![Rowdy Sheeter Sarver Assassinated At Rajendra Nagar - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/14/Rowdy-Sheeter.jpg.webp?itok=MdCgmpfB)
సాక్షి, రంగారెడ్డి: రాజేంద్రనగర్‌లో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. డైరీ ఫామ్ వద్ద ఓ నిర్మానుష్య ప్రాంతంలో రౌడీ షీటర్ సర్వర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. పథకం ప్రకారం సర్వర్‌ను నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లిన దుండగులు కత్తులతో పొడిచి చంపారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటానికి స్థలానికి చేరుకొని హత్య తీరును పరిశీలించారు.కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నాయి. పాతకక్షల నేపథ్యంలో సర్వర్‌ను దుండగులు చంపినట్లు తెలుస్తోంది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment