ఈసారి బిగ్‌బాస్ షో (Bigg Boss 8 Telugu) విజేతగా సీరియల్ నటుడు నిఖిల్ (Nikhil Maliyakkal) నిలిచాడు. గేమ్‌లో గెలవడం సంగతి పక్కనబెడితే ఇతడికో లవ్ స్టోరీ ఉంది. తనతో పాటు సీరియల్స్ చేసిన కావ్యనే ప్రేమించాడు. కొన్నాళ్లు రిలేషన్‌లో ఉన్నారు. ఏమైందో ఏమో గానీ బ్రేకప్ అయింది. ఇదంతా నిఖిల్.. బిగ్‌బాస్‌కి రాకముందే జరిగిపోయింది. షోలో ఉన్నప్పుడే నిఖిల్-కావ్య ఒకరిపై ఒకరు కౌంటర్స్ వేసుకుంటూ ఇన్ స్టాలో పోస్టులు కూడా పెట్టారు.
బిగ్ బాస్ అయిపోగానే వచ్చి కావ్యని కలుస్తానని షోలో ఉన్నప్పుడు నిఖిల్ చెప్పాడు. కానీ అలా చేయలేదు. నేరుగా కర్ణాటకలోని సొంతూరు వెళ్లిపోయారు. షోలో గెలిచిన ఆనందంలో పార్టీ చేసుకున్నారు. కానీ ఊహించని విధంగా మాజీ ప్రేమికులు నిఖిల్-కావ్య (Kavyashree) ఒకే షోలో ఎదురెదురు పడ్డారు. ఇంకా చెప్పాలంటే ఎదురు పడాల్సి వచ్చింది. కానీ కావ్య అయితే కనీసం నిఖిల్ ముఖం వైపు కూడా చూసేందుకు ఇష్టపడలేదు. షోలో నిఖిల్ ఉన్నంతసేపు చాలా సీరియస్ ఫేస్‌తో కనిపించింది.
(ఇదీ చదవండి: Allu Arjun Issue: 3.30 గంటలు.. 20 ప్రశ్నలు)
తాజాగా ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. దీనికే బిగ్‌బాస్ విజేత నిఖిల్ వచ్చాడు. అయితే కావ్యతో బ్రేకప్ గురించి తెలిసినా సరే హోస్ట్ శ్రీముఖి కావాలనే.. వీళ్లని పరిచయం చేస్తాను పదా అని చెప్పి కావ్య ఆడుతున్న టీమ్ దగ్గరకు తీసుకెళ్లింది. అయితే నిఖిల్ వైపు కనీసం చూసేందుకు కూడా కావ్య ఇష్టపడలేదు. షోలో ఉన్నంతసేపు కళ్లజోడు పెట్టుకునే నిఖిల్ కనిపించాడు. కళ్లద్దాలు తీయవా అని నిఖిల్‌ని శ్రీముఖి అడిగింది కానీ తీయను అనే సమాధానం నిఖిల్ నుంచి వచ్చింది.
నిఖిల్-కావ్యని ఎదురెదురుగా పెట్టిన శ్రీముఖి.. మాట్లాడించడానికి చాలానే ప్రయత్నించింది. కానీ కావ్య మాత్రం చాలా కోపంగా చూసింది. కనీసం నిఖిల్‌ని చూడ్డానికి కూడా ఇష్టపడలేదు. నిఖిల్ నవ్వుతూనే కనిపించాడు కానీ కావ్యకి మాత్రం కన్నీళ్లు ఒక్కటే తక్కువ అన్నట్టుగా చాలా దిగులుగా కనిపించింది. తెగిపోయిన బంధం మళ్లీ అతుక్కునే ప్రసక్తే లేదు అన్నట్టుగానే కనిపించాయి కావ్య చూపులు. ప్రోమోలో అయితే కనీసం చూడలేదు. షోలో అయినా సరే వీళ్లు మాట్లాడించారా అనేది చూడాలి?
(ఇదీ చదవండి: పీవీ సింధు రిసెప్షన్‌లో సినీ స్టార్స్.. చిరు, అజిత్‌తో పాటు)
Comments
Please login to add a commentAdd a comment