మీర్‌పేట మాధవి కేసులో గురుమూర్తి అరెస్ట్‌ | Meerpet Married Woman Case, Madhavi Husband Gurumurthy Arrested, More Details Inside | Sakshi
Sakshi News home page

సంచలన మీర్‌పేట కేసులో గురుమూర్తి అరెస్ట్‌

Published Tue, Jan 28 2025 2:33 PM | Last Updated on Tue, Jan 28 2025 3:51 PM

Meerpet Case Madhavi Husband Gurumurthy Arrested

సాక్షి, హైదరాబాద్‌: సంచలనం సృష్టించిన మీర్‌పేట వెంకట మాధవి హత్య కేసులో ఎట్టకేలకు భర్త గురుమూర్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఉదయం ఇంటి వద్ద సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ పూర్తి చేసిన పోలీసులు.. మధ్యాహ్నాం అరెస్టును ధృవీకరించారు. అంతకు ముందు.. 

మాధవి కనిపించకుండా పోయిందన్న కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ కేసును ఇప్పుడు మర్డర్‌ కేసుగా మార్చారు.  సాయంత్రం నిందితుడిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 

వెంకట మాధవిని గురుమూర్తి కిరాతకంగా హతమార్చిన సంగతి తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ విస్మయానికి గురి చేసే విషయాలు వెలుగు చూశాయి. ఆమెను హతమార్చాక.. మలయాళ సినిమా సూక్ష్మదర్శిని ప్రేరణతో మృతదేహాన్ని మాయం చేశాడు గురుమూర్తి. ఆ తర్వాత కూడా సినిమా టికెట్లు బుక్‌ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో రకరకాల ప్రచారాలు మీడియాలో జరగ్గా.. సాయంత్రం ప్రెస్‌మీట్‌లో పోలీసులు ఆ విషయాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

భార్య మాధవితో గొడవ పడి ఆమెను హతమార్చి.. ఆపై మృతదేహాన్ని కుక్కర్‌లో వేసి ఉడకబెట్టాడు గురుమూర్తి. ఆపై ఆ మాంసాన్ని కమర్షియల్‌ గ్యాస్‌ స్టౌవ్‌పై కాల్చాడు. చివరకు ఎముకల్ని పొడి చేసి చెరువులో కలిపాడు. సాంకేతిక ఆధారాలతో గురుమూర్తిని ఇప్పుడు పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement