
సెల్లార్ల కూల్చివేతకు సై
తొలగింపు ప్రక్రియకు శ్రీకారం
పేరున్న భవనాలకూ అదే శాస్తి
వాణిజ్య ప్రాంతంపై జీవీఎంసీ దృష్టి
అక్రమ నిర్మాణదారుల గుండెల్లో రైళ్లు
విశాఖపట్నం సిటీ : నిబంధనలు విరుద్ధంగా సెల్లార్‌ను ఆక్రమించిన వ్యాపారుల్లో జీవీఎంసీ అధికారులు దడ పుట్టిస్తున్నారు. రూ.లక్షల్లో లీజుకిచ్చేసిన భవన యజమానులు, ఆక్రమణదారులను పరుగులెట్టిస్తున్నారు. బాబ్బాబు మా భవనం వద్దకు రావద్దని వేడుకుంటున్నా పట్టణ ప్రణాళిక అధికారులు గట్టిగా అడుగులేస్తున్నారు. స్మార్ట్‌సిటీ సాకారమయ్యేందుకు అధికారులంతా తమకు సహకరించాలంటూ కోరిన జీవీఎంసీ కమిషనర్ ఆదేశాలను వంటపట్టించుకున్న ప్రణాళిక అధికారులు ఒత్తిళ్లను సైతం లెక్క చేయటం లేదు. కూలగొట్టే పని చేసుకుపోతున్నారు. ఏళ్ల తరబడి సెల్లార్‌లను ఆక్రమించి నిర్వహిస్తున్న ఆస్పత్రులు, మందులు దుకాణాలు, ఇతర గొడౌన్‌లను సైతం ఖాళీ చేయిస్తున్నారు. ఖాళీ చేయకుండా రాజకీయ నేతలతో ఒత్తిడి తమ వర్గీయుడికే ఎమ్మెల్సీ పదవి దక్కేలా చేయడానికి ఇరువురు మంత్రులు వ్యూహాలకు పదునుపెడుతున్నారు. చెరో జాబితా సిద్దం చేస్తున్నారు. మరోవైపు తటస్థ ముద్రతో ఎమ్మెల్సీ పీఠాన్ని ఎగరేసుకుపోవాలని మరికొందరు నేతలు చాపకింద నీరులా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆశల పల్లకీలో : జిల్లా టీడీపీలో ఎమ్మెల్సీ పీఠంపై కన్నేసిన ఆశావాహుల జాబితా చాంతాడును తలపిస్తోంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో జిల్లా టీడీపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. గత ఎన్నికల్లో తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ టిక్కెట్లు దక్కని నేతలు అందరూ ఎమ్మెల్సీ స్థానానికి గురిపెట్టారు. మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, వుడా మాజీ చైర్మన్ ఎస్.ఎ. రహమాన్, మాజీ మంత్రి మణికుమారి, జిల్లా పార్టీ అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు, తోట నగేష్, నల్లూరి భాస్కరరావు, కోన తాతారావు తదితరులు రేసులో ఉన్నట్లు బయటపడ్డారు. వీరిలో కొందరు గంటా మద్దతు కోసం ప్రయత్నిస్తుండగా మరికొందరు అయ్యన్న ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఒకరిద్దరు ఈ గ్రూపులతో సంబంధం లేకుండా నేరుగా సీఎం చంద్రబాబు కటాక్షం కోసం పావులు కదుపుతున్నారు.