స్టార్ హీరోయిన్ త్రిష (Trisha Krishnan) బాధపడుతోంది. తన కొడుకు చనిపోయాడని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం తాను షాక్‌లో ఉన్నానని చెప్పుకొచ్చింది. ఈ బాధ నుంచి తన ఫ్యామిలీ బయటపడేందుకు కాస్త సమయం పడుతుందని తనని తానే సముదాయించుకుంది. ఇక్కడ జొర్రో అంటే త్రిష పెంపుడు కుక్క. పేరుకే కుక్క గానీ కొడుకులా పెంచుకున్నట్లు ఇన్ స్టాలో పోస్ట్ చూస్తే అర్థమవుతోంది.
'నా కొడుకు జొర్రో.. ఈ క్రిస్మస్ నాడు వేకువజామున చనిపోయాడు. నా గురించి బాగా తెలిసినవాళ్లకు.. జొర్రో నాకు ఎంతముఖ్యమనేది కూడా తెలుసు. నేను, నా ఫ్యామిలీ ఇప్పుడు చాలా బాధలో ఉన్నాం. కుదుటపడటానికి కొన్నిరోజులు పడుతుంది. అప్పటివరకు అందుబాటులో ఉండను' అని హీరోయిన్ త్రిష ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'బరోజ్' సినిమా రివ్యూ)
గత ఇరవైళ్లుగా దక్షిణాది భాషల్లో హీరోయిన్‌గా చేస్తున్న త్రిష.. ఇప్పుడు 40 ఏళ్లు దాటినా సరే స్టార్ హీరోయిన్ క్రేజీ ప్రాజెక్టులు చేస్తోంది. ప్రస్తుతం చిరంజీవి 'విశ్వంభర'లో (Viswambhara Movie) మెయిన్ హీరోయిన్ ఈమెనే. తమిళంలో అజిత్ 'విడమూయార్చి', 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రాల్లో త్రిషనే హీరోయిన్. ఇది కాకుండా సూర్య, కమల్ హాసన్ (Kamal Haasan) కొత్త సినిమాల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. మలయాళంలోనూ రెండు మూవీస్ చేస్తోంది.
ఇలా కెరీర్ పరంగా బిజీగా ఉన్న త్రిష.. ఇప్పుడు పెంపుడు కుక్క చనిపోయిందని పోస్ట్ పెట్టింది. దీంతో ఆమె ఫాలోవర్స్.. త్వరలో త్రిష తిరిగి మాములు మనిషి అవ్వాలని కామెంట్స్ పెడుతున్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కేసీఆర్' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)
Comments
Please login to add a commentAdd a comment