ఓటీటీల్లో వందలకొద్దీ సినిమాలు, వెబ్ సిరీసులు ఉన్నాయి. కానీ వీటిలో ఎక్కువమందికి రీచ్ అయినవి కొన్నే ఉంటాయి. అలాంటి ఓ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్'(Squid Game). తొలుత కొరియన్ భాషలో తీసినప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. తెలుగు, తమిళ లాంటి ప్రాంతీయ భాషల్లోనూ దీన్ని డబ్ చేశారు. అలా ఓటీటీలో (OTT) అత్యధికంగా చూసిన వెబ్ సిరీస్‌గా నిలిచింది. ఇప్పుడు దీని రెండో సీజన్ గురువారం (డిసెంబర్ 26) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) తెలుగులోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా తొలి సీజన్‌లో అసలేం జరిగింది? రెండో సీజన్‌లో ఏం జరగొచ్చు?
(ఇదీ చదవండి: సినిమాల్ని వదిలేద్దాం అనుకుంటున్నా: డైరెక్టర్ సుకుమార్)
ఒక్కమాటలో ఈ సిరీస్ గురించి చెప్పాలంటే.. అప్పుల్లో కూరుకుపోయి, ఆర్థికంగా ఇక లేవడం కష్టమనే స్థితిలో ఉన్న పేదలను ఒక చోట చేర్చి.. వారితో ఆటలు ఆడిస్తుంటే బాగా డబ్బునోళ్లు వీళ్లని చూసి ఎంజాయ్ చేస్తుంటారు. వినడానికి చిన్న కథలా అనిపిస్తున్నా ఒక్కసారి సీజన్ మొదలెడితే పూర్తయ్యేదాకా చూడకుండా ఉండలేరు. కథ ప్రారంభం కాగానే దర్శకుడు ఏం చెప్పాలనుకొంటున్నాడో అర్థమవుతుంది. కానీ ఏం జరుగుతుందో ఉహించలేం!
జీవితంలో అన్ని కోల్పోయిన 456 మందిని గుర్తుతెలియని వ్యక్తులు.. ఓ రహస్య దీవికి తీసుకెళ్తారు. వీళ్లకు రెడ్ లైట్ గ్రీన్ లైట్, గోళీలాట, టగ్ ఆఫ్ వార్ లాంటి పిల్లలు ఆడుకునే గేమ్స్ పెడతారు. మొత్తం ఆరు పోటీలు ఇందులో గెలిస్తే 45.6 బిలియన్ కొరియన్ వన్ (మన కరెన్సీ ప్రకారం 332 కోట్లు) సొంతం చేసుకోవచ్చు. గేమ్స్ సింపుల్‌గానే ఉంటాయి కానీ ఓడిపోతే మాత్రం ఎలిమినేట్ అవుతారు. ఇక్కడ ఎలిమినేట్ అంటే ప్రాణాలు తీసేస్తారు. తొలి గేమ్ ఆడుతున్నప్పుడు గానీ అందరికీ ఈ విషయం తెలియదు. అలాంటి ప్రాణాంతకమైన ఆటలను పూర్తి చేసింది ఎవరు? చివరకు ప్రైజ్‌మనీ గెలిచింది ఎవరు? అనేదే స్టోరీ.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్)
మనుషులు నిజరూపాల్ని, స్వభావాలు బయటపెట్టిన సిరీస్ ఇది. తన వరకు వస్తే ఎంత మంచోడైనా సరే తాను చస్తానని తెలిస్తే ఎంతకు తెగిస్తాడు అనే ఒక్క లైన్ మీద కథను గ్రిప్పింగ్‌గా నడిపించడం అనేది స్క్రిప్ట్ సత్తానే. మరీ ముఖ్యంగా గోళీలాటలో అద్భుతమైన ఎమోషనల్ ఉంటుంది. ఆ ఎపిసోడ్ గురించి చెప్పడం కంటే చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ ఎపిసోడ్ చివరిలో ఆటగాళ్లు ఎంత మానసికంగా కుంగిపోతారో, ప్రేక్షకుడి మనసు కూడా అంత బరువెక్కుతుంది.
ఈ సిరీస్ చూడటం మొదలుపెట్టినప్పుడు ఏ పాత్ర గురించి మనకు తెలీదు. ప్రత్యేక అంచనాలు ఏం ఉండవు. కాని ఒక్కసారి సిరీస్ చూడటం మొదలుపెడితే ఏకబిగిన చూసేస్తారు. సిరీస్ చివరి ఎపిసోడ్ అంటే క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలు.. అసలు ఎందుకు ఇలాంటి ప్రాణాంతక ఆటలు ఆడించాల్సి వచ్చిందో గేమ్ సృష్టికర్త చెబుతుంటాడు. హీరోకి అతడు మాట్లాడుతుంటే.. అది చెప్పినట్లు కాకుండా సమాజ స్వభావంపై వారి అభిప్రాయాల్ని చెబుతూ మనకు ప్రశ్నలను రేకెత్తిస్తారు.
(ఇదీ చదవండి: అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రశ్న.. జానీ మాస్టర్ రియాక్షన్?)
ఈ సిరీస్‌లోని కొన్ని పాత్రలు సొంతవాళ్లనే మోసం చేసుకొనే పరిస్థితులు వస్తాయి. మోసంతో పాటు స్నేహం, సహకారం, త్యాగం.. ఇలా అన్ని ఎమోషన్స్ అద్భుతంగా కుదిరేశాయి. ఈ సిరీస్ చూస్తున్నప్పుడు మీరు కన్నీళ్లు పెట్టుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఈ సిరీస్‌లోని పాత్రలన్నీ మన చుట్టూ కనిపించే మనుషుల్లాగే ఉంటాయి. ఇది కూడా సిరీస్ ప్రపంచవ్యాప్తంగా హిట్ కావడానికి కారణమని చెప్పొచ్చు.
తొలి సీజన్‌లో చివరగా ఒక్కడు మిగులుతాడు. ప్రైజ్‌మనీతో బయటకొస్తాడు. ఇప్పుడు రెండో సీజన్ ట్రైలర్‌లోనూ మళ్లీ అతడే కనిపించాడు. అయితే ప్రాణాలు పోతాయని తెలిసినా హీరో రావడం బట్టి చూస్తుంటే ఈసారి అందరితో కలిసి గేమ్స్ ఆడుతూనే.. దీని తెర వెనక ఉన్న వాళ్ల వాళ్ల నిజ స్వరూపాల్ని బయటపెట్టడం లాంటివి చేస్తాడేమో అనిపిస్తుంది. తొలి సీజన్‌కి మించి ఈసారి ఎక్కువ భావోద్వేగ భరిత సీన్స్ ఉండాలి. అప్పుడే సిరీస్ వర్కౌట్ అవుతుంది. చూడాలి మరి 'స్క్విడ్ గేమ్ 2'లో ఏముంటుందో?
(ఇదీ చదవండి: ఎన్టీఆర్.. ఇంత సన్నబడ్డాడేంటి?)
Comments
Please login to add a commentAdd a comment