Cellar
-
ఇంటికి 100 మీటర్ల దూరంలో.. 26 ఏళ్ల పాటు చెరలో
అల్జీర్స్: టీనేజీ వయసులో పాఠశాలకు వెళ్తుండగా మార్గమధ్యంలో అపహరణకు గురై ఏకంగా 26 సంవత్సరాలపాటు బందీగా ఉండిపోయిన అల్జీరియన్ వ్యక్తి వేదన ఇది. అల్జీరియా దేశంలోని డిజేఫ్లా రాష్ట్రంలో ఇటీవల కిడ్నాపర్ చెర నుంచి విముక్తుడైన 45 ఏళ్ల ఒమర్ బిన్ ఒమ్రాన్ గాథను స్థానిక అల్జీరియన్ ఎల్ఖబర్ వార్తాసంస్థ వెలుగులోకి తెచి్చంది. గడ్డితో నిండిన సెల్లార్లో ఏళ్ల తరబడి.. ఒమర్‌కు 19 ఏళ్ల వయసు ఉన్నపుడు అంటే 1998 సంవత్సరంలో ఒకరోజు ఉదయం వృత్తివిద్యా పాఠశాలకు ఒమర్ తన ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. కొంతదూరం వెళ్లగానే కిడ్నాప్‌కు గురయ్యాడు. కిడ్నాప్‌చేసిన వ్యక్తి ఒమర్‌ను ఒక గడ్డితో కప్పిన నేలమాళిగలో దాచిపెట్టాడు. ఎందుకు కిడ్నాప్ చేశాడో, ఎందుకు ఇన్ని సంవత్సరాలు అక్కడే ఉంచాడో ఎవరికీ తెలీదు. తోబుట్టువు పోస్ట్‌తో వెలుగులోకి కిడ్నాపర్‌కు ఒక తోబుట్టువు ఉన్నారు. ఆ వ్యక్తి ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో ఒక విషయం రాసుకొచ్చారు. ఊరిలో ఒక‡ కిడ్నాప్ ఉదంతంలో తన పాత్ర కూడా ఉందని ఒక పోస్ట్‌చేశారు. ఈ పోస్ట్‌ను ఒమర్ కుటుంబం గమనించి వెంటనే దర్యాప్తు సంస్థకు సమాచారం ఇచ్చారు. దీంతో నేషనల్ జెండర్మెరీన్( దేశ దర్యాప్తు సంస్థ) పాత కేసును తిరగతోడింది. పోస్ట్ పెట్టిన వ్యక్తిని విచారించి కిడ్నాపర్ ఇంటిని కనిపెట్టారు. అధికారులు ఆదివారం కిడ్నాపర్ ఇంటిపై మెరుపుదాడి చేసి ఇళ్లంతా వెతికారు. చివరకు గడ్డితో ఉన్న రహస్య సెల్లార్లో ఒమర్‌ను కనుగొన్నారు. 61 ఏళ్ల కిడ్నాపర్ పారిపోతుంటే పోలీసులు పట్టుకున్నారు. కిడ్నాపర్ ఇల్లు.. ఒమర్ సొంత ఇంటికి కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. ఈ సెల్లార్ ఒక గొర్రెల కొట్టం కింద ఉన్నట్లు తెలుస్తోంది. కిటికీలోంచి చూసేవాడిని: ఒమర్ ‘‘కిడ్నాప్‌కు గురయ్యాక ఈ సెల్లార్లోనే ఉండిపోయా. నా కుటుంబసభ్యులు అటుగా వెళ్లేటపుడు సెల్లార్ కిటికీ నుంచి చూసేవాడిని. అరిచి పిలుద్దామని వందలసార్లు అనుకున్నా. కానీ పక్కనే కిడ్నాపర్ ఉండేవాడు. భయంతో నోరు మెదపలేదు’’ అని విడుదలయ్యాక ఒమర్ చెప్పారు. -
జ్ఞానవాపి మసీదులో పూజలు ప్రారంభం
వారణాసి: కాశీలోని జ్ఞానవాపి మసీదు సెల్లార్లో బుధవారం అర్ధరాత్రి పూజలు ప్రారంభమయ్యాయి. ఇక్కడున్న హిందూ దేవతల విగ్రహాలకు అర్చకులు హారతులు ఇచ్చారు. ఈ మసీదులో హిందూ దేవతలకు పూజలు జరగడం 31 సంవత్సరాల తర్వాత మొదటిసారి అని కాశీ విశ్వనాథ్ ఆలయ ట్రస్టు అధ్యక్షుడు నరేంద్ర పాండే చెప్పారు. పూజల కోసం వ్యాసుడి సెల్లార్ 31 ఏళ్ల తర్వాత తెరుచుకుందని అన్నారు. దక్షిణ సెల్లార్‌ను బుధవారం రాత్రి 10.30 గంటలకు తెరిచినట్లు వెల్లడించారు. అనంతరం కోర్టు ఉత్తర్వులను పాటిస్తూ పూజలు నిర్వహించామని, ఇందుకోసం జిల్లా అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలోనే ఉన్న జ్ఞానవాపీ మసీదు భూగర్భ గృహంలో హిందూ దేవతలకు పూజలు చేసుకోవడానికి వారణాసి జిల్లా కోర్టు బుధవారం అంగీకరించిన సంగతి తెలిసిందే. కోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడిన కొన్ని గంటల వ్యవధిలోనే పూజలు ప్రారంభం కావడం గమనార్హం. పూజల విషయంలో కోర్టు ఉత్తర్వుల ప్రకారమే నడుచుకున్నామని వారణాసి జిల్లా మేజి్రస్టేట్ ఎస్.రాజలింగం చెప్పారు. మసీదు ప్రాంగణంలోని సెల్లార్‌ను శుభ్రం చేసిన తర్వాత లక్ష్మీదేవికి, వినాయకుడికి హారతి ఇచి్చనట్లు స్థానికులు చెప్పారు. -
అదృశ్యమైన బాలిక సెల్లార్ గుంతలో శవమై తేలింది
గచ్చిబౌలి: అదృశ్యమైన బాలిక సెల్లార్ గుంతలో శవమై తేలిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ గోనె సురేష్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన నాణు, హీరాబాయి దంపతులు నగరానికి వలస వచ్చి గోపన్‌పల్లిలోని ఎన్టీఆర్నగర్లో ఉంటున్నారు. నాణు ఆటో డ్రైవర్‌గా, హీరాబాయి హౌస్‌మేడ్‌గా పని చేస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. చిన్న కూతురు రమావతి రాణి(17) యూసూఫ్‌గూడలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఆదివారం తల్లిదండ్రులు పనికి వెళ్లారు. ఉదయం ఇంటికి తాళం వేసి బయటికి వెళ్లిన రాణి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు ఆమె కోసం గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. సోమవారం తెల్లవారు జామున ఎన్టీఆర్నగర్లోని సిరీస్ సంస్థకు సంబంధించిన సెల్లార్ గుంతలో ఆమె మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహన్ని బయటికి తీసి స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధితులను ఎమ్మెల్సీ రాములు నాయక్, స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పరామర్శించారు. పరిహారం చెల్లించాలని ఆందోళన 14 ఏళ్ల క్రితం సెల్లార్ గుంతను తవ్వి వదిలేశారని, రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందారని స్థానికులు తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. సాయంత్రం 5 గంటల వరకు మృతదేహంతో సెల్లార్ గుంత వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసులు ఇటు బాధితులు అటు సైట్ యాజమాన్యంతో చేసిన చర్చలు ఫలించ లేదు. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సాయంత్రం 7 గంటల వరకు ఆందోళన కొనసాగించడంతో దిగివచి్చన యాజమాన్యం బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు అంగీకరించడంతో వారు ఆందోళనను విరమించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్తిత్తం ఆస్పత్రికి తరలించేందుకు అంగీకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: లిఫ్ట్ అడిగి ఇంజక్షన్ గుచ్చి) -
Hyderabad: పుప్పాలగూడలో విషాదం, గోడకూలి ముగ్గురు మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పుప్పాలగూడలో శనివారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ ఆవరణలో సెల్లార్ గుంత తీస్తుండగా దాన్ని ఆనుకుని ఉన్న గోడ అకస్మాత్తుగా కూలిపోయింది. గుంత తీస్తున్న కూలీలపై గోడపడిపోవడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతులంతా బిహార్ వాసులుగా పోలీసులు గుర్తించారు. -
కేపీహెచ్బీలో విషాదం.. సెల్లార్ గుంతలో పడి ముగ్గురు బాలికలు మృతి
సాక్షి, హైదరాబాద్: నిర్లక్ష్యంగా వదిలేసిన సెల్లార్ గుంత అభం శుభం తెలియని ముగ్గురు బాలికలను బలితీసుకుంది. శుక్రవారం పాఠశాలకు సెలవు కావటంతో ఇంటివద్దనే ఉన్న బాలికలు ఆడుకునేందుకు సెల్లార్ గుంత వద్దకు వెళ్లారు. గుంతలో ఉన్న నీటిలోకి దిగే క్రమంలో ఒకరు జారిపడిపోతోంటే.. ఆమెను కాపాడేందుకు ఒకరి తరువాత ఒకరు మొత్తం ఐదుగురు బాలికలు అందులో పడిపోయారు. ముగ్గురు చనిపోగా ఇద్దరు బయటపడ్డారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని 4వ ఫేజ్‌లో ఆర్టీఐ కార్యాలయం ఆనుకొని ఉన్న ఆరెకరాల ఖాళీ స్థలంలో 8 ఏళ్ల క్రితం బహుళ అంతస్థుల నిర్మాణం కోసం సెల్లార్ గుంతలు తవ్వారు. అప్పటి నుంచి ఎలాంటి నిర్మాణం చేపట్టకపోవటంతో గుంతలోకి భారీ ఎత్తున వర్షపు నీరు వచ్చి చేరింది. బతుకుదెరువు కోసం బిహార్ నుంచి వచ్చిన లక్ష్మీ ప్రసాద్ టీ కొట్టు నిర్వహిస్తూ తన ఐదుగురు కూతుళ్లు, ఒక కొడుకుతో ఆర్టీఐ కార్యాలయం సమీపంలో ఉంటున్నాడు. అతని నాలుగో కుమార్తె సంగీత కుమారి (12) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతోంది. యూపీకి చెందిన ప్రమోద్ గుప్త, గీత దంపతులు కూడా ఆర్టీఐ కార్యాలయం సమీపంలోనే టీ కొట్టు నిర్వహిస్తున్నారు. వీరి కూతురు రమ్య (7) అదే పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. నాగర్‌కర్నూల్‌కు చెందిన పర్విన్ కుమార్తె సోఫియా (10) నాలుగో తరగతి చదువుకుంటోంది. వీరితోపాటు చదువుతున్న నేహా, సంగీత చెల్లెలు నబియా ఐదుగురు కలిసి మధ్యాహ్నం ఆడుకునేందుకు సెల్లార్ గుంత వద్దకు వెళ్లారు. తొలుత సంగీత నీటిలో దిగేందుకు యత్నించగా, ఆమెను కాపాడేందుకు రమ్య నీటిలోకి దిగి ఆమె సైతం మునిగింది. వీరిని కాపాడేందుకు సోఫియా యత్నించగా ఆమె కూడా మునిగిపోయింది. నేహా, నబియా వీరిని కాపాడేందుకు యత్నించి అదృష్టవశాత్తు బయటపడ్డారు. వీరు తర్వాత ఇంట్లో విషయం చెప్పడంతో కుటుంబసభ్యులు ఘటనాస్థలానికి వెళ్లారు. పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో సంగీత, సోఫియా, రమ్య మృతదేహాలను వెలికి తీశారు. నిర్లక్ష్యమే పెను శాపం.. ఎనిమిదేళ్ల క్రితం రాష్ట్ర గృహ నిర్మాణ మండలి ఆధ్వర్యంలో కేపీహెచ్‌బీ 4వ ఫేజులో బహుళ అంతస్థుల భవనాన్ని నిర్మించేందుకు ఓ కన్స్ట్రక్షన్ కంపెనీకి పనులను అప్పగించారు. సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో 20 అడుగుల లోతు సెల్లార్ గుంతను తవ్వి వదిలేశారు. దీంతో గుంత నీటితో నిండి నిరుపయోగంగా ఉంది. ఎనిమిదేళ్లుగా ఇలాగే ఉండటంతో పిల్లల ప్రాణాల పాలిట యమపాశంగా మారింది. గతంలో ఇద్దరు బాలురు ఇందులో పడి మృతిచెందారు. -
పేక మేడ
సోమవారం సాయంత్రం... షేక్‌పేట సత్య కాలనీ సమీపంలోని బస్తీ...ఉన్నట్టుండి పెద్ద శబ్దం. అందరిలోనూ కలవరం. ఎక్కడ ఏం జరిగిందోనని ఆరాటం... తరచి చూస్తే...పేకమేడలా కూలిన నాలుగంతస్తుల భవనం. నిర్మాణంలోని భవనం కావడంతో పెను ముప్పు తప్పింది. సెల్లార్‌లోని కారు మాత్రం నుజ్జునుజ్జయింది. సమీపంలోని కార్మికులకు గాయాలయ్యాయి. గోల్కొండ: నిర్మాణం పూర్తికావచ్చిన ఓ నాలుగు అంతస్తుల భవనం పేక మేడలా ఓ పక్కకు ఒరిగి పోయింది. ఎడా పెడా లోతైన సెల్లార్లు తవ్వడడమే ఇందుకు కారణమని అధికారులు పేర్కొంటున్నారు. సోమవారం సాయంత్రం షేక్‌పేట్‌లోని సత్యకాలనీ సమీపంలోని బస్తీలో నిర్మాణం పూర్తికావచ్చిన ఓ భవనం సెల్లార్‌లోని పిల్లర్లు కుప్పకూలడంతో సమీపంలోని మరో భవనం వైపు ఒరిగింది. వివరాల్లోకి వెళితే షేక్‌పేట్ హరిజన్బస్తీకి చెందిన సీహెచ్ పద్మావతికి బీజేఆర్ కమ్యూనిటీ హాల్ సమీపంలో 400 చదరపు గజాల స్థలం ఉంది. ఇందులో 200 గజాల్లో నాలుగు అంతస్తుల భవన నిర్మాణం చేపట్టింది. ప్రస్తుతం నిర్మాణం పనులు చివరి దశలో ఉన్నాయి. ఇదిలా ఉండగా అదే భవనానికి ఆనుకొనే ఫారూఖ్ అనే వ్యక్తి మరో జీ+4 భవన నిర్మాణం చేపట్టాడు. ఇందులో భాగంగా అతను తన భవనానికి లోతైన సెల్లార్ తవ్వాడు. కాగా ఈ రెండు భవనాల వెనుక మరో వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం సెల్లార్ తవ్వాడు. ఇదిలా ఉండగా సోమవారం పద్మావతి భవనంలోని పిల్లర్లు కుప్ప కూలడంతో భవనం పెద్ద శబ్దంతో పారూఖ్ భవనం మీదకు ఒరిగి పోయింది. అయితే ప్రమద సమయంలో అక్కడ ఎవరూ లేక పోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ సందర్భంగా కాంక్రిట్ ముక్కలు పడి సమీపంలోని గుడిసెల్లో నివాసం ఉంటున్న సునీత, బరువుల సూర్యలకు గాయాలయ్యాయి. పద్మావతి భవనం సెల్లార్లో పార్కుచేసిన కారు నుజ్జు నుజ్జు అయ్యింది. ప్రమాదంపై సమాచారం అందడంతో ఎమ్మెల్యేలు కౌసర్ మొహియుద్దీన్, మాగంటి గోపీనాథ్, ఎంఎల్సీ రాములు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పశ్చిమ మండలం డీసీపీ వెంకటేశ్వరరావు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. భవనం అనుమతులపై విచారణ చేపడతామని షేక్‌పేట్ తహశీల్దార్ చంద్రకళ పేర్కొన్నారు. కాగా టౌన్‌ప్లానింగ్ అధికారులెవరూ సంఘటన స్థలానికి రాకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్ప కూలినప్పుడే.. సాక్షి, సిటీబ్యూరో: ప్రమాదాలు జరిగినప్పుడో.. ప్రాణాలు పోయినప్పుడో మాత్రమే నగరంలో భవన నిర్మాణ అనుమతులు చర్చనీయాంశంగా మారుతున్నాయి. కాసులకు అలవాటుపడ్డ జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు నగరంలో అడ్డదిడ్డంగా వెలుస్తున్న భవనాలను పట్టించుకోవడం లేరు. తాజాగా షేక్‌పేట హరిజనబస్తీలోని జీప్లస్ మూడంతస్తుల భవనం ఒరిగిపోవడం అధికారుల వైఖరికి అద్దంపడుతోంది. ఎనిమిదేళ్లుగా ఎలాంటి అనుమతుల్లేకుండా ఈ భవన నిర్మాణం కొనసాగుతున్నా అధికారుల దృష్టికి రాకపోవడం గమనార్హం. భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సెల్లార్‌లోని కారు నుజ్జునుజ్జయింది. ఎలాంటి ప్రాణాపాయం జరగనప్పటికీ అధికారుల బాధ్యతారాహిత్యాన్ని బట్టబయలు చేసింది. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే చర్చకు వస్తున్న నిర్మాణ అనుమతులు, భూసార పరీక్షలు, స్ట్రక్చరల్ స్టెబిలిటీ తదితర అంశాలను ఆ తరువాత ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ భవనానినికి సంబందించి ఎలాంటి అనుమతులు లేకున్నా, కొద్ది స్థలంలోనే పలు అంతస్తులు నిర్మిస్తున్నా.. తగినంత సెట్బ్యాక్లు వదలకుండా భారీ డీవియేషన్లకు పాల్పడుతున్నా.. సంబంధిత అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. తమ చేతులు తడిపితే చాలుననుకున్నవారు ఇరుకు జాగాలోనే భహుళ అంతస్థులు వెలుస్తున్నా పట్టించుకోవడం లేదు. సెల్లార్లపై నిర్లక్ష్యం.. భూసార పరీక్షల కనుగుణంగా సెల్లార్ తవ్వకాల్లో ప్రమాణాలు పాటించాల్సి ఉన్నా..ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభమైనా మధ్యలో కొంతకాలం నిర్మాణ పనులు ఆపివేసినట్లు తెలిసింది. దీంతో ఐరన్ తుప్పుపట్టడం .. ఇతర కారణాల వల్ల కూడా ఒరిగిపోయి ఉండవచ్చునని అధికారులు పేర్కొంటున్నారు. సెల్లార్ చుట్టూ 10 అడుగుల మేర ఖాళీ స్థలాన్ని వదలాలన్న నిబంధనను కూడా పట్టించుకోలేదు. గతంలో సోమాజిగూడలో ఓ కార్పొరేట్ ఆస్పత్రి సెల్లార్ తవ్వకంలో, మినిస్టర్ రోడ్‌లోని మరో ఆస్పత్రి నిర్మాణ సమయంలోనూ ఇలాంటి ఘటన లు జరిగయి. ఆర్కే పురంలో రెండేళ్ల క్రితం సెల్లార్ తవ్వకాల్లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. సెల్లార్ల తవ్వకాల్లో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని టౌన్‌ప్లానింగ్ అధికారులు సూచిస్తున్నా నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన సిబ్బంది చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడంతో ప్రమాదాలకు కారణమవుతోంది. -
సెల్లార్ల కూల్చివేతకు సై
తొలగింపు ప్రక్రియకు శ్రీకారం పేరున్న భవనాలకూ అదే శాస్తి వాణిజ్య ప్రాంతంపై జీవీఎంసీ దృష్టి అక్రమ నిర్మాణదారుల గుండెల్లో రైళ్లు విశాఖపట్నం సిటీ : నిబంధనలు విరుద్ధంగా సెల్లార్‌ను ఆక్రమించిన వ్యాపారుల్లో జీవీఎంసీ అధికారులు దడ పుట్టిస్తున్నారు. రూ.లక్షల్లో లీజుకిచ్చేసిన భవన యజమానులు, ఆక్రమణదారులను పరుగులెట్టిస్తున్నారు. బాబ్బాబు మా భవనం వద్దకు రావద్దని వేడుకుంటున్నా పట్టణ ప్రణాళిక అధికారులు గట్టిగా అడుగులేస్తున్నారు. స్మార్ట్‌సిటీ సాకారమయ్యేందుకు అధికారులంతా తమకు సహకరించాలంటూ కోరిన జీవీఎంసీ కమిషనర్ ఆదేశాలను వంటపట్టించుకున్న ప్రణాళిక అధికారులు ఒత్తిళ్లను సైతం లెక్క చేయటం లేదు. కూలగొట్టే పని చేసుకుపోతున్నారు. ఏళ్ల తరబడి సెల్లార్లను ఆక్రమించి నిర్వహిస్తున్న ఆస్పత్రులు, మందులు దుకాణాలు, ఇతర గొడౌన్లను సైతం ఖాళీ చేయిస్తున్నారు. ఖాళీ చేయకుండా రాజకీయ నేతలతో ఒత్తిడి తమ వర్గీయుడికే ఎమ్మెల్సీ పదవి దక్కేలా చేయడానికి ఇరువురు మంత్రులు వ్యూహాలకు పదునుపెడుతున్నారు. చెరో జాబితా సిద్దం చేస్తున్నారు. మరోవైపు తటస్థ ముద్రతో ఎమ్మెల్సీ పీఠాన్ని ఎగరేసుకుపోవాలని మరికొందరు నేతలు చాపకింద నీరులా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆశల పల్లకీలో : జిల్లా టీడీపీలో ఎమ్మెల్సీ పీఠంపై కన్నేసిన ఆశావాహుల జాబితా చాంతాడును తలపిస్తోంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో జిల్లా టీడీపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. గత ఎన్నికల్లో తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ టిక్కెట్లు దక్కని నేతలు అందరూ ఎమ్మెల్సీ స్థానానికి గురిపెట్టారు. మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, వుడా మాజీ చైర్మన్ ఎస్.ఎ. రహమాన్, మాజీ మంత్రి మణికుమారి, జిల్లా పార్టీ అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు, తోట నగేష్, నల్లూరి భాస్కరరావు, కోన తాతారావు తదితరులు రేసులో ఉన్నట్లు బయటపడ్డారు. వీరిలో కొందరు గంటా మద్దతు కోసం ప్రయత్నిస్తుండగా మరికొందరు అయ్యన్న ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఒకరిద్దరు ఈ గ్రూపులతో సంబంధం లేకుండా నేరుగా సీఎం చంద్రబాబు కటాక్షం కోసం పావులు కదుపుతున్నారు.