ఓటీటీలోకి 'కేసీఆర్' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | KCR Movie OTT Release Date Official | Sakshi
Sakshi News home page

KCR Movie OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'కేసీఆర్'

Published Wed, Dec 25 2024 11:21 AM | Last Updated on Wed, Dec 25 2024 11:49 AM

KCR Movie OTT Release Date Official

'జబర్దస్త్' షోతో కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ రాకేశ్ (Jabardasth Rakesh).. హీరోగా నటించిన నిర్మించిన సినిమా కేసీఆర్ (KCR Movie). గతనెల 22న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చింది గానీ అదే టైంలో మరికొన్ని మూవీస్ రిలీజ్ కావడంతో ఇది పెద్దగా జనాలకు రీచ్ కాలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అధికారిక పోస్టర్ కూడా విడుదల చేశారు.

కేసీఆర్ అలియాస్ 'కేశవ చంద్ర రమావత్' సినిమాకు గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, కొత్తగా ఏర్పడిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నికైన పరిణామాలకు ఓ లంబాడీ యువకుడి జీవిత ప్రయాణాన్ని జోడించి ఈ మూవీని తెరకెక్కించారు. నటి సత్య కృష్ణన్ కూతురు అనన్య కృష్ణన్ (Ananya Krishnan).. ఈ చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'బరోజ్' సినిమా రివ్యూ)

నవంబర్ 22న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. డిసెంబర్ 28 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.  'కేసీఆర్' విషయానికొస్తే.. తెలంగాణ ఉద్య‌మం నడుస్తున్న రోజుల్లో కేసీఆర్ ప్ర‌సంగాలు విని అత‌డికి అభిమాని అవుతాడు కేశ‌వ చంద్ర ర‌మావ‌త్ (రాకింగ్ రాకేష్‌). ఊరివాళ్లంతా కేశ‌వ చంద్ర‌ర‌మావ‌త్‌ను కేసీఆర్ అని పిలుస్తుంటారు. కేశ‌వ‌ను అత‌డి మ‌ర‌ద‌లు మంజు (అన‌న్య కృష్ణ‌న్‌) ఇష్ట‌ప‌డుతుంది. బావ‌నే పెళ్లిచేసుకోవాల‌ని క‌ల‌లు కంటుంది. మ‌ర‌ద‌ల్ని కాద‌ని కేశ‌వ చంద్ర ర‌మావ‌త్ బాగా డ‌బ్బున్న అమ్మాయితో పెళ్లికి సిద్ధ‌ప‌డ‌తాడు.

త‌న పెళ్లి అభిమాన‌ నాయ‌కుడు కేసీఆర్ చేతుల మీదుగా జ‌ర‌గాల‌ని కేశవ చంద్ర క‌ల‌లు కంటాడు. కేసీఆర్‌ను క‌ల‌వ‌డం కోసం హైద‌రాబాద్ వ‌స్తాడు. ఆ త‌ర్వాత ఏమైంది? కేశ‌వ చంద్ర ర‌మావ‌త్.. కేసీఆర్‌ను క‌లిశాడా? త‌మ ఊరికి ఎదురైన రింగ్ రోడ్ స‌మ‌స్య‌ని ఇతడు ఎలా ప‌రిష్క‌రించాడు? మ‌ర‌ద‌లి ప్రేమ‌ను అర్థం చేసుకున్నాడా అనేదే మూవీ స్టోరీ.

(ఇదీ చదవండి: ఎదురుపడ్డ మాజీ ప్రేమికులు నిఖిల్-కావ్య.. అక్కడే ఉన్నా గానీ!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement