మాస్కో: ఇటీవల కాలంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడులను తీవ్రతరం చేసింది. ఈ క్రమంలోనే క్రిస్టమస్ వేళ ఉక్రెయిన్‌ను టార్గెట్ చేస్తూ రష్యా భీకర దాడులకు పాల్పడింది. 70కి పైగా క్షిపణులు, 100కు పైగా డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు మరోసారి అమెరికా అండగా నిలిచింది.
రష్యా దాడుల నుంచి కీవ్‌ను రక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు అందిస్తామని వెల్లడించారు. దీనిపై ఇప్పటికే తాను రక్షణ మంత్రిత్వశాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ ప్రజలు చలి నుంచి రక్షణ పొందకుండా ఉండడమే రష్యా దాడి వెనుక ఉద్దేశం. గ్రిడ్ వ్యవస్థను నాశనం చేసి వారికి విద్యుత్ సరఫరా అందకుండా మాస్కో కుట్ర పన్నింది అంటూ సంచలన కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ విషయంలో బైడెన్ ఇప్పటికే పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ట్రంప్ అధికారంలోకి వచ్చేనాటికి ఉక్రెయిన్‌కు మరింత ఎక్కువ సాయం అందించాలనే ఉద్దేశంతో బైడెన్ సర్కారు వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే 725 మిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించగా.. దానికి అదనంగా మరో 988 మిలియన్ డాలర్ల ఆయుధ సామగ్రిని ఇస్తామని బైడెన్ కార్యవర్గం హామీ ఇచ్చింది. అమెరికా నుంచి కీవ్‌కు 2022 నుంచి ఇప్పటి వరకు 62 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలు, ఇతర సాయం అందించారు.
మరోవైపు.. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత యుద్ధం చేస్తున్న దేశాలకు అమెరికా సాయం అందించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. ఇదే సమయంలో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో చర్చలు జరపాలని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment