డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): జీవీఎంసీ స్థాయీ సంఘ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది. పది స్థానాలకు గాను పది స్థానాలూ గెలుచుకుంది. సంఖ్యా బలాన్ని మించి ఇతర పారీ్టల నుంచి కూడా ఓట్లు పోలవ్వడం సీఎం జగన్ పరిపాలన దక్షతకు నిదర్శనంగా నిలుస్తోంది. వైఎస్సార్‌సీపీకి స్వతంత్రులతో కలిపి 62 మంది కార్పొరేటర్లుండగా వీరిలో ఉరికిటి నారాయణరావుకు 66, అక్కరమాని పద్మకు 64, పీలా లక్ష్మీసౌజన్యకు 64, కోడిగుడ్ల పూరి్ణమకు 63, కంటిపాము కామేశ్వరికి 63, బల్ల లక్ష్మణరావుకు 63, భూపతిరాజు సుజాతకు 63 ఓట్లు వచ్చాయి.
అంటే తెలుగుదేశం, బీజేపీ నుంచి కూడా కార్పొరేటర్లు వైఎస్సార్‌సీపీకి చెందిన కార్పొరేటర్లకు ఓట్లు వేశారన్నమాట. ఈ సందర్భంగా మంత్రి, జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికల ఇన్‌చార్జ్ గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ టీడీపీకి చెందిన కార్పొరేటర్లు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి మద్దతు పలకడం విశేషమన్నారు. సీఎం ఆదేశాలతో, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌చార్జ్ వైవీ సుబ్బారెడ్డి సూచనలు, సలహాలతో ఈ విజయం సాధించినట్టు మంత్రి అమర్‌నాథ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment