
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. కాలాపత్తర్ లో పాత కక్షల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. రెండు వర్గాలు కత్తులతో దాడులు చేసుకున్నారు. రౌడీషీటర్ షానుర్‌పై ప్రత్యర్థి వర్గం మరణాయుధాలతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో షానూర్‌కు తీవ్రగాయాలు కాగా, ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. షానూర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. వర్గ ఆధిపత్యం, పాత తగాదాలే దాడులకు కారణమని పోలీసులు భాస్తున్నారు ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. షానూర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment