
ప్రమాద స్థలం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పుప్పాలగూడలో శనివారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ ఆవరణలో సెల్లార్ గుంత తీస్తుండగా దాన్ని ఆనుకుని ఉన్న గోడ అకస్మాత్తుగా కూలిపోయింది. గుంత తీస్తున్న కూలీలపై గోడపడిపోవడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతులంతా బిహార్ వాసులుగా పోలీసులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment