తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. ఎక్కువ వడ్డీ రేట్లకు అప్పులు ఇవ్వడంతో పాటు దాడులకు తెగబడుతున్నారు. తాజాగా హైదరాబాద్ మీర్పేట్ శేషాద్రినగర్లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది.
మైనా ప్రైవేట్ ఫైనాన్స్ ఏజెంట్ అరుణ్కుమార్ అరాచకం సృష్టించాడు. కొడుకు అప్పు తీర్చాలని తల్లిదండ్రులను అరుణ్ చితక్కొట్టాడు. దీంతో బాధితులు మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.