విశాఖపట్నం, సాక్షి: కూటమి సర్కార్‌పై పోరుబాటలో భాగంగా.. ఇవాళ అన్నదాతకు అండగా కార్యక్రమం నిర్వహిస్తోంది వైఎస్సార్‌సీపీ. ఈ క్రమంలో రాష్ట్రమంతా కలెక్టరేట్‌ల వద్ద నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇచ్చింది. అయితే.. కలెక్టరేట్ వద్ద జరిగిన కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
విశాఖ కలెక్టరేట్ వద్దకు వైఎస్సార్‌సీపీ నేతలతో పాటు భారీగా రైతులు చేరుకున్నారు. అయితే లోపలికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో తోపులాట జరగ్గా.. మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య గాయపడ్డారు. ఆయన చేతికి గాయమైనట్లు తెలుస్తోంది.
మరోవైపు.. జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ దాకా వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ క్రమంలో డీఆర్‌ఓకు వినతిపత్రం సమర్పించారు ఆ పార్టీ నేతలు. ‘‘ ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుంది. రైతాంగ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు వినతి పత్రం సమర్పించాం.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్న రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. తక్షణమే.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి.
.. సూపర్ సిక్స్ అని చెప్పి కూటమి ప్రభుత్వం డక్ ఔట్ అయింది. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఏడాదికి రూ.20,000 ఇవ్వాల్సిందే.
రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. 18 ఏళ్ల నిండిన మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ హామీలన్నీ నెరవేర్చాల్సిందే అని గుడివాడ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment