వర్షం ఎఫెక్ట్‌.. మీర్‌పేట్‌లో ఇళ్లలోకి వరద నీరు | Flood Water Coming Into Houses At Meerpet Due To Heavy Rains Effect In Hyderabad | Sakshi
Sakshi News home page

Heavy Rains In Hyderabad: వర్షం ఎఫెక్ట్‌.. మీర్‌పేట్‌లో ఇళ్లలోకి వరద నీరు

Published Thu, Sep 26 2024 11:54 AM | Last Updated on Thu, Sep 26 2024 12:39 PM

Flood Water Coming Into Houses At Meerpet

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పలు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుకుంది. వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని మీర్‌పేట్‌ ఏరియాలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మీర్‌పేట్‌ పరిధిలోని మిథిలా నగర్‌, సత్యసాయి నగర్‌ సహా పలు కాలనీల్లోకి చెరువు నీరు వచ్చి చేరుతోంది. నీరు ఇళ్లలోకి చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక​.. ఎస్‌ఎన్‌డీపీ నాలా మూసుకుపోవడంతో మ్యాన్‌హోల్స్‌ నుంచి నీరు ఉప్పొంగుతోంది. రాత్రి నుంచి క్రమంగా నీరు పెరిగి ఉదయానికి నీరు ఇళ్లలోకి చేరుకుంది.

ఈ సందర్బంగా స్థానికులు మాట్లాడుతూ.. గత ముడు రోజులుగా మా కాలనిలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. బయటికి రాలేము, ఎటు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. వర్షాల కారణంగా మంత్రాల చెరువు, పెద్ద చెరువు నిండి వరదనీరు కాలనీలోకి వస్తోంది. వరద నీటి కోసం గతంలో వేసిన ట్రాంక్ పైప్ లైన్లు మూసుకుపోవడంతో ఇళ్లలోకి వరద నీరు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వస్తున్నారు చూస్తున్నారు కానీ.. శాశ్వత పరిష్కారం లేదని తెలిపారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement