
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మంగళవారం కుండపోత వర్షం కురిసింది. అకాల వర్షాల నేపథ్యంలో ప్రమాదాల కారణంగా రెండు రాష్ట్రాల్లో పలువురు మృతిచెందారు.
కాగా, హైదరాబాద్‌లోని బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సెంట్రింగ్ పని కార్మికుల షెడ్‌పై కూలిన రిటైనింగ్ వాల్. భారీ వర్షానికి కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న గోడ కూలిపోవడంతో ఏడుగురు కార్మికులు మృతి చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సీఎన్‌డీఆర్‌ఎఫ్, జీహెచ్ఎంసీ సిబ్బంది మృతదేహాలను బయటకు తీశారు. ఇక, మృతులను ఒడిషా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కార్మికులుగా గుర్తించారు. ఇక, ఏపీలో కూడా పిడుగుల కారణంగా ఏడుగురు మృత్యువాడపడ్డారు.

బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. గోడకూలి ఏడుగురు చనిపోవడంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గోడ నిర్మాణంలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే, చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. ఈ ఘటనలో గాయపడిన వారికి సరైన వైద్య చికిత్స అందించాలన్నారు.
#HyderabadRains #tankbund #Hussainsagar @CoreenaSuares2 @Rajani_Weather super duper rain. #scary pic.twitter.com/2xvWITJ3jt
— sαмυεℓ ραυℓ🇮🇳 (@vikramsamuelp) May 7, 2024