Hyderabad Rains
-
హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే పలుచోట్ల వర్షం కురుస్తోంది. తెలంగాణలో కూడా నేడు పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నగరంలోని అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరాతబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎస్ఆర్ నగర్, బేగంపేట్, కూకట్పల్లి, బాలానగర్, కుత్బుల్లాపూర్, మూసాపేట సహా పాలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. ఇక, తెలంగాలో కొద్ది రోజులుగా మేఘావృత వాతావరణం నెలకొన్ని విషయం తెలిసిందే. Hyderabad looks so beautiful with light rain and the glowing city skyline. A perfect peaceful Morning! 🌧️🌃 #HyderabadRains #CitySkyline #BeautifulHyderabad #RainyVibes@HyderabadMojo@HiHyderabad @hyderabadprop @ikaranreddy pic.twitter.com/fQaWuSDSHl— HyderabadInfra (@HyderabdInfra) December 8, 2024 -
హైదరాబాద్‌లో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఎండ కారణంగా ఉక్కపోతతో సతమతమవుతున్న నగరవాసులకు కొంత ఉపశమనం కలిగింది. హైదరాబాద్‌లో పలుచోట్ల ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తోంది. దీంతో, రోడ్లపై భారీ వరద నీరు చేరుకుంది.నగరంలోని బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, ముషీరాబాద్, చిక్కడపల్లి, ట్యాంక్ బండ్, మేడ్చల్, అల్వాల్, కూకట్పల్లి, నిజాంపేట్, ఎస్ఆర్నగర్, జీడిమెట్ల, సికింద్రాబాద్, బేగంపేట్ సహా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరుకుంది. దీంతో, భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. Hyderabad rains right now Alhamdulillah #Hyderabadrains pic.twitter.com/yXotf9aWP8— kashif Qureshi (@kashiflion) October 3, 2024 Hyderabad Rain Movement.Isolated Places Get Heavy Rain.Thunderstorms....⛈️Cloud's moving Downward Direction.Be Alert....⚠️#HyderabadRains#HeavyRain pic.twitter.com/1n69AEE4lc— Jagtial District Weather Forecast....🛰⛈️ (@SkyForecastMaN4) October 3, 2024ఇది కూడా చదవండి: కూల్చి వేతలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు -
వర్షం ఎఫెక్ట్.. మీర్పేట్లో ఇళ్లలోకి వరద నీరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పలు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుకుంది. వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని మీర్పేట్ ఏరియాలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మీర్పేట్ పరిధిలోని మిథిలా నగర్, సత్యసాయి నగర్ సహా పలు కాలనీల్లోకి చెరువు నీరు వచ్చి చేరుతోంది. నీరు ఇళ్లలోకి చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక.. ఎస్ఎన్డీపీ నాలా మూసుకుపోవడంతో మ్యాన్‌హోల్స్ నుంచి నీరు ఉప్పొంగుతోంది. రాత్రి నుంచి క్రమంగా నీరు పెరిగి ఉదయానికి నీరు ఇళ్లలోకి చేరుకుంది.ఈ సందర్బంగా స్థానికులు మాట్లాడుతూ.. గత ముడు రోజులుగా మా కాలనిలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. బయటికి రాలేము, ఎటు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. వర్షాల కారణంగా మంత్రాల చెరువు, పెద్ద చెరువు నిండి వరదనీరు కాలనీలోకి వస్తోంది. వరద నీటి కోసం గతంలో వేసిన ట్రాంక్ పైప్ లైన్లు మూసుకుపోవడంతో ఇళ్లలోకి వరద నీరు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వస్తున్నారు చూస్తున్నారు కానీ.. శాశ్వత పరిష్కారం లేదని తెలిపారు. -
తెలంగాణకు అలర్ట్.. నేడు ఏడు జిల్లాలో గట్టి వానలు
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్ప పీడన ప్రభావంతో నేడు ఏడు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో బుధవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే, మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. Today's Forecast ⚠️⛈️Today will be another day of powerful thunderstorms in North, Central TG districts mainly during afternoon - midnight. Widespread storms aheadHyderabad will get a thunderstorm for 6th consecutive day again like yesterday during afternoon- night ⚠️ pic.twitter.com/c0bt720er9— Telangana Weatherman (@balaji25_t) September 25, 2024 ఇక, మంగళవారం అత్యధికంగా జనగామ జిల్లా దేవరుప్పులలో 11.5 సెం.మీ. వర్షం కురిసింది. నల్గొండ జిల్లా కామారెడ్డి గూడెంలో 10.9, తిమ్మాపూర్‌లో 9.9, శాలిగౌరారంలో 9.1, రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లో 8.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో కూడా పలుచోట్లు మోస్తరు వర్షం కురిసింది. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుకుంది. Raining here at #Khajaguda Circle ⛈️#Hyderabadrains pic.twitter.com/ySDOSIj8f2— Hyderabad Rains (@Hyderabadrains) September 24, 2024ఇది కూడా చదవండి: యాదాద్రి రాజగోపురానికి బంగారు తాపడం -
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో వాతావరణం మారిపోయింది. ఒక్కసారిగా భారీ కురుస్తోంది. ఆదివారం ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగానే ఉన్నా.. సాయంత్రానికి వర్షం దంచికొడుతోంది.కాగా, నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్, బేగంపేట్, యూసఫ్‌గూడ సహా పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షం మొదలైంది. మరోవైపు.. వర్షం కారణంగా గణేష్ విగ్రహాల నిమజ్జనానికి ఆటంకం కలుగుతోంది. Now ✅West Hyderabad to see Short Rains for 5 Minutes — 5:00 PM— Gachibowli — Kondapur — Hitech City — Miyapur⚠️Near-by Areas #HyderabadRains— Hyderabad Rainfall Alert⛈️ (@Hyderabadstorm) September 15, 2024ఇది కూడా చదవండి: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్.. సీఎం రేవంత్ వార్నింగ్ -
హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: నగరంలో మళ్లీ పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం జల్లులతో మొదలైన వర్షం.. కుండపోతగా మారింది. భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు.ఇక, నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, మాదాపూర్, ఖైరాతాబాద్, కొండాపూర్, పంజాగుట్టా, ఎస్ఆర్ నగర్, ఫిల్మ్ నగర్, బోరబండా, మెహదీపట్నం,బేగంపేట్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.Sunday Music Start #HyderabadRains pic.twitter.com/qP1uje5IX3— Johnnie Walker🚁 (@Johnnie5ir) September 8, 2024 Rainy day#rains #hyderabadrains #RainyDay pic.twitter.com/gSztUEI8cZ— Best Bike (@bestbike2023) September 8, 2024 Heavy rain in Begumpet Airport @balaji25_t 🌧️🌪️#Hyderabad #HyderabadRains#WeatherUpdate pic.twitter.com/FbtcUOHHbo— పంజా (@HarishNaidu01) September 8, 2024 Rains further Covers all parts in ✅Hyderabad by 3:15 PM ✅North Hyderabad to reduce rains after 3:20 PM#HyderabadRains https://t.co/WYklIZ5jPY— Hyderabad Rainfall Alert⛈️ (@Hyderabadstorm) September 8, 2024 -
హైదరాబాద్‌లో కుండపోత వర్షం..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. ఒక్కసారిగా నల్లటి మేఘాలు కమ్ముకుని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఖైరతాబాద్, మెహిదీపట్నం, బేగంపేట, అబిడ్స్, కోఠి, నాంపల్లిలో భారీ వర్షం కురిసింది. మియాపూర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, బోడుప్పల్ సహా పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం పడింది. సాయంత్రం కావడంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. Very heavy smashing rain at Tellapur side. #Tellapur #HyderabadRains pic.twitter.com/dquYSIRmZx— Jagadish Reddy (@Jagadish_M) September 6, 2024 #06SEP 5:10PM⚠️Heavy Rain Spell ahead for West, Central, South &East #Hyderabad City.#Serilingampally, #Patancheru, #Kukatpally, #Begumpet, #Secunderabad,Abids,Khairatabad,Shaikpet, Charminar, Lb nagar Surroundings will see good Rains during the next 1hr⛈️⚠️#Hyderabadrains pic.twitter.com/vgpORYwzwg— Hyderabad Rains (@Hyderabadrains) September 6, 2024 Raining #Khajaguda 🌧️🌧️#Hyderabadrains pic.twitter.com/rnJ9GNbLBy— Hyderabad Rains (@Hyderabadrains) September 6, 2024 -
హైదరాబాద్‌లో మళ్లీ ఒక్కసారిగా వర్షం.. ఫుల్ ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మళ్లీ వర్షం మొదలైంది. గురువారం సాయంత్రం ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా కుండపోతగా వర్షం కురుస్తోంది. జోరుగా కురుస్తున్న వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. సాయంత్రం సమయం కావడంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.కాగా, హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట్, యూసుఫ్‌గూడ, మెహిదీపట్నం, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, బాచుపల్లి, ప్రగతినగర్, నిజాంపేట్, మియాపూర్ సహా తదితర ప్రాంతాల్లో వరద కురుస్తోంది.#HYDTPinfo#RainAlert It started #Raining.Commuters please drive carefully.#HyderabadRains#Monsoon2024 pic.twitter.com/bRClAaOqqA— Hyderabad Traffic Police (@HYDTP) September 5, 2024 #Hyderabadrains !!Now heavy rains going in west Hyderabad City places bachupally West south see good rains 🌧️⚠️ pic.twitter.com/vFk1EtdSUd— Telangana state Weatherman (@tharun25_t) September 5, 2024 🔴 #HyderabadRains Update Moderate-Intense rains happening in south of #Hyderabad #Nalgonda #Nagarkurnool moving to #Mahbubnagar & Convection in #chhatisgarh & NAP move to Eastern #Telangana #Mulugu #Bhadradri #Khammam #Bhupalpally #Suryapet #Mancherial tonight #TelanganaRains ⚠️ https://t.co/XrgG6twBzj pic.twitter.com/rMWfpTR1Fk— MADRAS WEATHERMAN (R G Prasad) 🇮🇳 (@Prasadweather) September 5, 2024 -
హైదరాబాద్‌లో మొదలైన వర్షం.. రాత్రిలోపు భారీ వర్ష సూచన
హైదరాబాద్, సాక్షి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీనికితోడు మరో రుతు పవన ద్రోణి కూడా ఏర్పడడంతో రాష్ట్రం అంతటా వానలు మొదలయ్యాయి. రాజధాని నగరం హైదరాబాద్‌లో ఈ ఉదయం నుంచి వాన మొదలైంది. వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం.. చురుకుగా కదులుతోంది. నేడు, రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని, మిగతా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌లో ఈ రాత్రిలోపు భారీ వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది.మరోవైపు శుక్రవారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. ములుగు జిల్లా మల్లంపల్లిలో 5.6 సెం.మీలు, వరంగల్ జిల్లా నల్లబెల్లిలో 4.2, దుగ్గొండిలో 4, భదాద్రి కొత్తగూడెం జిల్లాలో 3.8 సెం.మీటర్ల వర్షం కురిసింది. -
హైదరాబాద్‌లో మళ్లీ దంచికొట్టిన వాన.. తెలంగాణకు ఐదురోజులు భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరవ్యాప్తంగా దట్టమైన మేఘాలు కమ్ముకుని జడివాన కురిసింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఒక్కసారిగా భారీ వర్షం పడింది. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరోవైపు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ సిబ్బంది హెచ్చరించారు. ఇదే సమయంలో హెల్ప్‌లైన్ నెంబర్లు ఇచ్చారు.హెల్ప్‌లైన్ నెంబర్స్ ఇవే:040-21111111, 9000113667నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, పంజాగుట్ట, అమీర్‌పేట్, నిజాంపేట్, ప్రగతి నగర్, బాచుపల్లి, పటాన్ చెరు, రామచంద్రపురం, అమీన్ పూర్, ఖైరతాబాద్, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో, రోడ్లపై ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోయింది. భారీ వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.#Hyderabadrains!!Now raining in Gachibowli 🌧️⚠️ pic.twitter.com/nLt7pXCZ3W— Telangana state Weatherman (@tharun25_t) August 16, 2024 మరోవైపు.. తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక, గురువారం సాయంత్రం హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో, జనజీవనం అస్తవ్యస్తమైంది. Ee varsham andira eee Hyderabad laaa 🌦️⛈️🌧️☔️💧#HyderabadRains pic.twitter.com/v1bKqPSDqB— Heisenberg (@abhinayrdy) August 16, 2024 #Gachibowli#HyderabadRains pic.twitter.com/YzMEKvpkvu— Jagadish Reddy (@jagadish757) August 16, 2024 -
హైదరాబాద్‌లో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సాయంత్రం సమయంలో వర్షం కురుస్తుండటంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కాగా, హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. బుధవారం సాయంత్రం కూకట్పల్లి, అమీర్‌పేట, ఎస్ఆర్ నగర్, మూసాపేట్, చందానగర్, మియాపూర్, జగద్గిరిగుట్ల సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు.. రోడ్లపై ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్థంభించిపోయింది. వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. #Hyderabadrains!!Now iosalted thunder storm rains for west Hyderabad City places like Kukatpally serilingampally nizampet miyapur Quthbullapur places see good rains 🌧️🌧️⚠️ pic.twitter.com/aJlZvA4rSg— Telangana state Weatherman (@tharun25_t) August 14, 2024 -
బిగ్ అలర్ట్.. ఈ తెలంగాణ జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. మరో రెండ్రోజులపాటు ఈ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మరోవైపు రాజధాని హైదరాబాద్‌ను కూడా భారీ వర్షం ముంచెత్తే అవకాశం ఉందని తెలిపింది. భద్రాది కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రెండు నుంచి మూడు రోజులపాటు భారీ వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది. అలాగే బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఇప్పటికే ఆ పది జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా నిన్నటి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. వాగులు, వంకలు పొంగుతున్నాయి. ఇక ఇవాళ(శనివారం) సాయంత్రం హైదరాబాద్ తో పాటు పరిసర జిల్లాల్లో సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణ శాఖ తాజా ప్రకటనతో జీహెచ్ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. -
Hyd: నగరాన్ని ముంచెత్తిన వాన(ఫోటోలు)
-
హైదరాబాద్‌లో భారీ వర్షం.. జీహెచ్ఎంసీ మేయర్ కీలక సూచన
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురుస్తోంది. మరో గంటసేపు కూడా భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉండటంతో జీహెచ్ఎంసీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు.కాగా, నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి.. నగరంలో మరో గంటసేపు కుండపోత వర్షం కురిసే అవకాశముందని, అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. వర్షానికి సంబంధించి అత్యవసర సహాయం కోసం 040-21111111, 9000113667 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. Had a Tele conference with all the Zonal Commissioners and EVDM Team. Instructed @GHMCOnline officials to be on high alert with out causing any inconvenience to public. Heavy rains are expected to continue over the city for 1 hour and later reduce. Citizens are advised to stay… pic.twitter.com/8DBj5BrvYQ— Vijayalaxmi Gadwal, GHMC MAYOR (@gadwalvijayainc) July 14, 2024 ఇక, కూకట్పల్లి, మూసాపేట, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, బాచుపల్లి, ప్రగతి నగర్,హైదర్‌నగర్, మల్కాజిగిరి, కుషాయిగూడ, దమ్మాయిపేట, చర్లపల్లి, కీసర, నిజాంపేట, నేరేడ్మెట్, అమీర్‌పేట్, ఈఎస్ఐ, ఎర్రగడ్డ, సనత్‌నగర్, బోరబండ, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లపై వర్షం నీరు చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. #Hyderabad #Hyderabadrains pic.twitter.com/FP9wh1CvGQ— Jagadish (@Jagadish_M) July 14, 2024 #Hyderabadrains!!Now scattered heavy rains going in sanathanagar areas super rains for next 30min with gusty winds 🌧️ pic.twitter.com/JvHbX3iqmV— Telangana state Weatherman (@tharun25_t) July 14, 2024 -
హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. భారీగా ట్రాఫిక్ జాం (ఫొటోలు)
-
హైదరాబాద్: వర్షాలపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
సాక్షి, హైదరాబాద్: నగరంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని విభాగాల అధికారులతో మాట్లాడిన సీఎం.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమీక్షలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.బంజారాహిల్స్‌లోని ఉదయ్ నగర్ ప్రాంతంలో వర్షం ధాటికి దెబ్బతిన్న నాలా ప్రాంతాన్ని మేయర్ గద్వాల విజయలక్ష్మి పరిశీలించారు. నాలా దెబ్బతిన్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో పట్టపగలే చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. పలు చోట్ల వర్షం కురిసింది. మూసాపేట, కూకట్పల్లి, మియాపూర్, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, చంపాపేట్ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మెహిదీపట్నం, టోలిచౌక్, గచ్చిబౌలి, చార్మినార్, మలక్‌పేట్, నాగోల్ కుండపోత వర్షం కురిసింది.భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మలక్‌పేట్ రైల్వే బ్రిడ్జి కింద భారీగా వర్షపునీరు చేరింది. రైల్వే అండర్ పాస్ కింద వరదనీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కోఠి, చాదర్‌ఘాట్, మలక్‌పేట నుంచి దిల్‌సుఖ్‌నగర్‌కు వెళ్తే రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. -
హైదరాబాద్‌లో విషాదం.. ఏడుగురు మృతి
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మంగళవారం కుండపోత వర్షం కురిసింది. అకాల వర్షాల నేపథ్యంలో ప్రమాదాల కారణంగా రెండు రాష్ట్రాల్లో పలువురు మృతిచెందారు.కాగా, హైదరాబాద్‌లోని బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సెంట్రింగ్ పని కార్మికుల షెడ్‌పై కూలిన రిటైనింగ్ వాల్. భారీ వర్షానికి కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న గోడ కూలిపోవడంతో ఏడుగురు కార్మికులు మృతి చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సీఎన్‌డీఆర్‌ఎఫ్, జీహెచ్ఎంసీ సిబ్బంది మృతదేహాలను బయటకు తీశారు. ఇక, మృతులను ఒడిషా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కార్మికులుగా గుర్తించారు. ఇక, ఏపీలో కూడా పిడుగుల కారణంగా ఏడుగురు మృత్యువాడపడ్డారు. బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. గోడకూలి ఏడుగురు చనిపోవడంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గోడ నిర్మాణంలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే, చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. ఈ ఘటనలో గాయపడిన వారికి సరైన వైద్య చికిత్స అందించాలన్నారు. #HyderabadRains #tankbund #Hussainsagar @CoreenaSuares2 @Rajani_Weather super duper rain. #scary pic.twitter.com/2xvWITJ3jt— sαмυεℓ ραυℓ🇮🇳 (@vikramsamuelp) May 7, 2024 -
హైదరాబాద్‌లో చల్లబడిన వాతావరణం.. నాలుగు రోజులు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొన్ని రోజులుగా మండుతున్న ఎండలతో ప్రజలు అల్లాడిపోగా.. తాజాగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఆకాశం మేఘావృతమై ఉండగా.. చల్లటి గాలులు వీస్తుండడంతో నగరవాసులకు ఊరట కలిగించినట్లయ్యింది. త్వరలోనే తెలంగాణలో వానలు పలుకరించనున్నాయి. రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానలు పడే అవకాశాలున్నాయని పేర్కొంది.ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. గురువారం నుంచి ఆదివారం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 36-26 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఉపరితల గాలులు ఆగ్నేయ దిశ నుంచి వీచే అవకాశం ఉందని తెలిపింది. -
HYD: హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మంగళవారం తెల్లవారుజాము నుంచే నగరంలో పలుచోట్ల వర్షం కురుస్తోంది. ఇక, మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక, హైదరాబాద్ ఈరోజు ఉదయం దిల్సుఖ్నగర్, చైతన్యపురి, సరూర్‌నగర్, కర్మాన్‌ఘాట్, వనస్థలిపురం, ఎల్బీనగర్, హయత్ నగర్, చార్మినార్, కోఠి పలు చోట్ల వర్షం కురుస్తోంది. ఇక, కామారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షం కురుస్తోంది. వర్షాల నేపథ్యంలో మెదక్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కౌడిపల్లి మండలం జాబితాండలో అకాల వర్షం, ఈదురు గాలుల కారణంగా ఇంటి పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి సంగీత చనిపోయింది. pic.twitter.com/GaPhmhUzwC — kutharamp OG (@nanisumanth29) March 19, 2024 ఇక, ఈదురు గాలల వర్షం కారణంగా పలుచోట్ల రైతులకు తీవ్ర నష్ట వాటిల్లింది. గాలుల కారణంగా మామిడి పూత, కాయలు రాలిపోయాయి. అలాగే, వరి పంట, మొక్కజొన్న పంటలకు నష్టం జరిగింది. -
హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో పలుచోట్ల వర్షం కురుస్తోంది. గురువారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై.. సాయంత్రం నుంచి పలుచోట్ల మోస్తరు వర్షం కురుస్తోంది. దీంతో, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, నగరంలోని ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, దిల్సుఖ్నగర్, చైతన్యపురి, సరూర్‌నగర్, మీర్పేట్, చాదర్‌ఘాట్, రాజేంద్రనగర్, అత్తాపూర్, మణికొండ, పంజాగుట్ల, బంజారాహిల్స్, గోషామహల్, ఎస్ఆర్నగర్, కూకట్పల్లి, హబీబ్‌నగర్, రాయదుర్గం, అప్జల్‌గంజ్ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. అకాల వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. #HyderabadRains pic.twitter.com/IUaeFxv27c — pala hanmi reddy (@hanmireddy) November 23, 2023 @Hyderabadrains it's raining heavily at Raidurgham pic.twitter.com/druN8puIqC — Varun sam (@Varunsam007) November 23, 2023 Heavy rainfall in Hyderabad 🌧#HyderabadRains pic.twitter.com/o93Rq09eGp — Irfan Khan (@IrfanKhanhyd) November 23, 2023 -
తెలంగాణలో ఐదు రోజులు వర్షాలే!
సాక్షి, హైదరాబాద్: తూర్పు మధ్య బంగాళాఖాతం, మయన్మార్ తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. తెలంగాణలో ఐదు రోజులపాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ఇక హైదరాబాద్‌కు యెల్లో అలర్ట్ జారీ చేసిన ఐంఎడీ.. ఓ మోస్తరు వర్షాలు ఉంటాయని తెలిపింది. అల్పపీడనం.. తీవ్ర అల్పపీడనంగా బలపడి వాయవ్య దిశగా ఉత్తర ఒడిశా, పశ్చిమ్ బెంగాల్ వైపు కదులుతుంది. దీని ప్రభావంతో ఏపీలోనూ మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. -
హైదరాబాద్‌లో వర్షం.. వానలోనే గణనాథుల నిమజ్జనం..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మళ్లీ వర్షం ప్రారంభమైంది. ట్యాంక్ బండ్లో వినాయక నిమజ్జనాలు జరుగుతున్న సందర్భంగా వర్షం కురుస్తుండటం ఇబ్బందికరంగా మారింది. వర్షంలోనే ట్యాంక్ బండ్‌పై వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం కురుస్తోంది. బషీర్‌బాగ్, ఎంజే మార్కెట్, ట్యాంక్ బండ్, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఇక, వర్షంలోనే గణనాథులు ట్యాంక్ బండ్‌పైకి తరలి వస్తున్నాయి. వర్షంలోనే వినాయక విగ్రహాల నిమజ్జనం జరుగుతోంది. వర్షం కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విగ్రహాల తరలింపునకు ఆటంకం కలుగుతోంది. ఇదిలా ఉండగా, ఇప్పటికే ఖైరతాబాద్ గణేష్, బాలాపూర్ గణనాథుల నిమజ్జనం ముగిసింది. #28SEP 5PM⚠️ HEAVY THUNDERSTORMS ALERT FOR South -East #Hyderabad ⛈️#SaroorNagar,#Uppal,#Malakpet,#Amberpet ,#Ou ,#Secunderabad surroundings Seeing Intense Downpour⛈️⚠️ & These Stroms will Later Spread towards Central City.,#HyderabadRains pic.twitter.com/fjHhxcvUxR — Hyderabad Rains (@Hyderabadrains) September 28, 2023 Hyderabad right now! #rain #hyderabadrains #weather pic.twitter.com/r8lyCBXmEg — Stella Paul (@stellasglobe) September 28, 2023 మరోవైపు.. హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హిమాయత్‌నగర్, కవాడిగూడ, నారాయణగూడ, ముషీరాబాద్, ఉప్పల్, అంబర్పేట్, ఓయూ, తర్నాక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. #24HrWx #Telangana #Hyderabad High chances of thunderstorms in parts of the city particularly in the evening time. pic.twitter.com/fBpORkJxeg — Weather@Hyderabad|TS|AP 🇮🇳 (@Rajani_Weather) September 28, 2023 RED WARNING FOR HYDERABAD ⚠️ As expected, Huge thunderstorms clouds forming in Central Zone like Himayatnagar, Kavadiguda, Narayanguda, Musheerabad, Uppal, Amberpet, OU, Tarnaka side will later cover other parts too. Get ready for the blast 🔥⚡️⚡️⚡️⚡️#HyderabadRains — Telangana Weatherman (@balaji25_t) September 28, 2023 Pouring really hard. Almost like a curtain/waterfall. Can't see anything. Video somehow there's some visibility. #HyderabadRains pic.twitter.com/PmVPU4dEHd — VT-RRB ◢◤ (@rb_41) September 28, 2023 -
దర్శనాలకు బ్రేక్.. రాత్రి 12 గంటలకు ఖైరతాబాద్ గణపతికి చివరి పూజ
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఖైరతాబాద్ గణపతి వద్దకు దర్శనం నిలిపివేశారు. ఇప్పటి వరకు క్యూలైన్లో ఉన్న భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తున్నారు. ఇక, శోభాయాత్రకు ఖైరతాబాద్ గణపతి సిద్ధమవుతున్నాడు. ఈరోజు రాత్రి 12 గంటలకు గణపతికి చివరి పూజ ఉంటుంది. రేపు(గురువారం) ఉదయమే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ఉంటుంది. ఈ నేపథ్యంలో నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కాగా, తలసాని మీడియాతో మాట్లాడుతూ.. గణేశ్ శోభాయాత్ర, నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయన్నారు. గణేశ్ విగ్రహాల శోభాయాత్ర నిర్వహించే అన్ని రహదారులలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. విద్యుత్ తీగలు, చెట్ల కొమ్మలు అడ్డం లేకుండా తొలగించినట్లు పేర్కొన్నారు.అదేవిధంగా అవసరమైన ప్రాంతాల్లో రహదారుల మరమ్మతులు చేపట్టడంతో పాటు 52వేల విద్యుత్ లైట్లను సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులకు తాగునీటిని అందించడం 34 లక్షల వాటర్ ప్యాకెట్లు సిద్ధం చేశామన్నారు. ఇందుకోసం 122 స్టాల్స్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా విగ్రహాల నిమజ్జనం కోసం 125 స్టాండింగ్, 244 మొబైల్ మొత్తం 369 క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 12 కిలోమీటర్ల మేర బారికేడింగ్ కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 37 హెల్త్ క్యాంప్‌ల ఏర్పాటుతో అత్యవసర వైద్యసేవల కోసం 15 హాస్పిటల్స్‌లో ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. శోభాయాత్ర, నిమజ్జనం జరిగే ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూసేందుకు 3వేల మంది పారిశుధ్య సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా చూసే 68 అడుగుల ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. విగ్రహాల నిమజ్జనం కోసం 74 ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశామని, అలాగే 33 బేబీ పాండ్స్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 200 మంది స్విమ్మర్లు, 5 బోట్లను కూడా అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాన్ని నమొద్దని సూచించారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో ఒక్కసారిగా భారీ వర్షం.. రెడ్ అలర్ట్ -
హైదరాబాద్‌లో ఒక్కసారిగా భారీ వర్షం.. రెడ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఈదురుగాలులతో ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తోంది. బుధవారం మధ్యాహ్నం వరకు ఎండగా ఉండి సాయంత్రం 5 గంటల నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. #27SEP 5:15PM⚠️ South #Hyderabad Seeing SEVERE DOWNPOUR & Rains Not Going to Stop for next 1Hr⛈️ Stay Alert ⚠️#HyderabadRains pic.twitter.com/PNzdWwLDg0 — Hyderabad Rains (@Hyderabadrains) September 27, 2023 నగరంలోని నాంపల్లి, అబిడ్స్, కోఠి, బషీర్‌బాగ్, బేగంబజార్, మాసబ్ ట్యాంక్, లక్డీకపూల్, గోషామహల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, పంజాగుట్ట, అప్జల్‌గంజ్, హబీబ్‌నగర్ సహా పలు ప్రాంతాల్లో భారవ వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వర్షం కారణంగా వినాయక నిమజ్జనాలకు వెళ్లున్న భక్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు.. హైదరాబాద్‌కు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. Heavy Rain's in hyderabad#hyderabadRains pic.twitter.com/i6EY0Y84WH — dsm nayak,,✍️ (@nayak_dsm) September 27, 2023 Date: 27-09-23 at 1730 hrs Due to heavy flow of commuters near Bada Ganesh, Rains and peak hours, movement of Vehicle is slow from Panjagutta, NIMS, CEO, RTO Office, Khairathabad X Roads towards Shadan College. Panjagutta Traffic police are available and regulating traffic. pic.twitter.com/6uj4yux7W8 — Hyderabad Traffic Police (@HYDTP) September 27, 2023 -
హైదరాబాద్‌లో భారీ వర్షం.. రోడ్లపైకి భారీగా చేరిన నీరు
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో.. తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం సాయంత్రం హైదరాబాద్ నగరంలో, శివారుల్లోనూ భారీ వర్షం కురిసింది. రోడ్లపైకి నీరు భారీగా చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జంట నగరం సికింద్రాబాద్‌లోనూ పలు ప్రాంతాల్లో వాన పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం అయ్యాయి. విద్యాసంస్థలు, ఆఫీసుల సమయం ముగియడంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో కురుస్తున్న వర్షం మణికొండ, గచ్చిబౌలి, కొండాపూర్, హఫీజ్‌పేట్, చందానగర్‌లో వర్షం. ఫిల్మ్‌నగర్,పంజాగుట్ట, అమీర్‌పేట్, బేగంపేట్, ఎస్ఆర్ నగర్లో వర్షం మెహిదీపట్నం, మాసబ్‌ట్యాంక్, నాంపల్లి, ఖైరతాబాద్‌లో వర్షం కేపీహెచ్‌బీ, కూకట్పల్లి, జేఎన్టీయూ, నిజాంపేట్‌లో వర్షం పడింది. మరోవైపు.. వర్షం మరికొన్ని గంటలపాటు కొనసాగే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. #Filmnagar #hyderabadrains @balaji25_t @Hyderabadrains @TelanganaRains @ts_weather @MasRainman #Telangana #AppleEvent pic.twitter.com/cEcUitsmiT — Srikanth Marka (@SrikanthMarka6) September 14, 2023 #14SEP 5:30PM⚠️ Rain Intensity Reduced & Leaving the City 🌧️ #Rajendranagar Surroundings will see Heavy Spell.#HyderabadRains pic.twitter.com/ebtytBXkLN — Hyderabad Rains (@Hyderabadrains) September 14, 2023 @balaji25_t @Hyderabadrains @Salma90910310 Charminar Hyderabad pic.twitter.com/4T0oG88Evo — Rafai (@asocircle02) September 14, 2023 videos credit goes to the respected owners -
గందరగోళంగా వాతావరణం.. తెలుగు రాష్ట్రాలకు కొనసాగనున్న వర్షాలు
సాక్షి, హైదరాబాద్/విశాఖపట్నం: మునుపెన్నడూ లేనంతగా వాతావరణంలో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రుతుపవనాలు ఆలస్యం కావడం.. వాటికి తుపాన్లు తోడు కావడం.. వర్షాలు ఆలస్యం కావడం.. ఆ వెంటనే కుంభవృష్టి వర్షాలు.. అన్‌సీజన్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు.. మళ్లీ కుండపోత వానలు.. ఇలా వాతావరణం గందరగోళంగా తయారయ్యింది. తెలుగు రాష్ట్రాలపైనా ఈ ప్రభావం కనిపిస్తోంది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. అయితే ఇవాళ, రేపు తెలంగాణలో విస్తారంగా.. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కోస్తా, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. శుక్ర, శనివారాల్లో తెలంగాణ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రత్యేకించి దక్షిణ తెలంగాణను అప్రమత్తం చేసింది. అలాగే.. మూడు నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్,మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, కామారెడ్డి,జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలు కొనసాగుతున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ బంగాళాఖాతానికి ఆనుకుని ఉత్తరాంధ్రపై ఏర్పడిన అల్పపీడనం బలహీనపడగా.. మరో ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల ప్రభావం కారణంగా.. వర్షాలు పడుతున్నాయి. మరో రెండు రోజులు ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్రల్లో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది విశాఖ వాతావరణ కేంద్రం. శుక్రవారం.. పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే.. శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ,అనకాపల్లి,అల్లూరి , పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా, కాకినాడ జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, విశాఖపట్నం జిల్లా, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ సీజన్లో ఎక్కువే.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో వర్షపాతం ఆశాజనకంగానే నమోదవుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఏటా జూన్ ఒకటి నుంచి సెప్టెంబర్ 30 తేదీ వరకు నైరుతి రుతుపవనాల సీజన్‌గా పేర్కొంటారు. ఈ సీజన్‌కు రాష్ట్రంలో 72.10 సెం.మీ సాధారణ వర్షపాతం. సెప్టెంబర్ 7వ తేదీ నాటికే (గురువారం) 74.35 సెం.మీ వర్షపాతం నమోదైంది. అంటే సాధారణం కంటే 1.03 శాతం ఎక్కువగానే వర్షం కురడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగానూ వాతావరణం గందరగోళంగా ఉంది. గాలుల వేగం పెరగడంతో.. వాతావరణం వేగంగా మారుతోంది. ఆలస్యంగా వచ్చిన నైరుతీ రుతుపవనాలు క్రియాశీలకంగా ఉన్నాయి. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి అవి తిరోగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈసారి ముందస్తుగానే ఈశాన్య రుతుపవనాల రాక మొదలవొచ్చని(ఈ నెలలోనే!) ఐఎండీ అంచనా వేస్తోంది. -
ఎగిరెగిరి పడ్డ టమాటా.. ఇప్పుడు ఢీలా!
సాక్షి, కర్నూలు జిల్లా: తెలంగాణలో భారీగా కురుస్తున్న వర్షాల ప్రభావం రాష్ట్రంలో టమాటా ధరలపై పడింది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని మార్కెట్లకు టమాటా చేరడం లేదు. దీంతో టమాటా ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. పత్తికొండ మార్కెట్లో కిలో టమాటా రూ. 4 నుంచి 10 రూపాయలు మాత్రమే పలుకుతోంది. ప్యాపిలి మార్కెట్లోనూ టమాటా ధరలు భారీగా పతనమయ్యాయి. కిలో టమాటా రూ.3 మాత్రమే పలుకుతోంది. ధరలు లేకపోవడంతో టమాటాలను రైతులు మార్కెట్‌కు ఆరుబయటే పారేసి వెళ్లిపోతున్నారు. పచ్చి పంట కావడంతో ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టమాటాలను రోడ్లపైనే పారబోస్తూ కన్నీరు పెట్టుకుంటున్నారు. కనీస ధర లేకపోవడంతో డోన్ జాతీయ రహదారిపైనే టమాటాలను ఓ రైతు పారబోశాడు. పారబోసిన టమాటాలను పశువులు తింటున్నాయి. రవాణా ఖర్చులు కూడా రావట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పచ్చి పంట అయినందున ఎక్కడా దాచలేమని రైతులు దిగులు పడుతున్నారు. మొన్నటి వరకు కిలో రూ. 200 వరకు పలికిన కిలో టమాటా ఒక్కసారిగా తగ్గిపోయింది. ఇప్పటివరకు ఎన్నో ఆశలతో ఉన్న టమాటా రైతులు.. వర్షాలతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయని చెబుతున్నారు. గత రెండు నెలలుగా ఎగిరెగిరి పడ్డ టమాటా ఇప్పుడిలా ఉల్టా కావడం మళ్లీ హాట్ టాపిక్ అయ్యింది. ఇదీ చదవండి: అలా.. ఆంధ్రప్రదేశ్‌కు బోలెడు అవకాశాలు -
ఉధృతంగా ఈసీ, మూసీ వాగులు.. ఆ రోడ్డు మూసివేత
సాక్షి, రంగారెడ్డి: కుండపోత వర్షాలతో హైదరాబాద్ శివారులోని జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. లోతట్టు ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మూసీ పరివాహక ప్రాంత వాసులను అధికారులు అప్రమత్తం చేశారు. ఈసీ,మూసీ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రాజేంద్రనగర్ నుంచి పోలీస్ అకాడమీ వైపు వెళ్లే ఔటర్ సర్వీసు రోడ్డును పోలీసులు మూసివేశారు. నార్సింగి నుంచి మంచిరేవులకు వెళ్తే దారిని నార్సింగి పోలీసులు మూసేశారు. ప్రత్నామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచించారు. ఎగువ ప్రాంతాల నుంచి జంట జలాశయాలకు వరద భారీగా చేరుతోంది. వికారాబాద్, తాండూర్, శంకర్పల్లి, షాబాద్, షాద్ నగర్, పరిగితో పాటు పలు గ్రామాలకు నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. చదవండి: మూసీలో కొట్టుకొచ్చిన లక్ష్మీ మృతదేహం? -
హైదరాబాద్‌లో మళ్లీ మొదలైన వాన
సాక్షి, హైదరాబాద్: నగరంలో వర్షం మళ్లీ మొదలైంది. హైదరాబాద్‌లో రానున్న రెండు గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే నిన్నటి కుండపోత నుంచి నగరవాసులు ఇంకా తేరుకోలేదు. ఈలోపు మళ్లీ వర్షం కురుస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దాని ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా, ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు కుండపోతగా కురిసిన వర్షం హైదరాబాద్‌లో బీభత్సం సృష్టించింది. జన జీవనాన్ని అతలాకుతలం చేసింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయాయి. బాచుపల్లి ప్రగతినగర్ కాలనీ వద్ద ఉన్న నాలాలో పడి బాలుడు మృతి చెందాడు. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులకు చెట్లు నేలకొరిగాయి. రెజిమెంటల్ బజార్లో పురాతన భవనం కూలిపోయింది. అందులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. చదవండి: ఇంకెన్నాళ్లు నాలా మరణాలు? రోడ్లు చెరువులను తలపించాయి. మ్యాన్ హోళ్లు ఓపెన్ చేసినా.. పై నుంచి భారీ ఎత్తున వస్తున్న నీళ్లతో.. ప్రధాన రహదారిపైనే మోకాళ్ల లోతు నీళ్లు నిలిచాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆరాంఘర్ జాతీయ రహదారిపై, శ్రీనగర్ సమీపంలో ఆర్టీసీ బస్సులు వరదలో చిక్కుకుపోయాయి. డీఆర్ఎఫ్ బృందాలు, ట్రాఫిక్ పోలీసులు అతికష్టం మీద ఆ బస్సులను వరద నుంచి బయటకు తీశారు. మొత్తమ్మీద మంగళవారం రికార్డు స్థాయిలో సుమారు 20 సెంటిమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. తెల్లవారు జామున నుంచి ఉదయం 8 గంటల వరకు 14.7 సెం.మీ.. తిరిగి మధ్యాహ్నం వరకు మరో 5.9 సెం.మీ మేర వర్షం కురిసినట్లు వాతావరణశాఖ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. Moderate - Heavy downpours expected today in North, Central, East Telangana today and light - moderate rains ahead in South Telangana Moderate rains expected in Hyderabad city today but yesterday type huge rains not expected — Telangana Weatherman (@balaji25_t) September 6, 2023 జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు సికింద్రాబాద్ జోన్లో పలు చోట్ల నీరు నిలిచిన ప్రాంతాలను జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ బుధవారం ఉదయం పరిశీలించారు. నీరు వెంటనే తొలగించాలని, మ్యాన్ హోల్స్ వద్ద మట్టి, చెత్తచెదారాన్ని వెంటవెంటనే తీసేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారాయన. మయూర మార్గ్ అల్లం తోట బావి, ద్వారక దాస్ నగర్ కాలనీ, ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్, యస్ పి రోడ్డు పెట్రోల్ పంప్, అల్లాగడ్డ బావి రైల్వే అండర్ బ్రిడ్జి, లాలా పేట్ సత్య నగర్ లలో నాలాలను సైతం ఆయన పరిశీలించారు. -
దంచికొట్టిన వాన.. ముంచెత్తిన వరద
హైదరాబాద్: ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు కుండపోతగా కురిసిన వర్షం నగరంలో బీభత్సం సృష్టించింది. జన జీవనాన్ని అతలాకుతలం చేసింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయాయి. బాచుపల్లి ప్రగతినగర్ కాలనీ వద్ద ఉన్న నాలాలో పడి బాలుడు మృతి చెందాడు. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులకు చెట్లు నేలకొరిగాయి. రెజిమెంటల్ బజార్లో పురాతన భవనం కూలిపోయింది. అందులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. రోడ్లు చెరువులను తలపించాయి. మ్యాన్ హోళ్లు ఓపెన్ చేసినా.. పై నుంచి భారీ ఎత్తున వస్తున్న నీళ్లతో.. ప్రధాన రహదారిపైనే మోకాళ్ల లోతు నీళ్లు నిలిచాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆరాంఘర్ జాతీయ రహదారిపై, శ్రీనగర్ సమీపంలో ఆర్టీసీ బస్సులు వరదలో చిక్కుకుపోయాయి. డీఆర్ఎఫ్ బృందాలు, ట్రాఫిక్ పోలీసులు అతికష్టం మీద ఆ బస్సులను వరద నుంచి బయటకు తీశారు.. మొత్తమ్మీద మంగళవారం రికార్డు స్థాయిలో సుమారు 20 సెంటిమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. తెల్లవారు జామున నుంచి ఉదయం 8 గంటల వరకు 14.7 సెం.మీ.. తిరిగి మధ్యాహ్నం వరకు మరో 5.9 సెం.మీ మేర వర్షం కురిసినట్లు వాతావరణశాఖ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కుండపోత వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జీహెచ్ఎంసీ, డిజాస్టర్ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావద్దని అలర్ట్ ప్రకటించింది. వర్ష సమస్యలపై కాల్ చేయండి జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్ : 040– 21 11 11 11 డయల్ 100 ∙ఈవీడీఎం కంట్రోల్‌రూమ్: 9000113667 మియాపూర్ పటేల్ చెరువుకు గండి శేరిలింగంపల్లి: లింగంపల్లి అండర్ బ్రిడ్జి వద్ద భారీగా వరదనీరు వచ్చి చేరడంతో లింగంపల్లి నుంచి గచి్చ»ౌలి వైపు రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో వాహనదారులు లింగంపల్లి నుంచి లింగంపల్లి ఆర్ఓబీ మీదుగా గచి్చ»ౌలి వైపు వెళ్లారు. పటేల్చెరువుకు గండి పడటంతో కింది భాగంలో ఉన్న శ్రీరాంనగర్, శాంతినగర్, దీప్తీశ్రీనగర్ కాలనీల్లో వరద చేరింది. లోతట్టు ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన పురానాపూల్ బ్రిడ్జిని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం సందర్శించారు. జియాగూడలోని కేఎస్ స్వామి నగర్‌లోని లోతట్టు ప్రాంతవాసుల పరిస్థితిని సమీక్షించారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆయన వెంట హైదరాబాద్ ఆర్టీఓ సూర్యప్రకా‹Ù, ఎమ్మార్వో జ్యోతి సంబంధిత అధికారులు ఉన్నారు. నీట మునిగిన కాలనీలు.. భారీ వర్షంతో బస్తీలతో పాటు కొత్త కాలనీలు నీట మునిగాయి. వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరింది. నాలాలు పొంగి ప్రవహించి బస్తీలపై ప్రభావం చూపాయి. చింతల్‌లోని గణేష్ నగర్, కల్పనాసొసైటీ, శ్రీనివాస్ నగర్ కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. జీడిమెట్ల నుంచి వచ్చే కాలువ నిండి పొంగిపొర్లుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్,లింగంపల్లి, కూకట్పల్లి, మాదాపూర్, గచి్చ»ౌలి, రాయదుర్గం, మియాపూర్, చందానగర్, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, పంజాగుట్ట, ఎల్బీనగర్, హయత్ నగర్, ప్రగతి నగర్, జీడిమెట్ల, సుచిత్ర, కొంపల్లి, దూలపల్లి, దుండిగల్, గండిమైసమ్మ, మల్లంపేట్, బౌరంపేట్, సురారం, జీడిమెట్ల, షాపూర్ నగర్, చింతల్, గాజులరామారం, రాజేంద్రనగర్, అత్తాపూర్, కాటేదాన్, నార్సింగి, మణికొండ, గండిపేట, బండ్లగూడ తదితర అన్నీ ప్రాంతాల్లో వర్షం బీభత్సం సష్టించింది. కుప్పకూలిన పురాతన భవనం రాంగోపాల్‌పేట్: రెజిమెంటల్‌బజార్‌లోని ఓ పురాతన భవనం కుప్పకూలింది. భవనంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 6 నెలల క్రితం జీహెచ్ఎంసీ అ«ధికారులు భవన యజమానిని ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఆ భవనం ఖాళీగా ఉంది. మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో భవనం ముందు భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే జీహెచ్ఎంసీ బేగంపేట సర్కిల్ ఏసీపీ కిష్టఫర్ చైన్మెన్లు ప్రకా‹Ù, నర్సింగ్‌రావు, జగదీష్, పాండులు అక్కడికి చేరుకుని చుట్టు పక్కల ఉండే వారిని అప్రమత్తం చేశారు. పురాతన భవనాలకు నోటీసులు జారీ చేశామని ప్రజలు జీహెచ్ఎంసీకి సహకరించాలని కోరారు. భవనాలు ఖాళీ చేయకపోతే తామే ఖాళీ చేయిస్తామని హెచ్చరించారు. -
HYD Rains: మైసమ్మగూడలో నీట మునిగిన అపార్ట్మెంట్లు
సాక్షి, మేడ్చల్: భారీ వర్షాలతో గుండ్ల పోచంపల్లి పరిధి మైసమ్మగూడలో పలు కాలనీలు నీటమునిగాయి. ప్రధాన రోడ్లపై వర్షం నీరు ఏరులైపారుతోంది. ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుకునే విద్యార్థులు ఉంటున్న సుమారు 30 అపార్ట్మెంట్లలో వరద నీరు చేరింది. ఒకటో అంతస్తు వరకు వరద నీరు చేరింది. పలువురు విద్యార్థులకు ఈ రోజు పరీక్షలు ఉండటంతో మునిగిపోయిన హాస్టల్ నుండి ఎటు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. మైసమ్మగుడలో కాలువలు, నాళాలు కబ్జాకు గురయ్యాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలు నీట మునగటంతో విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. రెండు జేసీబీలను రప్పించి అపార్ట్ మెంట్లలో ఉంటున్న విద్యార్థులను బయటకు తీసుకువస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో నగరానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నగరం, శివారుల్లోని పలు కాలునీలు నీట మునిగి చెరువుల్ని తలపిస్తున్నాయి. జలాశయాలకు నీరు పోటెత్తడంతో గేట్లు వదిలి.. దిగువనకు విడుదల చేస్తున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ముందస్తుగానే ఖాళీ చేయాలని కోరుతున్నారు అధికారులు. -
HYD: అత్యవసరమైతేనే బయటకు రావాలి
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో నగరానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దీంతో నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి అధికారులను అప్రమత్తం చేశారు. మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు పడతాయనే వాతావరణ శాఖ సూచనలు, రేపటి వరకు అతిభారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో జోనల్ కమిషనర్లతో మంగళవారం కాన్ఫరెన్స్ నిర్వహించారామె. లోతట్టు ప్రాంతాల్లో అస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని మేయర్ అధికారులను ఆదేశించారు. అలాగే.. పోలీస్, జీహెచ్ఎంసీ శాఖల సమన్వయంతో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు రేపటి వరకు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిందని. దీంతో నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని కోరారామె. ► ప్రజలు అత్యవసరం పని ఉంటేనే బయటి రావాలని తెలిపారు. హిమాయత్, ఉస్మాన్ సాగర్ జంట జలయాలు గేట్లు ఎత్తి వేసిన నేపథ్యంలో మూసి నది లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని జోనల్ కమిషనర్ లను ఆదేశించారు. హెల్ప్ లైన్ కు వచ్చిన పిర్యాదులకు వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని అధికారులకు మేయర్ సూచించారు. ఇప్పటికే నగరం, శివారుల్లోని పలు కాలునీలు నీట మునిగి చెరువుల్ని తలపిస్తున్నాయి. జలాశయాలకు నీరు పోటెత్తడంతో గేట్లు వదిలి.. దిగువనకు విడుదల చేస్తున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ముందస్తుగానే ఖాళీ చేయాలని కోరుతున్నారు అధికారులు. లోతట్టు ప్రజల్ని అప్రమత్తం చేయండి భారీ వర్షాలకు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ రొనాల్డ్ రాస్ సూచించారు. జంట జలాశయాల గేట్లు తెరిచినందున మూసీ పరివాహక ప్రాంతాలు.. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని అధికారుల్ని కోరారాయన. ప్రజలు కూడా ఏదైనా సమస్య ఎదురైతే జీహెచ్ఎంసీ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ హెల్ప్‌లైన్ నెంబర్ 040-2111 1111 డయల్ 100 ఈవీడీఎం కంట్రోల్ రూం నెంబర్ 9000113667 ► మరోవైపు మంత్రి తలసాని సైతం హైదరాబాద్ వర్ష పరిస్థితులపై అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రోడ్లపై నీరు నిలిచిపోకుండా చూడాలని, కూలిన చెట్లు, కొమ్మలను వెంటనే తొలగించాలని, హుస్సేన్‌సాగర్.. ఉస్మాన్ సాగర్ నీటి స్థాయిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ప్రత్యేకించి నాలాల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ జరపాలని మంత్రి తలసాని అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపైనా తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర సేవలకు జీహెచ్ఎంసీ కంట్రోల్ రూంను సంప్రదించాలని ప్రజలను కోరారు. ► ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ పోలీసులు అలర్ట్ జారీ చేశారు. వీలును బట్టి వర్క్‌ఫ్రమ్ చేసుకోవాలని సూచించారు. అలాగే.. ఆఫీస్‌లకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, ట్రాఫిక్ రద్దీ దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. -
Telangana Rains: మరో 24 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కురుస్తున్న కుండపోత వర్షాలు ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గతకొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలతో రాష్ట్రమంతా తడిసి ముద్దవుతోంది. ఇప్పటికే పలు జిల్లాలు జల దిగ్భంధంలోకి వెళ్లిపోయాయి. వరదలతో ముప్పు తిప్పలు పడుతున్న రాష్ట్ర ప్రజలకు భారత వాతావరణ శాఖ తాజాగా మరో హెచ్చరిక చేసింది. నిన్నటి తీవ్ర అల్ప పీడనం నేడు అల్పపీడనంగా బలహీనపడినట్లు తెలిపింది. ప్రస్తుతం దక్షిణ ఒడిశా, పరిసరాల్లోని ఉత్తర ఆంధ్రప్రదేశ్ వద్ద అల్పపీడనం కొనసాగుతోందని పేర్కొంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని తెలిపింది. ఈ ప్రభావంతో తెలంగాణలో గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, అసాధారణమైన వర్షపాతం 24 సెంటీమీటర్లకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. శుక్రవారం కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీంతో రాష్ట్రలోని 8 జిల్లాలకు ఆరెంజ్, 14 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు, గంటకు 40 నుండి 50కిమీ వేగంతో వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. చదవండి: వరద బీభత్సం.. తెగిపోయిన వరంగల్-హన్మకొండ కనెక్టివిటీ భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఆదిలాబాద్, కుమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. సోమవారం తెరుచుకోనున్న విద్యాసంస్థలు రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు రేపు సెలవు ప్రకటించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదేశించారు. శనివారం మొహర్రం సెలవు కావడంతో ప్రభుత్వ విద్యాసంస్థలు అన్నీ ఇక సోమవారం తెరుచుకోనున్నాయి. చదవండి: తెలంగాణ చరిత్రలోనే రికార్డు వర్షపాతం.. నీట మునిగిన మేడారం -
మున్నేరు వరదల్లో చిక్కుకున్న ఏడుగురు సురక్షితం
Updates.. ►భద్రాచలం వద్ద తగ్గుముఖం పడుతున్న గోదావరి. ► గురువారం రాత్రి 7 గంటలకు భద్రాచలం వద్ద కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక ►ప్రస్తుతం 48 అడుగుల మేర ప్రవహిస్తున్న గోదావరి. ►దిగువకు 11లక్షల 50వేల క్యుసెక్కుల వరద నీరు గోదావరిలోకి విడుదల. ►ఏ సమయంలోనైన గోదావరి మళ్ళీ పెరిగే అవకాశం ఉందంటున్న అధికారులు. ప్రమాదకరంగా మున్నేరు నది ఖమ్మం నగరంలో మున్నేరు నది 30 అడుగుల ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు, కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇల్లోకి వరదనీరు చేరింది. మున్నేరు వద్దకు సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. NDRFతో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పద్మావతి నగర్ వరద లో చిక్కుకున్న ఏడుగురు కుటుంబ సభ్యులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి. మీడియాతో మంత్రి పువ్వాడ ధ్యాన మందిరంలో చిక్కుకున్న ఏడుగురు కుటుంబ సభ్యులు కాపాడినట్లు మంత్రి అజయ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంతోనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఇక్కడికి పిలిపించామని.. వరదల్లో చిక్కుకున్న ఏ ఒక్కరి ప్రాణం పోకూడదనే ముఖ్యమంత్రి లక్ష్యమని పేర్కొన్నారు. ఖమ్మం మున్నేరు వరద ఉధృతితో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేపించి పునరావస కేంద్రలను ఏర్పాటు చేశామని చెప్పారు. పునరావాస కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించామని.. ఇంకా అనేక ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్నారని ఫోన్లు వస్తున్నాయన్నారు. వరదల్లో చిక్కుకున్న అందరిని కాపాడే బాధ్యత తమదేన్నారు. పెద్దపల్లి జిల్లా. ►పార్వతి బ్యారేజ్‌లోకి కొనసాగుతున్న భారీ వరద నీరు. ►మొత్తం 74 గేట్లు కాగా అందులో 70 గేట్లు ఎత్తిన అధికారులు. ►ఇన్ ఫ్లో 5,90,256 క్యూసెక్కుల ►ఔట్ ప్లో 5,90,256 క్యూసెక్కుల ►బ్యారేజ్ పూర్తి సామర్థ్యం 8.83 టీఎంసీలు. ►ప్రస్తుత నీటి సామర్థ్యం : నిల్ రాజన్న సిరిసిల్ల జిల్లా ►గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరులోకి వరద నీరు ►ఇన్ ఫ్లో 29781 క్యూసెక్కులు. ►ఔట్ ప్లో 29781 క్యూసెక్కులు. ►ప్రాజెక్ట్ సామర్థ్యం 2.20 టీఎంసీలు. ►ప్రస్తుత నీటి సామర్థ్యం 2.20 టీఎంసీలు. తెలంగాణలో అసాధారణ వర్షపాతం ►తెలంగాణలో గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, అసాధారణమైన వర్షపాతం 24 సెంటీమీటర్లకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఆదిలాబాద్, కుమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. మోరంచపల్లి గ్రామస్తులు సేఫ్ ►వరదల్లో చిక్కుకున్న మోరంచపల్లి గ్రామాస్థులు సురక్షితంగా బయటపడ్డారు. హెలికాఫ్టర్లు, బోట్ల ద్వారా గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గ్రామంలోని ప్రజలందరినీ సేఫ్‌జోన్‌కు చేర్చారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా మోరంచపల్లి గ్రామస్తులు అంతా సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ►భారీ వర్షాల నేపథ్యంలో నీటిపారుదల శాఖ అప్రతమతంగా ఉందని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. కడెం ప్రాజెక్టులో రెండు గేట్లు మొరాయించాయని, వాటికి వెంటనే మరమ్మతులు చేసి పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు. డ్యామ్ ఎత్తు 700 అడుగులు అయితే.. 702 అడుగుల మేర నీటి ప్రవాహం ఉందని తెలిపారు. నీట మునిగిన వరంగల్ ►భారీ వర్షాలతో నీట మునిగిన వరంగల్ రైల్వే స్టేషన్ ► పూర్తిగా తెగిపోయిన వరంగల్-హన్మకొండ కనెక్టివిటీ ►శివనగర్ బస్తీల్లో పారుతున్న వరద నీరు ► వరంగల్‌లో పూర్తిగా నీట మునిగిన హంటర్ రోడ్డు, నయూం నగర్, శివనగర్ ► బిల్డింగ్‌లపై తలదాచుకున్న వరద బాధితులు ►హంటర్ రోడ్డుకు చేరుకున్న ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది ►సాయం చేయాలని బాధితుల ఆర్తనాదాలు ►వరద నీటిలో కొట్టుకుపోయిన వాహనాలు పట్టాలపై వరద.. పెద్దపల్లిలో నిలిచిన గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ►పెద్దపల్లి రైల్వే స్టేషన్లో మూడు గంటలకుపైగా గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. పట్టాలపై భారీగా వరదనీరు చేరడంతో సికింద్రాబాద్‌కు రావాల్సిన రైలును పెద్దపల్లిలో అధికారులు నిలిపేశారు. కాజీపేట వడ్డేపల్లి చెరువు ఉప్పొంగి ప్రవహించడంతో పెద్దపల్లి రైల్వే స్టేషన్లో గోరఖ్ పూర్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపవేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రయాణికులు వాహనాల్లో తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఖమ్మం జిల్లా ► భారీ వర్షాల నేపథ్యంలో మున్నేరు వరదల్లో ఏడుగురు వ్యక్తులు చిక్కుకున్నారు. నగరంలోని పద్మావతి నగర్లో శ్రీరామ చంద్ర మిషన్ హార్ట్ ఫుల్ నెస్ ధ్యాన మందిరంలో చిక్కుకున్న ఏడుగురుని కాపాడేందుకు రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. అయితే వరద ఉదృతితో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. సహాయక చర్యలను మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి, అదనపు కలెక్టర్ ప్రియాంక పర్యవేక్షిస్తున్నారు. ►మున్నేరు వరదలో చిక్కుకున్న ఏడుగురి కోసం రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు ఫోన్ చేశారు. మున్నేరు వరద ఉధృతి , సహాయ చర్యల పై మంత్రిని అడిగి తెలుసుకున్నారు. ఏడుగురిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని హుటాహుటిన ఖమ్మం తరలించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ►సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి పువ్వాడ భద్రాచలం నుంచి ఖమ్మం బయలుదేరారు. విశాఖ నుంచి భద్రాచలం వస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని మార్గమధ్యంలో ఖమ్మం మళ్లించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రత్యేక డ్రోన్ పంపించి ఇంట్లో చిక్కుకున్న ఏడుగురి పరిస్థితిని ఖమ్మం అధికారులు ఆరాతీస్తున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మున్నేరు వాగుప్రమాద స్థాయిలో పొంగి ప్రవహిస్తోంది. .ఖమ్మం కాల్వ ఒడ్డు వద్ద గరిష్టంగా 28 అడుగులు ప్రవహిస్తున్న మున్నేరు వరద ఉధృతిని రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ పరిశీలించారు. వరద ప్రాంతాల్లో కేటీఆర్ పర్యటన ►రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో హైదరాబాద్ తాజా పరిస్థితిపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నుంచి పురపాలకశాఖ అధికారులు, అడిషనల్ కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అదే విధంగా హైదరాబాద్ నగరంలోనూ పలు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. హుస్సేన్ సాగర్ వద్ద వరద ఉధృతిని మంత్రి పరిశీలించారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. ప్రాణ నష్టం జరగకుండా చూడడమే ప్రాథమిక ప్రాధాన్యతగా పని చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ సమీక్ష.. ► తెలంగాణలో ఎడతెరిపిలేని భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టారు. ఎప్పటికప్పుడు తెలంగాణలో పరిస్థితిని కేసీఆర్ పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామాల్లో సహాయక చర్యల కోసం హెలికాప్టర్‌ను తరలించాలని కేసీఆర్ ఆదేశించారు. వరద బాధిత జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియామించాలని ఆదేశాలు జారీ చేశారు. ► తెలంగాణ చరిత్రలోనే భారీ వర్షం కురిసింది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో 649.8మిమీ వర్షం కురిసింది. అంతకుముందు.. ములుగు జిల్లా వాజేడులో 2013లో జూలై 19న 24 గంటల్లో 517.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసినట్టు అధికారులు తెలిపారు. ► ఇక, గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని 35 ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లపైన వర్షపాతం నమోదైంది. 200 కేంద్రాల్లో 10 సెంటీమీటర్లకుపైగా వర్షం కురిసింది. ► హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మరో 24 గంటలు వర్షం ముప్పు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ► ఇక, భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంపీ హై అలర్ట్. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించింది. ► కాగా, జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 11 సెం.మీల వర్షపాతం నమోదైంది. ► బంగాళాఖాతంలో వాయుగుండం బలపడటంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 48 గంటలు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ► తెలంగాణలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్, 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. ఇక, హైదరాబాద్‌లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. ► భద్రాచలం వద్ద 51 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరుకుంది. దీంతో, రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. MLA Rekha Naik & other officials run away from #Kadem project after they realize that it is dangerous today morning. While project capacity is 700 ft, it is filled to 699.5 ft. Officials tried to open all 18 gates but 4 didn’t work! #NirmalDist #TelanganaRains #StaySafe pic.twitter.com/27AQxZJ6FH — Revathi (@revathitweets) July 27, 2023 ► హైదరాబాద్‌లో రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ప్రధాన జంక్షన్లలో రోడ్లు జలమయమయ్యాయి. మరో మూడు గంటలపాటు నగరంలో వర్షం కురిసే అవకాశం ఉంది. అత్యవసరమైతే బయటకు రావాలని అధికారులు సూచించారు. జీహెచ్ఎంసీ హెల్ప్‌లైన్ నెంబర్: 040-2111 1111, ఆర్డీఎఫ్ నెంబర్: 90001 13667. #Kadem Project@balaji25_t pic.twitter.com/hfvoSl8uGc — Shravan Pintoo (@ShravanPintoo) July 27, 2023 #Telangana A woman was washed away while crossing a water stream in Kothagudem. And the BRS govt has the audacity to implement this Telangana model across the country... And also KCR wanted to become the PM. pic.twitter.com/Uj3k2KSGJu — Gems Of KCR (@GemsOfKCR) July 27, 2023 ► భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు. భద్రాచలం నుంచి దిగువకు 12.65 లక్షల క్యూసెక్కుల వరద వదులుతున్నారు. భద్రాద్రి రామాలయం చుట్టూ వరద నీరు చేరింది. నీటమునిగిన అన్నదాన సత్రం, విస్తా కాంప్లెక్స్. చర్లలోని లోతట్టు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలింపు. భద్రాచలం పట్టణంలోని 3 కాలనీల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలింపు. బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న ఏజెన్సీ ప్రాంత ప్రజలు. అత్యవసరమైతే ఫొటోలు, లోకేషన్లు పంపాలని జిల్లా ఎస్పీ సూచన. పోలీసు రెస్య్కూ కంట్రోల్ వాట్సాప్ నెంబర్ 87126 82128. In total 80 tourists who were stuck at #Muthyaladara waterfalls, #Mulugu, #Telangana were rescued by the DDRF & NDRF teams deployed. All are safe & sound. One minor boy was bitten by a scorpion, he was shifted to hospital for treatment. #Rains https://t.co/0ey898lYpK pic.twitter.com/RmhWS4v4UE — Sowmith Yakkati (@sowmith7) July 27, 2023 Due to heavy rains across Telangana State, citizens are advised to come out only for extremely important work at night times. Present situation is currently under control. #TelanganaPolice, from home guard officers to the DG level, are well-prepared, and every hour from each PS… pic.twitter.com/CWcLiypmB7 — DGP TELANGANA POLICE (@TelanganaDGP) July 26, 2023 ► మూసీ ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మూసీ ఇన్‌ఫ్లో 19వేలు, ఔట్‌ఫ్లో 17వేలు క్యూసెక్కులు. Water falling from 700 feet at #Mutyamdhara #waterfalls in Veerabhadravaram located in #Mulugu district’s #Vebkatapuram mandal.@telanganatouris @tstdcofficial @VSrinivasGoud @newstapTweets pic.twitter.com/TsGrw0mvbF — Saye Sekhar Angara (@sayesekhar) July 26, 2023 ► నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ డేంజర్ జోన్లో ఉంది. సామర్ధ్యానికి మించి వరద ప్రవహిస్తోంది. కడెం ప్రాజెక్ట్ సామర్థ్యం 3.50లక్షల క్యూసెక్కులే. కాగా, 6.04 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. కడెం ప్రాజెక్ట్ గేట్లపై నుంచి వరద ప్రవహిస్తోంది. 14 గేట్ల ద్వారా దిగువకు 2.18 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. రంగంలోకి దిగిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నిర్మల్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. Despite heavy #rains, a funeral procession had no option but to risk crossing a seasonal stream to perform the final rites of an elderly person. The incident happened couple of days ago in Cherial of #Siddipet district, #Telangana. pic.twitter.com/rD1utRTTvT — Krishnamurthy (@krishna0302) July 26, 2023 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. కుండపోత కారణంగా మోరంచ వాగు ప్రవాహం ప్రమాదకర స్థాయి దాటి మోరంచపల్లి గ్రామాన్ని ముంచెత్తింది. దీంతో కొందరు గ్రామస్తులు వర్షంలోనే బిల్డింగ్‌లపైకి ఎక్కి రక్షించాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో అని గ్రామస్తులు వణికిపోతున్నారు. ► వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. చాలామంది సెల్ఫోన్లు కూడా పని చేయడం లేదని.. దీంతో అధికారుల సాయం కోరేందుకు కూడా వీలుకావడం లేదని వాపోతున్నారు. మోరంచపల్లి గ్రామంలో 300 మంది.. వెయ్యి జనాభా దాకా ఉంది. వానాకాలం వచ్చినప్పుడల్లా మోరంచవాగు ప్రవాహంతో గ్రామం చుట్టూ నీరు చేరుతుంటుంది. అయితే ఈ దఫా గ్రామాన్ని వాగు పూర్తిగా ముంచెత్తడం గమనార్హం. సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా వర్షాలు భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు, వాతావరణ శాఖ రెండు రోజులపాటు రెడ్ అలర్ట్ ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని.. దానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. వర్షాలకు తోడు పలుచోట్ల గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ప్రకటించింది.