Meerpet
-
చెల్లింపుతో చిక్కాడు
రాచకొండ పోలీసుస్టేషన్ పరిధిలోని మీర్‌పేటలో వెలుగులోకి వచ్చిన ‘చంపేసి.. ఉడకబెట్టిన’ కేసు సంచలనం సృష్టించింది. ఇంత దారుణంగా కాకున్నా, హైదరాబాద్‌లో దాదాపు ఏడాదిన్నర క్రితం అనురాధ అనే నర్సు హత్యకు గురైంది. ఆమె శరీరాన్ని ముక్కలు చేసిన నిందితుడు చంద్రమోహన్ ఫ్రిజ్‌లో దాచి పెట్టాడు. మూసీ నది సమీపంలో దొరికిన హతురాలి తలతో మొదలైన ఈ కేసు దర్యాప్తు కొలిక్కి రావడానికి ఓ యూపీఐ పేమెంట్ కీలక ఆధారమైంది. చైతన్యపురి ప్రాంతంలో నివసించే బి.చంద్రమోహన్ అవివాహితుడు. వడ్డీ వ్యాపారంతో పాటు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతుండేవాడు. తల్లితో కలిసి సొంత ఇంటి మొదటి అంతస్తులో నివసించేవాడు. ఇతడి తండ్రికి 2007లో ఒక ఆస్పత్రిలో బైపాస్ సర్జరీ జరిగింది. అప్పట్లో ఆస్పత్రి తరఫున సేవలు చేయడానికి హెడ్ నర్సు వై. అనురాధారెడ్డి ఇంటికి వచ్చేది. చంద్రమోహన్‌కు ఆమెతో పరిచయం ఏర్పడింది. తండ్రి 2009లో చనిపోయినప్పటికీ వీరి పరిచయం కొనసాగి, సన్నిహితంగా మారారు. చంద్రమోహన్ 2021లో అనురాధను తన ఇంటి కింద ఉన్న ఒక పోర్షన్లోకి తీసుకువచ్చాడు. అనురాధ, చంద్రమోహన్ 15 ఏళ్లు సన్నిహితంగా మెలిగారు. అతగాడు ఆమె నుంచి దాదాపు 20 తులాల బంగారం, రూ.8 లక్షల నగదు తీసుకున్నాడు. కొన్నేళ్ల క్రితమే భర్త నుంచి విడాకులు తీసుకున్న అనురాధ రెండో వివాహం చేసుకోవాలని 2023లో భావించింది. దీంతో తన వద్ద తీసుకున్న బంగారం, నగదు తిరిగి ఇవ్వాల్సిందిగా చంద్ర మోహన్‌పై ఒత్తిడి చేసింది. ఆమె వివాహ ప్రయత్నాలు తెలుసుకున్న చంద్రమోహన్, అదే జరిగితే అనురాధ తనకు దూరం అవుతుందని, అప్పటికే ఆమె వద్ద తీసుకున్న నగదు, బంగారం తిరిగి ఇవ్వాల్సి వస్తుందని భావించాడు. దీంతో అనురాధను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. 2023 మే నెలలో వేసవి సెలవుల నేపథ్యంలో చంద్రమోహన్ ఇంటి కింది భాగంలో ఉన్న మరో పోర్షన్లో ఉండే కుటుంబం ఊరికి వెళ్లింది. అక్కడే ఉన్న మరో పోర్షన్లో నివసించే అనురాధను హత్య చేయడానికి అదే సరైన సమయమని చంద్రమోహన్ భావించాడు. ఆ నెల 12న మధ్యాహ్నం ఆమె వద్దకు వెళ్లి, గొడవకు దిగాడు. ఇంట్లో ఉన్న కత్తితో దాడి చేసి చంపేశాడు. మృతదేహాన్ని అక్కడే ఉంచి, ఎలా మాయం చేయాలనే అంశంపై తన స్మార్ట్‌ఫోన్ ద్వారా యూట్యూబ్‌లో సెర్చ్ చేశాడు. మృతదేహం వాసన బయటకు రాకుండా ఏం చేయాలనేది వెతికాడు. అందులో చూపించిన వీడియోలను ఆధారంగా చేసుకుని, అప్పటికప్పుడు రెండు చిన్న సైజు స్టోన్ కట్టర్లు, నాలుగు మటన్ కత్తులు, దాదాపు 40 వరకు ఫినాయిల్, డెట్టాల్, వివిధ కెమికల్స్ బాటిళ్లు, అగరుబత్తీలు, అత్తర్లు, కర్పూరం తదితరాలు కొనుక్కుని వచ్చాడు. కట్టర్లతో మొండెం నుంచి తల, కాళ్లు, చేతులు వేరు చేస్తూ అనురాధ శరీరాన్ని ఆరు ముక్కలు చేశాడు. కాళ్లు, చేతులు, తల ఫ్రిజ్‌లో, మొండాన్ని ఓ పెట్టెలో పెట్టి మూడు రోజులు గదిలోనే ఉంచాడు. హతురాలి సెల్‌ఫోన్‌ను తన వద్దే ఉంచుకున్న చంద్రమోహన్ దాంతో ఆస్ట్రేలియాలో ఉండే ఆమె కుమార్తెతో అనురాధ మాదిరిగా చాటింగ్ చేస్తూ వచ్చాడు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం తన ఇంటి నుంచి కింద ఉన్న అనురాధ పోర్షన్లోకి వస్తున్న చంద్రమోహన్ మృతదేహం ముక్కల మీద ఫినాయిల్, డెట్టాల్, కర్పూరం తదితరాలు చల్లి వెళ్లేవాడు. ఇంట్లో రక్తం వాసన తెలియకుండా అగరుబత్తీలు, అత్తర్లు వినియోగించాడు. ఇలా దాదాపు 13 రోజుల పాటు వాసన ఆ గది కూడా దాటకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో ఈ మృతదేహం విషయం పక్కింటి వాళ్లకు, పైనే ఉన్న చంద్రమోహన్ తల్లికీ తెలియలేదు. ఓ దశలో చంద్రమోహన్ దఫదఫాలుగా మృతదేహం భాగాలను బయట పారేయాలని భావించాడు. అనూరాధ తలను చెత్త కవర్లో పెట్టుకుని వెళ్లి, 2023 మే 15 రాత్రి మూసీ సమీపంలో పడేశాడు. పారిశుద్ధ్య కార్మికులు మే 17న ఉదయం దీనిని గమనించి, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మలక్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తల దొరికిన ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఆ ప్రాంతానికి దాదాపు 300 మీటర్ల దూరంలో ఉన్న దానిపై ఆధారపడ్డారు. 2023 మే 16వ తేదీ ఫీడ్ పరిశీలించినా ఎలాంటి ఆధారం లభించలేదు. దీంతో 15వ తేదీకి సంబంధించింది చూస్తుండగా, ఓ వ్యక్తి ఆటోలో వచ్చి కవర్‌ను ఆ ప్రాంతంలో పారేస్తున్నట్లు కనిపించింది. అక్కడ నుంచి ఒక్కో కెమెరాలో అతడి కదలికలు గమనిస్తూ పోయారు. తల దొరికిన ప్రాంతం నుంచి దాదాపు కిలోమీటరు ప్రయాణించిన చంద్రమోహన్ అక్కడి ఓ బేకరీ వద్ద ఆగాడు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా పారేయడంతో రిలాక్స్ అయ్యాడు. అక్కడే ఓ వాటర్ బాటిల్ కొనుక్కుని తాగాడు. వాటర్ బాటిల్‌కు తన ఫోన్లోని యూపీఐ యాప్ ద్వారా డబ్బు చెల్లించాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వాటిని చూసిన పోలీసులు అప్రమత్తమయ్యారు. తక్షణం ఆ బేకరీ వద్దకు చేరుకుని ఆ రోజు జరిగిన యూపీఐ లావాదేవీల డేటా సేకరించారు. సీసీ కెమెరాల్లో ఉన్న టైమ్ ఆధారంగా వాటర్ బాటిల్ ఖరీదు చేసిన వ్యక్తి చెల్లించిన లావాదేవీని గుర్తించారు. ఆ యూపీఐ యాప్‌తో అనుసంధానించి ఉన్న ఫోన్ నంబర్ తెలుసుకున్న దర్యాప్తు అధికారులు దాని ఆధారంగా చంద్రమోహన్‌ను గుర్తించి 2023 మే 24న అరెస్టు చేశారు. ఆపై కేసును హత్య జరిగిన ప్రాంతం జ్యురీస్‌డిక్షన్ ఆధారంగా చైతన్యపురి ఠాణాకు బదిలీ చేశారు. -
హైదరాబాద్ మీర్ పేట్ మాధవి హత్య కేసులో మరో సంచలనం
-
మీర్పేట్ మాధవి హత్య కేసులో మరో సంచలనం
సాక్షి, హైదరాబాద్: మీర్పేట్ మాధవి హత్య కేసులో మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. వెంకట మాధవిని గురుమూర్తి ఒక్కడే చంపలేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భర్తతో కలిసి మరో ముగ్గురు హత్య చేసి ఉంటారనే అనుమానాలున్నాయి. ఆ ముగ్గురిలో ఒక మహిళ ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్యకు సహకరించిన వారి వివరాలు సేకరించే పనిలో పోలీసులు పడ్డారు. అవసరమైతే గురుమూర్తికి పాలీగ్రాఫ్ టెస్ట్‌లు నిర్వహించే యోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం.ఈ కేసులో నిందితుడు గురుమూర్తిని పోలీసులు శనివారం కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే అతడిని రిమాండ్ చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మీర్‌పేట పోలీసులు కస్టడీ పిటిషన్ వేసి గురుమూర్తిని విచారణ నిమిత్తం శనివారం కస్టడీలోకి తీసుకున్నారు. సరూర్‌నగర్‌లోని సీసీఎస్ లేదా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్‌కు విచారణ నిమిత్తం తరలించినట్లు తెలుస్తోంది. ఈ నెల 12 వరకు వరకు అతన్ని విచారణ చేయనున్నట్లు సమాచారం.ఏపీలోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన పుట్ట గురుమూర్తి, అదే గ్రామానికి వెంకట మాధవికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. గురుమూర్తి ఆర్మీలో జవాన్‌గా చేరి నాయక్ సుబేదార్‌గా పదవీ విరమణ పొందాడు. ప్రస్తుతం కంచన్‌బాగ్ డీఆర్డీఏలో కాంట్రాక్టు భద్రతా సిబ్బందిగా పని చేస్తున్నారు. గురుమూర్తి కొన్నాళ్లుగా తన సమీప బంధువైన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం భార్యకు తెలిసి పలుమార్లు గొడవలు జరిగినట్టు సమాచారం. ఈ క్రమంలోనే భార్య అడ్డు తొలగించుకోవాలనే క్రమంలోనే ఆమెను హత్య చేశాడు.మరోవైపు.. నిందితుడు చెప్పిన విషయాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మృతదేహాన్ని చెరువులో విసిరేసినట్లు చెబుతున్నా, అక్కడ ఇంకా ఆధారాలు లభించలేదు. శరీరం ఆనవాళ్లు లభ్యమైనా వెంకట మాధవి పిల్లల డీఎన్ఏతో పోల్చే అవకాశముంది. ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. క్లూస్‌టీం, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక కీలకం కానుంది. వెంకట మాధవి అదృశ్యంపై కేసు నమోదు చేశామని, ఆమె ఇంట్లోకి వెళ్తున్న దృశ్యాలు మాత్రమే లభ్యమైనట్లు పోలీసులు తెలిపిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: ఉన్మాదిలా మారి.. 70 సార్లు కత్తితో పొడిచి.. -
మీర్పేట్ హత్య కేసు.. గురుమూర్తికి 14 రోజుల రిమాండ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మీర్ పేట హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.. గురుమూర్తికి కోర్టు.. 14 రోజుల రిమాండ్ విధించింది. ఫిబ్రవరి 11వ తేదీ వరకు గురుమూర్తికి రిమాండ్ విధించింది. గురుమూర్తిని మీర్ పేట్ పోలీసులు.. చర్లపల్లి జైలుకు తరలించారు.ప్రకాశం జిల్లా జేపీ చెరువు గ్రామానికి చెందిన గురుమూర్తి, వెంకట మాధవి (35) దంపతులు తమ ఇద్దరు పిల్లలతో ఐదేళ్ల నుంచి జిల్లెలగూడ న్యూ వేంకటేశ్వర కాలనీలో అద్దెకు ఉంటున్నారు. గురుమూర్తి కంచన్‌బాగ్‌లోని డీఆర్డీఓలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. భార్యాభర్త మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో ఆమెను ఎలాగైనా హత్యచేయాలని పథకం వేసిన గురుమూర్తి.. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న భార్యా పిల్లలను తీసుకొని బడంగ్‌పేటలోని తన సోదరి సుజాత ఇంటికి వెళ్లాడు.పిల్లలను అక్కడే వదిలేసి అదే రాత్రి భార్యతో కలిసి తన ఇంటికి తిరిగి వచ్చేశాడు. మర్నాడు ఉదయం మళ్లీ సోదరి ఇంటికి వెళ్లి రాత్రి వరకూ అక్కడే గడిపారు. పిల్లలను మళ్లీ అక్కడే ఉంచేసి రాత్రి 10 గంటలకు ఇద్దరూ ఇంటికి వచ్చారు. పథకం ప్రకారం 16న ఉదయం 8 గంటలకు భార్యతో వాగ్వాదానికి దిగి, ఆమె తలను గోడకేసి బలంగా బాదాడు. దీంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత ఆమె గొంతు నులిమి చంపేశాడు. మృతదేహాన్ని బాత్రూమ్లోకి తీసుకెళ్లి వివస్త్రను చేసి, మళ్లీ శవాన్ని బెడ్ రూమ్‌లోకి తీసుకెళ్లి బెడ్‌పై పడేశాడు. పదునైన కత్తితో ముందుగా వెంకట మాధవి రెండు భుజాలు నరికాడు. తర్వాత కాళ్లు కోశాడు.కాళ్లు, చేతులను చిన్న ముక్కలుగా చేసి బకెట్లో వాటర్ హీటర్‌తో ఉడకబెట్టాడు. తర్వాత వాటిని బయటికి తీసి, సింగిల్ బర్నల్ గ్యాస్ స్టవ్ మీద బాగా కాల్చాడు. కాలిన ముక్కలను రోలులో వేసి పొడిగా దంచాడు. ఎము కల పొడి, చిన్న చిన్న మాంసం ముద్దలను టాయిలెట్లో వేసి ఫ్లష్ చేశాడు. చిన్న శరీర అవశేషాలను తర్వాత పారవేసేందుకు వీలుగా ఇంట్లోని చెత్త డబ్బాలో వేశాడు. మిగిలిన మృతదేహాన్ని విడతల వారీగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జిల్లెలగూడ చెరువులో పడేశాడు. శరీర భాగాలను కాల్చుతున్నప్పుడు వాసన రాకుండా ఇంటి తలుపులు, కిటికీలు తెరిచి పెట్టాడు. బాత్రూమ్, ఇంట్లో రక్తం మరకలు, దుర్వాసన పోయేందుకు డిటర్జెంట్, ఫినాయిల్‌తో శుభ్రం చేశాడు. ఏమీ తెలియనట్లుగా మిస్సింగ్ కేసు.. పండుగ తర్వాత ఇంటికొచ్చిన పిల్లలను నమ్మించేందుకు గురుమూర్తి ముందుగానే ఓ కట్టుకథను తయారుచేసుకున్నాడు. అమ్మ ఏదని పిల్లలు అడిగితే బయటికి వెళ్లిందని చెప్పాడు. తనకు చెప్పకుండా మాధవి ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని అత్త కుప్పాల సుబ్బమ్మకు తెలిపాడు. ఆమెతో కలిసి 18న మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి మిస్సింగ్ కేసు పెట్టాడు. ఎలా చిక్కాడంటే.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురుమూర్తి అపార్ట్మెంట్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. 15వ తేదీన రాత్రి 10:41 గంటలకు గురుమూర్తి, భార్య మాధవి ఇద్దరూ కలిసి ఇంటి లోపలికి వెళ్లడం గమనించారు. ఆ తర్వాత మాధవి బయటికి వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో నమోదు కాలేదు. దీంతో గురుమూర్తే ఇంట్లో భార్యను హత్య చేసి ఉంటాడని పోలీసులు ఓనిర్ధారణకు వచ్చారు. దీంతో వారు తమదైన పద్ధతిలో విచారించే సరికి భార్యను తానే హత్య చేసినట్లు నేరం ఒప్పుకున్నాడు. నిందితుడి ఇంట్లో నుంచి స్టవ్, కత్తి, రోలు, పొత్రం, బకెట్, వాటర్ హీటర్, హత్య సమయంలో వెంకటమాధవి ధరించిన దుస్తులు, ద్విచక్ర వాహనం, రెండు సెల్ఫోన్లు ఇతర వస్తువులను స్వా«దీనం చేసుకున్నారు. -
మాటల్లో చెప్పలేం.. మీర్ పేట్ హత్య కేసులో నివ్వెరపోయే విషయాలు
సాక్షి,హైదరాబాద్: సంచలనం సృష్టించిన మీర్‌పేట (meerpet) వెంకట మాధవి (venkata madhavi) హత్య కేసులో భర్త గురుమూర్తి (gurumurthy) గురించి పోలీసులు విస్తుపోయే వాస్తవాల్ని వెల్లడించారు. గురుమూర్తి మనిషి కాదని.. మనిషి రూపంలో ఉన్న నరరూప రాక్షసుడు. ఆయనలో ఎలాంటి పశ్చాతాపం కనిపించడం లేదంటూ రాచకొండ సీపీ కార్యాయలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ సుధీర్ బాబు కేసు విషయాల్ని వెల్లడించారు. భార్యను ఇంత దారుణంగా చంపిన గుర్తుమూర్తిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదు. క్షణికావేశంలో జరిగిన హత్య కాదు.. పథకం ప్రకారమే హత్య చేశాడు. చూడటానికి మనిషి బాగున్నా. స్వతాహాగానే క్రూరుడు. గురుమూర్తి తన భార్య వెంకట మాధవిని హత్య ఎలా చేశాడో మాటల్లో చెప్పలేం. ఈ నెల 15,16 తేదీల్లో దంపతుల మధ్య గొడవ జరిగింది. 16న ఉదయం 8 గంటలకు ఆమెతో అకారణంగా గొడవపెట్టుకొని ఘర్షణకు దిగాడు. మాధవి తల గోడకేసి మోదాడు. ఆపై గొంతు నులిమి హతమార్చాడు. ఇంట్లో ఉన్న కత్తితో కాళ్లు, చేతులు, బాడీ, తల నాలుగు భాగాలుగా కట్ చేశాడు. శరీర భాగాల్ని వాటర్ హీటర్‌తో నీళ్లు మరిగించి ఉడక బెట్టాడు. ఉడక బెట్టిన శరీర భాగాల్ని మరింత చిన్నవిగా చేసేందుకు ఇంట్లో ఉన్న పెద్ద గ్యాస్ మీద పెట్టి కాల్చాడు. కాల్చిన అనంతరం రోకలి బండతో శరీరభాగాలను దంచి పొడి చేశాడు. ఆ పొడిని సాయంత్రం ఆరుగంటల సమయంలో ప్లాస్టిక్ బకెట్లో తీసుకెళ్లి జిల్లెలగూడ చెరువులో పోశాడు.ఇంటికొచ్చిన తర్వాత ఉదయం ఎలా అయితే శుభ్రంగా ఉందో.. అలాగే శుభ్రం చేశాడు. ఆ తర్వాత బంధువుల ఇంటికి వెళ్లి పిల్లల్ని తన ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికొచ్చిన పిల్లలు తమ అమ్మ గురించి అడగ్గా.. మాధవి గురించి పిల్లలకు లేనిపోనివి అన్నీ చెప్పాడు. మమ్మి నాతో గొడవ పెట్టుకుని ఎక్కడికో వెళ్లిందని నమ్మించాడు.భార్యను హత్య చేసిన తర్వాత శరీర భాగాల్ని కట్ చేసిన బెడ్ రూంకు తాళ వేశాడు. అలా రెండ్రోజుల పాటు మేనేజ్ చేసిన తర్వాత.. బాధితురాలి తల్లిదండ్రులు రావడం.. తప్పని సరి పరిస్థితుల్లో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు మిస్సింగ్ కప్లయింట్ నమోదు చేయడం. ఆ కంప్లయింట్ ద్వారా విచారణ చేపట్టాం.పోలీసుల విచారణలో గురుమూర్తి పోలీసుల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. ముందుగా మాధవి డెడ్ బాడీ గురించి అడ్డగా.. జిల్లెల గూడా చెరువు పక్కనే ఉన్న మున్సిపాలిటీ చెత్తకుప్పలో పడేశానని చెప్పాడు. కానీ వాస్తవం అది కాదు. కేసు నుంచి తప్పించుకోవాలనే అలా చెప్పాడు. ఈ కేసులో నిందితుడు ఉపయోగించిన 16 రకాల ఆధారాల్ని లభ్యం చేసుకున్నాం.’అని వెల్లడించారు. 👉చదవండి : ఏపీ యువతి కేసులో సుప్రీం సంచలన తీర్పు -
మీర్‌పేట మాధవి కేసులో గురుమూర్తి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన మీర్‌పేట వెంకట మాధవి హత్య కేసులో ఎట్టకేలకు భర్త గురుమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయం ఇంటి వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తి చేసిన పోలీసులు.. మధ్యాహ్నాం అరెస్టును ధృవీకరించారు. అంతకు ముందు.. మాధవి కనిపించకుండా పోయిందన్న కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ కేసును ఇప్పుడు మర్డర్ కేసుగా మార్చారు. సాయంత్రం నిందితుడిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వెంకట మాధవిని గురుమూర్తి కిరాతకంగా హతమార్చిన సంగతి తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ విస్మయానికి గురి చేసే విషయాలు వెలుగు చూశాయి. ఆమెను హతమార్చాక.. మలయాళ సినిమా సూక్ష్మదర్శిని ప్రేరణతో మృతదేహాన్ని మాయం చేశాడు గురుమూర్తి. ఆ తర్వాత కూడా సినిమా టికెట్లు బుక్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో రకరకాల ప్రచారాలు మీడియాలో జరగ్గా.. సాయంత్రం ప్రెస్మీట్లో పోలీసులు ఆ విషయాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.భార్య మాధవితో గొడవ పడి ఆమెను హతమార్చి.. ఆపై మృతదేహాన్ని కుక్కర్లో వేసి ఉడకబెట్టాడు గురుమూర్తి. ఆపై ఆ మాంసాన్ని కమర్షియల్ గ్యాస్ స్టౌవ్‌పై కాల్చాడు. చివరకు ఎముకల్ని పొడి చేసి చెరువులో కలిపాడు. సాంకేతిక ఆధారాలతో గురుమూర్తిని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. -
మీర్ పేట మర్డర్ కేసులో మరో సంచలనం
-
ఆ సినిమా చూసి.. మాధవి కేసులో మరిన్ని కొత్త విషయాలు!
హైదరాబాద్, సాక్షి: సంచలనం సృష్టించిన మీర్‌పేట వెంకట మాధవి హత్య కేసులో.. దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ విస్మయం కలిగించే విషయాలు బయటపడుతున్నాయి. మలయాళ హిట్ మూవీ సూక్ష్మదర్శిని ప్రేరణతోనే గురుమూర్తి తన భార్య మృతదేహాన్ని మాయం చేసినట్లు విచారణలో తేలింది. మరోవైపు.. ఈ కేసు దాదాపుగా ఓ కొలిక్కి రావడంతో నిందితుడిపై పోలీసులు చర్యలకు దిగనున్నారు.వెంకట మాధవి మృతదేహాన్ని ఎలా మాయం చేయాలో అనే ఆలోచనలో గురుమూర్తికి ఈ ఆలోచన తట్టింది. సూక్ష్మదర్శిని సినిమా తరహాలోనే మృతదేహాన్ని డిస్పోస్ చేశాడు గురుమూర్తి. ఆ చిత్రంలో మాదిరే.. భార్య మాధవి మృతదేహాన్ని కెమికల్స్‌లో నానబెట్టి, ఆపై కాల్చి పొడి చేశాడు గురుమూర్తి. ఇవాళ డీఎన్ఏ రిపోర్ట్‌తో పాటు క్లూస్‌టీం ఆధారంగా ఇచ్చే నివేదిక వచ్చే అవకాశం ఉంది. దీంతో.. సాయంత్రంలోగా నిందితుడపై యాక్షన్‌కు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.నజ్రియా, బసిల్ జోసెఫ్ కీలక పాత్రల్లో ఎం.సి.జతిన్ రూపొందించిన మిస్టరీ థ్రిల్లర్ ‘సూక్ష్మదర్శిని’. మలయాళంలో చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. తెలుగులోనూ హాట్‌స్టార్‌లో ఈ చిత్రం ప్రస్తుతం అందుబాటులో ఉంది. తన చుట్టు పక్కల జరిగే విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువ ఉన్న ఇల్లాలు.. తన పక్క ఇంట్లో జరిగిన ఓ ఘోరమైన నేరాన్ని ఎలా బయట పెట్టిందన్నది ఈ చిత్ర కథ.దుర్వాసన రాకుండా..మీర్‌పేట పరిధి జిల్లెలగూడ న్యూవెంకటేశ్వరనగర్ కాలనీలో ఉండే మాజీ ఆర్మీ ఉద్యోగి గురుమూర్తి ఈ నెల 15న భార్య వెంకటమాధవిని హత్య చేసిన సంగతి తెలిసిందే. గతంలో ప్రకాశం జిల్లాలోని సొంతూరులో మరో మహిళతో వివాహేతర బంధం వ్యవహారం తెలిసినప్పుడు భార్య తరఫు కుటుంబీకులు గురుమూర్తిపై దాడికి పాల్పడ్డారు. ఇప్పుడు భార్య మరణం విషయం తెలిస్తే దారుణంగా స్పందిస్తారేమోనని భయపడ్డాడు. ఇంటర్నెట్లో మృతదేహం ఎలా ముక్కలు చేయాలని వెతికాడు. చైతన్యపురిలో నర్సు హత్య ఉదంతంతోపాటు వెబ్‌సిరీస్‌లు, సినిమాల ప్రేరణ పొందాడు. ఇంట్లో అందుబాటులో ఉన్న హ్యాక్సా బ్లేడుతో తలను వేరుచేసి మొండేన్ని మూడు ముక్కలు చేశాడు. ఆ తర్వాత బకెట్లో వేడినీటిలో ముక్కల్ని ఉడికించిన తర్వాత మళ్లీ పెద్ద స్టవ్ మీద కాల్చాడు. ఈ క్రమంలో ముక్కలు మాంసం ముద్దలుగా మారిపోయాయి. పొరుగింట్లోకి దుర్వాసన వెళ్లకుండా కొన్ని ద్రావణాలు వాడాడు. సాయంత్రం వరకూ ఈ పనిపూర్తి చేసి మీర్‌పేటలోని పెద్ద చెరువులో వేశాడు. ఆ తర్వాత తనకేం తెలియనట్లు భార్య తల్లిదండ్రులకు ఫోన్ చేసి వెంకట మాధవి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు చెప్పాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నాక అతడిచ్చిన సమాచారంతో చెరువులో మృతదేహం ముక్కల కోసం పోలీసులు వెతికారు. ఎలాంటి ఆనవాళ్లు లభించక.. పోలీసులు తలలు పట్టుకున్నారు. అయితే దఫదఫాలుగా ఫోరెన్సిక్, క్లూస్‌టీంలతో ఇంటిని పరిశీలించినప్పుడు తల వెంట్రుకలు, స్టవ్, వాటర్ బకెట్, హీటర్ వద్ద కొన్ని రక్తం, ఆనవాళ్లు లభించాయి. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి విశ్లేషించారు. ఇవన్నీ వెంకట మాధవివేనని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఇక ఈ కేసులో ముందుకు వెళ్లే కొద్దీ పోలీసులకు కొత్త విషయాలు వెలుగు తెలుస్తున్నాయి. ఘటన తర్వాత ఎనిమిది సార్లు గురుమూర్తి ఫోన్ మాట్లాడాడు. అందులో.. బడంగ్‌పేటలో ఉన్న సోదరితోనూ మాట్లాడినట్లు తెలుస్తోంది. నిందితుడి ఫోన్ కాల్ డాటా సేకరణలో ఈ విషయాలు వెలుగు చూశాయి. -
మీర్ పేట్ మహిళ మర్డర్ కేసులో సంచలన విషయాలు
-
మీర్పేట్ మాధవి కేసులో మరో సంచలనం.. వేడి నీటిలో ఉడికించి..
సాక్షి, రంగారెడ్డి: మీర్పేట్ మాధవి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు విచారణలో భాగంగా మరిన్ని విషయాలు బయటకు వచ్చాయి. మాధవిని భర్త గురుమూర్తే దారుణంగా హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. భార్య శరీర భాగాలను ముక్కలు చేసి ఉడికించడానికి పోటాషియం హైడ్రాక్సైడ్ వాడినట్టు పోలీసులు గుర్తించారు. అలాగే, బ్లూ రేస్ టెక్నాలజీతో గురుమూర్తి ఇంట్లో ఆధారాలను పోలీసులు సేకరించారు.మీర్పేట్ మాధవి హత్య కేసులో రోజుకో సంచలన విషయం బయటకు వస్తోంది. తాజాగా పోలీసులు విచారణలో భాగంగా విస్తుపోయే విషయాలు తెలిశాయి. మాధవిని హత్య చేసిన తర్వాత గురుమూర్తి.. ఆమె శరీర భాగాలను ముక్కలుగా చేసి ఉడికించడానికి పోటాషియం హైడ్రాక్సైడ్‌ను వాడినట్టు పోలీసుల విచారణలో తేలింది. బాత్రూంలో శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. వాటిని వేడి నీటలో ఉడికించి, బొక్కలు పొడి చేసి బాత్రూమ్ ఫ్లస్ ద్వారా డ్రైనేజీలోకి పంపించాడని పోలీసులు గుర్తించారు.ఇక, ఈ హత్య కేసు దర్యాప్తులో భాగంగా బ్లూ రేస్ టెక్నాలజీతో గురుమూర్తి ఇంట్లో ఆధారాలను పోలీసులు సేకరించారు. ఇదే సమయంలో ఈనెల 14వ తేదీ రాత్రి నుంచి 16వ తేదీ రాత్రి వరకు నిందితుడు గురుమూర్తి సెల్‌ఫోన్ సిగ్నల్స్, సీసీ కెమెరాల రికార్డు ఫుటేజ్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు విషయమై దేశంలోని ప్రధానమైన ఫోరెన్సిక్ నిపుణుల సహకారాన్ని పోలీసులు తీసుకుంటున్నారు. కాగా, నేడు పోలీసుల చేతికి డీఎన్ఏ రిపోర్టు అందే అవకాశం ఉంది.తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాధవి హత్య కేసు మిస్టరీని పోలీసులు దాదాపు ఛేదించారు. కేసు నుంచి తప్పించుకోడానికి మాజీ సైనికుడు గురుమూర్తి పకడ్బందీగా ప్లాన్ చేయడంతో పోలీసులకు సవాల్‌గా మారింది. అయితే, మృతదేహాన్ని నరకడానికి ఉపయోగించిన కత్తి, చెక్క మొద్దును ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఆ కత్తిని ఏం చేశాడు? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.అసలు కారణం..సంక్రాంతి పండుగ కోసం భార్య, తన ఇద్దరు పిల్లలతో కలిసి నగరంలో ఉండే తన సోదరి ఇంటికి వెళ్లాడు గురుమూర్తి. అక్కడే ఈ కుటుంబం పండుగ జరుపుకుంది. పిల్లలకు సెలవులు కావడంతో వారిని సోదరి ఇంటి దగ్గర వదిలేసి.. జనవరి 14న సాయంత్రం గురుమూర్తి, మాధవి తిరిగొచ్చారు. ఆ తర్వాత రోజు రాత్రి మాధవితో గొడవపడిన గురుమూర్తి.. ఆమెను కొట్టి విసురుగా తోసేయడంతో కిందపడి అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో కంగారుపడిపోయిన గురుమూర్తి, కేసు తనపై రాకుండా మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో యూట్యూబ్‌లో రాత్రంతా వీడియోలు చూసి జనవరి 16న ఉదయం భార్య మృతదేహాన్ని ముక్కులుగా కట్ చేశాడు.ఇంటి యజమాని కుటుంబంతో సహా బెంగళూరులో ఉండటం, పిల్లలు సోదరి ఇంట్లో ఉండటంతో గురుమూర్తికి కలిసొచ్చింది. జనవరి 17న మాధవి తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. తనతో గొడవపడి అలిగి ఇంట్లోంచి వెళ్లిపోయిందని చెప్పాడు. దీంతో మాధవి తల్లి సుబ్బమ్మ మీర్‌పేటకు వచ్చి.. అల్లుడితో కలిసి బంధువులు, తెలిసినవారి ఇళ్లలో వాకబు చేసింది. ఆ మర్నాడు అల్లుడితో కలిసి వెళ్లి మీర్‌పేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అనంతరం, మాధవి ఇంట్లోంచి వెళ్లినట్లు ఎక్కడా ఆధారాలు లభించలేదు. అతడిపైనే పోలీసులకు అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. తానే భార్యను చంపినట్లు ఒప్పుకున్నాడు.వివాహేతర సంబంధం..కాగా, భార్య మాధవి బంధువుల అమ్మాయితో గురుమూర్తి సంబంధం పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై మూడేళ్ల కిందటే గొడవ జరగడంతో ఇరువురూ తమ స్వగ్రామానికి వెళ్లడం మానేశారు. ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో పండగలు, వేడుకలకు వెళ్లలేకపోతున్నామని భార్యాభర్తలు తరుచూ దీనిపై గొడవపడినట్టు వెలుగులోకి వచ్చింది. ఆ యువతిని పెళ్లిచేసుకోడానికే భార్యను గురుమూర్తి హత్య చేశాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. -
మీర్ పేట్ మర్డర్ డైరీ.. పూటకో ట్విస్ట్..
-
మీర్పేట్ మర్డర్ మిస్టరీ కొత్త టెక్నాలజీతో కేసు విచారణ
-
మీర్పేట్ హత్య కేసులో సంచలన విషయాలు.. రెండు ఎవిడెన్స్ లభ్యం?
సాక్షి, హైదరాబాద్: మీర్పేట్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గురుమూర్తి హత్య ఎలా చేశాడనే దానిపై పోలీసులు నిర్థారణకు వచ్చినట్లు తెలిసింది. గ్యాస్ స్టౌవ్‌పై శరీరానికి సంబంధించిన ఒక టిష్యూ, రక్తపు మరక లభ్యమైనట్లు సమాచారం. క్లూస్ టీమ్‌కి దొరికిన రెండు ఆధారాలతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రెండు ఆధారాలను క్లూస్ టీమ్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపింది.భార్య వెంకట మాధవి చనిపోయిన తర్వాత డెడ్‌బాడీని బాత్రూమ్లోకి తీసుకెళ్లిన భర్త గురుమూర్తి.. బాత్రూమ్లో డెడ్‌బాడీని ముక్కలు ముక్కలుగా కట్ చేశాడు. ఒక్కొక్క ముక్కని కమర్షియల్ గ్యాస్ స్టౌవ్‌పై పెట్టి కాల్చేశాడు. బాగా కాలిపోయిన ఎముకలను రోట్లో వేసి పొడిగా చేసిన గురుమూర్తి.. ఎముకల పొడి మొత్తాన్ని బకెట్లో నింపి చెరువులో పడేశాడు.మాధవి హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతుందని.. కేసులో కీలక అంశాలున్నాయని రాచకొండ సీపీ అన్నారు. దర్యాప్తు కోసం ఇతర రాష్ట్రాల నుంచి సాంకేతిక నిపుణులను తీసుకొస్తున్నామన్నారు. ఈ కేసు టెక్నికల్ అంశాలతో ముడిపడి ఉందని.. టెక్నాలజీ ఉపయోగించి కేసు దర్యాప్తు చేస్తున్నామని సీపీ తెలిపారు.వీఈ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. మరో మహిళతో అక్రమ సంబంధం నేపథ్యంలో అడ్డు తొలగించుకునేందుకే గురుమూర్తి తన భార్య మాధవిని హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గురుమూర్తి సెల్ఫోన్లో మరో మహిళతో ఉన్న ఫోటోలు లభించడంతో ఈ దిశగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది. అయితే విచారణ సందర్భంగా అతడు పొంతన లేని సమాధానాలు చెబుతుండటం, ఇంకా ఎలాంటి ఆ« దారాలు లభించకపోవడంతో.. అసలేం జరిగింది? అతను చెప్పేది నిజమా, అబద్ధమా? అనేది మిస్టరీగా మారిందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కేసులో అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి వివరాలనూ పోలీసులు వెల్లడించకపోవడం గమనార్హం.ఇదీ చదవండి: ఆటో డ్రైవర్ కిరాతకం.. మహిళపై అత్యాచారంతనతో గొడవ పడి భార్య బయటికి వెళ్లిపోయిందని గురుమూర్తి బంధువులతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి మిస్సింగ్ కేసు పెట్టించాడు. దీనితో పోలీసులు ఆ కాలనీలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. 14న మాధవి బయటి నుంచి ఇంట్లోకి వెళ్లినట్టుగా సీసీ కెమెరా వీడియోల్లో ఉంది. తర్వాత ఆమె బయటికి రాలేదు. గురుమూర్తి ఒక్కడే ఇంటి నుంచి బయటకు వెళ్లిరావడాన్ని పోలీసులు గుర్తించారు. దీనికితోడు గురుమూర్తి ప్రవర్తనపై సందేహంతో.. మాధవిని ఇంట్లోనే హత్య చేసి ఉండవచ్చని భావించి, ఇంట్లో, పరిసరాలను పరిశీలించారు. తర్వాత అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. భార్య తలపై ఆయుధంతో మోది హత్య చేసి, శరీరాన్ని ముక్కలు చేశానని.. బకెట్లో వేసి వాటర్ హీటర్‌తో ఉడికించి, రోకలితో దంచి చెరువులో పడేశానని నిందితుడు పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలిసింది.పోలీసులు చెరువులో గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టినా ఎలాంటి ఆధారమూ లభించలేదని.. ఇంట్లోని బాత్రమ్, వీధిలోని అన్ని మ్యాన్‌హోళ్లను తెరిపించి పరిశీలించినా ఏ స్పష్టతా రాలేదని సమాచారం. దీనితో గురుమూర్తి చెప్పేది నిజమా, అబద్ధమా? పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు అలా చెబుతున్నాడా అన్న సందేహాలు వస్తున్నాయి. హత్యపై రకరకాలుగా ప్రచారం జరుగుతున్నా పోలీసు అధికారులు అధికారికంగా ఎలాంటి వివరాలూ వెల్లడించడం లేదు. కాగా.. గురుమూర్తి ఇంట్లో మద్యం సీసా, దాని పక్కనే మటన్ షాపులో ఉపయోగించే చెక్క మొద్దును గుర్తించారు. హత్య అనంతరం శరీరాన్ని దీనిపైనే ముక్కలుగా చేసినట్టు భావిస్తున్నారు. -
పోలీసులకే దృశ్యం సినిమా చూపిస్తున్న గురుమూర్తి
-
మీర్పేట్ మాధవి హత్య కేసు.. పిల్లల విచారణలో కీలక విషయాలు
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా మీర్పేట్ చిల్లెలగూడలో జరిగిన దారుణ హత్యపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. మరో మహిళతో ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారి తీసినట్లు విచారణలో భాగంగా గురుమూర్తి నుంచి పోలీసులు వివరాలు రాబట్టారు. పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసిన గురుమూర్తి, ఓ వెబ్ సిరీస్ తరహాలో మృతదేహాన్ని మాయం చేసి తప్పించుకోవాలని చూసినట్టు పోలీసులు నిర్ధారించారు.మీర్‌పేట్‌కు చెందిన మాధవి హత్య కేసులో ఆమె భర్త, నిందితుడు గురుమూర్తిని పోలీసులు నేడు కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక, ఇప్పటికే రెండుసార్లు సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత మరోసారి సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేయనున్నారు. ఈ కేసులో కీలకమైన ఆధారాలను దర్యాప్తు అధికారులు సేకరించారు. సుమారు మూడు గంటల పాటు గురుమూర్తి ఇంట్లో క్లూస్ టీమ్ సోదాలు నిర్వహించింది. అలాగే, సీసీ ఫుటేజ్, ఫోన్ సిగ్నల్ ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మరోవైపు, మాధవి హత్య కేసులో ఇద్దరు పిల్లల స్టేట్మెంట్ను కూడా పోలీసులు రికార్డు చేశారు. పిల్లల స్టేట్మెంట్ సందర్భంగా కూడా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తమ తల్లి కనిపించకపోయిన తర్వాత ఇంట్లో చెడు వాసన వచ్చినట్టు పిల్లలు తెలిపారు. అలాగే, కుటుంబ సభ్యలను కూడా పోలీసులు విచారిస్తున్నారు.ఇదిలా ఉండగా.. నిందితుడు విషయాలపై ఆధారపడకుండా పోలీసులు వేర్వేరు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు నిందితుడి ఫోన్ పరిశీలించినప్పుడు మరో మహిళ ఫొటోలు కొన్ని ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 18వ తేదీన నమోదు చేసిన వెంకట మాధవి అదృశ్యం కేసును హత్య కేసు సెక్షన్ల కింద మారుస్తున్నారు. కేసు విషయంలో నేడు కొంత స్పష్టత వచ్చే అవకాశముంది.జరిగింది ఇదీ.. ఏపీలోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన పుట్ట గురుమూర్తి, అదే గ్రామానికి వెంకట మాధవికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. గురుమూర్తి ఆర్మీలో జవాన్‌గా చేరి నాయక్ సుబేదార్‌గా పదవీ విరమణ పొందాడు. ప్రస్తుతం కంచన్‌బాగ్ డీఆర్డీఏలో కాంట్రాక్టు భద్రతా సిబ్బందిగా పని చేస్తున్నారు. గురుమూర్తి కొన్నాళ్లుగా తన సమీప బంధువైన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం భార్యకు తెలిసి పలుమార్లు గొడవలు జరిగినట్టు సమాచారం. ఈ క్రమంలోనే భార్య అడ్డు తొలగించుకోవాలనే క్రమంలోనే ఆమెను హత్య చేసేందుకు ప్లాన్ వేశాడు.సంక్రాంతి పండుగ సందర్భంగా గురుమూర్తి తన ఇద్దరు పిల్లల్ని నగరంలోనే ఉండే తన సోదరి ఇంటి దగ్గర దింపాడు. 13, 14 తేదీల్లో మాధవితో కలిసి ఉదయం సోదరి ఇంటికెళ్లి సాయంత్రానికి తిరిగొచ్చేవారు. 15వ తేదీన ఉదయం గురుమూర్తికి భార్యకు గొడవ మొదలైంది. మరో మహిళతో సంబంధం, ఇందుకు సంబంధించి కొన్ని ఫొటోలు భార్య చూసింది. అప్పటికే భార్యను హతమార్చాలని కసితో ఉన్న గురుమూర్తి అనుకున్నంత పని చేశాడు. భార్యను తలమీద కొట్టడంతో ఆమె కిందపడిపోయింది. ఆరు నెలల క్రితం ఓటీటీలో చూసిన వెబ్సిరీస్లోని పాత్రల తరహాలోనే మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నాడు. ఇందులో భాగంగా మృతదేహాన్ని టాయిలెట్లోకి తీసుకెళ్లి ముక్కలుగా నరికాడు.శరీరాన్ని ముక్కలుగా చేసి..ఆ తర్వాత బకెట్ నీళ్లను హీటర్‌తో వేడి చేసి ముక్కల్ని వేశాడు. ముక్కలు మొత్తగా మారాక మాంసాన్ని ఎముకల నుంచి విడదీసి మరో బకెట్లో వేసి రోకలితో దంచి ముద్దగా చేశాడు. ఎముకల్ని ముక్కలుగా చేసి అంతా సంచుల్లో నింపి సమీపంలోని చెరువులో వేశాడు. హత్య తర్వాత దాదాపు రెండ్రోజులు నిద్రలేకుండా ఇదంతా చేసినట్లు నిందితుడు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని మాయం చేసిన తర్వాత గదిని నీళ్లతో శుభ్రం చేశాడు. 17వ తేదీ సాయంత్రం భార్య కనిపించడం లేదని వెంకట మాధవి తల్లిదండ్రులకు ఫోన్లో చెప్పాడు. చిన్న గొడవతో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు ఫిర్యాదు చేయించాడు.ఈ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే పోలీసులకు గురుమూర్తి మీద అనుమానమొచ్చింది. మాధవి ఇంటి లోపలికి వెళ్లడం తప్ప బయటకు వచ్చే దృశ్యాలు రికార్డవలేదు. దీంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించినప్పుడు అసలు విషయం బయటపడింది. బుధ, గురువారాల్లో నిందితుడి నివాసాన్ని పరిశీలించిన క్లూస్‌టీం, ఫోరెన్సిక్ బృందాలు నీళ్ల బకెట్, వాటర్ హీటర్‌తో పాటు ఇంట్లో కొన్ని కీలక ఆనవాళ్లు సేకరించాయి. వీటిని పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. బకెట్లో వేసి శరీరం ముక్కలు ఉడికించినట్లు కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి.పోలీసులకే ట్విస్ట్.. నిందితుడు చెప్పిన విషయాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మృతదేహాన్ని చెరువులో విసిరేసినట్లు చెబుతున్నా, అక్కడ ఇంకా ఆధారాలు లభించలేదు. శరీరం ఆనవాళ్లు లభ్యమైనా వెంకట మాధవి పిల్లల డీఎన్ఏతో పోల్చే అవకాశముంది. ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. క్లూస్‌టీం, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక కీలకం కానుంది. వెంకట మాధవి అదృశ్యంపై కేసు నమోదు చేశామని, ఆమె ఇంట్లోకి వెళ్తున్న దృశ్యాలు మాత్రమే లభ్యమైనట్లు ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ తెలిపారు. -
Meerpet Case: గురుమూర్తి ఫోన్లో ఏముంది?.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్‌పేట(Meerpet Case) వెంకటమాధవి హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. గురుమూర్తి(Gurumurthy) కాల్ డేటా Call Data) మొత్తాన్ని చెక్ చేసిన పోలీసులు.. అతనికి ఎవరితోనైనా వివాహేతర సంబంధాలు ఉన్నాయన్న కోణంలో ఆరా తీస్తున్నారు. ఆధారాలు దొరకకుండా భార్యను హత్య చేయడం వెనుక మరో మహిళతో అక్రమ సంబంధం కారణంగానే భార్యను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మాధవి మృతదేహం బూడిద ఆధారాల కోసం పోలీసులు లోతైన విచారణ చేపట్టారు.ఇంకా ఎలాంటి ఆధారాలు దొరకలేదు: డీసీపీఎల్బీ నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ ‘సాక్షి’ మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసులో విచారణ కొనసాగుతుందని.. ఇప్పటివరకు మిస్సింగ్ కేసు గానే మేము విచారణ చేస్తున్నామన్నారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. సీసీ కెమెరాలు రికార్డయిన దృశ్యాలు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. వెంకట మాధవి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తమ కూతురిని గురుమూర్తే హత్య చేశాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుందన్నారు.బాడీని ముక్కలు ముక్కలు చేసి చెరువులో పడేసినట్లు ఇంకా ఆధారాలు దొరకలేదు. సీసీ కెమెరా ఫుటేజ్‌లో మాత్రం వెంకట మాధవి ఇంట్లోకి వెళ్లిన దృశ్యాలు మాత్రమే ఉన్నాయి. ఇంటి నుంచి బయటకు వచ్చినట్టు దృశ్యాలు లేవు. వెంకట మాధవిని భర్త గురుమూర్తి హత్య చేసినట్లు వాళ్ల కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ వెల్లడించారు.ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన విశ్రాంత ఆర్మీ జవాన్ గురుమూర్తి (39), వెంకట మాధవి (35) భార్యాభర్తలు. వారికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఐదేళ్ల క్రితం జిల్లెలగూడ న్యూ వేంకటేశ్వర కాలనీలోకి వచ్చి, అద్దె ఇంట్లో ఉంటున్నారు. గురుమూర్తి కంచన్‌బాగ్‌లోని డీఆర్డీఓలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. గురుమూర్తి విపరీత ప్రవర్తన, అనుమానిస్తూ వేధిస్తుండటంతో భార్య మాధవి ఇబ్బందిపడుతూ ఉండేది. ఇరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.ఈ నెల 16న గురుమూర్తి, మాధవి మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో గురుమూర్తి ఆమెను పాశవికంగా హత్యచేశాడు. కానీ ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయిందని అందరికీ చెప్పాడు. మాధవి తల్లి ఉప్పాల సుబ్బమ్మ తన కూతురు కనిపించకుండా పోయిందని ఈ నెల 18న మీర్‌పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.ఇదీ చదవండి: హైదరాబాద్: కిడ్నీ ఆపరేషన్ కేసులో కీలక మలుపుఇంట్లో గొడవ జరిగిన సమయంలోనే మాధవిని గురుమూర్తి హత్య చేశాడు. కానీ ఏమీ ఎరగనట్టుగా అత్తమామలతో పాటు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్టు తెలుసుకున్న పోలీసులు గురుమూర్తిపై నిఘా పెట్టారు. అతడి ప్రవర్తన, కదలికలపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తున్నామని మీర్పేట్ సీఐ నాగరాజు తెలిపారు.భార్యను హత్య చేసిన గురుమూర్తి పోలీసులకు ఎలాంటి ఆధారాలు, ఆనవాళ్లు చిక్కకుండా పక్కా ప్లాన్ చేశాడు. శరీరంలోని ఎముకలను పొడిగా ఎలా మార్చాలని యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో శోధించాడు. క్రైమ్, హర్రర్ సినిమాలు చూశాడు. ముందుగా వీధి కుక్క మీద ప్రయోగం చేశాడు. కుక్కను ఇంట్లోకి తీసుకొచ్చి చంపేశాడు. ముక్కలుగా నరికి, ఎముకలతో సహా కుక్కర్లో ఉడకబెట్టాడు. తర్వాత అదే తరహాలో భార్య శరీరాన్ని కూడా ముక్కలు చేసి, ఉడకబెట్టాడు. ఎండబెట్టి, కాల్చి పొడి చేశాడు.మాధవి మిస్సింగ్ కేసు నేపథ్యంలో.. జిల్లెలగూడ న్యూవేంకటేశ్వర కాలనీలో గురుమూర్తి, మాధవి నివాసమున్న ఇల్లు, పరిసర ప్రాంతాలను పోలీసులు మూడు రోజులుగా క్షుణ్నంగా పరిశీలించినట్టు తెలిసింది. ఆమె హత్యకు గురై ఉంటే ఏమైనా ఆధారాలు లభిస్తాయేమోనని డ్రైనేజీ మ్యాన్‌హోల్స్, నాలాలను కూడా తెరిచి పరిశీలించినట్టు స్థానికులు తెలిపారు. కానీ నిందితుడిని విచారించిన సమయంలో అసలు సంగతి బయటపడింది. -
భార్యను కుక్కర్ లో పెట్టి..!
-
భార్యపై అనుమానంతో ముక్కలుగా నరికిన భర్త
-
మీర్పేట్లో కిరాతం.. భార్యను ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెట్టి..
సాక్షి, హైదరాబాద్: మీర్‌పేటలో దారుణం జరిగింది. డీఆర్డీవో కాంట్రాక్ట్ ఉద్యోగి గురుమూర్తి.. అనుమానంతో భార్యను కిరాతకంగా చంపేశారు. భార్య వెంకట మాధవిని చంపి ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెట్టిన భర్త.. ఉండకబెట్టిన మాంసాన్ని చెరువులో పడేశారు.ఈ నెల 13వ తేదీ నుంచి వెంకట మాధవి కనిపించకుండా పోయింది. ఈ నెల 18న తన భార్య వెంకటమాధవి కనిపించడం లేదంటూ ఆమె తల్లిదండ్రులతో కలిసి భర్త గురుమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కమర్షియల్ సిలిండర్ తీసుకొచ్చి ముక్కలను ఉడకబెట్టిన భర్త.. ముక్కలను ఎండబెట్టి రోకలితో పొడిగా మార్చాడు. తర్వాత మృతదేహం పొడిని చెరువులో కలిపాడు. మూడు రోజుల పాటు ఇంట్లో మృతదేహాన్ని కాల్చివేసి పొడిగా మార్చేశాడు. బాడీ మొత్తాన్ని పొడిగా మార్చడంతో ఆనవాళ్లు దొరకలేదు.గురుమూర్తి గతంలో ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. 13 ఏళ్ల క్రితం వెంకటమాధవితో గురుమూర్తికి వివాహం జరిగింది. వారికి ఇద్దరు సంతానం. తూప్రాన్‌పేట్‌లోని దండుపల్లిలో నివాసముంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని గుర్తించారు.దీంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు నిజం వెలుగులోకి వచ్చింది. తానే భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించానని, ఆ తర్వాత వాటిని జిల్లెలగూడ చెరువులో పడేసినట్టు తెలిపాడు. దీంతో మృతదేహం ఆనవాళ్ల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.ఇదీ చదవండి: ఓసారి మా ఇంటికొచ్చి.. టీ తాగి వెళ్లండి! -
HYD: మీర్పేట్లో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ నగరం మీర్పేట్లో సోమవారం(అక్టోబర్7) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నందన వనం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు.టూ వీలర్‌ను లారీ ఢీకొనడంతో టూవీలర్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరి మీద నుంచి లారీ వెళ్లడంతో వారి మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి. ఇదీ చదవండి: భారీగా సైబర్ నేరగాళ్ల అరెస్ట్ -
వర్షం ఎఫెక్ట్.. మీర్పేట్లో ఇళ్లలోకి వరద నీరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పలు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుకుంది. వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని మీర్పేట్ ఏరియాలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మీర్పేట్ పరిధిలోని మిథిలా నగర్, సత్యసాయి నగర్ సహా పలు కాలనీల్లోకి చెరువు నీరు వచ్చి చేరుతోంది. నీరు ఇళ్లలోకి చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక.. ఎస్ఎన్డీపీ నాలా మూసుకుపోవడంతో మ్యాన్‌హోల్స్ నుంచి నీరు ఉప్పొంగుతోంది. రాత్రి నుంచి క్రమంగా నీరు పెరిగి ఉదయానికి నీరు ఇళ్లలోకి చేరుకుంది.ఈ సందర్బంగా స్థానికులు మాట్లాడుతూ.. గత ముడు రోజులుగా మా కాలనిలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. బయటికి రాలేము, ఎటు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. వర్షాల కారణంగా మంత్రాల చెరువు, పెద్ద చెరువు నిండి వరదనీరు కాలనీలోకి వస్తోంది. వరద నీటి కోసం గతంలో వేసిన ట్రాంక్ పైప్ లైన్లు మూసుకుపోవడంతో ఇళ్లలోకి వరద నీరు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వస్తున్నారు చూస్తున్నారు కానీ.. శాశ్వత పరిష్కారం లేదని తెలిపారు. -
అందుకే చెప్పకుండా వచ్చేశా.. మిస్సింగ్ బాలుడి ఆచూకీ లభ్యం
సాక్షి, తిరుపతి: హైదరాబాద్ మీర్పేట్లో అదృశ్యమైన బాలుడిని తిరుపతి రైల్వేస్టేషన్లో గుర్తించారు. బాలుడు మహీధర్‌రెడ్డి ఆచూకీ మలక్‌పేట రైల్వేస్టేషన్లో ఫుటేజ్ ద్వారా లభ్యమైంది. బాలుడిని తిరుపతి నుంచి హైదరాబాద్‌కు బంధువులు తీసుకొస్తున్నారు. రెండు రోజుల క్రితం మీర్పేట్లో ట్యూషన్‌కు వెళ్లి బాలుడు కనిపించకపోయిన సంగతి తెలిసిందే.ఇంట్లో వాళ్లకు చెప్పకుండా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చానని.. తిరుమల నుంచి వీడియో కాల్ ద్వారా మాట్లాడానని బాలుడు తెలిపాడు. ఆ బాలుడిని చైల్డ్ హోంకు తరలించిన పోలీసులు.. కర్నూలు నుంచి మేనమామ వస్తున్నాడని.. ఆయనకు అప్పగిస్తామని తెలిపారు.జిల్లెలగూడ దాసరి నారాయణరావు కాలనీకి చెందిన మధుసూదన్‌రెడ్డి, కవిత దంపంతుల కుమారుడు మహిధర్‌రెడ్డి(13) స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతన్నారు. రోజుమాదిరిగానే ఆదివారం మధ్యాహ్నం 3.30గంటలకు తన అన్నతో కలిసి సర్వోదయనగర్‌లో ట్యూషన్‌కు బయలుదేరాడు. వీరు నిత్యం లిఫ్ట్ అడిగి వెళ్తుంటారు. ఓ బైక్ ఆపగా.. అన్నను వెళ్లమని చెప్పిన మహిధర్ తాను తర్వాత వస్తానన్నాడు. అనతరం మరో స్కూటీని లిఫ్ట్ అడిగి మీర్పేట్ బస్టాండ్ వద్ద దిగి అక్కడ నుంచి మిథాని డిపోకు చెందిన ఉమెన్స్ కాలేజీ బస్‌లో మలక్‌పేట్ రైల్వే స్టేషన్ బస్టాప్‌లో దిగాడు. రైల్వే స్టేషన్‌కు వెళ్లి టికెట్ తీసుకుని రైలు ఎక్కాడు. ముందుగా కిడ్నాప్ అనుకుని.. ట్యూషన్‌కు వెళ్లిన కొడుకు తిరిగి రాకపోవంతో కంగారుపడిన తల్లిదండ్రులు కిడ్నాప్ అనుకుని మీర్‌పేట ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఇంట్లో నుంచి వెళ్లేప్పుడు రూ.2 వేలు తీసుకెళ్లిన్నట్లు గుర్తించారు. పోలీసులు సీసీ పుటేజీలు పరిశీలించగా బాలుడు తనంతట తానే లిఫ్ట్ అడిగి.. బస్ ఎక్కి, అనంతరం రైలులో వెళ్లిన్నట్లు గుర్తించారు. సొంతూరు కర్నూల్ వెళ్లి ఉంటాడని భావించి అక్కడి పోలీసులు, బంధువులను అప్రమత్తం చేశారు. ఏసీపీ కాశిరెడ్డి మీర్‌పేటకు వచ్చి సీసీ పుటేజీ పరిశీలించా.. నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. -
ఏసీబీ వలలో మీర్‌పేట ఎస్ఐ
హైదరాబాద్: నోటరీ ప్లాటు విక్రయ సెటిల్మెంట్ వ్యవహారంలో రూ.10 వేలు లంచం తీసుకుంటూ సబ్ ఇన్స్పెక్టర్ సైదులు అడ్డంగా దొరికిపోయాడు. మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. నాదర్గుల్కు చెందిన షేక్ నజీముద్దీన్ గత డిసెంబరులో సర్వే నంబర్ 197లోని తన 200 గజాల నోటరీ ప్లాటును గుర్రంగూడకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మాదాని సుభాష్‌కు రూ.4.80 లక్షలకు విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నాడు. దీంతో సుభాష్ రూ.2.10 లక్షలు బయానా చెల్లించి ప్లాటుకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలను తీసుకుని అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఈ ప్లాటు కొంత కాలంగా కోర్టు వివాదంలో ఉండడం, తాజాగా కోర్టు కేసు అనుకూలంగా వచ్చే అవకాశం ఉండడంతో నజీముద్దీన్ తన ప్లాటును తిరిగి ఇచ్చేయాలని ఒత్తిడి తేగా సుభాష్ అంగీకరించలేదు. దీంతో నజీముద్దీన్ ఈ నెల 23న మీర్‌పేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ బొడ్డుపల్లి సైదులుకు ఫిర్యాదు చేశాడు. సివిల్ వివాదంలో తలదూర్చిన పోలీసు అధికారి సుభా‹Ùను స్టేషన్‌కు పిలిపించి ప్లాటు పత్రాలు వెనక్కి ఇవ్వకపోతే, అవి పోయినట్లు దొంగతనం కేసు పెడతానని బెదిరించాడు. దీంతో భయపడిన సుభాష్ ప్లాట్ కాగితాలు నజీముద్దీన్కు ఇచ్చేందుకు అంగీకరించాడు. ఈ వ్యవహారాన్ని సెటిల్ చేసి ఎస్ఐ సుభాష్‌కు రూ.1.40 లక్షలు ఇప్పించాడు. ఇందులో తనకు రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా, రూ.5వేలు ఇస్తానని ఒప్పుకొన్నాడు. ఆ తర్వాత ఓసారి మధ్యవర్తి ముత్యంరెడ్డితో కలిసి స్టేషన్‌కు వచ్చాడు. రూ.10 వేలు ఇస్తామని చెప్పడంతో ఎస్ఐ ఓకే చెప్పాడు. ఈ వ్యవహారాన్నంతా బాధితుడు ముందుగానే సెల్ఫోన్లో రికార్డు చేసి ఏసీబీ అధికారులకు పంపాడు. శనివారం పీఎస్‌కు వచ్చిన సుభాష్ నుంచి ఎస్ఐ రూ.10 వేలు తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ విలేకరులతో మాట్లాడుతూ.. ఎస్ఐ సైదులును మేజి్రస్టేట్ ఎదుట హాజరు పర్చడంతో పాటు తన ఇంట్లోని ఫైళ్లను తనిఖీ చేశామని తెలిపారు. 2021లో సరూర్‌నగర్ పీఎస్‌లో విధులు నిర్వర్తించిన సమయంలోనూ ఇలాంటి కేసులోనే ఎస్ఐ సైదులు సస్పెండ్ అయ్యాడని స్పష్టంచేశారు. లంచం కోసం ఇబ్బంది పెడితే 1064 ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. -
యజమాని వేధింపులు..శానిటైజర్ తాగిన యువతి
-
సెలూన్ యజమాని లైంగిక దాడి..శానిటైజర్ తాగి యువతి ఆత్మహత్య
హైదరాబాద్: మీర్పేట్ టీచర్స్ కాలనీలోని గత కొంతకాలంగా సెలూన్లో పనిచేస్తున్న దివ్య అనే యువతి (18)పై యజమాని మురళి(35) లైంగిక దాడికి పాల్పడుతుండటంతో ఆమె శానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకుంది వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. గత కొంత కాలంగా ఓ సెలూన్ లో పని చేస్తున్న దివ్యను యజమాని మురళి లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు సమాచారం. మంగళవారం 2024 జనవరి 30న మరళి సెలూన్ లో ఉన్న ఓ గదిలోకి దివ్య(18)ను తీసుకెళ్లి లైంగిక దాడి చేయడానికి ప్రయత్నం చేయగా.. దివ్య బయటికి వచ్చి అరవడంతో మురళి అక్కడి నుంచి పరారైయ్యాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన దివ్య సెలూన్ లో ఉన్న శానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకుంది. గతంలో పలుమార్లు మురళి దివ్యను లైంగిక దాడి చేశాడని సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
మీర్‌పేట గ్యాంగ్ రేప్ ఘటనపై గవర్నర్ దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్: మీర్‌పేట గ్యాంగ్ రేప్ ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన గురించి రాజ్‌భవన్ వర్గాల ద్వారా వివరాలను అడిగి తెలుసుకున్న ఆమె.. ఘటనపై 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలంటూ తెలంగాణ సీఎస్, డీసీపీ, రాచకొండ సీపీని ఆదేశించారు. మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని.. నందనవనం కాలనీలో 16 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. బాలిక ఇంట్లోకి దూరి మరీ ఆమె సోదరుడి ఎదుటే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు గంజాయి బ్యాచ్ అని, మత్తులోనే అఘాయిత్యానికి తెగబడ్డారని పోలీసులు చెబుతున్నారు. ఇక భారతీయ రెడ్‌క్రాస్ సొసైటీ (IRCS), రంగారెడ్డి జిల్లా శాఖ, బాధితురాలి ఇంటిని సందర్శించి, ఆమె కుటుంబానికి అవసరమైన అన్నివిధాల సహాయాన్ని వెంటనే అందించాలని గవర్నర్ సౌందరరాజన్ ఆదేశించారు. -
హైదరాబాద్: ప్రాణం తీసిన బీరు
సాక్షి, క్రైమ్: రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ శివారు మీర్‌పేట పరిధిలో దారుణం జరిగింది. బీర్ బాటిల్స్ కోసం ఓ వ్యక్తితో గొడవ పెట్టుకుని.. అతన్ని కత్తితో కిరాతకంగా హత్య చేశారు. మృతుడ్ని సాయి వరప్రసాద్‌గా నిర్ధారించారు పోలీసులు. జిల్లెలగూడ నుంచి సాయి వరప్రసాద్.. బీరు బాటిల్స్ కొనుక్కుని వెళ్తున్నాడు. ఈ క్రమంలో కొందరు యువకులు.. అతన్ని అడ్డుకుని బాటిల్స్ తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. అందుకు అతను ససేమీరా అనడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కత్తితో సాయిపై ఆ యువకులు దాడి చేశారు. రక్తపు మడుగులో అక్కడికక్కడే సాయి కుప్పకూలిపోయాడు. బీర్ బాటిల్ హత్య ఉదంతంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన మీర్ పేట్ పోలీసులు.. పల్లె నితీష్ గౌడ్, కిరణ్ గౌడ్,సంతోష్ యాదవ్,పవన్‌లను నిందితులుగా నిర్ధారించారు. -
మీర్పేట్లో దారుణం.. కన్న బిడ్డలపై తల్లి కర్కశం, ఇద్దరు పిల్లల్ని చంపి..
సాక్షి, రంగారెడ్డి: మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మదర్స్‌డే రోజే ఓ తల్లి ఘోరానికి పాల్పడింది. క్షణికావేశంలో 9 నెలలు మోసి కన్న పేగు బంధాన్ని తెంచుకుంది. అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులను వాటర్ బకెట్లో ముంచి వారిని తిరిగిరాని లోకాలకు పంపించింది. అనంతరం తను కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాల్లోకి వెళితే.. మీర్పేట్లో నివాసముంటున్న శ్రీను నాయక్‌కు తన భార్య భారతి(26)తో ఇటీవల గొడవలు అవుతున్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి భార్యభర్తల మధ్య మళ్లీ వాగ్వాదం జరిగింది. దీంతో విసిగిపోయిన భారతి భర్త మీద కోసం ఆదివారం తన ఇద్దరు పిల్లల్ని వాటర్ బకెట్లో ముంచి ప్రాణాలు తీసింది. తను ఆత్మహత్యాయత్నం చేయగా.. పక్కనే ఉన్న స్థానికులు గమనించి హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వివాహిత పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చదవండి: ఓ భార్య ఘనకార్యం.. భర్తను హత్య చేసి అతడిపైనే పుస్తకం రాసింది..చివరికి.. -
కార్పొరేటర్ భర్త హంగామా.. కారుతో ఢీకొట్టి.. ఆపై దాడి చేసి..
సాక్షి, హైదరాబాద్: బైక్‌పై వెళుతున్న వారిని కార్పొరేటర్ భర్త కారుతో ఢీకొట్టి ఆపై దాడి చేసిన ఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మీర్‌పేట 28వ డివిజన్ కార్పొరేటర్ జిల్లెల అరుణ భర్త ప్రభాకర్‌రెడ్డి సోమవారం రాత్రి కారులో ఇంటికి బయలుదేరాడు. అదే సమయంలో న్యూ బాలాజీనగర్‌కు చెందిన బలరామకృష్ణ మీర్‌పేట చౌరస్తా నుంచి మరో వ్యక్తి డానియల్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. శివసాయినగర్ కాలనీ పార్కు వద్దకు రాగానే ప్రభాకర్‌రెడ్డి తన కారుతో బలరామకృష్ణ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరూ కిందపడ్డారు. దీంతో బలరామకృష్ణ, ప్రభాకర్‌రెడ్డిల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రభాకర్‌రెడ్డి.. బలరామకృష్ణపై దాడి చేయడంతో స్వల్ప గాయాలయ్యాయి. తనపై దాడి చేసిన ప్రభాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బాలరామకృష్ణ మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నన్ను, నా భార్యను బలరామకృష్ణ బూతులు తిట్టాడని ప్రభాకర్‌రెడ్డి కూడా ఫిర్యాదు చేశాడు. ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన వారు కావడం విశేషం. ఇరువురి ఫిర్యాదులు స్వీకరించి కేసులు నమోదు చేసినట్లు సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు. పరస్పర ఆరోపణలు తనను చంపేందుకే ప్రభాకర్‌రెడ్డి కారుతో ఢీ కొట్టాడని బాలరామకృష్ణ ఆరోపించారు. గతంలో కూడా ఇలాగే చేస్తే మంత్రి సబితారెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కాగా తనపై రాజకీయంగా బురద జల్లేందుకే బాలరామకృష్ణ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. రోడ్డుకు ఎడమ వైపు కుక్క పిల్లలు ఉండడంతో వాటిని తప్పించబోయి కుడివైపు వస్తున్న బలరామకృష్ణ ద్విచక్ర వాహనాన్ని ప్రమాదవశాత్తు ఢీకొనడం జరిగిందని తెలిపారు. అంతేగానీ ఇందులో ఎలాంటి కుట్ర కోణం లేదన్నారు. కావాలనే బలరామకృష్ణ నన్ను, నా భార్యను బూతులు తిట్టాడని జిల్లెల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. -
హైదరాబాద్: మీర్పేట్ కార్పొరేటర్ భర్త వీరంగం
-
మొన్న పూజిత.. నేడు అమీక్ష
సాక్షి, హైదరాబాద్: అన్నంలో పురుగులు వస్తున్నాయని ఇటీవల 4వ తరగతి విద్యార్థిని పూజిత నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేయగా.. తాజాగా 2వ తరగతి చదువుతున్న మరో చిన్నారి ఇంటి పక్కన గొడవ జరుగుతుంది, వచ్చి ఆపాలని రాత్రి 11 గంటలకు డయల్ 100కు కాల్ చేసిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. ప్రశాంతిహిల్స్ రోడ్ నం–6కు చెందిన అమీక్ష (7) టీచర్స్‌కాలనీలోని భారతి స్కూల్లో 2వ తరగతి చదువుతోంది. ఆదివారం రాత్రి ఇంటి పక్కనే నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద ఇద్దరి కూలీలు గొడవ పడుతున్నారు. గొడవ జరుగుతున్నట్లు గ్రహించిన చిన్నారి అమీక్ష రాత్రి 11 గంటలకు తండ్రి సెల్‌ఫోన్ తీసుకొని డయల్ 100కు కాల్ చేసి ఇక్కడ గొడవ జరుగుతుంది.. వెంటనే వచ్చి గొడవను ఆపాల్సిందిగా కోరింది. బాలిక ఫిర్యాదు చేయడంతో మీర్‌పేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గొడవ పడుతున్న ఇద్దరు కూలీలకు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించారు. తొందరగా స్పందించినందుకు థ్యాంక్యూ అంకుల్ అని చిన్నారి చెప్పినట్లు సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు. అమీక్షను స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడ ఏ గొడవ జరిగినా, ఆపద వచ్చినా డయల్ 100కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సీఐ సూచించారు. -
మీర్పేట్లో దారుణం.. వివాహితపై ఎస్బీ కానిస్టేబుల్ అత్యాచారం
సాక్షి, హైదరాబాద్(మీర్‌పేట): మహిళపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు.. తనపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని, లేదంటే న్యూడ్ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించిన ఓ స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేసిన మీర్పేట్ పోలీసులు బుధవారం అతన్ని రిమాండ్‌కు తరలించారు. సీఐ మహేందర్‌రెడ్డి వివరాల ప్రకారం.. సైదాబాద్‌కు చెందిన పి.వెంకటేశ్వర్లు గతంలో మాధన్నపేట పీఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించాడు. వీరి ఇంటి సమీపంలో నివాసముండే బాధిత మహిళ (34) కుటుంబం.. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా ఉండేవారు. వేంకటేశ్వర్లు గతంలో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించగా ఆమె తిరస్కరించినప్పటికీ మానసికంగా, శారీరకంగా వేధిస్తుండడంతో 25 జనవరి, 2021న సైదాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఈ సమయంలో పోలీసులు అతనికి కౌన్సె లింగ్ ఇచ్చారు. అయినా వెంకటేశ్వర్లు తన బుద్ధి మార్చుకోకుండా మరలా మహిళను వేధించడంతో పాటు లైంగిక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేయడం మొదలుపెట్టాడు. దీంతో విసుగు చెందిన ఆమె మరోసారి సైదాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా.. 2021, మేలో వెంకటేశ్వర్లును రిమాండ్ చేశారు. ఆతర్వాత సదరు మహిళ ఫోన్ నంబర్‌తో పాటు తమ నివాసాన్ని మొదట ఈసీఐఎల్‌కు, అక్కడినుంచి మీర్‌పేట సీతాహోమ్స్కు మార్చింది. జైలు నుంచి బయటకు వచ్చిన వెంకటేశ్వర్లు హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు. అనంతరం మహిళ ఫోన్ నంబర్, ఇంటి అడ్రస్ తెలుసుకుని భర్త, పిల్లలు లేని సమయంలో ఇంటికి వచ్చి వేధించడం ప్రారంభించాడు. 2022, ఆగస్టు 17న మధ్యాహ్నం ఇంట్లోకి చొరబడి తనతో సహజీవనంచేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించి అత్యాచారం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు తీశాడు. ఈ నెల 14న మళ్లీ వెళ్లి.. గతంలో తనపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశాడు. పరుష పద జాలంతో ధూషిస్తూ లైంగిక దాడికి యత్నించగా ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో ఆగ్రహానికి గురైన అతడు నీ నగ్న చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించి వెళ్లిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుతో వెంకటేశ్వర్లుపై అత్యాచారంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టి రిమాండ్‌కు తరలించారు. చదవండి: (Hyderabad: చదివేది బీటెక్, సీఏ.. చేసే పనులేమో చైన్ స్నాచింగ్‌లు..) -
హైదరాబాద్‌లో దారుణం.. రెచ్చిపోయిన మృగాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో దారుణం జరిగింది. కొందరు దుండగులు లెనిన్‌నగర్‌లో బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దారుణ ఘటన నవంబర్ 5వ తేదీన జరిగినట్టు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. వివరాల ప్రకారం.. మీర్పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ బాలికపై ఇద్దరు వ్యక్తులు లైంగికదాడియత్నం చేశారు. కాగా, లెనిన్‌నగర్‌కు చెందిన బాధితురాలు.. తన రాత్రి సమయంలో తన స్నేహితురాలి ఇంటికి వెళ్తుండగా అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్లు ఆమెను కిడ్నాప్ చేశారు. అనంతరం, బైక్‌పై ఎక్కించుకుని బడంగ్‌పేట్‌లోని ప్రభుత్వ పాఠశాల వెనుకకు తీసుకెళ్లి ఆమెపై లైంగికదాడియత్నం చేశారు. ఈ క్రమంలో బాలిక కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. స్థానికుల రాకను గమినించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే, లైంగికయత్నంలో నిందితులు.. బాధితురాలిని బెదిరింపులకు గురిచేసినట్టు తెలుస్తోంది. తమ గురించి ఎవరికైని చెబితే చంపేస్తామని వార్నింగ్ ఇచ్చినట్టు బాధితురాలు పేర్కొంది. ఈ ఘటనపై బాధితురాలు, ఆమె పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
సంబంధంలేని గొడవలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన యువకుడు
సాక్షి, హైదరాబాద్: గొడవతో సంబంధం లేదు... గొడవ పడుతున్న వారితోనూ ఎటువంటి స్నేహం లేదు.. స్నేహితుడి ఇంటి వద్ద దించేందుకని వచ్చిన యువకుడు సంబంధం లేని తగాదాలోకి వెళ్లి ప్రాణాలమీదకు తెచ్చుకున్న విషాదకర సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, ఇన్చార్జి సీఐ నర్సింగ్ యాదయ్య కథనం ప్రకారం.. జిల్లెలగూడ బాలాజీకాలనీలో అద్దెకు ఉండే మణికంఠ తన స్నేహితులైన నరేందర్, నవీన్, సాయికుమార్, జైపాల్‌తో కలిసి శ్రీశైలం వెళ్లి ఆదివారం రాత్రి 11 గంటలకు కర్మన్‌ఘాట్ గ్రీన్‌పార్కు కాలనీకి వచ్చి ప్రవీణ్, భార్గవ (21)లతో కలిసి నిర్మానుష్య ప్రదేశంలో అర్ధరాత్రి వరకు మద్యం సేవించారు. ఆ తర్వాత మణికంఠ తనను ఇంటి వద్ద దించేందుకు టీకేఆర్ కమాన్ వద్ద నివాసముండే మరో స్నేహితుడు శరత్‌కు ఫోన్ చేసి పిలిపించుకున్నాడు. దీంతో శరత్ తన ద్విచక్ర వాహనంపై మణికంఠను తీసుకుని బాలాజీకాలనీలోని ఇంటికి వచ్చి తలుపు ఎంత కొట్టినా మణికంఠ తల్లి సంధ్యారాణి తలుపు తీయలేదు. ఇద్దరి సెల్ఫోన్లలో బ్యాలెన్స్ లేకపోవడంతో అదే వీధిలో నివాసముండే రమాదేవి తన మనువరాలి తొట్టెల శుభకార్యం (21వరోజు) చేసుకుంటున్నారు. దీంతో మణికంఠ, శరత్‌లు అక్కడికి వెళ్లి మా అమ్మపేరు సంధ్యారాణి.. తలుపు ఎంతకూ తీయడం లేదు. మా సెల్ఫోన్లలో బ్యాలెన్స్ అయిపోయిందని ఫోన్ ఇస్తే కాల్ చేసుకుంటామని రమాదేవిని అడిగారు. దీంతో రమాదేవి బంధువు అయిన మేడ్చల్ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రూపేష్‌కుమార్ ఈ అర్ధరాత్రి వేళ వచ్చి సెల్‌ఫోన్ అడుగుతున్నారు ఎందుకని ప్రశ్నించాడు. శరత్, రూపేష్ కుమార్ల మధ్య మాటమాట పెరిగి వాగ్వివాదం జరగడంతో అందరూ కలిసి కావాలనే అల్లరి చేస్తున్నారని శరత్, మణికంఠను కొట్టి అక్కడి నుంచి వెళ్లగొట్టారు. చదవండ: వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడ్డ ఏఆర్ కానిస్టేబుల్ ఇరువర్గాల మధ్య ఘర్షణతో.. అనంతరం ఇద్దరు కలిసి చందన చెరువు కట్ట వద్దకు వెళ్లి అక్కడే జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న వారి వద్ద నుంచి.. శరత్ సెల్‌ఫోన్ తీసుకుని బాలాపూర్ సాయినగర్‌కు చెందిన నరేందర్‌కు ఫోన్ చేసి తమపై దాడి చేశారని చెప్పాడు. తనను ఇంటి వద్ద దించేందుకు వెంట వచ్చిన భార్గవతో కలిసి వెంటనే నరేందర్ చెరువు కట్ట వద్దకు చేరుకున్నాడు. దీంతో పాటు శరత్ మరో స్నేహితుడైన ప్రవీణ్ ఇంటికి వెళ్లి బైక్‌పై ఎక్కించుకుని వచ్చాడు. ఐదుమంది కలిసి అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో శుభకార్యం జరుగుతున్న రమాదేవి ఇంటికి వెళ్లారు. అంతా మద్యం సేవించి ఉండటంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఎక్సైజ్ కానిస్టేబుల్ రూపేష్‌కుమార్‌పై ఇటుకతో దాడి చేయగా బంధువులంతా కోపోద్రిక్తులై యువకులను చితకబాదారు. పారిపోతున్న క్రమంలో భార్గవ కిందపడగా తీవ్రంగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే అతన్ని ఓవైసీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. మృతుడు భార్గవ సైదాబాద్ వాసి అని, మెడికల్ డిస్ట్రిబ్యూషన్లో సేల్స్‌మెన్‌గా పనిచేస్తుంటాడని సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించి దాడికి పాల్పడిన రూపేష్‌కుమార్, రమాదేవితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ యాదయ్య పేర్కొన్నారు. -
మూడేళ్ల క్రితం పెళ్లి.. రెండేళ్ల పాప.. భార్యతో గొడవపడి..
సాక్షి, రంగారెడ్డి: భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జిల్లెలగూడ బాలాజీనగర్‌లో నివసించే ఆవుల శివకుమార్(30), హారికలు భార్యాభర్తలు. వీరికి మూడేళ్ల క్రితం వివాహమైంది. రెండేళ్ల పాప ఉంది. శివకుమార్ టీకేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఉద్యోగం చేస్తున్నారు. సోమవారం దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన శివకుమార్ బెడ్రూంలోని ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించి, మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం.. భార్యకు వేధింపులు
సాక్షి, హైదరాబాద్: భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను, పిల్లలను పట్టించుకోకుండా మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ భార్య మహిళా సంఘాల నాయకులతో కలిసి ఇంటి ఎదుట ఆందోళనకు చేపట్టింది. ఈ ఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన దేవులపల్లి వేణుకుమార్ (46), కల్పన (42)కు 18ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కూతురు సంతానం. కొంతకాలంగా బడంగ్‌పేట శివనారాయణపురంలో నివాసమున్నారు. వేణుకుమార్ నగరంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. మూడేళ్లుగా భార్యాభర్తల మధ్య కలహాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో వేణు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని భార్య కల్పన ఆరోపిస్తూ గతంలో వరంగల్‌లోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వేణుపై కేసు నమోదు చేయడంతో పాటు కోర్టులో మెయింటెనెన్స్ కేసు నడుస్తోంది. తనను దూరం పెట్టాలనే ఉద్ధేశంతో మూడేళ్లుగా తనను, తన పిల్లలను పట్టించుకోవడం లేదని కల్పన శుక్రవారం స్థానిక మహిళా సంఘాల నాయకులతో కలిసి శివనారాయణపురంలోని భర్త ఇంటికి వచ్చి బైఠాయించి పోలీసులు, కోర్టు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ఈ సంఘటనకు సంబంధించి భార్యాభర్తలిద్దరూ ఫిర్యాదులు చేయగా కేసు విచారిస్తున్నామని సీఐ తెలిపారు. చదవండి: బిహార్‌లో కల్తీ మద్యం కలకలం.. 11మంది మృతి -
జానియర్పై లైంగిక దాడి.. వేధింపులు మితిమీరడంతో..
మీర్‌పేట: పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి బాలికపై అత్యాచారం చేశాడు. వీడియో తీసి బెదిరింపులకు పాల్పడుతున్న ఓ యువకుడిని మీర్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. సీఐ మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. బడంగ్‌పేటకు చెందిన బాలిక (17) బర్కత్‌పురాలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. అదే కళాశాలలో చదువుతున్న తోటి విద్యార్థి గుడ్డె అమిత్‌వర్ధన్ (19) సదరు బాలికను పరిచయం చేసుకుని ప్రేమిస్తున్నానని చెప్పాడు. మొదట నిరాకరించిన ఆమె తర్వాత సన్నిహితంగా మెలిగింది. ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఫిబ్రవరిలో అమిత్‌వర్ధన్ బడంగ్‌పేటలోని బాలిక ఇంటికి వచ్చి నీతో మాట్లాడాలని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా సెల్ఫోన్లో వీడియో చిత్రీకరించాడు. చదవండి: (భర్తతో విడాకులు.. మరొకరితో ప్రేమ.. విధులకు వెళ్తుండగా..) వీడియోను తరచూ బాలికకు చూపించి తాను చెప్పినట్లు చేయాలని, లేకపోతే సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించడం ప్రారంభించాడు. వేధింపులు మితిమీరడంతో బాలిక కుటుంబ సభ్యులకు తెలిపింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడు అమిత్వర్ధన్ను అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. -
హైదరాబాద్: ఇంట్లోనే వ్యభిచారం.. ముగ్గురు అరెస్ట్..
సాక్షి, హైదరాబాద్: వ్యభిచార గృహంపై దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్న సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. మీర్‌పేట సర్వోదయనగర్ కాలనీకి చెందిన నిర్వాహకురాలు వాసిరెడ్డి సుధారాణి తన ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం రాత్రి దాడి చేశారు. నిర్వాహకురాలు సుధారాణి, దిల్సుఖ్నగర్ కృష్ణానగర్‌కాలనీకి చెందిన విటుడు గట్ల రాజు (37)తో పాటు ఓ యువతిని అరెస్ట్ చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. సుధారాణి గతంలోనూ ఇదే కేసులో పట్టుబడినట్లు సీఐ వెల్లడించారు. కోర్టు భవనం -
వివాహేతర సంబంధం.. మహిళతో న్యూడ్ కాల్స్.. వాటిని రికార్డ్స్ చేసి!
సాక్షి, హైదరాబాద్: ఫేస్బుక్ పరిచయం అక్రమ సంబంధానికి దారితీసి చివరకు హత్యచేయించింది. మీర్‌పేటలో ఫోటోగ్రాఫర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు ప్రధాన నిందితురాలైన ఓ మహిళతో పాటు సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. మీర్‌పేట సీఐ మహేందర్‌రెడ్డి ప్రకారం... నగరంలోని భాగ్ అంబర్‌పేటకు చెందిన మల్కాపురం యష్మాకుమార్ (32) వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్. ఈయనకు 2018లో మీర్‌పేట నందిహిల్స్‌కు చెందిన వివాహిత బుచ్చమ్మగారి శ్వేతారెడ్డి (32)తో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరి మధ్య తరచూ ఫోన్ సంభాషణలు కొనసాగడంతో సన్నిహిత్యం పెరిగి అక్రమ సంబంధానికి దారితీసింది. కాగా యష్మాకుమార్ శ్వేతారెడ్డికి ఫోన్ చేసి న్యూడ్ కాల్స్ చేయమన్నాడు. వాటిని రికార్డ్ చేసుకున్న యష్మాకుమార్ నెల రోజుల నుంచి తనను పెళ్లి చేసుకోవాలని శ్వేతారెడ్డిపై ఒత్తిడి పెంచాడు. లేదంటే న్యూడ్ ఫొటోలు, వీడియో కాల్స్‌ను బంధువులకు పంపుతానని బెదిరించసాగాడు. ఆందోళనకు గురైన శ్వేతారెడ్డి యష్మాకుమార్ను హతమార్చాలని నిర్ణయించుకుంది. ఇందుకు కృష్ణాజిల్లా తిరువూరు మండలం ఎరుకోపాడు గ్రామానికి చెందిన ఓ ప్రైవేటు కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన కొంగల అశోక్ (28), ఎలక్ట్రీషియన్ కొత్తపల్లి కార్తీక్(30) సాయం కోరింది. పథకం ప్రకారం శ్వేతారెడ్డి ఈ నెల 3న యష్మాకుమార్కు ఫోన్ చేసి ఇంటికి రావాలని కోరింది. దీంతో అతను అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ప్రశాంతిహిల్స్ వద్దకు చేరుకోగానే అప్పటికే అక్కడ మాటువేసిన అశోక్, కార్తీక్ సుత్తితో యష్మాకుమార్ తలపై బలంగా దాడి చేశారు. దీంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. హత్య చేసిన తరువాత యష్మాకుమార్వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను తీసుకుని రావాలని శ్వేతారెడ్డి తెలుపగా సెల్‌ఫోన్ కనిపంచకపోవడంతో అక్కడి నుంచి వారు పారిపోయారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన యష్మాకుమార్ ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 6న మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న మీర్‌పేట పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి హత్య కేసులో ప్రధాన నిందితురాలైన శ్వేతారెడ్డి ఆమెకు సహకరించి హత్య చేసిన అశోక్, కార్తీక్‌లను బుధవారం రిమాండ్‌కు తరలించారు. చదవండి: ప్రేమించి పెళ్లి.. సంతానం కలగకపోవడంతో.. సోదరుల సమాధుల వద్ద -
'ఆమెకు 11 లక్షలు ఇస్తే.. రూ.5 కోట్లుగా మారుస్తుంది'
సాక్షి, మీర్‌పేట (రంగారెడ్డి): అతీంద్రియ శక్తులు ఉన్నాయని, ఇచ్చిన డబ్బుకు పదింతలు అధికంగా ఇస్తానని నమ్మించి రూ.11 లక్షలతో ఓ మహిళ, కొందరు వ్యక్తులు ఉడాయించిన సంఘటన మీర్‌పేట పోలీస్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. హస్తినాపురం కస్తూరికాలనీకి చెందిన శ్రీనివాస్‌రెడ్డి (43) వృత్తిరీత్యా వ్యాపారి. నందిహిల్స్‌లో నివాసముండే ఇతని స్నేహితుడు మహేశ్.. రాజు అనే ఓ వ్యక్తిని శ్రీనివాస్‌రెడ్డికి పరిచయం చేశాడు. రాజుకు తెలిసిన నగరంలోని ఓ మహిళకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని, ఆమెకు 11 లక్షలు ఇస్తే.. రూ.5 కోట్లుగా మారుస్తుందని చెప్పాడు. దీంతో శ్రీనివాస్‌రెడ్డితో పాటు అతని స్నేహితులైన మరో ఏడుగురు కలిసి రూ.11 లక్షలు పోగు చేశారు. మధ్యవర్తులుగా ఉన్న రాజు, వినోద్, మహమ్మద్‌ఖాన్‌ల ద్వారా ఈ నెల 1వ తేదీన రాత్రి సదరు మహిళను హస్తినాపురం విశ్వేశ్వరయ్య కాలనీలోని శ్రీనివాస్‌రెడ్డి సోదరుడి షెడ్డుకు పిలిపించి పూజలు చేయించారు. ముందుగా రూ.5 వేలు పూజలో పెడితే రూ.50 వేలుగా మారుస్తానని మహిళ చెప్పగా.. వారు ఆ నగదు ఇచ్చారు. కొద్దిసేపటి తర్వాత వాటిని రూ.50 వేలుగా చేసి చూపించింది. చదవండి: (వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ముగ్గురి అరెస్ట్) నమ్మకం కలిగించిన తర్వాత మిగతా డబ్బును కూడా పూజలో పెట్టాలని చెప్పగా శ్రీనివాస్‌రెడ్డి, అతని స్నేహితులు రూ.11 లక్షలు పూజలో పెట్టారు. పథకం ప్రకారం సదరు మహిళ అందరం కలిసి భోజనం చేద్దామని వారికి చెప్పింది. భోజనం చేస్తుండగా 15 మంది వ్యక్తులు రెండు కార్లలో అక్కడికి వచ్చి పోలీసులమని బెదిరించి శ్రీనివాస్‌రెడ్డి, అతని స్నేహితులపై కర్రలతో దాడి చేసి గాయపరిచారు. అనంతరం సదరు మహిళ పూజలో ఉంచిన రూ.11 లక్షలు తీసుకుని కారులో వచ్చిన వారితో పాటే పారిపోయింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు. -
హైదరాబాద్: కార్పొరేటర్ తనయుడి నిర్వాకం.. ప్రేమించాలంటూ బాలికకు..
సాక్షి, హైదరాబాద్: ప్రేమించాలంటూ ఓ బాలికను వేధిస్తున్న కార్పొరేటర్ తనయుడిపై మీర్‌పేట పోలీసులు పోక్సో, నిర్భయ కేసులు కేసు నమోదు చేశారు. సీఐ మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. జిల్లెలగూడ మల్రెడ్డి రంగారెడ్డి కాలనీకి చెందిన కార్పొరేటర్ కుమారుడు, మీర్‌పేట బీజేవైఎం అధ్యక్షుడు బచ్చనమోని ముఖేష్‌యాదవ్ స్థానికంగా నివసించే ఓ బాలిక (15)ను ప్రేమించాలంటూ కొంత కాలంగా వేధిస్తున్నాడు. తరచూ మెసేజ్‌లు పంపుతూ, ఫోన్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం బాలిక సమీపంలోని కిరాణాషాప్‌నకు వెళ్తుండగా ముఖేష్‌యాదవ్ వెంబడించి ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ముఖేష్‌యాదవ్‌పై పోక్సో, నిర్భయ చట్టాల కింద కేసులు నమోదు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. ముఖేష్‌పై మరో కేసు కూడా నమోదైందని, విచారణ జరుగుతోందని సీఐ తెలిపారు. చదవండి: అబ్దుల్లాపూర్ మెట్లో దారుణం.. జంట మృతదేహాల కలకలం -
రియల్ ఎస్టేట్ వ్యాపారం.. మరోవైపు పేద యువతులు, మహిళలతో వ్యభిచారం
సాక్షి, మీర్‌పేట: వ్యభిచార గృహంపై దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్న ఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మీర్‌పేట లక్ష్మీనగర్ కాలనీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించే పిల్లలమర్రి వేణు (33) ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ బద్యానాయక్ సిబ్బందితో కలిసి మంగళవారం సాయంత్రం ఇంటిపై దాడి చేశాడు. ఈ దాడిలో నిర్వాహకుడు వేణుతో పాటు బోడుప్పల్ ప్రాంతానికి చెందిన యువతి (24), వనస్థలిపురం క్రిస్టియన్ కాలనీకి చెందిన విటుడు కొల్లా బలరాముడు (52)లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి వెయ్యి రూపాయల నగదు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఉపాధి పేరిట ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేద యువతులు, మహిళలతో వ్యభిచారం చేయిస్తున్నట్టు సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు. పోలీసుల అదుపులో నిందితులు చదవండి: మహిళకు మాయమాటలు చెప్పి వ్యభిచారంలోకి లాగేందుకు యత్నం.. చివరికి -
సులభ్ కాంప్లెక్స్‌లోకి తీసుకెళ్లి బాలికపై అత్యాచారం..
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. బడంగ్పేట్లో స్థానికంగా ఉండే పండ్ల వ్యాపారి కూతురుపై పక్కనే ఉండే సులభ్ కాంప్లెక్స్‌లో పనిచేసే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. రవిందర్ అనే వ్యక్తి 10 ఏళ్ల బాలికను సులభ్ కాంప్లెక్స్ లోపలికి తీసుకెళ్లి న్యూడ్ వీడియో చూపిస్తూ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అయితే ఇంతలో తన కూతురు కనపడటం లేదని గుర్తించిన తల్లి.. అనుమానంతో సులభ్ కాంప్లెక్స్‌లోకి వెళ్లి వెతకగా చిన్నారి ఏడుపు వినిపించింది. వెంటనే డోర్ తీయడంతో రవిందర్ అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించాడు. దీంతో నిందితుడిని పట్టుకున్న స్థానికులు అతన్ని చితకబాదారు. అనంతరం మీర్పేట్ పోలీసులకు అప్పగించారు. చదవండి: ఇద్దరితోనూ సన్నిహితం.. అక్కపై మరిగిన నూనె పోసిన చెల్లెలు -
HYD: భర్తతో గొడవలు.. మరో వ్యక్తితో పరిచయం.. ఇద్దరు పిల్లలతో కలిసి
సాక్షి, మీర్‌పేట: భర్తతో గొడవపడిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కనిపించకుండా పోయింది. ఈ సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా పదర గ్రామానికి చెందిన కుమార్, రాధ (30) భార్యాభర్తలు. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. ఏడేళ్ల క్రితం దంపతుల మధ్య గొడవ జరగడంతో రాధ భర్తను వదిలేసి జిల్లెలగూడ అంబేడ్కర్‌నగర్‌కు వచ్చి ఓ అపార్ట్మెంట్లో వాచ్‌ఉమన్‌గా పనిచేస్తూ ఇక్కడే ఉంటోంది. తరచూ భర్త వచ్చి వెళ్తుండేవాడు. రాధ కూలీ పనులకు కూడా వెళ్తుండేది. ఈ క్రమంలో గుంటూరుకు చెందిన దుర్గాప్రసాద్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడడంతో రెండు నెలలుగా ఇద్దరు కలిసి ఉంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న భర్త కుమార్ గత నెల 4న కుటుంబసభ్యులతో కలిసి అంబేడ్కర్‌నగర్‌కు వచ్చి రాధను మందలించగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో అర్ధరాత్రి అందరూ నిద్రించిన తర్వాత రాధ తన ఇద్దరు కుమారులు రవి (10), గణేష్ (12)ను తీసుకుని దుర్గాప్రసాద్‌తో కలిసి వెళ్లి తిరిగి రాలేదు. వారి ఆచూకీ కోసం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో సోమవారం కుమార్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: గాంధీ, ఉస్మానియాలో కరోనా కలకలం.. 94 మంది వైద్యులు, సిబ్బందికి పాజిటివ్ -
మీర్పేట్లో వ్యభిచారం.. ముగ్గురి అరెస్ట్
సాక్షి, మీర్‌పేట: వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. అంబర్‌పేట పటేల్‌నగర్‌కు చెందిన నస్రీన్‌బేగం(35) కేటరింగ్ నిర్వహిస్తోంది. ఈమె టీకేఆర్ కమాన్ సమీపంలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు గురువారం సాయంత్రం దాడి చేశారు. నిర్వాహకురాలు నస్రీన్బేగంతో పాటు మరో ఇద్దరు యువతులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: (14 ఏళ్ల మేనల్లుడితో శారీరక వాంఛలు.. వీడియో రికార్డ్ చేసి..) -
హిజ్రా ప్రాణం తీసిన ప్రేమ: స్వప్నతో నిషాంత్ వివాహం.. తల్లిదండ్రులకు తెలిసి..
సాక్షి, మీర్పేట్: ప్రేమించి పెళ్లిచేసుకున్న వ్యక్తి వదిలివెళ్లాడని మనస్తాపానికి గురై ఓ హిజ్రా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాచలానికి చెందిన మొదపూరపు గుణ అలియాస్ స్వప్న (హిజ్రా) (24) కొంత కాలంగా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందనవనం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎంలోని ఓ ఫ్లాట్‌లో స్నేహితులతో కలిసి ఉంటోంది. మూడు నెలల క్రితం నల్లగొండ జిల్లా నిడమనూరుకి చెందిన బైక్ మెకానిక్ గోశెట్టి నిషాంత్‌తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి రెండు నెలల క్రితం ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇంట్లో పూజ ఉంది రమ్మని వారం క్రితం తండ్రి నుంచి ఫోన్ రావడంతో నిషాంత్ ఊరికి వెళ్లొస్తానని చెప్పివెళ్లాడు. హిజ్రాను వివాహం చేసుకున్నాడని తల్లిదండ్రులకు తెలిసి కొడుకును తిరిగి హైదరాబాద్ రానివ్వలేదు. నిషాంత్ విషయాన్ని స్వప్నకు ఫోన్ చేసి చెప్పాడు. ఆదివారం ఆమె వాళ్ల ఊరికి వెళ్లి చూడగా ఇంటికి తాళం ఉంది. దీంతో నిడమనూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిషాంత్, వారి తల్లిదండ్రులను పిలిపించగా స్వప్న తనకు ఇష్టం లేదని చెప్పడంతో మనస్తాపానికి గురైంది. రాత్రి నందనవనంలోని రూమ్‌కి వచ్చింది. సోమవారం ఉదయం ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. స్నేహితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. చదవండి: (పిల్లలను ఇంట్లో వదిలి వివాహిత అదృశ్యం) -
తండ్రి గేమ్ ఆడొద్దన్నాడని ఇంటర్ విద్యార్థిని దారుణం..
సాక్షి, రంగారెడ్డి : సెల్ఫోన్లో గేమ్స్ ఆడొద్దని తండ్రి మందలించడంతో మనస్తాపం చెందిన ఇంటర్ విద్యారి్థని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. బాలాపూర్‌కు చెందిన వెల్దుర్తి మనోహరాచారి, లావణ్య దంపతులు. పదేళ్లుగా మీర్‌పేట సర్వోదయనగర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. వీరికి కుమార్తెలు కౌశికి (17), అనుశ్రీ, కుమారుడు రేవంత్ ఉన్నారు. పెద్ద కుమార్తె కౌశికి ఐఎస్‌సదన్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తరచూ సెల్ఫోన్లో గేమ్స్ ఆడుతుండడాన్ని గమనించిన తండ్రి ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో గేమ్స్ ఆడడం ఆపేసి పడుకోవాలని మందలించి బయటకు వెళ్లాడు. చదవండి: ఆశ చంపమంది.. అపరాధ భావం చంపేసింది! మనస్తాపానికి గురైన కౌశికి క్షణికావేశంలో బెడ్రూంలోకి వెళ్లి లోపలి నుంచి గడియ పెట్టుకుని చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. గదిలో నుంచి అరుపులు వినపడడంతో గమనించిన తల్లి కిటికీలోంచి చూడగా కౌశికి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. అదే గదిలో పడుకున్న చిన్న కుమార్తె అరుపులకు లేచి గడియ తీసింది. వెంటనే తల్లి స్థానికుల సాయంతో కౌశికిని ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు. చదవండి: చెరువులో మునిగి నలుగురు హైదరాబాద్ యువకులు మృతి -
మన కుటుంబ పరిస్థితి ఎందుకు ఇలా ఉందంటూ..
సాక్షి, మీర్‌పేట: ఆర్థిక ఇబ్బందులు... ఉద్యోగం రాలేదని మనస్థాపానికి గురైన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహేశ్వరానికి చెందిన స్మిత భర్త సంతోష్‌కుమార్ కొన్నేళ్ల క్రితం చనిపోవడంతో ఇద్దరు కుమారులతో కలిసి నాలుగేళ్లుగా బాలాపూర్ చౌరస్తా సమీపంలోని ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీలో అద్దెకు ఉంటోంది. పెద్ద కుమారుడు వరుణ్ ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా చిన్న కుమారుడు విశాల్ (20) ఇంటర్ పూర్తి చేసి బీటెక్ మొదటి సంవత్సరంలోనే చదువు ఆపేసి ఉద్యోగం వేట మొదలుపెట్టాడు. చదవండి: తెలంగాణలో 20 మంది డీఎస్పీలకు స్థానచలనం ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవడంతో ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలన్న ఉద్దేశంతో విశాల్ కొన్ని నెలలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఎంతకూ ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనసస్థాపం చెందిన విశాల్ బుధవారం అర్ధరాత్రి అందరూ పడుకున్న తరువాత ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితి, ఉద్యోగం గురించి ఉద్యోగం విశాల్ తరచు కుటుంబ సభ్యులతో చర్చిస్తూ ఉండేవాడని.. మన కుటుంబ పరిస్థితి ఇలా ఎందుకు ఉందని ఆవేదనకు గురయ్యేవాడని కుటుంబసభ్యులు విలపించారు. ఈ క్రమంలోనే ఉద్యోగం రాకపోవడంతో మానసిక ఒత్తిడికి గురై విశాల్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు పేర్కొంటున్నారు. చదవండి: ఒంటరి మహిళలే టార్గెట్: అదే కిరణ్ ప్రత్యేకత -
మీ ఇంట్లో అతీంద్రియ శక్తులు, పూజలు చేస్తే ఐశ్వర్యం దక్కుతుందని.. చివరికి
మీర్‌పేట( హైదరాబాద్): మీ ఇంట్లో అతీంద్రియ శక్తులు ఉన్నాయని, క్షుద్రపూజలు చేస్తే శక్తులు మీ వశమై ఐశ్వర్యం, సంపద మీకు దక్కుతుందని నమ్మించి మోసానికి పాల్పడిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ గాంధీ నగర్‌కు చెందిన పిల్లి జితేందర్ (34) ప్రైవేటు ఉద్యోగం చేస్తుంటాడు. మహారాష్ట్ర యావత్మాల్ జిల్లాకు చెందిన అబ్ధుల్ గని (48) వృత్తిరీత్యా కార్పెంటర్. కుషాయిగూడ చీరాగల్లికి చెందిన మహ్మద్ దస్తగిరి (35) వస్త్ర వ్యాపారి. వీరు ముగ్గురు పథకం ప్రకారం 8నెలల క్రితం మీర్‌పేట సర్వోదయనగర్‌కు చెందిన కృష్ణవేణి ఇంటికి వచ్చి వారి ఇంట్లో అతీంద్రియ శక్తులు ఉన్నాయన్నారు. క్షుద్ర పూజలు చేయడం ద్వారా ఆ శక్తులు వారి సొంతమవుతాయని చెప్పారు. అవి సొంతమైతే కుబేరులవుతారని వారిని నమ్మించారు. క్షుద్ర పూజలు చేసేటప్పుడు బంగారు ఆభరణాలు, నగదు ఉంచాలని తెలిపారు. వారు ఐదున్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.11లక్షల నగదును మూటలో కట్టి ఉంచారు. క్షుద్రపూజలు చేసిన అనంతరం పూజ ముగిసిందని అక్కడి నుంచి జారుకున్నారు. వారు వెళ్లాక మూటను విప్పి చూడగా అందులోని బంగారం, నగదు కనిపించకపోవడంతో షాక్‌కు గురై మోసపోయినట్లు గ్రహించారు. ఆలస్యంగా వెలుగులోకి... ఈ సంఘటన జరిగిన 8 నెలల తరువాత ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. క్షుద్ర పూజల పేరిట మోసపోయినట్లు తెలుసుకున్న బాధిత కుటుంబం జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక, బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో ఎలాగోలా ధైర్యం చేసి జరిగిన మోసంపై ఆగస్టు 9వ తేదీన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు కృష్ణవేణి ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు క్షుద్రపూల పేరిట మోసానికి పాల్పడిన ముగ్గురు నిందితులు పిల్లి జితేందర్, అబ్ధుల్ గని, మహ్మద్ జితేందర్‌లను గురువారం అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.2.66 లక్షల నగదు, మూడు బంగారు నాణేలు, ఒక బంగారు గొలుసును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. -
ఫోన్లో మాట్లాడొద్దన్నందుకు యువతి ఆత్మహత్య
సాక్షి, మీర్‌పేట: ఫోన్లో మాట్లాడొద్దన్నందుకు యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సంఘటన వివరాల ప్రకారం... బడంగ్‌పేట చంద్రవిహార్‌కాలనీకి చెందిన లక్ష్మయ్య కుమార్తె ప్రశాంతి (18) డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ప్రశాంతి తరచు ఫోన్ మాట్లాడుతుండడంతో అధిక సమయం ఫోన్లో మాట్లాడవద్దని తండ్రి పలుమార్లు మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ప్రశాంతి సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
ఠాగూర్ సినిమాను తలపించే సీన్.. అస్సలు తగ్గేదే లే!
సాక్షి, మీర్‌పేట: వైద్యం పేరుతో మోసం చేసి తన భర్త మృతికి కారణమయ్యారని మృతుడి భార్య మీర్‌పేట పోలీసులకు రైజ్ చిల్డ్రన్స్ ఆసుపత్రి యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... కొత్తపేట హుడాకాంప్లెక్స్‌కు చెందిన పాశం సైదులు గౌడ్ ఏప్రిల్ 26వ తేదీన కరోనా బారిన పడి హస్తినాపురంలోని రైజ్ చిల్డ్రన్స్ ఆసుపత్రిలో చేరాడు. సైదులు పరిస్థితి విషమంగా ఉందని.. హెల్త్‌కార్డు తీసుకోమని రూ.50వేలు నగదు రూపంలో చెల్లిస్తేనే చేర్చుకుంటామని చెప్పడంతో ముందుగా రూ.50వేలు చెల్లించి ఆ తరువాత బెడ్ కోసం ప్రతి రోజు రూ.40వేలు, మాత్రలు, పరీక్షలకు వేర్వేరుగా నగదు చెల్లించారు. మరుసటి రోజు వైద్యులు 6 రెమ్‌డెసివర్ ఇంజెక్షన్లు అవసరమని.. రూ.30వేలకు బ్లాక్ మార్కెట్లో శంకర్ అనే వ్యక్తి వద్ద దొరుకుతాయని చెప్పి ఇంజెక్షన్లు ఇప్పించారని తెలిపారు. ఇదిలా ఉండగా సైదులుకు ప్లాస్మా కావాలని చెప్పడంతో కుటుంబ సభ్యులు రూ.20వేలు చెల్లించారు. ఏప్రిల్ 30వ తేదీన మరికొన్ని పరీక్షలు నిర్వహించాలని అందుకు రూ.60వేలు ఖర్చవుతుందని చెప్పి నగదు చెల్లించాక 14 గంటల తరువాత సైదులు పరిస్థితి విషమించిందని తెలిపారన్నారు. వెంటిలేటర్ అత్యవసరమని లక్ష రూపాయలు చెల్లించాలని తెలిపారు. మే 2వ తేదీన సైదులుకు నాలుగు యూనిట్ల ప్లాస్మా, మందులు అవసరమని, చెప్పి ఐదు రోజుల్లో కోలుకుంటాడని వైద్యులు చెప్పారు. అనంతరం మే 8వ తేదీన సైదులు మృతి చెందాడు. వైద్యం పేరుతో రైజ్ ఆసుపత్రి యాజమాన్యం లక్షల్లో డబ్బు వసూలు చేసి, రెమ్‌డెసివర్ ఇంజెక్షన్లు తన భర్తకు వేయకుండా ఇతరులకు అమ్ముకున్నారని మృతుడి భార్య పేర్కొన్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తన భర్త మృతి చెందాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు రెమ్‌డెసివర్ ఇంజెక్షన్లు అమ్ముకున్న మేనేజర్ శ్రీధర్‌రెడ్డితో పాటు వైద్యులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, రఘుదీప్, మనోహర్‌రెడ్డి, డైరెక్టర్ శిల్పపై చీటింగ్ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
మీర్ పెట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ భర్తదాష్టీకం
-
వేశ్యవాటిక గుట్టురట్టు.. ఇద్దరు యువతులు, 3 విటుల అరెస్ట్
సాక్షి, మీర్‌పేట: వ్యభిచార గృహంపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి నిర్వాహకురాలితో పాటు ఇద్దరు యువతులు, ముగ్గురు విటులను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. గాయత్రినగర్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు సోమవారం సాయంత్రం దాడి చేశారు. నిర్వాహకురాలు సరితతో పాటు ఇద్దరు యువతులు, విటులు గాయత్రినగర్‌కు చెందిన కుంచా వెంకటరమణ (45), వనస్థలిపురం సాగర్కాంప్లెక్స్కు చెందిన విజల యాదగిరి(51), బడంగ్‌పేట ద్వారకాహిల్స్కు చెందిన నేలేటి శ్రీనివాసులు(51)లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ర.10380 నగదు, 7 సెల్ఫోన్లు, ఒక బ్రెజా కారును సీజ్ చేసి అనంతరం మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. చదవండి: బార్లో వ్యభిచారం.. ఇద్దరు యువతులు, నిర్వాహకుల అరెస్ట్ -
రోడ్డుపైనే మృతదేహాన్ని ఉంచడంతో..
మీర్‌పేట: అనారోగ్యంతో మృతి చెందిన మహిళ మతదేహాన్ని ఇంట్లోకి రానివ్వకుండా ఇంటి యజమాని అడ్డుకున్న సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... హయత్‌నగర్‌కు చెందిన సుధీర (51) భర్త కొంత కాలం క్రితం చనిపోయాడు. ఇద్దరు కుమారులు నిఖిల్‌సాగర్ (25), నిషాంత్ సాగర్ (22)లు ఉన్నారు. పదేళ్ల క్రితం జిల్లెలగూడ బాలాజీకాలనీలో అద్దెకు ఉంటున్నారు. సుధీర కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందింది. దీంతో అంత్యక్రియల నిమిత్తం కుటుంబసభ్యులు మృతదేహాన్ని సాయంత్రం ఇంటికి తీసుకొచ్చారు. మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకునివ్వకుండా ఇంటి యజమాని నిరాకరించింది. దీంతో కుటుంబ సభ్యులు చేసేది లేక ఇంటి బయటే రోడ్డుపై టెంట్ వేసి మృతదేహాన్ని ఉంచారు. విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానిక నాయకులు జోక్యం చేసుకుని యజమానికి నచ్చజెప్పడంతో ఆ తరువాత కుటుంబసభ్యులు ఇంటి లోపలి వరండాలో మృతదేహాన్ని ఉంచి ఏర్పాట్లు చేసిన అనంతరం జిల్లెలగూడ శ్మశానవాటికిలో అంత్యక్రియలు నిర్వహించారు. పరస్పర దాడులు.. కేసు నమోదు పహాడీషరీఫ్: కోర్టు కేసు ఉన్న భూ విషయమై రెండు గ్రూపులు దాడులకు పాల్పడిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పహాడీషరీఫ్‌కు చెందిన ఇర్ఫాన్, ఇమ్రాన్ గ్రూప్‌కు ఇజ్రత్ అలీ, విరాహసత్ అలీ మరో గ్రూప్ నడుమ భూ వివాదం నెలకొంది. ఈ స్థలంలో గురువారం ఇర్ఫాన్ అలీ, ఇమ్రాన్ అలీలు ప్రహరీ నిర్మాణం చేపట్టారు. విషయం తెలుసుకున్న మరో వర్గం అడిగేందుకు రాత్రి 10గంటలకు వెళ్లారు. ఈ సమయంలో రెండు గ్రూప్‌లు పరస్పరం దాడులకు పాల్పడ్డాయి. అనంతరం ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య చాదర్‌ఘాట్: కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన చాదర్‌ఘాట్ పోలీస్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై గోపి తెలిపిన వివరాల ప్రకారం.. ఆజంపురాకు చెందిన విజయ్‌కుమార్ (39) పెయింటర్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గురువారం అర్ధరాత్రి భార్యను రూమ్‌లోంచి బయటకు నెట్టివేసి తలుపులు బిగించుకుని ఇనుపరాడ్డుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తమ్ముడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: చెట్టుపై కూర్చున్నట్లుగా యువతి మృతదేహం.. -
‘నువ్వు, నీ కడుపులోని బిడ్డ ఇద్దరు చచ్చిపోండి’
సాక్షి, మీర్‌పేట: ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిని యువకుడిపై మీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... వికారాబాద్‌కు చెందిన కర్రె అనూష (22) 2017 సంవత్సరంలో ఒవైసీ నర్సింగ్ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ 3వ సంవత్సరం చదువుతుండగా హస్తినాపురంకు చెందిన విజయ్‌కుమార్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని అనూషను నమ్మించాడు. ఈ క్రమంలో అనూష గర్భం దాల్చడంతో విజయ్‌కుమార్ పెళ్లి చేసుకోకపోగా ఎలాగైనా వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. తాజాగా ఓ దొంగతనం కేసులో అనూష జైలుకు వెళ్లడంతో అప్పటి నుంచి విజయ్‌కుమార్ ఫోన్ స్విచ్చాఫ్ చేసి కనిపించకుండా పోయాడు. జైలు నుంచి బయటకు వచ్చిన అనూష వెంటనే విజయ్‌కుమార్ తల్లిదండ్రులకు ఫోన్ చేయగా నువ్వు, నీ కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరు చచ్చిపోండని బెదిరించారు. విజయ్‌కుమార్ స్పందించకపోవడంతో అనూష మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు విజయ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: చంపి అయినా ‘పరువు’ కాపాడుకోవాలనుకుని.. బయటకు వెళ్లకుండా తల వ్రెంటుకలను కట్ చేయించి.. -
సీన్ రివర్స్, అయినా కూడా కోవిడ్ టీకా డ్రామా, ఆపై
మీర్‌పేట: కోవిడ్ టీకా పేరిట ఓ యువతి వృద్ధ దంపతులకు మత్తుమందు ఇచ్చి 8 తులాల బంగారు ఆభరణాలను అపహరించి కొత్తరకం మోసానికి పాల్పడిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... జిల్లెలగూడ లలితానగర్ రోడ్ నం.1కు చెందిన కుంతాల లక్ష్మణ్ (80), కస్తూరి (70) దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు బెంగళూరులో, చిన్న కుమారుడు దుబాయ్‌లో స్థిరపడడంతో ఇద్దరే ఒంటరిగా ఉంటున్నారు. లక్ష్మణ్ విద్యుత్ శాఖలో అకౌంటెంట్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందాడు. వికారాబాద్‌కు చెందిన విజయ్, అనూష (21)లు లక్ష్మణ్ పక్కింట్లో అద్దెకు ఉంటున్నారు. విజయ్ ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా అనూష మందమల్లమ్మ సమీపంలోని విశ్వాస్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసి మానేసింది. ప్రస్తుతం బీఎస్సీ నర్సింగ్ 4వ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో వృద్ధ దంపతులతో ఆప్యాయతగా మాటలు కలిపి పరిచయం పెంచుకోవడంతో వారు అనూషపై నమ్మకం పెంచుకున్నారు. మూడు నెలల క్రితం అనూష ఇంటిని ఖాళీ చేసి అదే కాలనీలోని మరో ఇంట్లో అద్దెకు దిగారు. పాత పరిచయంతో కస్తూరి ఒంటిపై ఉన్న ఆభరణాలపై కన్నేసిన అనూష పథకం ప్రకారం శుక్రవారం వృద్ధ దంపతుల వద్దకు వచ్చి తాను గర్భవతినని, ప్రస్తుతం 8వ నెలని, తల్లిగారింటికి వెళ్తున్నానని ఆప్యాయతగా మాట్లాడి మత్తు మందు కలిపిన పాయసం ఇవ్వగా వారు తినలేదు. సీన్ రివర్స్ కావడంతో మరుసటి రోజు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు అనూష మరలా వచ్చి తాను ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్నానని, కోవిడ్–19టీకా వేస్తానని మరో డ్రామాకు తెరలేపగా వృద్ధ దంపతులు దీనికీ నిరాకరించారు. బలవంతంగా వారికి ‘మిడోజాలం’అనే మత్తు మందును కోవిడ్–19టీకాగా నమ్మించి వేయగా వారు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే కస్తూరి ఒంటిపై ఉన్న బంగారు గాజులు, చెవి కమ్మ లు, మాటీలు, రెండు ఉంగరాలు, పుస్తెలతాడును తీసుకుని అక్కడినుంచి జారుకుంది. దాదాపు రెండున్నర గంటల తరువాత తేరుకున్న లక్ష్మణ్ బంగా రు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న క్రైం ఎస్ఐ మారయ్య చాకచక్యంగా వ్యవహరించి స్థానికులు, సీసీపుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టి రెండు గంటల్లో అనూషను అదుపులోకి తీసుకుని ఆమె వద్ద నుంచి బంగారాన్ని స్వాధీ నం చేసుకున్నారు. అనూషపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తామని సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు. చదవండి: ఎస్సారెస్పీ కాలువలోకి కారు.. ముగ్గురు మృతి చదవండి: పులి విహారం.. టూరిస్టు గైడ్లుగా మహిళలు -
మాయగాళ్లు, ఖాళీ ప్లాట్లు కనిపిస్తే చాలు..
సాక్షి, మీర్‌పేట: ఖాళీ ప్లాట్లపై కన్నేసి యజమానులకు తెలియకుండా నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్లను విక్రయించి మోసాలకు పాల్పడుతున్న తొమ్మిది మంది ముఠా సభ్యుల్లో ఇద్దరిని మీర్‌పేట పోలీసులు అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నాదర్గుల్కు చెందిన వల్లాల ప్రేమ్‌కుమార్ (45), బాలాపూర్‌కు చెందిన చెరుకూరి కిరణ్‌కుమార్, శ్రీనివాస్‌నాయక్, కృష్ణారెడ్డి, హేమలత, నరేష్, వి.శివారెడ్డి, ఏ.సంతోష్, ఎలిమినేటి సుకుమార్‌రెడ్డిలు కలిసి 1980–90 నాటి వెంచర్లలోని ఖాళీ ప్లాట్లపై కన్నేసి వాటికి సంబంధించి నకిలీ పత్రాలు తయారు చేసి అసలు యజమానులకు తెలియకుండా ఇతరులకు ప్లాట్లు విక్రయిస్తున్నారు. కాగా సికింద్రాబాద్ పద్మారావునగర్‌కు చెందిన అక్కాచెళ్లెల్లు తుమ్మల రమాదేవి, తుమ్మల యహేమలతలకు చెందిన మీర్‌పేట నందిహిల్స్ సర్వే నం.29లో రెండు ప్లాట్ల (నం–21, 22)కు సైతం 1985 నాటి నిజమైన పత్రాలను పోలి ఉండేలా నకిలీ పత్రాలను తయారు చేసి విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఇది తెలుసుకున్న ప్లాట్ల యజమానులు రమాదేవి, హేమలత వెంటనే మీర్‌పేట పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు చెరుకూరి కిరణ్‌కుమార్‌తో కలిసి మొత్తం 8 మంది సభ్యులు మోసానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. వీరిలో ఏ3గా ఉన్న వల్లాల ప్రేమ్‌కుమార్, ఏ6గా ఉన్న ఎలిమినేటి సుకుమార్‌రెడ్డిలను శుక్రవారం అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నకిలీ పత్రాలు తయారు చేసే సామగ్రిని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని, ఇందులో హస్తినాపురం మాజీ కార్పొరేటర్ సోదరుడు కూడా ఉన్నాడని సీఐ పేర్కొన్నారు. -
మీర్పేట్లో వ్యభిచార గృహం సీజ్
సాక్షి, మీర్‌పేట: వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటిని మీర్ పేట పోలీసులు బాలాపూర్ మండల రెవెన్యూ అధికారుల సమక్షంలో సీజ్ చేశారు. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మీర్‌పేట ఆర్ఎన్రెడ్డినగర్ టీకేఆర్ కళాశాల సమీపంలోని ఓ ఇంట్లో వ్యభి చారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఈనెల 5వ తేదీన ఇంటిపై దాడి చేసి నిర్వాహకులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు గురువారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ సమక్షంలో సదరు ఇంటిలోని మొదటి అంతస్తును సీజ్ చేశారు. -
మీర్‌పేట చెరువుకు గండి.. టెన్షన్లో ప్రజలు
సాక్షి, హైదరాబాద్ : భారీ వర్షాల కారణంగా నగర శివారులోని మీర్పేట్–బడంగ్‌పేట్‌ల మధ్య ఉన్న పెద్ద చెరువు కట్టకు గండిపడింది. రోడ్లుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారుల హెచ్చరికలతో న్యూ బాలాజీనగర్ కాలనీలో 90 శాతం మంది, జనప్రియనగర్‌లోని క్వార్టర్లలో 20 శాతం మంది ఇప్పటికే తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. మిగిలిన కాలనీల్లోనూ చాలా వరకు ఇళ్లు ఖాళీ అయ్యాయి. (చదవండి : వణికిస్తున్న మీర్పేట్ చెరువు) మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్‌పేట–బడంగ్‌పేట మధ్యలో ఉన్న చెరువు పేరులోనే కాదు విస్త్రీర్ణంలోనూ చాలా పెద్దది. హరితహారంలో భాగంగా చెరువు కట్టకు భారీగా డ్రిల్లింగ్ చేశారు. మొక్కల కోసం తవ్విన ఈ గుంతల నుంచి వాటర్ లీకేజీ అవుతోంది.శిఖం భూములు చాలా వరకు కబ్జాకావడం, ఇంటి వ్యర్ధాలను కట్టకు లోపలి వైపు పోయడంతో చెరువు విస్త్రీర్ణం చాలా వరకు కుంచించుకుపోయింది. చిన్న పాటి వర్షానికి చెరువు పొంగిపొర్లుతోంది. ఫలితంగా కింద ఉన్న న్యూబాలాజీనగర్, జనప్రియనగర్, ఎంఎల్‌ఆర్‌కాలనీ, ఎస్ఎల్ఎన్ ఎస్‌కాలనీ, టీఎస్‌ఆర్‌కాలనీ, అయోధ్యనగర్‌లకు వరద పోటెత్తి నీటమునుగుతున్నాయి. -
వణికిస్తున్న మీర్పేట్ చెరువు
సాక్షి, మీర్పేట్: నగర శివారులోని మీర్పేట్–బడంగ్‌పేట్‌ల మధ్య ఉన్న పెద్ద చెరువు నివురుగప్పిన నీరులా ఉంది. చెరువు ప్రమాదకర స్థితిలో ఉందని, ఏ క్షణంలోనైనా కట్టకు గండిపడే మీర్‌పేట పరిధిలోని పెద్దచెరువుకు గండిపడితే.. ఆ నీరంతా ఆయా కాలనీల మీదుగా కింద ఉన్న మంత్రాల చెరువులోకి చేరుతోంది. ఇప్పటికే మంత్రాల చెరువు పొంగిపొర్లుతుండటంతో దానికింద ఉన్న మిథులానగర్, సత్యసాయి నగర్లు పూర్తిగా నీటమునిగాయి. మంత్రాల చెరువు నుంచి నీరంతా సందె చెరువులోకి చేరి అటు నుంచి కాలనీలను ముంచేస్తూ..జిల్లెలగూడ, మందమల్లమ్మ, వివేక్‌నగర్, కర్మన్‌ఘాట్, గ్రీన్పార్క్కాలనీల మీదుగా సరూర్‌నగర్ చెరువులోకి చేరుతోంది. సరూర్‌నగర్ చెరువులోకి ఒక్కసారిగా వరద నీటి ఉధృతి పెరిగితే..దాని కింద ఉన్న చాలా కాలనీలు నీటమునుగుతాయి. అందువల్లే ఇక్కడి ప్రజల బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఇప్పటికే వారం రోజుల నుంచి వరదలో మగ్గిపోయి... ఇప్పుడిప్పుడే తేరుకుంటుండగా..పెద్దచెరువ రూపంలో మరో ప్రమాదం పొంచి ఉందనే వార్త వారిని వణికిస్తోంది. అధికారులు ఏం చర్యలు తీసుకుంటారోనని ఎదురుచూస్తున్నారు. ప్రమాదం లేకపోలేదని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఆ చెరువు కింద ఉన్న కాలనీవాసుల్లో మరింత ఆందోళన మొదలైంది. ముందస్తు చర్యల్లో భాగంగా లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయిస్తుండటంతో ఇళ్లు, వాకిళ్లను వదిలేసి బతుకుజీవుడా అంటూ బాధితులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. రియల్ వ్యాపారుల మాటలు నమ్మి రూ.లక్షలు వెచ్చించి ఇళ్లను కొనుగోలు చేసి ప్రస్తుతం తాము భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 90 శాతం ఇళ్లు ఖాళీ... మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్‌పేట–బడంగ్‌పేట మధ్యలో ఉన్న చెరువు పేరులోనే కాదు విస్త్రీర్ణంలోనూ చాలా పెద్దది. హరితహారంలో భాగంగా చెరువు కట్టకు భారీగా డ్రిల్లింగ్ చేశారు. మొక్కల కోసం తవ్విన ఈ గుంతల నుంచి వాటర్ లీకేజీ అవుతోంది. శిఖం భూములు చాలా వరకు కబ్జాకావడం, ఇంటి వ్యర్ధాలను కట్టకు లోపలి వైపు పోయడంతో చెరువు విస్త్రీర్ణం చాలా వరకు కుంచించుకుపోయింది. చిన్న పాటి వర్షానికి చెరువు పొంగిపొర్లుతోంది. ఫలితంగా కింద ఉన్న న్యూబాలాజీనగర్, జనప్రియనగర్, ఎంఎల్‌ఆర్‌కాలనీ, ఎస్ఎల్ఎన్ ఎస్‌కాలనీ, టీఎస్‌ఆర్‌కాలనీ, అయోధ్యనగర్‌లకు వరద పోటెత్తి నీటమునుగుతున్నాయి. అధికారుల హెచ్చరికలతో న్యూ బాలాజీనగర్ కాలనీలో 90 శాతం మంది, జనప్రియనగర్‌లోని క్వార్టర్లలో 20 శాతం మంది ఇప్పటికే తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. మిగిలిన కాలనీల్లోనూ చాలా వరకు ఇళ్లు ఖాళీ అయ్యాయి. ఇసుక బస్తాలతో పాటు కట్టపై మట్టిని పోసి ప్రమాదం జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ‘మాది విజయవాడ. ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తున్నా. హైదరాబాద్‌లో సొంత ఇల్లు కొనుక్కోవాలనేది నా జీవితాశయం. ఆ మేరకు 18 నెలల క్రితం హౌసింగ్ లోన్ తీసుకుని మీర్‌పేట న్యూ బాలాజీనగర్‌లో రూ.54 లక్షల వెచ్చించి ఇల్లు కొన్నా. కుటుంబ సభ్యులతో కలిసి ఇదే ఇంట్లో ఉంటున్నాం. పదిహేను రోజుల నుంచి వరద ఓ మోస్తరుగా ఉంది. మూడు రోజుల క్రితం భారీగా పోటెత్తింది. కాలనీలోని ఇళ్లను ముంచెత్తింది. ఇంట్లోకి భారీగా వరద చేరడంతో టీవీ, కంప్యూటర్, రిఫ్రిజిరేటర్, వాషింగ్‌మిషన్ సహా ఉప్పు, పప్పు, బియ్యం ఇలా నిత్యావసర వస్తువులన్నీ వరదనీటిలో మునిగిపోయాయి. ఉన్న ఫలంగా ఇల్లు వదిలేసి కట్టు బట్టలతో బయటికి రావాల్సి వచ్చింది. అటు బిల్డర్ చెప్పిన మాటలతోనే కాదు.. ఇటు వరదతోనూనిండా మునిగిపోయాం.’ ... ఇదీ న్యూ బాలాజీనగర్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రవికుమార్ ఆవేదన. నగర శివారు ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లను కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరిదీ ఇదే వ్యథ. ప్రాణభయంతో వెళ్తున్నా చాలా రోజులుగా ఎంఎల్‌ఆర్‌కాలనీ ముంపులోనే ఉంది. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ ఇప్పటికే తడిసిపోయాయి. రూ.2 లక్షలకుపైగా నష్టం వాటిల్లింది. మురుగునీటి మధ్య ఇంట్లో ఉండలేక బయటకు రాలేక నరకం అనుభవిస్తున్నాం. ప్రస్తుతం పెద్దచెరువు కట్ట తెగే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో చేసేదేమీలేక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇంటిని వదిలి వెళ్తున్నా. ఇప్పటికే చాలా మంది ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. – రాజు, ఎంఎల్‌ఆర్‌కాలనీ పెద్ద చెరువు లీకేజీలను అరికట్టేందుకు ముందస్తుగా చర్యలు చేపట్టాం. కట్టపై నాలుగు చోట్ల ఇసుక బస్తాలను వేస్తున్నాం. ఇప్పటికే కింది కాలనీలను ఖాళీ చేయించాం. – బి.సుమన్‌రావు, కమిషనర్ -
ప్రముఖ గాయకుడుకి మాతృ వియోగం
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు, ఇండియన్ ఐడల్ రన్నరప్ కారుణ్య మాతృమూర్తి కన్నుమూశారు. మీర్‌పేట కార్పోరేషన్ బాలాపూర్ చౌరస్తా సమీపంలోని త్రివేణినగర్‌లో కారుణ్య తల్లి జానకి (70), తండ్రి మధు నివాసం ఉంటున్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ బీడీఎల్ విశ్రాంత ఉద్యోగులు. జానకి గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఆమె శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. సైదాబాద్ శ్మశాన వాటికలో జానకి అంత్యక్రియలు నిర్వహించారు. జానకి మృతి పట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
మీర్పేట్ వైన్ షాపులో చోరి
-
25 నయా నగరం..వేల కోట్ల వ్యయం!
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని పలు నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థల్లో సమస్యలు తిష్ట వేశాయి. గ్రామీణ నేపథ్యం నుంచి పట్టణాలుగా.. తర్వాత నగరపాలక సంస్థలుగా వెంటవెంటనే రూపాంతరం చెందినా... పలు సమస్యలు స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలుగ చేస్తున్నాయి. రహదారులు, భూగర్భ డ్రైనేజీ, శానిటేషన్, వీధిలైట్లు, పార్కుల అభివృద్ధి లాంటి సదుపాయాలు మచ్చుకైనా కానరావడం లేదు. ఓఆర్ఆర్ పరిధిలోని 15 పురపాలక సంస్థలు, 7 కార్పొరేషన్లు అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచాయి. ఈ నగరాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు సుమారు రూ.25 వేల కోట్లు అవసరమవుతాయని ఇటీవల అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఈ స్థాయిలో నిధులు వెచ్చించే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం.. ఆయా నగరపాలక సంస్థలు లేవు. ఈ నగర పాలక సంస్థలకు ఏటా లభిస్తున్న ఆదాయం అరకొరగా పారిశుద్ధ్య వసతుల కల్పన, ఉద్యోగుల జీతభత్యాలకే సరిపోతోంది. ప్రధానంగా నిజాంపేట్, బోడుప్పల్, మీర్పేట్, బడంగ్పేట్ నగరపాలక సంస్థలకు ఏటా వచ్చే ఆదాయం కంటే వ్యయం అధికంగా ఉంటోంది. కార్పొరేషన్లలో ప్రధాన సమస్యలు ఇవే.. ►ఈ నగరపాలక సంస్థల్లో పట్టణ ప్రణాళిక గాడి తప్పింది.మాస్టర్ ప్లాన్ అమలు ఊసేలేదు. ►మురుగునీరు, ఇరుకు రహదారులతో ఇబ్బందులు. ►గ్రీన్ బెల్ట్, పార్కుల అభివృద్ధి లేదు. ►పుట్టగొడుగుల్లా వెలిసిన అక్రమ కట్టడాలను నియంత్రించేవారే కరువయ్యారు. ►గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు మంచినీటి సరఫరా అరకొరే. ►ఘన వ్యర్ధాల నిర్వహణ కాగితాలకే పరిమితం. ►మురుగునీటి శుద్ధి, పునర్వినియోగం జాడే కానరాదు. ►ప్రజారోగ్యం గాల్లో దీపం అయింది. ∙యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాల ఆక్రమణ ►పలు నగరపాలక సంస్థల్లో ముంపు సమస్యతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు కంటి మీద కునుకు ఉండటంలేదు. కార్పొరేషన్లు /సమస్యలు నిజాంపేట్ జనాభా: 3 లక్షలు ఆదాయం: రూ.30 కోట్లు; వ్యయం: రూ.35 కోట్లు ప్రధాన సమస్యలు: ముంపు సమస్యలు, డ్రైనేజీ, మంచి నీటి వసతుల లేమి, ప్రభుత్వ స్థలాల ఆక్రమణ. బోడుప్పల్ జనాభా: 1.35 లక్షలు ఆదాయం: రూ. 30 కోట్లు; వ్యయం: రూ.32 కోట్లు సమస్యలు: రహదారులు, పార్కుల లేమి, డ్రైనేజీ సమస్యలు, తాగునీటి పైపులైన్ లీకేజీ. మీర్పేట్ జనాభా: 84 వేలు ఆదాయం: రూ. 23 కోట్లు; వ్యయం: రూ. 25 కోట్లు సమస్యలు: చెరువుల కలుషితం, భూగర్భ డ్రైనేజీ సదుపాయం లేకపోవడం, తాగునీటి సమస్యలు. బడంగ్పేట్ జనాభా: 1.16 లక్షలు ఆదాయం: రూ.30 కోట్లు; వ్యయం: రూ. 35 కోట్లు సమస్యలు: అక్రమ కట్టడాలు, డ్రైనేజీ సదుపాయం లేమి, పార్కులు అసలే లేకపోవడం. త్వరితగతిన చేపట్టాలి... మీర్‌పేట కార్పొరేషన్ పరిధిలోని 3 చెరువులు కలుషితం కావడంతో పరిసర కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డైనేజీ నీరు చెరువుల్లో కలవకుండా చేపడుతున్న ట్రంకులైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. తోడేటి ప్రసాద్, మీర్‌పేట నాణ్యతలేని రోడ్లు మీర్‌పేట కార్పొరేషన్లో ప్రధాన రహదారులన్నీ గుంతలమయంగా మారాయి. మున్సిపాలిటీ అధికారులు నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా రోడ్లు వేస్తుండటంతో అవి కొన్ని రోజులకే గుంతలమయంగా మారుతున్నాయి. ఇజాజ్ మీర్‌పేట -
సిన్మాలు చూసి.. ఇంటర్నెట్లో వెతికి..!
సాక్షి, హైదరాబాద్: 14 ఏళ్ల పిల్లాడు ఏడేళ్ల బాలుణ్ని కిడ్నాప్ చెయ్యడం సాధారణ వ్యక్తుల్నే కాదు.. పోలీసుల్ని కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది. అందుకే అతన్ని లోతుగా విచారించారు. కిడ్నాప్‌కు తెగించిన నేపథ్యాన్ని తెలుసుకున్నారు. కిడ్నాప్ ఆలోచన ఎలా వచ్చిందని అడిగారు. పోలీసులకు ఏ మాత్రం తడుముకోకుండా ఆ బాలుడు చెప్పిన సమాధానాలు మరింత ఆశ్చర్యం కలిగించాయి. సినిమాలను చూసే తాను చోరీలు, కిడ్నాప్ చెయ్యడం నేర్చుకున్నానని ఆ బాలుడు పోలీసులకు చెప్పాడు. మీర్‌పేటలో ఏడేళ్ల బాలుణ్ని 14 ఏళ్ల మరో బాలుడు కిడ్నాప్ చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. పదో తరగతి చదివే బాలుడు మూడు లక్షలు కావాలంటూ మీర్‌పేటలో అర్జున్ అనే పిల్లాడిని కిడ్నాప్ చేశాడు. బాలుడి తండ్రికి ఫోన్ చేసి మీ కొడుకు నీకు దక్కాలంటే వెంటనే డబ్బు ఏర్పాటు చెయ్యి అని బెదిరించాడు. చివరికి పోలీసులు చైల్డ్ కిడ్నాపర్‌ను ఫేస్బుక్ అకౌంట్, సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా పట్టుకున్నారు. ఏడేళ్ల అర్జున్ను సేవ్ చేసి.. కిడ్నాప్ కథను సుఖాంతం చేశారు. అయితే.. ఈ 14 ఏళ్ల పిల్లాడికి కిడ్నాప్ ఆలోచన ఎలా వచ్చింది. వాడి బుర్రలో ఉంటే చదువు లేదా ఆటపాటలు ఉండాలి. అలాంటిది నేరాలు, ఘోరాలు.. ఈజీగా డబ్బు సంపాదించే మార్గాల గురించి ఎందుకు ఆలోచించాడు. ముందుగా పోలీసులు అతని నేపథ్యం ఏంటో తెలుసుకున్నారు. గతంలో అతను ఓ ఇంట్లో లక్ష రూపాయలు చోరీ చేసి దొరికిపోయాడట. అప్పటికైనా పెద్దవాళ్లు అతని ఆలోచనల్ని పసిగట్టాల్సింది. ఆ విషయం పోలీసులదాకా వెళ్లకుండా కప్పిపెట్టారు. ఆ దొంగతనాన్ని సెటిల్ చేసుకున్నారు. ఇది జరిగి నెల రోజులు కూడా గడవలేదు. ఇంతలోనే కిడ్నాప్ చేశాడు. ఈ కిడ్నాప్ తర్వాత పోలీసులు కిడ్నాప్ చేసేంత ధైర్యం నీకు ఎలా వచ్చిందంటూ బాలుడిని ప్రశ్నించారు. సినిమాల్లో హీరోలు చేసే చోరీలను చూసి తాను కూడా డబ్బు కోసం దొంగతనాలు చెయ్యాలని డిసైడయ్యాడట. ఈ క్రమంలోనే వెంటనే ఎక్కువ డబ్బు ఎలా వస్తుందంటూ ఇంటర్ నెట్లో వెదుకుతూ వెళ్తే.. కిడ్నాప్ చెయ్యాలని అతనికి తట్టిందట. అలా సినిమాలు.. వీడియోలు చూసిన అనుభవాన్ని ఆచరణలో పెట్టినట్లు బాలుడు చెప్పాడు. అలా వచ్చే డబ్బుతో ఏం చేస్తావ్ అడిగినప్పుడు.. ఛలో ముంబై.. ముంబయి ఎగిరిపోయి... జల్సాగా బతకాలి అన్నాడట. బాలుడి ప్రవర్తనలో ఇంతటి మార్పులకు కారణం అతను చూసే సినిమాలు, వీడియోలేనని పోలీసులు తెలిపారు. సినిమాలు తీసేవాళ్లకు ఆ సినిమా ఎంత బలమైన మాధ్యమమో.. దాన్ని ఎంతమంది పిల్లలు చూసి నేర్చుకుంటారో అనే బాధ్యత ఉండదు. అమ్మాయిల్ని ఏడిపించే హీరోలను.. చోరీలను చేసే హీరోలను.. గ్యాంగులు మెయిన్ టైన్ చేసి డాన్ లుగా ఎదిగే హీరోలను చూస్తూ మన పిల్లలు పెరుగుతున్నారు. ఎక్కువగా ఏం చూస్తే వాటిని అనుసరించడం పిల్లల సహజ స్వభావం. నేరం అని తెలియకుండా నేరాలు చేసే పిల్లలు.. దొరికిపోతామన్న భయం లేకుండా తీవ్రమైన క్రైమ్స్ చేసే పిల్లలు ఇప్పుడు పెరిగిపోతున్నారు. వాళ్ల అలా మారడానికి కారణం సమాజం. మనముందున్న పరిస్థితులేమిటన్న వాస్తవం ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బయటపడుతోంది. అందుకే పిల్లల్ని రెండు రకాలుగా రక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. పిల్లల్ని నేరాల బారిన పడకుండా కాపాడుకుంటూనే... నేరాల వైపు ఆకర్షితులు కాకుండా పెంచడం తల్లిదండ్రులకు కత్తిమీద సాములాంటిదే. -
హైదరాబాద్ మీర్పేట్లో పేలుడు..
సాక్షి, హైదరాబాద్ : మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పేలుడు కలకలం రేపింది. విజయపురి కాలనీలో చెత్త ఏరుకుంటున్న ఓ మహిళ డబ్బాను నేలకేసి కొట్టడంతో ఈ పేలుడు చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయపురి కాలనీలో చెత్త ఏరుకునే మహిళకు చెత్తకుప్ప సమీపంలో డబ్బా దొరికింది. దీంతో ఆమె డబ్బాను తెరిచేందుకు యత్నించింది. అయితే డబ్బా తెరుచుకోకపోవడంతో.. దానిని నేలకేసి కొట్టింది. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో చెత్త ఏరకునే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరకుని డబ్బాను స్వాధీనం చేసుకుని క్లూస్ టీమ్‌కు అప్పగించారు. పేలుడుకు గల కారణాలపై విచారణ చేపట్టారు. బాంబ్ స్కాడ్ కూడా మరికాసేపట్లో ఘటన స్థలానికి చేరుకోనుంది. గతంలో శివరాంపల్లిలో పీవీ ఎక్స్‌ప్రెస్‌వే 279 పిల్లర్ దగ్గర ఇలాంటి ఘటనే చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చెత్త ఏరకునే వ్యక్తి మృతి చెందాడు. -
వేధింపులతో పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్య..!
సాక్షి, హైదరాబాద్ : మీర్పేట్లోని తీగల రాంరెడ్డి (టీఆర్ఆర్) కాలేజీలో విషాదం చోటేచేసుకుంది. పాలిటెక్నిక్ ఫైనలియర్ చదుతున్న సంధ్య అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. కాలేజీ యాజమాన్యం బెదిరింపుల వల్లనే సంధ్య బలవన్మరణానికి పాల్పడిందని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పార్వతి మేడమ్ వేధింపులు భరించలేకనే సంధ్య మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ కాలేజీ గేటు ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. డిటెండ్ చేస్తామని కాలేజీ యాజమాన్యం బెదిరిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పాలిటెక్నిక్ విద్యార్ధిని ఆత్మహత్య..!
-
భర్త మందలించాడని.. పిల్లలతో సహా అదృశ్యం
మీర్‌పేట : భర్త మందలించాడని ముగ్గురు పిల్లలతో సహా ఓ మహిళ అదృశ్యమైన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన నేనావత్ శ్రీను నగరానికి వలసవచ్చారు. నందనవనం వాంబేకాలనీలో భార్య విజయ (35), పిల్లలు నిఖిల్ (16), వైశాలి (13), మహేష్‌లాల్ (11)లతో కలిసి నివాసం ఉంటున్నారు. శ్రీను విద్యుత్ శాఖ కార్యాలయంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల విజయ తరచూ ఫోన్లో మాట్లాడుతుండటాన్ని గుర్తించిన శ్రీను ఆమెను మందలించాడు. దీంతో మనస్తాపానికిలోనైన విజయ ఈ నెల 2న ముగ్గురు పిల్లలతో కలిసి ఇంట్లో నుంచి ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత తిరిగిరాలేదు. ఆందోళనకు గురైన శ్రీను బంధువులు, చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ప్రయోజనం లేకపోవడంతో బుధవారం మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పెన్షన్ కోసం కన్న తండ్రిని..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మీర్పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పెన్షన్ డబ్బుల కోసం ఓ యువకుడు కన్న తండ్రిని అతి కిరాతకంగా హతమార్చాడు. వివరాల్లోకి వెళ్తే.. మీర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడలో నివాసం ఉంటున్న కృష్ణ వాటర్ బోర్డ్‌లో పనిచేసి.. ఆరు నెలల క్రితం పదవి విరమణ పొందాడు. నెలవారి పెన్షన్ డబ్బులతో జీవనం సాగిస్తున్న కృష్ణతో అతడి కుమారుడు తరుణ్ తరుచు గొడవపడుతుండేవాడు. పెన్షన్ డబ్బులు తనకు ఇవ్వాల్సిందిగా తండ్రిపై ఒత్తిడి చేసేవాడు. అయిన కృష్ణ డబ్బులు ఇవ్వకపోవడంతో.. తండ్రిపై పగ పెంచుకున్న తరుణ్.. అతనిపై ఇనుప రాడుతో దాడికి దిగాడు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ కృష్ణను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్టుగా తెలిపారు. దీంతో కృష్ణ మృతదేహాన్ని తిరిగి ఇంటికి తీసుకువచ్చిన కుటుంబసభ్యులు బంధువులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నారు. -
ప్రేమపేరుతో వేధింపులు
మీర్‌పేట: ప్రేమించాలని ఓ విద్యార్థినిని వేధిస్తున్న యువకుడిపై ఈ పెట్టి కేసు నమోదు చేసి పోలీసులు రెండు రోజులు జైలుశిక్ష విధించిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ యాదయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అల్మాస్‌గూడకు చెందిన బాలిక స్థానిక పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. తిరుమలహిల్స్‌కు చెందిన కార్లకోట భువనేశ్వర్ (22) ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా అతను స్కూల్ వద్దకు వెళ్లి తనను ప్రేమించాలని బాలికను వేధిస్తున్నాడు. దీనిపై బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ పెట్టి కేసు నమోదు చేసిన పోలీసులు రెండు రోజుల జైలుశిక్ష విధించారు. -
మీర్పేట్లో బాలిక దారుణ హత్య!
హైదరాబాద్: ఇంట్లో అదృశ్యమైన ఓ బాలిక దారుణ హత్యకు గురైంది. వివరాలు..మీర్పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అల్మాస్గూడ రాజీవ్ గృహకల్ప కాలనీలో నివాసముండే 8వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలిక వైష్ణవి తప్పిపోయింది. ఎక్కడ వెతికినా జాడ లేకపోవడంతో తల్లిదండ్రులు నిన్న(ఆదివారం) స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలికను అపహరించిన దుండగులు హత్య చేసి సమీపంలోని చర్చి ప్రాంతంలో మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు. సోమవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మీర్పేట్లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్స్
-
భార్య,ఇద్దరు పిల్లలను కిరాతకంగా చంపేశాడు
-
మీర్‌పేటలో ట్రిపుల్ మర్డర్
-
మీర్‌పేట సుమిత్ర ఎన్‌క్లేవ్‌లో దారుణం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని మీర్‌పేటలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యతో పాటు కన్నబిడ్డలు ఇద్దర్నీ హతమార్చాడో దుర్మార్గుడు. అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. వివరాల్లోకి వెళితే మీర్పేట్ సుమిత్ర ఎన్క్లేవ్ లో నివాసం ఉంటున్న హరీందర్ గౌడ్...సోమవారం తెల్లవారుజున భార్య జ్యోతి, కుమారుడు అభితేజ్ (6), కుమార్తె సహస్ర(5)ను గొంతు నులిమి అతి దారుణంగా హత్యచేశాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని కాలనీవాసులకు చెప్పి... నేరుగా మీర్‌పేట పీఎస్‌లో లొంగిపోయాడు. కాగా హరిందర్ మలక్‌పేటలో సొంతంగా వ్యాపారం నిర్వహిస్తున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆటోను ఢీకొన్న కారు: ఇద్దరు యువకుల మృతి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మీర్పేట్ పరిధిలోని నాదర్గుల్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక శ్రీనిలయ టౌన్షిప్ వద్ద ఆటోను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తాపడింది. మాధవ్, నితిన్ అనే ఇద్దరు యువకులు మృతిచెందారు. హరీష్, తరుణ్ అనే మరో ఇద్దరు గాయపడ్డారు. -
మీర్‌పేటలో భర్తను చితకబాదిన భార్య
-
వేరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని...
-
భర్తకు దేహశుద్ధి చేసిన భార్య
హైదరాబాద్: వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి తన భార్యకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. దాంతో ఆమె అతనికి దేహశుద్ధి చేసింది. ఈ సంఘటన మీర్పేట్లో బుధవారం ఉదయం జరిగింది.పరమేష్ అనే వ్యక్తి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొన్నాళ్లుగా అతన్ని గమనిస్తూ వస్తున్న భార్య నాగలక్ష్మి భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. పరమేష్ ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భర్తని ఉతికారేసిన భార్య -
పోలీసులపై బ్లేడుతో దాడి
హైదరాబాద్: మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సల్మాన్ అనే దొంగ హల్చల్ చేశాడు. ఆటో చోరీ కేసులో ఉన్న అతడిని పట్టుకునేందుకు వెళ్లిన కానిస్టేబుళ్లపై బ్లేడుతో దాడి చేసి పరారయ్యాడు. దీంతో రమేష్ అనే కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. అతడిని గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. మొత్తం ఐదు దొంగతనం కేసుల్లో సల్మాన్ నిండుతుడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.