GVMC
-
స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే కోసం కూటమి ప్రభుత్వం పాట్లు.
విశాఖ: కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలో ఈసారి జీవీఎంసీ ప్రదర్శన ఆశించిన మేర ఉండేలా కనబడటం లేదు. నగరంలో స్వచ్ఛ సర్వేక్షణ్ కోసం కూటమి ప్రభుత్వం పడరాని పాట్లు పడుతోంది. ఈ సర్వే కోసం సచివాలయ సిబ్బందిపై జీవీంఎసీ అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో చేయాల్సిన సర్వేను.. సచివాలయ సిబ్బందికి అప్పగించారు. ఒక్కొక్క సచివాలయ ఉద్యోగి 300 మంది ప్రజలు ఓటీపీలు సేకరించాలని ఆదేశించారు. అయితే ఓటీపీలు చెప్పడానికి ప్రజలు నిరాకరిస్తున్నారు. దాంతో జోనల్ కమిషనర్ శివప్రసాద్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అనుకున్న టార్గెట్ చేరలేకపోయారంటూ సచివాలయ సిబ్బందికి నోటీసులు పంపారు శివ ప్రసాద్. ఆయన తీరుతో సచివాలయ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో చేయించాల్సిన సర్వేను తమతో చేయించడంపై మండిపడుతున్నారు. -
విశాఖలో కూటమి ‘మహా’ కుట్ర
సాక్షి, విశాఖపట్నం: మహా విశాఖ నగర పాలక సంస్థలో జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో టీడీపీ కూటమి కుట్ర రాజకీయాలకు తెరతీసింది. కూటమి కార్పొరేటర్లకు జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్ మద్దతు పలుకుతూ.. చెల్లని ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకుని.. 10కి 10 స్థానాల్లోనూ టీడీపీ విజయం సాధించినట్లు ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక తొలిసారిగా జీవీఎంసీలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో.. టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కార్పోరేటర్లను బలవంతంగా లాక్కెళుతున్న పోలీసులుకుట్రలు చేసైనా విజయం సాధించాలనే ఉద్దేశంతో.. కార్పొరేటర్లకు రూ.5 లక్షల వరకూ డబ్బులిచ్చి మరీ ఓట్లు బహిరంగంగానే కొనుగోలు చేశారు. తమకు మద్దతిస్తున్న కార్పొరేటర్లను భీమిలిలోని రిసార్టులో మంగళవారం రాత్రి మొత్తం అక్కడే బస చేయించి.. ఉ.11 గంటల సమయంలో ఓటింగ్‌కు బస్సులో తీసుకొచ్చారు. మరోవైపు.. టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు కొందరు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు నేరుగా ఫోన్లుచేసి డబ్బులు పంపిస్తున్నట్లు చెప్పి ఓట్లు కొనుగోలు చేశారు. కన్నీటి పర్యంతమవుతున్న వైఎస్సార్సీపీ కార్పోరేటర్ రోహిణిబ్యాలెట్ పేపర్లపై కలర్ పెన్సిళ్లతో గుర్తులు..ఇక డబ్బులు తీసుకున్న వారు తమకు ఓట్లు వేశారా లేదా అనేది తెలుసుకునేందుకు కలర్ పెన్సిళ్లతో బ్యాలెట్ పేపర్‌పై అనధికారికంగా గీతలు గీశారు. వాస్తవానికి.. బ్యాలెట్ పేపర్‌పై పెన్ను, పెన్సిల్, స్కెచ్ గీతలుంటే కచ్చితంగా ఆ ఓట్లు చెల్లుబాటు కావన్న నిబంధనలున్నా కమిషనర్ మాత్రం పూర్తిగా పక్కా టీడీపీ కార్యకర్తలా వ్యవహరించారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఆ ఓట్లు చెల్లుబాటు కావని చెబుతున్నా బేఖాతరు చేస్తూ టీడీపీ కార్పొరేటర్లు 10 మందీ విజయం సాధించినట్లు ప్రకటించారు.దీంతో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు కమిషనర్ తీరుపై మండిపడ్డారు. పోర్టికోలో బైఠాయించారు. ముందుగానే కుట్ర పన్ని గెలుపొందాలని స్కెచ్ వేసిన టీడీపీ పెద్దఎత్తున పోలీసు బలగాల్ని రంగంలోకి దించి.. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను జీవీఎంసీ నుంచి బయటికి పంపించేశారు. అక్రమంగా విజయం సాధించిన టీడీపీ వ్యవహారం, కమిషనర్ వ్యవహరించిన తీరుపై న్యాయపోరాటం చేస్తామని మేయర్ గొలగాని హరివెంకటకుమారి, డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్, కటుమూరి సతీష్, ఫ్లోర్‌లీడర్ బానాల శ్రీను, ఇతర కార్పొరేటర్లు తెలిపారు. -
దొడ్డిదారిలో గెలుపు కోసం కూటమి.. వైఎస్సార్సీపీ పోరాటం (ఫొటోలు)
-
10 మంది కూటమి కార్పొరేటర్లు ఓటమి GVMC ఓట్ల లెక్కింపులో కుట్ర
-
కూటమి కుట్ర.. GVMC స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో రసాభాసా
సాక్షి,విశాఖపట్నం: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో రసాభాసా నెలకొంది. పెన్సిల్‌తో మార్క్ చేసిన ఓట్లు చెల్లవని వైఎస్సార్సీపీ అభ్యంతరం చెబుతూ కౌంటింగ్‌ను నిలిపేయాలని డిమాండ్ చేసింది. అదే సమయంలో తమకు అనుకూలంగా వ్యవహరించాలని కూటమి నేతలు కమిషనర్‌పై ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో.. వైఎస్సార్సీపీ ఆందోళన, టీడీపీ కవ్వింపు చర్యలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.మొత్తం పోలైన ఓట్లలో 14-16 మధ్య బ్యాలెట్ పేపర్లను తొలగించాకే కౌంటింగ్ కొనసాగించాలని వైఎస్సార్సీపీ పట్టుబట్టింది. దీంతో ఒకానొక తరుణంలో కౌంటింగ్ ప్రక్రియ నిలిచింది.అయితే.. టీడీపీ శ్రేణులు రంగ ప్రవేశం చేసి.. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై దాడికి దిగారు. దీంతో.. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు కూడా ప్రతిఘటించాల్సి వచ్చింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే.. టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న టైంలో.. అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తూ ఉండిపోయారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన నేపథ్యంలో.. న్యాయపోరాటం చేస్తామని వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు చెబుతున్నారు.ఉదయం నుంచే ప్రలోభపర్వాలుమొత్తం 10 స్టాండింగ్ కమిటీ స్థానాలకు ఎన్నిక జరిగింది. జీవీఎంసీలో 98 వార్డులుండగా 97 మంది కార్పొరేటర్లున్నారు. వీరిలో వైస్సార్సీపీ నుంచి 58 మంది, టీడీపీ నుంచి 29 మంది, జనసేన నుంచి ముగ్గురు, నలుగురు స్వతంత్ర అభ్యర్థులున్నారు. సీపీఐ, సీపీఎం, బీజేపీ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. 90 మంది కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక.. పోలింగ్‌కు సీపీఎం కార్పొరేటర్ గంగారావు దూరంగా ఉన్నారు. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆఖరి నిమిషంలో ఓటు వేశారు.కూటమివైపు 49 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ ఓటమి భయంతో టీడీపీ క్యాంపు రాజకీయం చేసింది. ప్రలోభాలే ఎజెండాగా టీడీపీ కుట్రలకు తెరలేపింది. విశాఖ టీడీపీ నేతలు.. కార్పొరేటర్లకు డబ్బులు ఎర చూపినట్లు సమాచారం.టీడీపీ కుట్రలు చేస్తోంది.. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్జీవీఎంసీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమి కుట్రలు చేసిందని జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ సాక్షిటీవీతో అన్నారు. గతంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలన్నీ ప్రశాంతంగా నిర్వహించాం. జీవీఎంసీలో వైఎస్ఆర్సీపీకి సంఖ్యా బలం ఉన్నప్పటికీ కార్పొరేటర్లను కొనుగోలు చేసి గెలవాలని కూటమి ప్రయత్నాలు చేస్తోందని శ్రీధర్ మండిపడ్డారు. -
వైఎస్సార్సీపీ ఆఫీస్‌కు నోటీసులు.. చించేసిన గుడివాడ అమర్నాథ్
విశాఖపట్నం, సాక్షి: తాడేపల్లి(గుంటూరు)లో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. మరో చర్యకు ఉపక్రమించింది. విశాఖపట్నం పార్టీ కార్యాలయానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా నోటీసులు జారీ చేయించింది. ఈ నోటీసుల సంగతి తెలిసి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అక్కడికి చేరుకున్నారు. ఆగ్రహంతో ఆ నోటీసుల్ని చించిపడేశారు.విశాఖ రూరల్ చినగడిలి ఎండాడ వద్ద గత ఏడాది సెప్టెంబర్‌లో వైఎస్సార్సీపీ కార్యాలయం ప్రారంభించారు. అయితే.. జీవీఎంసీ పరిధిలో ఉన్న ఈ స్థలంలో వీఎంఆర్డీఏ నుంచి అనుమతులతో కార్యాలయం నడిపిస్తున్నారని, ఇది అక్రమ కట్టడమని పేర్కొంటూ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. తక్షణమే ఇందులో కార్యకలాపాలు నిలిపివేయాలని, వారం రోజుల్లోగా వివరణ ఇవ్వకపోతే చర్యలు తప్పవని నోటీసుల్లో జీవీఎంసీ పేర్కొంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యాలయాలను అధికార యంత్రాంగం టార్గెట్‌గా చేసుకుంది. నెల్లూరు పార్టీ కార్యాలయానికి కూడా మున్సిపల్ అధికారులు వెళ్లినట్లు సమాచారం. -
ఏపీ అభివృద్ధికి రోడ్ మ్యాప్: సీఎం జగన్
రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెరగాలి. ఆహ్లాదకర వాతావరణం, కనువిందు చేసేలా సుందరీకరణపై ప్రధానంగా దృష్టి సారించాలి. చివరి దశలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. నగరాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్ల విస్తరణ, ఇతరత్రా మౌలిక సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధతో ప్రణాళికలు రూపొందించాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లోని రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. వర్షాకాలం ముగిసిన నేపథ్యంలో పనుల సీజన్ మొదలైందన్నారు. వివిధ దశల్లో కొనసాగుతున్న పనులను వేగంగా పూర్తి చేయడంతో పాటు ప్రత్యేక డ్రైవ్ ద్వారా రోడ్లను సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా నీటి సంరక్షణ పద్ధతులను పాటించడం ద్వారా తాగు నీటిని ఆదా చేయాలని చెప్పారు. ఇందులో భాగంగా తీర ప్రాంతాల్లోని పరిశ్రమలు డీ–శాలినేషన్ చేసిన సముద్రపు నీటిని వినియోగించేలా ప్రోత్సహించాలని సూచించారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, కర్నూలు, కడప, తిరుపతి, గుంటూరు సహా వివిధ కార్పొరేషన్లలోని అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రాజెక్టులపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ఆహ్లాదకరంగా విజయవాడ ► విజయవాడలో అంబేడ్కర్ స్మృతి వనం, కన్వెన్షన్ సెంటర్ పనులను వేగంగా పూర్తి చేయాలి. పార్కులో పచ్చదనానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. కాలువల పరిశుభ్రతపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి. ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా అత్యాధునిక యంత్రాలను వినియోగించాలి. విమానాశ్రయానికి వెళ్లే మార్గం అంతటా ఆకర్షణీయంగా.. ప్రయాణికులను ఆకట్టుకునేలా సుందరీకరణ పనులు చేపట్టాలి. ముఖ్యంగా కృష్ణలంక ప్రాంతంలో కృష్ణానదిని ఆనుకుని నిర్మించిన రక్షణ గోడ ప్రాంతాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలి. ► రాజమహేంద్రవరంలోని కంబాల చెరువు సహా వివిధ ప్రాంతాల్లో చేపట్టిన సుందరీకరణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. గోదావరి నదిపై హేవ్‌లాక్ బ్రిడ్జిని ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించాలి. ► వరదల కారణంగా నెల్లూరు మునిగిపోయే పరిస్థితి రాకూడదు. ప్రజలు ఇబ్బంది పడకుండా రక్షణ గోడ నిర్మాణాన్ని వేగవంతం చేయాలి. ► టిడ్కో ఇళ్ల నిర్వహణను ప్రాధాన్య అంశంగా తీసుకోవాలి. పేదల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీల్లో నీటి సంరక్షణ పద్ధతులను ప్రోత్సహించాలి. మానవ వనరుల్లో సాంకేతిక విజ్ఞానం పెంచాలి ► నగరాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టాం. ప్లోటింగ్ సోలార్ ప్యానెల్స్, ఎస్టీపీల నిర్వహణ, పారిశుద్ధ్యం కోసం అత్యాధునిక యంత్రాలు తదితర వాటిని తీసుకొస్తున్నాం. ► పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థుల్లో పట్టణాభివృద్ధి ప్రాజెక్టుల కోసం అవసరమయ్యే సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించాలి. ఇలాంటి ప్రాజెక్టుల సమగ్ర నిర్వహణ కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్వోపీ) పెట్టుకోవాలి. విశాఖలో ప్రగతి వీచిక విశాఖపట్నంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సౌకర్యాలను కల్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ముందుగా రోడ్ల విస్తరణ, ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులు విశాఖ ప్రగతిని సీఎంకు వివరించారు. నాలుగేళ్లలో రూ.3,592 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. రహదారులతో పాటు డ్రెయిన్లు, నీటి సరఫరా, వీధి లైట్లు, పార్కులు, వాటర్ బాడీలు, సుందరీకరణ, మురుగు నీటి శుద్ధి, వివిధ భవనాల నిర్మాణంతో పౌరులకు మెరుగైన సేవలు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రూ.100 కోట్లతో జీవీఎంసీ ప్రధాన కార్యాలయాన్ని నిర్మించామన్నారు. మరో రూ.300 కోట్లతో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు పనులను త్వరలో ప్రారంభిస్తున్నామని చెప్పారు. మూడు వరసల్లో పార్కు, ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో కమర్షియల్ కాంప్లెక్స్, మల్టీ లెవల్ కారు పార్కింగ్, భీమిలి, గాజువాక, అనకాపల్లిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. పురపాలక, పట్టణా భివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్. గుల్జార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ పి.కోటేశ్వరరావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ గంధం చంద్రుడు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్, అర్బన్ రీ సర్వే ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ బి.సుబ్బారావు, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ఆర్.జె.విద్యుల్లత, ఏపీజీబీసీఎల్ ఎండీ బి.రాజశేఖరరెడ్డి, మెప్మా ఎండీ విజయలక్ష్మి పాల్గొన్నారు. -
విత్తన బంతి హరిత కాంతి
డాబాగార్డెన్స్: అడవులు సహజ సిద్ధంగా తయారు కావాలి. గుంతలు తవ్వి, మొక్కలు నాటి అడవులు సృష్టించడం అసాధ్యం. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అడవి జీవవైవిధ్యానికి అద్దం పడుతుంది. ఇలాంటి అడవులను సృష్టించేందుకు జీవీఎంసీ కృషి చేస్తోంది. ఒకవైపు మొక్కలు నాటుతూనే మరోవైపు నగరంలో ఏడు కొండలపై సీడ్ బాల్స్ విసిరి మొక్కలు పెంచే కార్యక్రమానికి ఈస్ట్రన్ నేవల్ కమాండ్, గ్రీన్ క్లైమేట్ సంస్థ సహకారంతో జీవీఎంసీ శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని సోమవారం ఐఎన్ఎస్ డేగా వద్ద నేవల్ అధికారి మనీష్శర్మతో కలిసి మేయర్ హరివెంకటకుమారి, డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ ప్రారంభించారు. 4 హెలికాప్టర్ల ద్వారా సుమారు 6 లక్షల విత్తనాలను సేకరించి నగరంలోని పావురాల కొండ 1, 2, కాపులుప్పాడ, సింహాచలం, పొర్లుపాలెం కొండ, వేదుళ్లనరవ కొండ, యారాడ కొండలపై విడుదల చేసినట్లు మేయర్ తెలిపారు. విత్తన బంతులతో విశాఖను హరిత వనం చేద్దామని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ డాక్టర్ వై.శ్రీనివాసరావు, హార్టికల్చర్ డీడీ దామోదర్, జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్కుమార్ పలువురు జీవీఎంసీ అధికారులు, నేవల్ అధికారులు, గ్రీన్‌క్లైమేట్ సంస్థ ప్రతినిధి జేవీ రత్నం పాల్గొన్నారు. -
జీవీఎంసీ స్థాయీ సంఘ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): జీవీఎంసీ స్థాయీ సంఘ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది. పది స్థానాలకు గాను పది స్థానాలూ గెలుచుకుంది. సంఖ్యా బలాన్ని మించి ఇతర పారీ్టల నుంచి కూడా ఓట్లు పోలవ్వడం సీఎం జగన్ పరిపాలన దక్షతకు నిదర్శనంగా నిలుస్తోంది. వైఎస్సార్సీపీకి స్వతంత్రులతో కలిపి 62 మంది కార్పొరేటర్లుండగా వీరిలో ఉరికిటి నారాయణరావుకు 66, అక్కరమాని పద్మకు 64, పీలా లక్ష్మీసౌజన్యకు 64, కోడిగుడ్ల పూరి్ణమకు 63, కంటిపాము కామేశ్వరికి 63, బల్ల లక్ష్మణరావుకు 63, భూపతిరాజు సుజాతకు 63 ఓట్లు వచ్చాయి. అంటే తెలుగుదేశం, బీజేపీ నుంచి కూడా కార్పొరేటర్లు వైఎస్సార్సీపీకి చెందిన కార్పొరేటర్లకు ఓట్లు వేశారన్నమాట. ఈ సందర్భంగా మంత్రి, జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికల ఇన్చార్జ్ గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ టీడీపీకి చెందిన కార్పొరేటర్లు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి మద్దతు పలకడం విశేషమన్నారు. సీఎం ఆదేశాలతో, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జ్ వైవీ సుబ్బారెడ్డి సూచనలు, సలహాలతో ఈ విజయం సాధించినట్టు మంత్రి అమర్నాథ్ చెప్పారు. -
పచ్చందాల కోక.. విశాఖ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఒక వైపు పచ్చని తూర్పు కనుమలు.. మరోవైపు నీలి సముద్రపు అలలతో అందంగా కనిపించే వాల్తేరు నగరం మరింత సుందరంగా రూపుదిద్దుకోనుంది. గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పరిధిలోని సగం నగరం అందమైన నందనవనంగా ముస్తాబవనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 642 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన జీవీఎంసీ పరిధిలో 50 శాతం గ్రీనరీ ఏర్పాటుకు అన్ని వీధుల్లో నీడనిచ్చే చెట్లను నాటనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్ ద్వారా జీవీఎంసీ సర్వే చేస్తోంది. 98 వార్డుల్లో వార్డు ఎమినిటీస్ సెక్రటరీలకు సర్వే బాధ్యత అప్పగించారు. వారి పరిధిలోని 30, 40, 60, 80, 100 ఫీట్ల రోడ్లపై ఎక్కడెక్కడ చెట్లను పెంచే అవకాశం ఉందో సర్వే చేస్తున్నారు. ఇప్పటికే 400 చదరపు కిలోమీటర్ల మేర సర్వే పూర్తయినట్లు సమాచారం. దాదాపు 1,697 కిలోమీటర్ల మేర రోడ్ల వెంట 6 వేల చెట్లను నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ‘గ్రీనరీ మై స్ట్రీట్’ కాన్సెప్ట్‌తో.. వాస్తవానికి హుద్‌హుద్‌కు ముందు విశాఖ నగరంలో 44 శాతం మేర పచ్చదనం ఉండేది. హుద్ హుద్ తర్వాత 14 శాతానికి పడిపోయింది. కొద్దికాలంగా జీవీఎంసీ తీసుకుంటున్న చర్యలతో గ్రీన్ కవరేజ్ 35 శాతానికి చేరుకుంది. 10 లక్షల జనాభా దాటిన నగరాల్లో పచ్చ దనంలో దేశంలోనే మొదటిస్థానంలో ఉన్న విశాఖ.. 50 శాతం గ్రీనరీ లక్ష్యాన్ని చేరుకుంటే ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ పచ్చదనం ఉన్న నగరంగా రికార్డు సృష్టించనుంది. ఇందుకోసం ‘గ్రీనరీ మై స్ట్రీట్’ పేరుతో జీవీఎంసీ పచ్చదనం పెంపునకు చర్యలు చేపట్టింది. రహదారులతో పాటు వివిధ సంస్థల కార్యాలయాలు, ఖాళీ ప్రదేశాల్లో కూడా మొక్కలను నాటేందుకు సిద్ధమవుతోంది. ప్రపంచంలోనే నెంబర్ వన్ గ్రీన్ సిటీగా.. ప్రపంచవ్యాప్తంగా సింగపూర్ (45 శాతం) తర్వాత విశాఖ నగరంలోనే పచ్చదనం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం 35 శాతం ఉన్న పచ్చదనాన్ని వచ్చే ఏడాది కాలంలో 40 శాతానికి పెంచేలా జీవీఎంసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నిర్ణీత లక్ష్యం మేరకు 50 శాతం గ్రీనరీ ఏర్పాటైతే ప్రపంచంలోనే మొదటి స్థానంలో విశాఖ నగరం నిలవనుంది. తద్వారా 2 డిగ్రీల సెల్సియస్ మేర వేసవి తాపం కూడా తగ్గుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పందిరి తరహాలో.. ఏదో ఒక తరహా మొక్కలను కాకుండా.. పందిరి తరహాలో చెట్టు పెనవేసుకునిపోయేలా ఉండేలా జీవీఎంసీ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందుకోసం 30, 40 అడుగుల రోడ్ల వెంట ఇండియన్ చెర్రీ, టీ కోమా వెరైటీస్, పారిజాతం వంటి మొక్కలను నాటనున్నారు. 80, 100 ఫీట్ల రోడ్లలో మాత్రం నిమ్మ, వేప, బాదం, నిద్ర గన్నేరు వంటి మొక్కలను నాటనున్నారు. అయితే, రోడ్డుకు ఒక వైపు నాటే ఈ మొక్కలు ఏపుగా పెరగడంతో పాటు రోడ్డుకు ఆవలి వైపు వరకు కొమ్మలు విస్తరించి రహదారి మొత్తం నీడనిస్తాయి. ప్రధానంగా వేసవి కాలంలో ప్రయాణికులకు చలువ పందిళ్ల తరహాలో ఎండ నుంచి రక్షణ కలి్పస్తాయని జీవీఎంసీ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే నగరంలోని దయాళ్‌నగర్ వంటి ప్రాంతాల్లో పందిరి తరహా గ్రీనరీని జీవీఎంసీ అభివృద్ధి చేసింది. నగరంలోని మిగతా రోడ్లలోనూ ఈ పందిళ్లతో నగరం పచ్చదనంతో కళకళలాడనుంది. గ్రీనరీ కోసం ప్రత్యేక కార్యక్రమం విశాఖ నగరంలో 50 శాతం గ్రీనరీ లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమం చేపట్టాం. ఇందుకోసం వార్డుల వారీగా ఎమినిటీస్ సెక్రటరీల సహాయంతో 1,697 కిలోమీటర్ల మేర రోడ్ల సర్వే పూర్తి చేశాం. ఆ ప్రాంతాల్లో 6 వేల మొక్కలను నాటేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ఈ కసరత్తు నిరంతరం జరుగుతుంది. రానున్న ఏడాది కాలంలో 40 శాతం గ్రీనరీ లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ తర్వాత దీనిని 50 శాతానికి పెంచి, పచ్చదనంలో విశాఖను ప్రపంచంలోనే మొదటిస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నాం. – సాయికాంత్ వర్మ, జీవీఎంసీ కమిషనర్ -
విశాఖ తీరంలో కొత్త అందాలు
-
విశాఖ : కాంగ్రెస్ పార్టీ ఆఫిస్ కు సీల్
-
ప్లాస్టిక్ నిషేధానికి తొలి అడుగు
-
బాక్స్ కథా చిత్రం: ఈ కథేంటో.. ఇందులో మతలబు ఏంటో..
అనకాపల్లి నుంచి కాపులుప్పాడకు దూరం.. 63 కిలోమీటర్లు మధురవాడ నుంచి కాపులుప్పాడకు దూరం.. 8 కిలోమీటర్లు ఇందులో ఏది దగ్గరని ఒకటో తరగతి పిల్లాడిని అడిగినా ఠక్కున సమాధానం చెబుతారు. కానీ ఘనత వహించిన జీవీఎంసీలోని కాంట్రాక్టర్లు మాత్రం మధురవాడ నుంచి కాపులుప్పాడకే దూరం ఎక్కువ అని చెబుతున్నారు. జీవీఎంసీలోని ప్రజారోగ్యశాఖ అధికారులు సైతం అవునంటూ తాళం వేస్తున్నారు. అంతేకాదు మీరు చెప్పిన సమాధానమే కరెక్టేనంటూ బహుమతి కింద కాంట్రాక్ట్‌ను సైతం అప్పగించారు. ఈ కథేంటో.. ఇందులో మతలబు ఏంటో.. ఈ బాక్సు టెండర్ల వ్యవహారమెంటో తెలుసుకుంటే మతిపోతోంది. సాక్షి, విశాఖపట్నం : జీవీఎంసీ పరిధిలోని చికెన్, మటన్ షాపుల నుంచి వచ్చే వ్యర్థాలను కాపులుప్పాడ డంపింగ్‌యార్డుకు తరలించేందుకు బాక్సు టెండర్లు పిలిచారు. ఓ నెలలో ఒక షాపు నుంచి వచ్చే చికెన్/మటన్ వ్యర్థాలను మధురవాడ నుంచి కాపులుప్పాడకు తరలించేందుకు రూ.110కు కాంట్రాక్టర్లు కోట్ చేసి పనులను దక్కించుకున్నారు. అయితే, అనకాపల్లి నుంచి కాపులుప్పాడకు ఇవే వ్యర్థాలను తరలించేందుకు మాత్రం రూ.100 మాత్రమే కోట్ చేశారు. ఇందుకు జీవీఎంసీ అధికారులు సైతం గుడ్డిగా తలూపి పనులను అప్పగించారు. ఈ లెక్కన అనకాపల్లి నుంచి కాపులుప్పాడకు చికెన్ వ్యర్థాలను తరలించేందుకు అయ్యే వ్యయం కంటే.. మధురవాడ నుంచి కాపులుప్పాడకు అయ్యే వ్యయమే ఎక్కువని కాంట్రాక్టర్లు తేల్చేశారు. ఇందుకు జీవీఎంసీ అధికారులు కూడా అవునంటూ పనులను అప్పగించారు. అయితే, ఈ వ్యవహారంలో అసలు ‘చేపల’ కథ వేరే ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆన్లైన్ వద్దు.. బాక్సులే ముద్దు...! వాస్తవానికి జీవీఎంసీ పరిధిలోని చికెన్, మటన్ షాపుల్లో వ్యర్థాలను తరలించేందుకు టెండర్లను గత ఏడాది జూన్‌లోనే పిలిచారు. కరోనా నేపథ్యంలో దీనిని రద్దు చేశారు. తాజాగా తిరిగి టెండర్లను పిలిచారు. అయితే ఆన్లైన్ టెండర్లు కాకుండా బాక్సు టెండర్లను ఆహ్వానించారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఆన్లైన్ టెండర్లను ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారానే చేపడుతున్నారు. అయితే, జీవీఎంసీలో మాత్రం బాక్సులను వదలడం లేదు. అందులోనూ ప్రజారోగ్య విభాగంలోనే అధికంగా బాక్సు టెండర్లను ఆశ్రయించడంలో ఉన్న మతలబు ఏమిటనే ప్రశ్నకు సమాధానం అంతుచిక్కడం లేదు. అక్కడ రూ.100.. ఇక్కడ రూ.110 జీవీఎంసీ పరిధిలో 2019 లెక్కల ప్రకారం 1,600 చికెన్, మటన్ షాపులున్నాయి. రోజూ ఈ షాపుల నుంచి వచ్చే 60 టన్నుల వ్యర్థాలను కాపులుప్పాడకు తరలించాల్సి ఉంటుంది. ఇందుకు టెండర్లు ఆహ్వానించగా పలు విచిత్రాలు చోటుచేసుకున్నాయి. అనకాపల్లిలో సేకరించిన వ్యర్థాలను కాపులుప్పాడకు తరలించేందుకు షాపునకు రూ.100 అయితే, మధురవాడలోని షాపుల నుంచి సేకరించిన వ్యర్థాలను తరలించేందుకు మాత్రం రూ.110 లెక్క టెండర్లను దక్కించుకోవడం గమనార్హం. వాస్తవానికి అనకాపల్లితో పోల్చుకుంటే మధురవాడ చాలా దగ్గర. అయినా ఎందుకు ఇలా జరిగిందని ఆరా తీస్తే.. చేపల యజమానుల చేతివాటమని తెలుస్తోంది. అనకాపల్లి నుంచి సేకరించిన వాటిని యలమంచిలి, పెందుర్తిలోని చేపల చెరువులకు తరలించవచ్చనేది వారి ఆలోచనగా ఉన్నట్టు సమాచారం. అయితే ఇది చట్టరీత్యానేరం. దీనిపై జీవీఎంసీతో పాటు మత్స్యశాఖ అధికారులు ఎలా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది. -
జీవీఎంసీ పరిధిలో పార్కుల అభివృద్ధి
-
గ్రేటర్ విశాఖలో స్థాయిసంఘం ఎన్నికల కోలాహలం
-
జి వి ఎం సి స్టాండింగ్ కమిటీ ఎన్నికలు
-
GVMC తొలి కౌన్సిలింగ్ ప్రారంభం
-
వక్రీకరణ అలా.. వాస్తవం ఇలా
విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకా స్టైరీన్ వాసన వస్తోందా.. ఇళ్లలో ఊపిరి (గాలి) అందడం లేదా.. ఉండలేకపోతున్నారా.. పెద్ద సంఖ్యలో జనం ఇంకా ఆసుపత్రులకు వస్తున్నారా.. సమీపంలోని మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్‌లోని నీటిపై గ్యాస్ పేరుకుపోయిందా.. ఓ వర్గం మీడియాలో వస్తున్న కథనాలన్నీ వాస్తవమేనా? నిజంగానే అక్కడ ఇంకా అంత ప్రమాదకర పరిస్థితి ఉందా? స్టైరీన్ గ్యాస్ ఇంకా తన ప్రతాపం చూపుతోందా? ఇంతకూ ఏది వక్రీకరణ.. ఏది వాస్తవమో తెలుసుకుందాం. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం వలంటీర్‌పై స్టైరీన్ ప్రభావమా? వక్రీకరణ : ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి ఆనుకుని ఉన్న వెంకటాపురం గ్రామంలో విషవాయువు ప్రభావం ఇంకా ఉందని, కొందరికి ఊపిరి అందడం లేదని.. ఈ క్రమంలో వార్డు వలంటీర్ నూకరత్నం స్పృహ తప్పి పడిపోయిందని ఓ వర్గం మీడియాలో పేర్కొన్నారు. వాస్తవం: వెంకటాపురం నడి బొడ్డున ఉన్న సచివాలయంలో వార్డు వలంటీర్ నూకరత్నం.. ప్రమాదం జరిగాక శనివారం మొదలు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 దాటే వరకు నిరంతరాయంగా విధులు నిర్వర్తించింది. మంగళవారం ఉదయం కూడా ఎన్యూమరేషన్లో భాగంగా తనకు కేటాయించిన 50 ఇళ్లకు వెళ్లి వచ్చారు. 11 గంటల సమయంలో గ్రామ సచివాలయానికి మంత్రులు అవంతి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబు, ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ రావడంతో సచివాలయ గది జనంతో కిక్కిరిసింది. దీంతో ఒక్కసారిగా ఆమె డీ హైడ్రేషన్‌తో బీపీ పెరిగి స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే పక్కనే ఉన్న జీవీఎంసీ ఏఎంహెచ్‌వో లక్ష్మీ తులసి ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత గోపాలపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ సాయంత్రం 4 గంటల వరకు చికిత్స తీసుకుని తర్వాత ఇంటికి వెళ్లిపోయింది. ఇబ్బంది ఉంటే మేమెలా పని చేయగలం? ప్రతి రోజూ వెంకటాపురం ఊరు మధ్యలో ఉన్న వార్డు సచివాలయంలోనే పని చేస్తున్నాం. రమాదేవి, ఆశాజ్యోతి, సత్య తులసితో పాటు సచివాలయ ఇన్చార్జ్ బాధ్యుడిగా నాతో సహా అందరం అక్కడే పని చేస్తున్నాం. ఘటన తర్వాత ఇక్కడికొచ్చినప్పుడు మొదట్లో కాస్త వాసన వచ్చింది. తర్వాత ఎలాంటి వాసన రావడం లేదు. నిజంగా ఇబ్బందికర పరిస్థితులుంటే మేమెలా పనిచేయగలం? – నాయుడు, వెంకటాపురం వార్డు సచివాలయం ఇన్చార్జ్ ఊపిరి అందనంతటి విషమ పరిస్థితి ఉందా ? వక్రీకరణ : ఆ గ్రామాల్లోని ఇళ్లలో ప్రజలకు ఊపిరి ఆడటం లేదు. జనం పెద్ద సంఖ్యలో గోపాలపట్నం ఆసుపత్రికి వైద్యం కోసం వస్తున్నారు. (ఓ దినపత్రికలో వార్త) వాస్తవం: ‘నిజానికి ఊపిరి అందని విషమ పరిస్థితి ఎవరికీ లేదు. చిన్న చిన్న సమస్యలతో వచ్చి చికిత్స (ఇంజక్షన్) చేయించుకుని మందులు తీసుకుని వెళ్లిపోతున్నారు. ఇంత వరకు ఆసుపత్రిలో ఎవరూ అడ్మిట్ కాలేదు. అంతా ఓపీ (అవుట్ పేషెంట్) విభాగానికి వచ్చి వెళ్లిపోతున్నారు’ అని గోపాలపట్నం ఆసుపత్రి ఇన్చార్జ్ డాక్టర్ శాంతిప్రభ స్పష్టం చేశారు. ’ఊపిరి అందడం లేదు..’ అని రాయడం సరికాదు.. నేను ఓ డాక్టర్‌గా చెబుతున్నాను.. అలా ఎలా రాస్తారో నాకు అర్థం కావడం లేదు. గ్యాస్ లీకైన నాలుగైదు రోజుల తర్వాత ఆ ప్రాంతంలో ఇళ్ల తలుపులు ఒక్కసారిగా తెరిస్తే.. అప్పటి వరకు మూసుకుపోయిన గదుల్లోని గ్యాస్ కాస్త బయటకు వస్తుంది. ఆ ప్రభావంతో కొందరు కొద్ది క్షణాలు ఇబ్బంది పడి ఉండొచ్చు. అలాంటి వారు మా వద్దకు వస్తే ప్రాథమిక చికిత్స చేసి పంపించేస్తున్నాం. అంతే కానీ ఊపిరి అందని పరిస్థితి ఎవ్వరికీ లేదు. నిజానికి నాకు రాజకీయాలతో సంబంధం లేదు. కానీ ఓ మాట చెబుతాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచితనాన్ని కొందరు అలుసుగా తీసుకుంటున్నారు. ప్రభుత్వ పరంగా ఇంత చేసినా ఇంకా రాజకీయాలు చేస్తున్నారు’ అని ఆమె వ్యాఖ్యానించారు. స్టైరీన్ లేదని ప్రతీ రిపోర్టులో వచ్చింది ఘటన జరిగినప్పటి నుంచి ప్రతి రోజూ నీటి శాంపిళ్లు ల్యాబొరేటరీకి పంపించాం. 7, 8 తేదీల్లో తీసిన శాంపిళ్ల రిపోర్టుల్లో స్టైరీన్ లేదని వచ్చింది. ఇప్పటికీ నీటిని పరీక్షలకు పంపిస్తున్నాం. నిజంగా స్టైరీన్ నీటిలో కలిసిపోతే.. అందులోని చేపలు, ఇతర జీవులన్నీ ఇప్పటికే చనిపోవాలి. కానీ అలాంటిదేమీ జరగలేదు. ప్రతి రిపోర్టులోనూ స్టైరీన్ మోతాదు లేనట్లు నివేదిక వచ్చినా, నీటిని ఒకటికి రెండు సార్లు శుద్ధి చేశాకే సరఫరా చేస్తాం. – జి.సృజన, జీవీఎంసీ కమిషనర్ మేఘాద్రిగెడ్డపై ‘విష’ ప్రచారం వక్రీకరణ: ఘటన జరిగిన ప్రాంతానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేఘాద్రిగెడ్డలో విషవాయువు స్టైరీన్ కారణంగా నీటిపై పచ్చని రంగు తెట్టు ఏర్పడిందంటూ ఓ పత్రికలో ఫొటో ఐటం వచ్చింది. వాస్తవం: నీటిపై రంగు తెట్టు కాదు.. నాచు ఏర్పడింది. వివరాల్లోకి వెళితే.. ఎల్జీ పాలిమర్స్‌కు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్ నుంచి నగరంలోని 45, 46, 47, 48, 49వ వార్డుల్లోని 6,590 ఇళ్లకు నీటిని సరఫరా చేస్తుంటారు. అదేవిధంగా ఆర్మీకి చెందిన మిలటరీ ఇంజనీరింగ్ సర్వీస్ (ఎంఈఎస్), తూర్పు నౌకాదళానికి చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేవల్ ప్రాజెక్టŠస్(డీజీఎన్‌పీ)కు బల్క్ నీటి కనెక్షన్ అందిస్తున్నారు. మొత్తంగా మేఘాద్రిగెడ్డ నుంచి 8 మిలియన్ గ్యాలన్ల నీటిని ప్రతి రోజూ సరఫరా చేస్తుంటారు. ► ఈ నెల 7వ తేదీన దుర్ఘటన జరిగిన వెంటనే నీటి సరఫరా నిలిపేశారు. ప్రత్యామ్నాయంగా గోదావరి జలాలు అందించేలా జీవీఎంసీ నీటి సరఫరా విభాగం చర్యలు తీసుకుంది. ► మేఘాద్రిగెడ్డలోని నీరు విషతుల్యం అయ్యిందా.. లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు జీవీఎంసీ చర్యలు ప్రారంభించింది. విశాఖలోని రీజనల్ వాటర్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ప్రతినిధులు ఈ నెల 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆ నీటి శాంపిళ్లను పరీక్షల కోసం తీసుకెళ్లారు. ► 7, 8వ తేదీల్లో తీసుకున్న శాంపిళ్లలో స్టైరీన్ మోనోమర్ అవశేషాలు లేవని స్పష్టం చేశారు. నీటిలో ఉన్న లవణాలు, ఇతర వాల్యూస్ అన్నీ.. వినియోగించేందుకు సురక్షితంగా ఉన్నాయని రిపోర్టులో స్పష్టం చేశారు. స్టైరీన్ కలిసి ఉంటే జలచరాలు చనిపోలేదే! రీజనల్ లేబొరేటరీ ఇచ్చిన తొలి రోజు రిపోర్టు, ప్రస్తుత పరిస్థితులు పరిశీలిస్తే.. నీటిలో ఎలాంటి విషవాయువు అవశేషాలు కలవలేదని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఒకవేళ నీరు కలుషితమై ఉంటే అందులో ఉండే జలచరాలు మృత్యువాత పడేవి. కానీ అది జరగలేదు. స్టైరీన్ బరువైన వాయువు కాబట్టి నీటి ఉపరితలంపై పొరలా ఏర్పడిందనుకుంటే నీటిలోని ఆక్సిజన్ తగ్గి ఉండాలి. ఫలితంగా జలచరాలు మృత్యువాత పడి ఉండాలి. కానీ అదేమీ జరగలేదు. నిల్వ ఉండే నీటిలో నాచు ఉండదా? మేఘాద్రిగెడ్డ నీటిని 7వ తేదీ నుంచి వాడటం లేదు. గేటు సమీపంలో ఎప్పటికప్పుడు నాచు ఏర్పడుతుంటుంది. దాన్ని 10 రోజులకోసారి శుభ్రం చేస్తుంటాం. ఘటన జరిగిన తర్వాత.. ఆ నీటిని పూర్తిగా వినియోగించడం లేదు. నిల్వ ఉండే నీటిలో నాచు ఏర్పడటం సహజం. దానిని చూసి.. రంగు పొరలు ఏర్పడ్డాయనడం సరికాదు. భయపడాల్సిన అవసరం లేదు. – వేణుగోపాల్, జీవీఎంసీ నీటి సరఫరా విభాగం ఎస్ఈ నాచు ఎందుకు ఏర్పడిందంటే.. మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 61 అడుగులు కాగా, ప్రమాదం సంభవించే సమయానికి 57.5 అడుగుల నీటి మట్టం ఉంది. 9వ తేదీ రాత్రి కురిసిన వర్షానికి మరో అడుగు నీరు రిజర్వాయర్‌లో చేరి ప్రస్తుతం 58.6 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి గెడ్డల్లో నీరు రిజర్వాయర్‌లో చేరినప్పుడు గెడ్డల నుంచి వచ్చే నాచు ఇక్కడ పొరలుగా ఏర్పడిందే తప్ప.. విషవాయువు ప్రభావం వల్ల కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఊపిరి అందనిది ఎల్లో బ్యాచ్‌కే : బొత్స చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఓ దుర్ఘటన జరిగిన వెంటనే బాధితులకు పెద్ద మొత్తంలో నష్ట పరిహారం చెల్లింపుతో పాటు శరవేగంగా పునరావాసం, నష్ట నివారణ చర్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. అయితే జనానికి మంచి చేస్తే చూడలేని విషపు మీడియా ఇష్టారాజ్యంగా కథనాలు వండి వారుస్తోంది. అందులో భాగంగానే ‘ఈనాడు’లో అసత్య వార్తలు పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి. వెంకటాపురం గ్రామానికి చెందిన కొద్ది మంది ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటే.. గ్రామాల్లో ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందంటూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా వార్తలు రాయడం అమానుషం. ప్రజలకు ధైర్యం చెప్పే విధంగా.. అధికారులకు మార్గదర్శకం చేసే విధంగా వార్తలు ఉండాలి కానీ ప్రజలను రెచ్చగొట్టే విధంగా విషం చిమ్మడం సరికాదు. బాబు జమానాలో అరకొర పరిహారం అందులోనూ జాప్యం.. హుద్‌హుద్ తుపాన్, విశాఖ తుపాన్ విరుచుకుపడిన తేదీ: 2014 అక్టోబర్ 13 మృతులు: 46 మంది ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా: రూ.5 లక్షలు ఇచ్చిన తేదీ: 2015 జనవరి 20 (వంద రోజుల తర్వాత ఇచ్చారు) గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట, రాజమండ్రి ఘటన జరిగిన తేదీ: 2015 జూలై 14 మృతులు: 29 మంది ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా: రూ.10 లక్షలు ఇచ్చిన తేదీ: క్షతగాత్రులకు 4 నెలల తర్వాత అరకొరగా చెల్లింపు కృష్ణా నదిలో బోటు మునక, విజయవాడ ఘటన జరిగిన తేదీ: 2017 నవంబర్ 12 మృతులు: 21 మంది ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా : రూ.10 లక్షలు ఇచ్చిన తేదీ : 2017 నవంబర్ 30 తిత్లీ తుపాన్, ఉత్తరాంధ్ర తుపాన్ విరుచుకుపడిన తేదీ: 2018 అక్టోబర్ 11 మృతులు: 8 మంది ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా : రూ.5 లక్షలు ఇచ్చిన తేదీ : 2018 నవంబర్ 6 గోదావరిలో బోటు మునక, వాడపల్లి–మంటూరు, తూర్పుగోదావరి జిల్లా ఘటన జరిగిన తేదీ: 2018 మే 17 మృతులు : 22 మంది ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా : రూ.10 లక్షలు ఇచ్చిన తేదీ : 2018 మే 28 స్కూల్ ఆటో బోల్తా, ఫిరంగిపురం, గుంటూరు జిల్లా ఘటన జరిగిన తేదీ: 2017 డిసెంబర్ 28 మృతులు : ఐదుగురు విద్యార్థులు,ఆటో డ్రైవర్ ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా : రూ.5 లక్షలు ఇచ్చిన తేదీ : 2018 మార్చి 31 అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పేరేచర్లలో జరిగిన పాదయాత్రలో దీనిపై అప్పటి సీఎం చంద్రబాబును నిలదీశారు. దీంతో కొద్ది నెలలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియాలో మూడు లక్షలు కోత పెట్టి రూ.2 లక్షలు చెల్లించింది. గ్యాస్ పైప్‌లైన్ పేలుడు, నగరం, తూ.గో. జిల్లా మృతులు: 22 మంది ఘటన జరిగిన తేదీ : 2014 జూన్ 27 ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా : రూ.3 లక్షలు ఇచ్చిన తేదీ: 2014 జూన్ 30 (గెయిల్, కేంద్ర ప్రభుత్వం మూడు రోజుల్లోనే ఎక్స్‌గ్రేషియా చెల్లించటంతో రాష్ట్ర వాటా పరిహారం అదే రోజు ఆ మొత్తంతో కలిపి ఇచ్చారు.) ఇప్పుడు విశాఖ ఘటనలో.. రూ. కోటి పరిహారం 5 రోజుల్లో చెల్లింపు -
ప్రభుత్వం బస.. పల్లెలకు భరోసా
సాక్షి ప్రతినిధి. విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ప్రభావిత ఐదు గ్రామాల ప్రజలు ఐదు రోజుల తర్వాత మంగళవారం సరికొత్త ఉదయాన్ని చూశారు. సోమవారం రాత్రి వారి మధ్యనే మంత్రులు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు బస చేసి కొండంత భరోసా ఇచ్చారు. పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ, జీవీఎంసీతోపాటు అన్ని విభాగాల అధికారులు కంటిమీద కునుకు లేకుండా ఆయా గ్రామాల్లో రాత్రంతా కాపలా కాశారు. సోమవారం రాత్రి ఇళ్లకు చేరుకున్న గ్రామస్తులకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు నైతిక స్థైర్యం కల్పించారు. ఆ గ్రామాల్లో జనజీవనం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంది. ప్రజాప్రతినిధుల నిద్రతో ఆ ప్రాంతాల్లో నవోదయం వెల్లివిరిసింది. ఐదు రోజుల్లోనే గ్రామస్తుల దైనందిన జీవనం యథావిధిగా ప్రారంభమైంది. ఉదయాన్నే చాలామంది నిర్భయంగా మార్నింగ్ వాక్కు వెళ్లారు. కిరాణా, పాలు, కూరగాయలు తదితర షాపులన్నీ తెరుచుకున్నాయి. దినపత్రికలు సరఫరా అయ్యాయి. గ్రామాల్లో మంత్రుల నిద్ర ఆ ఐదు గ్రామాల్లో మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయ్‌ప్రసాద్ సోమవారం రాత్రి బస చేశారు. గ్రామస్తులతో ముచ్చటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సాధకబాధకాలు తెలుసుకున్నారు. రాత్రి వారితోనే కలిసి భోజనం చేశారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు: కన్నబాబు వెంకటాపురం: జిల్లా ఇన్చార్జి మంత్రి కురసాల కన్నబాబు సోమవారం రాత్రి 8 గంటలకు వెంకటాపురం చేరుకున్నారు. గడపగడపకూ తిరిగారు. గ్రామస్తులతో మాట్లాడారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రాత్రి 11.30 గంటలకు వెంకటాపురంలోనే ఒక ఇంట్లో నిద్ర చేశారు. ఉదయం 6 గంటలకు లేచి రెడీ అయ్యి మళ్లీ గ్రామాల్లో పర్యటించారు. ప్రభుత్వం అన్నివిధాలా గ్రామస్తులను ఆదుకుంటుందని ధైర్యాన్ని ఇచ్చారు. కాలుష్యం కారణంగా భవిష్యత్‌లో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని కొంతమంది ఆందోళన వ్యక్తం చేయగా.. గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నాలుగు శాఖల వైద్యాధికారులు గ్రామాల్లోనే ఉంటారని చెప్పారు. ఎవరికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా ప్రాథమిక శిబిరాల్లో పరీక్షలు నిర్వహించి అవసరమైతే పెద్దాస్పత్రులకు పంపించడం జరుగుతుందన్నారు. కన్నబాబు వెంట మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ ఉన్నారు. ప్రభుత్వం అండగా ఉంటుంది: ముత్తంశెట్టి పద్మనాభనగర్‌లో: మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సోమవారం రాత్రి 8 గంటలకు గ్యాస్ పీడిత గ్రామాలను సందర్శించారు. వెంకటాపురం, పద్మనాభనగర్లలో స్థానికులతో మాట్లాడారు. అనంతరం రాత్రి 10 గంటలకు గ్రామస్తులతో కలిసి భోజనం చేసి పద్మనాభనగర్లోని ఒక ఇంట్లోనిద్రించారు. ఉదయం 5.45 గంటలకు లేచి గ్రామంలో తిరిగారు. ఆవులకు పశుగ్రాసం వేశారు. బోర్ వాటర్‌ను పరిశీలించారు. అనంతరం ఇళ్లకు వెళ్లి స్థానికులతో ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా కల్పించారు. ఆయన వెంట పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్ ఉన్నారు. 9 గంటలకు మిగిలిన నాలుగు గ్రామాలు కూడా సందర్శించి అక్కడ పరిస్థితులను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కంపెనీ మూతపడే ఉంది: బొత్స నందమూరి నగర్లో: మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం రాత్రి 8 గంటలకు నందమూరినగర్‌లో ఇంటింటికీ వెళ్లి పరిస్థితులను పర్యవేక్షించారు. మంగళవారం ఉదయం 6 గంటలకే నిద్రలేచి గ్రామం మొత్తం కలియతిరిగారు. స్థానికుల సమస్యలను సావధానంగా విన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. ప్రస్తుతం కంపెనీ మూతపడి ఉందని, కమిటీ నివేదిక వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ఆయన వెంట వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ కూడా ఉన్నారు. వెంకటాపురంలో ఎన్యుమరేషన్ తీరును పరిశీలిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్టైరీన్ తరలిస్తున్నాం :ధర్మాన ఎస్సీ, బీసీ కాలనీలో: మంత్రి ధర్మాన కృష్ణదాస్ సోమవారం రాత్రి 9 గంటలకు ఎస్సీ, బీసీ కాలనీకి చేరుకుని ఓ ఇంట్లో బస చేశారు. మంగళవారం ఉదయం 5.30 గంటలకే నిద్ర లేచి గ్రామంలోని ప్రతి వీధీ పర్యటించారు. స్థానికులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. నిపుణుల సూచనలు ప్రజలకు వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు భవిష్యత్‌లో ప్రమాదాలు జరగకుండా స్టైరీన్ గ్యాస్‌ను తరలించేస్తున్నామని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. గ్రామస్తులతో ఎంపీల మాటామంతి సోమవారం రాత్రి 9.30 గంటలకు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆయా గ్రామాలను సందర్శించి గ్రామస్తులతో ముచ్చటించారు. స్థానికులతో కలిసి భోజనం చేశారు. అనంతరం అక్కడే ఒక ఇంట్లో మేడమీద ఆరు బయటే నిద్రించారు. తిరిగి ఉదయం 5.45 గంటలకు లేచారు. గ్రామాల్లో కలియతిరిగారు. వెంకటాపురం, ఎస్సీ, బీసీ కాలనీ, నందమూరి నగర్ ఇలా అన్ని ప్రాంతాల్లో ప్రజలను కలిశారు. వెంకటాపురంలో కొంతమంది తమ సమస్యలను విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి నాలుగు ఇళ్లకు ఒక పారిశుధ్య కార్మికుడు నిత్యం పనులు చేపట్టేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎంపీ ఎంవీవీ సోమవారం రాత్రి 8 గంటలకు కంపరపాలెం గ్రామాన్ని సందర్శించారు. మంత్రులతో కలిసి అన్ని గ్రామాలకు వెళ్లి అక్కడ పరిస్థితులను పర్యవేక్షించారు. స్థానికుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రాత్రి 10 గంటలకు స్థానికులతో కలిసి భోజనం చేశారు. అనంతరం 11 గంటలకు ఓ ఇంట్లో నిద్ర చేశారు. ఉదయం 6 గంటలకు రెడీ అయ్యి మళ్లీ అన్ని గ్రామాల్లో కలియతిరిగారు. -
ఏపీలో సుపరిపాలన జరుగుతోంది
-
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
-
టౌన్ ప్లానింగ్‌పై ఏసీబీ పంజా
మంగళవారం ఉదయం 10.30 గంటల సమయం..గాజువాకలోని జీవీఎంసీ జోన్–5 కార్యాలయంలో అప్పుడప్పుడే కార్యకలాపాలు మొదలవుతున్నాయి. అదే సమయంలో ఒక్కసారిగా పది మంది వ్యక్తులు లోపలికి ప్రవేశించి ఉద్యోగుల నుంచి ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. సోదాలు మొదలుపెట్టారు.అదే సమయానికి.. మధురవాడలోని జోన్–1 కార్యాలయంలోనూ అదే సీన్.అవినీతి ప్లానింగ్‌తో నగరపాలనను గాడి తప్పిస్తున్న జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగంపై అవినీతి నిరోధక శాఖ పంజా విసిరింది. మంగళవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఏసీబీ డీఎస్పీలు షకీలాభాను, రంగరాజుల ఆధ్వరం్యలో రెండు బృందాలు గాజువాక, మధురవాడ కార్యాలయాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించాయి. రెండు చోట్లా టౌన్ ప్లానింగ్ విభాగాల్లోనే ఈ సోదాలు కేంద్రీకృతం కావడం విశేషం.తనిఖీ బృందాలు ఫైళ్లు, రికార్డులు పరిశీలించడంతో సరిపెట్టకుండా బిల్డింగ్ ఇన్స్పెక్టర్ నుంచి చైన్మన్ వరకు.. అలాగే ఆ సమయంలో అక్కడ ఉన్న బయటి వ్యక్తులను తరచి తరచి ప్రశ్నించారు. వారిలో కొందరు అనధికార ఉద్యోగులుగా చెలామణీ అవుతున్న విషయాన్ని గుర్తించారు. కాగా మధురవాడ జోనల్ కార్యాలయంలో ఒక అనధికార మహిళా ఉద్యోగి వద్దటౌన్ ప్లానింగ్ సిస్టమ్‌కు చెందిన పాస్వర్డ్ ఉన్న విషయం సోదాల్లో వెలుగు చూసింది. బిల్డింగ్ ప్లాన్లకు అనుమతుల జారీలో కొన్ని ఉల్లంఘనలు సైతం ఏసీబీ అదికారులు దృష్టికి వచ్చాయి. విశాఖపట్నం, మధురవాడ (భీమిలి): భవన నిర్మాణాలకు అనుమతుల మంజూరులో నిబంధనలు తుంగలో తొక్కేయడం... నిర్మాణదారులు నిబంధనలు ఉల్లంఘించినా చూసీచూడనట్లు వ్యవహరించడం... అధ్వానంగా రికార్డుల నిర్వహణ, అనధికార నిర్మాణాలు కట్టడిచేయలేకపోవడం... ఇలా ఒక్కటేమిటి అన్నింటా జీవీఎంసీ జోన్–1 కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ సి బ్బంది అవకతవకలకు పాల్పడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఏసీబీ అధికారులు తేల్చారు. మధురవాడలోని జోనల్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ డీఎస్పీ రంగరాజు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు జెడ్సీ రాము సమక్షంలోను, వేర్వేరుగా స్థానిక అధికారులను ప్రశ్నించారు. అనంతరం బీరువాలు, రికార్డులు పరిశీలించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం మంగళవారం సాయంత్రం వరకూ సోదాలు జరుగుతుండగా ప్రాథమిక సమాచారాన్ని డీఎస్పీ రంగరాజు మీడియాకి తెలిపారు. జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయడంలో, ప్లాన్లు అమోదించడంలో జరుగుతున్న అవకతవకలు పరిశీలించాలని రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి ఆదేశాల మేరకు సోదాలు నిర్వహించినట్టు చెప్పారు. ఇక్కడ పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది రికార్డులు సరిగా నిర్వహించడం లేదని తెలిపారు. అనధికార నిర్మాణాలను చూసీచూడనట్లు వదిలేస్తున్నారని, పరిశీలించాల్సిన అధికారులు కూడా పట్టించుకోవడం లేదని గుర్తించామన్నారు. ఈ డీవియేషన్స్ టీపీఎస్, టీపీవో, ఏసీపీ... ఇలా అన్ని స్థాయిల్లో ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా నాన్ ఏజెన్సీ అడ్వర్టైజ్మెంట్ బోర్డ్ రికార్డుల నిర్వహణ, టీడీఆర్ ఇవ్వడం వంటి వాటిలో అవకతవకలు జరిగినట్టు గుర్తించామని తెలిపారు. అలాగే ఇక్కడ అత్యంత రహస్యంగా ఏసీపీ మాత్రమే ఉపయోగించాల్సిన డాంగిల్, పాస్వర్డ్ ఓ అనధికార మహిళకు అప్పగించి పనులు నిర్వహిస్తున్నారని తెలిపారు. చివరకు అత్యంత ముఖ్యమైన ఆర్టీఐ రిజిస్టర్ కూడా సక్రమంగా నిర్వహించలేదని చెప్పారు. ఆరిలోవ ఇందిరానగర్‌లో ఓ భవనంలో మూడు ప్లాట్ల నిర్మాణానికి అనుమతి తీసుకుని 8 ప్లాట్స్ నిర్మిస్తున్నట్టు ప్రాథమిక నిర్థారణకు వచ్చామని, దానిపై కూడా విచారణ సాగుతుందని చెప్పారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలకు సిఫార్స్ చేస్తామని తెలిపారు. ఇన్స్పెక్టర్ రమేష్ ఆధ్వర్యంలో ఆఫీసులో, మరో ఇన్స్పెక్టర్ అప్పారావు ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయిలో విచారణ సాగిస్తున్నామని తెలిపారు. జోన్–5లోనూ విస్తృత సోదాలు గాజువాక: జీవీఎంసీ జోన్ – 5 (గాజువాక జోన్) కార్యాలయంలోని టౌన్‌ప్లానింగ్ విభాగంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ అధికారులు, సిబ్బంది మంగళవారం ఉదయం పదిన్నర గంటల సమయంలో ఒక్కసారిగా పది మంది ప్రవేశించి విభాగంలోని ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు విచారణ కొనసాగించారు. ఏసీబీ అడిషినల్ ఎస్పీ షకీలాభాను, సీఐ లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించిన అధికారులు టౌన్‌ప్లానింగ్ విభాగంలోని ప్రతి ఫైలును క్షుణ్ణంగా పరిశీలించారు. వివిధ ఫైళ్లకు సంబంధించిన అనుమతుల్లో చోటుచేసుకున్న జాప్యంపై విభాగం అధికారులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా సహాయ ప్లానింగ్ అధికారి అమర్నాథ్, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు వెంకటరావు, గోపన్నలను వివిధ అంశాలపై విచారించారు. గుమస్తాలను విచారించడంతోపాటు వారి వద్ద ఉన్న నగదు సైతం పరిశీలించారు. అనంతరం ఆ వివరాలను నమోదు చేశారు. విభాగంలో అనధికారికంగా పని చేస్తున్న వ్యక్తుల వివరాలు సేకరించారు. విభాగంలో అప్పటికే ఉన్న బయటి వ్యక్తులను ప్రశ్నించారు. సమస్యలుంటే తమతో చెప్పాలని ఏసీబీ అధికారులు కోరడంతో పలువురు తమ సమస్యలను వివరించారు. అనంతరం జోన్లో చోటు చేసుకొంటున్న అనధికార నిర్మాణాలపై చైన్మ్యాన్లను ప్రశించారు. పలు వార్డుల్లో పర్యటించి వివిధ భవన నిర్మాణాలను పరిశీలించారు. జోనల్ కమిషనర్ డి.శ్రీధర్ నుంచి పలు వివరాలు సేకరించారు. టౌన్‌ప్లానింగ్ సిబ్బంది హాజరు, సర్వీస్ రిజిస్టర్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అడిషినల్ ఎస్పీ షకీలాభాను మాట్లాడుతూ అనధికార వ్యక్తుల నుంచి రూ.29వేలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కార్యాలయం పరిధిలో పలు అవకతవకలు జరిగినట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఇద్దరు అనధికార కంప్యూటర్ ఆపరేటర్లు కార్యాలయంలో పనిచేస్తున్నట్టు గుర్తించామని తెలిపారు. ఫిర్యాదుల ఆధారంగా దాడులు టౌన్‌ప్లానింగ్ విభాగంపై ఏసీబీకి వరుసగా అందుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. గాజువాక జోన్లో ఈ ఫిర్యాదులు మరింత వెల్లువెత్తుతున్నాయి. డబ్బులు ఇవ్వనిదే భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంలేదని, అనధికారిక నిర్మాణాల్లో చైన్మ్యాన్లు కీలకంగా వ్యవహరిస్తున్నారని, డబ్బులు వసూలు చేసి అనుమతిస్తున్నారన్న ఆరోపణలు, ఫిర్యాదులు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఈ అంశాలపై ఏసీబీ అధికారులు వివరాలు సేకరించారు. -
నగరానికి జ్వరమొచ్చింది
పెదవాల్తేరు(విశాఖతూర్పు): జీవీఎంసీ ఎన్ని చర్యలు చేపట్టనా విశాఖ నగరంలో జ్వరాలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఏ కాలనీలో చూసినా జ్వర పీడితులే కనిపిస్తున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా జ్వర పీడితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో నగరంలోని సీఎం ఆరోగ్యకేంద్రాలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. చినవాల్తేరు, పెదజాలారిపేట, ఎంవీపీ కాలనీ, అక్కయ్యపాలెం, కంచరపాలెం, బర్మాక్యాంపు, కప్పరాడ, బుచ్చిరాజుపాలెం, ప్రసాద్‌గార్డెన్స్, పాతపోస్టాఫీసు, రెల్లివీథి, హెచ్‌బీకాలనీ, రేసపువా నిపాలెం ప్రాంతాల్లో సీఎం ఆరోగ్యకేంద్రాలు రోజూ అధికసంఖ్యలో వస్తున్న రోగులతో కిటకిటలాడుతున్నాయి. సాధారణ జ్వరాలు, విష జ్వరాలు, డెంగ్యూ జ్వరాలతో జనాలు బా ధపడుతున్నారు. మలేరియా, డెంగ్యూ రక్తపరీక్షల కోసం ప్రజలు ఆరోగ్యకేంద్రాలను ఆశ్రయి స్తున్నారు. కొన్ని ఆరోగ్యకేంద్రాలు చిన్న చిన్న గదులలో ఉండటంతో రోగులు గంటల కొద్దీ నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కేంద్రాలన్నీ ప్రతి ఆదివారం, సెలవు దినాలలో కూడా పనిచేస్తాయి. తగినంత ప్రచారం లేనందు ఆదివారాలలో ఓపీ తగ్గుముఖం పట్టడం గమనార్హం. కంచరపాలెం కేంద్రంలో రోజూ 180 నుంచి 200 వరకు ఓపీ నమోదవుతుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చినవాల్తేరు, హెచ్‌బీకాలనీ, ఎంవీపీ కాలనీ వంటి కేంద్రాలలో రోజూ 60 నుంచి 70 వరకు మాత్రమే ఓపీ ఉండేది. ప్రస్తుత జ్వరాల సీజన్లో మాత్రం రోజూ 110 నుంచి 150 వంతున ఓపీ నమోదు కావడం గమనార్హం. జ్వరాల సీజన్ కావడంతో దాదాపుగా ప్రతీ కేంద్రంలోను ఓపీ వందకు పైగా దాటేయడం గమనార్హం. పనివేళలివీ: సీఎం ఆరోగ్యకేంద్రాలన్నీ రోజూ ఉదయం 8 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పనిచేస్తాయి. మళ్లీ సాయంత్రం 4 గంటలనుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయి. ఆదివారాలు, పండగరోజులలో కూడా సెలవు లేకుండా పనిచేస్తాయి. మందుల చీటీలను కంప్యూటర్ ప్రింటవుట్‌రూపంలో అందజేస్తారు. ఇక్కడ మలేరియా, డెంగ్యూ తదితర రక్తపరీక్షలు చేస్తారు. ఇంకా బీపీ, షుగర్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. పారిశుద్ధ్య లోపంతో.. పలు జోన్ల పరిధిలో డస్ట్‌బిన్‌ఫ్రీ సిటీ అంటూ డంపర్బిన్లు తొలచేశారు. దీంతో ప్రజలు, అటు పారిశుద్ధ్య కార్మికులు చెత్తచెదారాలను రోడ్లపైనే వేస్తున్నారు. ఈ చెత్త తరలింపులో ఎడతెగని జాప్యం జరుగుతోంది. ఫలితంగా దోమలు, ఈగలు వృద్ధిచెంది జ్వరాలు వ్యాప్తి చేస్తున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ఫాగింగ్ చేస్తున్నా సరే సత్ఫలితాలు ఇవ్వడం లేదని ప్రజలు వాపోతున్నారు. కాలువలు, గెడ్డలు కూడా చెత్తతో నిండిపోతున్నాయి.అధిక సంఖ్యలో ప్రజలు ఇళ్లలోని నీటిపాత్రలను వారంలో ఒకరోజు ఖాళీచేయడం లేదని ఇందువల్ల కూడా దోమల లార్వా వృద్ధి చెందుతుందని జీవీఎంసీ ప్రజారోగ్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే, సెప్టిక్‌ట్యాంక్ ఔట్లెట్ గొట్టాలకు అధికశాతం మంది మెస్‌క్లాత్‌లు అమర్చడం లేదు. ఈ కారణాల చేత కూడా నగరంలో దోమలు బాగా వృద్ధి చెందుతున్నాయి. -
ఆ నాలుగూ అలా కొట్టేశారా ?
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రమంతటా కనీవినీ ఎరుగని రీతిలో వీచిన ఫ్యాన్ గాలికి బలమైన టీడీపీ కోటలన్నీ తుత్తునీయలయ్యాయి. విశాఖ జిల్లాలోనూ అదే ఉద్ధృతి.. మొత్తం గ్రామీణ జిల్లాతోపాటు విశాఖ శివారులోని మూడు నియోజకవర్గాల్లోనూ చతికిలపడిపోయిన అధికార టీడీపీ నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం ఎలా నెగ్గుకురాగలిగిందన్న ఆశ్చర్యం, అనుమానాలు ఇప్పటికీ వ్యక్తమవుతూనే ఉన్నాయి. మంత్రి హోదాలో ఉత్తరం నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు కేవలం 1800 ఓట్లతో బయటపడటం, దక్షిణంలోనూ 3893 ఓట్ల తేడాతో వాసుపల్లి గణేష్‌కుమార్ గట్టెక్కగా మిగిలిన పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లోనూ టీడీపీ నెగ్గుకురావడానికి కారణాలేమిటి?.. తెర వెనుక ఏం జరిగిందన్న చర్చ ఇప్పటికీ సాగుతోంది.దీని వెనుక పెద్ద కుట్రే జరిగిందన్న వాదనలు తాజాగా బయటకొస్తున్నాయి. ఇందులో జీవీఎంసీ అధికారుల పాత్రపై బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఒకే ఒక్కడిపై ఇవన్నీ కేంద్రీకృతమవుతున్నాయి. జీవీఎంసీ యూసీడీ ప్రాజెక్టు అధికారులు ఇళ్ల లబ్ధిదారులను దాదాపు బ్లాక్మెయిల్ చేసి టీడీపీకి ఓట్లు వేయించారని.. ఈ తతంగాన్ని సదరు ప్రాజెక్టు ముఖ్య అధికారి అంతా తానై నడిపించారని అంటున్నారు.ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకొని తలా రూ.25 వేలు చొప్పున డీడీలు కట్టిన నగరంలోని సుమారు 40వేల కుటుంబాలను.. టీడీపీని గెలిపిస్తేనే ఇళ్లు వస్తాయని, లేదంటే మీరు కట్టిన డబ్బులు కూడా పోతాయని యూసీడీ అధికారులే బెదిరించి వారి చేత బలవంతంగా టీడీపీకి ఓట్లు వేయించినట్లు తెలుస్తోంది. ఇదే నగరంలో ఆ నలుగురు టీడీపీ అభ్యర్థులను ఓటమి నుంచి బయటపడేసిందంటున్నారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో నగరంలో టీడీపీకి మద్దతుగా జీవిఎంసీ యూసీడీ(అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్) ప్రాజెక్ట్ ముఖ్య అధికారి ఆధ్వర్యంలో పెద్ద తతంగమే నడిచిందని యూసీడీ వర్గాలే చెప్పుకొస్తున్నాయి. సదరు అధికారి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్లకు అత్యంత సన్నిహితుడిగా పేరు పొందాడు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు సెలవులో వెళ్లిన ఆ అధికారి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఆగమేఘాలపై రంగంలోకి దిగాడు. ఇళ్ల కోసం దరఖాస్తు చేసిన ప్రతిఒక్కరితో మాట్లాడాడు. మీకు ఇళ్లు రావాలంటే టీడీపీకి ఓటు వేయాల్సిందేనని నిస్సిగ్గుగా ప్రచారం చేశాడు. ఒక విధంగా బెదిరింపులకు పాల్పడ్డాడు. మొదటి నుంచి అతగాడిది ‘పచ్చ’పాతమే టీడీపీ మాదే.. అని భావించే సామాజికవర్గానికి చెందిన ఆ అధికారి సోషల్ వెల్ఫేర్ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేశారు. 2016 నుంచి ప్రాజెక్టు డైరెక్టర్(పీడీ)గా పనిచేశారు. 2018లో బదిలీ అయినా ఇక్కడే కొనసాగుతూ వచ్చారు. ఈయన ఆధ్వర్యంలో డ్వాక్రా గ్రూపుల రుణాలు, పింఛన్లు, ఇళ్ల మంజూరుతో పాటు కుట్టుమిషన్ల పంపిణీ వంటి కార్యక్రమాలు అమలు చేస్తుంటారు. ఏడాది క్రితం ఈయన ఆధ్వర్యంలోనే పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ జరిగింది. ఇదే అదునుగా ఎన్నికల ముందు నుంచి అప్పటి నగర ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, వాసుపల్లి గణేష్‌కుమార్, గంటా శ్రీనివాసరావు, గణబాబులతో అతి సన్నితంగా ఉండేవారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత వ్యూహం ప్రకారం నగరంలోని సుమారు 40 వేల మంది ఇళ్ల దరఖాస్తుదారుల చేత రూ.25 వేలు చొప్పున డీడీలు కట్టించేసుకున్నారు. ఆనక టీడీపీకి ఓటు వేస్తేనే ఇళ్లు ఇస్తామని.. లేదంటే మీ డీడీలు రద్దు చేస్తామని బెదిరింపులకు దిగారు. తనకు తోడుగా మరో అధికారిని కూడా తెచ్చుకున్నారు. గతంలో జోన్–3 ,5లలో జోనల్ కమీషనర్‌గా పనిచేసిన ఆ అధికారి.. ఎన్నికలకు కొంతకాలం ముందు తూర్పుగోదావరి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారిగా నియమితలయ్యారు. అయితే యూసీడీ ముఖ్య అధికారి ఇక్కడ లేని పోస్టు సృష్టించి.. ఆ అధికారిని డిప్యుటేషన్ మీద ఇక్కడికి తీసుకొచ్చి హౌసింగ్ స్ఫెషల్ అధికారిగా నియమించుకున్నారు. ఇద్దరూ కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పినట్టల్లా అడుతూ దరఖాస్తుదారులను తీవ్రంగా ప్రభావితం చేసి ఓట్లు దండుకున్నారు. ఫలితాల అనంతరం బదిలీ తీరా ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయఢంకా మోగించడంతో వారిలో భయం ఆవహించింది. నగరంలో తాము అనుకున్నది సాధించగలిగినా అధికారం టీడీపీ చేజారడంతో ఇక్కడే ఉంటే తమ బండారం బయట పడుతుందనే భయంతో సదరు యూసీడీ ముఖ్య అధికారి పలాయనం చిత్తగించారు. ఉన్న పళంగా బదిలీ చేయించుకుని మే 31న సాంఘిక సంక్షేమ శాఖకు వెళ్లిపోయారు. ఇదంతా జీవీఎంసీ ఉన్నతాధికారుల కనుసన్నుల్లోనే జరిగిందని ఉద్యోగవర్గాలు పేర్కొంటున్నాయి. -
విశాఖలో వెలుగులోకి వచ్చిన మరో భూమాయ
-
ఇసకేస్తే రూ.కోట్లు!
► జీవీఎంసీలో ఇసుకాసురుల దందా ► ఉచిత ఇసుకకూ అనుచిత వసూళ్లు ► శ్రీకాకుళం జిల్లా పొందూరు నుంచి ఇసుక రవాణా ► దానికి అనుమతి పేరుతో దోచేస్తున్న అధికారులు ► ట్రిప్పునకు రూ.500 ఇస్తేనే స్లిప్పు ► ప్రతిరోజూ వందలాది ట్రిప్పులు మహా విశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ)లో పనిచేసిన పాము పాండురంగారావు రూ. వందల కోట్ల అక్రమాస్తులు కూడబెట్టారంటే మొదట్లో ఎవరికీ నమ్మబుద్ధి కాలేదు.. కూసింత బయటపడితే.. చింపి చేటంత చేస్తారన్న వ్యాఖ్యలు వినిపించాయి.. కానీ పక్కా ఆధారాలతో వెల్లడైన ఆస్తుల లెక్కలు.. అందరి కళ్లూ అంటుకుపోయేలా చేశాయి.. ఇప్పుడిదంతా ఎందుకంటే.. జీవీఎంసీలో అలాంటి అవినీతి ‘కట్టల’ పాములు ఇంకా చాలానే ఉన్నాయి మరి.. ప్రతి పనిలోనూ కాసులు వెతుక్కొని కోట్లు కూడబెట్టేవారు ఇంకెంతో మంది ఉన్నారు.. అంతెందుకు.. ప్రభుత్వం ఇసుక సరఫరాను ఉచితం చేసినా.. అందులోనూ రూ. కోట్ల కుప్పలు పోగేసుకోగల ఘనులు.. మన జీవీఎంసీ అధికారులు! రవాణాకు అనుమతుల పేరుతో.. ట్రిప్పునకు ఇంత అని రేటు పెట్టి మరీ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అదెలాగంటే... సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : గతంలో ఇసుక రీచ్‌ల నిర్వహణలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తడం.. ఇసుక కొరత నెలకొనడం వంటి కారణాలతో ప్రభుత్వం ఉచితంగా ఇసుక పంపిణీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఎక్కడో ఏమో గానీ.. జీవీఎంసీ అధికారులకు మాత్రం ఈ విధానం ‘ఉచిత’ సంపాదన మార్గంగా మారింది. అడ్డదారిలో రూ.కోట్లు సంపాదించిపెడుతోంది. జీవీఎంసీ పరిధిలో భారీ స్థా?ఇలో భవన నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఇసుక కొరత తీవ్రమైంది. జిల్లాలో ఏ రీచ్‌లోనూ ఇసుక లభ్యం కాని పరిస్థితుల్లో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి అక్కడి రీచ్‌ల నుంచి ఇసుక తెప్పిస్తున్నారు. ఈ మేరకు జీవీఎంసీ పరిధిలోని నిర్మాణాలకు అవసరమైన ఇసుకను శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు మండలం ముద్దాడ, పింగూరు రీచ్‌ల నుంచి తీసుకునేందుకు అనుమతులు పొందారు. అక్కడ కూడా పూర్తి ఉచితంగానే ఇసుక పంపిణీ చేస్తారు. అయితే రవాణా ఖర్చులు మాత్రం వినియోగరారుడే భరించాలి. ఈ క్రమంలో కార్పొరేషన్ పరిధిలో నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు తమకు అవసరమైన ఇసుక కోసం కార్పొరేషన్ అధికారుల నుంచి సిఫారసు చేయించుకోవాల్సి ఉంటుంది. సరిగ్గా దీన్నే అవకాశంగా తీసుకొని జీవీఎంసీ అధికారులు దోపిడీ పర్వానికి తెర తీశారు ఇసుక కావాల్సిన కాంట్రాక్టర్లు జీవీఎంసీ ఇంజినీరింగ్ విభాగాన్ని సంప్రదించాలి. తమ నిర్మాణాలకు సంబంధించి ఎన్ని ట్రిప్పుల ఇసుక కావాలో ముందుగా తెలియజేయాలి. ఆ మేరకు ఇంజినీరింగ్ అధికారులు పరిశీలించి సదరు కాంట్రాక్టర్లకు స్లిప్‌లు అందిస్తారు. ఆ స్లిప్ తీసుకుని పొందూరు మండలంలోని రీచ్‌కు వెళ్తే అక్కడ ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తారు. కానీ కార్పొరేషన్ అధికారులు ట్రిప్పునకు రూ. 500 చొప్పున వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రోజుకు ఎన్ని ట్రిప్పులు తిరిగితే అన్ని రూ.500 వాళ్లకు ముట్టజెప్పాల్సిందే. అసలే తీవ్రమైన ఇసుక కొరతతో ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయిన తరుణంలో కాంట్రాక్టర్లు మారు మాట్లాడకుండా ట్రిప్పుకు 500 చొప్పున ఇచ్చి స్లిప్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇలా రోజుకు 300 నుంచి 400 ట్రిప్పులు పొందూరు మండలం నుంచి వస్తున్నాయి. దీన్ని బట్టి జీవీఎంసీ అధికారులు ఉచిత ఇసుక పంపిణీ ద్వారా ఎంత కొల్లగొడుతున్నారో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఏం చేస్తున్నట్టు? ఉచిత ఇసుక వ్యవహారంలోనూ జీవీఎంసీ అధికారులు కాసులు వెతుక్కుంటుంటే కాంట్రాక్టర్స్ అసోసియేన్ ఏం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ దశలో కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ద్వారా స్లిప్‌లు అందించే పని చేపట్టారు. అయితే అసోసియేషన్‌లోని కొందరు.. అవినీతి అధికారులతో కుమ్మక్కై.. స్లిప్ రాస్తే తమకూ వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. వాళ్లకు కొంత.. వీళ్లకు కొంత అంటూ అటు అసోసియేషన్.. ఇటు అధికారులు వాటాలు వేసుకుని డబ్బులు డిమాండ్ చేస్తున్నా విధి లేని పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు ఎవరికివ్వాల్సింది వారికి ఇచ్చేస్తున్నట్టు తెలుస్తోంది. -
మాయల మరాఠీలు
► ఏఈ నుంచి సీఈ దాకా ఇక్కడే ప్రస్థానం ► మిత్ర చతుష్టయంతో అంతులేని అక్రమార్జన ► హద్దులు దాటిన కేజీహెచ్ వైద్యుని సంపాదన ► కలకలం రేపిన ఏసీబీ దాడులు పాండురంగారావు.. ఈ పేరు వింటే ఇప్పటికీ విశాఖ వాసుల్లో చాలామందికి ఠక్కున గుర్తుకొస్తారు.. జీవీఎంసీ ఇంజినీరని. ఆయన ప్రజల్లో అంతగా మమేకమై పోయారని కాదు.. అవినీతి, అక్రమ సంపాదనల్లో ఆరితేరిపోయారని..! అడ్డదారుల్లో వచ్చిన ఆదాయంతో బహుళ అంతస్తుల భవనాలు కట్టారు. తోచిన చోటల్లా పెట్టుబడులు పెట్టారు. ఆస్తులను బినామీల పేరున దాచిపెట్టారు. అందుకు కొందరు నమ్మకమైన మిత్రులతో జట్టుకట్టారు. చెట్టపట్టాలేసుకుని తిరిగారు. రాష్ట్రస్థాయి పదవికి ఎదిగాక ఇక తమనెవరూ ఏమీ చేయలేరన్న ధీమాకొచ్చారు. ఇదంతా గతంలో జీవీఎంసీలో సుదీర్ఘకాలం ఇంజినీర్‌గా పనిచేసి, ఇప్పుడు ప్రజారోగ్యశాఖలో ఇంజినీర్ ఇన్ చీఫ్ హోదాలో ఉన్న పాండురంగారావు అక్రమార్జన బాగోతమని వేరేచెప్పనక్కర్లేదు. ఆయనతోనే జతకట్టిన కేజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ బాబు విజయకుమార్ కూడా ఆదాయానికి మించిన ఆస్తులను మూటగట్టారు. మూడో కంటికి తెలియకుండా సంపాదనలో మునిగితేలారు. ఇప్పుడు తన ప్రాణమిత్రుడు పాండురంగారావుతో కలిసి అవినీతి నిరోధకశాఖకు చిక్కారు. సాక్షి, విశాఖపట్నం: పాండురంగారావు తన ఉద్యోగ ప్రస్థానాన్ని జీవీఎంసీలోనే ప్రారంభించారు. ఏఈగా చేరిన ఆయన డీఈఈ, ఈఈ, ఎస్ఈతో పాటు ఇన్చార్జి చీఫ్ ఇంజినీర్, రెగ్యులర్ చీఫ్ ఇంజినీర్ పదవులను కూడా ఇక్కడే నిర్వహించారు. పైరవీల్లో దిట్టగా పేరొందిన ఆయన ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుని తనకు కావలసిన చోట పోస్టింగు వేయించుకుంటారన్న పేరును అప్పట్లోనే గడించారు. అందులో భాగంగానే పలుమార్లు పదోన్నతులు పొంది ఎక్కడో బదిలీ అయినా తనదైన శైలిలో చక్రం తిప్పుతూ కొన్నాళ్లకే మళ్లీ కాసులు కురిపించే కామధేనువులాంటి జీవీఎంసీకి సునాయాసంగా వచ్చేసేవారు. జీవీఎంసీలో పనిచేసినప్పుడు ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. కానీ ఇక్కడ పనిచేసినంతకాలం ఆ ఆరోపణలను ఆయనను ఏమీ చేయలేకపోయాయి. ఎంతమంది ఎన్ని ఫిర్యాదులు చేసినా అవి బుట్టదాఖలయిపోయేవి. ఇక ఆయనకు కేజీహెచ్ ప్రొఫెసర్, ప్రస్తుత డెప్యూటి సూపరింటెండెంట్ బాబు విజయకుమార్‌తో సాన్నిహిత్యం పెరిగాక సంపాదనపై దృష్టి సారించారు. ఇద్దరూ కలిసి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడం మొదలెట్టారు. అలా మొదలైన అక్రమ సంపాదన అంతస్తులుగా ఎగబాకింది. ఇళ్లు, ఇళ్లస్థలాలు, అపార్ట్మెంట్లు, పెద్ద సంఖ్యలో భూములు, కోట్ల రూపాయల పెట్టుబడులు, బంగారు, వెండి ఆభరణాలు, కార్లు ఒకటేమిటి అన్నీ సమకూర్చుకున్నారు. తమ ఆస్తులను నమ్మకస్తులైన బినామీల పేరిట పెట్టారు. వీరిద్దరు కలిసి తమ పిల్లలను డైరెక్టర్లుగా చూపుతూ దాదాపు వంద కోట్ల రూపాయల విలువచేసే సూపర్‌స్పెషాల్టీ ఆస్పత్రిని ఆరిలోవలో నిర్మాణాన్ని చేపట్టారు. వీటితో పాటు ఇంకా లెక్కతేలని అక్రమ ఆస్తులున్నట్టు ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. కొంతమంది కాంట్రాక్టర్లతో కలిసి కాంట్రాక్టు పనులు కూడా చేయిస్తున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. గతంలో విజయకుమార్‌కు వైద్యునిగా ప్రాక్టీసు బాగానే ఉండేదని, కొన్నాళ్లుగా అంతగా లేదని వైద్యులు చెబుతున్నారు. గతంలో వివాదాస్పద ఆమ్వే స్కీములోనూ విజయకుమార్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. తమ సోదాల్లో దొరికిన ఆదాయానికి మించిన ఆస్తుల విలువను స్థానిక అధికారులకు కళ్లు బైర్లుకమ్మేలా ఉన్నాయని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఇంకా కొన్ని లాకర్లను శనివారం తెరిచే అవకాశం ఉంది. ఒక్క విజయకుమార్ ఆస్తులే ప్రభుత్వ విలువ ప్రకారం రూ.3.58 కోట్లుగా తేల్చిన అధికారులు ఇందులో 2.63కోట్లు ఆదాయానికి మించిన ఆస్తులుగా గుర్తించారు. ఇంకా నిర్మాణంలో ఉన్న అశ్వని సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికయ్యే పెట్టుబడి ఎంతన్నది తేలాల్సి ఉంది. శనివారం కూడా ఏసీబీ సోదాలు కొనసాగనున్నాయి. మరికొన్ని లాకర్లను తెరవనున్నారు. వాటిలో మరెన్ని ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, బంగారు ఆభరణాలు లభిస్తాయో చూడాలి. ప్రాణస్నేహితులుగా చలామణి అవుతున్న ప్రజారోగ్యశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ పాండురంగారావు, కేజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ విజయకుమార్‌లు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారంటూ ఏకకాలంలో రాష్ట్రంతోపాటు విశాఖ నగరంలోనూ పలుచోట్ల దాడులు నిర్వహించడం ఇటు జీవీఎంసీలోనూ, అటు కేజీహెచ్‌లోనూ తీవ్ర కలకలం రేగింది. వీరిద్దరి అక్రమార్జన వందల కోట్ల రూపాయలున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. -
ఎన్నికల పరిశీలకుడిగా అనిల్ కుమార్
హైదరాబాద్: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పరిశీలకుడిగా నెల్లూరు సిటీ నియోజకవర్గ శాసనసభ్యుడైన పీ. అనిల్ కుమార్‌ను నియమిస్తూ వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అనిల్ కుమార్‌ను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. -
స్వచ్ఛ విశాఖే లక్ష్యం
సాక్షి, విశాఖపట్నం: స్వచ్ఛభారత్ మిషన్‌లో గతేడాది దేశంలోనే 5వ ర్యాంకు సాధించిన విశాఖ నగరాన్ని ఆ ర్యాంకింగ్‌లో ఈ ఏడాది మరింత ముందుకు తీసుకువెళ్లానేది ప్రధాన లక్ష్యమని జీవీఎంసీ కమిషనర్ హరినారాయణ్ అన్నారు. ఐటీడీఎ పీఓగా పనిచేసి పదిహేను రోజుల క్రితం జీవీఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన హరినారాయణ్ గురువారం విశాఖ జర్నలిస్ట్ ఫోరం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవీఎంసీ కోర్ సర్వీసులను నగరంలోని ప్రతి ఒక్కరికీ అందించడానికి శాయశక్తుల కషి చేస్తామని చెప్పారు. దేశంలోనే ఎల్ఈడీ లైట్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన తొలి కార్పొరేషన్‌గా జీవీఎంసీ ఖ్యాతి గడించిందని, రెండో దశలో ఎల్ఈడీలకు స్మార్ట్ కనెక్షన్ ఇచ్చి ఏ బల్బు ఎక్కడ వెలుగుతుందో లేదో తెలుసుకునే సౌకర్యం తీసుకువస్తామని తెలిపారు. విద్యుత్ ఆదాకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వెలగని వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తామరు. శివారు, మారుమూల ప్రాంతాలకు విద్యుత్, తాగునీరు అందిచేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఐఏఎస్ పరీక్షలకు శిక్షణ, పాఠశాల్లో ఈ–ల్యాబ్‌ల ద్వారా విద్యాప్రమాణాలు పెంచుతున్నామన్నారు. స్మార్ట్ సిటీ కాన్సెప్ట్‌లో ఉండే పాన్‌సిటీ (సేవలు), డెవలప్మెంట్(ప్రాంతాల వారీ అభివద్ధి) అనే రెండు భాగాలను అమలు చేస్తున్నట్లు తెలిపారుు. వ్యక్తిగత మరుగుదొడ్లు ఇంకా కొందరికి లేవని, వారిని కూడా ప్రోత్సహించి నిర్మించుకునేలా చేస్తామన్నారు. సెప్టెంబర్‌లో జరిగే బ్రిక్స్ సదస్సు, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే సీఐఐ సదస్సుల వల్ల అంతర్జాతీయంగా విశాఖ ఖ్యాతిని విస్తరించే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. జీవీఎంసీలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ పోస్టు భర్తీ కోసం చీఫ్ సెక్రటరిని కోరామని త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు. కబేలా వల్ల ఎవరికి ఎలాంటి అభ్యంతరాలున్నా తమ వద్దకు వచ్చి తెలియజేయవచ్చన్నారు. నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, భద్రత ప్రమాణాల పెంపు అవసరమని వాటిపైనా చర్యలు తీసుకుంటాని తెలిపారు. ఆక్రమణలు తొలగిస్తామన్నారు. అంతకుముందుగా ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, కార్యదర్శి ఎస్ దుర్గారావుల ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ సభ్యులు కమిషనర్‌ను సన్మానించారు. -
కమిషనర్‌గా హరినారాయణన్ బాధ్యతల స్వీకరణ
∙ద్వారకానగర్: నగర ప్రజల సమస్య పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు జీవీఎంసీ నూతన కమిషనర్ ఎం.హరినారాయణన్ అన్నారు. బుధవారం ఉదయం ఆయన జీవీఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం హెచ్ఓడీలతో సమావేశం నిర్వహించి టీం వర్క్‌తో స్మార్ట్‌సిటీ లక్ష్యాలను కొనసాగించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగర అవసరాలు, ప్రజల ఆశలు, ఆకాంక్షలకనుగుణంగా విశాఖ అభివృద్ధికి కషి చేయనున్నట్టు వివరించారు. అంకితభావంతో పారదర్శకంగా పరిపాలన సాగిస్తానని స్పష్టం చేశారు. నగరం అభివద్ధి పథంలో నడుస్తోందని.. మరింత వేగంగా పరుగులు తీయిద్దామన్నారు. ఏడీసీ (జనరల్) జి.వి.వి.ఎస్.మూర్తి కమిషనర్‌కు స్వాగతం పలికారు. అనంతరం ఆయన అధికారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా పలు యూనియన్ల నాయకులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. -
ఎందుకో.. ‘మహా’ మక్కువ!
ఇతర శాఖల అధికారులకది కామధేనువు కాసులు కురిపించే కల్పతరువు అందుకే జీవీఎంసీపై ఇతర శాఖల అధికారుల మోజు ఇక్కడికి రావడానికి హోదా తగ్గించుకునేందుకైనా సిద్ధం క్యూ కడుతున్న అన్ని శాఖల అధికారులు అదిపురపాలకశాఖలోని ఒక సంస్థ. కానీ ఇప్పుడు దాదాపు అన్ని శాఖల అధికారుల దృష్టి దానిపైనే ఉంది. ఏమైనా సరే.. ఎలా అయినా సరే.. ఒక్కసారి ఆ సంస్థలోకి డిప్యుటేషన్ మీద వెళ్లాల్సిందే!.. అని పలు శాఖల అధికారులు తెగ ఆరాటపడిపోతున్నారు. ఎంతగా తాపత్రయ పడుతున్నా రంటే.. కొందరు ప్రస్తుత తమ స్థాయికితగని పోస్టు అయినా సరే.. ఓకే అంటున్నారు. ఇంత మందిని.. అంతగా ఆకర్షిస్తున్న ఆ సంస్థ.. దాని ప్రత్యేకతలేమిటయ్యా.. అంటే.. అదే మహావిశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ).. కాసులు కురిపించే కామధేనువులాంటి ఈ సంస్థలో కనీసం ఒక ఏడాదైనా పని చేస్తే.. కరువు తీరిపో తుందన్న భావన ఇతర శాఖల అధికారులది. అయితే అలా వచ్చిన వారు ఇక్కడే తిష్ట వేసేస్తున్నారు. విశాఖపట్నం: పురపాలక శాఖలో పనిచేసే అధికారులు, సిబ్బందికే కాదు.. ఇతర శాఖలకు చెందిన వారికి కూడా జీవీఎంసీ కల్పతరువుగా మారుతోంది. ఇక్కడ పని చేసేందుకు ఇతర శాఖల అధికారులు తెగ ఉబలాటపడుతున్నారు. ఏళ్ల తరబడి తిష్టవేసి అందిన కాడికి దండుకుంటూ రెండు చేతులా ఆర్జిస్తున్నారు. జీవీఎంసీలో పనిచేసేందుకు మాతృశాఖకు చెందిన వారి కంటే ఇతర శాఖలకు చెందిన వారే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఈ పరిస్థితి ఏదో ఒక డిపార్టుమెంట్‌కు పరిమితం కాదు. దాదాపు అన్ని శాఖలకు చెందిన వారు జీవీఎంసీకి క్యూ కడుతున్నారు. ముఖ్యంగా ఇంజినీరింగ్ సెక్షన్లో పనిచేసేందుకు పంచాయతీరాజ్, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ విభాగాలకు చెందినవారు పైరవీలకు పాల్పడుతున్నారు. చివరికి హోదాను సైతం తగ్గించుకునేందుకు వెనుకాడటం లేదు. జీవీఎంసీలో వందల కోట్ల విలువైన పనులు జరుగుతుండడం.. ప్రతి పనిలోనూ ఓ పక్క పర్సంటేజీలు.. మరో పక్క భారీగా ముడుపులు అందే అవకాశం ఉండడంతో ఇక్కడ కొద్దికాలమైనా పని చేసే అవకాశం కోసం ఆరాటపడుతున్నవారు.. తీరా ఆ అవకాశం వచ్చిన తర్వాత ఇక్కడే పాతుకుపోతున్నారు. అబ్బే పిల్లల చదువులు, వైద్యం కోసమే! ఇతర శాఖల కంటే జీవీఎంసీలోనే పనిచేసేందుకు ఎందుకు ఆసక్తి చూపుతున్నారని ప్రశ్నిస్తే.. విశాఖలో ఉన్న విద్య, వైద్య సౌకర్యాల కోసమేనని కొందరు సమర్థించుకుంటున్నారు. కానీ వాస్తవం అది కాదన్నది బహిరంగ రహస్యం. అదే వాస్తవమైతే.. నగరంలో ఇంకా చాలా శాఖలు, విభాగాలు ఉన్నా.. ఒక్క జీవీఎంసీకే ఎందుకు క్యూ కడతారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇటువంటి వారందరికీ జీవీఎంసీ కామధేనువులా కన్పిస్తోంది. పిండుకున్న వాడికి పిండుకున్నంత అన్నట్టుగా ఇక్కడి పరిస్థితి ఉంది. ఈ కారణంగానే ఇక్కడ పనిచేసేందుకు ఇతర శాఖల అధికారులు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే ఇక్కడ తిష్ట వేసిన అధికారులను పరిశీలిస్తే.. పంచాయతీరాజ్ శాఖ నుంచి డిప్యుటేషన్‌పై కుమార్ రాజు, కృష్ణకుమార్, వెంకట్రావు, బాలాజీలు జీవీఎంసీకి వచ్చారు. కుమార్రాజు, కృష్ణకుమార్‌లు నాలుగైదేళ్లుగా ఇక్కడే పాతుకుపోయారు. వెంకట్రావు వచ్చి మూడేళ్లు దాటి పోయింది. ఇటీవలే డిప్యుటేషన్‌పై వచ్చిన బాలాజీ కీలకమైన టీఎస్ఆర్ వాటర్ వర్క్స్ ఏఈగా బాధ్యతలు చేపట్టారు. పంచాయతీరాజ్‌లో డిప్యుటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హోదాలో పనిచేస్తుండగా, తమ హోదాను తగ్గించుకుని ఏఈలుగా ఇక్కడ పనిచేసేందుకు వస్తున్నారు. వీరే కాదు.. జీవీఎంసీ రెవెన్యూ, పబ్లిక్‌హెల్త్, ఎడ్యుకేషన్, యూసీడీ, యూజీడీ విభాగాల్లో కూడా ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన పనిచేస్తున్న వారు లెక్కకు మించే ఉన్నారు. జోనల్ కమిషనర్‌గా చక్రధరరావు తాజాగా డిప్యుటేషన్‌పై మరో అధికారి ఇక్కడకు వస్తున్నారు. జిల్లా స్థాయి అధికారిగా పనిచేస్తున్న ఆయన ఇక్కడ జోనల్ కమిషనర్‌గా పని చేసేందుకు వస్తుండటం గమనార్హం. పశ్చిమగోదావరి జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వి.చక్రధరరావును జీవీఎంసీలో జోనల్ కమిషనర్‌గా బదిలీపై నియమించారు. ఈయన మాతృశాఖ సాంఘిక సంక్షేమ శాఖ. ఈయన గతంలో డిప్యుటేషన్‌పై తూర్పుగోదావరి జిల్లా ఆర్వీఎం(సర్వశిక్ష అభియాన్) పీవోగా పనిచేశారు. అక్కడ పనిచేసినంత కాలం ఈయనపై తీవ్ర అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. దుస్తుల కొనుగోలు, అదనపు తరగతి గదుల నిర్మాణంలో సుమారు రూ.5 కోట్లకు పైగా అవినీతి జరిగినట్టు విజిలెన్స్ విచారణలో సైతం గుర్తించినట్టు సమాచారం. ప్రస్తుతం జిల్లా స్థాయి అధికారిగా పనిచేస్తున్న చక్రధరరావు ఇక్కడ ఒక జోన్‌కు కమిషనర్‌గా పనిచేసేందుకు వస్తున్నారు. ఏడాది పాటు ఈయన డిప్యుటేషన్‌కు అనుమతినిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి కరికాల వలవన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా ఇతర శాఖల అధికారులు ఇక్కడ పనిచేయడానికి క్యూ కడుతుండడం చూస్తుంటే జీవీఎంసీ కామధేనువనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. -
క‘న్నీటి’ కుళాయి!
పబ్లిక్ కుళాయిలకు త్వరలో మంగళం వ్యక్తిగత కుళాయి కనెక్షన్ తప్పనిసరి సామాన్యులకు పెను భారం {పజల నెత్తిన రూ.30 కోట్ల భారం {పతి నెలా పన్నుపోటు స్మార్ట్ మంత్రం సంక్షేమాన్ని మాయం చేస్తోంది. ప్రజోపయోగ సేవలకు మంగళం పాడేస్తోంది. విశాఖ మహానగరాన్ని స్మార్ట్ సిటీగా మార్చేస్తామని చెబుతున్న పాలకులు.. అభివృద్ధి మాటేమోగానీ.. ఉన్న సౌకర్యాలను ఊడగొడుతూ సామాన్యుల జీవితాలను దుర్భరం చేస్తున్నారు. వ్యక్తిగత కుళాయిలను తప్పనిసరి చేయాలన్న జీవీఎంసీ ్డనిర్ణయం అటువంటిదే. దీనివల్ల నగరంలోని లక్షలాది కుటుంబాలు తాగునీరు గగనమవుతుంది. సాక్షి, విశాఖపట్నం : వ్యక్తిగత కుళాయిల పేరుతోసామాన్య, మధ్యతరగతి ప్రజలపై పెనుభారం మోపేందుకు జీవీఎంసీ(మహావిశాఖ నగరపాలక సంస్థ) రంగం సిద్ధం చేస్తోంది. ఫలితంగా ఇప్పటివరకు ట్యాంకర్లు, పబ్లిక్ కుళాయిలపై ఆధారపడుతున్న సామాన్య ప్రజలు గొంతు తడుపుకోవడానికి కాసులు వెచ్చించక తప్పదు. విలీన మున్సిపాల్టీలు, పంచాయతీలు కలుపుకొని జీవీఎంసీ పరిధిలో 22 లక్షల జనాభా ఉంది. జనాభా లెక్కల ప్రకారం ఐదున్నర లక్షల కుటుంబాలు ఉండగా.. ఆస్తి పన్ను రికార్డుల ప్రకారం 4.22 లక్షల ఇళ్లు ఉన్నాయి. వీటిలో 1.60 లక్షల ఇళ్లకు మాత్రమే వ్యక్తిగత కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. 4వేల అపార్ట్మెంట్లకు సెమీ బల్క్ కనెక్షన్లు ఉన్నాయి. నగర పరిధిలో 7,500 పబ్లిక్ కుళాయిలు ఉన్నాయి. వీటిపై ఆధారపడుతున్న కుటుంబాలు 2.50 లక్షల వరకు ఉంటాయని అంచనా. వ్యక్తిగత కనెక్షన్లు తప్పనిసరి చేస్తే వీరంతా కుళాయిలు వేయించుకోవాల్సిందే. సామాన్యులకు ఆర్థిక భారం కుళాయి కనెక్షన్ వేయించుకోవాలంటే ఇన్స్టలేషన్ చార్జీల కింద బీపీఎల్ కుటుంబాలకు రూ. 1200, ఏపీఎల్ కుటుంబాలకు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు వసూలు చేస్తున్నారు. మెటీరియల్ ఖర్చులను పూర్తిగా ఎవరికి వారే భరించాలి. ప్రధాన పైపులైన్‌కు ఇంటికి మధ్య ఉన్న దూరాన్ని బట్టి రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు మెటీరియల్ ఖర్చు వస్తుంది. పబ్లిక్ కుళాయి వినియోగించుకుంటున్న కుటుంబాలు లక్షకుపైగా ఉంటే..వారిలో సొంత ఇళ్లు ఉన్న వారు 70వేలకుపైగా ఉంటారని అంచనా. ఇక వ్యక్తిగత కుళాయి కనెక్షన్లు కలిగిన వారిని మినహాయిస్తే ఆస్తిపన్ను అసెస్మెంట్ ప్రకారం మరో 2 లక్షల ఇళ్ల యజమానులు వ్యక్తిగత కుళాయి కనెక్షన్లు వేయించుకోవల్సి ఉంటుందని లెక్కలేస్తున్నారు. వీరిలో లక్షన్నరకు పైగా బీపీఎల్ పరిధిలోనే ఉంటారని చెబుతున్నారు. ఈ లెక్కన సరాసరిన 2లక్షలకు పైగా బీపీఎల్ కుటుంబాలు విధిగా వ్యక్తిగత కుళాయి కనెక్షన్లు వేయించుకోవల్సిన పరి స్థితి ఏర్పడింది. వీరు కనెక్షన్‌కు రూ.1200 చొప్పున చెల్లించడంతో పాటు మరో రూ.వెయ్యికి పైగా మెటీరియల్ చార్జి కింద భరించాలి. అంటే మొత్తం 2లక్షల బీపీఎల్ కుటుంబాలపై ఎంత తక్కువ లెక్కేసుకున్నా రూ.30 కోట్ల మేర భారం పడనుంది. అంతేకాకుండా ప్రతి నెలా రూ.60 చొప్పున కుళాయి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ భారం ఏటా కోటిన్నర పైమాటే. ఇక ఇన్స్టలేషన్, మెటిరీయల్ చార్జీలు కలిపి ఏపీఎల్ కుటుంబాలపై రూ.10 కోట్ల వరకు భారం పడనుండగా. వీరు ప్రతి నెలా రూ.120 చొప్పున పన్నుల రూపంలో రూ.2కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని అంచనా. శివార ప్రాంతాల పరిస్థితి దారుణం పబ్లిక్ కుళాయి కనెక్షన్లను పూర్తిగా తొలగించి వాటి స్థానంలో విధిగా ప్రతి ఇంటికి వ్యక్తిగత కుళాయి కనెక్షన్ వేయాలని జీవీఎంసీ భావిస్తోంది. ఇటీవల కేంద్రం మంజూరు చేసిన ‘అవృత్’ నిధులు రూ.130 కోట్లతో మంచినీటి సరఫరా వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాగా జీవీఎంసీలో విలీనమైన శివారు గ్రామాల కు నేటికీనగర మంచినీటి పథకంతో కనెక్టవిటీ లేదు. వాటర్‌ట్యాంక్‌ల ద్వారానే ఆయా గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలైన గాజువాక, ఎండాడ, మధురవాడ, మారికవలస, బోయపాలెం, కొమ్మాది,పెందుర్తి, చినముషిడివాడ, అడవివరం, సింహాచలం దువ్వాడ, లంకెలపాలెం, దేవాడ, అప్పికొండ, అగనంపూడి, ఐటీ సెజ్, 58, 60, 69 వార్డులకు టౌన్ సప్లయి రిజర్వాయర్ నుంచి ట్యాంకర్ల ద్వారా రోజుకు 367 ట్రిప్పులు సరఫరా చేస్తున్నారు. 189 ఆటోల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. జీవీఎంసీకి నీటిసరఫరా లారీలు 4 ఉండగా, మరో 50 ట్యాంకర్లను అద్దె ప్రాతిపదికన నడుపుతున్నారు. ఈ గ్రామాలకు ఒకపూట నీరు రావడం కూడా కష్టంగా ఉంది. వేసవిలో అయితే వీరి పాట్లు వర్ణనాతీతం. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఆయా గ్రామాలకు అవృత్ పథకం నిధులతో పూర్తి స్థాయిలో పైపులైన్లు వేయాలని నిర్ణయించారు. వ్యక్తిగత కుళాయిల ఏర్పాటు పూర్తి కాగానే పబ్లిక్ కుళాయిలను తొలగించాలని భావిస్తున్నారు. 2017 నాటికి నగరంలో ఎక్కడా పబ్లిక కుళాయినేది కన్పించని పరిస్థితి ఏర్పడనుంది. -
మేనల్లుడికి పోటీ‘యేలేరు’!
ఏలేరు కాలువ పనుల్లో అవినీతి ప్రవాహం ప్రభుత్వ పెద్ద మేనల్లుడి కళ్లలో ఆనందమే లక్ష్యం అందుకోసం ఐదు ముక్కలుగా పనుల విభజన తెర వెనుక మంత్రాంగం నెరుపుతున్న జీవీఎంసీ అధికారి రూ.3 కోట్ల ఈ పనులకు పోటీ రావద్దని కాంట్రాక్టర్లకు హుకుం ఏలేరు కాలువ నిర్వహణ.. ఈ పనులను ఎప్పటినుంచో రెండు భాగాలు (ప్యాకేజీలు)గా విభజించి కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారు. అయితే ఈ ఏడాది దాన్ని మూడు ముక్కలు చేశారు... అంతేనా వచ్చే ఏడాదికి ఐదు ముక్కలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.. ఇలా ముక్కలు చేయడం వెనుక మతలబేంటంటే.. నగరానికి చెందిన ఓ ప్రభుత్వ పెద్ద మేనల్లుడికి మేలు చేయడమే! ఇప్పటికే రూ.కోటి విలువైన పనులను ‘గిఫ్ట్’గా కొట్టేసిన ఆయనగారికి మరింత పెద్ద మొత్తం మేలు చేయడమే ఈ మంత్రాంగం లక్ష్యం. విశాఖపట్నం: ఏలేరు కాలువ నిర్వహణ పనుల్లో ఓ ప్యాకేజీని ప్రభుత్వ పెద్ద మేనల్లుడికి గిఫ్ట్‌గా ఇచ్చేసిన అధికారులు.. తాజాగా అదనపు మేలు చేకూర్చే ప్రయత్నాల్లో పడ్డారు. ఈ పనులను ఎన్నో ఏళ్ల నుంచి రెండు ప్యాకేజీల కింద చేస్తూ వచ్చారు. రూ.2.50 కోట్ల విలువైన ఈ పనులపై ప్రభుత్వ పెద్ద మేనల్లుడి కన్ను పడింది. అయితే చిన్న కాంట్రాక్టరైన ఆయనకు పెద్ద పనులు చేసే అర్హత లేదు. కానీ ‘మేనల్లుడి’ కళ్లలో ఆనందం కోసం ప్రభుత్వ పెద్ద జీవీఎంసీ ఉన్నతాధికారులతో మంతనాలు జరిపి ‘దిశా నిర్దేశం’ చేశారు. అంతే కాలువ నిర్వహణ పనులను రెండు ప్యాకేజీల నుంచి మూడు ప్యాకేజీలుగా ముక్కలు చేసేశారు. వాటిలో ఒక ప్యాకేజీని ‘మేనల్లుడి’కి ఏకపక్షంగా కట్టబెట్టేశారు. ఆ పనులను ఏడాదిగా ఎంజాయ్ చేస్తున్నప్పటికీ మేనల్లుడు సంతృప్తి చెందలేదు. పైగా ఈ డిసెంబర్ 31తో కాంట్రాక్టు గడువు ముగుస్తుండటంతో మళ్లీ టెండర్లు పిలవాలి. ఇదే అదనుగా మరింత విలువైన పనులను ఏకపక్షంగా దక్కించుకోవాలని భావించారు. పోటీకి రావద్దు ఈసారి ఏలేరు కాలువ నిర్వహణ పనుల విలువ రూ.3 కోట్లకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. పనిలో పనిగా ప్రభుత్వ పెద్ద మేనల్లుడికి గరిష్ట ప్రయోజనం కలిగేలా మూడు ప్యాకేజీలుగా ఉన్న పనులను ఐదు ప్యాకేజీలుగా విభజించాలని నిర్ణయించారు. మొత్తం పనులను ఇద్దరు కాంట్రాక్టర్లకే ధారదత్తం చేయాలని నిర్ణయించారు. అలా చేస్తేనే ప్రభుత్వ పెద్ద సమీప బంధువుకు రూ.కోటిన్నర కాంట్రాక్టు కట్టబెట్టవచ్చన్నది పన్నాగం. ఇందులో భాగంగా కొద్ది రోజుల క్రితం జీవీఎంసీ అధికారి ఒకరు కాంట్రాక్టర్లతో అనధికారికంగా ఓ సమావేశం నిర్వహించారు. ఏలేరు కాలువ నిర్వహణ టెండర్లు త్వరలో పిలవనున్న విషయాన్ని వెల్లడిస్తూనే.. వాటి కోసం ఎవరూ టెండర్లు వేయరాదని తేల్చి చెప్పేశారు. ఆ కాంట్రాక్టు తన మేనల్లుడికి వదిలేయాలని ప్రభుత్వ పెద్ద చెప్పారని కూడా వివరించారు. దీనిపై ఒకరిద్దరు కాంట్రాక్టర్లు అభ్యంతరం తెలిపారు. కానీ వారికి ఇతరత్రా కాంట్రాక్టుల్లో సర్దుబాటు చేస్తామని ఏలేరు పనుల జోలికి మాత్రం రావద్దని దాదాపు హుకుం జారీ చేశారు. దాంతో చేసేదేమి లేక వారు సమావేశం నుంచి నిష్ర్కమించారు. కొసమెరుపు ఏమిటంటే.. తన కోసం ఇంత చేసిన సదరు అధికారికి ఆ ‘మేనల్లుడు’ ఖరీదైన వాహనాన్ని కానుకగా ఇచ్చి ఖుషీ చేశారుట... అదీ సంగతి! -
కాలుష్యాన్ని తరిమితేనే.. స్మార్ట్
ట్రాఫిక్ నియంత్రణ మెరుగుపడాలి పారిశుధ్యం అధ్వానం స్మార్ట్ సర్వేలో నెటిజన్ల వాణి విశాఖపట్నం సిటీ: జీవీఎంసీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్‌సిటీ సర్వేలో ‘కాలుష్యాన్ని తరిమికొట్టండి మహాప్రభో’ అంటూ ఎక్కువమంది నెటిజనులు సూచించారు. విశాఖ నగరంలో ఏమేం సదుపాయాలు కావాలో వివరించాలని మైగావ్.ఇన్ వెబ్సైట్లో జీవీఎంసీ కోరడంతో 2023మంది తమ ప్రాధాన్యాలను తెలిపారు. 25 శాతంమంది కాలుష్యం నుంచి విశాఖను రక్షించాలని ప్రాధేయపడ్డారంటే నగర ప్రజలు ఈ సమస్యతో ఎంతగా సతమతమవుతున్నారో అర్థమవుతోంది. స్మార్ట్సిటీపై సెప్టెంబర్ 15వ తేదీ నుంచి నవంబర్ 1వ తేదీ వరకు వివిధ రూపాల్లో ప్రజల అభిప్రాయాలను జీవీఎంసీ సేకరించింది. గరిష్టంగా 5 లక్షలమంది నుంచి అభిప్రాయాలు తీసుకోవాలన్నది లక్ష్యం కాగా దాదాపు 3 లక్షలమంది సర్వే పత్రాల ద్వారా, 2,023మంది వెబ్సైట్ ద్వారా సర్వేలో పాల్గొన్నారు. ముందుగా నెటిజన్ల అభిప్రాయాలను క్రోడీకరించి కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తున్నారు. ఆన్ లైన్ డేటా మేరకు ఎవరెవరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం. కాలుష్యం మహా నగరంలో కాలుష్యం విపరీతంగా ఉందని 25 శాతం మంది అభిప్రాయపడ్డారు. గాలి, నీరు, శబ్ద కాలుష్యాలు తట్టుకోలేని విధంగా ఉన్నాయన్నారు. స్మార్ట్ సిటీలో మొదటి ప్రాధాన్యతగా కాలుష్యాన్ని తుదముట్టించాలని వారు సూచించారు. పరిశుభ్రత దారుణం నగరంలో పారిశుధ్య నిర్వహణ ఏ మాత్రం బాగులేదని 14 శాతం అభిప్రాయపడ్డారు. డ్రైనేజీ వ్యవస్థ, పారిశుధ్య పనులను మెరుగుపరచాలని కోరారు. ట్రాఫిక్/పార్కింగ్ అస్తవ్యస్తం మహా నగరంగా అభివృద్ధి చెందిన తర్వాత ట్రాఫిక్ నిర్వహణ అసలేం బాగోలేదని 13 శాతం మంది అభిప్రాయపడ్డారు. సిగ్నల్ పడినా అధిగమించి వెళ్లే బైక్‌లే అధికంగా ఉంటున్నా పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్నారని ఆరోపించారు. రద్దీని క్రమబద్ధీకరించేందుకు రూట్ మార్చడం వంటి చర్యలు తీసుకోవడంలేదన్నారు. ప్రజా భద్రత/రక్షణ ఏదీ నగరంలో ప్రజలకు భద్రత, రక్షణ లేదని 9 శాతంమంది అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా మహిళలపై దాడులు జరుగుతున్నాయని పే ర్కొన్నారు. ఒంటరిగా వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్‌స్నాచింగ్‌లకు పూనుకుంటున్నారని, ఇలాంటి వారిని అరికట్టేందుకు రక్షణ బృందాల అవసరం వుం దని అభిప్రాయపడ్డారు. వైఫై/ఇంటర్నెట్ నగరం నలుమూలలా ఇంటర్నె ట్, వైఫై కావాలని 6 శాతం మం ది ప్రజలు అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నట్టు ఈ సూచనను బట్టి తెలుస్తోంది. విద్య విద్యాలయాల్లో సదుపాయాలు కల్పించాలని 5 శాతం మంది కోరారు. నగరంలోని దాదాపు అన్ని విద్యాలయాల్లోనూ ఒకే రీతిన సమస్యలున్నాయని ఏకరువు పెట్టారు. ఆరోగ్యం వదిలేశారు 20 లక్షల మంది జనాభా ఉన్న నగరంలో ఆరోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేశారని 4 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. వ్యాధుల బారిన పడ్డ వారికి ప్రాథమిక చికిత్స అందించే సాయం కూడా జీవీఎంసీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా రవాణా మెరుగుపడాలి ప్రజా రవాణా తగినంతగా లేదని 4 శాతంమంది అభిప్రాయపడ్డా రు. రక్షిత మంచినీరు కరువైందని 4 శాతం మంది పేర్కొన్నారు. విద్యుత్/పార్కులు/ఇ గవర్నెన్స్: 24/7 విద్యుత్‌ను 3 శాతంమంది కావాలన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్, పార్కుల నిర్వహణ అ ధ్వానంగా ఉందని 3 శాతం మం ది అభిప్రాయపడ్డారు. ఇ-గవర్నె న్స్ అమలు చేయాలని 2 శాతం మంది కోరుకున్నారు. సంప్రదాయేతర ఇంధన వనరులు కావాలని 1 శాతంమంది కోరారు. -
చెత్త నుంచి విద్యుత్.. స్వచ్ఛ విశాఖే టార్గెట్
♦ కర్మాగారం ఏర్పాటుపై సమీక్ష ♦ సెప్టెంబర్ నాటికి డీపీఆర్ ♦ స్థలం కేటాయించాలన్న ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి విశాఖపట్నం సిటీ : జీవీఎంసీ నుంచి ఉత్పన్నమయ్యే చెత్త నుంచి విద్యుత్ తయారీకి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ అన్నారు. పాత కౌన్సెల్ హాల్లో శనివారం మధ్యాహ్నం జీవీఎంసీ ఉన్నతాధికారులందరితో సమీక్ష నిర్వహించారు. విద్యుత్ కర్మాగారం నిర్మించడానికి అవసరమయ్యే స్థలాన్ని ముందుగానే గుర్తించాల్సిందిగా సూచించారు. నీరు, చెత్త కోసం డెవలపర్స్‌తో అంగీకార పత్రాలను రూపొందించాలని ఆదేశించారు. చెత్త నుంచి విద్యుత్ తయారీ వల్ల నగరంలో నిత్యం పేరుకుపోయే టన్నుల కొద్దీ చెత్తకు పరిష్కారం దొరికినట్టేనని స్పష్టం చేశారు. ఉత్పత్తి అయిన విద్యుత్ స్థానిక అవసరాలు తీర్చడంతో పాటు ఆదాయం కూడా సమకూర్చుకోవచ్చని వెల్లడించారు. ప్రతిపాదనలు సిద్ధం చేసేటప్పుడే అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సెప్టెంబర్ నెలాఖరు నాటికి డీటెయిల్డ్ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) రూపొందించాలని సూచించారు. కమిషనర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నగరంలో చెత్త సమస్య పరిష్కారమైతే స్వచ్ఛ విశాఖ లక్ష్యం నెరవేరినట్టేనని అభిప్రాయపడ్డారు. నగరం నలుమూలలు నుంచీ రోజుకు 800 నుంచి వెయ్యి టన్నుల చెత్త లభ్యమవుతుందని చెప్పారు. ప్రాజెక్టు అవసరాలకు అవసరమైన నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటిస్తూ అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా సూపరింటెండెంగ్ ఇంజినీర్‌ను ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ పరిపాలన సంచాలకులు కన్నబాబు, స్వచ్చాంధ్ర కార్పోరేషన్ సంచాలకులు మురళీధర్, నెడ్‌క్యాప్ సంచాలకులు కమలాకరబాబు, కేపీఎంజీ ప్రతినిధి ఉదయ్, జీవీఎంసీ అదనపు కమిషనర్ ఎన్. మోహన్‌రావు, చీఫ్ ఇంజినీర్ దుర్గాప్రసాద్, సీఎంఓహెచ్ డాక్టర్ మురళీమోహన్, పర్యవేక్షక ఇంజినీర్లు పాల్గొన్నారు. -
రేటును బట్టే సీటు
తహశీల్దార్ బదిలీల్లో అవినీతిపర్వం చక్రం తిప్పిన కీలక నేత బంధువు ‘ఇది కౌన్సెలింగ్‌ల సీజన్... రేటును బట్టే సీటు అని ‘గంట’ మోగించి మరీ చెబుతున్నారు ఓ కీలక నేత. కాలేజీల్లో మేనేజ్మెంట్ సీట్లకే కాదు తహశీల్దార్ పోస్టులకు కూడా అదే నీతిని వర్తింపజేస్తున్నారు ఆయన సమీప బంధువు. జిల్లాలో తహశీల్దార్ల బదిలీల్లో సర్వం తానై చక్రం తిప్పుతున్నారు ఆయన. ఆయన చెప్పిన ప్రకారమే ఉన్నతాధికారులు కూడా జీహుజూర్ అంటున్నారు. -సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలో ప్రభుత్వ వ్యవహారాల్లో చక్రం తిప్పుతున్న ఓ కీలక నేతకు ఆయన సమీప బంధువు. ఆ కీలక నేత రాజకీయ, వ్యాపార వ్యవహారాలకు ఓ రకంగా చెప్పాలంటే పవార్ ఆఫ్ అటర్నీ పొందినట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా తహశీల్దార్ల బదిలీల్లో ఆయన చెప్పిందే వేదంగా సాగిందని రెవెన్యూ వర్గాలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నాయి. రెండు తప్పా అన్ని పోస్టింగులు ఆయన చెప్పినట్లే ఇచ్చారని తెలుస్తోంది. అందుకు అనువుగా తమ వర్గంలోని ప్రజాప్రతినిధులతో మాట్లాడి ‘ఉభయతారకంగా’ అంతా సర్దుబాటు చేసేశారు. జీవీఎంసీ పరిధిలోనే కాకుండా రూరల్ జిల్లా పరిధిలోనూ ఆయన అనుకున్నట్లుగానే బదిలీల ప్రహసనంగా సాగింది. దాదాపు వేలమే..!: ఆ కీలక నేత బంధువు ముందే వేసుకున్న పక్కా ప్రణాళిక ప్రకారం కథ నడిపారు. తమ నియోజకవర్గ పరిధిలోని పోస్టుకు దాదాపు వేలంపాట మాదిరిగా వ్యవహారం సాగించారు. ఆ మండల పరిధిలో పెద్ద ఎత్తున వివిధ ప్రాజెక్టులు, సంస్థలు రానున్నాయి. భారీ భూసేకరణ ప్రక్రియ చేపట్టనున్నారు. దాంతో పలువురు అధికారులు ఆ పోస్టు కోసం కీలక నేత సమీప బంధువును కలిశారు. ఇదే అదనుగా ఆశావాహుల మధ్య పోటీ పెంచి జేబులు నింపుకున్నారని తెలుస్తోంది. తాజా బదిలీల్లో అత్యధికంగా ఆ పోస్టుకే చెల్లించడం గమనార్హం. త్వరలో విశాఖ - చెన్నై కారిడార్ కోసం భారీ భూసేకరణ జరగనున్న రెండు కీలక మండలాల పోస్టింగుల కోసం కూడా అధికంగా ఆ కీలక నేత బంధువుకు ముట్టజెప్పుకోవాల్సి వచ్చింది. వ్యూహాత్మకంగా తమకు అనుకూలమైన అధికారులను అక్కడ పోస్టింగు వేయించుకున్నారు. మరో భారీ ప్రాజెక్టు రానున్న ఓ మండలంలో పోస్టింగు కోసం కూడా కీలక నేత బంధువు పెద్ద మొత్తమే డిమండ్ చేసి రాబట్టుకున్నారు. రెండో దశపై మరింత గురి: జిల్లాలో కీలకమైన రెవెన్యూ విభాగంలో తమ అనుయాయులు ఉండేలా కీలక నేత వ్యూహం పన్నారు. తొలి దశ బదిలీల్లో అంతా తాము అనుకున్నట్లే సాగడంతో రెండో దశపై గురిపెట్టారు. అందుకోసం ఇప్పటికే అనుకున్న రేటు చెల్లించడంతోపాటు తమకు అనుకూలంగా ఉండే వారి జాబితాను సిద్ధం చేసేపనిలో నిమగ్నమయ్యారు. జిల్లా ఉన్నతాధికారులు కూడా కీలక నేతకు తందాన అంటుంటంతో రెవెన్యూ యంత్రాంగం దాదాపుగా నిర్వీర్యమైపోంందని ఉద్యోగవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
అయిదో రోజుకు కార్మికుల సమ్మె
- మంత్రి గంటాతో తేలని చర్చలు - సమ్మె విరమించేదిలేదన్న జేఏసీ నేతలు - నేటి నుంచి ప్రత్యామ్నాయ చర్యలు:కమిషనరు విశాఖపట్నం సిటీ : మహా నగరపాలక సంస్థలో పారిశుధ్య కార్మికుల సమ్మె మంగళవారానికి అయిదో రోజుకు చేరింది. ఔట్సోర్సింగ్,పారిశుధ్య కార్మికుల సమ్మె అయిదు రోజులుగా జరుగుతుంటే వారికి మద్దతుగా చేపట్టిన రెగ్యులర్ ఉద్యోగుల సమ్మె 010 పద్దు జీతాల కోసం చేపట్టారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సమ్మె ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలకు చెందినదని, జీవీఎంసీలో జరుగుతున్న సమ్మెతోపాటు రెగ్యులర్ ఉద్యోగులకు 010 పద్దులో జీతాలు ఇవ్వాలనే డిమాండ్ కూడా ఉందని జేఏసీ నేతలు స్పష్టం చేశారు.విశాఖలోనే తమ జీతాలు 010 పద్దులో ఇవ్వడం లేదని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఇస్తున్నారని గుర్తింపు కార్మిక సంఘం స్పష్టంచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె విరమించినా తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె విరమించే అవకాశమే లేదంటున్నారు. తూతూ మంత్రంగా మంత్రి గంటా చర్చలు మంత్రి గంటా శ్రీనివాసరావు జేఏసీ నేతలందరితో సమావేశం ఏర్పాటు చేశారు. కమిషనర్ ప్రవీణ్‌కుమార్ ఛాంబర్లో గంట పాటు చర్చలు జరిపారు. ఆశించిన ప్రకటన మంత్రి చేయలేదు. దీంతో చర్చల్లో ఏమీ తేలలేదు. పని చే సే వారికి అడ్డుపడొద్దని మంత్రి గంటా శ్రీనివాసరావు మున్సిపల్ జేఏసీ నేతలకు సూచించారు. కమిషనర్ ఛాంబర్లో మంగళవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ సమ్మె విష యం మున్సిపల్, ఆర్ధిక శాఖ మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ఎవరూ అడ్డుపడొద్దని సూచించారు. ఆగ్రహంగా కమిషనర్ ప్రవీణ్..! కమిషనర్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహంగా కనిపించారు. సమ్మె తీవ్ర రూపం దాల్చడంతో పాటు ప్రైవేట్ కాంట్రాక్టర్లు తీసుకొచ్చిన పారిశుద్ద్య కార్మికులకు, మున్సిపల్ పారిశుద్ద్య కార్మికులకు మధ్య మంగళవారం పలు చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత వతావరణం ఏర్పడేందుకు కమిషనర్ చర్యలే కారణమంటూ జేఏసీ నేతలు ఆరోపించడంతో కమిషనర్ మరింత ఆగ్రహంతో ఉన్నారు. మంత్రి గంటా చర్చలప్పుడు కూడా కమిషనర్ ఆగ్రహంతోనే కార్మికులనుద్దేశించి మాట్లాడారు. ఒకటి రెండు చోట్ల కమిషనర్‌కు జేఏసీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రతీ నెలా జీతాలు ఇవ్వలేం..! రూ. 2 వేల కన్నా అదనంగా పారిశుద్ద్య కార్మికులకు జీతాలు పెంచితే జీవీఎంసీ ప్రతీ నెలా క్రమం తప్పకుండా జీతాలు చెల్లించలేదని జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం జీవీఎంసీకి వచ్చే ఆ దాయం రూ. 550 కోట్లు అయితే అందులో ప్రతీ ఏటా జీతాలు, పెన్షన్లు కోసం రూ. 250 కోట్లు ఖర్చు చేస్తున్నామని జీతాలు పెంచితే రూ. 321 కోట్లకు బడ్జెట్ పెరుగుతుందని వివరించారు. వ్యాధులు ప్రబలకుం డా అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, స్వచ్చంద సంస్థల సహకారంతో బుధవారం నుంచి చెత్తలు తొలగించనున్నట్లు ప్రకటించారు. 400 మంది ప్రైవేట్ వర్కర్లు, 25 జేసీబీలు, 52 లారీలు, 36 మంది డ్రైవర్లను రంగంలోకి దించి చెత్తను తొలగిస్తామన్నారు. రెచ్చగొడితే ఊరుకోం పారిశుద్ద్య కార్మికుల పని ఎవరైనా చేయొచ్చని అయితే రెచ్చగొడితే మాత్రం ఊరుకునేది లేదని జీవీఎంసీ గుర్తింపు కార్మిక సంఘం సెక్రటరీ జనరల్ వివి వామన రావు స్పష్టం చేశారు. అఖిల పక్ష నేతలందరితో కలిసి ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సోమవారం అర్ధరాత్రి నుంచీ జీవీఎంసీలో అంతా సమ్మెలోకి వచ్చినట్టయ్యిందని చెప్పారు. తాగునీరు, వీధి లైట్లు తప్పా మిగిలిన అత్యవసర పనుల్లో దేనికీ కార్మికులు హాజరు కావడం లేదన్నారు. 010 పద్దుతో జీతాలు వచ్చే వరకూ సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. -
ప్రతిభకు మహా కోత
- విద్యశ్రీ పథకం కింద అర్హత పాయింట్ల పెంపు - తక్కువ మందికి పరిమితమైన పథకం - కలవరపడుతున్న పేద విద్యార్థులు విశాఖపట్నం సిటీ : ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన ప్రతిభావంతులైన పేదింటి విద్యార్థులకిచ్చే ప్రోత్సాహానికి జీవీఎంసీ కోత విధిస్తోంది. కాసుల భారమంటూ ఈ పథకాన్ని కుదించేస్తోంది. మహా విశాఖ నగర పాలక సంస్థ(జీవీఎంసీ) పాఠశాలల్లో చదివిన విద్యార్ధులను ఉన్నత చదువులకు ప్రోత్సహించేందుకు విద్యశ్రీ పథకాన్ని అయిదేళ్ల క్రితం ప్రారంభించింది. ఇందుకోసం జీవీఎంసీలో ఓ ప్రత్యేక విభాగం వుంది. ఈ పథకంలో లబ్ధికి ఏటా వందలాది మంది విద్యార్ధులు ఎంపికవుతున్నారు. వీరికి కార్పొరేట్ కాలేజీల్లో విద్యతో బాటు ఉచితంగా పుస్తకాలు, దుస్తులు అందిస్తున్నారు. దీంతో ప్రభు త్వ పాఠశాలల్లో విద్యను ప్రోత్సహించవచ్చని ప్రభుత్వం భావించి ఆ మేరకు నిర్ణయాన్ని అమలు చేస్తోంది. టెన్తులో 500మార్కులు దాటినవారు దీనికి అర్హత పొందేవారు. జీపీఎ విధానమొచ్చాక గతేడాది పదోతరగతిలో 7.5 గ్రేడ్ పాయిం ట్లు సాధించిన విద్యార్ధులను కార్పోరేట్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించారు. 327 మందికి రూ. 37 లక్షలు జీవీఎంసీ విద్యశ్రీ కింద చెల్లించింది. అయితే అర్హుల సంఖ్య పెరిగిపోతోందని భావించిన జీవీఎంసీ ఇప్పుడు భారీగా కోత పెట్టేందుకు సమాయత్తమయ్యింది. 2015 ఫలితాల్లో 9 ప్లస్ గ్రేడ్ పాయింట్లు సాధించిన వారు మాత్రమే అర్హులని ప్రకటించేయడంతో పేద, మధ్య తరగతి విద్యార్దులంతా నిరాశకు గురయ్యారు. 9 ప్లస్ గ్రేడ్ పాయింట్లు అంటే జీవీఎంసీ పాఠశాలల్లో చదివే అతి కొద్ది మందికే సాధ్యం. చాలీచాలనీ కూలీతో పిల్లలను బడికి పంపడమే తమ కుటుంబాల్లో తక్కువని అలాంటి వారికి అన్ని గ్రేడ్ పాయింట్లు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు. భీమిలి, అనకాపల్లితో కలిపి జీవీఎంసీ పరిధిలో 27 పాఠశాలల్లో చదివిన వారిలో 9 గ్రేడ్పాయింట్లకు పైగా మార్కులు సాధించిన వారు 50 మంది వరకూ ఉన్నారు. అందులో పాలిటెక్నిక్, ఐటీఐ వంటి కోర్సులకు పోయేవారు ఎక్కువగానే ఉంటారు. ఇంటర్మీడియట్ చదివే వారు అరుదుగా వుంటారని అందుకే కనీసం 8 గ్రేడ్‌పాయింట్ల కైనా అర్హత మార్కులను కుదించాలని కోరుతున్నారు. -
కోతల సర్కార్
పింఛన్.. పరేషాన్.. భరోసా లేని పేదల బతుకులు వెంటాడుతున్న నాటి పీడకలలు పింఛన్.. గతి లేని బతుకులకు చేయూత. వృద్ధులు, వికలాంగులు, వితంతువుల వంటి అభాగ్యులకు ఆసరా. గట్టిగా అడగలేరని కాబోలు చంద్రబాబు సర్కారులో అలాంటి నిస్సహాయులకే అన్యాయం జరుగుతోంది. పెన్షన్ మొత్తాన్ని ఐదు రెట్లు పెంచామని ప్రకటించుకున్న సర్కార్ అసలుకే ఎసరు పెడుతోంది. బయోమెట్రిక్, ఆధార్ సీడింగ్, డోర్‌లాక్, వలసలు, ఆస్తిపాస్తులున్నాయని జన్మభూమి కమిటీ నివేదికలు... ఇలా ఎన్నో సాకులతో సంక్షేమానికి కోత విధిస్తోంది. పింఛనుదార్ల సంఖ్య గణనీయంగా తగ్గడమే కాదు గత అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క నెలలోనూ ఏ ఒక్కరికి మొదటి రోజున పింఛను ఇచ్చిన దాఖలాలు లేవు. గత పాలనలో ఎవరైనా చనిపోతేనే పెన్షన్ మంజూరు చేసిన చంద్రబాబు నైజం గుర్తుకు వచ్చి అందరిలో భయాందోళన నెలకొంది. సాక్షి, విశాఖపట్నం : టీడీపీ అధికారంలోకి వచ్చే నాటికి జిల్లాలో 3.19 లక్షలకు పైగా పింఛన్లుండేవి. కానీ నేడు అవి 3.05 లక్షలకు తగ్గిపోయాయి. ఒక్క జీవీఎంసీలో ఏకంగా 62వేల పింఛన్లు ఉండేవి. కానీ నేడు కేవలం 53,596కు కుదించేశారు. ఈ లెక్కన జిల్లాలో 15వేలకు పైగా కోతపెడితే ఒక్క జీవీఎంసీపరిధిలోనే అత్యధికంగా 9వేల పింఛన్లకు కోతపెట్టారు. గతంలో టీడీపీ పాలనలో రూ.75 పింఛన్ ఇచ్చేందుకు నానా అగచాట్లు పెట్టేవారు. ఆ రోజుల్లో ఎవరైనా కొత్త పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఉన్న వారిలో ఎవరైనా చనిపోతే అప్పుడు చూద్దాం... అంటూ హేళనగా మాట్లాడిన సందర్భాలున్నాయి. మళ్లీ ఆ దుస్థితి నిర్భాగ్యుల కళ్లెదుట కదలాడుతోంది. పింఛన్ మొత్తాన్ని ఐదురెట్లు పెంచామని ప్రకటించుకున్న సర్కార్ గత అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క నెలలోనూ ఏ ఒక్కరికి మొదటి రోజున పింఛను ఇచ్చిన దాఖలాలు లేవు. ఎప్పుడు అందుతుందో..అసలు అందుతుందో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో నిరుపేదలు ఆందోళనలో ఉన్నారు. ‘కోత’లకు సాకులెన్నో... వేలిముద్రలు పడడంలేదు..ఐరిష్ కాప్చర్ కావడం లేదంటూ లబ్దిదారులను ఒకటికి పదిసార్లు తిప్పించుకోవడం ఆనక వారిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి క్రమంగా తొలగించడం సర్కారుకు పరమావధిగా మారింది. ఇలా మూడు నెలలు క్రమం తప్పకుండా తీసుకోలేని పింఛన్‌దారుల పేర్లను జాబితాల నుంచి తొలగిస్తున్నారు. ఈ విధంగా మూడు నెలలుగా పింఛన్లు తీసుకోలేని మరో 7,229 మందిని తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు. జూన్లలో కొత్తగా పింఛన్లు మంజూరు చేశామని....వీటిని జన్మభూమి మావూరు గ్రామసభల్లో పంచిపెడతామని సర్కార్ ప్రకటించింది. కానీ కొత్తగా పింఛన్లు మంజూరు చేస్తే ఉన్న సంఖ్య పెరగాల్సింది పోయి తగ్గిపోయింది. ఇవీ గణాంకాలు... గత నెలలో 3,09, 905 మందికి పింఛన్లు మంజూరు చేయగా, జూన్‌లో ఈ సంఖ్య 3,05,988కి పడిపోయింది. అంటే ఒక్క నెలలోనే 4వేల పింఛన్లకు కోతపడి ంది. ఇక ఏ విధంగా కొత్తగా పింఛన్లు మంజూరు చేశారో అధికారులే చెప్పాలి. ప్రసుతం వృద్ధాప్య పింఛన్ల సంఖ్య 1,49,691కి చేరింది. వితంతు పింఛన్ల సంఖ్య 1,15,371కు చేరింది. ఇక వికలాంగుల పింఛన్లు 37,990 ఉండేవి. కానీ నేడు 32,404 పింఛన్లకు తగ్గిపోయాయి. ఇలా ఏ విధంగా చూసినా పింఛన్లకు కోత పడింది. గతేడాది ఆధార్ సీడింగ్, డోర్‌లాక్, వలసలు,ఆస్తిపాస్తులున్నాయని జన్మభూమి కమిటీ తనిఖీల్లో గుర్తించామనే సాకుతో పింఛన్లలో భారీగా కోత పెట్టిన సర్కార్ ఆ తర్వాత రోల్‌బ్యాక్ పేరుతో జీవీఎంసీ పరిధిలో 2,158, రూరల్ పరిధిలో 3,410 పింఛన్లను పునరుద్ధరించారు. లక్షల్లో దరఖాస్తులు, వేలల్లో గుర్తింపు... గతేడాది జన్మభూమి మావూరుతో పాటు మండల, జిల్లా స్థాయి గ్రీవెన్స్ అర్జీల్లో 3.54 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే వారిలో 44వేల మంది అర్హులని అధికారులు గుర్తించారు. అయితే జన్మభూమి కమిటీలు మరో 20వేలకు కోత పెట్టి 24 వేల మందికే సిఫార్సు చేశాయి. వీటిలో 12,500 పింఛన్లు మాత్రమే ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. వీటిలో జీవీఎంసీ పరిధిలో 4,623, రూరల్ పరిధిలో 8,200 మాత్రమే మంజూరు చేశారు. వీటితో కలుపుకొని జూన్‌లో 3,05,988 పింఛన్లు మంజూరు చేశారు. ఇంకొక చిత్రమేమిటంటే కొత్తగా పింఛన్లు మంజూరు చేసినప్పుడు బడ్జెట్ కేటాయింపులు పెరగాలి. కానీ మేలో రూ. 34.76 కోట్లు జిల్లాకు కేటాయిస్తే, జూన్‌లో ఈ మొత్తం రూ.32.92 కోట్లకు కుదించారు. ప్రభుత్వం మా ఉసురు పోసుకుంది.. గత ప్రభుత్వ హయాంలో రూ.60, తరువాత రూ.200 పించను వచ్చేది. ముగ్గురు కొడుకులున్నా కూలిపనులు లేకపోవడంతో వారికడుపే నిండడం కష్టంగా ఉంది. ఇపుడు టీడీపీ ప్రభుత్వం వచ్చాక మా ఉసురు పోసుకుంది. పించను ఆపేసింది. గతంలో గొప్పగా బతికేవాళ్లమని తెలియడం కోసం తెల్లచొక్కా తొడుక్కుంటున్నా లోపల మాత్రం చిరుగులే. నా వయసు ఎనభై పైబడుతుంది. ఈ వయసులో పించను ఆపేయడంతో దిక్కు తోచడం లేదు. పించను తొలగించకుండా ఉంటే కొండంత ఆసరాగా ఉండేది. ప్రభుత్వం ఇపుడా ఆశ కూడా లేకుండా చేసింది. -కె.పైడన్న, భీమిలి మండలం కదల్లేకపోయినా కనికరం లేదు.. పెందుర్తి మండలంలోని రాంపురం పంచాయితీ బాపూజీనగర్‌కు చెంది న కేసుబోయిన రాజశేఖర్(19)కు కాళ్ళు పనిచేయవు. మాటలు రావు. కళ్ళు కూడా సరిగా కనపడవు. తల్లిదండ్రులు అప్పారావు, లక్ష్మి కూలి పనులు చేసుకుంటున్నారు. చిన్నపాటి గుడిసెలో నివాసం ఉంటున్నారు. కేజీహెచ్‌లో నిర్వహించిన సదరం క్యాంప్‌లో డాక్టర్లు ఇతడ్ని 90 శాతం వికలాంగుడిగా నిర్ధారించి సర్టిఫికేట్ ఇచ్చారు. దీని ఆధారంగా ప్రభుత్వం ఇచ్చే వికలాంగ పింఛన్‌కు దరఖాస్తు చేశారు. జన్మభూమి కమిటీ, స్థానిక నాయకులు, జిల్లా ఉన్నతాధికారుల చుట్టూ తిరిగినా ఫలితం శూన్యం. అన్ని అర్హతలు ఉండి కూడా పింఛన్ మంజూరు కావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలి కెళ్లాల్సి వస్తోంది... టీడీపీ ప్రభుత్వం రాకముందు ప్రతి నెల రూ.200 పింఛన్ సొమ్ము అందేది. దీంతో కొంత భరోసా ఉండేది. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఉన్న పింఛను కాస్తా తీసేశారు. నా పేరు మీద 6 ఎకరాల భూమి ఉందని పింఛను తీసేశారు. నిజానికి నా పేరు మీద భూమి ఉన్నా అది సాగులోకి లేదు. నిరుపయోగంగా ఉంది. భూములన్నీ నా కుమారుల ఆధీనంలోనే ఉన్నాయి. నేను ఒంటరిగానే నివసిస్తున్నాను. ఈ ఏడాది జనవరి నెల నుంచి పింఛన్ సొమ్ము ఇవ్వడం లేదు. ప్రస్తుతం నాకు 65 ఏళ్ళు నిండింది. ఈ వయస్సులో కూడా కూలిపనులు చేసుకోవాల్సి వస్తుంది. -బార్జా రాములమ్మ, దబ్బాపుట్టు, పాడేరు మండలం -
జీవీఎంసీ ఆదాయానికి బీపీ‘ఎస్’
- అనధికారిక భవనాల క్రమబద్ధీకరణ - 10 వేల దరఖాస్తులొస్తాయని అంచనా - రెండు మాసాల గడువు విశాఖపట్నం సిటీ : గ్రేటర్ విశాఖ పరిధిలో అక్రమ నిర్మాణాలను అపరాధ రుసుంతో క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. 2014 డిసెంబర్ 31వ తేదీని కటాఫ్‌గా నిర్ణయించింది. ఆలోగా నిర్మించుకున్న భవనాల అతిక్రమణలను క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కల్పించింది. వాణిజ్య భవనాలు, నివాస భవనాలు, నివాసేతర భవన యజమానులకు ఇది ఉపశమనమి చ్చే సమాచారం. ఇందుకు రెండు మాసాల గడువు ఇచ్చింది. బుధవారం నుంచీ బీపీఎస్.ఏపీ.జీవోవి.ఇన్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దరఖాస్తులు జీవీఎంసీకి వచ్చిపడుతున్నాయి. రెండు రోజుల్లోనే సుమారు 50 మంది దరఖాస్తు చేసుకున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జీవీఎంసీలో ఈసారి 10 వేల భవనాలకు సంబంధించి దరఖాస్తులు వస్తాయని పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు భావిస్తున్నారు. గతంలో 23 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో17 వేల దరఖాస్తులను పరిష్కరించారు. అయిదారు వేల భవనాలుండిపోయాయి. గెడ్డలు ఆక్రమించి కట్టేయడం, ప్రభుత్వ భూముల్లో నిర్మించేయడం, రోడ్లు లేకుండా నిర్మాణాలు చేసేయడం వంటి సమస్యలతోపాటు సాంకేతిక అడ్డంకులున్న భవనాలకు అనుమతి ఇవ్వలేదు. ఆ భవనాలను క్రమబద్ధీకరించలేదు. ఈ సారి కొత్తగా 10 వేల ద రఖాస్తులు మాత్రమే వస్తాయని అంచనా. వీటి వల్ల జీవీఎంసీకి రూ. 50 కోట్ల ఆదాయం సమకూరే అవకాశముందని భావిస్తున్నారు. దరఖాస్తు ఇలా: - ఆన్లైన్లో దరఖాస్తుతో పాటు రూ.10 వేల ఫీజును సౌకర్యంలో గానీ, మీ-సేవలో గానీ చెల్లించాలి. లేదా నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ ద్వారా చెల్లించవచ్చు. - నిబంధనలు అతిక్రమించిన నిర్మించిన మొత్తం స్థలానికి అపరాధ రుసుం లెక్కిస్తారు. 30 రోజుల్లో దీనిని చెల్లించవచ్చు. లేదా దరఖాస్తుతో బాటు చెల్లించవచ్చు - దర ఖాస్తు తిరస్కరిస్తే జరిమానాలో 10 శాతాన్ని మినహాయించుకుని మిగిలింది వాపసు చేస్తారు. - మురికివాడల్లోని భవనాలకు 50 శాతం అపరాధ రుసుం మినహాయింపు అమల్లో ఉంది. - దరఖాస్తుతోపాటు రూ. 10 వేలు చెల్లించిన రశీదు, దస్తావేజులు, ప్లాన్ కాపీ,తాజా పన్ను కాపీ, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఉంటే ఇలవవ్వచ్చు లేదా అగ్నిమాపక శాఖ జారీ చేసిన సర్టిఫికెట్, స్ట్రక్చరల్ ఇంజనీర్ భవన ధృఢత్వం తెలిపే సర్టిఫికెట్ వంటి వన్నీ జతచేయాలి. ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి అనుమతి పత్రం కూడా జత చేయాలి. -
ఈ సారైనా.. పాస్ అయ్యేనా?
ఈ పద్ధతిలో జిల్లాలో 2 లక్షల మందికే సరకులు 6.5 లక్షల మందికి పాతపద్ధతిలోనే పంపిణీ మే 1 నుంచి ఏజెన్సీలో కూడా అమలు సాక్షి, విశాఖపట్నం : ఈ-పాస్ విధానం జిల్లాలో తుస్సుమంది. అధికారులను.. డీలర్లను ముప్పుతిప్పలు పెట్టింది. ఇక సామాన్యప్రజల సహనానికి పరీక్షగా నిలిచింది. ప్రారంభించిన తొలి నెలలో నాలుగో వంతు మందికి మించి ఈ మెషీన్ల ద్వారా సరకులు అందించలేని దుస్థితి ఏర్పడింది. మిగిలిన వారికి పాతపద్ధతిలోనే సరకులు పంపిణీ పూర్తి చేయడంతో గండం గడిచి పిండం బయట పడినట్టయ్యింది. జిల్లాలో జీవీఎంసీ పరిధిలోని 412, భీమిలి, అనకాపల్లి, యలమంచలి, నర్సీపట్నం మున్సిపాల్టీల పరిధిలో 274 రేషన్‌షాపులో ఈ నెల 1వ తేదీ నుంచి ఈ-పాస్ (ఎలక్ట్రానిక్ పేమెంట్ అండ్ అప్లికేషన్ సిస్టమ్) విధానానికి శ్రీకారం చుట్టారు. తొలి రోజు నుంచి దాదాపు అన్ని షాపుల్లోనూ సర్వర్లు డౌన్ అయిపోవడం, సెల్నెట్వర్క్ సిగ్నెల్స్ పనిచేయకపోవడం, మెషీన్లు మొరాయించడం వంటి సమస్యలతో పంపిణీలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. రోజుకు పట్టుమని పదిమందికి కూడా సరఫరా చేయలేకపోయేవారు. ఈ విధానం ద్వారా పంపిణీ మా వల్ల కాదని, పాతపద్ధతిలోనే పంపిణీ చేస్తామని డీలర్లు చెప్పడం.. ఏదేమైనా ఈ పాస్ ద్వారానే పంపిణీ చేయాలని అధికారులు ఒత్తిడి తీసుకురావడంతో 15వ తేదీ వరకు కనీసం జిల్లాలో 20 శాతం మంది కార్డుదారులకు కూడా సరకులు పంపిణీచేయలేకపోయారు. చివరకు క్షేత్ర స్థాయి సాంకేతిక సమస్యలను గుర్తించిన యంత్రాంగం ఈ నెల వరకు పాతపద్ధతి (డిజిటల్ కీ రిజిస్ట్రర్)లోనే పంపిణీ చేసేందుకు గ్రీన్సిగ్నెల్ఇచ్చింది. రెండు రోజుల గడువు పెంచింది. దీంతో 20వ తేదీ నాటికి కిరోసిన్ మినహా మిగిలిన నిత్యావసరాల పంపిణీని పూర్తి చేయగలిగారు. కిరోసిన్‌ను మాత్రం ఈనెల 25వ తేదీ వరకు పంపిణీ చేసేందుకు గడువు ఇచ్చారు. కె.కోటపాడు, బుచ్చియ్యపేటల్లో ఒక్కొక్కరికే.. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన ఈ పాస్ మెషీన్ల ద్వారా 2,09,982 కార్డులకు మాత్రమే పంపిణీ చేయగలిగారు. మిగిలిన6,26,548 మందికి పాతపద్ధతిలోనే పంపిణీ చేశారు. జీవీఎంసీ పరిధిలో 412 షాపుల పరిధిలో 3,68,496 కార్డుదారులుండగా, కేవలం 86,311 కార్డులకు మాత్రమే ఈపాస్ విధానంలో సరకులు పంపిణీ చేయగలిగారు. మిగిలిన 2,70,419 కార్డుదారులకు పాతపద్ధతిలోనే పంపిణీ చేయగలిగారు. అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం, భీమిలి మున్సిపాలిటీలతో పాటు పెందుర్తి, బుచ్చెయ్యపేట, కె.కోటపాడు, ఆనందపురం, పరవాడ మండలాల్లో 274 షాపుల పరిధిలో 4,68,034 కార్డుదారులకు ఈ పాస్ ద్వారా పంపిణీ చేయాల్సి ఉండగా, 1,23,671 కార్డుదారులకు మాత్రమే పంపిణీ చేయగలిగారు. మిగిలిన 3,44,363 కార్డుదారులకు పాతపద్ధతిలోనే పంపిణీ చేశారు. ఈ-పాస్ ద్వారా జీవీఎంసీ పరిధిలో 23.72 శాతం మందికి, ఇతర మున్సిపాల్టీలతో పాటు ఎంపిక చేసిన మండలాల్లో 26.42శాతం మందికి సరకులు ఇవ్వగలిగారు. బుచ్చియ్య పేటలో 272, కె.కోటపాడులో 501 కార్డుదారులకు పంపిణీ చేయాల్సి ఉండగా, కేవలం ఒక్కొక్కరికి మాత్రమే ఈపాస్ద్వారా పంపిణీ చేయగలిగారు. విశాఖపట్నం రూరల్-2లో కూడా 17 మందికి మాత్రమే పంపిణీ చేశారు. మెషీన్ల పనితీరుపై టెస్టింగ్ డ్రైవ్ వచ్చేనెలలో ఈ పరిస్థితిని అధిగమించేందుకు గురవారం నుంచి ఈ పాస్ మెషీన్ల పనితీరుపై ప్రత్యేకంగా టెస్టింగ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మరో పక్క ఏజెన్సీలో పరిధిలో జీసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డీఆర్ డిపోల్లో కూడా మే 1వ తేదీ నుంచి ఈ పాస్ ద్వారా సరుకుల పంపిణీ చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. తొలినెలలో ఎదురైనా అవరోధాలను అధిగమించేందుకు ఇకనైనా పగడ్బందీ చర్యలు చేపట్టాల్సి ఉంది. -
ఈ-పాస్ రోజూ ఫెయిలే
♦ పక్షం రోజులైనా గాడిలో పడని కొత్తవిధానం ♦ సరకులందక నరకం చూస్తున్న కార్డుదారులు ♦ అవగాహన లేమితో డీలర్ల అవస్థలు ♦ కొన్ని చోట్ల పాతపద్ధతిలోనే బట్వాడా సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో ఈ-పాస్ విధానం అభాసుపాలవుతుంది. కనీస శిక్షణ.. అవగాహన.. పరిశీలన లేకుండా అమలు చేసిన ఈ కొత్త విధానం వల్ల కార్డుదారులు సకాలంలో సర కులు అందక మండుటెండలో గంటల తరబడి నిరీక్షిస్తూ నిత్యం నరకం చూస్తున్నారు. కనీస అవగాహన లేని డీలర్లు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో ఈ-పాస్ (ఎలక్ట్రానిక్ పేమెంట్ అండ్ అప్లికేషన్ సిస్టమ్) విధానం అమలులోకి వచ్చి అప్పుడే పక్షం రోజులైంది. కానీ నేటికీ ఈ విధానం గాడిలో పడలేదు. ఆదా పేరుతో ఆర్భాటంగా ప్రారంభించిన ఈ విధానం వల్ల ప్రజలు నిత్యం అగచాట్లకు గురవుతున్నారు. జీవీఎంసీ పరిధిలోని 412 షాపులు, భీమిలి, అనకాపల్లి, యలమంచలి, నర్సీపట్నం మున్సిపాల్టీల పరిధిలో 274 షాపుల్లో ఈనెల 1వ తేదీ నుంచి ఈ పాస్ విధానానికి శ్రీకారం చుట్టారు. రోజులు గడుస్తున్నాయే తప్ప..పరిస్థితులు మాత్రం చక్కబడే అవకాశాలు కన్పించడం లేదు. ప్రతీరోజూ సగానికి పైగా మిషన్లు మొరాయించడం లేదా సర్వర్లు డౌన్ కావడం.. నెట్ వర్క్‌లు పనిచేయకపోవడం నిత్యకృత్యమైపోయింది. తొలగని బాలారిష్టాలు ఈ పాస్ మిషన్‌లో రేషన్‌కార్డు వివరాలను ఫీడ్ చేసి ఆధార్ నెంబర్లను అనుసంధానం చేయాలి. రేషన్‌కార్డు నెంబర్ ఎంటర్ చేయగానే హైదరాబాద్‌లోని సెంట్రల్ సివిల్ సప్లయిస్ సర్వర్‌తో, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే బెంగుళూరులోని ఆధార్ సర్వర్‌తో కనెక్ట్ అవుతుంది. వేలిముద్రలు తీసుకోగానే వాటిని సెంట్రల్ సర్వర్ నుంచి సరిపోల్చుకుంటుంది. అన్నీ సరిపోతే ఆ రేషన్‌కార్డులో ఎంతమంది సభ్యులు న్నారు? వారికి ఏ సరుకులు ఎంత మేరకు కేటాయించారు? వాటిధరఎంత? అనే వివరాలు మిషన్‌లో చూపిస్తాయి. ఇదంతా సెకన్లలో జరిగిపోవాలి. సక్రమంగా పనిచేస్తే ఒక్కో కార్డుకు వివరాలు అప్లోడ్ చేసి సరకులు ఇచ్చేందుకు అరగంటకు పైగా సమయం పడుతోంది. కానీ అన్ని వివరాలు ఫీడ్ చేసిన తర్వాత సర్వర్ డౌన్ అని రావడం లేదా సిగ్నల్ వ్యవస్థ పనిచేయక పోవడం వంటి సమస్యలతో అదేపనిగా వేలిముద్రలు తీసుకోవడం.. వివరాలు ఫీడ్ చేయడంతోనే సరిపోతుంది. ఒకే అని సమాధానం వచ్చేవరకు ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ సమస్యల వల్ల డిపోలకు వచ్చిన కార్డుదారుల్లో కనీసం 10 శాతం మందికి కూడా సరుకులు పంపిణీ చేయలేకపోతున్నారు. ఈ విధానంలో ఒక్కో రేషన్‌షాపులో రోజుకు నలుగురైదుగురుకు మించి ఇవ్వలేకపోతున్నారు. దీంతో సరకులు కోసం కార్డుదారులు గంటల తరబడి నిరీక్షించాల్సిన వస్తోంది. డిపోల వద్ద ఆందోళనలు కొన్ని డిపోల వద్ద కార్డుదారులకు డీలర్లకు మధ్య ఘర్షణవాతావరణం కూడా చోటు చేసుకుంటోంది. ఇటీవల కలెక్టరేట్‌ను ముట్టడించి కార్డుదారులు ఆందోళన చేశారు. అలాగే దొండపర్తి, గాజువాక, గోపాలపట్నం, వన్‌టౌన్ ఏరియాల్లో పెద్దఎత్తున నిరసన వ్యక్తంచేశారు. వన్‌టౌన్ పప్పులవీధిలోని రేషన్‌షాపులో ఈ పాస్ మిషన్ పనిచేయక పోవడంతో శనివారం డిపోకు వచ్చిన డీఎస్ఒ రవితేజనాయక్ను కార్డుదారులు నిలదీశారు. ఒక్క విశాఖలోనే కాదు మిగిలిన మున్సిపాల్టీల్లో కూడా ఇదే రీతిలో సరకులందక కార్డుదారులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. సిగ్నల్ సమస్య వేధిస్తున్న మారుమూల ప్రాంతాల్లోని డిపోలను మూసివేసిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం జీవీఎంసీతో పాటు మిగిలిన మున్సిపాల్టీల్లో దాదాపు అన్ని రకాల సెల్‌టవర్లు ఉన్నాయి. అయినప్పటికీ సిగ్నెల్స్ లేకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. మిషన్లలో లోపమా.. లేక నెట్వర్కింగ్లో లోపమో అంతుచిక్కని సమస్యగా తయారైంది. ఉన్న కొద్దిపాటి టెక్నీషియన్లు మిషన్ల మరమ్మతుల పేరుతో ఆ మూల నుంచి ఈ మూలకు.. ఈ మూల నుంచి ఆ మూలకు తిరిగలేక అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు 2జీ సిమ్ల స్థానంలో దాదాపు అన్ని డిపోలకు 3జీ సిమ్‌లు, యాంటినాలు సరఫరా చేసినా పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. అక్కరకు రాని రైల్వే సర్వర్ మాలుమూల ప్రాంతాల్లో సైతం పనిచేసే అత్యాధునిక సర్వర్ వ్యవస్థ రైల్వేశాఖలోనే ఉంది. దీంతో ఈపాస్‌లో సర్వర్ సమస్యలను అధిగమించేందుకు రైల్వే శాఖాధికారులతో చర్చించి ఆ సర్వర్‌తో ఈ పాస్మిషన్లను అనుసంధానంచేయాలని రెవెన్యూ అధికారులు చేసిన కృషి ఫలించలేదు. గురువారం రాత్రికే ఈ సర్వర్ అందుబాటులోకి వస్తుందని, శుక్రవారం నుంచిసర్వర్ సమస్యలుండవని చెప్పినిప్పటికీ రైల్వేసర్వర్ జాడ లేదు. ఇక ఆరు జిల్లాలకు ప్రత్యేకంగా ఒక సర్వర్‌ను ప్రభుత్వం ఆదివారంలోగా అందుబాటులోకి తీసుకొస్తుందని ప్రకటించినా దాని జాడ కూడా కన్పించలేదు. ఇక ఈ పాట్లు పడలేక నర్సీపట్నంలోని ఎంపిక చేసిన 10 డిపోల్లో గతంలో మాదిరి గానే బియ్యం, ఇతరనిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. ఈ పాస్ ఇక్కట్లు తొలిగే వరకు ఈ నెలకు పాతపద్ధతిలోనే పంపిణీ చేయాలన్న భావనలో అధికారులున్నట్టు తెలిసింది. -
