హైదరాబాద్: నగరంలోని పుప్పాలగూడలో జంట హత్యలు కలకలం రేపాయి. యువతీ, యువకుడ్ని కత్తులతో పొడిచి హత్య చేసినట్లు తెలుస్తోంది. పుప్పాలగూడలోని అనంత పద్మనాభస్వామి ఆలయ గుట్టల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది,. ఈరోజు(మంగళవారం) ఉదయం గుట్టల వద్దకు వచ్చిన వారికి మృతదేహాలు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పరిశీలించారు. మృతులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. అక్కడ బిల్డింగ్ నిర్మాణాలు జరుగుతుండటంతో పని చేయడానికి వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో కొన్ని ఆధారాలు సేకరించామని, వాటి ద్వారా మృతుల వివరాలను గుర్తిస్తామన్నారు.
ఘటన జరిగిన ప్రదేశాన్ని డీసీపీ శ్రీనివాస్ పరిశీలించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు డీసీపీ తెలిపారు. త్వరలోనే ఈ కేసును ఛేదిస్తామన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment