సెక్షన్లు నమోదైన ఈ కేసులో దర్యాప్తును ముందుకు తీసుకెళ్లకపోగా అసలు ఫిర్యాదే తప్పు అని ఖాకీలు తాజాగా తేల్చేశారు.
దీనిపై పైస్థాయి నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిళ్లతో మదనపల్లె డీఎస్పీ జారీ చేసిన నోటీసును రూరల్ సీఐ ఆదివారం ఫిర్యాదుదారుడికి అందజేశారు. ప్రాజెక్టుల సందర్శన పేరుతో నాడు అంగళ్లుకు వచ్చిన చంద్రబాబు పోలీసులను తీవ్రంగా తూలనాడటంతోపాటు రైతులపై సైతం దాడులకు టీడీపీ శ్రేణులను పురిగొల్పారు. దీనిపై ఫిర్యాదుదారుడు సమరి్పంచిన ఆధారాలను కనీసం పట్టించుకోని పోలీసు అధికారులు తాజాగా ఏకంగా కేసే లేకుండా మూసివేసేందుకు సిద్ధమయ్యారు.
ఆ రోజు జరిగింది ఇదీ..
ముదివేడు సమీపంలో రూ.750 కోట్లతో నిరి్మస్తున్న రిజర్వాయర్‌పై చంద్రబాబు ఎన్‌జీటీలో కేసు వేయించి టీడీపీ నేతల ద్వారా అడ్డుకోవడంతో పనులు ఆగిపోయాయి. దీనిపై మార్కెట్ కమిటీ చైర్మన్ డీఆర్.ఉమాపతి, రైతులు, వైఎస్సార్‌సీపీకి చెందిన కొందరు నాడు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపి చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే చంద్రబాబు అంగళ్లు కూడలి వద్ద వారిని వేలెత్తి చూపిస్తూ ఉసిగొల్పడంతో టీడీపీ మూకలు విరుచుకుపడ్డాయి. రాళ్లు, ఇటుకలు, కట్టెలు, చెప్పులు, రాడ్లతో మూకుమ్మడిగా దాడి చేయడంతో వైఎస్సార్‌సీపీకి చెందిన వసంతరెడ్డి, అర్జున్‌రెడ్డి, విలేకరి శ్రీనివాసులు, మహే‹Ù, ముదివేడు పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ కేశవ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఉమాపతి ఆడియో, వీడియో సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేయడంతో ఆగస్టు 8న చంద్రబాబు సహా 20 మంది టీడీపీ నేతలు, ఇతరులపై 120బి, 147, 148, 153, 307, 115, 109, 323, 324, 506, రెడ్‌విత్ 149 ఐపీసీ సెక్షన్లు కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజాగా ఆర్‌సీఎస్ నోటీసు
చంద్రబాబు సీఎం కావడంతో ఆయనపై నమోదైన కేసును నీరుగార్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా చంద్రబాబుపై నమోదైన క్రైమ్ నంబర్ 79/2023 తప్పుడు కేసుగా తేల్చేసి ఫిర్యాదుదారుడిని ఆదివారం పోలీస్‌స్టేషన్‌కు రప్పించి రెఫర్డ్ కేసు సమన్స్ (ఆర్‌సీఎస్) అందచేశారు. పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే నోటీసు అందుకున్న వారం రోజుల్లో సంబంధిత కోర్టును ఆశ్రయించవచ్చని అందులో ఉంది. అయితే నోటీసును డీఎస్పీ గత నెల 25న జారీ చేస్తే ఫిర్యాదుదారుడికి ఆదివారం అందచేయడం గమనార్హం. గడువు ముగిశాక నోటీసు అందించడం ద్వారా కోర్టును ఆశ్రయించే అవకాశం లేకుండా చేయాలని కుట్రపూరితంగా వ్యహరించినట్లు స్పష్టమవుతోంది. అయితే ఫిర్యాదుదారుడు ఉమాపతి తాను నోటీసు అందుకున్న తేదీని ప్రస్తావిస్తూ కాగితాలపై సంతకం చేయడంతో పోలీసుల పాచిక పారలేదు.
బలవంతంగా నాతో సంతకం
ముదివేడులో ఉన్న నన్ను ఆరుగురు పోలీసులు ఓ నిందితుడి మాదిరిగా మదనపల్లె రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టారని, నోటీసు తీసుకుని సంతకం చేయాలని నన్ను బలవంతం చేశారు. కేసు రాజీకి ఒప్పుకోనని చెప్పినా పట్టుపట్టి సంతకం పెట్టించుకున్నారు. రైతులకు ద్రోహం చేయడం వల్లే ఆ రోజు చంద్రబాబును ప్రశి్నంచేందుకు అంగళ్లు వచ్చాం. రైతులమైన మాపై టీడీపీ శ్రేణులు రాళ్లు, రాడ్లతో దాడులు చేశాయి. పోలీసుల ఒత్తిళ్లకు తలొగ్గేది లేదు. ఈ కేసులో రాజీ పడేది లేదు. కచ్చితంగా కోర్టును అశ్రయిస్తా. – డీఆర్.ఉమాపతి, అంగళ్లు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment