బేబీ జాన్ సినిమాతో కీర్తి సురేశ్ (Keerthy Suresh) బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. బుధవారం (డిసెంబర్ 25)న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పెళ్లయిన రెండు రోజులకే పర్సనల్ లైఫ్‌ను పక్కనపెట్టేసి సినిమా ప్రమోషన్స్‌లో మునిగిపోయింది. తాజాగా ఈ బ్యూటీ బేబీ జాన్ (Baby John Movie) హీరో వరుణ్ ధావన్‌తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.
ఎప్పుడూ పెళ్లి టాపికే..
ఈ సందర్భంగా వరుణ్ ధావన్ (Varun Dhawan) మాట్లాడుతూ.. మేము ఎప్పుడూ పెళ్లి గురించే మాట్లాడుకునేవాళ్లం. నాకేమో పెళ్లయిపోయింది. తనేమో పెళ్లికి రెడీ అవుతోంది.. కాబట్టి ఈ హడావుడి గురించే ఎప్పుడూ కబుర్లాడుకునేవాళ్లం. వివాహమయ్యాక నేను మంచి ఇల్లాలుగా ఉంటాననేది. సినిమాలో తను ఎలాంటి భార్యగా నటించిందో చూడండి.. తనకు వైఫ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇచ్చేయాలంటారు. నిజానికి కీర్తి ఎంతోమంది మనసులను ముక్కలు చేసింది.
(చదవండి: కోహ్లి నన్ను బ్లాక్ చేశాడు, ఎందుకో ఇప్పటికీ అర్థం కావట్లేదు: సింగర్)
అదే బెటర్ అనిపించింది!
తను ప్రేమలో ఉన్న విషయం ఏళ్ల తరబడి ఎవరికీ తెలియదు అన్నాడు. ఇంతలో కీర్తి మధ్యలో కలుగజేసుకుంటూ నాకు బాగా దగ్గరైనవాళ్లకు తెలుసు. అట్లీ, అతడి భార్య, అలాగే వరుణ్‌తో సినిమా చేస్తున్నప్పటి నుంచి తనకూ తెలుసు. అలాగే నా క్లోజ్ ఫ్రెండ్స్‌కు కూడా తెలుసు. ఈ విషయాన్ని బయటకు తెలియనివ్వకపోడమే బెటర్ అనిపించింది అని చెప్పుకొచ్చింది.
చాలామంది హీరోలు తన నెంబర్ అడిగారు
వరుణ్ మాట్లాడుతూ.. మేము ముంబైలో షూటింగ్ చేస్తున్నప్పుడు చాలామంది తన ఫోన్ నెంబర్ పంపించమని మెసేజ్ చేశారు. ఎంతో మంది హీరోలు తన నెంబర్ అడిగారు. తనను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. అందుకే ఎవరికీ నెంబర్ ఇవ్వకుండా తనను కాపాడాను. చివరకు నా బేబీ.. నాకే వదినగా మారిపోయింది అని వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment