wall collapsed
-
నంద్యాలలో విషాదం.. నిద్రలోనే కుటుంబం మృత్యువాత
సాక్షి, నంద్యాల: జిల్లాలోని చాగలమర్రి మండలం చిన్నవంగలిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో దంపతులు, వాళ్ల ఇద్దరు పిల్లలు ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న ఆ కుటుంబ సభ్యులపై మట్టి మిద్దె కూలి ఒక్కసారిగా మీద పడింది. దీంతో ఆ కుటుంబం అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు తెల్లారి చూసేసరికి దిబ్బల కింద ఆ కుటుంబం సజీవ సమాధి అయ్యి ఉంది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. బాధిత కుటుంబాన్ని గురుశేఖర్ రెడ్డి కుటుంబంగా పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోగా.. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
రాజేంద్రనగర్‌లో విషాదం.. గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి
హైదరాబాద్, సాక్షి: రాజేంద్రనగర్‌లో సోమవారం ఉదయం విషాదం చోటు చేసుకుంది. బాబుల్ రెడ్డి నగర్ కాలనీలో ఓ ఇంటి గోడకూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. అలాగే మరో ఇద్దరికి తీవ్ర గాయాలయినట్లు తెలిసింది. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.ఇద్దరికి గాయాలు...సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. నిన్న కురిసిన భారీ వర్షానికి నానిన గోడ కూలినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మృతులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే పోలీసులు మాత్రం అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్‌లో విషాదం.. ఏడుగురు మృతి
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మంగళవారం కుండపోత వర్షం కురిసింది. అకాల వర్షాల నేపథ్యంలో ప్రమాదాల కారణంగా రెండు రాష్ట్రాల్లో పలువురు మృతిచెందారు.కాగా, హైదరాబాద్‌లోని బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సెంట్రింగ్ పని కార్మికుల షెడ్‌పై కూలిన రిటైనింగ్ వాల్. భారీ వర్షానికి కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న గోడ కూలిపోవడంతో ఏడుగురు కార్మికులు మృతి చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సీఎన్‌డీఆర్‌ఎఫ్, జీహెచ్ఎంసీ సిబ్బంది మృతదేహాలను బయటకు తీశారు. ఇక, మృతులను ఒడిషా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కార్మికులుగా గుర్తించారు. ఇక, ఏపీలో కూడా పిడుగుల కారణంగా ఏడుగురు మృత్యువాడపడ్డారు. బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. గోడకూలి ఏడుగురు చనిపోవడంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గోడ నిర్మాణంలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే, చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. ఈ ఘటనలో గాయపడిన వారికి సరైన వైద్య చికిత్స అందించాలన్నారు. #HyderabadRains #tankbund #Hussainsagar @CoreenaSuares2 @Rajani_Weather super duper rain. #scary pic.twitter.com/2xvWITJ3jt— sαмυεℓ ραυℓ🇮🇳 (@vikramsamuelp) May 7, 2024 -
అడ్డగుట్ట విషాదం.. నిబంధనలకు విరుద్ధంగా పనులు
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి అడ్డగుట్టలో విషాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం గోడ కూలి.. ఇద్దరు కార్మికులు మృతి చెందారు. అయితే యజమాని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వల్లే కార్మికుల ప్రాణాలు పోయినట్లు తెలుస్తోంది ఇప్పుడు. కేపీహెచ్‌బీ పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనంలో గోడతో పాటు సెంట్రింగ్ కర్రలు విరిగిపడ్డాయి. దీంతో.. భవనం 6వ అంతస్థు నుంచి కిందపడిపోయారు కార్మికులు. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పిట్టగోడ పనులు చేస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పిట్టగోడతో పాటు గోవా కరలు(పిరంగి ) విరిగి కిందపడ్డారు. మృతుల్ని ఒడిశాకు చెందిన సంతోష్, సోనియాచరణ్గా గుర్తించారు. గాయపడిన మరో ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. అయితే భవన నిర్మాణానికి అనుమతులు ఐదు అంతస్థుల వరకే ఉందని.. నిబంధనలకు విరుద్ధంగా ఆరో అంతస్థు నిర్మించి పనులు జరుపుతున్నట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. -
కూలిన కాలేజీ గోడ.. నలుగురి దుర్మరణం
చెన్నై: తమిళనాడు కోయంబత్తూరులో మంగళవారం సాయంత్రం ఘోరం జరిగింది. పూదూర్ ప్రాంతంలో ఓ ప్రైవేట్ కళాశాల గోడ కూలి నలుగురు మృతి చెందారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కునియముత్తూర్లోని సుకునపురం కృష్ణ కళాశాల వద్ద నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆ సమయంలో ప్రహారీ గోడ కూలి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన నలుగురు పనుల కోసం వచ్చిన వలస కూలీలుగా తెలుస్తోంది. -
హైదరాబాద్: గోడ కూలి నెలల పసికందు మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బోరబండ పరిధిలోని రహమత్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి కురిసిన నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ గోడ కూలి.. పక్కనే ఉన్న రేకుల ఇంటి మీద ఇటుక రాళ్లు పడ్డాయి. దీంతో ఆ ఇంట్లో ఉన్న ఓ నెలల పసికందు మృతి చెందింది. నారాయణఖేడ్ చెందిన శ్రీకాంత్-జగదేవి జంట.. కూలీ పని కోసం నగరానికి వచ్చి రెహమత్నగర్ పరిధిలోని ఓంనగర్‌లో ఉంటున్నారు. మంగళవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షంతో.. వాళ్లుంటున్న పోర్షన్ పక్కన నిర్మాణంలో ఉన్న భవనం నాలుగో అంతస్తులో ఉన్న సైడ్‌వాల్ కూలిపోయింది. దీంతో ఆ ఇటుక రాళ్లు పక్కనే శ్రీకాంత్ ఉంటున్న రేకుల రూమ్‌పై పడ్డాయి. ఆ సమయంలో పెద్ద శబ్ధం రావడంతో.. ఆ భార్యభర్తలిద్దరూ అప్రమత్తం అయ్యి బయటపడ్డారు. అయితే ఊయలలో నిద్రిస్తున్న 8 నెలల జీవనికా ఇటుకలు మీద పడి అక్కడికక్కడే మృతి చెందింది. బాలిక మృతితో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఆ భవన నిర్మాణం అక్రమంగా సాగుతోందని చెబుతూ.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. మరోవైపు చిన్నారి మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ తరలించి.. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. -
భవిత కళాశాలలో ప్రమాదం
-
విషాదం: ఎంగేజ్మెంట్కు ఆహ్వానించేందుకు వచ్చి.. కొన్ని గంటలముందే..
వరంగల్/ఎంజీఎం: ఎంగేజ్మెంట్కు ఆహ్వానించేందుకు వచ్చిన ఓ యువకుడు పాత భవనం గోడ కూలడంతో మృత్యువాతపడ్డాడు. ఇదే ఘటనలో మరో వ్యక్తి సైతం ప్రాణాలు కోల్పోగా, మహిళకు తీవ్రగాయాలయ్యాయి. వరంగల్ మండిబజార్‌లో శుక్రవారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇంతేజార్గంజ్ ఇన్స్పెక్టర్ డి.మల్లేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం రేబల్లె గ్రామానికి చెందిన తిప్పారపు పైడి (55), ఖమ్మం జిల్లా కేంద్రంలోని వైఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన సమ్మక్క అలియాస్ సలీమా మండిబజార్‌లో నిర్మిస్తున్న భవనం వద్ద వాచ్‌మెన్‌గా చేరారు. ఈ క్రమంలో పక్కనే తడకలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. సలీమా కొడుకు ఫిరోజ్(24) తొర్రూరులో నివాసం ఉంటుండగా, రంగశాయిపేటకు చెందిన యువతితో పెళ్లి కుదిరింది. ఈ నెల 24న(ఆదివారం) ఎంగేజ్మెంట్ ఉండడంతో తల్లి సలీమాను ఆహ్వానించేందుకు శుక్రవారం అన్నావదినతో కలిసి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో ఖమ్మం నుంచి వరంగల్‌కు వచ్చాడు. చదవండి👉క్లౌడ్ బరస్ట్, పోలవరం ఎత్తు టీఆర్ఎస్కు కొత్త ఆయుధాలా! ఫిరోజ్ అన్నావదిన రంగశాయిపేటలోని బంధువుల ఇంటికి వెళ్లగా, ఫిరోజ్ తన తల్లి సలీమా వద్దకు వెళ్లాడు. రాత్రి పైడి, సలీమాతోనే నిద్రించాడు. ఈ క్రమంలో పక్కనే శిథిలావస్థలో ఉన్న మూడు పోర్షన్ల పాత భవనం గోడ కూలి నిద్రిస్తున్న ముగ్గురిపై పడింది. ఈ ఘటనలో పైడి, ఫిరోజ్ అక్కడికక్కడే మృతి చెందగా, సలీమాకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. సమాచారం అందుకున్న ఏసీపీ కలకోట గిరికుమార్, పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. బాధితురాలు సమ్మక్క అలియాస్ సలీమా ఫిర్యాదు మేరకు శిథిలభవనం యజమానులు జిజియ భాయి, గుండా సంతోష్‌కుమార్, కుస్రు ఫయిజల్లతోపాటు కొత్తగా ఇల్లు కట్టుకుంటున్న కందకట్ల రాంప్రసాద్పై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ మల్లేష్ తెలిపారు. చదవండి👉అంగట్లో జూనియర్ లైన్‌మన్ పోస్టులు రూ.5 లక్షలకు బేరం! మంత్రి, ఎమ్మెల్యేల పరామర్శ ఎంజీఎం మార్చురీలో ఉన్న పైడి, ఫిరోజ్ మృతదేహాలను మంత్రి దయాకరరావు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వర్ధన్నపేట, వరంగల్ తూర్పు ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్ పరిశీలించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. అలాగే, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఎంజీఎంలో మృతదేహాలను సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. రూ.20లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చదవండి👉పాలేరు వరద మధ్యలో బిక్కుబిక్కుమంటూ 21 మంది కూలీలు! -
పాణాలు తీసిన ప్రహరీ
కృష్ణరాజపురం: భారీ వర్షాలకు నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్ గోడ కూలి నలుగురు కూలీ కార్మికులు మరణించారు. ఈ సంఘటన బెంగళూరు సమీపంలో హొసకోటె తాలూకా అనుగొండనహళ్లి హోబళి పారిశ్రామిక ప్రాంతంలో ఒక అపార్టుమెంట్ వద్ద జరిగింది. మృతులు, క్షతగాత్రులంతా ఉత్తర భారతదేశానికి చెందిన వారు. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు గోడ పక్కనే వేసుకున్న తాత్కాలిక షెడ్లో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా గోడ కూలిపోయింది. గోడ కింద పలువురు కార్మికులు చిక్కుకుపోయారు. స్థానికులు, పోలీసులు చేరుకుని వారిని బయటకు తీసి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బిహార్‌కు చెందిన మనోజ్ కుమార్ (35), రామ్‌కుమార్ (25), నితీశ్ కుమార్ (22), మణితన్ దాస్ అనే నలుగురు తీవ్రగాయాలతో మరణించారు. నాసిరకం నిర్మాణం నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్లో కూలీ కార్మికులు పనిచేస్తున్నారు. కారి్మకులు ఉండేందుకు తాత్కాలికంగా షెడ్‌ను నిర్మించారు. అయితే బుధవారం కురిసిన భారీ వర్షం, అలాగే పక్కనే ఉన్న రాజకాలువ పొంగడంతో ప్రమాదం జరిగింది. ప్రహరీని రాజకాలువను ఆక్రమించి, నాసిరకంగా కట్టినట్లు సమాచారం. ఎలాంటి పునాది లేకుండా ఆ కాంపౌండ్‌కు ఆనుకుని షెడ్‌ను నిర్మించారు. దీంతో వర్షానికి తడిసిన ఆ కాంపౌండ్ గోడ పేకమేడలా షెడ్డుమీద కూలి పోయింది. నలుగురికి తీవ్రగాయాలు ఈ ప్రమాదంలో సునీల్ మండల్, శంభు మండల్, దిలీప్, దుర్గేశ్ అనే నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వైట్‌ఫీల్డ్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని మంత్రి ఎంటీబీ నాగరాజు, ఎస్పీ పురుషోత్తమ్, డీఎస్పీ పి.ఉమాశంకర్ పరిశీలించారు. (చదవండి: నకిలీ పత్రాలతో రూ.95 లక్షల లోన్ ) -
Hyderabad: పుప్పాలగూడలో విషాదం, గోడకూలి ముగ్గురు మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పుప్పాలగూడలో శనివారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ ఆవరణలో సెల్లార్ గుంత తీస్తుండగా దాన్ని ఆనుకుని ఉన్న గోడ అకస్మాత్తుగా కూలిపోయింది. గుంత తీస్తున్న కూలీలపై గోడపడిపోవడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతులంతా బిహార్ వాసులుగా పోలీసులు గుర్తించారు. -
గుజరాత్లో ఘోర ప్రమాదం
-
గుజరాత్లో ఘోర ప్రమాదం: గోడ కూలి 12 మంది దుర్మరణం
Morbi's Salt Factory Wall Collapsed: గుజరాత్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం మోర్బీలోని హల్వాద్ ఇండస్ట్రీయల్ ఏరియా(జీఐడీసీ)లోని సాగర్ ఉప్పు కర్మాగారం గోడ కూలి 12 మంది మరణించారు. మరో ముగ్గురు శిథిలాల కిందే ఇరుక్కుపోయినట్లు భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 12 మంది గోడ కిందే ప్రాణాలు వదిలిన ఘటన స్థానికంగా విషాదం నింపింది. ఘటన గురించి తెలియగానే.. స్థానిక ఎమ్మెల్యే బ్రిజేష్ మెర్జా ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటుందని ఆయన తెలిపారు. Gujarat | At least 12 people died after a wall of a salt factory in Morbi's Halvad GIDC collapsed 12 people have died after an incident happened at Sagar Salt Factory in Halvad GIDC. Government stands with the families of the deceased: State Minister Brijesh Merja pic.twitter.com/lSBAaw2jJB — ANI (@ANI) May 18, 2022 ఇదిలా ఉంటే ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. The tragedy in Morbi caused by a wall collapse is heart-rending. In this hour of grief, my thoughts are with the bereaved families. May the injured recover soon. Local authorities are providing all possible assistance to the affected. — Narendra Modi (@narendramodi) May 18, 2022 GUJARAT: 12 PEOPLE KILLED IN WALL COLLAPSE "We have identified the owner of the factory," said SP of #Gujarat's #Morbi district where 12 people have been killed in a wall collapse in a salt factory. pic.twitter.com/ucDdKU5jCe — Mirror Now (@MirrorNow) May 18, 2022 -
Mahabubnagar: గోడ కూలి ఐదుగురి దుర్మరణం
సాక్షి, అలంపూర్(మహబూబ్‌నగర్): ఆ కుటుంబ సభ్యులు అప్పటివరకు వివాహ సంబరాల్లో ఆనందంగా గడిపారు. బంధుమిత్రులతో కలిసి కష్టసుఖాలు పంచుకున్నారు. రాత్రి సహపంక్తి భోజనం చేసి ఇంటికెళ్లారు. ఆ తర్వాత తల్లిదండ్రులు.. వారి ముగ్గురు పిల్లలు శాశ్వతంగా నిద్రలోకి వెళ్లిపోయారు. అంతవరకు అందరి మధ్యన ఉన్న ఆ కుటుంబాన్ని గోడ రూపంలో మృత్యువు కబళించింది. ఈ దుర్ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం కొత్తపల్లిలో చోటుచేసుకుంది. ఈ గ్రామానికి చెందిన హరిజన మోష (35), శాంతమ్మ (33) దంపతులకు ఐదుగురు సంతానం. వీరిలో కుమారులు చరణ్ (10), రాము (8), తేజ (7), చిన్న, కుమార్తె స్నేహ ఉన్నారు. పూరి గుడిసెలో ఈ కుటుంబం నివాసముంటోంది. అర ఎకరం భూమి ఉన్నా సాగు చేసుకోవడానికి స్తోమత లేకపోవడంతో భార్యాభర్తలు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎక్కువగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి ఇటుక బట్టీల్లో పనిచేసేవారు. రెండు నెలల క్రితమే స్వగ్రామానికి వచ్చి ఇక్కడే సీడ్ పత్తి పనులకు వెళ్తున్నారు. తాముంటున్న గుడిసెలోనే రెండు గదులుగా చేసుకునేందుకు ఆరడుగుల ఎత్తుతో ఇటుక గోడ నిర్మించుకున్నారు. ఆ గోడ పటిష్టంగా లేకపోవడం, దానికితోడు గుడిసెకు చుట్టూ ఉన్న బండల సందులోంచి వర్షపు నీరు రావడంతో మెత్తబడింది. రాత్రి అక్కడే నిద్రిస్తున్న కుటుంబసభ్యులపై గోడ కూలి పడింది. తల్లిదండ్రులతోపాటు చరణ్, రాము, తేజ సజీవ సమాధి అయ్యారు. మరో ఇద్దరు చిన్నారులు బతికి బయటపడ్డారు. ఈ దుర్ఘటన శనివారం అర్ధరాత్రి దాటాక రెండు గంటలకు జరిగింది. గోడ కూలిన సమయంలో పెద్దగా పిడుగు శబ్దం రావడంతో చుట్టుపక్కలవారు ప్రమాదాన్ని గుర్తించలేక పోయారు. ఆదివారం ఉదయం ఆరు గంటలు దాటినా నల్లా నీటిని పట్టుకునేందుకు ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో చుట్టుపక్కలవారు లోపలికి వెళ్లారు. కూలిన గోడ కింద అందరిని చూసి అవాక్కయ్యారు. శిథిలాలను తొలగించగా అందులో ఐదుగురు అప్పటికే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన మరో స్నేహ, చిన్నను 108 వాహనంలో చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ రంగస్వామి, శాంతినగర్ సీఐ వెంకటేశ్వర్లు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ రఘురాంశర్మ వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. మృతి చెందిన మోషకు అన్న ప్రేమరాజు, తమ్ముడు రాజు ఉన్నారు. గ్రామంలో విషాదఛాయలు ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాతపడటంతో కొత్తపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. శనివారం రాత్రి కాలనీలో జరిగిన ఓ వివాహ రిసెప్షన్లో మోష కుటుంబం పాల్గొంది. అందరితో కలిసి భోజనం చేసి 10.30 గంటల తర్వాత ఇంటికి చేరుకుని వారు నిద్రపోయినట్లు స్థానికులు చెప్పారు. మరికొన్ని గంటలు ఇక్కడే ఉండి ఉంటే ప్రమాదం తప్పి ఉండేదని బంధువులు, కాలనీవాసులు కన్నీరు మున్నీరయ్యారు. సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి ఈ ఘటనపై సీఎం కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని, వైద్య, విద్య సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే వివిధ గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. -
వర్షం బీభత్సం.. గోడ కూలి అన్న, చెల్లి దుర్మరణం..
సాక్షి, దొడ్డబళ్లాపురం(కర్ణాటక): ఎడతెరిపిలేని వర్షంతో ఇంటిపై గోడ కూలి అన్న, చెల్లెలు ఇద్దరూ దుర్మరణం పాలైన సంఘటన నెలమంగల తాలూకా బిన్నమంగల గ్రామంలో చోటుచేసుకుంది. తుమకూరు జిల్లా గుబ్బి తాలూకా సీఎస్ పుర గ్రామానికి చెందిన వేణుగోపాల్ (22), కావ్య (20) మృతి చెందిన అన్న, చెల్లెలు. ఇద్దరూ విద్యాభ్యాసం నిమిత్తం గ్రామంలోని హనుమంతరాయప్ప అనే వ్యక్తికి చెందిన షీట్ ఇంట్లో అద్దెకు ఉన్నారు. సోమవారం రాత్రి ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. హఠాత్తుగా ఇంటి పక్కన ఉన్న పెద్ద గోడ కూలి ఇంటి షీట్‌పై పడింది. దీంతో అన్న, చెల్లి ఇద్దరూ శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందారు. ఫైర్ సిబ్బంది మృతదేహాలను వెలికితీసారు. ఇదే శిథిలాల కింద పడి మరో వ్యక్తి గాయాలపాలయ్యా డు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
ముంబైలో ఘోర ప్రమాదం
-
కుప్ప‘కూలి’న గోడ.. తెల్లారిన ఆరుగురి బతుకులు
పాట్నా: కాలువ తవ్వకం చేస్తుండగా పాఠశాల ప్రహారి గోడ కుప్పకూలిపోయింది. అయితే గోడ పనులు చేస్తున్న కూలీలపై పడడంతో వారి శిథిలాల కింద ఛిద్రమయ్యారు. ఈ ప్రమాదంలో మొత్తం 6గురు కూలీలు దుర్మరణం పాలవగా.. మరికొందరు తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఈ ఘటన బిహార్‌లో ఖగారియా జిల్లా మహేశ్‌ఖంట్ పోలీస్ పరిధిలోని చాందీతోలా ప్రాంతంలో చోటుచేసుకుంది. తీవ్ర గాయాలపాలైన వారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చాందీతోల ప్రాంతంలో ఉన్న పాఠశాల ప్రహారి గోడకు సమీపంలో భూగర్భ కాలువ తవ్వకాలు చేపట్టారు. మొత్తం 12 మంది కూలీలు పాల్గొంటున్నారు. ఈ పనుల్లో భాగంగా జేసీబీ ప్రహారి గోడకు సమీపం తవ్వకాలు చేపట్టడంతో పగులుళ్లు వచ్చి కూలిపోయింది. ఈ పనుల వలన పాఠశాల ప్రహారి గోడకు పగుళ్లు ఏర్పడి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 6 గురు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా మరికొందరు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం. ఈ ప్రమాదానికి కారణం కాంట్రాక్టర్ నిర్లక్ష్యమేనని స్థానికులు, మృతుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే జేసీబీకి సంబంధించిన వ్యక్తులు పరారయ్యారు. -
హైదరాబాద్: పాతబస్తీ బండ్లగూడలో దారుణం..
-
పాతబస్తీ బండ్లగూడలో విషాదం..
సాక్షి, హైదరాబాద్: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. బండ్లగూడ మహ్మదియా నగర్‌లోని ఓ పహిల్వాన్‌కు చెందిన ఫామ్‌హౌస్ గ్రానైట్ గోడ కూలి పక్కనే ఉన్న రెండిళ్లపై పడింది. ఈ ఘటనలో 11మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మృతులంతా రెండు కుటుంబాలకు చెందిన వారే. ఈ ఘటనలో గాయపడిన నలుగురిని పోలీసులు మొగల్‌పురలోని అస్రా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఎంపీ అసద్, ఎమ్మెల్యే అక్బర్ పరామర్శించారు. గ్రానైట్ రాయితో నిర్మించిన ఈ గోడ పాతది కావడం.. ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు కూలి ఉండచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మరో ఘటనలో తల్లీకూతుళ్లు మృతి.. ఇబ్రహీంపట్నం(హైదరాబాద్): ఇంటిగోడ కూలిపోయి తల్లీ కూతుళ్లు మృతి చెందగా కుమారుడుకి తీవ్రగాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని మల్‌శెట్టిగూడలో క్యామ సువర్ణ(37) కూతురు స్రవంతి (14), కుమారుడు సంపత్ (18)తో కలసి ఓ ఇంటిలో నివాసముంటోంది. సోమవారం నుంచి వర్షం కురుస్తుండటంతో ఇంటి గోడలు బాగా నానిపోయాయి. దీంతో రాత్రి 8 గంటల సమయంలో ఇంటి పైకప్పు గోడలు కూలి సువర్ణ, స్రవంతి, సంపత్‌లపై పడ్డాయి. తల్లీకూతుళ్లు అక్కడికక్కడే మృతి చెందగా, కుమారుడు సంపత్‌కు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం స్థానికులు వెంటనే అతడిని ఇబ్ర హీంపట్నం ఆస్పత్రికి తరలించారు. -
విషాదం: నలుగురు చిన్నారులు మృతి
భోపాల్: మధ్యప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని కట్నీ జిల్లా బన్హారా గ్రామంలో ఓ గోడ కూలి నలుగురు చిన్నారులు మృతి చెందారు. భారీగా కురుస్తున్న వర్షాలకు ఇంటి బయట గోడ కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చెరుకున్నారు. మృత దేహాలను స్థానిక ఉమ్రియాపాన్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
తగిలేపల్లిలో తీరని విషాదం..
వర్ని(బాన్సువాడ): ఆ కుటుంబానికి ప్రభుత్వం ‘డబుల్ బెడ్రూం’ మంజూరు చేసింది. మొదటి అంతస్తులో కేటాయించడంతో తన భార్య గర్భిణి అనీ ఇబ్బంది అవుతుందని వేడుకోవడంతో ఖాళీ స్థలాన్ని కేటాయించారు. ఆ స్థలంలో రేకుల షెడ్డు వేసుకున్నారు. సోమవారం గృహప్రవేశానికి ముహూర్తం నిర్ణయించారు. అంతలోనే తీరని విషాదం నెలకొంది ఆ కుటుంబంలో.. ప్రస్తుతమున్న అద్దె ఇంటి గోడకూలి భార్యాభర్తలు, శ్రీనివాస్(34), లక్ష్మి(30), వారి ఏడాది కుమారుడు సాయికుమార్ దుర్మరణం చెందారు. మరో ముగ్గురు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. వర్ని మండలం తగిలే పల్లిలో శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన గ్రామస్తులను కలచి వేసింది. మంజూరైన డబుల్ బెడ్‌రూంలోకే వెళ్తే బతికేవారేమో... అయ్యో పాపం మరో మూడ్రోజుల్లో కొత్తింటిలోకి వెళ్లేవారు కదా అంటూ తమ వేదనను ఒకరికొకరు పంచుకున్నారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... తగిలేపల్లికి చెందిన మనిగిరి లక్ష్మి, గాంధారి మండలం చద్మల్‌కు చెందిన శ్రీనివాస్ బంధువుల ఇళ్లలో తరచూ కలవడంతో ఒకరికొకరు ఇష్టపడి పెళ్లిచేసుకున్నారు. పదేళ్ల క్రితం వివాహం కాగా వీరికి ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు జన్మించా రు. తొలుత చద్మల్‌లో నివాసం ఉన్న ఈ కుటుంబం ఒంటరిగా ఉంటున్న లక్ష్మి తల్లి గంగవ్వ వీరిని తగిలేపల్లికి రావాలని కోరింది. వా రు గ్రామానికి వచ్చి దినసరి కూలీలుగా పనిచేస్తూ అద్దె ఇంట్లో ఉంటున్నారు. శుక్రవారం ఉదయం గంగవ్వ నిద్రలేచి ఆరుబయట పను లు చేస్తుండగా ఒక్కసారిగా గోడ కుప్ప కూలింది. నిద్రలో ఉన్న కూతురు, అల్లుడు, నలుగురు చిన్నారులపై ఇటుక, సిమెంట్ పెళ్లలు పడ్డాయి. దీంతో గంగవ్వ కేకలు వేసింది. చుట్టుపక్కల వారు వచ్చి నలుగురిని బయటకు తీశారు. అప్పటికే లక్ష్మి, ఆమె కుమారుడు సాయికుమార్ మరణించారు. లక్ష్మి భర్త, ముగ్గు రు కూతుళ్లను ‘108’లో బోధన్ ఏరి యా ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకెళ్ల గా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. తల్లి, తండ్రులను కోల్పోయిన ముగ్గురు చిన్నా రులు సంజన(8), అశ్విని(5), పండు(3) బోధ న్ ఆస్పత్రిలో చికిత్స అనంతరం హైదరాబాద్ పంపించారు. రుద్రూర్ సీఐ అశోక్‌రెడ్డి, వర్ని ఎస్సై అనిల్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పునాది లేకుండా నిర్మించిన గోడ వల్లే దుర్ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన స్పీకర్ పోచారం తగిలేపల్లి ఘటన గురించి టీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో దిగ్భ్రాంతి చెందిన స్పీకర్ ఫోన్ ద్వారా ఘటన వివరాలు తెలుసుకున్నారు. అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులైన మరో ముగ్గురికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పీకర్ హామీ ఇచ్చారు. చిన్నారులను పరామర్శించిన సీపీ బోధన్‌టౌన్(బోధన్): వర్ని మండలం తగిలేపల్లిలో గోడ కూలిన ఘటనలో గాయాలపాలై బోధన్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను శుక్రవారం పోలీస్ కమిషనర్ కార్తికేయ పరామర్శించారు. ఘటనలో ముగ్గురు మృతి చెందగా, చిన్నారులు సంజనశ్రీ, వైష్ణవి, స్నిగ్ధ(పండు) గాయాల పాలయ్యారు. ఇందులో సంజనశ్రీ, వైష్ణవిలు బోధన్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా స్నిగ్ధను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. చిన్నారులను పరామర్శించిన సీపీ వారి ఆరోగ్య పరిస్థితిని సూపరింటెండెంట్ అన్నపూర్ణను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు మెరుగైన చికిత్సలు అందించాలని సూచించారు. ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు. ఆయన వెంట ఏసీపీ జైపాల్ రెడ్డి, సీఐ పల్లె రాకేశ్ ఉన్నారు. మెరుగైన వైద్య సేవలందించాలి గోడకూలిన ఘటనలో గాయాల పాలైన చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌వో సుదర్శనం వైద్యులకు సూచించారు. గాయపడిన చిన్నారులను పరామర్శించారు. అలాగే టీఆర్ఎస్ నేత పోచారం సురేందర్‌రెడ్డి తదితరులు పరామర్శించారు. -
గోడకూలి ముగ్గురు మృతి
-
సిమెంటు దిమ్మె పడి..
అబిడ్స్: పాతబస్తీలోని మంగళ్‌హాట్, మచిలీపురకు చెందిన ఇందర్‌సింగ్ (21) గాలి దుమారంతో ఇంటిపై పక్క బిల్డింగ్ పెంట్‌హౌస్ మీదనుంచి సిమెంట్ దిమ్మె పడటంతో అక్కడికక్కడేమృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. మచిలీపురలోని రేకులఇంటిలో ఇందర్ సింగ్, ఆయన తల్లిదయాబాయ్ (55) నివాసముంటున్నారు. ఇందర్‌సింగ్ బేగంబజార్ మచ్చీ మార్కెట్లో పనిచేస్తున్నాడు. అతని ఇంటి పక్కన నివసించే గణేశ్ సింగ్ 3 అంతస్తుల భవనంపై రేకుల షెడ్డు నిర్మించాడు. రేకుల షెడ్డుపై నిర్మించిన సిమెంట్ దిమ్మె గాలి దుమారానికి ఇందర్ సింగ్ రేకుల ఇంటిపై పడటంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి దయాబాయ్‌కి కాలు విరగడంతో స్థానికులు, గోషామహల్ కార్పొరేటర్ ముఖేశ్ సింగ్‌లు కలిసి చికిత్స నిమిత్తం ఆమెను ఉస్మానియా ఆస్పత్రిఇకి తరలించారు. ఇందర్ సింగ్ కుటుంబానికి నగర మేయర్ బొంతు రామ్మోహన్ రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రణ్వీర్ రెడ్డి పేర్కొన్నారు. -
కూలిన లేడీస్ హాస్టల్ గోడ
-
పట్టణ ప్రగతిలో అపశ్రుతి.. చిన్నారి మృతి!
-
పట్టణ ప్రగతిలో అపశ్రుతి!
సాక్షి, వరంగల్ అర్బన్: పట్టణాల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రొక్లెయినర్‌తో మురుగు కాలువ పనులు చేస్తుండగా గోడ కూలి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోగా ఆమె తమ్ముడికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. నగరంలోని 43వ డివిజన్లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం పనులు కొనసాగుతున్నాయి. మురుగు కాలువను జేసీబీతో శుభ్రం చేస్తుండగా ఆ పక్కనే గోడకు తగలడంతో అది కూలిపోయింది. అదే సమయంలో ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులపై గోడ కూలింది. ఈ ప్రమాదంలో ప్రిన్సి అనే ఎనిమిది సంవత్సరాల బాలిక మృతి చెందింది. ఆమె తమ్ముడికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిది గోవిందరావుపేట మండల కేంద్రం. మృతురాలి తండ్రి వడ్రంగి పనిచేస్తూ కుంటుంబాన్ని పోషిస్తున్నాడు. జేసీబీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని చిన్నారుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలుడిని చికిత్స నిమిత్తం ఏజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, జిల్లా కలెక్టర్ ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధితులను ఆదుకుంటామని తెలిపారు.