స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) తనను ఎందుకు బ్లాక్ చేశాడో ఇప్పటికీ తెలియడం లేదంటున్నాడు ప్రముఖ సింగర్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ రాహుల్ వైద్య. ఇంతవరకు ఆయన్ను పొగడటమే తప్ప విమర్శించిందే లేదని చెప్తున్నాడు. తాజాగా రాహుల్ వైద్య (Rahul Vaidya) మాట్లాడుతూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో విరాటో కోహ్లి నన్ను బ్లాక్ చేశాడు. కారణమేంటన్నది నాకిప్పటికీ తెలియదు.
బహుశా దానివల్లేనేమో!
మన దేశంలోనే ఆయన బెస్ట్ బ్యాట్స్‌మన్. నన్నెందుకు బ్లాక్ చేశాడన్నది అంతు చిక్కడం లేదు అని చెప్పుకొచ్చాడు. ఇతడి కామెంట్లు విన్న నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. విరాట్ పిల్లలు అనుకోకుండా అతడి ఫోన్‌తో ఆడుకుంటూ అనుకోకుండా రాహుల్‌ను బ్లాక్ చేసి ఉండొచ్చు అని ఓ యూజర్ అభిప్రాయపడ్డాడు. కాగా విరాట్ కోహ్లి- అనుష్క దంపతులకు వామిక, అకాయ్ సంతానం. ఈ మధ్య కోహ్లి తన కుటుంబంతో లండన్‌లోనే ఎక్కువగా ఉంటున్నాడు.
ఎవరీ రాహుల్?
రాహుల్ వైద్య విషయానికి వస్తే.. ఇండియన్ ఐడల్ మొదటి సీజన్‌లో పాల్గొని సెకండ్ రన్నరప్‌గా నిలిచాడు. అప్పుడప్పుడూ కొత్త పాటల ఆల్బమ్స్ రిలీజ్ చేస్తూ ఉంటాడు. హిందీ సినిమాల్లో ఎన్నో పాటలు ఆలపించాడు. 2020లో హిందీ బిగ్‌బాస్ 14వ సీజన్ రన్నరప్‌గా నిలిచాడు. బిగ్‌బాస్ షో (Bigg Boss)లో కంటెస్టెంట్ దిశా పార్మర్‌తో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకోగా ఈ జంటకు నవ్య అనే కూతురు కూడా పుట్టింది.
చదవండి: ఓటీటీలోనే టాప్ సిరీస్.. రెండో సీజన్ చూసేందుకు సిద్ధమా?
Comments
Please login to add a commentAdd a comment