
బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హకు ఈ ఏడాది ఎంతో స్పెషల్.

బ్యాచిలర్ లైఫ్‌కు బైబై చెప్పేసి ప్రియుడు జహీర్ ఇక్బాల్ చేయందుకుంది.

ఏడేళ్ల ప్రేమను జీవితాంతం కొనసాగిద్దామంటూ జూన్‌లో జహీర్‌ను పెళ్లాడింది.

తాజాగా ఈ జంట ఆస్ట్రేలియా ట్రిప్‌కు వెళ్లారు.

అక్కడ లిజర్డ్ ఐలాండ్‌ను సందర్శించారు.

అలాగే బంగీ జంప్ కూడా ట్రై చేశారు.

బంగీ జంప్‌ను జహీర్ ఎంతో ఆనందించగా సోనాక్షి మాత్రం భయంతో కేకలు పెట్టింది.

బంగీ జంప్ అంత భయంకరంగా ఏమీ ఉండదని నన్ను గుడ్డిగా నమ్మించాడు. అందుకే ఇలా వణికిపోయాను అని సోనాక్షి సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.













