సాక్షి, హైదరాబాద్: మీర్‌పేటలో దారుణం జరిగింది. డీఆర్‌డీవో కాంట్రాక్ట్ ఉద్యోగి గురుమూర్తి.. అనుమానంతో భార్యను కిరాతకంగా చంపేశారు. భార్య వెంకట మాధవిని చంపి ముక్కలుగా నరికి కుక్కర్‌లో ఉడకబెట్టిన భర్త.. ఉండకబెట్టిన మాంసాన్ని చెరువులో పడేశారు.
ఈ నెల 13వ తేదీ నుంచి వెంకట మాధవి కనిపించకుండా పోయింది. ఈ నెల 18న తన భార్య వెంకటమాధవి కనిపించడం లేదంటూ ఆమె తల్లిదండ్రులతో కలిసి భర్త గురుమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కమర్షియల్ సిలిండర్ తీసుకొచ్చి ముక్కలను ఉడకబెట్టిన భర్త.. ముక్కలను ఎండబెట్టి రోకలితో పొడిగా మార్చాడు. తర్వాత మృతదేహం పొడిని చెరువులో కలిపాడు. మూడు రోజుల పాటు ఇంట్లో మృతదేహాన్ని కాల్చివేసి పొడిగా మార్చేశాడు. బాడీ మొత్తాన్ని పొడిగా మార్చడంతో ఆనవాళ్లు దొరకలేదు.
గురుమూర్తి గతంలో ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. 13 ఏళ్ల క్రితం వెంకటమాధవితో గురుమూర్తికి వివాహం జరిగింది. వారికి ఇద్దరు సంతానం. తూప్రాన్‌పేట్‌లోని దండుపల్లిలో నివాసముంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని గుర్తించారు.
దీంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు నిజం వెలుగులోకి వచ్చింది. తానే భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్‌లో ఉడికించానని, ఆ తర్వాత వాటిని జిల్లెలగూడ చెరువులో పడేసినట్టు తెలిపాడు. దీంతో మృతదేహం ఆనవాళ్ల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
ఇదీ చదవండి: ఓసారి మా ఇంటికొచ్చి.. టీ తాగి వెళ్లండి!
Comments
Please login to add a commentAdd a comment