నేటి నుంచి ఈ-పాస్
అమలులోకి ‘ఆహార భద్రత’ పెరగనున్న బియ్యం కేటాయింపులు అధికారుల్లో టెన్షన్..టెన్షన్ విశాఖపట్నం : జిల్లా పౌరసరఫరాల శాఖాధికారుల్లో ఏప్రిల్ ఒకటో తేదీ సమీపిస్తున్నకొద్దీ టెన్షన్ ఎక్కువై పోతోంది. ఒకేసారి రెండు పథకాలు బుధవారం నుంచి ప్రారంభం కావడంతో అమలులో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులుతలెత్తుతాయోననే ఆందోళన వారిని కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. జిల్లాలో 2063 రేషన్దుకాణాలున్నాయి. తొలిదశలో జీవీఎంసీతో పాటు భీమిలి, అనకాపల్లి, నర్సీపట్నం, యలమంచలి మున్సిపాల్టీల పరిధిలోని 686 షాపుల్లో ఈ-పాస్ అమలు చేస్తున్నారు. జీవీఎంసీలోని 72 డివిజన్ల పరిధిలో ఉన్న 412 షాపుల్లోనూ ఈపాస్ విధానాన్ని అమలుచేస్తుండగా, ఇతర మున్సిపాల్టీల్లో మరో 274 షాపుల్లో ఈ విధానాన్ని వర్తింపచేస్తున్నారు. సిటీ పరిధిలో 290 షాపుల్లో ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లను ప్రవేశపెడుతున్నారు. వేలిముద్రల సేకరణలో తలెత్తు తున్న ఇబ్బందులను అధిగమించేందుకు సిటీ పరిధిలోని 412 షాపులకు ఐరిష్ కాప్చర్ మిషన్లను సరఫరా చేశారు. ఈపాస్‌లో వేలిముద్రలు పడకపోతే ఈ ఐరిష్ ద్వారా ఐ బాల్ కాప్చర్ చేసి సరుకులు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. జీవీఎంసీ పరిధిలో పంపిణీ చేసిన ఈ పాస్ మిషన్లలో175 మాత్రమే పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. 60 షాపుల్లో సిగ్నెల్ సమస్యలుండగా, ఈ-పాస్ మిషన్ల విషయంలో 34షాపుల్లో టెక్నికల్ సమస్యలు తలెత్తాయి. సాప్ట్ వేర్ సమస్యలతో ఇప్పటికే 21 మిషన్లను వెనక్కి పంపారు. నెట్వర్క్ సమస్యలను అధిగమించేందుకు 70 షాపుల్లో యాంటినాలు ఏర్పాటు చేశారు. 290 షాపుల్లో ఐడియా 2 జీ సిమ్‌తో పాటు ఎయిర్టెల్ 2 జీ సిమ్‌లు ఏర్పాటు చేయగా, 340 షాపుల్లో ఎయిర్టెల్ 3 జీ సిమ్‌లను ఏర్పాటు చేశారు. సిటీ పరిధిలో 3,71,625 కార్డు దారులకు ఈ కొత్త ఈ-పాస్ విధానంలో నేటి నుంచి సరుకులు పంపిణీ జరుగనుంది. కచ్చితంగా వేలిముద్రలు సేకరించిన కుటుంబసభ్యుల్లో ఎవరో ఒకరు వస్తే కాని సరుకులు తీసుకునే అవకాశం ఉండదు. ఇక ఇతర మున్సిపాల్టీల పరిధిలో 133 షాపుల్లో ఈ పాస్ మిషన్లు ఏర్పాటు చేయగా, వీటిలో కూడా సగం షాపుల్లో సాంకేతిక, నెట్వర్క్ సమస్యలు నెలకొన్నాయి. ఈ సమస్యలన్నీ అధిగమించి ఈ విధానాన్ని సమర్ధంగా అమలుకు జిల్లా జాయింట్ కలెక్టర్ జనార్దన్ నివాస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతీ డిపోలోనూ వీటి అమలు తీరును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మరోపక్క ఆహార భద్రత పథకం అమలుకు జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి అమలవుతున్న ఈ కార్యక్రమం కోస అవసరమైన అదనపు కేటాయింపులను ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్‌డిపోలకు చేరవేశారు. జిల్లాలో 10,45,838 తెలుపు, 75,889 ఏఏవై, 1,035 అన్నపూ ర్ణ కార్డులు న్నాయి. వీటిపరిధిలో 39,17,354యూనిట్స్(మంది)లో 5,06,777యూనిట్స్‌ను తొలగిం చగా, 34,10,577 యూనిట్స్ కు సీడింగ్ పూర్తయింది. వీటికి నేటి నుంచి ఐదేసి కిలోల చొప్పున సరఫరా చేయనున్నారు. ఇప్పటి వరకు బీపీఎల్ కార్డుదారులకు 15636.633ఎంటీలు సరఫరా చేస్తుండగా, నేటి నుంచి 18,677.145ఎంటీల బియ్యాన్ని కేటాయించారు. కా ర్డులో సభ్యుల సంఖ్యతో ప్రమేయంలేకుండా ఎంతమంది సభ్యులుంటే అంతమందికి ఒక్కొక్కరికి ఐదేసి కిలోల చొప్పున నేటి నుంచి పంపిణీ చేయనున్నారు. ఈ బియ్యం పక్కదారి పట్టకుండా ఉండేందుకు జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ కార్యాలయం నుంచి మండలస్థాయి గోదాముల వరకు పూర్తిగా కంప్యూటీకరించారు. సప్లయి చైన్డ్ మేనేజ్మెంట్(ఎంసీఎం) ద్వా రా వీటిని అనుసంధానం చేశారు. ఎఫ్‌సీఐ గోదాముల నుంచి సరుకు బయలుదేరగానే లారీ నంబర్, సరుకు వివరాలు ఏ మార్గంలో వస్తున్నదీ మండలస్థాయి గోదాములో ఉండే కంప్యూటర్లో తెలుస్తాయి. పకడ్బందీగా అమలు ఆహార భద్రత పథకంతో పాటు కొత్తగా ప్రవేశపెడుతున్న ఈ పాస్ విధానాన్ని జిల్లాలో పగడ్బందీగా అమలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. నూరు శాతం ఈ రెండు విజయవంతంగా అమలుకు పౌరసరఫరాలశాఖ సిబ్బంది కృషి చేస్తున్నారు. ప్రారంభంలో ఏమైనా సాంకేతిక సమస్యలు వచ్చినా సత్వరమే అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. -జనార్దన్ నివాస్, జేసీ చౌకధరల దుకాణాల్లో నేటి నుంచి ఈ-పాస్ (ఎలక్ట్రానిక్ పేమెంట్ అండ్ అప్లికేషన్ సిస్టమ్) విధానంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తారు. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరొక పక్క జాతీయ ఆహారభద్రత పథకాన్ని కూడా బుధవారం నుంచి జిల్లా వ్యాప్తంగా అమలుకు తగిన ఏర్పాట్లు చేశారు. ప్రారంభానికి ముందే ఈ పాస్ మిషన్లు మొరాయి స్తున్నా.. సెల్ నెట్వర్కులు సరిగా పనిచేయకున్నా అమలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. -
సెల్లార్ల కూల్చివేతకు సై
తొలగింపు ప్రక్రియకు శ్రీకారం పేరున్న భవనాలకూ అదే శాస్తి వాణిజ్య ప్రాంతంపై జీవీఎంసీ దృష్టి అక్రమ నిర్మాణదారుల గుండెల్లో రైళ్లు విశాఖపట్నం సిటీ : నిబంధనలు విరుద్ధంగా సెల్లార్‌ను ఆక్రమించిన వ్యాపారుల్లో జీవీఎంసీ అధికారులు దడ పుట్టిస్తున్నారు. రూ.లక్షల్లో లీజుకిచ్చేసిన భవన యజమానులు, ఆక్రమణదారులను పరుగులెట్టిస్తున్నారు. బాబ్బాబు మా భవనం వద్దకు రావద్దని వేడుకుంటున్నా పట్టణ ప్రణాళిక అధికారులు గట్టిగా అడుగులేస్తున్నారు. స్మార్ట్‌సిటీ సాకారమయ్యేందుకు అధికారులంతా తమకు సహకరించాలంటూ కోరిన జీవీఎంసీ కమిషనర్ ఆదేశాలను వంటపట్టించుకున్న ప్రణాళిక అధికారులు ఒత్తిళ్లను సైతం లెక్క చేయటం లేదు. కూలగొట్టే పని చేసుకుపోతున్నారు. ఏళ్ల తరబడి సెల్లార్లను ఆక్రమించి నిర్వహిస్తున్న ఆస్పత్రులు, మందులు దుకాణాలు, ఇతర గొడౌన్లను సైతం ఖాళీ చేయిస్తున్నారు. ఖాళీ చేయకుండా రాజకీయ నేతలతో ఒత్తిడి తమ వర్గీయుడికే ఎమ్మెల్సీ పదవి దక్కేలా చేయడానికి ఇరువురు మంత్రులు వ్యూహాలకు పదునుపెడుతున్నారు. చెరో జాబితా సిద్దం చేస్తున్నారు. మరోవైపు తటస్థ ముద్రతో ఎమ్మెల్సీ పీఠాన్ని ఎగరేసుకుపోవాలని మరికొందరు నేతలు చాపకింద నీరులా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆశల పల్లకీలో : జిల్లా టీడీపీలో ఎమ్మెల్సీ పీఠంపై కన్నేసిన ఆశావాహుల జాబితా చాంతాడును తలపిస్తోంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో జిల్లా టీడీపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. గత ఎన్నికల్లో తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ టిక్కెట్లు దక్కని నేతలు అందరూ ఎమ్మెల్సీ స్థానానికి గురిపెట్టారు. మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, వుడా మాజీ చైర్మన్ ఎస్.ఎ. రహమాన్, మాజీ మంత్రి మణికుమారి, జిల్లా పార్టీ అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు, తోట నగేష్, నల్లూరి భాస్కరరావు, కోన తాతారావు తదితరులు రేసులో ఉన్నట్లు బయటపడ్డారు. వీరిలో కొందరు గంటా మద్దతు కోసం ప్రయత్నిస్తుండగా మరికొందరు అయ్యన్న ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఒకరిద్దరు ఈ గ్రూపులతో సంబంధం లేకుండా నేరుగా సీఎం చంద్రబాబు కటాక్షం కోసం పావులు కదుపుతున్నారు. -
దాహార్తికి గోదావరి
అదనంగా 50 క్యూసెక్కుల నీరు తెచ్చేందుకు జీవీఎంసీ కసరత్తు మరో పాయ తవ్వడం ద్వారా సేకరించవచ్చునని అంచనా రూ. 49 లక్షల కేటాయింపు ఏలేరు కెనాల్‌ను పరిశీలించిన కమిషనర్ విశాఖపట్నం సిటీ: వేసవి సీజన్లో విశాఖవాసులందరికీ తాగునీటి సరఫరాపై జీవీఎంసీ దృష్టి సారించింది. నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు కసరత్తు ప్రారంభించింది. గోదావరి నీటిని ఏలేరు కెనాల్ ద్వారా విశాఖకు తీసుకొస్తున్న విధానంలో ఎదురవుతున్న ఇబ్బందులను బుధవారం కమిషనర్ ప్రవీణ్‌కుమార్ స్వయంగా పరిశీలించారు. గోదావరి నుంచి రెండు మోటార్ల ద్వారా నిరంతరం పంపింగ్ చేస్తూ కెనాల్లోకి నీటిని మళ్లిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గోదావరి నదిలోనూ నీరు అడుగంటడంతో ఒక పాయను తవ్వడం ద్వారా ఈ వేసవి వరకూ తాగునీటికి ఢోకా వుండదని గుర్తించారు. అందుకు అవసరమైన ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. రూ. 49 లక్షలతో గోదావరి నదిలోనే ఓ చిన్న పాయను తవ్వడం ద్వారా పంపింగ్ చేసి విశాఖకు తీసుకురానున్నారు. ఇలా చేయడం వల్ల అదనంగా మరో 50 క్యూసెక్కుల నీటిని విశాఖకు తీసుకురావచ్చని జీవీఎంసీ అధికారిక వర్గాలు అంచనా వేశాయి. ప్రస్తుతం గోదావరి నుంచి 100 క్యూసెక్కులు, ఏలేరు రిజర్వాయర్ నుంచి 150 క్యూసెక్కుల నీటిని విశాఖకు ఏలేరు కెనాల్ ద్వారా తీసుకొస్తున్నారు. అయితే 300 క్యూసెక్కుల నీరు వుంటేనే కానీ నగర ప్రజల దాహార్తిని తీర్చలేమని అంచనాకొచ్చారు. అందుకనుగుణంగా ఏలేరు, గోదావరి నీటిని అదనంగా లిఫ్ట్ చేసి మోటార్ల ద్వారా సరఫరా చేయాలని ప్రయత్నిస్తున్నారు. అడుగంటిన ఏలేరు, గోదావరి..! ఏలేరు, గోదావరి నీటి మట్టాలు అడుగంటాయి. విశాఖకు అక్కడి నుంచి రావాల్సిన నీరు రావడం లేదు. ఏలేరు నుంచి 200 క్యూసెక్కుల నీటిని వాడితే 30 రోజులు తర్వాత నీరు లభ్యం కాదు. ప్రస్తుతమున్న నీటి నిల్వలు మరో నెల రోజుల వరకూ సరిపోతాయని అంచనా వేశారు. ఏలేరులో ప్రస్తుతం నీటి నిల్వ 74.63 మీటర్లు వుందని 72.5 మీటర్లకు తగ్గితే ఇక నీటి లభ్యత వుండదని స్థానిక అధికారులు కమిషనర్‌కు వివరించారు. అయితే తాటిపూడి, గోస్తనీ నదుల వల్ల వచ్చే నీరుందని చెప్పారు. మేఘాద్రిగెడ్డ, రైవాడ, ముడసర్లోవ నుంచి నీరు తగ్గే అవకాశాలున్నాయని గుర్తించామన్నారు. అందుకే గోదావరి నుంచి ఎత్తిపోతల ద్వారా 50 క్యూసెక్కుల నీటిని తీసుకొస్తామని అందుకు అవసరమైన చర్యలు వెంటనే మొదలెట్టాల్సిందిగా ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఏలేరు కెనాల్ గట్టుపై పర్యటన..! ఏలేరు నుంచి విశాఖకు వచ్చే కెనాల్ గట్టు వెంట కమిషనర్, ఇంజనీరింగ్ అధికారులు బుధవారం పర్యటించారు. దాదాపు 60 కిలోమీటర్లు ఇరుకైన గతుకులతో నిండిన కాల్వ గట్టు వెంబడి పర్యటించారు. తూర్పు గోదావరి జిల్లాలోని ఈ గట్టు వెంట దాదాపు రైతులు పైపుల ద్వారా నీటిని చోరీ చేస్తున్న దృశ్యాలు అడుగడుగునా కనిపించాయి. పలు చోట్ల కాల్వ గట్టులు తవ్వేయడంతో ఆ గట్ల పునరుద్ధరణ పనులను పర్యవేక్షించారు. కమిషనర్ వెంట చీఫ్ ఇంజనీర్ దుర్గాప్రసాద్, ప్రాజెక్టు ఎస్ఈ ఉమా మహేశ్వరరావు, ఏఈ రాజు, కాంట్రాక్టర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రూ. 14 కోట్లతో నీటి ప్రాజెక్టులు విశాఖ ప్రజలు, పారిశ్రామిక అవసరాల కోసం రూ. 14 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు కమిషనర్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విశాఖలోని గంభీరం(ఆనందపురం), నక్కపల్లి, వంటి ప్రాంతాల్లో పరిశ్రామిక క్లస్టర్లు రానున్నాయని చెప్పారు. విశాఖ-ఛెన్నై పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా ఈ రెండు చోట్ల పరిశ్రమలు రానున్నాయన్నారు. అందుకే భవిష్యత్తు అవసరాలకు సంబంధించి జీవీఎంసీ , ప్రభుత్వం ఈ మొత్తాన్ని వెచ్చిస్తుందని వెల్లడించారు. ఏషియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందుకు సాయం చేస్తుందన్నారు. -
‘లెక్కే’లేదు..
జిల్లాలో రూ.1209 కోట్ల ఆడిట్ అభ్యంతరాలు విశాఖలో అత్యధికం జీవీఎంసీలోనే రూ.780 కోట్లు దుర్వినియోగమైన నిధులు కూడా కోట్లలోనే.. ఆర్ఆర్ యాక్టు ప్రయోగించేందుకు జంకుతున్న అధికారులు సాక్షి, విశాఖపట్నం: రాష్ర్టంలో రూ.10 వేల కోట్ల విలువైన ఆడిట్ అభ్యంతరాలుంటే వాటిలో 12 శాతం విశాఖ జిల్లావే. ఒక్క విశాఖ జిల్లాలోనే ఇప్పటివరకు ఏకంగా రూ.1208 కోట్ల 56 లక్షల 57 వేల విలువైన 2 లక్షల11 వేల 165 ఆడిట్ అభ్యంతరాలున్నాయి. ఇంత పెద్దసంఖ్యలో అభ్యంతరాలున్న జిల్లా రాష్ర్టంలో మరొకటి లేదనే చెప్పాలి. జీవీఎంసీతోపాటు జిల్లాలో 11 ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఏటా రాష్ర్ట ఆడిట్ విభాగం క్రమం తప్పకుండా ఆడిటింగ్ చేస్తుంటుంది. వీటి పరిధిలో 1967-2014ల మధ్య జరిగిన ఆడిటింగ్‌కు సంబంధించి గుర్తించిన ఆడిట్ అభ్యంతరాలే ఎక్కువగా ఉన్నాయి. అభ్యంతరాల పరంగా చూస్తే జిల్లా పరిధిలో పంచాయతీల్లోనే అత్యధికంగా ఉన్నాయి. వీటిలో ఏకంగా లక్షా 87వేల 859 ఆడిట్ అభ్యంతరాలున్నాయి. వీటి విలువ అక్షరాలా రూ.124 కోట్ల 54 లక్షలు. ఇక విలువపరంగా చూస్తే జిల్లాలో అత్యధికంగా జీవీఎంసీ పరిధిలోనే ఉన్నాయి. ఇక్కడ పేరుకుపోయిన 1348 ఆడిట్ అభ్యంతరాల విలువ ఏకంగా రూ.779కోట్ల 68లక్షల పైమాటే. జీవీఎంసీలో 14 ఏళ్ల ఆడిటింగ్ జరగలేదు జీవీఎంసీ పరిధిలో ఏకంగా 14 ఏళ్లకు సంబంధించిన ఆడిటింగ్ జరగనేలేదు. రాష్ర్ట ఆడిట్ విభాగం ఎన్నిసార్లు లేఖలు రాసినా ఆయా సంవత్సరాలకు సంబంధించిన రికార్డులను సమర్పించడంలో మాత్రం జీవీఎంసీ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. జీవీఎంసీ పరిధిలోనే అవకతవకలు..అవినీతి ఎక్కువగా జరిగినట్టుగా ఆడిటింగ్‌లో గుర్తించారు. ఏళ్లతరబడి ఇచ్చిన అడ్వాన్సులు రికవరీ చేసుకోకపోవడం..మంజూరుకు మించి నిబంధనలకు విరుద్దంగా ఖర్చు చేయడం వంటి అవకతవకలు ఎక్కువగా జీవీఎంసీ పరిధిలో జరిగాయి. ఇక ఏయూతో పాటు ప్రభుత్వ విద్యాసంస్థల్లో పేరుకుపోయిన ఆడిట్ అభ్యంతరాలు లెక్కలేనంతగా ఉన్నాయి. ఒక్క ఏయూ పరిధిలోనే సుమారు రూ.100కోట్లకు పైగా ఆడిట్ అభ్యంతరాలున్నట్టుగా చెబుతున్నారు. ఆడిటింగ్‌లో రాజకీయ ఒత్తిళ్లదే ప్రధాన భూమిక ప్రతి శాఖలోనూ బడ్జెట్ కనుగుణంగా కేటాయింపులు జరిగాయా? లేదా?, జరిగిన కేటాయింపులకు తగ్గట్టుగా ఖర్చులు చేశారా? లేదా?, ఆ ఖర్చులు కూడా నిబంధనలకనుగుణంగా జరిగాయా ? లేదా ? వంటి విషయాలపై ఏటా రాష్ర్ట ఆడిట్ విభాగం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. దుర్వినియోగమైనట్టుగా నిర్ధారణయితే సంబంధిత అధికారులు, సిబ్బందిపై రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్)యాక్టును ప్రయోగించి వడ్డీతో సహా రికవరీ చేసే అవకాశం ఉంది. ఈ ఆర్థిక అవకతవకల్లో అధికారులు లేదా సిబ్బంది భాగస్వామ్యం ఉన్నట్టుగా నిర్ధారణ అయితే వారిపై క్రమశిక్షణా చర్యలే కాదు..అవసరమైతే క్రిమినల్ చర్యలు కూడా తీసుకునే వెసులుబాటు చట్టంలో ఉంది. కానీ ఏటా ఈ ఆడిట్ శాఖ తనిఖీలు చేయడం.. అభ్యంతరాలు తెలపడమే తప్ప అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకున్నదాఖలాలులేవనే చెప్పాలి. పేరుకుపోయిన ఆడిట్ అభ్యంతరాలు 1967 నుంచి ఉండడంతో ఇందుకు బాధ్యులైన వారిలో చాలా మంది ఇప్పటికే పదవీవిరమణ చెందడంతో పాటు చాలా మంది కాలం చేసినవారు కూడా ఉన్నారు. వీరి నుంచి రికవరీ చేయడం సాధ్యమయ్యే పనికాదనే చెప్పాలి. ఈ పరిస్థితికి రాజకీయ ఒత్తిళ్లు, ఉన్నతాధికారుల ఉదాశీన వైఖరే కారణం. ఇప్పటికైనా ఆడిట్ అభ్యంతరాల విషయంలో ఒక కార్యాచరణ ప్రణాళిక ప్రకటించి నిర్ణీత గడువులోగా వీటిని పరిష్కరించకపోతే భవిష్యత్‌లో వీటి ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. భారీ ఎత్తున ఆర్థిక అవకతవకలకు పాల్పడిన వారి నుంచి ఆర్ ఆర్ యాక్టు ద్వారా రికవరీ చేయడంతో పాటు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటేనే ఈ పరిస్థితి గాడిలో పడుతుంది.. -
వదిలేస్తే మానులు మటాష్..
పార్కులు, మైదానాల్లో కుప్పలుగా చెట్ల వ్యర్థాలు, మానులు తరలింపులో తాత్సారం వాటా కావాలంటూ జీవీఎంసీకి ఎన్హెచ్ఏఐ నోటీసు అగ్గి పడితే బుగ్గి అవుతుందని గుబులు విశాఖపట్నం సిటీ : భోగి పం డుగ సమీపిస్తోంది. నగరంలో ఎక్కడికక్కడే చెట్ల వ్యర్థాలు, మానులు కుప్పలుతెప్పలుగా పడి ఉన్నాయి. చలి తీవ్రత ప్రజానీకాన్ని వణికిస్తోంది. ప్రజల దృష్టి ఏ మాత్రం చెట్ల వ్యర్థాలపై పడినా మొత్తం మటాషే... వాస్తవానికి నగరంలోని ఈ చెట్ల వ్యర్థాలన్నింటినీ టింబర్ డిపో యజమానులకు రూ.4 లక్షలకు జీవీఎంసీ రెండు వారాల కిందట అమ్మేసింది. కొందరిని భయపెట్టి, ఇంకొందరిని బెదిరించి, మరి కొంతమందిని బుజ్జగించి మరీ ఈ వ్యర్థాలన్నీ తీసుకుపోవాలని జీవీఎంసీ ప్రాధేయపడింది. ఏదోలాగ చెట్ల వ్యర్థాలు తరలించుకుపోతే అదే చాలనుకుంది. కానీ ఇంత పెద్ద మొత్తంలో కలపను తీసుకెళ్లి ఎక్కడ పెట్టుకోవాలో తెలియక టింబర్ డిపో యజమానులు నెమ్మదిగా విలువైన కలపను తర లించుకుపోతున్నారు. కేవలం పొయ్యిలోకే పనికి వచ్చే కలపను మాత్రం అలాగే ఉంచి నెమ్మదిగా గ్రామీణుల చెంతకు తరలించే ప్లాన్‌లో ఉన్నారు. ఈలోగా జీవీఎంసీకి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ)ల నుంచి నోటీసులొస్తున్నాయి. సేకరించిన కలప మొత్తంలో సగం వాటా తమదేనని, ఇప్పుడు ఆ కలపను తమకు సంబంధం లేకుండా అమ్మేసుకోవడమేంటని సీరియస్ అయింది. జాతీయ రహదారిని ఆనుకుని ఎక్కువగా భారీ వృక్షాలుండేవని, అవన్నీ అమ్మేసుకోవడం సరైన పద్ధతి కాదని, వచ్చిన మొత్తంలో తమ వాటా తేల్చాలని కోరింది. ఎన్హెచ్ఏఐ జారీ చేస్తున్న నోటీసులతో జీవీఎంసీ అధికారులు కంగారు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్హెచ్ఏఐతో గొడవ పెట్టుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. అమ్మిన మొత్తంలో సగం తమకు అందజేయాలని ఎన్హెచ్ఎఐ కోరింది. జీవీఎంసీ మనుగడ కేంద్రం నుంచి వచ్చే నిధులతో ముడిపడి ఉండడంతో ఎన్హెచ్ఏఐకు ఏం చెప్పాలో తెలియక, వాళ్లిచ్చిన నోటీసుకు సమాధానం ఇవ్వలేక జీవీఎంసీ మొద్దు నిద్ర నటిస్తోంది. కలప పార్కుల్లోనే ఉండడంతో వచ్చే భోగి పండుగకు స్థానికులంతా వాటిని పట్టుకుపోతే పరిస్థితి ఏంటని ఆలోచిస్తోంది. ఆకతాయిలు కలప యార్డుల్లోనే మంట పెడితే భారీ నష్టమే జరగవచ్చని ఆందోళన చెందుతోంది. -
జీవీఎంసీ కార్మికుల ధర్నా
28. కలెక్టరేట్ ముందు బైఠాయించిన జీవీఎంసీ కార్మికులు సిరిపురం : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జీవీఎంసీ పారిశుధ్యం, పార్కులు, తాగునీరు, వీధిలైట్లు, ఆఫీస్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు శుక్రవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ప్రతి నెలా ఐదో తేదీలోగా వేతనాలు చెల్లించాలని, ప్రతి కార్మికుడికి కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వాలని, వారంలో ఒక రోజు సెలవుతోపాటు, ఎనిమిది పండగ దినాలు, 15 క్యాజు వల్ లీవ్‌లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ కార్మికులు ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవాధ్యక్షుడు జి.సుబ్బారావు మాట్లాడుతూ వీధులు శు భ్రం చేస్తున్న పారిశుధ్య కార్మికులకు సే ఫ్టీ మాస్క్‌లు, గ్లౌజులు, సబ్బులు, అం దజేయాలన్నారు. కార్మికులు మృతి చెందితే అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం వెంటనే రూ. 10వేలు ఇవ్వాలని, హైకోర్టు తీర్పు ప్రకారం ప్యాకేజీ కాం ట్రాక్టర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 26 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. వినతిపత్రా న్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇ చ్చేందుకు సిద్ధమైన కార్మికులను పో లీసులు అడ్డుకున్నారు. దీంతో వారి మ ద్య వాగ్వాదం చోటుచేసుకుంది. ధ ర్నాలో యూనియన్ నగర గౌరవాధ్యక్షు డు జి.సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి పి.వెంకటరెడ్డి, అధ్యక్షుడుఎం.సూరీడు, పెద్దసంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. -
లంచం తీసుకుంటూ ఇద్దరు అరెస్టు
విశాఖపట్నం సిటీ: జీవీఎంసీలోని ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 8 వేలు డిమాండ్ చేసిన ఇద్దరు ఐటీ విభాగ ఉద్యోగులను ఏసీబీ అధికారులు సోమవారం పట్టుకున్నారు. వారి నుంచి రూ. 8 వేలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన విశేషాలను ఏసీబీ డీఎస్పీ నర్సింహారావు వెల్లడించారు. 66వ వార్డు పద్మనాభనగర్‌లో ఎస్సీ, బీసీ కాలనీలో ఇంజనీరింగ్ అధికారులు గత ఏడాది ఓ కల్వర్టు నిర్మాణ బాధ్యతను గల్లా శ్రీనివాస్ అనే కాంట్రాక్టరుకు అప్పగించారు. ఆయన కల్వర్టు పనులన్నీ పూర్తి చేసి బిల్లుకు దరఖాస్తు చేసుకున్నారు. రూ.13 లక్షలు బిల్లులు చెల్లించేందుకు అనుమతులు మంజూరయ్యాయి. ఈ బిల్లులను జీవీఎంసీ ఫైనాన్స్ విభాగ అధికారులు క్లియర్ చేసేసి ఈనెల 2న ఐటీ విభాగానికి పంపారు. ఐటీ విభాగంలో వెంటనే ఈ బిల్లు క్లియరెన్స్ కావాలి. రెండు వారాలుగా పూర్తి చేయడం లేదు. కాంట్రాక్టర్ వద్ద సూపర్వైజర్గా పని చేస్తున్న బొడ్డేటి అనిల్‌కుమార్ కొద్ది రోజులుగా ఈ బిల్లు కోసం మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. చివరికి ఐటీ విభాగ ఓఎస్డీగా వ్యవహరిస్తున్న జెన్కో సహాయ డిప్యూటీ ఇంజనీర్ ఎస్. గోపాలరావును కాంట్రాక్టరు సంప్రదించాడు. ఆయన రూ. 10 వేలు కావాలని డిమాండ్ చేశాడు. దీంతో ఆయన ఏసీబీ అధికారులకు చెప్పాడు. వారు ముందస్తు పథక రచన చేశారు. ఆ మేరకు రూ. 8 వేలు చెల్లిస్తానని కాంట్రాక్టరు ఐటీ ఓఎస్డీకి చెప్పాడు. సోమవారం మధ్యాహ్నం నగదును ఐటీ కార్యాలయానికి తీసుకువెళ్లాడు. ఆ మొత్తాన్ని తనకు కాకుండా ప్రాజెక్టు మేనేజర్‌గా పని చేస్తున్న ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీస్ సంస్థ ఉద్యోగి జి. రవికి ఇవ్వాలని గోవిందరావు సూచించాడు. ఈ మొత్తాన్ని రవి నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వెంటనే అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్లు గణేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
విశాఖలో వింత !
విశాఖపట్నం: సాదారణంగా ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేక అధికారులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తారు. ధర్నాలు చేస్తారు. కానీ విశాఖలో వింతగా అధికారులు నిరసన తెలుపుతున్నారు. అదీ తమ సమస్యల పరిష్కారం కోసం కాదు. పన్నులు చెల్లించనందుకు ఈ నిరసన తెలిపారు. బకాయిలు చెల్లించకపోతే రిలేనిరాహార దీక్ష కూడా చేస్తామని హెచ్చరించారు. లక్ష్మీపురం ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సిఐ) గోడౌన్ల వద్ద గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పోరేషన్ (జివిఎంసి) రెవెన్యూ అధికారులు వినూతన రీతిలో నిరసన తెలిపారు. ఎఫ్‌సిఐ 2 కోట్ల రూపాయల ఆస్తి పన్ను ఎగవేసిందని అధికారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పన్ను బకాయిలు చెల్లించకపోతే త్వరలో రిలే దీక్షలు చేస్తామని జీవీఎంసీ రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. పన్నులు ఎగవేసినందుకు రెవెన్యూ అధికారులు నిరసన తెలపడం, బకాయిల కోసం రిలేదీక్ష చేస్తామని హెచ్చరించడం వింతగాలేదూ! అధికారులు ఈ విధంగా పన్నులు వసూలు చేయడం శుభపరిణామమే. -
ఏలేరు.. బేజారు
సాక్షి, విశాఖపట్నం : తాగునీటి సరఫరా జీవీఎంసీకి తలనొప్పిగా తయారయింది. రానున్న కాలంలో పరిస్థితి మరింత జఠిలమయ్యేలా ఉంది. ప్రస్తుతం ఏలేరు కాల్వ నుంచి రోజూ 250 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతోంది. ఇందులో 200 క్యూసెక్కులు ఏలేరు జలాశయం నుంచి వస్తోంది. మిగిలిన 50 క్యూసెక్కుల నీటిని గోదావరి నుంచి పంప్ చేస్తూ కాటేరు వద్ద ఏలేరు కాల్వలోకి వదులుతున్నారు. లీకులు మినహాయిస్తే నగరానికి సుమారు 65-68 మిలియన్ గ్యాలన్లు చేరుతోంది. పంపింగ్ కోసం ఒక మోటారును వాడుతున్నారు. దీనికి నెలకు రూ.కోటి వరకు విస్కో(విశాఖ ఇండస్ట్రియల్ వాటర్ సప్లై కంపెనీ)పై భారం పడుతోంది. సాగునీటి మళ్లింపు జరిగితే మిగిలిన పంపుల్ని కూడా వినియోగంలోకి తీసుకురావాలి. అంటే మరింత ఆర్ధిక భారం పెరుగుతుంది. ఆశించిన స్థాయిలో నీరు లేని ఏలేరుపై మరోపక్క తూర్పు గోదావరి జిల్లాలో సాగునీటి కోసం ఒత్తిడి వస్తోంది. సాగునీటి సరఫరాను పెంచితే నగరానికి తాగునీటి ఇక్కట్లు తప్పేలా లేవు. తాజాగా సర్కారు ఆదే శాల మేరకు స్టీల్‌ప్లాంట్‌కు నీటి కేటాయింపు పెంచుతామని జీవీఎంసీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 30 ఎంజీడీల నీటిని స్టీల్‌ప్లాంట్‌కు కేటాయిస్తోంది. మంగళవారం నగరానికి ఏలేరు కాల్వ ద్వారా 65.5 ఎంజీడీల నీరు చేరగా అందులో స్టీల్‌ప్లాంట్‌కు 29 ఎంజీడీలు, జీవీఎంసీకి 27 ఎంజీడీలు, ఎన్టీపీసీకి 7.28 ఎంజీడీలు, ఏపీఐఐసీకి 2.2 ఎంజీడీలు కేటాయించారు. గోదావరి నుంచి మరో మోటారును వినియోగంలోకి తీసుకొచ్చేందుకు కూడా వీల్లేని పరిస్థితి. ఏలేరు కాల్వ ద్వారా 250 క్యూసెక్కులకు మించి సరఫరా జరిగే పరిస్థితిలేదు. ఇప్పటికే ఎంత అప్రమత్తంగా ఉన్నా అక్కడక్కడ గండ్లు పడి నీరు వృధా అవుతోందని అధికారులు చెప్తున్నారు. -
విలీనంపై మాటమార్చారు!
విశాఖ : గ్రేటర్ విశాఖ మున్సిపాలిటీ కార్పొరేషన్లో భీమిలి, అనకాపల్లి మునిసిపాలిటీ విలీనంపై మళ్లీ గందరగోళం నెలకొంది. మంత్రులు కూడా మాట మార్చారు. ఇన్నాళ్లూ తొందర్లోనే విలీన ప్రతిష్టంభనకు తెరపడుతుందని భావించిన అధికారులకు మంత్రులు షాకిచ్చారు. వుడాలో నిన్న జరిగిన విలేకర్ల సమావేశంలో మంత్రులు పి.నారాయణ, గంటా శ్రీనివాసరావును ప్రశ్నించగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని చెప్పుకొచ్చారు. విలీన పంచాయతీలన్ని విలీనం నుంచి ఉపసంహరించి ఎన్నికలు నిర్వహించడం వల్లే ఈ సమస్య తలెత్తిందని, దీనిపై పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు మూడు మాసాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరగని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా సమస్యల్ని పరిష్కరిస్తామంటూ భరోసా ఇచ్చారు. ఇన్నాళ్లూ స్థానిక మంత్రి, భీమిలీకి ప్రాతినిధ్యం వహిస్తున్న గంటా శ్రీనివాసరావు స్థానికుల అభిప్రాయం మేరకే విలీనంపై నిర్ణయం తీసుకుంటామంటూ చెప్పుకొచ్చిన ఆయన మున్సిపల్ మంత్రి సమక్షంలో మాత్రం ఓ చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. -
వందకు కుళాయి ఒట్టి మాటేనా?
‘రూ.100కే కుళాయి కనెక్షనిస్తాం. బీపీఎల్ కుటుంబాలన్నీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఏడాది కాలంలో నగర పరిధిలో సుమారు 12 వేల కుటుంబాలకు నీటి వసతి అందిస్తాం’ అంటూ ప్రకటనలు గుప్పించిన జీవీఎంసీ యంత్రాంగం అమల్లో చతికిలపడింది. జీవీఎంసీలో విలీనమైన అనకాపల్లి, భీమునిపట్నంలోని అధికారులు మంజూరు చేసిన స్థాయిలో కూడా కుళాయి కనెక్షన్లు ఇవ్వలేదు. నిధులు రాలేదట! 13వ ఆర్థిక సంఘ నిధుల్లో భాగంగా దారిద్య్ర రేఖకు దిగువనున్న(బీపీఎల్) కుటుంబాలకు ఉచితంగా కుళాయి కనెక్షన్లు మంజూరు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.1200 డిపాజిట్‌తో బీపీఎల్ కుళాయి కనెక్షన్లు ఇస్తున్నారు. ఉన్నఫళంగా డిపాజిట్ లేకుండా, అన్ని పరికరాలు ఉచితంగా అందించడం ఆర్థిక భారమవుతుందని ప్రభుత్వానికి జీవీఎంసీ గతంలో నివేదించింది. దీంతో ఆ మొత్తం 13వ ఆర్థిక సంఘ నిధులతో సర్దుబాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు నగర పరిధిలో సుమారు 12 వేల కుళాయి కనెక్షన్లు రూ.100కే అందించనున్నట్టు జీవీఎంసీ ప్రకటించింది. ఇందుకు రూ.2.36 కోట్లు ఆర్థిక సంఘ నిధులకు ప్రతిపాదనలు పంపింది. కానీ ఇప్పటి వరకు ఈ విభాగంలో సుమారు 200 కనెక్షన్లకు మించి మంజూరు చేయలేదని అధికారులు చెప్తున్నారు. ఆ 200 కనెక్షన్లు కూడా గతంలో ఉన్న బీపీఎల్ నిబంధనలనే కాస్త సవరించి, కనెక్షన్ మంజూరు సమయంలో రూ.100 చెల్లించి, తర్వాత నెలకు రూ.100 చొప్పున 11 నెలలు చెల్లించాలని ఆదేశించారు. ఆర్థిక సంఘ నిధులు విడుదలైతే.. మిగిలిన 11 నెలల మొత్తాన్ని.. తర్వాతి నీటి చార్జీల బిల్లులో సర్దుబాటు చేస్తామని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఆ విభాగంలో ఒక్క రూపాయీ జీవీఎంసీకి రాలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
గ్రేటర్ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే!
:రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొన్నా జీవీఎంసీలో మాత్రం ఆ జాడ లేదు. భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీలతోపాటు, పది గ్రా మ పంచాయతీల విలీనంతో వా ర్డుల పునర్విభజన జరగలేదు. పైగా ఇందులో ఐదు పంచాయతీ ల విలీనాన్ని రద్దు చేస్తూ తక్షణమే ఎన్నికలు నిర్వర్తించాల్సిందిగా హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో భీమిలి విలీన ప్రక్రియకూడా ఆటంకాలేర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇప్పట్లో కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించే పరిస్థితుల్లేవని ఉన్నతాధికారులు చెప్తున్నారు. వేరుపడనున్న భీమిలి? భీమిలి, జీవీఎంసీకి మధ్య అనుసంధానంగా ఉన్న కె.నగరపాలెం, కాపులుప్పాడ, చేపలుప్పాడ, నిడిగట్టు, జేవీ అగ్రహారం గ్రామాల విలీన ప్రక్రియను రద్దు చేసి ఈ ఐదు పంచాయతీలకు ఏప్రిల్ 15లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. అప్పీళ్లుకు వెళ్తుందనుకున్న రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ(ఎంఏయూడీ) కూడా వీటిని జీవీఎంసీ నుంచి విముక్తి కలిగి స్తూ ఉత్తర్వులు సిద్ధం చేసినట్టు తెలిసిం ది. భీమిలి విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు మళ్లీ మొదటికొచ్చాయి. గతం లో జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ఆయన అనుంగు అనుచరుడైన స్థానిక నేత అడ్డగోలుతనం వల్లే భీమిలి విలీనానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, స్థానికులెవరికీ భీమిలి విలీనం ఇష్టం లేదంటూ స్థానికలు ఆందోళనకు దిగుతున్నారు. దక్షిణ భారతదేశంలో తొలి పురపాలక సంఘంగా భీమిలికున్న చారిత్రక ప్రాశస్త్యానికి భంగం కలిగించొద్దంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంఏయూడీ కూడా భీమిలిని మున్సిపాలిటీగానే ఉంచేం దుకు నిర్ణయానికొచ్చినట్టు జీవీఎంసీలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. వార్డుల పునర్విభజనకు కనీసం ఆరు నెలలు! : భీమిలి, ఐదు పంచాయతీల్ని మినహాయించి అనకాపల్లి, దాన్ని ఆనుకుని ఉన్న ఐదు పంచాయతీల మేరకు వార్డుల పునర్విభజన చేపట్టాల్సి ఉంది. యుద్ధప్రాతిపదికన ఈ ప్రక్రియ ప్రారంభించినా.. కనీసం ఆరు నెలలు పడుతుందని జీవీఎంసీ కమిషనర్ ఎం.వి.సత్యనారాయణ స్పష్టం చేశారు. భీమిలి విలీనంపై సందిగ్ధత తొలగేందుకు ఎంత సమయం పడుతుందో తెలియని పరిస్థితి. ఈ నెలాఖరులోగా తొలి విడత మున్సిపల్ ఎన్నికలు ముగియనున్నాయి. వీటి అనంతరం కోర్టు కేసులున్న మున్సిపాలిటీలు/ కార్పొరేషన్లకు ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. జీవీఎంసీలో ఉన్నట్టుగా విచిత్ర పరిస్థితి మరే కేసులోనూ లేదు. దీంతో జీవీఎంసీ ఎన్నికలు కొత్త ప్రభుత్వం చొరవపైనే ఆధారపడి ఉందని అధికారులు చెప్తున్నారు. -
‘ఈనాడు’ భవనాల్ని కూల్చేయండి
విశాఖపట్నం, న్యూస్‌లైన్: విశాఖపట్నంలోని ‘ఈనాడు’ కార్యాలయంలో అక్రమంగా నిర్మించిన భవనాల్ని కూల్చివేయాలని మహా విశాఖ నగర పాలక సంస్థ(జీవీఎంసీ) కమిషనర్ ఆదేశించారు. ఈ మేరకు కమిషనర్.. జోనల్ కార్యాలయానికి, ‘ఈనాడు’ కార్యాలయానికి నోటీసులు జారీ చేశారు. అక్రమ కట్టడాలను 15 రోజుల్లో కూల్చివేయాలని పేర్కొన్నారు. లీజుకని తీసుకుని.. తానే యజమానినని చెప్పి.. విశాఖ సీతమ్మధారలో ‘ఈనాడు’ కార్యాలయం ఉన్న స్థల వాస్తవ యజమాని మంతెన ఆదిత్య కుమారవర్మ. 2.78 ఎకరాల ఆ స్థలాన్ని, 40 వేల చదరపు అడుగులు కలిగిన10 పెద్ద భవనాలను 1974-ఏప్రిల్‌లో రామోజీరావు 33 ఏళ్ల కాల పరిమితికి వర్మ నుంచి లీజుకు తీసుకున్నారు. లీజు 2007తో పూర్తయింది. తర్వాత లీజు గడువు పొడిగించాలని వర్మను రామోజీరావు కోరారు. వెంటనే ఖాళీ చేసి తన స్థలాన్ని, భవనాల్ని అప్పగించాలని వర్మ కోరారు. దీనిపై రామోజీరావు సివిల్ కోర్టును ఆశ్రయించారు. కేసు పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో 1985లో సీతమ్మధారలో రోడ్లను వెడల్పు చేశారు. వర్మకు చెందిన కొంత స్థలం విస్తరణలో పోయింది. అందుకు పరిహారంగా ప్రభుత్వం కొంత స్థలాన్ని కేటాయించింది. తాను స్థలం యజమానినని అంటూ రామోజీరావు తప్పుడు పత్రాల్ని సమర్పించి వర్మకు రావాల్సిన భూమిని తీసేసుకున్నారు. యజమాని అనుమతి లేని కట్టడాలు కూల్చేయాల్సిందే.. ఈ వివాదంపై నగరంలోని వివిధ న్యాయస్థానాల్లో సివిల్, క్రిమినల్ కేసులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అద్దె చట్టం ప్రకారం ఏదైనా నిర్మాణం చేపట్టాలన్నా, లేదా స్థలంలో ఉన్న కట్టడాల్ని మార్పు చేయాల్సి వచ్చినా స్థల యజమాని అనుమతి తప్పనిసరి. రామోజీరావు మాత్రం తానే యజమానిగా వ్యవహరించారు. స్థల యజమాని వర్మకు సమాచారం ఇవ్వకుండా అనుమతి పొందకుండా పలు శాశ్వత కట్టడాల్ని నిర్మించారు. వీటికి సంబంధించిన సాక్ష్యాధారాలతో వర్మ జీవీఎంసీకి ఫిర్యాదు చేశారు. వివరాల్ని పరిశీలించిన అధికారులు ‘ఈనాడు’ కార్యాలయంలో అక్రమ కట్టడాలు ఉన్నట్టు గుర్తిం చారు. స్థల యజమాని అనుమతి లేకుండా నిర్మించిన అన్ని కట్టడాలను 15 రోజుల్లో కూల్చివేయాలని నోటీసులు జారీ చేశారు. -
నేటి నుంచి కాంట్రాక్టు పారిశుధ్య కార్మికుల సమ్మె
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు సోమవారం నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆదివారం రాత్రి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 164 మునిసిపాలిటీలు, 19 కార్పొరేషన్లలో పనిచేస్తున్న 25 వేల మందికి పైగా కార్మికులు సమ్మెలోకి వెళుతున్నారు. కాంట్రాక్టు కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు కూడా వీరిలో ఉన్నారు. నెలసరి కనీస వేతనం రూ.12,500 చెల్లించాలని, విధి నిర్వహణలో మరణిస్తే ఆ కార్మికుని కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, తమ ఉద్యోగాలను దశల వారీగా క్రమబద్ధీకరించాలని, జాతీయ సెలవు దినాలు, వారాంతపు సెలవు దినాలు ఇవ్వడంతో పాటు సబ్బులు, దుస్తులు ఇవ్వాలని వీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ల సాధనకు రెండు నెలలుగా వివిధ రకాల ఆందోళనలు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో రెండు దఫాలుగా అధికారులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో సోమవారం నుంచి సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా 10 కాంట్రాక్టు కార్మిక సంఘాలు సమ్మెలోకి వెళ్లనున్నట్లు నేతలు ప్రకటించారు. వీరి సమ్మెకు ఏఐటీయూసీ, సీఐటీయూ, టీఎన్టీయూసీ తదితర కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. నిన్నమొన్నటి దాకా సీమాంధ్ర జిల్లాల్లో మున్సిపల్ ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు. వీరి సమ్మె విరమణ జరిగిన వారంలోపే రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టు కార్మికులు సమ్మెలోకి వెళ్లనుండటంతో అంతంత మాత్రంగా ఉన్న నగర పారిశుధ్యం పూర్తిగా చతికిలపడనుంది. అందుబాటులో లేని శాఖాధిపతులు... కార్మికుల సమ్మె విరమణకు చర్చలు జరపడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాల్సిన మున్సిపల్ శాఖ అధిపతులు ముగ్గురూ అందుబాటులో లేరు. వ్యక్తిగత పనులపై ముఖ్య కార్యదర్శి సెలవులో ఉన్నారు. కార్యదర్శి శిక్షణలో ఉన్నారు. కమిషనర్ ‘అధ్యయనానికి’ ఇజ్రాయిల్ వెళ్లారు. ‘గ్రేటర్’ కమిషనర్ ఉన్నప్పటికీ సమ్మెలోకి వెళ్లే కార్మికులను కనీసం చర్చలకు కూడా పిలవలేదు. -
రేపట్నుంచి జీవీఎంసీలో సమ్మె సైరన్!
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ లో కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. సోమవారం నుంచి విధులకు హాజరుకావడం లేదంటూ కార్మికులు సమ్మె నోటిస్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సుమారు మూడు వేల మంది కార్మికులు సమ్మె చేపట్టడంతో జీవీఎంసీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. -
నేటి నుంచి GVMC సిబ్బంది 3 రోజుల సమ్మె
-
రెండో రోజుకు వైఎస్సార్ సీపీ ఆమరణ నిరశన
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా జీవీఎంసీ వద్ద వైఎస్సార్ సీపీ నాయకులు కంపా హనోకు, గుడిమెట్ల రవిరెడ్డి చేపట్టిన ఆమరణ నిరహారదీక్ష రెండో రోజుకు చేరుకుంది. వీరికి సంఘీభావంగా గురువారం నాయకులు, విద్యార్థులు పెద్దఎత్తున తరలివచ్చారు. సమైక్యాంధ్ర నాయకులు ఆడారి కిషోర్‌కుమార్, ఏయూ జేఏసీ నాయకులు ఆరేటి మహేష్, కాంతారావు, లగుడు గోవింద్, పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్, సమన్వయకర్తలు జీవీ రవిరాజు, తిప్పల నాగిరెడ్డి మద్దతు తెలిపారు.