పీవీ సింధు రిసెప్షన్‌‌లో సినీ స్టార్స్.. చిరు, అజిత్‌తో పాటు | Chiranjeevi, Ajith And Nagarjuna Attends PV Sindhu Reception | Sakshi
Sakshi News home page

PV Sindhu: సింధు కోసం వచ్చిన నాగ్, చిరు, అజిత్, ఉపాసన

Published Wed, Dec 25 2024 7:27 AM | Last Updated on Wed, Dec 25 2024 8:01 AM

Chiranjeevi, Ajith And Nagarjuna Attends PV Sindhu Reception

ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు (PV Sindhu).. రీసెంట్‌గా వెంకట దత్త సాయిని పెళ్లి చేసుకుంది. రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోగా.. హైదరాబాద్‌లో రిసెప్షన్ వేడుకని అంగరంగ వైభవంగా చేశారు. అయితే ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు చాలామంది విచ్చేశారు. సినీ సెలబ్రిటీలు మాత్రం తెలుగు, తమిళ స్టార్స్ విచ్చేశారు.

(ఇదీ చదవండి: Allu Arjun Issue: 3.30 గంటలు.. 20 ప్రశ్నలు)

టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి(Chiranjeevi), నాగార్జునతో పాటు హీరోయిన్ మృణాల్ ఠాకుర్ (Mrunal Thakur).. సింధు రిసెప్షన్‌లో సందడి చేసింది. తమిళ స్టార్ హీరో అజిత్ (Ajith Kumar) ఏకంగా ఫ్యామిలీతో పాటు హైదరాబాద్ వచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీళ్లందరితో పాటు ఉపాసన కూడా సింధుని ఆశీర్వదించేందుకు రిసెప్షన్‌కి వచ్చింది.

గత ఆదివారం రాత్రి రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో పీవీ సింధు వివాహం గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు కొద్దిమంది బంధువులు మాత్రమే హాజరయ్యారు. సింధు పెళ్లాడిన వెంకట్ దత్త సాయి (Venkat Datta Sai) బడా వ్యాపారవేత్త కావడం విశేషం.

(ఇదీ చదవండి: ముంబైలో చాలామంది హీరోలు కీర్తి ఫోన్‌ నెంబర్‌ అడిగారు: వరుణ్‌ ధావన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement